కొండా సురేఖ మనవడి పాటకు ప్రభాస్ వాయిస్ ఓవర్ | Prabhas Voice Over To Konda Surekha Grandson Murali Krishna Patel Lingashtakam Song, Video Went Viral | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ మనవడి పాటకు ప్రభాస్ వాయిస్ ఓవర్

Feb 16 2026 10:42 AM | Updated on Feb 16 2026 11:29 AM

Prabhas Voice Over Konda Murali Krishna Patel Song

బంజారాహిల్స్‌ : రెండున్నరేళ్ల వయసులో లింగాష్టకం పఠించి అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఆ చిన్నారి. ఈ వీడియోకు హీరో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ప్రభాస్‌ స్వరం అధనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇంత చిన్న వయసులో భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మికతలో ప్రతిభను ప్రదర్శించిన బుడతడిని ప్రభాస్‌ ప్రశంసించారు. ఆ బుడతడే దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మనుమడు కొండా మురళీకృష్ణ పటేల్‌. చిన్నారి స్వచ్ఛమైన భక్తి, కుటుంబ విలువలు సమాజానికి మార్గదర్శకమని, ఇతర పిల్లలకు కూడా స్ఫూర్తి దాయకమని కొనియాడారు. కాగా చిన్నారి కొండా మురళీకృష్ణ పటేల్‌ తల్లిదండ్రులు సుషి్మతాపటేల్, అభిలాష ప్రభాస్‌ ప్రశంసల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement