వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్‌లోకి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిని ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, కబీర్ దుహాన్ సింగ్, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్‌కుమార్ తదితరులు నటించారు. ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, తాజాగా ఈ మూవీ రివ్యూలు, ఫలితంపై వారు రియాక్ట్ అయ్యారు.
అఖండ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట పేర్కొన్నారు. బుక్‌మైషోలో కూడా గంటకు 25వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయన్నారు. హిందీ బెల్ట్‌లో సుమారు 800 థియేటర్స్‌లలో విడుదల చేశామన్నారు. అక్కడ కూడా మంచి టాక్ వచ్చిందన్నారు. అయితే, టాలీవుడ్‌లో వచ్చే రివ్యూలను తాము తప్పు పట్టడం లేదన్నారు. ఒక సినిమా రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్ వారికి ఉండటంలో తప్పులేదన్నారు. కానీ, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందన్నారు.
రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాకు మంచి టాక్ వచ్చిందన్నారు. ఒక సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం అంటూ ప్రేక్షకుల ద్వారా మంచి టాక్ దక్కిందని తెలిపారు. ‘అఖండ 2’ మూవీకి ప్రేక్షకాదరణ దక్కినప్పటికీ.. ఇండస్ట్రీలో కాస్త నెగెటివిటీతో పాటు మిక్స్‌డ్ రిపోర్ట్ ఉందని రామ్ ఆచంట తెలిపారు.


