'డబ్బులు రాలేదని శనగలు తిందామన్నారు'.. వీకే నరేశ్‌ కామెంట్స్ వైరల్ | Vk Naresh Comments about SUper star Krishna at pree meet | Sakshi
Sakshi News home page

VK Naresh: 'నిర్మాత వద్ద డబ్బులు లేవని కృష్ణగారే ఇచ్చారు'.. వీకే నరేశ్

Feb 16 2026 4:33 PM | Updated on Feb 16 2026 5:59 PM

Vk Naresh Comments about SUper star Krishna at pree meet

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారితో హిట్‌ కొట్టిన నరేశ్.. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్ హే బల్వంత్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ‍సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌కు హాజరైన వీకే నరేశ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్‌ కృష్ణ గురించి ఆయన మాట్లాడారు. ఓ సినిమా షూటింగ్‌కు ఊటి వెళ్లిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అమ్మగారు, కృష్ణగారు ఇద్దరు కూడా పదిమందిని కలుపుకుపోయే తత్వమని చెప్పారు. సాంగ్స్ షూటింగ్‌ కోసం ఊటికి వెళ్లగా.. కృష్ణ గారు చేసిన పని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయిందని అన్నారు. అప్పట్లో మనీ ట్రాన్స్‌ఫర్‌ లాంటివేవి ఉండేవి కావని నరేశ్ తెలిపారు.

ఆ షూటింగ్‌కు వెళ్లిన సమయంలో నిర్మాతకు డబ్బులు రావడం ఆలస్యమైందని నరేశ్ తెలిపారు. అప్పట్లో కేవలం క్యాష్‌ మాత్రమే చెలామణిలో ఉండేదని..టైమ్‌కు డబ్బులు అందలేదని అన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు స్నాక్స్ తినాలంటే నిర్మాత దగ్గర డబ్బులు లేవు.. అప్పుడు కృష్ణగారు ఓ మాట అన్నారని తెలిపారు. అందరం ఈ రోజు శనగలు తిందాం.. డబ్బులు నేను ఇస్తాను అని షూటింగ్ ఆగనివ్వకుండా చేశారని నరేశ్ గుర్తు చేసుకున్నారు. నిర్మాత బాగుంటేనే మనందరం బాగుంటామని చెప్పారని అన్నారు. విజయ్- కృష్ణ అంటే ఒకటేనని.. రెండు కాదని నరేశ్‌ ప్రశంసించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement