'నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'.. హీరోయిన్ త్రిషకు క్షమాపణలు | Tamil Nadu BJP Leader Nagendran Apology To Actress Trisha Over His Controversial Comments On Her Relation With Vijay | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: 'నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'.. హీరోయిన్ త్రిషకు సారీ

Feb 16 2026 4:09 PM | Updated on Feb 16 2026 4:29 PM

Tamilnadu BJP Leader Nagendran apology To Actress Trisha

హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల విజయ్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని నాగేంద్రన్ కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

స్పందించిన త్రిష..

'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్‌(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.

అసలేం జరిగిందంటే..

అయితే ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. హీరో విజయ్‌ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా కామెంట్స్ చేశారు. దీంతో పెద్ద వివాదానికి దారితీసింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ వ్యాఖ్యలను ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement