మా కుటుంబం మెట్టుగూడలో ఉండేది.. తరచూ సంగీత్ థియేటర్‌లో సినిమాలు చూసేందుకు వచ్చే వాళ్లం. రాజీవ్ కనకాలతో నా డేటింగ్ స్పాట్ అదే. ఇక్కడే పాప్‌కార్న్ తింటూ, కూల్‌డ్రింక్స్ తాగుతూ టైంపాస్ చేసే వాళ్లం.
– సుమ, ప్రముఖ యాంకర్
రీల్ టు హీల్..
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులో 1969లో వెలిసిన సంగీత్ థియేటర్ ఇంగ్లిష్ సినిమాలకు ఐకానిక్ వేదిక. ఎలాంటి మలీ్టఫ్లెక్స్‌లు లేని సమయంలో బ్లాక్ బ్లస్టర్ సినిమాలతో పాటు అనేక బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 2008లో ఈ థియేటర్ మూతబడడంతో అదే స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మితమైంది. ప్రస్తుతం ఈ స్థలంలో 300 పడకల మెడికవర్ ఆస్పత్రి వచ్చింది . అప్పటి రీల్ నుంచి ఇప్పుడు రోగాలను హీల్ చేసే ఆస్పత్రిగా అవతరించింది.
అప్పట్లో తెరపై అనేక మంది నటుల హీరోయిజాన్ని ప్రదర్శించిన ఈ ప్రదేశంలో.. నేడు అనేక మంది ప్రాణాలను కాపాడుతూ నిజమైన హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అయితే ఇప్పటికీ సంగీత్ ల్యాండ్ మార్క్ అలాగే స్థిరపడి ఉండగా రానున్న రోజుల్లో దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారోనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


