PJTSAU : పరీక్షా పేపర్‌ లీకేజీ కలకలం | Exam Paper Leak At Rajendranagar PJTSAU Agriculture University, Junior Assistant Arrested For Selling BSc Question Paper | Sakshi
Sakshi News home page

PJTSAU : పరీక్షా పేపర్‌ లీకేజీ కలకలం

Feb 16 2026 11:08 AM | Updated on Feb 16 2026 11:53 AM

Exam Paper Leakage In Rajendra Nagar PJTSAU Agriculture University

సాక్షి,హైదరాబాద్‌: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పరీక్షా పేపర్ల లీకేజీ కలకలం సృష్టిస్తున్నాయి.  బీఎస్సీ అగ్రికల్చర్‌ మూడవ సంవత్సరరం పరీక్ష పేపర్లు వాట్సప్‌లో చక్కెర్లు కొట్టాయి. అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించారు. 

ఈ సోదాల్లో జూనియర్ అసిస్టెంట్ కార్తిక్ ఈ పేపర్‌ను లీక్ చేసి, దానిని 1.4 లక్షల రూపాయలకు విక్రయించినట్లు తేలింది. ప్రాథమిక విచారణలో పేపర్ లీక్ వరంగల్‌ నుంచి జరిగినట్లు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

సీఐడీ అధికారులు ఈ వ్యవహారాన్ని పూర్తిగా విచారించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, విశ్వవిద్యాలయం పరీక్షల నిర్వహణలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement