మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి మరో భారీ హిట్ అందుకున్నారు. 74 ఏళ్ల వయసులో ఆయన హీరోగానే కాకుండా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలతోనూ మెప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘కలాంకావల్’(Kalamkaval)లో తాను విలన్ పాత్రలో నటించారు. డిసెంబర్ 5న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరనుంది.
ఈ ఏడాది ప్రారంభంలో ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ అనే మిస్టరీ కామెడీ థ్రిల్లర్ సినిమాతో మెప్పించిన మమ్ముట్టి(Mammootty) ఇప్పుడు కలాంకావల్(Kalamkaval) అనే మూవీతో భారీ విజయం అందుకున్నారు. ఎప్పుడూ కూడా వైవిధ్యమైన పాత్రలతో, కథలతో మమ్ముట్టి ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తారు. ఈ చిత్రంలో కూడా ఆయన మానసిక రోగి పాత్రను పోషించారు. దర్శకుడు జితిన్ కె. జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విమర్శకులు, ప్రేక్షకుల నుండి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. రెండు వారాలకు గాను ‘కలాంకావల్’ చిత్రం కేవలం మలయాళంలోనే రూ. 75 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం చాలా థియేటర్స్‌లో మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. దీంతో మరో వారంలోపు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మమ్ముట్టి కంపెనీ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కలాంకావల్’లో వినాయకన్, మీరా జాస్మిన్, జిబిన్ గోపీనాథ్, గాయత్రి అరుణ్, రజిషా విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్‌కు రానుంది.


