
వీకెండ్ అయిపోయిందంటే బిగ్‌బాస్ హౌసులో నామినేషన్స్ గోల మొదలవుతుంది. ఈసారి కూడా షురూ అయిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్ తను చెప్పిందే రైట్ అన్నట్లు అందరినీ టార్చర్ పెడుతున్నాడు! ఇన్నిరోజులు ఓపిక పట్టిన తనూజ.. నామినేషన్స్‌లో ఇతడిని ఉతికారేసింది. సైలెంట్‌గా నవ్వుతూ కనిపించిన రీతూ కూడా రెచ్చిపోయింది. ఇంతకీ సోమవారం ఏం జరిగింది?
(ఇదీ చదవండి: అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)
ఆదివారం నాగార్జున వచ్చి వెళ్లిపోయిన తర్వాత హౌస్‌మేట్స్ అంతా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంటి పని విషయంలో కామనర్స్ శ్రీజ-మనీష్ మధ్య మాటమాట పెరిగింది. దీంతో మూలకెళ్లి కూర్చుకున్న మనీష్.. వరస్ట్ కామనర్స్ వీళ్లు, ఓ గలీజ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు అంటూ తనతో వచ్చిన వాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరోవైపు వీకెండ్ నాగార్జున గట్టిగా వాయించేసరికి మాస్క్ మ్యాన్ డీలా పడిపోయాడు. ఏం చేయాలో తెలీక తినడం మానేశాడు.
భరణి వచ్చి అడిగాడు, శ్రీజ అయితే ఏకంగా ప్లేటులో భోజనం తీసుకొచ్చి హరీశ్‌కి ఇచ్చింది. అయినా సరే మనోడు మంకు పట్టు వదట్లేదు. మీలాంటోళ్ల మధ్యన ఉండటమే దండగ అనేశాడు. నేను తినను, తాగను అని తెగేసి చెప్పాడు. దీంతో కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్, హరీశ్‌కి జాగ్రత్తలు చెప్పి ఇతడి బాధ్యతని రాము రాథోడ్‌కి అప్పగించాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే నామినేషన్ ఇద్దరివే జరిగినప్పటికీ మంచి రంజుగా జరిగాయి.

తొలివారం అంతా తాను చెప్పిందే రైటు, అందరూ అదే వినాలి అనే రేంజులో ప్రవర్తించిన హరీశ్.. తనూజ తన తప్పులు ఎత్తిచూపుతూ నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ అపరిచితుడిలా ప్రవర్తించాడు. తన ప్రవర్తనతో అటు హౌసులోని వాళ్లకు ఇటు చూస్తున్న ప్రేక్షకులకు ఓ రకంగా టార్చర్ చూపిస్తున్నాడు. మరోవైపు మనీష్, రీతూని నామినేట్ చేశాడు.
తొలివారం అంతా కాస్త సైలెంట్‌గానే రీతూ.. మనీష్ చెప్పిన పాయింట్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. గిన్నెలు సరిగా తోమడం లేదు, ఇంట్లోకి వచ్చినప్పుడు పర్మిషన్ అడగట్లేదు అంటూ ఏవేవో కారణాలు చెప్పాడు. దీనికి ఏ మాత్రం ఊరుకోని రీతూ.. నీదో షిట్ నామినేషన్ అని రెచ్చిపోయింది. మరోవైపు భరణిని కూడా నామినేట్ చేసిన మనీష్.. మీరు హౌసులో ఉన్న పెద్ద స్నేక్(పాము) అనేశాడు. కావాలనే కామనర్స్ మధ్యలో పుల్లలు పెడుతూ గొడవలకు కారణమవుతున్నారని అన్నాడు. ప్రస్తుతానికైతే తనూజ, మనీష్ మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లంతా మంగళవారం ఎపిసోడ్‌లో తమ తమ నామినేషన్స్ పూర్తి చేయనున్నారు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్)