– బాలకృష్ణ
‘అఖండ 2: తాండవం’ కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు. భారతీయ చిత్రం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు సంబంధించిన సినిమా ఇది. సనాతన హైందవ ధర్మం పరాక్రమాన్ని చూపించిన చిత్రం. ఈ సినిమా చూశాక సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని అందరూ అంటున్నారు’’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’.
సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆంచట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఆదివారం యూనిట్ నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకువెళ్లిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మన సినిమాను గెలుపించుకోవాలని ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఆర్టిస్టు, టెక్నిషియన్ కు థ్యాంక్స్.
ఆ శివుడే మా వెనకాల ఉండి నడిపించాడు’’ అన్నారు. ‘‘అఖండ 2’కు మ్యూజిక్ ఇవ్వడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా సక్సెస్ అవుతుందని ధైర్యంగా అనుకున్నాం’’ అని చెప్పారు తమన్ . ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బోయపాటిగారు బాలకృష్ణగారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. దైవంతో కూడిన ఒక క్యారెక్టర్‌ను డిజైన్ చేసి, ఒక సూపర్ హీరోని చేయడం అది బాలకృష్ణ, బోయపాటిగార్లకే చెల్లింది. తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే మేం పే చేసిన దానికి 70 శాతం రెవెన్యూ రికవరీ అయ్యింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఇండస్ట్రీలో కీలకమైన వ్యక్తిగా నాకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో విజీ చంద్రశేఖర్, గంగాధర శాస్త్రి, కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


