'అఖండ 2' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. 300 కోట్లు దాటిందా..? | Akhanda 2 movie day 1 collections | Sakshi
Sakshi News home page

'అఖండ 2' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. 300 కోట్లు దాటిందా..?

Dec 13 2025 12:43 PM | Updated on Dec 13 2025 1:10 PM

Akhanda 2 movie day 1 collections

'అఖండ 2' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ వచ్చేశాయి. అధికారికంగా 14 రీల్స్‌ ప్లస్‌ ప్రకటించింది. టీడీపీకి చెందిన ఒక యూట్యూబర్‌ చెప్పినట్లు 3 కోట్ల టికెట్లు తెగలేదు.  అది కూడా కేవలం హైదరాబాద్‌లో అని చెప్పడం మరీ అశ్చర్యాన్ని కలిగించే అంశమే అని చెప్పాలి.  ఒకవేళ ఇదే నిజమైంటే టికెట్‌ ధర రూ. 100 ఉన్నా కూడా మూడు వందల కోట్లు వచ్చేవి. పుష్ప-2 రికార్డ్‌ కూడా దాటేది.. ఇలాంటి మ్యాజిక్‌లు ఏమీ జరగవని తెలిసిందే. 

కానీ, మెగా హీరోలను ట్యాగ్‌ చేస్తూ మా బాలయ్య రేంజ్‌ ఇదీ అంటూ ఆ వీడియోను సోషల్‌మీడియాలో కొందరు షేర్‌ చేయడం విశేషం. అయితే,  తాజాగా కలెక్షన్స్‌ అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ తిరిగి కౌంటర్‌ ఇస్తున్నారు. ఫేక్‌ ప్రచారం ఎందుకు అంటూ పోస్టులు పెడుతున్నారు.

అఖండ2 ఫస్ట్‌ డే ప్రపంచవ్యాప్తంగా రూ 59.5 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రీమియర్‌ షోలతో కలిపి ఈ కలెక్షన్స్‌ అన్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. సాక్‌నిల్క్‌ వెబ్‌సైట్‌ ప్రకారం అఖండ సుమారు రూ. 36 కోట్ల నెట్‌ రాబట్టినట్లు పేర్కొంది. అంటే అధికారికంగా ప్రకటించిన గ్రాస్‌ కలెక్షన్స్‌కు సమానంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.75 కోట్లు, హిందీలో రూ. 50 లక్షలు, కేరళలో రూ. 3 లక్షలు, తమిళనాడులో రూ. 1.13 కోట్లు మాత్రమే ఈ మూవీ రాబట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement