దగ్గరివాళ్లే ద్రోహం చేశారు.. రెండేళ్లవుతోంది: నటి | Richa Chadha Opens Up About Industry Betrayals And Returning To Work Two Years After Giving Birth | Sakshi
Sakshi News home page

Richa Chadha: సంతోషాన్ని లాగేసుకున్నారు.. అయినా నేను రిచ్చే...

Dec 13 2025 10:04 AM | Updated on Dec 13 2025 11:00 AM

Richa Chadha on Industry Betrayals and Returning to Work

బాలీవుడ్‌ బ్యూటీ రిచా చద్దా గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టాక తనను చూసుకోవడంతోనే సరిపెట్టుకున్న రిచా చద్దా ఇప్పుడు మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టింది. అయితే అనుకున్నదానికంటే ఆలస్యంగానే సెట్‌లో రీఎంట్రీ ఇచ్చానంటోంది రిచా. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది.

ద్రోహం చేశారు
దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ పనిలో నిమగ్నమయ్యాను. వీలైనంత త్వరగా సెట్‌లో అడుగుపెట్టాలనుకున్నాను.. కానీ నా శరీరం, మనసు అందుకు సిద్ధపడటానికి చాలా సమయమే తీసుకుంది. వీటిని పక్కనపెడితే ఇండస్ట్రీలో అత్యంత దగ్గరి వ్యక్తులే నాకు ద్రోహం చేశారు. ఈ రంగంలో కొందరికి మాత్రమే నీతి నిజాయితీ అనే విలువలు ఉంటాయని అర్థమైంది. 

వాళ్లను క్షమిస్తానేమో కానీ..
వాళ్లకు ఆత్మనూన్యతా భావం ఎక్కువ. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండరు, పక్కపవాళ్లనూ సంతోషంగా ఉండనివ్వరు. ఎలా అంటే పక్కవాళ్ల జీవితంలోని ఆనందాన్నంతా పీల్చేస్తుంటారు. అయితే ఇదంతా కొత్తేమీ కాదు.. గురు దత్‌ 70 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటివాళ్లను నేను క్షమిస్తానేమో కానీ జరిగినదాన్ని మాత్రం మర్చిపోను.

నాకంటూ లైఫ్‌ ఉంది
పాప పుట్టకముందు నేనెలా ఉండేదాన్నో నాకే గుర్తులేదు. చాలామంది ఏదో ఒక కంటెంట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉండమని చెప్తున్నారు. నాకంటూ ఓ జీవితం ఉంది. ఆ లైఫ్‌లో జరిగే ప్రతీది చెప్పడం నాకిష్టం లేదు. అసలు సోషల్‌ మీడియాలో ప్రతీది షేర్‌ చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఎవరైనా ఒంటరితనం పోతుందా? లేదా మనమేదో రిచ్‌ అని చెప్పడానికా? అయినా నేను ఆల్‌రెడీ రిచే (Richa) అని చెప్పుకొచ్చింది.

సినిమా
రిచా చద్దా (Richa Chadha).. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌, ఫర్కీ, సర్బ్‌జిత్‌, లవ్‌ సోనియా, గోలియో కీ రాస్‌లీల రామ్‌లీల, షకీల, సెక్షన్‌ 375 వంటి పలు సినిమాల్లో నటించింది. చివరగా హీరామండి వెబ్‌ సిరీస్‌లో కనిపించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement