నువ్వు నాకు నచ్చావ్‌ రీరిలీజ్‌ మాత్రమే కాదు! | Venkatesh Nuvvu Naaku Nachav Rereleasing on 1st January 2026 | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరానికి 'నువ్వు నాకు నచ్చావ్‌'తో వెల్‌కమ్‌

Dec 15 2025 8:19 AM | Updated on Dec 15 2025 9:50 AM

Venkatesh Nuvvu Naaku Nachav Rereleasing on 1st January 2026

వెంకటేశ్‌, ఆర్తి అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా కె విజయభాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్‌. త్రివిక్రమ్‌ కథ, డైలాగ్స్‌ అందించిన ఈ సినిమాను స్రవంతి రవికిశోర్‌ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్‌ 6న విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించింది. 

ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్‌తో ప్రపంచవ్యాప్తగా రీరిలీజ్‌ చేయనున్నట్లుగా స్రవంతి రవికిశోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా రవికిశోర్‌ మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్‌. ఇది కేవలం రీరిలీజ్‌ కాదు, నూతన సంవత్సరాన్ని (2026 జనవరి 1) కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని చెప్పారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement