breaking news
Ram Achanta
-
అఖండ-2పై నెగెటివిటీ నిజమే: రామ్ ఆచంట
వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్‌లోకి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిని ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, కబీర్ దుహాన్ సింగ్, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్‌కుమార్ తదితరులు నటించారు. ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, తాజాగా ఈ మూవీ రివ్యూలు, ఫలితంపై వారు రియాక్ట్ అయ్యారు.అఖండ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట పేర్కొన్నారు. బుక్‌మైషోలో కూడా గంటకు 25వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయన్నారు. హిందీ బెల్ట్‌లో సుమారు 800 థియేటర్స్‌లలో విడుదల చేశామన్నారు. అక్కడ కూడా మంచి టాక్ వచ్చిందన్నారు. అయితే, టాలీవుడ్లో వచ్చే రివ్యూలను తాము తప్పు పట్టడం లేదన్నారు. ఒక సినిమా రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్ వారికి ఉండటంలో తప్పులేదన్నారు. కానీ, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందన్నారు. రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాకు మంచి టాక్ వచ్చిందన్నారు. ఒక సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం అంటూ ప్రేక్షకుల ద్వారా మంచి టాక్ దక్కిందని తెలిపారు. ‘అఖండ 2’ మూవీకి ప్రేక్షకాదరణ దక్కినప్పటికీ.. ఇండస్ట్రీలో కాస్త నెగెటివిటీతో పాటు మిక్స్డ్ రిపోర్ట్ ఉందని రామ్ ఆచంట తెలిపారు. -
'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ-2’ నేడు(డిసెంబర్ 5) రిలీజ్ కావాల్సింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు విడుదలకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకున్న సినిమా.. సడెన్‌గా ఆడిపోవడానికి గల కారణాలు ఏంటి?షాకిచ్చిన మద్రాసు హైకోర్టుఅఖండ 2 చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు రూ. 28 కోట్ల బాకీ ఉందని, ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలను ఇవ్వాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది.28 కోట్ల బాకీ సంగతేంటి?ఈరోస్ ఇంటర్నేషనల్(Eros International Media Ltd) - 14 రీల్స్ సంస్థ మధ్య గొడవ ఇప్పటిది కాదు. అఖండ 2(Akhanda 2: Thaandavam) సినిమాతో ఈరోస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ గతంలో 14 రీల్స్ సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంటలతో కలిసి అనిల్ సుంకర నిర్మించిన ‘1-నేక్కొడినే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయింది. ఆ చిత్రానికి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విఫలమవడంతో భారీ మొత్తంలో రికవరీ జరగలేదు. ఆ నష్టాలను పూడ్చేందుకు మహేశ్ బాబు మరో చిత్రం ‘ఆగడు’ కూడా అదే సంస్థకు ఇచ్చారు. అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 14 రీల్స్( 14 Reels Entertainment)-ఈరోస్ మధ్య రెవెన్యూ షేరింగ్, సెటిల్మెంట్ విషయంలో గొడవలు వచ్చాయి. 14 రీల్స్ సంస్థ తమకు రూ. 28 కోట్ల వరకు బాకీ ఉందంటూ ఈరోస్ కోర్టు మెట్లు ఎక్కింది.పేరు మార్చిన ఫలితం లేదు!14 రీల్స్-ఈరోస్ మంధ్య కోర్టు కేసు కొన్నేళ్లుగా నానుతూ ఉంది. కొన్నేళ్ల కిత్రం ఈరోస్ ట్రిబ్యునల్‌కి వెళ్లగా.. 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ 14 రీల్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2021లో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. ఇలా కోర్టులో పిటిషన్స్ వేస్తూ.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పైగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ పేరును కాస్త ‘14 రీల్స్ ప్లస్’గా పేరు మార్చి.. అఖండ 2 సినిమాను నిర్మించారు. అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలు ఒక్కటే అని.. ఈరోస్ ఆధారాలతో సహా కోర్టుకు అప్పజెప్పడంతో.. రిలీజ్ చేయొద్దంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు మరికొంత మంది ఫైనాన్షియర్లు కూడా డబ్బులు ఇవ్వలేదని గొడవకు దిగినట్లు సమాచారం. అఖండ 2 చిత్రానికి ఐవివై ఎంటర్టైన్మెంట్తో పాటు మరో మగ్గురు ఫైనాన్స్ చేశారు. వాళ్ల అమౌంట్ కూడా సెటిల్ చేయకుండానే రిలీజ్‌కి వచ్చేశారట. దీంతో వాళ్లు కూడా విడుదలను అడ్గుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమస్యలు అన్నీ క్లియర్ అయితేనే..అఖండ-2 రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తుంది. -
అఖండ 2 అంతకుమించి ఉంటుంది: రామ్ ఆచంట, గోపీ ఆచంట
‘‘అఖండ 2: తాండవం’ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి భారతదేశం అంతా విడుదల చేయాలని భావించాం. అయితే పాన్ ఇండియా కోసం ప్రత్యేకంగా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది పాన్ ఇండియా కంటెంట్ అయినప్పటికీ సినిమా మాత్రం గ్లోబల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. బాలయ్య, బోయపాటిగారి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అంతకుమించి ‘అఖండ 2’ ఉంటుంది’’ అని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట తెలిపారు. బాలకృష్ణ, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారితో మేము చేసిన ‘లెజెండ్’ పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వేరే కథ అనుకున్నప్పటికీ ‘అఖండ 2’ని ముందుకు తీసుకెళ్లాం. బాలయ్యగారితో పనిచేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. బోయపాటిగారు అహర్నిశలు కష్టపడి కుంభమేళా సన్నివేశాలని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా క్లైమాక్స్‌ని కాశ్మీర్లో చేయాల్సింది.ఆ సమయంలో పెహెల్గాం దాడి జరగడంతో షూటింగ్ అనుమతి రాలేదు. ఈ కారణంగా జార్జియాలో మైనస్ డిగ్రీ చలిలో చిత్రీకరించాం. మా సినిమా 2డీ, 3 డీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. మా సినిమాకి ప్రజెంటర్ తేజస్విని ప్రమోషన్‌కి సంబంధించి మంచి సజెషన్స్ ఇచ్చారు. సంయుక్తది హీరోయిన్ క్యారెక్టర్లా కాకుండా ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్రలానే ఉంటుంది. ‘అఖండ’లో ఉన్న పూర్ణగారి పాత్ర ‘అఖండ 2’లోనూ కంటిన్యూ అవుతుంది.తమన్‌గారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. ‘అఖండ 3’ చేసే అవకాశం ఉంది. ఆది పినిశెట్టిగారు అద్భుతమైన పెర్ఫార్మర్. ఇందులో ఆయన పాత్ర చాలా చక్కగా వచ్చింది. తన పాత్రకి 200శాతం న్యాయం చేశారాయన. ‘టైసన్ నాయుడు’ సినిమాని ఒకటి రెండు నెలల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులతో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అలాగే ఒక పెద్ద సినిమా చర్చల్లో ఉంది’’ అని చెప్పారు. -
నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. నేడు 65వ పుట్టినరోజును ఆయన జరపుకోనున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు (జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా BB4 పేరుతో ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2014లో లెజెండ్ చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించింది. సింహా,లెజండ్, అఖండ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యతో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశాడు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కూతురు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నట్లు ఆమె పేరు ఉంది. తొలిసారిగా ఆమె చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. The Lethal Combo that sets the screens on fire is Back 🔥🔥The two Forces - 'GOD OF MASSES' #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 🌋🌋Happy Birthday Balayya Babu ❤️🔥Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️Presented by… pic.twitter.com/Oj9b1j9bvS— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024 -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టి, డైరెక్టర్ పరశురామ్‌తో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. శ్రీనివాస్ కెరీర్లో పదో చిత్రంగా రూపొందుతోంది. ఈ నెల రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: జిమ్షి ఖలీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
బాలయ్య డైలాగ్‌తో అద్భుతమైన వీడియో
సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి, నట విశ్వరూపం నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా నిర్మాత, రామ్ ఆచంట సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘మరణం లేని జననం’ అంటూ ట్వీట్ చేశారు. ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఎన్టీఆర్ కుమారుడు, టాలీవుడ్ హీరో బాలకృష్ణ డైలాగుతో మొదలయ్యే ఈ వీడియోను అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘ సింహం నిద్రలేచి. గడపదాటి జనంలోకి వచ్చి గర్జిస్తే..ఆ గర్జనకు ఢిల్లీ మ్యాప్ షేపే మారిపోయింది’’ అంటూ సాగే వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు. తెలుగు సినీరంగంలో అద్భుతమైన నటుడిగా తనదైన ముద్రతో విశేష ప్రేక్షకాదరణ పొందారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా కొనియాడబడ్డారు ఎన్టీ రామారావు. అంతేకాదు పార్టీ పెట్టిన అనతి లంలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఘనతను సాధిచారు. రాజకీయ నాయకుడిగా తనదైన శైలిలో ఆదరణ పొందారు. కాగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట పలు బ్లాక్ బస్టర్ మూవీలను అందించిన సంగతి తెలిసిందే. మరణం లేని జననం 🙏🙏!!#NTR pic.twitter.com/hcIqyDT50Z — ram achanta (@RaamAchanta) January 18, 2021 -
వేదాంతం ఆరంభం
సునీల్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘వేదాంతం రాఘవయ్య’. సి. చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే బేనర్లో ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ ‘వేదాంతం రాఘవయ్య’కు కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. తొలి సీన్‌కి గోపీ ఆచంట కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కరుణాకరన్ క్లాప్ కొట్టి , గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట స్క్రిప్ట్‌ను దర్శకుడు సి. చంద్రమోహన్‌కు అందజేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: దాము నర్రావుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లైన్ ప్రొడ్యూసర్: కె.ఆర్.కె. రాజు. -
తిరుపతిలో శ్రీకారం
‘శ్రీకారం’ సినిమా కోసం నాగలి పట్టారు శర్వానంద్. రైతుగా మారి తిరుపతిలో వ్యవసాయం మొదలెట్టారు. ఏం పండిస్తున్నారంటే.. మంచి సినిమాను పండిస్తున్నాం అంటున్నారు చిత్రబృందం. శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభం అయింది. సుమారు 15రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని తెలిసింది. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: మిక్కీ జే మేయర్. -
సంక్రాంతికి శ్రీకారం
వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే కార్యక్రమాలకు హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ చుట్టారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాతో కిశోర్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్ ఇవ్వగా, ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు మొదటివారంలో ప్రారంభం కానుంది. మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు యువరాజ్ కెమెరామెన్. ‘శ్రీకారం’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... శర్వానంద్ కెరీర్లో హిట్ చిత్రాలుగా నిలిచిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’(2016), ‘శతమానం భవతి’ (2017) చిత్రాలు సంక్రాంతికి రిలీజైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘రణరంగం’, ‘96’ తెలుగు రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్. -
మంచి రోజు.. మంచి వార్త
‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ విజయాలతో జోష్‌గా ఉన్న వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఖరారైంది. ‘అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా 14 రీల్స్ ప్లస్ అనే బేనర్‌ను స్థాపించారు. ఈ బేనర్‌పైనే వరుణ్ తేజ్ సినిమా రూపొందనుంది. ‘‘మంచి రోజు మంచి వార్త’’ అన్నారు వరుణ్ తేజ్.‘‘14 రీల్స్ ప్లస్ బ్యానర్ తొలి సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందనుందని శుభప్రదమైన ఉగాది రోజున ప్రకటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత రామ్ ఆచంట. -
ఇరవైఅయిదు కథలు విన్నా...ఇదొక్కటే నచ్చింది : అర్జున్
‘‘నటుడిగా నా కెరీర్ మొదలై 30ఏళ్లు పైనే అయింది. ప్రతి సినిమాని ఓ పాఠంలానే భావిస్తాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు చేశాను. ఇప్పుడు ఒప్పుకున్న ఈ సినిమాలో కూడా నాది మంచి పాత్ర. ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 25 కథలు విన్నాను. ఈ కథ మాత్రమే నన్ను ఎగై్జట్ చేసింది. తెలివి, లౌక్యం.. ఇలా అన్నీ ఉన్న పాత్ర కావడంతో నటుడిగా నాకు మంచి స్కోప్ ఉంది’’ అని యాక్షన్ కింగ్ అర్జున్ అన్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన తెలుగులో ఓ సినిమాలో స్పెషల్ రోల్ చేయడానికి అంగీకరించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలు. సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అనీల్ సుంకర మాట్లాడుతూ – ‘‘స్పెషల్ రోల్‌కి అర్జున్‌గారైతే బాగుంటుందనిపించింది. ఆయన అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్త కాదు. కాకపోతే ఆయన కెరీర్లో మరో మంచి క్యారెక్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘అర్జున్‌గారు ఈ సినిమా అంగీకరించినప్పుడు.. సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ఎంత ఆనందపడ్డారో నేనూ అంతే ఆనందపడ్డా’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడే షూటింగ్ జరిపి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అమెరికాలో 60 రోజులపాటు చిత్రీకరణ జరుపుతాం’’ అని గోపీచంద్ ఆచంట తెలిపారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: హరీశ్ కట్టా. -
లెజండ్ మూవీ సక్సస్ మీట్
-
భాగ్యనగరంలో బిజీ బిజీగా...
క్లాసు, మాసు తేడా లేకుండా, చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ మెచ్చిన సినిమా ‘దూకుడు'. ఆ సినిమాతో మహేశ్-శ్రీను వైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ‘ఆగడు' పై అంచనాలకు కారణం అదే. పైగా మహేశ్‌తో తమన్నా జతకట్టడం ఇందులో మరో విశేషం. ప్రస్తుతం ‘ఆగడు' షూటింగ్ ఎక్కడా ఆగకుండా... శరవేగంతో జరుగుతోంది. ఈ సినిమాలో మహేశ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. పోకిరి, దూకుడు... మహేశ్ పోలీస్‌గా నటించిన సినిమాలు. ఆయన్ను సూపర్‌స్టార్‌ని చేసిన సినిమాలు కూడా అవే. దాన్ని ‘ఆగడు' కూడా కొనసాగిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ మార్చి 28 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్, తమన్నా, రాజేంద్రప్రసాద్, సోనూసూద్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు శ్రీనువైట్ల. ఈ నెల 10 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని యూనిట్ వర్గాల సమాచారం. తర్వాత బళ్లారిలో 5 రోజులు, గుజరాత్లో 10 రోజులు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపనున్నట్లు తెలిసింది. అలాగే జమ్మూ-కాశ్మీర్లో పాటలను చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు వినికిడి. కృష్ణ పుట్టినరోజైన మే 31న ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను జూన్‌లో విడుదల చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నెపోలియన్, సాయికుమార్, బ్రహ్మానందం, నదియా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, నిర్మాణం: 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్. -
బాలకృష్ణ 'లెజెండ్' మూవీ స్టిల్స్
-
ఊహలకు అతీతంగా ‘1’
‘1’... అటు సినిమా పరంగా, ఇటు సినీ కెరీర్ పరంగా మహేష్‌బాబు లక్ష్యం ఇదే. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రపథానికి అతి చేరువలో ఉన్న మహేష్... ప్రస్తుతం చేస్తున్న ‘1’ చిత్రంతో నంబర్‌వన్ అనిపించుకోవాలనే కసితో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా అన్ని రకాలుగా శ్రమ పడుతున్నారాయన. అందులో భాగంగానే ఈ సినిమా కోసం ప్రిన్స్ దృఢకాయునిగా మారారు. గ్లామర్ చెదరకుండా, జాగ్రత్తగా శారీరకభాషను మార్చుకున్నారు. ‘1’ ప్రోమోస్‌లో హాలీవుడ్ హీరోలను తలపించే మహేష్ లుక్‌ని చూస్తే ఆయన పడ్డ కష్టం అర్థమవుతోంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లోని క్రాబీలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఇందులో మహేష్ పాత్ర ఊహలకు అతీతంగా, భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. 16 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ బాలనటునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్.


