హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, కన్నడ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ‘ఆషికీ 3’ సినిమాతో బాలీవుడ్‌లో, ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక హిందీలో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే రెండో సినిమా ‘ఛూ మంతర్’లో నటించే చాన్స్ అందుకున్నారట శ్రీలీల.
తరుణ్ దుడేజా దర్శకత్వంలో మాడాక్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ‘ముంజ్య’ ఫేమ్ అభయ్ వర్మ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తొలుత అనన్యాపాండేను సంప్రదించారు మేకర్స్. ఆమె సరే అన్నప్పటికీ... తన బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’ రెండో సీజన్‌తో డేట్స్ క్లాష్ కావడంతో ‘ఛూ మంతర్’ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోనున్నారట. ఇప్పటికే మేకర్స్ సంప్రదించగా.. ‘ఛూ మంతర్’లో నటించేందుకు శ్రీలీల సుముఖంగా ఉన్నారని టాక్.


