సౌత్‌ హీరోలను కలవాలంటే కండీషన్స్‌? సెంథిల్‌ ఆన్సరిదే! | Cinematographer Senthil Kumar Reacts On Allu Arjun 42 Rules Controversy, Hails Respectful Work Culture In South Cinema | Sakshi
Sakshi News home page

కండీషన్స్‌ పెడుతున్న స్టార్స్‌? హీరోలు అలా ఉంటారన్న సినిమాటోగ్రాఫర్‌

Feb 16 2026 5:22 PM | Updated on Feb 16 2026 6:00 PM

South stars Applie Rules Cinematographer Senthil Kumar Answers

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాలని, ఆ రూల్స్‌ ఇవేనంటూ ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. అయితే అదంతా ఫేక్‌ అని, బన్నీని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నకిలీ జాబితా స్పష్టం చేశారని తర్వాత తేలిపోయింది. కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం సౌత్‌ స్టార్స్‌ ఇలాంటి నిబంధనలు పెట్టారా? అని చర్చ జరిగింది. 

అలాంటిదేం లేదు
తాజాగా ఈ వివాదంపై సౌత్‌ స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ కేకే. సెంథిల్‌ కుమార్‌ స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. సౌత్‌ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన రూల్స్‌ అంటూ ఏమీ లేవు. నేనెప్పుడూ అటువంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు. దక్షిణాదిన ఎంతోమంది స్టార్‌ హీరోలతో కలిసి పని చేశాను. కానీ, ఎప్పుడూ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఎటువంటి ఆంక్షలు విధించలేదు. హీరోలు చాలా గౌరవప్రదంగా ఉంటారు. నిజం చెప్పాలంటే వారిని కలిస్తే స్నేహితులను కలిసినట్లే ఉంటుంది.

చాలా సంతోషం
నా విషయానికి వస్తే.. టెక్నీషియన్‌గా నేను పని చేసిన సినిమాలకు ఎంతో గుర్తింపు వచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. నేను బయటకు వెళ్లినప్పుడు కూడా జనం గుర్తుపట్టి మాట్లాడుతుంటారు. మా టాలెంట్‌ గురించి మాట్లాడుతూ మమ్మల్ని జనానికి పరిచయం చేస్తున్న మీడియా, సోషల్‌ మీడియాకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే! పైగా ఈ జనరేషన్‌లో పని చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. 

దేవుడికి థాంక్స్‌
ఎందుకంటే అనేకమంది ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణులు సినిమాకోసం ఎంతో కష్టపడ్డారు. కానీ, వారికి అంత గుర్తింపు లభించలేదు. ఈలెక్కన నాకు వచ్చిన గుర్తింపు​నకుగానూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సెంథిల్‌ కుమార్‌.. సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పలు బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ప్రస్తుతం స్వయంభు సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.

చదవండి: ఏం కావాలి? ఏది వద్దో నాకు బాగా తెలుసు: శోభిత ధూళిపాళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement