breaking news
Mask Man Harish
-
హోస్ట్ ముందు కాలి మీద కాలేసుకుని కూర్చోవడమేంటి?.. పుష్ప సినిమా చూడలేదా అన్న హరీశ్!
తెలుగు బిగ్‌బాస్ సీజన్ నాలుగో వారం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటిముఖం పట్టారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరో కామనర్ హౌస్‌లో అడుగుపెట్టింది. అయితే హౌస్‌లో ఫుల్ అగ్రెసివ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్ హరీశ్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. టాప్-5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఉంటారనుకున్నా మాస్క్ మ్యాన్‌ను ఆడియన్స్ బయటకు పంపించేశారు.ఈ సందర్భంగా బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన మాస్క్ మ్యాన్ హరీశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మాస్క్ మ్యాన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. హోస్ట్ నాగార్జున ముందు కాలిమీద కాలు వేసుకుని ఎందుకు కూర్చున్నారు? సెలబ్రిటీలే మామూలుగా కూర్చుంటే.. కామనర్ అయిన మీరెందుకు అలా కూర్చోవాల్సి వచ్చిందని హరీశ్‌ను ప్రశ్నించారు.దీనికి బిగ్‌బాస్ కంటెస్టెంట్ హరీశ్ సమాధానం ఇచ్చారు. పుష్ప సినిమా డైలాగ్‌ను గుర్తు చేశారు. ఇది నా కాలే.. ఇది నా కాలే.. అంటూ అల్లు అర్జున్ చేసిన సీన్ ఎగ్జాంపుల్‌గా చూపించారు. కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అగౌరవించడం అనే విషయం నాకు ఇప్పటికీ తెలియదన్నారు. అలా చేయడం తప్పేమీ కాదు.. మన కాలు అవతలి వాళ్ల మీద వేస్తే తప్పు అని వివరించారు. అవతలి వ్యక్తిని గౌరవించడం అనేది మన మాటల్లో కనపడుతుంది.. అంతే కానీ మన కంఫర్ట్ జోన్లో కూర్చుంటే డిస్ రెస్పెక్ట్ చేయడం కాదన్నారు. నాగార్జున అంటే నాకు చాలా గౌరవముందని మాస్క్ మ్యాన్ హరీశ్ వెల్లడించారు. -
జడుసుకున్న దివ్య.. రీతూ ఓవరాక్షన్! ఆ ముగ్గురు మాస్క్‌తోనే..
Bigg Boss Telugu 9: సండే ఎపిసోడ్ అంటే ఆటపాటలతోనే సాగిపోతోంది. కానీ ఈ సీజన్లో హుషారుగా డ్యాన్సులే చేయడం లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో తోపులనిపించుకునే డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ మైండ్ గేమ్‌లో చాలా వీక్ అని ఇట్టే తేలిపోయింది. హరీశ్ ఎలిమినేషన్‌తో ఇద్దరు షాక్‌లో ఉన్నారు. ఇంకా ఏం జరిగిందో నేటి (అక్టోబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సరదా గేమ్స్నాగార్జున (Nagarjuna Akkineni) ఫస్ట్ హౌస్‌మేట్స్‌తో కొన్ని గేమ్స్ ఆడించాడు. కొందరికి ఫిజికల్ గేమ్, మరికొందరికి మైండ్ గేమ్, ఇంకొందరికి ఇమిటేట్ చేయమని టాస్క్.. ఇలా రకరకాల పనులు అప్పగించాడు. పవన్, కల్యాణ్ ఇద్దరూ మైండ్ గేమ్స్‌లో వీక్ అని చెప్పకనే చెప్పారు. రీతూ.. తనకు బలం బాగానే ఉందని నిరూపించింది. ఇక ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వస్తున్న నాగ్.. రీతూ చౌదరి సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఏడ్చేసిన రీతూఅయితే ఎలిమినేట్ అవుతానని ఊహించిందో, ఏమో కానీ రీతూ (Rithu Chowdary) ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూసి నాగ్ సైతం షాకయ్యాడు. దీంతో తనవి ఆనంద భాష్పాలు అంటూనే ఐ లవ్యూ సర్ అంది. ఇన్ని సీజన్స్ చేశాను.. ఇటువంటి రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు నాగ్. రీతూ ఏడుపు కాస్త ఓవరాక్షన్లాగే కనిపించింది. చివర్లో హరీశ్, దివ్య మిగిలారు. వీరిలో హరీశ్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించాడు. వైల్డ్ కార్డ్‌గా వచ్చాను, పంపించేస్తారేమో అని భయంతో ఉన్న దివ్యకు తను సేఫ్ అని తెలియగానే అప్పటిదాకా ఉన్న భయం అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. శ్రీజకు తుత్తర ఎక్కువేఇక హరీశ్ (Mask Man Harish) వెళ్లిపోయే ముందు హౌస్‌లో మాస్క్ వేసుకున్న వారి బండారం బయటపెట్టాడు. ఇమ్మాన్యుయేల్, భరణి, డిమాన్ పవన్.. ముగ్గురూ మాస్క్ వేసుకున్నారని, ఒరిజినాలిటీ, శక్తి సామర్థ్యాలు ఇంకా బయటకు రావాలని చెప్పాడు. శ్రీజ, తనూజ, పవన్ కల్యాణ్ మాస్క్ వేసుకోలేదన్నాడు. శ్రీజకు తుత్తరెక్కువే.. 10 సెకన్లు ముందే ఉంటుంది. ముందూవెనక ఆలోచించకుండా టకటకా మాట్లాడుతుంది. కానీ కొన్నిసార్లు బుల్లెట్‌లాంటి పాయింట్స్ పెడుతుంది. రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేయ్కల్యాణ్.. అగ్నిపరీక్షలో నేను నాన్న అని పిలిచింది ఒక్కర్నే.. తను తనలా ఉన్నారని నమ్ముతున్నా.. కొంచెం ఆ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా బాగా ఆడగలరు. తనూజ.. ఆమెలో నన్ను నేను చూసుకుంటా.. మా ఇద్దరి ఫేస్ సీరియస్‌గా ఉన్నట్లు ఉంటుంది, కానీ మనసులో ఏం ఉండదు. కాకపోతే ముక్కుమీద కోపం ఎక్కువ. అందుకే అసహనం, చిరాకు కనిపిస్తుంది. రిలేషన్స్ దాంట్లో పడిపోతే గేమ్‌పై ఫోకస్, క్లారిటీ మిస్ అవుతాం అని సలహాలు, సూచనలు ఇచ్చి హరీశ్ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?
హరిత హరీశ్, మాస్క్ మ్యాన్, హృదయ మానవ్.. ఇవన్నీ ఒక్కరి పేర్లే! అయినా హరీశ్.. మాస్క్ మ్యాన్‌గానే ఎక్కువ ఫేమస్. అగ్నిపరీక్షలో అతడి ముక్కుసూటితనం మెచ్చిన జడ్జిలు బిగ్‌బాస్ 9కి పంపారు. ఈ సీజన్లో తిరుగులేని కంటెస్టెంట్ అనుకున్నారు. అతడికి ఎవరూ ఎదురునిలబడలేరనుకున్నారు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో అంతా తలకిందులైంది. హౌస్‌లో అగ్గిరాజేస్తాడనుకుంటే తనే అగ్గిలో దూకి బూడిదలా మిగిలాడు (Mask Man Haritha Harish).అలక బూనిన హరీశ్ఇతడు ముక్కుసూటిగా మాట్లాడతాడు. కానీ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడే ఆగిపోతాడు. షోలో గొడవలు కామన్.. అప్పుడే పోట్లాడుకుంటారు, అంతలోనే కలిసిపోతారు. కానీ ఇతడు మాత్రం గొడవ దగ్గరే ఆగిపోయాడు. అవతలివారు కలుపుకుపోవాలన్నా కూడా దూరం పెట్టాడు. జనాలు అతడిని ఇంకొన్నివారాలు ఉంచాలనుకున్నా సరే నేను రానంటూ ఒక మూలన సైలెంట్‌గా కూర్చుండిపోయాడు. అన్నం మీద అలక చూపించాడు.ఆ ఒక్క సంఘటనతో సైలెంట్'ఇన్నాళ్లూ ఇమ్మాన్యుయేల్, భరణి మగాళ్లనుకున్నా.. కానీ ఆడవాళ్లతో ఫైట్ చేస్తున్నానని ఇప్పుడర్థమైంది' అని ఆవేశంలో ఓ కామెంట్ పాస్ చేశాడు. దీంతో ఆడవాళ్లంటే అంత చులకనా? అని అతడికి పెద్ద క్లాస్ పడింది. నా ఉద్దేశ్యం అది కాదు, నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని హర్టయ్యాడు. అప్పటినుంచి డౌన్ అవుతూ వచ్చాడు. నాగార్జున అన్నట్లుగానే ఇంట్లో వస్తువులకు, హరీశ్‌కు మధ్య పెద్ద తేడా లేనట్లుగానే కనిపించింది.ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే!తనకు ఆడాలని, హౌస్‌లో ఉండాలని కాస్తయినా ఆసక్తి లేకపోతే ప్రేక్షకులు మాత్రం ఏం చేస్తారు? అందుకే బయటకు పంపించేశారు. అయితే ఓ విషయంలో మాత్రం హరీశ్‌ను మెచ్చుకుని తీరాల్సిందే! ఓ గేమ్‌లో హరీశ్.. దివ్యను జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినా ఆమె చూసి పట్టుకోండి.. అంటూ అనవసర కామెంట్లు చేయడంతో అతడు ఆమె కాళ్లు మొక్కాడు. అక్కడ హరీశ్ అందరికీ నచ్చేశాడు. గుండెలో ఎంత బాధుంటే అలా చేస్తాడు! అని హరీశ్‌పై జాలిపడ్డారు.రెమ్యునరేషన్తను ఎలిమినేట్ అయినప్పుడు కూడా అతడి ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఇంట్లో ఉండాలని లేదు, ఇలాంటి మనుషుల మధ్య ఉండలేను అని చాలాసార్లు అన్న హరీశ్.. ఎట్టకేలకు వారి మధ్య నుంచి బయటకు వచ్చేస్తున్నందుకు లోలోన సంతోషించాడేమో! ఇకపోతే హరీశ్ వారానికి రూ.60-70 వేల మేరకు పారితోషికం తీసుకున్నాడు. ఈ లెక్కన నాలుగు వారాలకు గానూ రూ.2.50 లక్షల పైచిలుకు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది! -
సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. శ్రీజను ఇరికించి, రీతూది మోసం కాదని..
అందరి నోటికాడ గుడ్లు దొంగతనం చేసిన సంజనాకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి, అవతలివారు బాధపడేలా కాదని హెచ్చరించాడు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో వేయించాడు. అంతే కాదు ఓ పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అవేంటో అక్టోబర్ 4వ ఎపిసోడ్ హైలైట్స్‌లో మీరూ చూసేయండి..సంజనాను శిక్షించిన నాగ్సంజనాను దొంగ వేషాలు మానుకోమని తిట్టిపోశాడు నాగార్జున (Nagarjuna Akkineni). అంతేకాదు, ఓనర్ నుంచి తప్పించి టెనెంట్‌గా మార్చాడు. హౌస్‌లో ఏ పని కావాలన్నా సంజనాతో చేయించుకోవచ్చని ఆమెను శిక్షించాడు. ఇప్పటికైనా ఆమె తప్పు తెలుసుకోకుంటే మాత్రం సంజనా ఎక్కువకాలం హౌస్‌లో ఉండటం కష్టమే! మాస్క్ మ్యాన్ ఒంటరిగా ఉండటం గురించి చురకలు అంటించాడు నాగ్. ఇంట్లో ఉన్న వస్తువులకు, మీకూ తేడా లేనట్లే ఉందన్నాడు. గోల్డెన్ స్టార్తర్వాత కంటెస్టెంట్లకు పర్ఫామెన్స్ ఆధారంగా స్టార్ బ్యాడ్జ్‌లు ఇచ్చాడు. నాలుగు వారాలుగా కామెడీతో, ఆటతో, మాటతో మెప్పించిన ఇమ్మాన్యుయేల్‌కు గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. తర్వాత శ్రీజను లేపి.. నువ్వు ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావ్.. అంటూ కెప్టెన్సీ టాస్క్‌లో ఆమె సృష్టించిన గందరగోళం... దాని వల్ల కల్యాణ్- రీతూ, పవన్ మధ్య ఏర్పడిన అగాధం గురించి కాసేపు ప్రస్తావించాడు. శ్రీజ, సుమన్, రాము, డిమాన్, కల్యాణ్, భరణి, దివ్య, రీతూకు సిల్వర్ స్టార్ ఇచ్చాడు.తనూజను హెచ్చరించిన నాగ్హౌస్కు గెలవడానికి వచ్చావా? బంధాల కోసం వచ్చావా? ఈ బంధాలనేవి ఇంకా పెరిగితే భారంగా మారతాయి. ఏడుస్తూ ఉంటే అదే నీ ఆటను మంచేస్తుంది అని తనూజ (Thanuja Puttaswamy)కు సలహా ఇచ్చాడు. సంజనా- తనూజల పోపు గొడవ గురించి ప్రస్తావిస్తూ.. టీ కప్పులో తుపానులా.. మీ గొడవ పోపులో సునామీలా ఉందని సెటైర్లు వేశారు. రీతూ చౌదరి కెప్టెన్సీ టాస్క్‌లో.. కల్యాణ్‌ను తీసేయమని చెప్పడం కరెక్టేనని వంత పాడాడు నాగ్. కానీ తప్పించడం ఒకటే కాదు, గెలిచి చూపించాలన్నాడు. కల్యాణ్‌పై ప్రశంసలుఅటు కల్యాణ్‌తో మాత్రం.. మూడువారాలు ఆడిందేమీ లేదు, కానీ ఈవారం అదరగొట్టావ్ అని మెచ్చుకున్నాడు. అలాగే (రీతూ చేతిలో) మోసపోయావనీ అన్నాడు. సంజనాకు అసిస్టెంట్‌లా ఉన్న ఫ్లోరాకు, ఒంటరివాడిగా మిగిలిపోయిన హరీశ్‌కు బ్లాక్ స్టార్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు అనర్హులు అని ఓటింగ్ పెట్టగా మెజారిటీ ఫ్లోరాకు ఓట్లేసి ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో నాగార్జున ఆమెను వరుసగా రెండు వారాలకు నామినేట్ చేశారు.చదవండి: బిగ్‌బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే! -
బిగ్‌బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!
ఈసారి షాకింగ్ ఎలిమినేషన్. గత వారం ప్రియ బయటకెళ్లిపోయింది. కానీ ఆమెతో పాటు చివరవరకు డేంజర్ జోన్లో ఉన్న కల్యాణ్ లిస్టులో లేడు. దీంతో ప్రియ దోస్త్ శ్రీజ.. ఈసారి ఎలిమినేట్ కావడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ గేమ్స్ వల్ల ఈ వారం చాలా లెక్కలు మారిపోయాయి. అయినా సరే మరో కామనర్ ఎలిమినేట్ అయిపోయాడు. అతడే మాస్క్ మ్యాన్ హరీశ్. ఇంతకీ అసలేమైంది?అగ్నిపరీక్ష పోటీలో మంచి ప్రదర్శన ఇచ్చిన హరీశ్.. హౌసులోకి అడుగుపెట్టాడు. అయితే వచ్చినప్పటి నుంచి నాకు నచ్చినట్లు నేనుంటాను. పక్కనోళ్లు కూడ నాకు నచ్చినట్లుగానే ఉండాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు నోరుజారడం, వాటి గురించి హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడం కామన్ అయిపోయింది. కానీ ఈ వారం మాత్రం ఆరోగ్య సమస్యల వల్ల గేమ్స్ ఆడలేకపోయాడు. దీంతో ఓటింగ్ అంతా డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఓజీ' నుంచి నేహా శెట్టి సాంగ్ రిలీజ్)ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. సంజన, రీతూ, శ్రీజ, ఫ్లోరా, దివ్య, హరీశ్. వీళ్లలో సంజన, రీతూ, ఫ్లోరా.. తొలి వారం నుంచి అడపాదడపా నామినేషన్లలో ఉంటూ వచ్చారు. దీంతో వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఏర్పడింది. అలా ఈసారి కూడా ఓటింగ్ బాగానే పడింది. దివ్య కూడా వచ్చి వారమే అవుతుండటం, హౌసులో హుందాగా ప్రవర్తిస్తుండటం ఈమెకు ప్లస్ అవుతోంది. అది ఓట్ల రూపంలో మారుతోంది. చివరగా ఈసారి శ్రీజ కూడా కల్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీంతో ఈమెకు కూడా ఓట్లు బాగానే పడ్డాయి. అమ్మాయిలందరూ ఆకట్టుకుంటే హరీశ్ మాత్రం ఆరోగ్య సమస్యలతో గేమ్స్ ఆడలేకపోయారు. అలా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యనే మెయిన్ అయినప్పటికీ హరీశ్‌పై హౌసులోనూ నెగిటివిటీ బాగానే ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా శనివారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఫ్లోరా-హరీశ్ ఫొటోల్లో ఒకరిది ఎంచుకుని ట్రాష్ చేయాలని నాగార్జున అడిగేసరికి చాలామంది హౌస్మేట్స్ హరీశ్ పేరు చెప్పారు. అలా ఈసారి హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ని ఎలిమినేట్ చేసేశారట. అనధికారికంగా ఈ విషయం బయటకొచ్చింది. ఆదివారం ఎపిసోడ్‌తో హరీశ్ ఎలిమినేషన్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) -
తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. అతడే కొత్త కెప్టెన్!
షోలో కనిపించట్లేదు, కేవలం ఓదార్పులు తప్ప ఇంకేమీ లేదు అని మాటలు పడ్డ కల్యాణ్ గ్రాఫ్ ఈ ఒక్క ఎపిసోడ్‌తో ఎక్కడికో వెళ్లనుంది. కసిగా గేమ్ ఆడుతున్నాడు. తనను తాను నిరూపించుకుంటున్నాడు. అటు సంజనా మాత్రం తన గేమే కాదు, టీమ్ గేమ్‌ను సైతం చెడగొట్టేసింది. మరి హౌస్‌లో ఏం జరిగిందో అక్టోబర్ 2 ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రెడ్ టీమ్ బీభత్సంకెప్టెన్సీ కంటెండర్, మటన్, లగ్జరీ అంటూ కొన్ని కార్డులను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). వాటిని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నాడు. మొదట బాల్స్ గేమ్‌లో కల్యాణ్ (రెడ్ టీమ్) బాగా ఆడి గెలిచి కంటెండర్‌షిప్ సాధించాడు. నెక్స్ట్ హిప్పో గేమ్‌లో రెడ్ టీమ్ ప్లేయర్స్ ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ బీభత్సంగా ఆడారు. ఈ గేమ్‌లో సంజనా.. తన ఎల్లో టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్‌కు సహకరించింది. ఇదేంటని ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి ప్రశ్నించగా.. అన్నా, మనం ఎలాగో గెలవం.. రెడ్ టీమ్‌కు సపోర్ట్ చేద్దాం.. నువ్వు కూడా చేయ్ అని ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సుమన్ ఒప్పుకోలేదు. సంజనాపై సుమన్ అసహనంఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలవగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు కంటెండర్ షిప్ కార్డ్ అందింది. మరో గేమ్‌లో రెడ్ టీమ్ గెలిచి కిక్ ఔట్ కార్డు సాధించారు. దీని ద్వారా గ్రీన్ టీమ్(భరణి, దివ్య, శ్రీజ)ను ఆటలో లేకుండా ఎలిమినేట్ చేశారు. మరోవైపు సంజనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుమన్.. ఆమె నోట్లో నేరు పెట్టలేను. పెద్దాయన పెద్దాయన అంటూ నన్ను తొక్కేస్తోందంటూ డిమాన్ పవన్, రీతూల దగ్గర తన ఫ్రస్టేషన్ వెళ్లగక్కాడు.బోరున ఏడ్చేసిన తనూజతర్వాత బిగ్‌బాస్ కంటెండర్లుగా అర్హత సాధించిన కల్యాణ్, ఇమ్మాన్యుయేల్‌కు పెద్ద బాధ్యత అప్పగించాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీపడే మూడు జంటల్ని ఎంచుకోమన్నాడు. అలా వీరు.. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రామును మూడు జంటలుగా విభజించారు. వీళ్లకు గార్డెన్ ఏరియాలో ఓ గేమ్ పెట్టారు. అందులో తనూజ (Thanuja Puttaswamy) ఫౌల్ చేయడంతో గేమ్ నుంచి తీసేశారు. దీంతో తను బాత్రూమ్లోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. డోర్ తీయమని బతిమాలిన రీతూ.. తను కూడా లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.ఆ నలుగురే కెప్టెన్సీ కంటెండర్స్తర్వాత గేమ్స్‌లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్సయ్యారు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము కెప్టెన్సీ కోసం పోటీపడగా వీరిలో రాము కెప్టెన్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు హరీశ్ కళ్లలో భయం, బాధ కనిపించింది. ఇప్పటికే ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడంటూ అతడిపై నింద పడింది. దానివల్ల ఒంటరిగా కుమిలిపోతున్న హరీశ్.. ఓ గేమ్‌లో దివ్యను ముందుకు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి.. సరిగా పట్టుకోండి అని కావాలనే చీదరించుకుంది. తను జాగ్రత్తగా డీల్ చేసినా ఇలాంటి కామెంట్లు రావడంతో ఆయన వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాడు.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
నామినేషన్స్‌లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్
బిగ్‌బాస్ 9 హౌసులో మూడో వారం వచ్చేసింది. వీకెండ్ వస్తే నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో ఆటాడుకుంటాడు. సోమవారం వస్తే నామినేషన్స్ హడావుడి మొదలవుతుంది. ఈసారి కూడా రచ్చ రచ్చ జరిగింది. అయితే ఒకేరోజులో ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కెప్టెన్ కావడంలో సహాయపడ్డ రీతూని పవన్ మోసం చేసేశాడు. మరోవైపు హరీశ్ బూతు పదం వాడుతూ పంచాయతీ పెట్టాడు. ఈసారి నామినేషన్స్‌లో కామనర్స్‌ని సెలబ్రిటీలు గట్టిగా ఇరికించేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కిర్రాక్ సీత, రీతూపై సంచలన ఆరోపణలు చేసిన గౌతమి)ఈ వారం నామినేషన్స్ గురించి చెప్పిన బిగ్‌బాస్.. టెనెంట్స్ అందరూ ఐదుగురు ఓనర్లని నామినేట్ చేయాలని అందులో ఒకరు టెనెంట్ అయ్యిండాలని కండీషన్ పెట్టాడు. దీంతో అందరూ ఏకాభిప్రాయంతో మాజీ కెప్టెన్ సంజనని నామినేట్ చేశారు. దొంగబుద్ది చూపించడం, ఆడవాళ్లని హరీశ్ డీగ్రేడ్ చేశాడని చాడీలు చెప్పడం, సుమన్ శెట్టి గాజుల వేసుకుని కూర్చున్నారని తక్కువ చేసి మాట్లాడిందని కారణాలు చెప్పారు. మాటలు జారుతోందని, ఓ స్టాండ్ అనేది లేదు, ప్రతిదానికి అలుగుతోంది అంటూ రీతూని.. వీరిద్దరితో పాటు ఫ్లోరా, సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. అలానే టెనెంట్స్‌లో హరీశ్‌ని అందరూ కలిసి బుక్ చేశారు.అయితే టెనెంట్స్ మధ్య నామినేట్ ఎవరినీ చేయాలా అనే చర్చ నడుస్తున్నప్పుడు పవన్-రీతూ చౌదరి గురించి మాట్లాడిన హరీశ్.. లత్కోర్ అనే పదం ఉపయోగించాడు. దీన్ని పవన్, ప్రియ, శ్రీజ తప్పు పట్టగా.. అసలు ఆ పదం బూతు కాదని చెప్పి వాదించాడు. అయితే టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్‌ని నామినేట్ చేశారు కదా. దీన్ని మార్చే పవన్ ఓనర్స్‌కి ఇస్తున్నానని చెప్పి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఉన్న వాటికి ఇద్దరిని అదనంగా జోడించండి. ఉన్నవాటిలో ఇద్దరిని స్వైప్ చేయండి అని ఆదేశించాడు. అలానే నామినేషన్లలో ముగ్గురు టెనెంట్స్ కచ్చితంగా ఉండాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో టెనెంట్స్‌కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి.ఈ క్రమంలో లిస్టులో ఉన్న సంజన, సుమన్ శెట్టి ప్లేసులో టెనెంట్స్ అయిన ప్రియ, కల్యాణ్‌ని స్వైప్ చేశారు. అలానే గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్‌గా తప్పు చేసిందని రీతూని నామినేట్ చేశారు. అలా హరీశ్, ప్రియ, కల్యాణ్, ఫ్లోరా, శ్రీజ, రాము నామినేట్ అయ్యారు. ఇక్కడివరకు బాగానే ఉంది. చివరలో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. స్పెషల్ పవర్ ఉపయోగించి ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పగా.. పవన్, రీతూ బదులు శ్రీజని సేవ్ చేశాడు. దీంతో రీతూ ముఖం మాడిపోయింది. ఎందుకంటే గతవారం అంతా కష్టపడి రీతూ.. డీమన్ పవన్ కెప్టెన్ అయ్యేందుకు సాయం చేసింది. కానీ ఇప్పుడు అతడు రీతూని మోసం చేశాడు. ఇలా మూడోవారం నామినేషన్స్ ముగిశాయి.మూడోవారం నామినేషన్స్ లిస్ట్హరీశ్ప్రియకల్యాణ్రామురీతూఫ్లోరామరి ఈ వారం టెనెంట్స్ నుంచి ఎలిమినేట్ అవుతారా? లేదంటే ఓనర్స్ నుంచి నామినేట్ అయిన ముగ్గురిలో ఒకరు బయటకు వచ్చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా) -
అందరూ కలిసి హరీశ్‌ను బలి చేశారుగా! నామినేషన్స్‌లో ఎవరంటే?
తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ప్రారంభమైంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తవగా సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. టెనెంట్లు.. ఐదుగుర్ని నామినేట్ చేయాలన్నాడు. అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయుండాలన్నారు.నామినేషన్స్కెప్టెన్ అయ్యాక సంజనాకు అహం పెరిగిపోయిందని హరీశ్, ప్రియ.. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వదని శ్రీజ అభిప్రాయపడ్డారు. అలా మొదట సంజనాను నామినేట్ చేశారు. అలాగే రీతూ చౌదరి, సుమన్, ఫ్లోరాను నామినేట్ చేశారు. ఇక టెనెంట్స్‌లో ఒకర్ని అనగానే అందరూ కలిసి హరీశ్‌ను నామినేషన్స్‌లో ఇరికించేశారు. ఇంతటితో అయిపోలేదు. బిగ్‌బాస్ ఈ ప్రక్రియలో ఓ ట్విస్ట్ ఇచ్చాడట! గండం గట్టెక్కిన సంజనానామినేషన్స్లో ఉన్నవారు ఎవరితోనైనా స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడట! దీంతో సంజనా.. రాము రాథోడ్‌తో స్వాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే టెనెంట్స్లోనుంచి ప్రియ, కల్యాణ్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి రీతూ, సుమన్, ఫ్లోరా, రాము, ప్రియ, కల్యాణ్, హరీశ్ నామినేషన్స్‌లో ఉన్నారా? లేదంటే మళ్లీ ఏవైనా ట్విస్టులు ఇచ్చారా? అన్నది ఎపిసోడ్లో చూడాలి! చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే? -
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. హరిత ఏమందంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసిన ఏకైక కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హరీశ్. నేను మోనార్క్‌ను, ఎవరి మాటా వినను అన్న టైప్‌లో ప్రవర్తిస్తుంటాడు. అగ్నిపరీక్షలో అడుగుపెట్టినప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడి జడ్జిలనే ఆగం చేశాడు. తనలో సగమైన భార్య కోసం తన పేరును హరిత హరీశ్‌గా మార్చుకున్నాడు. నేనేమైనా గుడిలో గంటనా?కానీ, ఓసారి కోపం వచ్చి ఆమెపై చేయి చేసుకున్నట్లు తెలిపాడు. ఈ ఒక్కమాటతో అందరూ నోరెళ్లబెట్టారు. భార్యపై చేయి చేసుకునేంత దుర్మార్గుడివా? మూర్ఖుడివా? అని తిట్టిపోశారు. తాజాగా ఈ వివాదంపై హరీశ్ (Mask Man Harish) సతీమణి హరిత స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇదేమైనా గుడిలో గంటా? స్కూల్ బెల్లా? ఉదయం, సాయంత్రం కొట్టడానికి? ప్రతి కుటుంబంలో చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తను నన్ను కొట్టిన సంఘటన కూడా పెద్దగా గుర్తులేదు. అందుకే హృదయ్ మానవ్ఎందుకంటే మా మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ అలాంటిది! 20 ఏళ్ల జీవితంలో మేము ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నాం. అవన్నీ వదిలేసి దాన్ని పట్టుకుని వేలాడలేం. షో కోసం అబద్ధం చెప్పకుండా ఆయన దాన్నింకా గుర్తుపెట్టుకుని మరీ చెప్పాడు. హృదయంలో ఏదీ దాచుకోడు. అందుకే హృదయ మానవ్ అయ్యాడు. మా పెళ్లయి 15 ఏళ్లవుతోంది. మేమిలా దూరంగా, మాట్లాడుకోకుండా ఇన్నిరోజులు ఎప్పుడూ లేము. నా భర్త మంచివాడు. కావాలనే అతడిని నెగెటివ్ చేస్తున్నారు. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉంది, అదింకా బయటకు రావడం లేదు అని హరిత చెప్పుకొచ్చింది.చదవండి: ఉగ్రరూపం చూపించిన సుమన్.. అమ్మాయిలను ఈడ్చిపడేశాడు! -
హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్
-
4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్‌లో ఏడుగురు
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లుంది కథ! హౌస్‌లో గుడ్డు దొంగతనం చేసింది సంజనా.. ఆ గుడ్డును కాపాడుకోవాల్సింది ఓనర్లు. సంజనా ఐదు నెలల బాలింత కావడంతో ఆ దొంగతనాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు భరణి. అంతే, దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇప్పటికీ అదే పాయింట్ లాగుతూ ఓనర్లందరూ కలిసి భరణిని నామినేట్ చేశారు. మరి ఈ రెండోవారం నామినేషన్స్‌లో ఎవరున్నారో చూసేద్దాం..తలతిక్క సమాధానాలునాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాస్క్ మ్యాన్ హరీశ్‌ను రీతూ చౌదరి (Rithu Chowdary) నామినేట్ చేసింది. నేను తినను, వెళ్లిపోతాను అని గివప్ ఇవ్వడం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అదే అన్నం మీ ఎదురుగా మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. ఫ్యామిలీ గురించి ఆలోచించైనా తినొచ్చుగా.. అంది. దీనికి హరీశ్ తలతిక్క సమాధానం చెప్పాడు. నా జీవితం.. నాకు నచ్చినట్లు బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు. బలమైన కారణం వల్లే ఫుడ్ తినడం లేదు. నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి. నాపై ముద్ర వేశారునేను చరిత్రహీనుడని ముద్రవేశారు కదా.. దాన్నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి క్విట్ అవుతా అన్నాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని ప్రూవ్ చేయాలని రీతూ అంది. అప్పటికీ తగ్గని హరీశ్ (Mask Man Harish) టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడాడు. నీకు ఫుడ్ పెట్టడం వల్లే గొడవలనడంతో రీతూ ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సింపతీ కార్డ్ అన్నాడు హరీశ్. అలాగైతే అన్నం తినకపోవడం కూడా సింపతీ కార్డే అని రీతూ ఇచ్చిపడేసింది.దమ్ముంటే బిగ్‌బాస్‌ను అడగండితర్వాత శ్రీజ కూడా హరీశ్‌ను నామినేట్ చేసింది. మీరు ఇమ్మాన్యుయేల్‌ను రెడ్ ఫ్లవర్ అనడం వీడియోలో క్లియర్‌గా కనిపించిందని శ్రీజ చెప్తుంటే ఇమ్మాన్యుయేలే బాడీ షేమింగ్ చేశాడంటూ హరీశ్ మళ్లీ ఫైరయ్యాడు. మా మధ్య ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపో అనేసింది శ్రీజ. దమ్ముంటే బిగ్‌బాస్‌ను అడగండి, పంపిస్తే వెళ్లిపోతా అన్నాడు. ఇలా గొడవలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. చివర్లో బిగ్‌బాస్ కెప్టెన్ సంజనాకు ఓ పవర్ ఇచ్చాడు. ఒకర్ని నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు.సుమన్‌ను బలి చేసిన కెప్టెన్ సంజనాదీంతో ఆమె.. ఆరోజు నేను ఏడుస్తున్నప్పుడు మేము 9 మంది కాదు 8మందిమే అని నన్ను పక్కనపెట్టేశారు. తర్వాత ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు అంటూ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అందుకతడు.. ఆ తొమ్మిదో వ్యక్తి మీరే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? నేను అయ్యుండొచ్చుగా అని కౌంటరిచ్చాడు. ఇక ఫైనల్‌గా భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. మరోవైపు లైవ్‌లో తనూజ ఎంతో బతిమాలడంతో అప్పుడు అన్నం ముద్ద తిన్నాడంట హరీశ్!చదవండి: 'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక అసలు నిజం చెప్పిన పేరేంట్స్! -
బిగ్ బాస్ కి వెళ్లే ముందు నాతో ఒక్కటే చెప్పాడు
-
నేను గుండంకుల్ అంటే.. మీరన్నది ఏంటి?.. మాస్క్ మ్యాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. అప్పుడే హౌస్‌లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు కాస్తా సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ అనగానే ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. అగ్రెసివ్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌లో హౌస్‌లో మాస్క్ మ్యాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనొక్కడే అందరిపై నోరు పారేసుకుంటున్నారని ఆడియన్స్ కూడా భావిస్తున్నారు.అయితే రెండో వారంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్‌ను మిగిలిన కంటెస్టెంట్స్ సైతం ఓ ఆటాడేసుకుంటున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో మాస్క్ మ్యాన్‌కు కమెడియన్ ఇమ్మాన్యూయేల్ గట్టిగానే కౌంటరిచ్చాడు. నామినేషన్స్‌లో భాగంగా హరీశ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గుండంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం ఏంటని హరీశ్‌ను ఇమ్మాన్యుయేల్ నిలదీశాడు. ఇది విన్న మాస్క్ మ్యాన్ నేను మిమ్మల్ని అనలేదంటూ మాట్లాడారు. దీనికి ఇమ్మాన్యూయేల్ సైతం రెచ్చిపోయి ముందుకు దూసుకెళ్లారు. నేను కూడా అన్నది మిమ్మల్ని కాదని..నన్ను నేనే అనుకున్నానని అన్నారు.దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. మీరన్నదానికి ప్రూఫ్ ఉందని ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. లిమిట్స్‌లో ఉండాలంటూ మాస్క్ మ్యాన్ హరీశ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా గట్టిగా కేకలు వేస్తూ ఇమ్మాన్యుయేల్ వైపు దూసుకెళ్లాడు హరీశ్. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హాట్‌హాట్‌గా సాగినట్లు అర్థమవుతోంది. ఇంకేందుకు ఆలస్యం లేటేస్ట్ ప్రోమో చూసేయండి.High voltage nominations! 🔥Real opinions revealed, #SumanShetty breaks his silence! 👁️💣Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/hzGJhuRkjL— JioHotstar Telugu (@JioHotstarTel_) September 16, 2025 -
సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!
బిగ్‌బాస్ షోని ఒక్కొక్కరు ఒక్కోలా ఆడతారు. ఒకరు ఏడుస్తారు. మరొకరు కష్టపడతారు. ఇంకొకరు తమకు తామే టార్గెట్ అయిపోయి హైలైట్ అవ్వాలని చూస్తారు. తాజా సీజన్ చూస్తుంటే అలాంటి సందేహమే కలుగుతోంది. అందరూ మాస్క్ మ్యాన్ హరీశ్‌నే టార్గెట్ చేస్తున్నారు. అపరిచుతుడిలా ప్రవర్తిస్తూ అటు కామనర్స్, ఇటు సెలబ్రిటీలకు శత్రువులా మారిపోతున్న ఇతడి గేమ్ ప్లాన్ ఏంటనేది అర్థం కావట్లేదు. లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అలానే అనిపిస్తుంది.సోమవారం ఎపిసోడ్‌లోనూ తినకుండా నిరాహార దీక్ష లాంటిది చేసిన హరీశ్.. వింతవితంగా ప్రవర్తిస్తూ అందరికీ చిరాకు తెప్పిస్తున్నాడు. తనూజ ఇతడినే నామినేట్ చేసింది. ఇప్పుడు మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఇతడే మెయిన్ కాబోతున్నాడు. రాము రాథోడ్, ప్రియ, రీతూ చౌదరి.. ఇలా అందరూ హరీశ్‌నే నామినేట్ చేశారు.(ఇదీ చదవండి: మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!)నేను వెళ్లిపోతా రాము, ఇలాంటి మాస్క్ పెట్టుకుని తిరుగుతున్న వీళ్ల మధ్యలో నేను ఉండలేను అని చెప్పి వాళ్లనే డైరెక్ట్‌గా జడ్జ్ చేసేశారు అని రాము రాథోడ్.. హరీశ్‌ని నామినేట్ చేయగా ... షో వదిలేసి వెళ్లిపోతా అంటే అది గివప్ పర్సనాలిటీ అని రీతూ కారణం చెప్పింది. అయితే మీ వల్లే మా ఓనర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి అని హరీశ్ ఈమెకు కౌంటర్ ఇచ్చాడు. నాకు నచ్చినట్లు మిమ్మలి ఉండమని చెప్పట్లేదు. మీతో మీరు గొడవలు పెట్టుకుని, నా వల్ల అది జరుగుతుందని అంటే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని రీతూ ఏడ్చేసింది.ఎవరైనా ఏడిస్తే కాసేపు ఆపి, ఆ సంభాషణ కొనసాగిస్తారు. కానీ హరీశ్ మాత్రం రీతూతో.. సింపతీ కార్డ్, ఉమెన్ కార్డ్ ప్లే చేయొద్దు అని హర్ష్‌గా కౌంటర్ వేశాడు. ప్రియ అయితే ఇతడినే నామినేట్ చేస్తూ.. హ్యుమానిటీ మీకే కాదు మాకు ఉంది అంటూ కౌంటర్ వేసింది. ప్రోమో చూస్తుంటే అసలు హౌస్మేట్స్ అందరూ మాస్క్ మ్యాన్ని టార్గెట్ చేస్తున్నారా? హైలైట్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఏదైనా సరే ఇలాంటి వాళ్లని ఎంకరేజ్ చేస్తే టీఆర్పీలు వస్తాయి కాబట్టి బిగ్‌బాస్ కూడా ఇతడిని వదులుకోడేమో?(ఇదీ చదవండి: కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?) -
మాస్క్ మ్యాన్ చాలా సాఫ్ట్ ..! నన్ను నిజంగానే కొట్టాడు కానీ..! మాస్క్ వెనుక అసలు కథ!
-
మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!
వీకెండ్ అయిపోయిందంటే బిగ్‌బాస్ హౌసులో నామినేషన్స్ గోల మొదలవుతుంది. ఈసారి కూడా షురూ అయిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్ తను చెప్పిందే రైట్ అన్నట్లు అందరినీ టార్చర్ పెడుతున్నాడు! ఇన్నిరోజులు ఓపిక పట్టిన తనూజ.. నామినేషన్స్‌లో ఇతడిని ఉతికారేసింది. సైలెంట్‌గా నవ్వుతూ కనిపించిన రీతూ కూడా రెచ్చిపోయింది. ఇంతకీ సోమవారం ఏం జరిగింది?(ఇదీ చదవండి: అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)ఆదివారం నాగార్జున వచ్చి వెళ్లిపోయిన తర్వాత హౌస్మేట్స్ అంతా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంటి పని విషయంలో కామనర్స్ శ్రీజ-మనీష్ మధ్య మాటమాట పెరిగింది. దీంతో మూలకెళ్లి కూర్చుకున్న మనీష్.. వరస్ట్ కామనర్స్ వీళ్లు, ఓ గలీజ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు అంటూ తనతో వచ్చిన వాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరోవైపు వీకెండ్ నాగార్జున గట్టిగా వాయించేసరికి మాస్క్ మ్యాన్ డీలా పడిపోయాడు. ఏం చేయాలో తెలీక తినడం మానేశాడు.భరణి వచ్చి అడిగాడు, శ్రీజ అయితే ఏకంగా ప్లేటులో భోజనం తీసుకొచ్చి హరీశ్‌కి ఇచ్చింది. అయినా సరే మనోడు మంకు పట్టు వదట్లేదు. మీలాంటోళ్ల మధ్యన ఉండటమే దండగ అనేశాడు. నేను తినను, తాగను అని తెగేసి చెప్పాడు. దీంతో కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్, హరీశ్‌కి జాగ్రత్తలు చెప్పి ఇతడి బాధ్యతని రాము రాథోడ్‌కి అప్పగించాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే నామినేషన్ ఇద్దరివే జరిగినప్పటికీ మంచి రంజుగా జరిగాయి.తొలివారం అంతా తాను చెప్పిందే రైటు, అందరూ అదే వినాలి అనే రేంజులో ప్రవర్తించిన హరీశ్.. తనూజ తన తప్పులు ఎత్తిచూపుతూ నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ అపరిచితుడిలా ప్రవర్తించాడు. తన ప్రవర్తనతో అటు హౌసులోని వాళ్లకు ఇటు చూస్తున్న ప్రేక్షకులకు ఓ రకంగా టార్చర్ చూపిస్తున్నాడు. మరోవైపు మనీష్, రీతూని నామినేట్ చేశాడు.తొలివారం అంతా కాస్త సైలెంట్‌గానే రీతూ.. మనీష్ చెప్పిన పాయింట్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. గిన్నెలు సరిగా తోమడం లేదు, ఇంట్లోకి వచ్చినప్పుడు పర్మిషన్ అడగట్లేదు అంటూ ఏవేవో కారణాలు చెప్పాడు. దీనికి ఏ మాత్రం ఊరుకోని రీతూ.. నీదో షిట్ నామినేషన్ అని రెచ్చిపోయింది. మరోవైపు భరణిని కూడా నామినేట్ చేసిన మనీష్.. మీరు హౌసులో ఉన్న పెద్ద స్నేక్(పాము) అనేశాడు. కావాలనే కామనర్స్ మధ్యలో పుల్లలు పెడుతూ గొడవలకు కారణమవుతున్నారని అన్నాడు. ప్రస్తుతానికైతే తనూజ, మనీష్ మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లంతా మంగళవారం ఎపిసోడ్లో తమ తమ నామినేషన్స్ పూర్తి చేయనున్నారు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్) -
అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
బిగ్‌బాస్ హౌసులో రెండో వారం వచ్చేసింది. సెలబ్రిటీలతో పాటు ఎంట్రీ ఇచ్చిన కామనర్స్.. తొలివారం బాగానే లాక్కొచ్చారు కానీ ఇప్పుడు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్లలో వాళ్లే గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఈసారి నామినేషన్స్ జరగ్గా.. ఇందులోనూ చాలావరకు సామాన్యులే ఉన్నారు. ఇంతకీ ఈసారి లిస్టులో ఎవరెవరు ఉన్నారు? మాస్క్ మ్యాన్ హరీశ్.. నిరహారదీక్ష సంగతేంటి?తొలి వీకెండ్లో మాస్క్ మ్యాన్ హరీశ్ నిజస్వరూపాన్ని నాగార్జున బయటపెట్టడంతో మనోడు బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉన్నాడు. ఏం తినను, తాగను అంటూ నిరహారదీక్ష చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయం బయటపడింది. రెండో రోజుల నుంచి ఏం తినట్లేదు కాస్త తినండి అని చెప్పి ప్లేటులో ఫుడ్ పెట్టుకుని శ్రీజ రాగా.. మొహమాటం లేకుండా హరీశ్ వద్దనేశాడు. ఇంకొన్నిరోజుల వరకు తినను, కనీసం నీరు కూడా తాగను, మీలాంటోళ్ల మధ్యలో ఉండదల్చుకోలేదు అని అన్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు నేను ఏం తినను, తాగను అని క్లారిటీగా చెప్పేశాడు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్)మరోవైపు శ్రీజ-మనీష్ వాదులాడుకున్నారు. నీ పనే అరవడం కదా అని శ్రీజతోనే మనీష్ అనేసరికి ఈమె హర్ట్ అయిపోయింది. పాయింట్ అవుట్ చేసేస్తున్నారని మూలకు వెళ్లి ఏడవడం నీ పని అని మనీష్‌కి ఇచ్చిపడేసింది. భరణి తన గురించి సంజన దగ్గర చాడీలు చెబుతున్నాడని హరీశ్.. రాము రాథోడ్‌తో చెబుతూ కనిపించాడు.సెల్ఫీష్ రూత్‌లెస్ ఇడియట్స్ అని తమ కామనర్స్నే మనీష్ తిట్టాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కామనర్స్ అనేదానికి వీళ్లు ఓ గలీజ్ మార్క్, వరస్ట్ కామనర్స్ అంటూ ఇమ్మాన్యుయేల్‌తో చెబుతూ తెగ బాధపడిపోయాడు.ఇకపోతే ఈ వారం నామినేషన్స్ విషయానికొస్తే.. ఒక్కొక్కరు ఇద్దరిద్దరి పేర్లు చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. నామినేషన్ ప్రక్రియ బాగానే జరిగింది. అయితే దాదాపు ఎనిమిది మంది మాస్క్ మ్యాన్ హరీశ్ పేరు చెప్పారు. తర్వాత ఎక్కువమంది భరణి పేరు చెప్పారు. వీళ్లిద్దరితో పాటు మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి సామాన్యుల నుంచి నలుగురు, సెలబ్రిటీల నుంచి ఇద్దరు నామినేట్ అయినట్లు టాక్. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?) -
ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్‌బాస్‌కు.. ఎవరీ మాస్క్ మ్యాన్?
'దేవుడు దిగొచ్చినా నా తీరు మార్చుకోను, నేను మాట్లాడేదే రైటు, నా నెత్తికెక్కాలని చూస్తే తొక్కిపడేస్తా..' ఈ డైలాగులు, పద్ధతి అంతా మాస్క్ మ్యాన్‌దే! తన తప్పులను నాగార్జున ఎత్తిచూపినా సరే.. అవసలు తప్పే కాదన్నట్లు అడ్డదిడ్డంగా వాదించాడు. ఇమ్మాన్యుయేల్‌ను రెడ్ ఫ్లవర్ అనడం, అబ్బాయిలను అడంగిలుగా పోల్చడం.. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ ఈ వారం హైలైట్ అయ్యాడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీశ్. అసలు ఇతడెవరు? చూసేద్దాం..మాస్క వెనక రహస్యంసమాజంలో చాలామంది కనబడని మాస్కు వేసుకుంటారు. అది చెప్పడానికే హరీశ్ మాస్కు ధరించడం మొదలుపెట్టాడు. అయితే అతడు మాత్రం లోపల ఏదీ దాచుకోకుండా మాట్లాడతాడు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దాదాపు 12 ఏళ్లుగా నోస్ మాస్క్ ధరిస్తూ వచ్చాడు. ఐదు నెలలుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించాడు. విజయవాడలో పుట్టిపెరిగిన హరీశ్ హైదరాబాద్‌లో సెటిలయ్యాడు.అన్ని ఉద్యోగాల్లో..ట్యూషన్స్ చెప్పాడు, ఇంటింటికీ తిరిగి చేతి గడియారాలు అమ్మాడు. స్కూల్లో టీచర్‌గా మారాడు. బ్యాంకింగ్, టెలికాం, ఫార్మా, ఫైనాన్స్.. ఇలా అన్ని రంగాల్లో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అయినా ఎక్కడా తనకు సంతృప్తి కలగలేదు. హరీశ్‌ది ప్రేమ పెళ్లి. హరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. దేవుడిని నమ్మని ఇతడి పెళ్లి గుడిలో జరిగింది. వివాహం తర్వాత విభేదాలు రావడంతో దాదాపు ఏడేళ్లపాటు ఫ్యామిలీస్‌కి దూరంగా ఉన్నారు.యాక్సిడెంట్2017లో హరీశ్‌కు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత సిస్టర్ను కోల్పోయాడు. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఏళ్ల తరబడి ఆ డిప్రెషన్‌ను అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ బాధలోనే ఓసారి భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ డిప్రెషన్‌తోనే బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. ఇప్పుడు హౌస్‌లో అపరిచితుడిలా రకరకాల షేడ్స్ చూపిస్తున్నాడు. ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తన తప్పులను సరిదిద్దుకోకపోతే అతడు హౌస్‌లో కొనసాగడం కష్టమే!చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కామనర్స్ కామన్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్లను ఓనర్లను చేయగానే నిజమైన ఓనర్లలా తెగ ఫీలైపోతున్నారు. టెనెంట్స్/సెలబ్రిటీలతో కావాల్సినన్ని పనులు చేయించుకుంటూ వారితోనే చీటికిమాటికి గొడవలు పడుతున్నారు. అలా ఈ వారం చాలా గొడవలు జరిగాయి. వాటన్నిటి లెక్కలు సరిచేసేందుకు శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చేశాడు.కామనర్స్‌కు క్లాస్ పీకిన నాగ్సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ మధ్య ఏర్పడిన విభేదాలను క్లియర్ చేశాడు. ఫ్రీ బర్డ్, బ్యాక్ బిచ్చింగ్ అనేవి తప్పు పదాలు కావని క్లారిటీ ఇచ్చాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. చివరకు ఆ తప్పును తనూజ మీదకే నెట్టేసిన కామనర్స్ ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు. అలాగే గుండు అంకుల్ కామెంట్‌పై పెద్ద చర్చే జరిగింది. ఇమ్మాన్యుయేల్ నిన్ను గుండంకుల్ అనడం తప్పే, మరి దానికంటే ముందు రెడ్ ఫ్లవర్ అని నువ్వు అనడం తప్పు కాదా? అని మాస్క్ మ్యాన్ హరీశ్‌ను నిలదీశాడు నాగ్.రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా?అందుకతడు తను దురుద్దేశంతో ఆ మాట అనలేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగైతే గుండంకుల్ కూడా సరదాగా అన్నాడనుకోవచ్చుగా అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్. అగ్నిపరీక్ష కోసం గుండు చేయించుకున్నా.. అలాంటిది నాపై జోక్ వేస్తే తీసుకోను, బార్డర్ క్రాస్ చేస్తే ఊరుకోను అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు హరీశ్. గుండంకుల్ అన్నందుకు ఇమ్మాన్యుయేల్‌తో సారీ చెప్పించుకున్నావ్.. మరి రెడ్ ఫ్లవర్ అన్నందుకు నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదా? అని ప్రశ్నించాడు. వీడియో బయటకు లాగిన నాగ్అప్పటికే ముఖంలో నెత్తురు చుక్క లేని హరీశ్ (Haritha Harish).. సారీ బ్రదర్, అవసరం అయితే ఈ షో నుంచి వెళ్లిపోతా అని అసందర్భంగా మాట్లాడాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా హరీశ్ గురించి ఓ వీడియో ప్లే చేశాడు నాగ్. అందులో హరీశ్.. 'ఇమ్మాన్యుయేల్ ఆడాళ్లతో అయితేనే మాట్లాడతా అన్నాడు. నేను ఇప్పుడు ముగ్గురు ఆడాళ్లతో మాట్లాడా.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి.. ఈ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకిప్పుడు అర్థమైంది' అని మాట్లాడాడు. ఇందులో ఆడాళ్లపై హరీశ్‌కు చిన్నచూపు ఉందని క్లియర్‌గా అర్థమైందని రీతూ తప్ప హౌస్ అంతా ముక్తకంఠంతో చెప్పింది.అడ్డంగా వాదించిన మాస్క్ మ్యాన్కానీ మోనార్క్ హరీశ్ మాత్రం.. ఆడాళ్లను తక్కువ చేయలేదన్నాడు. పైగా.. నాపై ఆరోపణలు చేసి నా క్యారెక్టర్‌ను రాంగ్గా చిత్రీకరిస్తున్నారు అని హౌస్‌మేట్స్‌తో పాటు నాగ్పైనా ఆవేశపడ్డాడు. ఆ మాటతో నాగ్.. ఎవరు రాంగ్ సెట్ చేస్తున్నారు? అని ఫైర్ అయ్యాడు. అక్కడున్న లైవ్ ఆడియన్స్‌ని అడగ్గా వారు కూడా.. హరీశ్ ఫ్లిప్ అవుతున్నాడని చెప్పడంతో మాస్క్ మ్యాన్ దండం పెట్టేశాడు. ఎవరెన్ని చెప్పినా హరీశ్ మాత్రం తలపొగరుతో తను చెప్పిందే కరెక్ట్ అని అడ్డంగా వాదించాడు.చదవండి: ‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్ -
మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్
బిగ్‌బాస్ షోలో ఇప్పటివరకు 8 సీజన్లు జరిగాయి. ప్రతి వీకెండ్లోనూ వచ్చే నాగార్జున.. హౌస్మేట్స్ తప్పొప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్లతో మాట్లాడేవారు. చాలావరకు నాగ్ చెప్పిన దానికి వాళ్ల వైపు నుంచి సానుకూలంగా సమాధానం వచ్చేది. కొన్నిసార్లు మాత్రం హోస్ట్‌తో వాదించేవారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాగార్జున తనని తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తున్నారని మాస్క్ మ్యాన్ సీరియస్ అయిపోయాడు. దీంతో హరీశ్ vs నాగార్జున అన్నట్లు సాగింది.(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్?)శనివారం ఎపిసోడ్‌కి సంబంధించి ఇదివరకు ఓ ప్రోమో రిలీజ్ చేయగా అందులో సంజనకు నాగార్జున కౌంటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేయగా.. ఇమ్మాన్యుయేల్-హరీశ్ గొడవ గురించి మాట్లాడారు. ఇమ్ము.. సరదాకే గుండంకుల్ అని అన్నాడని ఎంతమంది అనుకుంటున్నారని అడగ్గా హౌసులోని అందరూ చేతులెత్తారు. దీంతో మాస్క్ మ్యాన్ హరీశ్‌దే తప్పు అన్నట్లు తేలింది. మరోవైపు ఇతడు.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి గురించి మాట్లాడిన ఓ వీడియోని స్క్రీన్ పై ప్రసారం చేయడంతో కొత్త వివాదం మొదలైంది.ఆ వీడియోలో మాస్క్ మ్యాన్ హరీశ్.. తనూజతో పాటు ఉన్న ఇమ్మాన్యుయేల్, భరణిని ఆడవాళ్లు అని పరోక్షంగా అన్నాడు. అయితే కావాలనే తనని తప్పుగా చూపిస్తున్నారని హరీశ్.. నాగార్జుననే నేరుగా అనేశాడు. నేను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నానా అని ఆశ్చర్యపోవడం నాగ్ వంతైంది. దీంతో ఈ గొడవకు సమాధానం చెప్పలేకపోయిన హరీశ్.. షో నుంచి క్విట్(వెళ్లిపోతా) అయిపోతా అని అన్నట్లు ప్రోమోలో చూపించారు. మరి నిజంగానే మాస్క్ మ్యాన్ని హౌస్ నుంచి బయటకు పంపేస్తారా? లేదంటే ఈ వివాదానికి ఎలా పుల్‌స్టాప్ పెడతారో చూడాలి?(ఇదీ చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?) -
ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ కూడా!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపు ఉంటే, సంజనా ఒక్కరే మరోవైపు నిలబడింది. కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, మరికొన్నిసార్లు అమాయకంగా ముఖం పెడుతుంది. ఒక్కోసారి తనపై నోరుపారేసుకున్నవారిపై ఒంటికాలిపై లేస్తుంది. ఏదేమైనా బిగ్‌బాస్ షోకి కావాల్సిన కంటెంట్ మాత్రం బాగానే ఇస్తుంది. ఇప్పుడేకంగా ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచింది.సత్తా చూపించిన రాముఅయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో కామనర్లు అతి చేశారు. పవన్ కల్యాణ్ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీశ్.. నేను వేరే వాళ్లలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయేల్‌పై సెటైర్లు వేశాడు. ఎవరూ శ్రీజ నిల్చున్న రాడ్స్ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ, ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్! సంజనాకోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజనా కెప్టెన్ అయింది.బాడీ షేమింగ్నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్లు ఎన్ని మాటలంటున్నారు? నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సంజనా.. తన లగేజీకి రూమ్‌లోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకి చెప్తే తను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజనా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్ కోసం బిగ్‌బాస్ చాక్లెట్లు, చిప్స్ పంపిస్తే.. కామనర్లు ప్రియ, శ్రీజ వాటిని కొట్టేశారు. ముగ్గురు ఆడోళ్లుఒక్క గుడ్డు తిన్నందుకు ఆమెను రెండురోజులపాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీశ్.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఒకమ్మాయి, ఇద్దరు మగాళ్లు అనుకున్నా.. కానీ వాళ్లు ముగ్గురు ఆడోళ్లని ఇప్పుడే తెలిసింది. ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు.దొంగతనం చేసిన మాస్క్ మ్యాన్కెప్టెన్ సంజనా హౌస్‌మేట్స్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తనను ఇంప్రెస్ చేస్తే కూల్‌డ్రింక్ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి? అనుకున్నాడో, ఏమో కానీ హరీశ్ ఓ కూల్‌డ్రింక్ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్ చేసేందుకు అందరూ స్కిట్ చేశారు. స్కిట్ చేసిన వాళ్లలో ఫలానా వాళ్లు బెస్ట్ అంటూ ప్రకటించింది. కానీ, అందరికీ కూల్‌డ్రింక్ ఇచ్చేముందు ఓ కూల్‌డ్రింక్ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీశ్ దాన్ని బయటపెడతాడా? లేదా? చూడాలి! -
ఇన్నాళ్లూ భరణి, ఇమ్మాన్యుయేల్ మగాళ్లనుకున్నా.. అంతమాటన్నాడేంటి?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీశ్ ఇప్పుడదే చేశాడు. హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. సంచాలక్ మర్యాద మనీష్ వల్ల ఈ టాస్క్ గందరగోళంగా మారింది. ఫైనల్‌గా ఈ గేమ్‌లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.భరణి, ఇమ్మాన్యుయేల్.. ఆడవాళ్లు!అయితే తాజా ప్రోమోలో హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్ చేశాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. బాడీ షేమింగ్ చేసినట్లు ఎపిసోడ్లో క్లిప్ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్ చేతిలో పవన్ కల్యాణ్‌కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్, మనీష్‌లకు కూడా క్లాస్ పడేట్లు కనిపిస్తోంది. చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్
కామనర్స్ అంటే బెరుకుగా, భయంభయంగా ఉంటారనుకున్నారేమో! కానీ, సెలబ్రిటీలనే బెదరగొడుతున్నారు. అందులోనూ బిగ్‌బాస్ వారికి సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఇంటిని కామనర్ల చేతిలో పెట్టాడు. వాళ్ల అనుమతితోనే టెనెంట్లు (సెలబ్రిటీలు) లోపల అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పని, వంటపని, అందరి బట్టలు ఉతికే పని కూడా సెలబ్రిటీలే చేస్తున్నారు.షేడ్స్ చూపిస్తున్న కామనర్స్ఒక్కోసారి సెలబ్రిటీల పరిస్థితి చూసి జాలిపడతారు, బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) వద్దన్నా సరే మానవత్వం అంటూ అరటిపండ్లు ఇచ్చేందుకు ముందుకొస్తారు. అదే సమయంలో వాళ్లు ఆకలిగా ఉందని ఏదైనా తింటే మాత్రం బిగ్‌బాస్ రూల్ మర్చిపోయారా? అని లాక్కుంటారు. వాళ్ల విధానాలు వారికే అర్థం కావాలి! ప్రస్తుతానికి హౌస్‌లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పక్షపాతం చూపించాడు బిగ్‌బాస్. కామనర్స్‌ను పక్కనపెట్టేసి టెనంట్స్ మాత్రమే ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలన్నాడు.చేతులెత్తి దండం పెట్టిన తనూజఅంతటితో ఆగలేదు.. వారి నామినేషన్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అన్నది చూడాల్సిన బాధ్యతను కామనర్స్‌కు అప్పగించాడు. ఇప్పటికే సంజనా, సుమన్ నామినేట్ అయ్యారు. తాజాగా ఈ నామినేషన్‌కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో శ్రీజ మాట్లాడుతూ.. వచ్చినప్పటి నుంచి కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారని తనూజ (Thanuja Puttaswamy)తో అంది. దానికామె చేతులెత్తి దండం పెట్టింది. పని కూడా చిరాకుపడుతూ చేస్తున్నారంది.అర్హత లేదని హెచ్చరికఒకరు ఒకసారి ఓ పని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకోపని చెప్తారు, నేనూ మనిషినే.. అంటూ తనూజ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించగా మధ్యలో మాస్క్ మ్యాన్ దూరాడు. నీ దయదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? మీ మాట, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని తిట్టాడు. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. కానీ తర్వాత మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. భరణి మినహా మిగతా అందరు సెలబ్రిటీలు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్, సుమన్, సంజన, ఫ్లోరా, రాము రాథోడ్, శ్రష్టి వర్మ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరితో పాటు కామనర్ డిమాన్ పవన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
బిగ్ బాస్ హౌస్ లో మొదలైన రచ్చ.. మొదటిరోజే రెచ్చిపోయిన మాస్క్ మాన్..!
-
గుండంకుల్.. ఎంతమాటన్నాడ్ సార్? అపరిచితుడు బయటకొచ్చేశాడు!
బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu) మొదలైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున అన్నది కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. మొదటి రోజే గొడవపడ్డారు. మాస్క్ మ్యాన్ హరీశ్, కమెడియన్ ఇమ్మాన్యుయేట్ మధ్యే ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం కూడా ఓ రకంగా బిగ్‌బాస్ అనే చెప్పాలి! సెలబ్రిటీలను కామనర్స్గా, కామనర్స్‌ను సెలబ్రిటీలుగా మార్చేశాడు బిగ్‌బాస్. సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక, ప్రధాన హౌస్‌లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు. నోటి కాడ కూడును లాక్కున్నాడు కూడా!ఒక్క పూట అన్నం కోసం..వాళ్లకు వండిపెట్టాలని చెప్పానే తప్ప తినమని ఎవరు చెప్పారన్నట్లుగా సరిగ్గా ప్లేటు ముందు పెట్టుకున్న సమయంలో ఆ ఫుడ్‌ను లోపల పెట్టేయమన్నారు. దీంతో తొమ్మిది మంది సెలబ్రిటీలు చేసేదేం లేక కళ్లతోనే భోజనాన్ని ఆస్వాదించి తిండి మాని పస్తులున్నారు. ఇది హరీశ్ తట్టుకోలేకపోయాడు. తిండి లాక్కోవడం తప్పంటూ బిగ్‌బాస్‌కే క్లాస్ పీకాడు. వాళ్లు తినేవరకు తానూ తినేది లేదని భోజనం ప్లేటు మీద నుంచి లేచాడు. అంతేకాదు, బ్రదర్ నేనున్నా అంటూ సెలబ్రిటీలకు అరటిపండ్లు పట్టుకెళ్లాడు. దాంతో బిగ్‌బాస్ మరోసారి వారించాడు. గుండు అంకుల్.. బెడిసికొట్టిన కామెడీవారిని పస్తులుంచడం తట్టుకోలేని హరీశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అయినా బిగ్‌బాస్ మరీ అంత చెడ్డోడు కాదులే.. ఏదో కాసేపు అలా తినొద్దని భయపెట్టినా తనే స్వయంగా ఫుడ్ పంపించాడు. అంటే కామనర్లకు సెలబ్రిటీలు వండిపెడ్తే.. సెలబ్రిటీలకు బిగ్‌బాస్ ఆహారం పంపిస్తాడన్నమాట! ఇకపోతే ఇమ్మాన్యుయేల్ ఏదో కామెడీ చేద్దామని ప్రయత్నించాడు. హరీశ్‌ను గుండు అంకుల్ అన్నాడు. మొదట ఆయన పట్టించుకోలేదు, కానీ రెండుమూడు సార్లు అనేసరికి చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు? ఎవరు అంకుల్? అని ఫైరయ్యాడు.బాడీ షేమింగ్అప్పటికే హర్ట్ అయ్యాడని గమనించిన ఇమ్ము.. అన్నా సారీ చెప్పా కదా అని సముదాయించాడు. అయినా తగ్గని హరీశ్.. లిమిట్లో ఉండు, బాడీ షేమింగ్ చేయొద్దని హెచ్చరించాడు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా, నెత్తిమీద ఎక్కాలని చూస్తే తొక్కిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చాలాసేపు వీరిమధ్య ఫైట్ నడిచింది. ఆయన గుండు చేయించుకుందే బిగ్‌బాస్ కోసం! అగ్నిపరీక్ష షోలో అరగుండు చేయించుకోమనగానే క్షణం ఆలోచించకుండా సగభాగం షేవ్ చేసుకున్నాడు. అతడిని ధైర్యాన్ని మెచ్చిన బిందుమాధవి.. మరీ అరగుండుతో ఎంతకాలం ఉంటావని పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది. అపరిచితుడు బయటకొచ్చేశాడుఇక బిగ్‌బాస్ షో అంతా అరగుండుతోనే ఉండాలని హరీశ్‌కు కండీషన్ కూడా పెట్టారు. ఈయన ఒక్కరోజులోనే తినమని ప్రేమ, తిననందుకు కన్నీళ్లు, తనపై కామెడీ చేసినందుకు కోపం.. ఇలా అన్నీ చూపించాడు. లైవ్‌లో అయితే వయసెంత అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సరదాగా ఉన్నాడట! మొత్తానికి మొదటిరోజే అపరిచితుడిని చూసేశామన్నమాట! చదవండి: రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్


