టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్‌తో కలిసి AMB బ్రాండ్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత కొత్త థియేటర్లు ఇతర నగరాల్లో కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలిలో AMB సినిమాస్ ఉంది.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో AMB క్లాసిక్ నిర్మాణంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం హకీంపేట్‌లో కొత్త థియేటర్ నిర్మాణం జరుగుతోంది. 2027లో ప్రారంభం అవుతుందని అంచనా.. అయితే, మహేష్ బాబు తన ప్లాన్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయనున్నారు.
మహేష్‌బాబు వేసిన దారిలో అల్లు అర్జున్ (AAA సినిమాస్), విజయ్ దేవరకొండ (AVD సినిమాస్), రవితేజ (ART సినిమాస్) వంటి స్టార్స్ కూడా అడుగులు వేస్తున్నారు. అయితే, మహేష్ మాత్రం ఈ రంగంలో చాలా దూకుడుగా ఉన్నారు. మొదట మెట్రో నగరాలను టార్గెట్ చేసిన ఆయన త్వరలో విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మహేష్ ప్లాన్ చేస్తున్న మూడో ప్రాజెక్ట్ హకీంపేట్(AMB Hakimpet)లో రానుంది. అక్కడ ఐమాక్స్ స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది.
ఇలా టాప్ రేంజ్ మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్న మహేష్ బెంగళూరులో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేశారు. కపాలి థియేటర్ ప్రాంగణంలో AMB Cinemas Kapali త్వరలో ఓపెన్ కానుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సినిమాను బెంగళూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించనున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎంటర్టైన్‌మెంట్ బ్రాండ్‌గా AMB నిలవనుంది.
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌తో కలిసి AMB Cinemasను లగ్జరీ బ్రాండ్‌గా రూపొందించారు. 7 స్టార్ లగ్జరీ, 7 3D స్క్రీన్స్, Dolby Atmos సౌండ్ సిస్టమ్‌తో గోవా, చెన్నై వంటి నగరాల్లో కూడా విస్తరణ చేసే ప్లాన్స్ ఉన్నాయి. అక్కడ డాల్బీ అట్మాస్, IMAX వంటి cutting-edge టెక్నాలజీని తీసుకువస్తున్నారు.


