విశాఖపట్నం: సంద్రంలో సందడి మొదలైంది.. నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తూర్పు తీరం.. కళకళలాడుతోంది.
ఒకేసారి అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచిన విశాఖ నగరంలో.. మినీ ఐఎఫ్‌ఆర్‌గా పిలుచుకునే మిలాన్–2026 లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం నౌకాదళ స్థావరంలోని విపత్తు నిర్వహణ రక్షణ వేదిక(హెచ్‌ఏడీఆర్ హార్డ్) వద్ద మిలాన్ విలేజ్‌ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించారు.


