భార్యను కొట్టిన మాస్క్‌ మ్యాన్‌.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు | Bigg Boss Mask Man Harish Apologises to wife Haritha | Sakshi
Sakshi News home page

అప్పుడు భార్యపై చేయి చేసుకుని.. నేడు అందరి ముందు కాళ్లు పట్టుకుని..

Mar 6 2026 5:24 PM | Updated on Mar 6 2026 6:01 PM

Bigg Boss Mask Man Harish Apologises to wife Haritha

మాస్క్‌ మ్యాన్‌.. బిగ్‌బాస్‌ కంటే ముందే ఈ పేరు బాగా ఫేమస్‌ అయింది. బిగ్‌బాస్‌ 9లో అడుగుపెట్టాలంటే అగ్నిపరీక్ష దాటాలని సామాన్యుల కోసం ఓ షో ఏర్పాటు చేశారు. అందులో మాస్క్‌ మ్యాన్‌ పాల్గొన్నాడు. తన పేరు హరిత హరీశ్‌ అని తెలిపాడు. భార్యపై ఉన్న ప్రేమతో ఇల్లాలి పేరునే తన పేరులో చేర్చుకున్నట్లు తెలిపాడు. అది విని భార్యంటే ప్రేమ, గౌరవం బాగానే ఉందని అందరూ అనుకున్నారు.

కోపమొస్తే కొట్టేస్తావా?
కానీ, అంతలోనే ఒకసారి భార్యపై చేయి చేసుకున్నానని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కొట్టేస్తావా? ఆడదానిపై చేయెత్తుతావా? అని తిట్టిపోశారు. అలా నెగెటివిటీతోనే బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. తన ముక్కుసూటితనం, మొండితనం, కోపం వల్ల ఎక్కువమందిని ఆకర్షించలేకపోయాడు.

కాళ్లు పట్టుకుని క్షమాపణలు
అయితే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి వస్తున్నాడు. మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే షోలో భార్య హరితతో కలిసి హరీశ్‌ పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో మాస్క్‌ మ్యాన్‌ మాట్లాడుతూ.. మగాడు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయత్తడం చాలా తప్పు అంటూ భార్య కాళ్లు నమస్కరించాడు. అలా అప్పటి వివాదానికి ఇలా ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే కపుల్‌ రియాలిటీ షో మార్చి 15న ప్రారంభం అవుతోంది. ఇది మా టీవీతో పాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

 

చదవండి: తండ్రి మరణించిన పదేళ్లకు ఆయన కల నెరవేర్చిన కూతురు

Advertisement
 
Advertisement
Advertisement