
బిగ్‌బాస్ హౌసులో రెండో వారం వచ్చేసింది. సెలబ్రిటీలతో పాటు ఎంట్రీ ఇచ్చిన కామనర్స్.. తొలివారం బాగానే లాక్కొచ్చారు కానీ ఇప్పుడు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్లలో వాళ్లే గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఈసారి నామినేషన్స్ జరగ్గా.. ఇందులోనూ చాలావరకు సామాన్యులే ఉన్నారు. ఇంతకీ ఈసారి లిస్టులో ఎవరెవరు ఉన్నారు? మాస్క్ మ్యాన్ హరీశ్.. నిరహారదీక్ష సంగతేంటి?
తొలి వీకెండ్‌లో మాస్క్ మ్యాన్ హరీశ్ నిజస్వరూపాన్ని నాగార్జున బయటపెట్టడంతో మనోడు బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉన్నాడు. ఏం తినను, తాగను అంటూ నిరహారదీక్ష చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయం బయటపడింది. రెండో రోజుల నుంచి ఏం తినట్లేదు కాస్త తినండి అని చెప్పి ప్లేటులో ఫుడ్ పెట్టుకుని శ్రీజ రాగా.. మొహమాటం లేకుండా హరీశ్ వద్దనేశాడు. ఇంకొన్నిరోజుల వరకు తినను, కనీసం నీరు కూడా తాగను, మీలాంటోళ్ల మధ్యలో ఉండదల్చుకోలేదు అని అన్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు నేను ఏం తినను, తాగను అని క్లారిటీగా చెప్పేశాడు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్)
మరోవైపు శ్రీజ-మనీష్ వాదులాడుకున్నారు. నీ పనే అరవడం కదా అని శ్రీజతోనే మనీష్ అనేసరికి ఈమె హర్ట్ అయిపోయింది. పాయింట్ అవుట్ చేసేస్తున్నారని మూలకు వెళ్లి ఏడవడం నీ పని అని మనీష్‌కి ఇచ్చిపడేసింది. భరణి తన గురించి సంజన దగ్గర చాడీలు చెబుతున్నాడని హరీశ్.. రాము రాథోడ్‌తో చెబుతూ కనిపించాడు.సెల్ఫీష్ రూత్‌లెస్ ఇడియట్స్ అని తమ కామనర్స్‌నే మనీష్ తిట్టాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కామనర్స్ అనేదానికి వీళ్లు ఓ గలీజ్ మార్క్, వరస్ట్ కామనర్స్ అంటూ ఇమ్మాన్యుయేల్‌తో చెబుతూ తెగ బాధపడిపోయాడు.
ఇకపోతే ఈ వారం నామినేషన్స్ విషయానికొస్తే.. ఒక్కొక్కరు ఇద్దరిద్దరి పేర్లు చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. నామినేషన్ ప్రక్రియ బాగానే జరిగింది. అయితే దాదాపు ఎనిమిది మంది మాస్క్ మ్యాన్ హరీశ్ పేరు చెప్పారు. తర్వాత ఎక్కువమంది భరణి పేరు చెప్పారు. వీళ్లిద్దరితో పాటు మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి సామాన్యుల నుంచి నలుగురు, సెలబ్రిటీల నుంచి ఇద్దరు నామినేట్ అయినట్లు టాక్. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందనేది చూడాలి?
(ఇదీ చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?)