ఊరి నేపథ్యం ‘దండోరా’.. ప్రేక్షకుల ఊహకు అందదు : డైరెక్టర్‌ | Director MuraliKanth Comments On Dhandoraa Movie A Gripping Tale Of Social Justice And Unexpected Twists | Sakshi
Sakshi News home page

ఊరి నేపథ్యం ‘దండోరా’.. ప్రేక్షకుల ఊహకు అందదు : డైరెక్టర్‌

Dec 16 2025 8:19 AM | Updated on Dec 16 2025 9:46 AM

Director MuraliKanth Talk About Dhandoraa Movie

శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్‌ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మురళీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘సమాజంలోని అసమానతలపై కథ చెప్పాలనుకుని, నాకు ఎదురైన ఓ సంఘటన ఆధారంగా ‘దండోరా’ సినిమా కథ రాసుకున్నాను. 

ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని పూడ్చిపెట్టే వరకు జరిగే కథే ‘దండోరా’. ఈ సినిమా కథ ఓ ఊరి నేపథ్యంలో సాగుతుంది. ఓ వ్యక్తిని ఆ ఊర్లో ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది? అన్నదే కథ. 

ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంది. బిందు మాధవి, మనిక, రాధ్య, మౌనిక... ఇలా వీరు చేసిన పాత్రలు, తీసుకునే నిర్ణయాలే టర్నింగ్‌ పాయింట్స్‌గా ఉంటాయి. నెక్ట్స్‌ ఏం జరుగుతుందో ప్రేక్షకుల ఊహకు అందదు. ముందుగా ఈ మూవీ కోసం వేరే టైటిల్‌ అనుకున్నాను. ఇది నాకు మూడేళ్ల జర్నీ. ‘అంతిమ యాత్ర’ అనే వర్కింగ్ టైటిల్‌ను అందరూ చూసి డల్‌గా ఉందని అనుకున్నారు. మనం మంచి కథను, మంచి సౌండింగ్‌తో చెబుతున్నాం కదా.. టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్‌గా ఉండాలని నిర్మాత అన్నారు. అలాంటి టైంలో ఓ ఫ్రెండ్ ‘దండోరా’ అని సలహా ఇచ్చారు. అలా ఈ మూవీకి కరెక్ట్ టైటిల్ దొరికినట్టు అయింది’ అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement