నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి Balakrishna's daughter, Tejaswini, will be presenting the film tentatively titled BB4, featuring Balayya and Boyapati. Sakshi
Sakshi News home page

బాలకృష్ణతో సినిమా నిర్మిస్తున్న కూతురు.. ప్రకటించిన బోయపాటి

Published Mon, Jun 10 2024 10:09 AM | Last Updated on Mon, Jun 10 2024 11:16 AM

BalaKrishna Daughter Produces A Movie With Boyapati

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. నేడు 65వ పుట్టినరోజును ఆయన జరపుకోనున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్‌ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో 3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు (జూన్‌ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా  BB4 పేరుతో ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 14 రీల్స్ ప్లస్‌ నిర్మాణ సంస్థ రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2014లో లెజెండ్ చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించింది. సింహా,లెజండ్‌, అఖండ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యతో ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ చేశాడు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కూతురు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నట్లు ఆమె పేరు ఉంది. తొలిసారిగా ఆమె చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement