ఓట్లకు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని డిమాండ్
వాదనకు దిగిన ఓటర్లు..
సాక్షిబ హైదరబాద్: తనకు ఓటు వేయాలంటూ ఓటర్లకు ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని ఓ అభ్యర్థి భర్త అడుగుతుండటంతో ఓటర్లు తిరగబడ్డారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారంలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ వీడీయో సోషల్ మీడీయాలో చక్కర్లు కోడుతుంది. బండమాదారంలోని 9వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు ఆకుల సురేష్ కు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఆయన తరన భార్య విజయలక్ష్మీతో నామినేషన్ వేయించి బరిలో దింపాడు.
ఫలితాల అనంతరం విజయలక్ష్మి మూడవ స్ధానంలో నిలిచారు. దీంతో విజయలక్ష్మి భర్త సురేష్ .. ఓటర్ల వద్దకు వెళ్ళి ఓటు కోసం తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పినా వినకుండా వారితో వాదనకు దిగారు. ఓటు వేశామని ఆలయంలోకి వెళ్లి ప్రమాణం చేయాలని కోరడంతో తిరగబడ్డారు. ఎన్నికలన్నప్పుడు అందరూ వస్తారు.. అందరూ డబ్బులు ఇస్తారు.. నచి్చన వారికి ఓటు వేస్తాం అందరికీ ఎలా వేస్తాం అని ప్రశ్నించారు.


