డ్రాగన్‌ రిటర్న్స్‌ | NTR Dragon Movie Shooting Update | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ రిటర్న్స్‌

Dec 13 2025 3:11 AM | Updated on Dec 13 2025 3:11 AM

NTR Dragon Movie Shooting Update

కొంత గ్యాప్‌ తర్వాత ట్రీ ఇస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన ఓ యాడ్‌ షూట్‌లో ఎన్టీఆర్‌ గాయపడటం, ఎన్టీఆర్‌ న్యూ మేకోవర్‌ కోసం కొంత టైమ్‌ పట్టడం వంటి కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది.

కొంత గ్యాప్‌ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దాదాపు 25 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా రాత్రివేళ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్‌ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement