తండ్రికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి తన కుమారుడైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శుక్రవారం నాగారంలోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్‌రెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి, శాలువాతో సన్మానించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు రామచంద్రారెడ్డిని సన్మానించారు.


