ట్విస్ట్‌.. ఒకే కారులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ | Mahipal Reddy, Raghunandan Rao Cast Ex-Officio Votes in Isnapur Municipal Polls | Sakshi
Sakshi News home page

ట్విస్ట్‌.. ఒకే కారులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ

Feb 16 2026 12:24 PM | Updated on Feb 16 2026 12:36 PM

Mahipal Reddy, Raghunandan Rao Cast Ex-Officio Votes in Isnapur Municipal Polls

సాక్షి,హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఒకే కారులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చారు.  

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్, అలాగే బీఆర్‌ఎస్‌లో చేరిన ఇండిపెండెంట్ సభ్యుడు పార్టీ బలాన్ని పెంచారు. దీంతో బీఆర్‌ఎస్ బలం 14కి చేరింది. కాంగ్రెస్ బలం మాత్రం 12 వద్ద నిలిచింది. ఈ సమీకరణలతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయి. ఫలితంగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశాలు బలపడుతున్నాయి.

స్థానికంగా ఈ పరిణామం పెద్ద రాజకీయ చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో ఓట్లను పరిగణలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, బీఆర్‌ఎస్ మాత్రం రాజ్యాంగబద్ధంగా తమకే అధికారం ఉందని వాదిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement