కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటారు. ఏదో ఒకరకంగా తమ గురించే మాట్లాడుకోవాలని, అందరి నోళ్లలో నానుతూ ఉండాలని తహతహలాడతారు.అలా పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్‌లను పెట్టుకుంటారు. కానీ తనకు అలాంటివేవీ ఇష్టం లేదని, పీఆర్ టీమ్ అసలే లేదని చెప్తోంది హీరోయిన్ శోభిత ధూళిపాళ.
24 గంటలు కనిపించాలా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. గతంలో నేను పీఆర్ ఏజెన్సీలతో పని చేశాను. కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ అవవు అని అర్థమైంది. 24 గంటలు అందరికీ కనిపించాలి, అందరూ నాకోసం మాట్లాడుకోవాలి అని నేను అనుకోవడం లేదు. అది నాకు ఏమాత్రం ఉపయోగపడదు, దానిపై నాకు ఆసక్తి అసలే లేదు.
అదైతే తెలుసు
నాకు పీఆర్ లేదు, కానీ కొందరికి అది బానే పని చేస్తుంది. నేను సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాలేదు, నాది ముంబై కూడా కాదు. వైజాగ్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు సాగాను. నాకు ఏం కావాలి? ఏం వద్దనే విషయాలపై క్లారిటీ ఉంది. రూల్స్‌తో సంబంధం లేకుండా నా దారిలో వెళ్లడమే నాకిష్టం. జనాలకు ఏదిష్టం, వాళ్లేం కోరుకుంటున్నారు? అనేది నాకు తెలియదు. కానీ నా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.
సినిమా
శోభిత ధూళిపాళ తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్‌లో ఎక్కువ పాపులర్ అయింది. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఇటీవలే చీకటిలో సినిమాతో మరోసారి అలరించింది.


