breaking news
BRS
-
‘రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి’
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల జిల్లా): బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎటువంటి నోరు విప్పకుండానే 33శాతం సీట్లను గెలుచుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మద్దతులో గెలిచిన సర్పంచ్‌లను సిరిసిల్లలో కేటీఆర్ సన్మానించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ‘ ఎన్నికలు లేనట్లయితే జనవరి మాసంలో కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ సభ్యత్వంలో తమ పాత్ర పోషించాలి. రాష్ట్రంలో 66 శాతం గెలిచాం అని ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నాడు. 66 శాతం ప్రజలు నీవైపు ఉంటే పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతోని దమ్ముంటే రాజీనామా చేయించు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరామని గతంలో బాహటంగానే చెప్పారు, ఇప్పుడేమో కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరియు స్పీకర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుంది. ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఒక బతుకేనా?, గడ్డి పోచలాంటి పదవి కోసం సూరు పట్టుకొని గబ్బిలం వేలాడినట్లు వేలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలలో ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత బెదిరించినా రాజ్యాంగ బద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామాలకు వచ్చే నిధులు ఎవరు ఆపలేరు. రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి మల్లీ కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుపుకుందాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు..
-
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగులేని విజయం
సాక్షి, యాదాద్రి: వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, అధినేత కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని, భవిష్యత్‌లో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పునాది వేసిందన్నారు. గురువారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్.. వారిని సన్మానించిన అనంతరం మాట్లాడారు. పెద్దలు చెప్పినట్టు ఎక్కడైతే పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్న నానుడిని నిజం చేస్తూ ఈరోజు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడినా.. నేడు భువనగిరి జిల్లా వ్యాప్తంగా 161 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్నామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలు.. పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ వికృత రాజకీయం కాంగ్రెస్ పార్టీ వికృత రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్లగొండలో అభ్యర్థిపై దాడిచేసి అమానవీయంగా మూత్రం తాగించడం వంటి ఘటనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగంతో రీకౌంటింగ్ పేరిట మన గెలుపును దొంగిలించిన 150 గ్రామాల్లో కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పారు. మూడు ఫీట్లు ఉన్నా.. 30 ఫీట్ల డైలాగులు సీఎం రేవంత్‌రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా.. ముప్పై ఫీట్ల డైలాగులు కొడతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి మోసపోయామని క్షేత్రస్థాయిలో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని లంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలది సిగ్గులేని రాజకీయం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని సిగ్గులేని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పోచారం, కడియం వంటివారు 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్‌రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని చెప్పారు. స్పీకర్ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్టు నటిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
‘తెలంగాణ రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి’
భువనగిరి(యాదాద్రి భువనగిరి జిల్లా): రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్శజమెత్తారు. ఈరోజు(గురువారం, డిసెంబర్ 18వ తేదీ) యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎన్నికలైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లి వేధించారు. చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లను పడేశారు. రాష్ట్రంలో 100-150 గ్రామాల్లో బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. పార్టీ ఫిరాయింపులు స్పీకర్‌కు కనుబడటం లేదా..పార్టీ మారిన వాళ్లే సిగ్గులేకుండా చెప్పినా స్పీకర్ కు వినపడటం లేదట. పది మంది ఎమ్మెల్యేలు ఆడనా మగనా అని కూడా చెప్పుకోవడం లేదు. ఏ పార్టీనో చెప్పుకోవడం లేదు. 70 ఏళ్లు నిండిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ మారాల్సిన అవసరం ఏం వచ్చింది. అసెంబ్లీలో మొఖం చాటేస్తున్నారు. రేవంత్ రెడ్డి మూడు ఫీట్లున్నా ముప్పై ఫీట్ల డైలాగులు కొడతాడు. అడ్డుమారి గుడ్డిదెబ్బలో రేవంత్ సీఎం అయిండు. కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు కూడా కోపం లేదు. జనవరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడదాం. కేసీఆర్ హయాంలో కేంద్రం ఉత్తమ పంచాయతీల అవార్డులు ఇస్తే తెలంగాణకే 30 శాతం వచ్చాయి. రేవంత్ రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడు. ప్రభుత్వాన్ని నడిపేందుకు రేవంత్ కు చేతకావడం లేదు. కరోన సమయంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదు. కేసీఆర్ సీఎం అయ్యే నాటికి 72 వేల కోట్ల అప్పు ఉంది. పదేళ్ల తర్వాత రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు అయిందని కాగ్ చెప్తోంది.. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఆరేడు లక్షల కోట్ల అప్పు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏనాడు ఓట్ల కోసం కాంగ్రెస్ నేతల్లా కేసీఆర్ అబద్ధాలు చెప్పలేదు. బీఆర్ఎస్ గెలిచిన చోట్ల సంక్షేమ పథకాలు అమలు చేయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.. అదేం రేవంత్ అత్త సొమ్ము కాదు.. రేవంత్ డబ్బులు ఇవ్వడం లేదని ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తరం రాస్తున్నారు. ప్రతీ జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. సర్పంచులపై కేసులు వేసినా భయపడాల్సిన పరిస్థితి లేదు’ అని విమర్శించారు. -
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. డీఎస్పీకి గాయాలు.. జగిత్యాలలో పోలీసు కాల్పులు
సాక్షి,జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. పోలీసు సిబ్బందికీ గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడకు చేరుకుని.. ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగాయి. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొనడంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన పోలీస్ పహారాలో బ్యాలెట్ బాక్సులను తరలించారు. -
బీఆర్ఎస్లో ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి ఊపిరి పోశాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో చేదు ఫలితాలను చవి చూసిన పార్టీలో.. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయని అంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫలితాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. గ్రామాల్లో తమ పట్టు చెక్కు చెదరలేదనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కనీసం 40 శాతం సర్పంచ్ పదవులు పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కేడర్ చెక్కు చెదరలేదు! పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్‌ను స్థానికంగా సమన్వయం చేసుకుని పట్టుదలతో పనిచేయడం వల్లే అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చామనే అభిప్రాయం బీఆర్ఎస్ నాయకత్వంలో వ్యక్తం అవుతోంది. పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, పట్టుదల నాయకత్వానికి స్ఫూర్తినిచ్చేలా ఉందనే అభిప్రాయం పైస్థాయి నాయకుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపం, గ్రూపు తగాదాలు, పాలన వైఫల్యం, పల్లెల్లో అభివృద్ధి కుంటుపడటం కూడా తమకు కలిసి వచ్చాయని గులాబీ దళం విశ్లేషిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్ లాంటి చోట్ల మినహా ఎక్కడా పెద్దగా బీజేపీ ప్రభావం కనిపించలేదని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు..ఆ పార్టీ బలపడిందనడానికి నిదర్శనం కాదని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నూతనోత్సాహంతో ముందుకు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల దిశగా సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేయడం, సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యక్రమాల సంబంధిత షెడ్యూల్‌ను పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించే అవకాశముంది. అలాగే భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీకి అధికార కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మరింత దూకుడుగా వెళ్లేలా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు కార్యాచరణపై గట్టిగా దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను విశ్లేషించి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలహీనతలపైనా పోస్ట్‌మార్టమ్ చేయాలని భావిస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత.. ఇతర పార్టీల్లోకి నేతల వలసలు, ఫిరాయింపులతో బలహీన పడిన నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
ఏక్షణమైనా... రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
-
అన్ని ఆధారాలు చూపించినా స్పీకర్ న్యాయం చేయలేదు
-
Vivekanand: వదిలే ప్రసక్తి లేదు తీర్పుపై న్యాయపోరాటం చేస్తాం
-
BRS ఎమ్మెల్యేల పిటిషన్ లు కొట్టివేసిన స్పీకర్
-
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే, స్పీకర్ నిర్ణయాన్ని పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. అరికపూడి గాంధీ,గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పును వెలువరించారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టారు. ఆ ఐదుగురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారికి అనర్హత వేటు నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వరుస పరిణాలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీర్పు ఇచ్చిన ఐదుమంది ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. స్పీకర్ నిర్ణయంపై కేసీఆర్, కేటీఆర్‌తో పిటిషనర్లు వివరించినట్లు తెలుస్తోంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ స్పందించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
Khammam: కౌంటింగ్ షురూ.. నువ్వా నేనా
-
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీపై పోరుబాట పట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం, నదీ జలాల కేటాయింపు వంటి అంశాలపైనా ఉద్యమించాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ స్వరూపం ఏ తరహాలో ఉండాలనే అంశంపై చర్చించేందుకు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ సమావేశంలో పాల్గొంటుంది. నదీ జలాల పరిరక్షణలో విఫలం కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్ర ప్రదేశ్ కొల్లగొడుతున్నా అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫ లమైందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభు త్వం 90 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీలు చాలంటూ కేంద్రం ముందు దేబిరిస్తోంది. 45 టీఎంసీలకు అంగీకరిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రం ముందు మోకరిల్లారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ ఎలా పూర్తవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేలా ఉంది’అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ‘కృష్ణా, గోదావరి జలాలతోపాటు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదు. రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ గండికొడుతోంది. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయం, కావేరీ అనుసంధానం పేరిట ఆంధ్ర జలదోపిడీకి సహకరిస్తున్న విధానంపై ప్రజా ఉద్యమం తప్పదు’అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.ప్రజా ఉద్యమంపై లోతైన చర్చ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై ఈ నెల 19న జరిగే విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న (శనివారం) బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. కృష్ణా,గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం,కార్యచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు,సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
సర్పంచ్ ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయం..!
రాజన్న సిరిసిల్ల జిల్లా: చింతల్‌ఠాణా ఓటర్లు ఎన్నికల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ప్రచార సమయంలోనే గుండెపోటుతో మరణించాడు. అయితే ఎన్నికల్లో మరణించిన వ్యక్తికే ఓట్లు వేసి గ్రామస్తులు గెలిపించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్‌ఠాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చెర్ల మురళికి కత్తెర గుర్తు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో అలసిపోయి ఇంట్లో నిద్రిస్తుండగా ఈనెల 3న గుండెపోటుతో మరణించాడు. కానీ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో ఆ ఊరి ఓటర్లు భారీ మెజార్టీతో చనిపోయిన వ్యక్తి మురళిని గెలిపించారు. దీంతో సర్పంచ్ ఎన్నికపై సందిగ్ధం నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు వచ్చిన ఓట్లు..చింతల్‌ఠాణా గ్రామపంచాయతీకి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ బలపరిచిన కొలపురి రాజమల్లుకు 358 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన చెర్ల మురళి(చనిపోయిన వ్యక్తి)కి 745 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బడుగు శ్రీనివాస్‌కు 40, ఇండిపెండెంట్ మంత్రి రాజలింగంకు 160, బీజేపీ బలపరిచిన సురువు వెంకటికి 367 ఓట్లు వచ్చాయి. నోటాకు 5, చెల్లని ఓట్లు 44 పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి సురువు వెంకటిపై 378 ఓట్ల మెజార్టీతో మరణించిన మురళి గెలిచాడు. ఉపసర్పంచ్‌గా గొట్ల కుమార్‌యాదవ్ ఎన్నికయ్యారు. అయోమయంలో అధికారులుపోటీ చేసిన వ్యక్తి మరణిస్తే.. శాసనసభ ఎన్నికలు అయితే వాయిదా పడుతుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఎన్నికల ప్రక్రియను ముందుకు సాగించారు. అప్పటికే ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు ఇవ్వడంతో ఎవరికి వారు ప్రచారంలో ఉన్నారు. దీంతో చనిపోయిన వ్యక్తి గుర్తును మార్పు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ముందుగానే ముద్రించిన బ్యాలెట్ పత్రాలు కావడంతో ఏమీ చేయలేక అధికారులు నోటాతో కలిపి ఆరు గుర్తులున్న బ్యాలెట్‌పత్రంతో ఎన్నికలు నిర్వహించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో సానుభూతి పవనాలు వీచి చనిపోయిన వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.దీనిపై క్లారిటీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాశారు. సర్పంచ్ స్థానానికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఉన్న అభ్యర్థుల్లో రెండో స్థానం పొందిన వ్యక్తికి సర్పంచ్‌గా అవకాశం ఇస్తారా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధికారులు చెబుతున్నారు. -
ఆల్ ఈజ్ వెల్.. పల్లె పోరు తొలి ఫలితాలపై ప్రధాన పార్టీల్లో సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ సమరం ముగిసింది. ఫలితాలు కూడా శుక్రవారం ఉదయం కల్లా పూర్తి స్థాయిలో వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోరుపై రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడంపై కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్లో పంచాయతీ ఫలితాలు జోష్‌ను నింపాయి. మరోవైపు బీజేపీ కూడా పల్లె పోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుండటం గమనార్హం.ఎవరి లెక్కలు వారివే..అధికార పార్టీ విషయానికొస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా..ప్రజాపాలనలోఅనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదన్న భావన అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సాధించిన స్థానాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం.. జిల్లాల వారీగా గులాబీ పార్టీ గట్టి పోటీనిచ్చిన ప్రాంతాల్లో ఓట్ల గణాంకాలను పరిశీలించే పనిలో పడింది. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఊపిరి పోశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారని, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగించే యోచనలో ఉన్నారు. బీజేపీ కూడా ఫలితాలపై అంతర్గత లెక్కలు వేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్న బలంతో పోలిస్తే పంచాయతీలు తక్కువగా వచ్చాయని, అయితే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా 500 కంటే ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో రికార్డు సృష్టిస్తామని వారంటున్నారు. రెండంకెల స్థానాలు దక్కించుకోవడం ద్వారా గ్రామాల్లో తమ ఉనికి చాటుకున్నామని లెఫ్ట్ పార్టీలంటుండడం గమనార్హం. -
కార్పొరేట్ కంపెనీల కోసమే విత్తన బిల్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన బిల్లు ముసాయిదాను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండి, రైతుల ప్రయోజనాలను కాలరాస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి రావడం, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు లేకపోవడం, రాష్ట్రాలకు విత్తన ధరలపై నియంత్రణ అధికారం లేకుండా పోవడం, సాంప్రదాయ రైతు విత్తన హక్కులకు రక్షణ లేకపోవడం వంటి తీవ్ర లోపాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు దేశీయ విత్తనభద్రత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, రాజకీయ పార్టీలతో చర్చించకుండా ఈ బిల్లును రూపొందించడం సరికాదని, వెంటనే ఆపివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ తరఫున సుదీర్ఘ ఫీడ్‌బ్యాక్‌తోపాటు సవరణలు సైతం కేంద్రానికి పంపినట్టు తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు గరిష్ట ఉత్పత్తి మేరకు నిర్దిష్ట సమయంలో నష్టపరిహారం అందేలా కఠిన నిబంధనలు పెట్టాలని, రాష్ట్రాల అధికారాలను కాపాడాలని సూచించారు. త్వరలో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కేంద్రానికి మరిన్ని సూచనలు పంపనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. -
ఆ పిల్‌కు నంబర్ కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాప్ర యోజన వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌ను ఈ పిటిషన్‌కు జత చేయాలని స్పష్టం చేసింది. ఈ రెండు పిల్లపై సీజే ధర్మాసనం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. పలువురికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తిన రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఫైలింగ్ నంబర్‌పైనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 2017లో అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇదే ‘కేబినెట్ హోదా’ అంశంపై పిటిషన్ వేశారని, అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టినా ప్రయోజనం లేదని చెప్పారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఓ నిర్ణయం తీసుకుంటారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తారని చెప్పారు. ఆర్టికల్ 164 (1ఏ) ప్రకారం మంత్రివర్గ హోదా కల్పించే విషయంలో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదన్నారు. ప్రస్తుతం 16 మంది కేబినెట్ మంత్రులకు అదనంగా ప్రభుత్వంలోని 14 మంది ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు ఆ హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నా రు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
కాంగ్రెస్‌దే పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశలో గురువారం 3,835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతు ఇచ్చిన అభ్యర్థులపై విజయం సాధించగా..మరి కొన్నిచోట్ల పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు. బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మేజర్ పంచాయతీల్లో పరిస్థితి కాస్త పోటీపోటీగా ఉన్నట్లు కనిపించింది.కాంగ్రెస్ విజయ దుందుభి మొత్తం 4,236 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 396 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీనితో 3,835 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి..ఏకగ్రీవంగా గెలుపొందిన వారితో కలిపి కాంగ్రెస్ మద్దతు పలికిన వారు 2,440 గ్రామాల్లో సర్పంచ్‌లుగా గెలుపొందారు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని చాలా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు పలికిన వారికే ఓటర్లు పట్టం కట్టినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే కొందరు కార్పొరేషన్ చైర్మన్ల (అధికార పార్టీ నేతలు) గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతు పలికిన వారు విజయం సాధించినట్లు సమాచారం. సత్తా చాటిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు కూడా గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. గురువారం రాత్రి వరకు 1,132 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపొందింది. స్వతంత్రులు 364 చోట్ల విజయం సాధించగా, బీజేపీ 206 స్థానాల్లో, వామపక్షాలు 25 స్థానాల్లో గెలుపొందాయి. మిగతా చోట్ల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.చనిపోయినా సర్పంచ్‌గా గెలుపు ఈ ఎన్నికల్లో 95 సంవత్సరాల వృద్ధుడు సర్పంచ్‌గా ఎన్నికవగా.. మరోచోట ఎన్నికల బరిలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఇంకొన్ని చోట్ల తల్లిపై కూతురు, అత్తపై కోడలు విజయం సాధించిన ఉదంతాలు వెలుగు చూశాయి. ఈ నెల 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 3,835 సర్పంచ్ స్థానాలతో పాటు 27,628 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరిగాయి. -
తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొలివిడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టిషాకిచ్చారు. సర్పంచ్ స్థానాల్లో ఇతరుల కంటే తక్కువ స్థానాల్ని బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ఎంపీ ఈటల రాజేందర్ బిగ్‌షాక్ తగిలింది. ఈటల బలపరిచిన బీజేపీ రెబల్ అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదే సమయంలో బండి సంజయ్ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపుపొందారు. ఈటల రాజేందర్ మద్దతు తెలిపిన ర్యాకం సంపత్ ఓటమి పాలయ్యారు.ప్రస్తుతం ఈ ఘటన పంచాయతీ ఎన్నికల్లో హాట్టాపిగ్గా మారగా.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన.మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల ముందే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు దోహదపడిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.కాగా, ఇవాళ జరిగిన పోలింగ్‌లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవంతో కలుపుకొని 1484 పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 723 మంది, బీజేపీ 132 మంది, ఇతరులు 339 మంది గెలుపొందారు. -
బీఆర్ఎస్ నేత దారుణహత్య
నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో ఈ ఘర్షణ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. బీఆర్ఎస్ మద్దతుదారుగా మాదాసు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా దేశపంగు మురళి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య కోడలు ఉప్పుల శైలజ 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇరు పార్టీల వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగించుకొని గ్రామంలోని పార్టీల జెండా దిమ్మెల సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ వారు ఓటర్లను కలిసివస్తున్న సమయంలో.. శైలజకు ప్రత్యర్థిగా ఉన్న ఆకుల రజిత వర్గానికి చెందిన ఉప్పుల సతీశ్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీశ్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యలు గొడవ పడడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్యపై దాడి చేయగా, అడ్డుకోవడానికి వెళ్లిన ఉప్పుల మల్లయ్యపై కూడా కర్రలతో దాడి చేశారు. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలై కిందపడిపోయాడు. ఇదే సమయంలో తలపై బండరాయితో మోపడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి ఉప్పుల మల్లయ్య మృతి చెందినట్టు చెప్పారు. ఈ దాడిలో మున్నా మల్లయ్యతోపాటు అతని సోదరుడు లింగయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మల్లయ్య మృతదేహానికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, రాజకీయ కక్షలతోపాటు దాయాదుల గొడవలు కూడా ఈ దాడికి కారణమైనట్టు తెలిసింది. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ఉప్పుల మల్లయ్య హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడి, మృతికి కారకులైన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. -
తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్: హరీష్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో విజయ దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావాలి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజల ఆశీర్వాదంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పదవులను గడ్డి పూసలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణం మీదికి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి ఆయన. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. ఆయన దీక్ష లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని హరీష్ రావు పేర్కొన్నారు. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2 తేదీలు తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనివని గుర్తుచేశారు.కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డి పేరు తప్పక రాయాల్సి వస్తుందని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని, రెండేళ్లుగా ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. కాళోజి, దాశరధి, గద్దర్ పేర్లతో ఇచ్చే అవార్డులను అవమానించడం, రేడియల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రయత్నం, ఒకప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ నేడు సోనియాగాంధీ దేవత అంటున్నాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు.ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే. సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్‌కు రానివ్వలేదు. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే దానికి మేము కొన్ని సంవత్సరాలు ఢిల్లీ తిరగాల్సి వచ్చింది. తెలంగాణ జైత్రయాత్రను కేసీఆర్ శవయాత్ర అని నినదించినప్పుడు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటూ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
9న ఘనంగా ‘విజయ్ దివస్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక ఘట్టమైన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది డిసెంబర్ 9వ తేదీనే అని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న ’దీక్షా దివస్’ను విజయవంతం చేసినట్లే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా.. ’విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 9న 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఒక రూపం వచ్చిందని కేటీఆర్ అన్నారు. అలాంటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే విజయ్ దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి. పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ దీక్ష ఫలవంతమైన నిమ్స్ ఆసుపత్రిలో, అలాగే గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. పార్టీ నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. -
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాగా ఆ లేఖలో శాసనసభ నిబంధనలకు తిలోదకాలు చేస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ హరీష్ మండిపడ్డారు.రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు.హరీష్ రావు డిమాండ్స్1.ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి.2.ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.3.అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి.4.అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి.5.డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి.6.ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి.7.సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలి.8.పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై తెలంగాణ నుంచే పోరాటం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తెస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, దాని అనుబంధ కార్మిక విభాగం బీఆర్టీయూ సిద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో కార్మిక సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున, రాజకీయాలకు అతీతంగా ఏ కార్మిక సంఘంతోనైనా తాము కలిసి పనిచేస్తామని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో సోనియా గాంధీ వ్యతిరేకించిన బిల్లును తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ప్రశి్నస్తూ, నూతన లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించిన కేటీఆర్, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించిన చట్టాలను, విధానాలను గుడ్డిగా ఇక్కడ అమలు చేయడం సరికాదని, మన దేశంలోని భిన్నమైన సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. చైనా ఆర్థిక వ్యవస్థతో పోల్చుతూ, నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేదని, కానీ నేడు అది 60 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, భారత్ మాత్రం ఇంకా 4 ట్రిలియన్ల వద్దే ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. చైనా తన ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విధానాలను మార్చుకుంటూ, నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ మద్దతునిస్తూ, లాభాల్లో ఉన్నప్పుడు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించిందని కేటీఆర్ చెప్పారు. కాగా, ఈ నూతన లేబర్ కోడ్లను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతుందని, ఇందుకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతో పాటు, అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లో తదుపరి సమావేశం నిర్వహిస్తామంటూ కార్యాచరణను కేటీఆర్ ప్రకటించారు.కార్పొరేట్ ఏకాధిపత్యం ప్రమాదకరం.. దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ ఏకాధిపత్యం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభాన్ని కేటీఆర్ ఉదహరించారు. ఇది ముమ్మాటికీ శ్రమ దోపిడీ వల్లే జరిగిందని, అయినా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమలు చేయకుండా ఆ సంస్థ ఒత్తిడికి తలొగ్గిందని విమర్శించారు. -
‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయనను ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడారు. అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమాయాలు వస్తాయని, వాటిని తట్టుకోవాలని తెలిపారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటి వరకూ ప్రజలు అధైర్యపడొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.ఇక 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ సీఎం పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన పెద్దగా పబ్లిక్‌గా కనిపించలేదు. 2023 డిసెంబర్ 4న గజ్వెల్లో తన ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆపై 2025 జూన్ 11న, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న జ్యుడీషియల్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఇలా చాలా అరుదుగానే కేసీఆర్ బయటకొస్తున్నారు. తాజాగా తెలంగాణలో పలు గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లతో కేసీఆర్ సమావేశం అవ్వడమే కాకుండా వారిలో జోష్ నింపే యత్నం చేశారు. -
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు
సాక్షి, ఆదిలాబాద్: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి నాలుగు కోట్ల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ముగిశాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్ బీజేపీ అయినప్పటికీ వారిని కలుపుకొని అభివృద్ధి పథం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పు డు ప్రతిపక్ష నాయకులకు సీఎం సభలో పాల్గొనే, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సెక్రటేరియెట్‌లో వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను, సీతక్కను నిర్బంధించారని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. రానివ్వబోమని సీఎం అన్నారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి ‘ఈ రెండేళ్లలో నేను ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులోనే నాకు అవకాశం వచ్చింది. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. ప్రస్తుతం ప్రజల కోసం, గౌరవం పొందడం కోసం నిరంతరం పనిచేస్తున్నా. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండేళ్ల పాలన సాగించా. తెలంగాణ ఆడబిడ్డలను గత ముఖ్యమంత్రి దివాలా తీయించాడు. మేము ఉచిత ప్రయాణం కల్పించాం. వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు పెట్రోల్ బంక్‌లు నడుపుతున్నారు. మొత్తం కోటి మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంచుతాం. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయి..అందుకే రాష్ట్రంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడ్డాయి..’అని ముఖ్యమంత్రి అన్నారు. రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి.. ‘ప్రాణహిత–చేవెళ్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో రూ.38 వేల కోట్లతో శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పెద్దాయన దయ్యంలా మారి ప్రాజెక్టును కాలగర్భంలో కలిపాడు. పేరు, ఊరు, అంచనాలు మార్చాడు. కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసిందే తప్ప ఆదిలాబాద్‌కు నీళ్లు రాలేదు. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా.. గత ప్రభుత్వం తీరుతో ప్రాజెక్టు కిందికి తరలిపోయింది. రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి. సొమ్ము రావడంతో సొంత కుటుంబసభ్యులు కత్తులతో పొడుచుకుంటున్నారు. బిడ్డ, కొడుకు, అల్లుడు తలో దిక్కు. అసలు ఆయన ఎక్కడ పడుకుంటున్నాడో అందరికీ తెలుసు..’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు శంకుస్థాపనకు నేనే వస్తా.. ‘మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ పరపతితో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కట్టడానికి టెండర్లు పిలిచాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొలాలకు నీళ్లు ఇస్తాం. ప్రాజెక్టు శంకుస్థాపనకు నేనే వస్తా. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి తెరిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఇక్కడ ఎయిర్‌పోర్టు కట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఏడాదిలో ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు తీసుకొస్తా. ఎయిర్ బస్సును కూడా తీసుకొస్తా. కొరటా–చనాఖా ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోవాలని గతంలో కోరారు. ఇక్కడ నూటికి నూరు శాతం అభివృద్ధి పనులు చేపడతాం..’అని సీఎం చెప్పారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.. ‘తెలంగాణ యువకులు ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలన్నదే నా కోరిక. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు లేవు. కానీ వాళ్ల ఇంట్లో మాత్రం పదవులు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టొద్దు.. వీలైతే ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకోవాలి. గ్లోబల్ సమ్మిట్‌కు కన్నతల్లి లాంటి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం. ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆహా్వనించాం. ప్రధాని, కేంద్ర మంత్రులను కూడా రమ్మని కోరాం..’రేవంత్ తెలిపారు. రూ.260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలోనే రూ.260 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సీఎం లాంఛనంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’చొరవకు అభినందనలు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. వీటిపై ఇటీవల ఆదిలాబాద్‌లో ‘సాక్షి’ఆధ్వర్యంలో చర్చా వేదికలు నిర్వహించడం జరిగింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘సాక్షి’చొరవను పలువురు అభినందిస్తున్నారు. సీఎంతో పాయల్ ముచ్చట కైలాస్‌నగర్: ఆదిలాబాద్ సభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎంతో సుదీర్ఘంగా చర్చించడం సభకు హాజరైన ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది. సీఎం ప్రసంగించేంత వరకు వారిరువురు మాట్లాడుకుంటూ కన్పించడం చర్చనీయాంశమయ్యింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆసీనులైన వేదికపై సీఎం పాయల్ శంకర్‌తోనే ఎక్కువసేపు మాట్లాడడంతో అంతగా ఏమి మాట్లాడి ఉంటారనే ఆసక్తి నెలకొంది. -
హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. ‘హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ’(హిల్ట్–పి) పేరిట జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు క్షేత్ర స్థాయికి వెళ్లనుంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. ‘హిల్ట్ పి’ఉత్తర్వుల్లో పేర్కొన్న 22 పారిశ్రామిక వాడలను ఎనిమిది క్లస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్లలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు ఈ నెల 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తాయి. కేటీఆర్ నేతృత్వంలోని బృందం బుధవారం జీడిమెట్ల పారిశ్రామికవాడను సందర్శిస్తుంది. ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్న వారితో కేటీఆర్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ధరల వ్యత్యాసం జనం ముందుకు... పారిశ్రామిక భూముల బదలాయింపులో జరుగుతున్న అవకతవకలతోపాటు, హిల్ట్ పాలసీ వెనుక దాగిన రూ.5 లక్షల కోట్ల కుంభకోణంలోని నిజానిజాలను ప్రజల ముందు పెట్టాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ‘స్థానిక నాయకులు, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలి. ప్రభుత్వం భూ బదలాయింపు చేయాలనుకుంటున్న పారిశ్రామిక వాడల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను చర్చించాలి. అత్యంత చౌకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు భూములు ఇవ్వడం వెనుక ఉద్దేశాలను ఈ బృందాలు ప్రస్తావించాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్ఆర్ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తద్వారా సుమారు రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. నిజ నిర్ధారణ బృందాలు ఇవే...పాశమైలారం, పటాన్చెరు, రామచంద్రాపురం-- టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్ నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి-- జి.జగదీశ్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీదేవి మౌలాలి, కుషాయిగూడ-- ఎస్.మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి జీడిమెట్ల, కూకట్పల్లి-- కేటీఆర్, సత్యవతిరాథోడ్ , పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద సనత్‌నగర్, బాలానగర్-- తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నవీన్‌రావు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కు-- చామకూర మల్లారెడ్డి, శంభీపూర్ రాజు కాటేదాన్, హయత్‌నగర్ -- సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి చందూలాల్ బరాదరి-- మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్, ఎండీ సలీమ్ -
వీరన్న కుటుంబాన్ని ఆదుకునేదెవరు?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఖమ్మం రైతు బానోతు వీరన్న ఉదంతంపై తాజాగా ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న బలవన్మరణం చెందడం అత్యంత బాధాకరం. పండించిన పంటకు ధర రాక.. అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అంటూ పురుగుల మందు తాగుతూ వీరన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఓ నిదర్శనం.వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి అంటూ హరీష్‌రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఫిరాయింపులపై వారిది ఒకటే తీరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాతీర్పును కాలరాయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరి ఒక్కటేనని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోగా, అలా వచి్చన కొందరు సిగ్గులేకుండా మంత్రి పదవుల్లో కొనసాగారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుందని విమర్శించారు. తమ పార్టీలో చేరే వారిని రాజీనామా చేసి వస్తేనే తీసుకున్నామని చెప్పారు.ఆ రెండు పార్టీల నిర్ణయాల వల్లే రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. కిషన్‌రెడ్డి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రేటర్ వరంగల్‌లో పర్యటించారు. వందేభారత్ రైలులో సికింద్రాబాద్ నుంచి వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయన.. స్టేషన్లో పనులను పరిశీలించి, చాయ్ పే చర్చ నిర్వహించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)ను సందర్శించారు. కాంగ్రెస్సే మా ప్రధాన శత్రువు ‘బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకం ఆడుతోంది. బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటన చేసింది. చివరకు ఇప్పుడు 32 శాతం కూడా లేకుండా అన్యాయం చేసింది. బీసీలకు కేటాయించిన స్థానాల్లో ముస్లింలు పోటీ చేసే అవకాశం ఉంది. నిజమైన బీసీలకు రిజర్వేషన్లు దక్కడం లేదు. బీసీ జనాభాను తగ్గించి చూపి అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీకి బీసీ రిజర్వేషన్లపై ఒక్కమాట కూడా మాట్లాడే హక్కులేదు. కాంగ్రెస్ పార్టీయే మాకు ప్రధాన శత్రువు. ఆ పార్టీ ప్రభుత్వ అవినీతిపై పోరాటాలు చేస్తాం. హిల్ట్ పి వెనుక ఉన్న కుంభకోణంపై కూడా పోరాటాలు చేస్తాం. 22 పరిశ్రమలకు చెందిన భూములను అన్యాక్రాంతం చేయాలని చూడటం దారుణం. గ్రేటర్ వరంగల్‌ను వరంగల్, హనుమకొండ జిల్లాలుగా విభజించి, 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసి పారిశ్రామిక వాడలను తరలించాలని ప్రభుత్వం చూడటంపై బీజేపీ పోరాటం చేస్తుంది..’అని కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే వరంగల్‌కు ప్రధాని ‘దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. 40 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు రూ.కోట్లు వెచి్చంచాం. పీఎం మిత్రకింద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఇప్పటికే 3 కంపెనీలు అగ్రిమెంట్ చేసుకుని ముందుకెళ్తున్నాయి. కాజీపేట ఆర్ఎంయూ వచ్చే ఏడాదిలో పూర్తయ్యేలా పనులు వేగవంతం చేశాం. మామునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ తది దశకు చేరుతోంది. మామునూరు ఎయిర్‌పోర్టు, మెగా టెక్స్టైల్ పార్కులలో భూమిపూజ చేసేందుకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని వరంగల్‌కు తీసుకు వస్తాం..’అని కేంద్రమంత్రి చెప్పారు. ‘మోదీ ప్రధాని అయ్యాక రూ.60 వేల కోట్ల ఎంఎస్పీ చెల్లించి పత్తి కొనుగోళ్లు చేశాం. తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు గతేడాది 110 ఉంటే ఈసారి 123కు పెంచాం. దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు తెలంగాణ నుంచే అత్యధికంగా పత్తి కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు కేంద్రమే మద్దతు ధర ఇస్తోంది..’అని కిషన్‌రెడ్డి తెలిపారు. పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తెలంగాణ విలన్ కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిడ్డల నెత్తురుతో కాంగ్రెస్ నేతల చేతులు తడిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కథలో విలన్, శాశ్వత శత్రువు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ యేనని చెప్పారు. తెలంగాణ చరిత్రలో మూడు తరాలను ముంచి రక్తం తాగిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియని టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’నినాదంతో ఆమరణ దీక్ష చేస్తే విరమించుకోవాలని నాడు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వేడుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సందర్భాన్ని గుర్తు చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ‘దీక్షా దివస్’లో కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ను మింగడానికి కాంగ్రెస్ అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని మండిపడ్డారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కౌరవులు, సైంధవులు, మారీచుల్లా పన్నాగాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.మేడిగడ్డ బరాజ్‌ను పేల్చేసే దుర్మార్గం ‘తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం బరాజ్‌ను బాంబులతో పేల్చే దుర్మార్గం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద దు్రష్పచారం చేస్తూ గోదావరి జలాలు మనకు దక్కకుండా కుట్ర జరుగుతోంది. కేసీఆర్ మౌనం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిది. కేసీఆర్ మాట్లాడినా.. మౌనంగా ఉన్నా సంచలనమే. ఎదురుదాడి ఎప్పుడు చేయాలో, వెనుకడుగు ఎక్కడ వేయాలో తెలిసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన మాయల ఫకీర్లు తెలంగాణ చరిత్రను తుడిచేస్తామని విర్రవీగుతున్నారు. పోరాటాల గడ్డ తెలంగాణలో ఢిల్లీ తోలు»ొమ్మలు, గుజరాత్ కీలు బొమ్మలు కనిపిస్తున్నారు. నెలకు మూడుమార్లు ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టి వచ్చే సామంతులను చూస్తున్నాం. ఎనిమిదేసి మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలున్నా పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించేవారు లేరు. గులాముల నుంచి తెలంగాణను కాపాడి వచ్చే కాలంలో గులాబీ జెండా ఎగురవేస్తాం. కుంభకోణాల కుంభకర్ణుల భరతం పట్టి తెలంగాణ సింహాసనం మీద కేసీఆర్‌ను మళ్లీ కూర్చోబెడతాం. మన అమ్మ తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ బొమ్మను పెట్టి బతుకమ్మను మాయం చేశారు. తెలంగాణ చేతిలో మళ్లీ బతుకమ్మను పెడదాం’అని కేటీఆర్ చెప్పారు. ఉద్యమ ఘట్టాలతో ఫొటో ప్రదర్శన దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతోపాటు అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఉద్యమ ఘట్టాలతో కూడిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. కేసీఆర్ ఉద్యమ చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసి వీక్షించారు. మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు ప్రసంగించారు. చరిత్రను మలుపుతిప్పిన సందర్భం ‘తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన సమున్నత సందర్భం కేసీఆర్ ఆమరణ దీక్ష. ప్రాణాలను ఫణంగా పెట్టి కేసీఆర్ చేసిన దీక్షతో పార్లమెంటు కంపించి డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసింది. ఆ తర్వాత కేంద్రం వెనక్కి తగ్గినా రాజీలేని పోరాటం, రాజీనామాలు, పదవీ త్యాగాలతో కేసీఆర్ తెలంగాణ సాధించారు. బాలనాగమ్మ కథలో తల్లిని కాపాడుకున్న బాలవర్దిరాజులా తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచిన తనయుడు కేసీఆర్. తెలంగాణ ఎవడి భిక్ష కాదు, ఢిల్లీ మెడలు వంచి సాధించాం. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ వేదికగా సోనియా గాం«దీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిరిగా ఏనాడూ తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని మేము అనలేదు’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేడు బీఆర్ఎస్ దీక్షా దివస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఘట్టాన్ని గుర్తు చేస్తూ ‘దీక్షా దివస్’కోసం ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం తెలంగాణ భవన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు.కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. కాగా, దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో ఉద్యమ ఘట్టాలను గుర్తు చేస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్, కేసీఆర్ పాత్రను గుర్తు చేసేలా రూపొందించిన డాక్యుమెంటరీని కేటీఆర్ విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లా కేంద్రాల్లోనూ కార్యక్రమాలుదీక్షా దివస్ ఏర్పాట్లకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమా వేశాలు నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లా కేంద్రాల్లో జరిగిన సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధనలో కేసీఆర్ కృషిని కొత్త తరానికి చాటి చెప్పేందుకు యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లోనూ ‘దీక్షా దివస్’ను నిర్వహించనున్నారు. కేసీఆర్ కటౌట్లకు పాలాభిషేకాలు: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఫొటోలను తెలంగాణ భవన్ నుంచి పంపించారు. కార్యక్రమం ప్రారంభంలో కార్యకర్తలు పార్టీ అధినేత కేసీఆర్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తారు. తెలంగాణ భవన్లో జరిగే ‘దీక్షా దివస్’ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. -
‘జూబ్లీ’యేషన్ స్టడీతో ‘జీహెచ్ఎంసీకి’ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుభవాలను అధికార కాంగ్రెస్ పార్టీ మదింపు చేస్తోంది. ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు అంతర్గత నివేదికలను సిద్ధం చేస్తోంది. దీంతో పాటు ఎన్నికల ఫలితం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, ఇతర అంతర్గత చర్చల్లో వెల్లడైన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.ఈ ఎన్నిక సందర్భంగా గుర్తించిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని జీహెచ్ఎంసీలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించనుంది. కాంగ్రెస్ పార్టీ ‘జూబ్లీ’యేషన్ మోడల్‌ను గ్రేటర్ హైదరాబాద్ అంతటా అమలు చేయనుంది. ఉప ఎన్నికపై అంతర్గత నివేదికలు, చర్చల్లో వెల్లడైన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..సమష్టి కృషితోనే గెలుపు⇒ రాజకీయంగా పట్టు లేని నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం అసాధారణమైన అంశం. ఈ ఎన్నికల్లో గెలుపునకు పార్టీ నేతల సమష్టి కృషే ప్రధాన కారణం. పార్టీ అధికారంలో ఉండడం కూడా దోహదపడింది.⇒ ఇక్కడ బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా పనిచేసింది. ఆ పార్టీ కేడర్ దెబ్బతినలేదు. జూబ్లీహిల్స్లోనే కాకుండా హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో కారు పార్టీ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది.⇒ ఆ పార్టీ ఎలక్షనీరింగ్ కూడా పకడ్బందీగా జరిగింది. ముఖ్యంగా కుల సంఘాలను సమావేశపర్చడం, అపార్ట్మెంట్లు, బస్తీల వారీగా పోలరైజ్ చేయడంలో క్రియాశీలంగా పనిచేసింది.బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకు⇒ బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని ఫలితాలు చెపుతున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడ ఎంత లూజ్‌గా ఉన్నా ఆ పార్టీకి 15 శాతం ఓట్లు వస్తాయి. ఈ రెండు పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలి.⇒ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. హైదరాబాద్‌లో చాలాచోట్ల పార్టీకి కమిటీల్లేవు. కాబట్టి బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. క్రియాశీలంగా లేని వారిని గుర్తించి వారిని పార్టీ పనిలోకి తీసుకురావాలి.⇒జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదు. ఉప ఎన్నికల సమయంలో హైప్ అయినంతగా ముస్లిం వర్గం ఆ పార్టీతో లేదు. ముస్లిం నేతల్లో చాలామంది ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు.మహిళలను ఆకట్టుకోవాలి⇒ మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిస్థాయి విశ్వాసం కనబర్చలేదు. వారిని ఆకట్టుకునే కార్యక్ర మాలు అమలుపర్చాలి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్రమంతటా మహిళల మనసు చూరగొనేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.⇒ హైడ్రాపై ప్రచారం జరుగుతున్నంత స్థాయిలో వ్యతి రేకత లేదు. హైడ్రాతో ప్రత్యక్షంగా నష్టపోయిన పేద, మధ్యతరగతి వర్గాలు చాలా తక్కువ. ఎక్కువగా బడాబాబులపై మాత్రమే హైడ్రా ప్రభావం ఉంది. 10–20 శాతానికి మించి హైడ్రాపై వ్యతిరేకత లేదు.⇒ జూబ్లీహిల్స్‌లో పార్టీ విజయానికి మరో ప్రధాన కారణం ఎంపిక చేసిన అభ్యర్థి. స్థానికుడైన బీసీని నిలబెట్టడం చాలా ఉపకరించింది. ఇదే వ్యూహాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలు చేయాలి.⇒ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కొంతమేరకు కనిపించినా, సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు మొదలైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే భావనకు ప్రజలు క్రమంగా వచ్చారు.⇒ మొత్తంమీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా సిటీ ఓటరు నాడిని పట్టుకోగలిగాం. వీరికి పార్టీల కన్నా వారి సమస్యలు, వారి పరిసరాల్లో ఉండే వాతా వరణం, ప్రభుత్వ పనితీరు లాంటివి ముఖ్యమన్నది అర్థమైంది. -
సీఎం కాదు.. రియల్ ఎస్టేట్ ఏజెంట్లా రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఒక సీఎంలా కాకుండా కేవలం రియ ల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణభవన్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి.. ఇప్పుడు హైదరాబాద్‌లోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చౌకగా భూములు తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూముల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్‌రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులు ఇస్తూ రియల్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 9,300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ఐదారు వందల మంది కోసం 5 లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయని, ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరుకు రేవంత్ చేసింది శూన్యం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్‌రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు చుక్కనీరు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్‌టి.రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తలకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజావ్యతిరేకత కాంగ్రెస్‌పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటారని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్వీ విభాగం పాటను ఆవిష్కరించిన కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్వీ విభాగం పాటను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ పాటను బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ రూపొందించారు. గురువారం నందినగర్ కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీష్, బీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు. -
బుర్రుందా..! మీలాంటోళ్ళు డిప్యూటీ సీఎంలు... పవన్ కామెంట్స్ కు జగదీశ్ రెడ్డి కౌంటర్
-
వాస్తవాలు నేను నిరూపిస్తా: కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్: చెక్ డ్యామ్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాస్ట్ చేసినట్లు అనుమానాలున్నాయని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను తాను చూపిస్తానంటూ సవాల్ చేశారు కౌశిక్‌రెడ్డి. వాస్తవాలు చూపిస్తే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావ రాజకీయాల నుంచి తప్పుకుంటారా?, అని ప్రశ్నించారు. లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డిలా మాట తప్పుతారా అంటూ విమర్శించారు కౌశిక్‌రెడ్డి. రాష్ట్రంలో మిషన్ భగీరథలో భాగంగా తమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 చెక్ డ్యామ్‌లు నిర్మిస్తే వాటిని సీఎం రేవంత్ సర్కార్ కూల్చివేస్తుందంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి-పెద్దపల్లి గుంపుల మధ్య ఉన్న కూలిన చెక్ డ్యామ్‌ను కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. ఆ చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడానికి ప్రయత్నించిని పోలీసులు ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. ఇసుక మాఫియా కోసం రాత్రికి రాత్రే ఆ చెక్ డ్యామ్‌ను పేల్చివేశారని రైతులు, మత్స్యకారులు చెబుతున్నారని మండిపడ్డారు. అయితే దీనిపై ఎమ్మెల్యే విజయరామారావు స్పందించగా, దానికి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చెక్ డ్యామ్‌ను పేల్చేసినట్లు అనుమానాలున్నాయంటూనే వాస్తవాలను చూపిస్తానన్నారు. -
‘రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారు’
వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీల గొంంతుకోసారంటూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు(బుధవారం, నవంబర్ 26వ తేదీ) వరంగల్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. ఎవరి ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీ విస్తరణ చేపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారు. తెలంగాణను రాహుల్‌కు ఏటీఎంలా మార్చారు’ అంటూ ధ్వజమెత్తారు. ఈరోజు కేటీఆర్.. వరంగల్ పర్యటనకె వెళ్లారు. ఉదయం 11:30 గంటలకు హన్మకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీరవెళ్లి భారత్ కుమార్‌రెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యారు. అపై మధ్యాహ్నం 3 గంటలకు జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. -
‘కాంగ్రెస్ హయాంలో పేల్చివేతలు, కూల్చివేతలు కామన్’
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ హయాంలో కూల్చివేతలు, పేల్చివేతలు సర్వసాధారణం అయిపోయాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. జమ్మికుంట మండలం తనుగుల మానేరునదిపై కూలిపోయిన చెక్ డ్యాంను ఆయన నేతృత్వంలోని బృందం మంగళవారం పరిశీలించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో పేల్చివేతలు సర్వసాధారణమైపోయాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాకు పెద్దపీట వేస్తోంది. ఓదెల, జమ్మికుంట మధ్య 24 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్‌ను ఇసుక మాఫియా పేల్చివేశారు. రాత్రి వరకూ చేపలు పడితే ఎలాంటి అలజడి లేదని.. ఉదయాన్నే వచ్చి చూస్తే డ్యాం కూలిపోయిందని మత్స్యకారులు చెబుతున్నారు. తమకు ఇసుక తీయడం కష్టమవుతోందని భావించి చెక్ డ్యామ్ నే పేల్చివేశారు. గతంలో హుసేన్ మియా వాగుపైనా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ, ఈ రోజువరకూ నాటి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. వారిని కాంగ్రెస్ పెద్దలు కాపాడుతున్నారు. భోజన్నపేట, కొత్తపల్లి రైతులే కంప్లైంట్ చేసినా హుస్సేన్ మియా ఘటనపై ఎఫ్ఐఆర్ చేయలేదు. నాడే చర్యలుంటే.. ఈరోజు ఈ తనుగుల చెక్ డ్యాంను పేల్చేందుకు భయపడేవారు. ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకూ తనుగులు చెక్ డ్యాం విషయంలో చర్యల్లేవు.ఇసుకమాఫియా నిర్మల్, కరీంనగర్, చెన్నూరు ఇలా ప్రతీచోటా ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతోంది. మిషన్ కాకతీయ ద్వారా 44 వేల చెరువులను సస్యశ్యామలం చేస్తే, చెక్ డ్యాములు నిర్మిస్తే.. నేటి ప్రభుత్వం జిలెటిన్ స్టిక్స్ పేలిస్తే ఇప్పటివరకూ చర్యల్లేవు. నాణ్యతా లోపమని మాట్లాడుతున్నారు... కట్టిందెవరు..?. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనే కదా...? అది పొంగులేటిదే కదా..? మరి మంత్రి మీద చర్యలేవి..?. రాఘవ కన్స్ట్రక్షన్ ను బ్లాక్ చేయాలని డిమాండ్.ఓవైపు కేంద్రమంత్రి మాట్లాడతాడు. ఇంకోవైపు కాంగ్రెసోళ్లే మాట్లాడతారు. ఏది నిజం..? ఎందుకు డ్రామాలాడుతున్నారు..? రెండేళ్లైంది.. ఏడాదికి ఆరు లక్షల చొప్పున ఉత్తమ్ చెప్పినట్టు 12 లక్షలకు సాగునీరిచ్చారా..?కాళేశ్వరంపైన కమిషన్ల పేరిట కాలాయాపన చేస్తున్నారు. విషయం గక్కుతున్నారు. కాళేశ్వరంతో లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశముంది. కేసీఆర్ కు పేరొస్తుందని కుట్ర చేస్తున్నారు. కాల్వలు తవ్వితే కేసీఆర్ కు పేరొస్తుందని రైతుల నోట్లో మట్టిగొడుతున్నారు. రేవంత్ కాళేశ్వరం కూల్చేస్తానంటుండు. మరి మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా..? అక్కడి నుంచి హైదరాబాద్ కు నీరెలా తరలిస్తావు?. అది మీ తాత కట్టిందా..?మేడిగడ్డలో ఒక్క పిల్లర్ వద్ద పగుళ్లు వస్తే రాద్ధాంతం చేశారు. జిలెటిన్ స్టిక్స్ తో చెక్ డ్యామ్ పేల్చివేత వెనుక కాంగ్రెసోళ్ల హస్తముంది. ఉన్నతస్థాయి విచారణ జరగాలి. చెక్ డ్యామ్ ను వెంటనే నిర్మించి, వర్షాకాలం వరకు పూర్తి చేయాలని డిమాండ్. కలెక్టర్, సీపీ తిమ్మినిబమ్మిని చేద్దామనుకుంటున్నారు.. జాగ్రత్త!. లక్ష క్యూసెక్కుల వరద వచ్చినా చెక్ డ్యామ్ కూలలేదే, కొట్టుకుపోలేదే.. మరిప్పుడెందుకు ఈ విధంగా కూలిపోయిందో చెప్పాలి.కాంగ్రెస్ హయాంలో రైతులకంటే ఇసుక మాఫియాకే ప్రాధాన్యత, పెద్దపీట. టెర్రరిస్టులు కూడా చేయని పనిని ఇవాళ ఇసుక మాఫియా చేస్తోంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరిగినా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఓ నీతి ఉంటుంది. ఈ చర్యలపైన సరైన విచారణ జరక్కపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తాం అని హరీష్‌రావు అన్నారు. -
Sridhar Babu: ఎన్నిసార్లు విఫలమైన బీఆర్ఎస్ బుద్ధిమాత్రం మారడం లేదు
-
కేటీఆర్ అరెస్ట్ తప్పదు?
-
ఫిరాయింపులపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందిపై విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో స్పీకర్ తన తుది తీర్పును రిజర్వు చేశారు. ఇప్పటివరకు స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది.రెండో విడత విచారణలో భాగంగా ఈనెల 6, 7, 14, 15 తేదీల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. తిరిగి తాజాగా 19, 20 తేదీల్లోనూ ఇరుపక్షాల న్యాయవాదులు స్పీకర్ ఎదుట మౌఖిక వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్‌పై స్పీకర్ వద్ద బీఆర్ఎస్ ఈ ఏడాది ఆరంభంలో అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.వారికి మూడు రోజుల గడువునాలుగు వారాల్లోగా అనర్హత పిటిషన్ల అంశం తేల్చాలంటూ సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు ఇటీవల గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా స్పీకర్ తాజాగా మరోమారు నోటీసులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ గడువులో ఇప్పటికే వారం రోజులు పూర్తి కాగా, స్పీకర్ తన నిర్ణయం ప్రకటించేందుకు మరో మూడు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో దానం, కడియంకు జారీ చేసిన నోటీసుల్లో మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పీకర్ గడువు విధించినట్లు తెలిసింది.వారి నుంచి సమాధానం అందిన తర్వాత వాటిపై బీఆర్ఎస్ తన అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఇస్తారు. ఇరువర్గాల నుంచి అందిన సమాధానాలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ వచ్చే నెల మొదటి వారంలో విచారణ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. ఈ ఇద్దరి పిటిషన్ల విచారణ పూర్తయిన తర్వాతే పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తుది తీర్పును ప్రకటించే అవకాశముందని సమాచారం. అయితే ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరవుతారా లేక అంతకుమునుపే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. -
ఓడిన చోటే గెలిచి చూపిద్దాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ గెలవలేదని, నిరాశ పడొద్దని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌వర్క్ మొదలు పెట్టి విజయం సాధిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓడిన చోటే గెలిచి చూపిద్దామన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మె ల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డిసెంబర్‌లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని 407 బూత్‌ల్లో ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున, మొత్తం 4 వేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారుపడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, కాలికి బలపం కట్టుకొని తిరుగుతామని భరోసా ఇచ్చారు. తెలంగాణభవన్, పార్టీ కార్యాలయాలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందన్నారు. – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాట స్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18,000 ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్‌లో, ఈ ఉపఎన్నికలో 75,000 ఓట్లు సాధించడం కార్యకర్తల కృషికి నిదర్శనమని చెప్పారు. – రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దని తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయన్నారు. -
రైతులు చావొద్దు.. ప్రభుత్వాలను చావగొట్టాలే
భైంసా టౌన్/ఆదిలాబాద్ టౌన్: రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చావగొట్టా లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్‌తోపాటు సోయా కొనుగోళ్లకు సంబంధించి బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 20 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. రైతులను కలవడానికి వస్తున్నామని తెలిసి ప్రభుత్వం కేంద్రంతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ నాటకాలు మొదలుపెట్టిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులతో రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో రాజకీయాలు చేయొద్దని... ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని సైతం కొనుగోలు చేసే వరకు కొట్లాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే అంశంపై కేబినెట్లో చర్చించే వారని.. కానీ సర్కారు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై యాప్‌లను ఏర్పాటు చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పటివరకు లక్ష క్వింటాళ్లు కూడా కొనలేదు.. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని కేటీఆర్ చెప్పారు. ఈసారి అధిక వర్షాలకుతోడు చలికాలంలో సహజంగానే పత్తిలో తేమ ఉంటుందని.. కానీ సీసీఐ మాత్రం 8 శాతం తేమ నిబంధన పేరిట ధరలో కోత పెడుతోందని ఆయన విమర్శించారు. రైతులు క్వింటాల్‌కు రూ. 2 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కనీసం లక్ష క్వింటాళ్ల పత్తి కూడా కొనుగోలు చేయలేదన్నారు. స్థానిక బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి తేమ నిబంధన 20 శాతానికి పెంచేలా చూడాలన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు 13 క్వింటాళ్ల సోయా కొనుగోలు చేశామని.. ప్రస్తుతం 7 క్వింటాళ్లకే పరిమితం చేశారని విమర్శించారు. తాము ఠంచన్‌గా రైతుబంధు, రుణమాఫీ, యూరియా బస్తాలు అందించామని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఏదీ సమయానికి అందక రైతులు ఆగం అవుతున్నారన్నారు. -
ఆ నలుగురి మౌఖిక వాదనలు విననున్న స్పీకర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మౌఖిక వాదనలు వినేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. బుధవారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎం.సంజయ్‌తోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జి.జగదీశ్‌రెడ్డి మౌఖిక వాదనలను స్పీకర్ వింటారు. 20న ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీతోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరఫున న్యాయవాదులు మౌఖిక వాదనలు వినిపిస్తారు. తెల్లం వెంకట్రావు, సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై రెండు విడతల్లో ఈ నెల 6, 7, 14, 15 తేదీల్లో స్పీకర్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే విచారణ చివరి అంకానికి చేరడంతో చివరగా ఇరుపక్షాల తరఫున న్యాయవాదులు స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట మౌఖిక వాదనలు వినిపించనున్నారు. ఈ వాదనలు ముగిసిన తర్వాత స్పీకర్ తన వద్ద దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటించే అవకాశముంది. స్పీకర్ నిర్ణయమే తరువాయి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎనిమిది మందిని స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది. తొలి విడతలో ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని స్పీకర్ ట్రిబ్యునల్ విచారించింది. రెండో విడతలో తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ కూడా విచారణకు హాజరయ్యారు. కాగా ఈ నెల 20న రెండో విడత విచారణకు హాజరైన నలుగురు ఎమ్మెల్యేల మౌఖిక వాదనలు కూడా పూర్తి కానున్నాయి. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్‌పై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో విచారణకు హాజరైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వారం రోజుల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం వెలువడక మునుపే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. -
‘ఫిరాయింపు’.. కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం కొత్త మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయగా ఇద్దరు ఎమ్మెల్యేలు నేటికీ స్పందించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులకు స్పందించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై రెండు విడతల్లో సాగిన స్పీకర్ విచారణ శనివారం పూర్తయింది. దీంతో నోటీసులకు స్పందించని ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఇటీవల మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానున్నది. అయితే విచారణ విస్తృతిని దృష్టిలో పెట్టుకొని విచారణ గడువు పెంచాలని స్పీకర్ కూడా సుప్రీంకోర్టును కోరినట్లు సమాచారం. కాగా, స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్)పై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు బీఆర్ఎస్ నుంచి గెలిచి 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య 10 మంది ఎమ్మెల్యేలు (దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్) కాంగ్రెస్‌లో చేరినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించారు. రెండు విడతల్లో స్పీకర్ విచారణ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది. తొలి విడత విచారణలో భాగంగా సెపె్టంబర్, అక్టోబర్లలో ఐదు రోజులపాటు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ట్రిబ్యునల్ విచారించింది. అయితే తాము పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని వారు వాదించారు. మరోవైపు సుప్రీంకోర్టు విధించిన గడువులోగా నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తవగా పిటిషన్ల విస్తృతిని దృష్టిలో పెట్టుకొని మరో 8 వారాల గడువు కోరుతూ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.ఈలోగా రెండో విడతలో మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, ఎం.సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. దీంతో మొత్తం 8 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో వారిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. -
కష్టపడినా కలిసి రాలేదు!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ యంత్రాంగం సర్వశక్తులూ ఒడ్డి కష్టపడినా కలిసి రాలేదనే అభిప్రాయం బీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడాన్ని బీఆర్ఎస్ సానుకూల ధోరణిలో చూస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మూడో స్థానంలో నిలిచిన పార్టీ ప్రస్తుతం 38 శాతం ఓట్లు సాధించడాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రలోభాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన బెదిరింపులు తదితరాల మూలంగానే పార్టీ అభ్యర్థి ఓటమి చెందారని భావిస్తోంది. కలిసిరాని సానుభూతి ఇతర పార్టీలతో పోలిస్తే పార్టీ అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసి, ప్రచార పర్వంలో దూసుకెళ్లినా స్థానిక పరిస్థితులు అనుకూలించలేదనే అభిప్రాయం బీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించినా సానుభూతి ఆశించిన స్థాయిలో కలిసి రాలేదని అంటున్నారు. ఆమె వైవాహిక జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి, ఘటనలు కొంత మేర ప్రభావం చూపి ఉంటాయని కూడా కొందరంటున్నారు. గోపీనాథ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత ఉన్నా అది ఓట్ల రూపం దాల్చలేదనే అంచనాకు వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతను నాటడంలో విఫలం పార్టీ పరంగా ప్రచారం, సమన్వయం, ప్రచార ఎజెండా అన్నీ సక్రమంగానే ఉన్నా..ప్రభుత్వం పట్ల అన్నివర్గాల్లో ఉన్న వ్యతిరేకతను స్థానిక ప్రజల్లో బలంగా నాటలేకపోయామని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ మొదటి నుంచీ ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించలేదని, క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ నామమాత్ర ప్రచారానికే పరిమితం కావడం కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ, గతంలో రెండు పర్యాయాలు ఓడిపోయిన నవీన్‌యాదవ్‌కు ఆ పార్టీ టికెట్ ఇవ్వడం, అజారుద్దీన్‌కు మంత్రి పదవి, మంత్రివర్గం మొత్తం నియోజకవర్గంలో మోహరించడం ఆ పార్టీ గెలుపునకు కారణమయ్యాయని బీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈసీ, పోలీసుల పనితీరుపై అసంతృప్తి అధికార పార్టీ బెదిరింపులు, ప్రలోభాలు కూడా తమ ఓటమికి ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. నియోజకవర్గంలో సుమారు సగం మంది ఓటర్ల చిరునామాలు గందరగోళంగా ఉన్నాయని, వారు ఎక్కడ ఉంటారో కూడా తాము తెలుసుకోలేక పోయామని ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నకిలీ ఓట్ల అంశాన్ని తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని అంటున్నారు. పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్లను పోలీసు విభాగం ఉద్దేశపూర్వకంగా నియంత్రించకపోవడం, ప్రలోభాలు, డబ్బు, చీరల పంపిణీ కూడా తమ విజయావకాశాలను దెబ్బతీశాయని విశ్లేషిస్తున్నారు. -
నేడే జూబ్లీహిల్స్ తీర్పు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. స్థానికులు ఇచ్చిన తీర్పు వెలువడనుండగా..అన్ని పార్టీలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు..కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీకి కూడా ఇక్కడ గెలుపు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని బట్టి ఆయా ప్రాంతాలు, బూత్‌ల వారీగా తమకు పడిన ఓట్ల సంఖ్యపై అంచనాలు వేయడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్ననికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతంత మాత్రంగానే పోలింగ్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో..ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే జూబ్లీహిల్స్ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ముఖ్యనేతలు, బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు, బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆధ్వర్యంలో బండి సంజయ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు చురుగ్గా ప్రచారం చేశారు. ఉవ్వెత్తున సాగిన ప్రచారంతో ఓటింగ్ 55–60 శాతం నమోదవుతుందని భావించారు. కానీ చివరకు 48.42 % మాత్రమే నమోదైంది. మొత్తం 407 పోలింగ్ బూత్‌లకు గాను 34 కేంద్రాల్లో 60 శాతానికి పైగా, 192 కేంద్రాల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. దీంతో ఆయా బూత్‌ల ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదయం 8 గంటలకే మొదలు పార్టీలు గెలుపోటములపై విశ్లేషణలతో పాటు, వివిధ పోలింగ్ బూత్‌లలో ఆయా వర్గాల వారీగా పోలైన ఓట్లు, పార్టీల వారీగా అనుకూల ప్రాంతాలు, తదితర అంశాల ఆధారంగా విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఉప ఎన్నిక త్రిముఖ పోరుగా సాగితే..అనూహ్య ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయనే ప్రచారం తొలుత జరిగింది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు, పోలింగ్ శాతం నమోదు, తదితరాలు గమనిస్తే మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు మొదలుపెడతారు. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలవడంతో అందుకు అనుగుణంగా కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పది రౌండ్లలో ముగించనున్నారు. లెక్కించే ఓట్లను బట్టి ఎప్పటికప్పుడు ఫలితాలను ఈసీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 15 ప్లాటూన్లతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
-
ప్రలోభాలు ఎదురైనా ఫలితం మనదే!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన బీఆర్ఎస్ మంగళవారం జరిగిన పోలింగ్ సరళిని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తూ పార్టీ అభ్యర్థి గెలుపోటములకు ఉన్న అవకాశాలపై లెక్కలు కడుతోంది. అధికార కాంగ్రెస్ నుంచి తీవ్ర ఒత్తిళ్లు, పోటీ ఎదురైనా ఈ నెల 14న వెలువడే ఉప ఎన్నిక ఫలితాల్లో విజయం సాధిస్తామనే విశ్వాసం పార్టీ నాయకత్వంలో నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ అభ్యర్థిపై సానుభూతి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అనుకూల ఫలితాన్ని సాధించి పెడుతుందనే ధీమా పార్టీ శిబిరంలో కనిపిస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు ఫోన్లు చేసి అభినందించడంతోపాటు బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.వార్ రూమ్‌లోనే c, హరీశ్పోలింగ్ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు మంగళవారం తెల్లవారుజామునే వార్ రూమ్‌కు చేరుకున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ నేతలు, కేడర్‌ను సమన్వయం చేస్తూ దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ ముగిసే వరకు వార్ రూమ్‌లోనే గడిపిన కేటీఆర్, హరీశ్‌రావు.. డివిజన్లు, బూత్‌లు, క్లస్టర్ల వారీగా పోలింగ్ వివరాలను విశ్లేషించారు. కాంగ్రెస్ నుంచి ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కు అనుకూలంగా పోలైందనే అంచనాకు వచ్చారు. కనీసం 2 శాతం ఓట్లతో కాంగ్రెస్‌పై పైచేయి సాధిస్తామని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది.ఉదయం నుంచే ఫిర్యాదుల పర్వం: పోలింగ్ ప్రారంభమైన మరుక్షణం నుంచే కాంగ్రెస్ నేతల కదలికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యా దుల ప్రక్రియను మొదలు పెట్టింది. డబ్బుల పంపిణీ, బెది రింపులు, దాడులు, రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల నుంచి ఏజెంట్లను బయటకు పంపడం, దొంగ ఓట్లు, బయటి నేతలు నియోజకవర్గంలోనే తిష్టవేయడం తదితరాలకు సంబంధించి బీఆర్ఎస్ 60కి పైగా ఫిర్యాదులు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు నియోజ కవర్గంలో సంచరిస్తుండటంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.పార్టీ శ్రేణులు, ఓటర్లకు ధన్యవాదాలు: కేటీఆర్‘గడిచిన నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన నేతలు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురి చేసినా బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ 48.47 శాతమే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్, సాయంత్రం వరకు కూడా అంతంత మాత్రంగానే సాగింది. అయితే చివరి గంటలో మాత్రం పోలింగ్ బూత్‌లలో ఓటర్ల సందడి కనిపించింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ గడువు ముగియడంతో గేట్లు మూసివేసి అప్పటివరకు క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు. మొరాయించిన ఈవీఎంలు పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఉదయమే ఓట్లు వేసి డ్యూటీలు, వివిధ పనులకు వెళ్లాలనుకున్న ఓటర్లు తీవ్ర ఇబ్బంది గురయ్యారు. తర్వాత పరిస్థితి చక్కబడినా సాయంత్రం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు పెద్దగా రాలేదు. బస్తీల్లో మాత్రమే కొంత హడావుడి కనిపించింది. ఇక నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రముఖులు, సినీ తారలు, అధికారులు మాత్రం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా కోడ్ ఉల్లంఘన, దొంగ ఓట్లు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పర్సపరంగా ఆరోపణలు చేశాయి. ప్రధాన పక్షాల అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు పోలింగ్ బూత్‌లు తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతర నేతలు తిరుగుతున్నారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించి ఆదేశాల ఇవ్వడంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం సాంకేతికతను వినియోగిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే తెలిసేలా 136 డ్రోన్లతో పర్యవేక్షించింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పలు పొలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాటలు వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసే సమయంలో..యూసుఫ్‌గూడలో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌తో కలిసి ఆందోళనకు దిగారు. దీనిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు షేక్‌పేట్ డివిజన్ అపెక్స్ హైసూ్కల్ పోలింగ్ బూత్ వద్ద కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఇక యూసుఫ్‌గూడ సవేర ఫంక్షన్ హాల్ వద్ద కూడా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి బూత్‌కీ ఎందుకు తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీకష్ణానగర్లోని ఎ బ్లాక్ పోలింగ్ బూత్‌లో దొంగఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ సునీత బైఠాయించారు. షేక్‌పేట్ అల్ఫల స్కూల్, సమత కాలనీల వద్ద గల పోలింగ్ స్టేషన్లలో భారీగా బోగస్ ఓటింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఆయా పోలింగ్ బూత్‌ల ముందు బైఠాయించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉండడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 1 శాతం అధికంగా పోలింగ్ చివరిసారిగా అందిన సమాచారం మేరకు ఈ ఉప ఎన్నికలో 48.42 శాతం పోలింగ్ నమోదైంది. అయితే దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చూసి తాజా ఎన్నికలో 50 శాతానికి పైగా పోలింగ్ ఉంటుందని పలువురు భావించినప్పటికీ ఎప్పటి మాదిరే నమోదైంది. రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికలకు ఎంతోకాలం ముందునుంచే ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తప్పకుండా ఓట్లు వేయాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం కన్పించలేదు. అధికారుల అవగాహన కార్యక్రమాలను కూడా స్థానికులు పట్టించుకోలేదు. -
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. గెలిచేది ఆ పార్టీనే?
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ పల్స్ -కాంగ్రెస్ 48శాతం,బీఆర్ఎస్-41శాతం,బీజేపీ-6శాతంచాణక్య స్ట్రాటజీస్- కాంగ్రెస్-46శాతం,బీఆర్ఎస్-43శాతం,బీజేపీ-6శాతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించింది.ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా..బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఈ రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14 (శుక్రవారం) విడుదల కానున్నాయి. ఇదీ చదవండి: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటేసిన మాగంటి సునీత
-
స్పీకర్‌పై ధిక్కార చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని, స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఈ ఏడాది జూలై 31న సీజేఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ కార్యాలయం అమలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ తదితరులు సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.సుప్రీం ఆదేశాల అమలులో జాప్యం చేసినందుకు స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ధిక్కార పిటిషన్లో కోరారు. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ అమలు చేయనందుకు ఆ 10మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టే అనర్హులుగా ప్రకటించాలని మరో రిట్ పిటిషన్లో కోరారు. ఈ రెండు పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని న్యాయవాది మోహిత్ రావు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. స్పీకర్ చర్య తీసుకోలేదు ‘సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్లో పేర్కొన్న ఎమ్మెల్యేలు విచారణను ఆలస్యం చేయడానికి యత్నిస్తే.. అటువంటి చర్యలను అనుమతించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు యతి్నస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. కానీ.. ఈ వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిరాయింపు అంశంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనూ స్పీకర్ కనీసం స్పందించలేదు. ఇది ఉద్దేశపూర్వంగా చేస్తున్న తాత్సారమే’అని మోహిత్ రావు వివరించారు. సుప్రీంకోర్టేమీ బంద్ కాదు కదా? సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ నెల 24న పదవీ విరమణ చేస్తున్నందున అప్పటి వరకు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం విచారణకు రాకుండా ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘నేను సీజేఐగా రిటైరైతే ఏమిటి? నవంబర్ 24 తర్వాత సుప్రీంకోర్టు ఏమీ బంద్ కాదు కదా?’అని వ్యాఖ్యానిస్తూ అత్యవసర విచారణకు నిరాకరించారు. తదుపరి వచ్చేవారు ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపడతారని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరిపేందుకు మరో 8 వారాల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం కోరిన విషయం తెలిసిందే. సమయం సరిపోలేదు.. ‘నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో నలుగురికి సంబంధించిన విచారణ చివరి దశకు చేరింది. మరో ఇద్దరి విచారణ ప్రారంభమైంది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ అధికారాలు, రోజువారీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు వంటి కార్యక్రమాల్లో స్పీకర్ బిజీగా ఉండటంతో సుప్రీంకోర్టు విధించిన గడువులోగా విచారించడం సాధ్యంకాలేదు.శాసన సభ్యులు సైతం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అకాల వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు తదితర కారణాలతో నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తోంది. అందువల్ల సమయం సరిపోలేదు’అని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో అక్టోబర్ 31న మిస్లీనియస్ అప్లికేషన్ (ఎంఏ) దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 14న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపైనా అదేరోజు విచారణ జరిగే అవకాశం ఉంది. -
నేడే పోలింగ్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 4 లక్షల మందికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించడంతోపాటు డ్రోన్ల ద్వారా కూడా పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకోనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సర్వశక్తు లూ ఒడ్డాయి. నెలరోజులకు పైగా జరిగిన ప్రచారపర్వంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి. ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే.. ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పార్టీలు ప్ర లోభాలకు తెరలేపాయి. ఓటర్లను రహస్యంగా కలుస్తూ నగ దు పంపిణీకి తెరలేపాయి. ఆది, సోమవారాల్లో గుట్టుగా ఇంటింటికీ వెళ్లి ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 2,500 చొప్పున నగదు పంపిణీ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు తాయిలాలు కూడా అందిస్తున్నాయని తెలుస్తోంది. బోరబండ, రహమత్‌నగర్ డివిజన్లలోని మహిళల కు నగదుతోపాటు చీరలు కూడా పంచినట్లు సమాచారం. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ ప్రధాన రాజకీ య పార్టీ గట్టిగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని.. ఓటరుగా ఉన్న వారికి నగదు ఇవ్వడంతోపాటు గ్రూపు సభ్యులుగా ఉన్న మహిళలకు అదనంగా రూ. 2,500, గ్రూపు లీడర్లకు రూ. 5 వేల చొప్పున నగదు పంచినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన పార్టీ ఓటర్లకు రూ. 1,000 నగదు పంపిణీని పూర్తి చేసిందని సమాచారం.పోలింగ్ పర్యవేక్షణ కోసం... నేడు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల కు ఆదేశాలు అందాయి. పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి అభ్యర్థి వరకు అందరూ సాయంత్రం పోలింగ్ ముగిసి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూంలకు తరలేంత వరకు జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ ప్రచార తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారని.. మంగళవారం పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పోలింగ్ సరళి పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యమ కాస్ట్లీ గురూ!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడగా, పంపకాల పర్వానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఉప ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. గెలవడం వాటికి ప్రతిష్టాత్మకంగా మారింది. గత మూడు రోజుల నుంచి బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా అంతటా యథేచ్ఛగా ‘ఓటుకు నోటు’ బేరం సాగుతోంది. ఓటర్లకు ఏ పార్టీ ఎంత పంపిణీ చేస్తోందన్న విషయాన్ని ఒకదానికొకటి ఆరా తీస్తున్నాయి. తామే ఎక్కువ డబ్బులను పంచాలనే ప్రణాళికలు రూపొందించుకుని గడపగడపనూ టచ్ చేస్తున్నాయి. కొన్ని పార్టీలైతే అపార్ట్మెంట్లో రూ.2,500, బస్తీల్లో రూ.3,000 చొప్పున పంచుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఏ పార్టీవారైనా ఓటర్లకు డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేస్తే.. ప్రత్యర్థి పార్టీ వారు పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసేవారు. ఇప్పుడు ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదు. ‘డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం మాకు వేయండి..’ అంటూ బహిరంగంగానే ఓటర్లకు పిలుపు ఇస్తున్నారు. తాము ఫలానా పార్టీవాళ్లమని కొందరు ఓటర్లు చెప్పినా ‘ఫర్వాలేదు. ఉంచుకోండి’ అంటూ బొట్టుపెట్టి అప్పగింతలు చేసినట్లే చెప్పేస్తున్నారు. ఆయా బస్తీల్లో మహిళా నేతలకు ఈ పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మధ్యవర్తులకు పండుగే పండుగ.. గత కొద్దిరోజుల నుంచి వివిధ పార్టీల ప్రచారాలకు జనాన్ని తీసుకువెళ్లడంలో కొందరు మధ్యవర్తులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన జనాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రోజువారీగా ఇస్తున్నారు. అయితే కొందరు మధ్యవర్తులు రూ.300 నొక్కేసి రూ.200 చొప్పున మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా పారామౌంట్ కాలనీలో తమకు రూ.500 ఇవ్వాల్సిందేనంటూ ప్రచారానికి హాజరైన మహిళలు మధ్యవర్తి ముందు బైఠాయించారు. ‘రూ.200 ఇస్తాను తీసుకోండి.. లేదంటే వెళ్లండి’ అంటూ సదరు మధ్యవర్తి తెగేసి చెప్పడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇటు మధ్యవర్తులు, అటు కిందిస్థాయి నేతలు అందినంత జేబులో వేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కాస్ట్లీగా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా అడుగు తీసి అడుగు వేస్తే పరిస్థితి డబ్బులు మయమైపోయిందని నేతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బుల ప్రవాహానికి అంతులేకుండా పోయిందని గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికల తీరును చూస్తున్న కొందరు ఓటర్లు పెదవి విరుస్తున్నారు.మూగబోయిన మైకులు బంజారాహిల్స్: గడిచిన 18 రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వంలో హోరెత్తిన ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. ప్రచార రథాలకు ఏర్పాటుచేసిన మైక్‌లను సరిగ్గా 6 గంటల సమయంలో నిర్వాహకులు తొలగించడంతో ప్రచారంలో మైకులు మూగబోయాయి. గల్లీ గల్లీలో 58 మంది అభ్యర్ధులు తమ ప్రచార రథాలకు మైకులు ఏర్పాటుచేసుకుని వారి సందేశాలు వినిపించారు. స్వతంత్ర అభ్యర్ధులు కూడా తమ స్థాయికి తగ్గ ప్రచార రథాన్ని తయారుచేసుకుని ఒక మైక్ తగిలించి గెలిస్తే తాము ఏమి చేస్తామో పాటల రూపంలో, ప్రసంగం రూపంలో వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మూడు ప్రధాన పారీ్టలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార రథాలు గల్లీగల్లీలో కదం తొక్కాయి. పాటలు, ప్రసంగాలు తమ పార్టీ మేనిఫెస్టోను తెలియజేస్తూ మైక్‌ల్లో ఊదరగొట్టారు. ప్రచార రథాలకు ఉన్న మైకులు తొలగిపోవడంతో ప్రచారం కాస్తా ఆకర్షణ కోల్పోయిందనే చెప్పారు. రథానికి మైక్ ఉంటేనే ఉర్రూతలూగించి పార్టీ పాటలతో వచ్చిన జనం ఎక్కువ సేపు ఉండేవారు. కాగా ప్రచార పర్వం ముగియడంతో ఆయా పారీ్టల అభ్యర్థులు పోలింగ్‌పై దృష్టిపెట్టారు. మంగళవారం ఎన్నికల పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అనుచరులు, ఇతర నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మనీ, మద్యం పంపకాలపైనా తెరచాటు వ్యవహారాలు ప్రారంభించినట్లు గుసగుసలు విని్పస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే తలంపుతో ప్రధాన పారీ్టల నేతలంతా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. చివరికి విజయం ఎవరిని వరిస్తుందో ఈ నెల 14న ఫలితాల వెల్లడి రోజు తెలియనుంది. -
బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే నోటాకు వేసినట్టే
సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే.. నోటాకు వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. 30 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఆదివారం యూసుఫ్‌గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మంత్రులతో కలిసి ఆయన మాట్లాడారు. పదేళ్ల పాలన చూసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు ఓడించినా, ఉపఎన్నికలో మాత్రం ఫేక్ సర్వేలు చేసుకొని భ్రమ పడుతుందని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలన చూసి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటంతో బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థిపై విష ప్రచారమని దుయ్యబట్టారు. ఇతర కుటుంబాల్లో తలదూర్చే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని, కానీ, మాగంటి ఇంటి వ్యవహారం బజారున పడింది కాబట్టి కేటీఆర్ మాగంటి తల్లికి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుందన్నారు. బలహీన వర్గాల వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచి్చందని, పదవి లేకుండానే అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన నవీన్‌యాదవ్ సేవకుడని, అతడిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలో రాగానే రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసిన సందర్భంలో బలహీనవర్గాల బిడ్డకు జూబ్లీహిల్స్‌లో టికెట్ ఇచ్చిందని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ను మూడు పర్యాయాలు ప్రజలు గెలిపించినా, ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈ ఉపఎన్నికలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ ఇక్కడ చేసింది ఏమీ లేదని, గెలిపిస్తే కూడా చేసేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్‌తోనే మూడేళ్లలో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కారుకు ఓటు వేస్తే కమలంకు ఓటు వేసినట్టేనన్నారు. ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తూ లబి్ధపొందాలని బీఆర్ఎస్, బీజేపీలు ప్రయతి్నస్తున్నాయని ఆరోపించారు. -
ప్రచారం సమాప్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రచార గడువు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల మైకులు బందయ్యాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నాటి నుంచి బహిరంగంగా, అంతకుముందు అంతర్గతంగా ప్రచార పర్వంలో నిమగ్నమై కాళ్లకు బలపాలు కట్టుకొని నియోజకవర్గమంతా చుట్టివచి్చన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం ముగియడంతో సేద దీరారు.అయితే, ప్రచారం ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రలోభాలకు తెరలేచాయనే చర్చ జరుగుతోంది. ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న మూడు ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు ఇతర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రలోభపర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంతోపాటు పలు రకాల తాయిలాలు ఇస్తున్నారని, గల్లీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, కులాలు, వర్గాల వారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.ముఖ్యంగా ఈసారి ఓటుకు రూ. 1,500 నుంచి రూ.5,000 వరకు ఇస్తున్నారని, ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అపార్ట్మెంట్ ఓటర్లకు రూ.3 వేలు, బస్తీల్లో రూ.5 వేల వరకు పంచేందుకు రాజకీయ పక్షాలు వెనుకాడడం లేదని, చివరి క్షణాల్లో గెలుపునకు అవసరమైన అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారన్నది ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బహిరంగ రహస్యంగానే మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంమీద ప్రచార పర్వం ముగియడంతో సోమవారం ప్రలోభాలు మరింత తీవ్రమవుతాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఇప్పటివరకు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, గడప గడపకూ ప్రచారాలతో హోరెత్తిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ప్రలోభాలతో సందడిగా మారింది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఈసీ మంగళవారం జరగనున్న పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలో 407 పోలింగ్ బూత్‌లలో దాదాపు రెండువేలకు పైగా సిబ్బందిని పోలింగ్ నిర్వహణకు నియమించారు. 2,494 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించి ఈ పోలింగ్ నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. పోలీసు బందోబస్తు కోసం వేల సంఖ్యలో సిబ్బందిని నియమించారు. సోమవారం రాత్రికి పోలింగ్స్టేషన్ల వారీగా అటు ఎన్నికల నిర్వహణ, ఇటు బందోబస్తు సిబ్బందిని పంపడం ద్వారా పోలింగ్ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలంటున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లేడీ Vs రౌడీ.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
-
మహిళా ఓటర్లే టార్గెట్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో నలుగురు మహిళలున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు సోషలిస్ట్ పార్టీ (ఇండియా) నుంచి రచ్చా సుభద్రా రెడ్డి, ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇంక్విలాబ్–ఏ–మిల్లత్ (ఏఐఎంఐఎం–ఇంక్విలాబ్) నుంచి షేక్ రఫత్ జహాన్, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగం పోటీ చేస్తున్నారు. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై సోషలిస్ట్ పార్టీ (ఇండియా) తరుఫున పోటీ చేసిన సుభద్రారెడ్డి..ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బరిలోకి దిగింది. బరిలో చిన్న వయస్కురాలు.. నలుగురు మహిళా అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కురాలు.. 32 ఏళ్ల అస్మా బేగం కాగా.. 75 ఏళ్ల సుభద్రా రెడ్డి అధిక వయస్కురాలు. బంజారాహిల్స్ నివాసి అయిన సుభద్రా.. చేనేత–జౌళి శాఖ రిటైర్డ్ గెజిటెడ్ అధికారిణి. ఈమె 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చేరడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఎన్నికల పోరాటంలో ఆమె సుపరిచితురాలే. సుభద్రా రెడ్డి 2009లో లోక్‌సత్తా అభ్యర్థిగా భువనగిరి లోకసభ స్థానం కోసం పోటీ చేశారు. ఆ తర్వాత 2021లో స్వతంత్ర అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. 2023లో గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేయగా సుభద్రకు 721 ఓట్లు పోలయ్యాయి. స్థిరచరాస్తులు, కేసులు.. షేక్ రఫత్ జహాన్‌కు ఈ ఉప ఎన్నికే రాజకీయ ఆరంగేట్రం. ఆమె భర్త గతంలో చేవెళ్ల లోకసభ నుంచి పోటీ చేశారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థి అస్మా బేగం కూడా చురుగ్గానే ప్రచారం చేస్తున్నారు. సుభద్రకు రూ.52 లక్షలు, షేక్ రఫత్ జహాన్‌కు రూ.10 లక్షలు, సునీతకు రూ.7 కోట్లకు పైగా విలువ చేసే స్థిరచరాస్తులున్నాయి. ఈమె మీద జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు ఉంది. ఇక, అస్మా బేగం మీద పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు గాను ఓయూ ఠాణాలో కేసు ఉంది. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 3.99 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1.91 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో మహిళా అభ్యర్థులందరూ ‘ఆమె’ కేంద్రంగానే ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. అతివలను తమ వైపు తిప్పుకుంటే ఆయా కుటుంబాల్లోని ఓట్లు సంపూర్ణంగా తమకే పడే అవకాశాలున్నాయని బలంగా నమ్ముతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు హామీలు, తాయిళాలతో ఆమె ఓట్లను ఆకర్షించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. -
'జూబ్లీ'యేషన్ ఎవరికో!?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్ఎస్ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచార బరిలోకి సీఎం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టేయడం ఈ ఉపఎన్నిక తీవ్రతకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునకలవడం చూస్తే ఈ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే హైడ్రా చేపట్టిన పేదలు, సామాన్యుల ఇళ్ల కూల్చివేతలు, ఆరు గ్యారంటీల అమల్లో అక్కడక్కడా తలెత్తిన లోపాలు, అర్హులందరికీ రేషన్ కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడం ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రియల్టీ రంగం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదని, ప్రభుత్వ బడ్జెట్ పరిమితుల దృష్యా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరగలేదని వారు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ విపక్ష బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికులకు కొన్నేళ్లుగా చిరపరిమితుడు కావడం.. గతంలోనూ పోటీ చేసి ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. అలాగే సుమారు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం, మజ్లిస్ మద్దతిస్తుండటం ఆ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజావ్యతిరేకత చాటాలని బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో విపక్ష బీఆర్ఎస్ ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా ప్రజావ్యతిరేకతను గట్టిగా చాటేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోందని చెబుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల కేసీఆర్ పాలనతో పోలుస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ ప్రచారంలో అధిక ప్రాధాన్యం ఇస్తోందని వారు వివరిస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌ను తాము చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచారంలో పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నగరం నలుమూలలా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వడం, బీఆర్ఎస్ హయాంలో సాగిన 42 ఫ్లైఓవర్ల నిర్మాణం, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచిత తాగునీరు ఇవ్వడం, ఆ పార్టీ హయాంలో ఐటీ సంస్థలకు ఇచ్చిన తోడ్పాటు వంటి అంశాలు బీఆర్ఎస్కు ఈ ఎన్నికలో కలిసి వచ్చే అంశాలు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం, ఆయన సతీమణి బరిలో నిలవడం కూడా బీఆర్ఎస్కు ఈ ఎన్నికలో దోహదపడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. బీజేపీ సైతం ఆశల పల్లకీలో.. ఇక బీజేపీ సైతం ఉపఎన్నికలో సత్తా చాటేందుకు ప్రచారంలో వేగం పెంచింది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రచారపర్వాన్ని బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని.. ఆ పార్టీలను గెలిపించొద్దని కోరుతున్నారు. ప్రధాని మోదీ చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని.. తమ పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డికే పట్టం కట్టాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలవడం ద్వారా గతంతో పోలిస్తే పుంజుకున్నామని.. అదే స్థాయిలో ఈ ఉప ఎన్నికలోనూ గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ వర్గం ఓటర్లపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోనప్పటికీ ఇతర వర్గాల ఓటర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమకు అండగా నిలుస్తారని ఆ పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్ల మౌనం.. పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో మంచిచెడుల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఓటర్లు నిరాకరిస్తున్నారు. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేమని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరేం చెప్పినా, ఎవరికి ఓటు వేయాలని సూచించినా పోలింగ్ రోజు మనసులో ఉన్న దానిని బట్టి ప్రాధాన్యతలను తేల్చుకుంటామని ఇంకొందరు బస్తీలవాసులు అంటున్నారు. అయితే ఆటో కార్మీకులు, చిరువ్యాపారులు, కూలీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఉందని ఆటో డ్రైవర్లు... రియల్టీ నిదానించడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని భవన నిర్మాణ కూలీలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. దశలవారీగా అయినా రాబోయే రోజుల్లో గ్యారెంటీలు అమలవుతాయనే ఆశాభావం సైతం కొందరిలో కనిపించింది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి అంశాలను బస్తీ ఓటర్లు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాగా, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రలోభాల పర్వాన్ని మొదలుపెట్టాయి. -
కాంగ్రెస్‌ను ఓడిస్తేనే హామీలన్నీ అమలు
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్కసారి అవకాశమిస్తేనే నాశనం చేసిన., మళ్లీ అవకాశమిస్తే సర్వనాశనం చేస్తా’అంటున్న రేవంత్‌రెడ్డికి అవకాశమిస్తే మీ వేలితోనే మీ కన్ను పొడుచుకున్నట్లవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్లో మాట్లాడుతూ మీ ఓటుతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న మీ సత్తా చూపాలని, బీఆర్ఎస్ గెలుపుతో రాష్ట్రంలో కొత్త తుపాను రానుందని వ్యాఖ్యానించారు. గెలుపు అనే కత్తిని మాచేతికిస్తే మీ తరపున యుద్ధం చేస్తామన్నారు. ‘పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు అందరినీ మోసం చేసిన కాంగ్రెస్‌కా.. లేక పేదల బతుకులు ఆగం చేస్తే గల్లాపట్టి గుంజికొడతాం అంటున్న బీఆర్ఎస్కా మీ ఓటు’ అని ప్రశ్నించారు. సర్వేల్లో ఓటమి అని తేలగానే అజహరుద్దీన్‌కు మంత్రి పదవి, సినీ కార్మికులకు వరాలు కురిపించడమే కాక ముఖ్యమంత్రితో సహ మంత్రులందరూ గల్లీగల్లీ తిరుగుతున్నారని, ఈ ఎన్నికల్లో వారిని ఓడిస్తేనే మీకిచ్చిన హామీలన్నీ అమలవుతాయని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తులం బంగారం ఇవ్వకపోగా మెడలో పుస్తెలు లాక్కుంటారని కేసీఆర్ అప్పుడే చెప్పారన్నారు. పార్టీ అభ్యర్థి మాగుంట సునీత మీద కుట్రలు చేస్తున్నారని, ఆమెకు అండగా నిలబడాలన్నారు. ప్రజలను బెదిరిస్తూ నకరాలు చేస్తున్న గూండాల పేర్లు రాసిపెట్టుకుంటామన్నారు. 500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న వారి తోకలు కత్తిరిస్తామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో తోకలాడించే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ షోలో పార్టీ నేతలు పల్లా రాజేశ్వరరెడ్డి, విష్ణు పాల్గొనగా, పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
‘గోపీనాథ్ ఆస్తులను కాజేయలని కుట్ర చేస్తున్నారు’
హైదరాబాద్: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతుందని కేంద్ర మంత్రి ,బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల కన్నుపడిందన్నారు. ఈరోజు(శనివారం, నవంబర్ 8వ తేదీ) జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా షేక్ పేట శివాజీ విగ్రహం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ గోపీనాథ్ ఆస్తులపై సీఎం, కేటీఆర్ కన్ను. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారుఅందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నరు. ఇదిగో కంప్లయింట్ కాపీ... పంపిస్తున్నా. సీఎం.. నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి. గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారు. వాస్తవాలు చెబుతుంటే... నన్ను మతతత్వవాది అంటున్నరు. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడను. 80 శాతం మంది హిందువులారా...మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ’ అని స్పష్టం చేశారు. -
‘హిల్స్’లో అమీతుమీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించడంతో నియోజకవర్గం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు వివిధ పార్టీల తరఫున ప్రచార యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నిక ఫలితాన్ని జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరటంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచార పోరు చివరి నిమిషం వరకు కొనసాగించేలా షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నాయి. ‘హస్త’గతానికి సీఎం రేవంత్ పావులు తమ రెండేళ్ల పాలనను చూపుతూ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ప్రచారాన్ని భుజాన వేసుకొని క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండేళ్ల పాలనలో అమలు చేసిన మహాలక్షి్మ, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలను బలంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోస్తీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫోర్త్ సిటీ వంటి అంశాలను కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.ప్రతి ఓటర్ను చేరుకునేలా 14 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, వాకిటి శ్రీహరి, శ్రీధర్‌బాబు, లక్ష్మణ్, కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు డివిజన్లవారీగా ప్రచారం, సమన్వయ బాధ్యతలు అప్పగించారు. సోషల్ ఇంజనీరింగ్ పేరిట యాదవులు, ఎస్సీలు, ముస్లిం, రెడ్డి, కమ్మ సామాజికవర్గం ఓటర్లపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు ప్రచార శైలిని బట్టి తెలుస్తోంది. కమ్యూనిస్టు, ఎంఐఎం, తెలంగాణ జన సమితి పార్టీలు కూడా కాంగ్రెస్ అభ్యరి్థకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాయి. కమల వికాసానికి కిషన్‌రెడ్డి వ్యూహాలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండటంతో ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో మాగంటి గోపీనాథ్‌పై పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన లంకల దీపక్‌రెడ్డినే ఈసారి కూడా బరిలో నిలిపింది. ఏపీలో ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, మారి్నంగ్ వాక్‌ల రూపంలో ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాసవర్మ, గజేంద్ర షెకావత్, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్‌తోపాటు ఏపీ మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.కారు స్టీరింగ్‌ను తిప్పుతున్న కేటీఆర్కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత అభ్యరి్థత్వాన్ని ఇతర పార్టీల కంటే ముందే ఖరారు చేసింది. నియోజకవర్గం పరిధిలోని డివిజన్లకు ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఇన్‌చార్జీలుగా ప్రకటించి మూడు నెలల ముందే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీతో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలను ప్రధాన ప్రచారకర్తలుగా ప్రకటించారు.నియోజకవర్గాన్ని 61 క్లస్టర్లుగా, 200కు పైగా బ్లాకులుగా విభజించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఆ స్థాయి నేతలు 60 మందికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అన్ని రకాల ప్రచార పద్ధతులను బీఆర్ఎస్ ఆచరణలో పెడుతూ ప్రతి ఓటర్ను చేరుకునే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి, హైడ్రా కూల్చివేతలను ప్రచార అ్రస్తాలుగా సంధిస్తోంది. కేటీఆర్ బీఆర్ఎస్ ప్రచారానికి సారథ్యం వహిస్తూ రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చివరి రోజున కేటీఆర్, హరీశ్‌రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా వేర్వేరుగా బైక్ ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. 14న ఫలితాలు ప్రకటించనున్నారు. -
జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
-
ఎమ్మెల్యేల అనర్హతపై మలివిడత విచారణ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తన చాంబర్లో ప్రారంభించారు. ఈ విచారణకు ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్‌తోపాటు పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, జి. జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్ తరఫు న్యాయవాదులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఉదయం 11 గంటలకు తొలుత ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుపై దాఖలు చేసిన పిటిషన్‌పై కేపీ వివేకానంద్‌కు న్యాయవాదులు పలు ప్రశ్నలు సంధించారు. వివేకానంద్ రాజకీయ ప్రస్థానం, ఆయన కుటుంబ రాజకీయ నేపథ్యంపై ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ అనుమతి తీసుకున్నారా అని అడిగినట్లు సమాచారం. తాము పార్టీలో మౌఖికంగా చర్చించుకున్నాకే ఫిర్యాదు చేశామని వివేకానంద్ సమాధానం ఇచ్చినట్లు తెలియవచ్చింది. పార్టీ మారినట్లు భావిస్తే ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదనే ప్రశ్నకు బదులుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అప్పటికే కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేసినట్లు సమాచారం. తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్ పార్టీ మారినట్లుగా వివేకానంద్, జగదీశ్‌రెడ్డి ఇచ్చిన ఆధారాలపై న్యాయవాదులు పలు కోణాల్లో ప్రశ్నలు వేసినట్లు సమాచారం. తెల్లం వెంకటరావు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలో కాంగ్రెస్ సమన్వయకర్తగా వ్యవహరించారని పీసీసీ చీఫ్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని వివేక్ అందజేయగా సర్టిఫైడ్ కాపీ ఉందా అని న్యాయవాదులు ప్రశ్నించినట్లు తెలిసింది. డాక్టర్ సంజయ్ విషయంలోనూ జగదీశ్‌రెడ్డి సమర్పించిన ఆధారాలపైనా ప్రతివాదుల న్యాయవాదులు పలు ప్రశ్నలు వేసినట్లు తెలియవచ్చింది. నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై జగదీశ్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీపై కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై శుక్రవారం విచారణ జరగనుంది. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం విచారణ వాయిదా పడనుంది. తిరిగి ఈ నెల 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గత నెలలో విచారణ జరపగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
మాగంటి కుటుంబంలో ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ చిచ్చు!
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాగంటి సునీత కుటుంబ వ్యవహారం శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆఫీసుకు చేరింది. మాగంటి గోపీనాథ్ రెండో భార్య సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను శేరిలింగం పల్లి తహసీల్దార్ జారీ చేశారు.మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను జారీ చేయడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారని మొదటి భార్య మాలినీ దేవి,ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై తహసీల్దార్ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులు వచ్చారు. తనకు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌పై తలెత్తుతున్న అభ్యంతరాలపై వివరణ ఇచ్చేందుకు మాగంటి సునీత తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీతజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం బీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత.. ఆయన సతీమణి మాగంటి సునీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలోకి దించింది. అయితే ఆమె ఎంపిక మాంగటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాగంటి సునీత నామినేషన్లను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. కుటుంబ సమస్య కాబట్టి న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో మాగంటి సునీతకు తహసీల్దార్ ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేయడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య,ఆమె కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉత్కంఠగా మారింది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అంటే?ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఎందుకంటే అది అభ్యర్థి కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా ధృవీకరించే పత్రం. ఇది వారసత్వ సంబంధాలు, కుటుంబ స్థితి, నామినేషన్ అఫిడవిట్లో ఇచ్చే సమాచారం సరైనదేనా అన్నది నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది. -
వికాసమా..? విధ్యంసమా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గడపగడపకూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ కాంగ్రెస్ చేతిలో మరోమారు మోసపోవద్దని చెప్తున్నాం.ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి నడుమ పోటీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గణాంకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజల మద్దతు కూడగట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు మిగిలిన మూడేళ్లు ప్రజల కోసం పనిచేసేలా ఒత్తిడి తెస్తాం.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీకి రూ.వేలకోట్ల ముడుపులు ముట్టజెపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండుసార్లు, 2023 శాసనసభ ఎన్నికల్లో నగరంలో బీఆర్ఎస్ గెలుపే నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. సాక్షి: సీఎం రేవంత్, బీజేపీ నడుమ బంధం అంటూ మీరు ఏ ఆధారాలతో విమర్శలు చేస్తున్నారు? కేటీఆర్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తోంది. ఓ వైపు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే ఢిల్లీలో రాహుల్‌గాందీకి రేవంత్ రూ.వేల కోట్ల ముడుపులు ఇస్తున్నారు. అందుకు బీజేపీ కూడా సహకరిస్తోంది. అందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు తెలంగాణలో రూ.1,300 కోట్ల కాంట్రాక్టు దక్కింది. హర్యానా, మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి రేవంత్ నిధులు పంపుతుంటే బీజేపీ ఎందుకు వదిలేస్తోంది? రేవంత్ తన రాజకీయ ఎదుగుదల కోసం ఏ పార్టీని అయినా వాడుకుంటారు. ఏబీవీపీ నుంచి మొదలై బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ మీదుగా సాగుతున్న ఆయన ప్రయాణం వచ్చే రెండేళ్లలో తిరిగి బీజేపీకి చేరుకుంటుంది. రేవంత్ వైఖరితో రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారు కాబట్టే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ ఎంపీలతో కలిసి రేవంత్ అర్ధరాత్రి అమిత్ షాను కలుస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రేవంత్‌ను రాహుల్ భరిస్తున్నారు. సాక్షి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో కనీసం చెత్త కుప్పలు కూడా తీయలేదన్న సీఎం రేవంత్ విమర్శలపై మీ స్పందనేంటి? కేటీఆర్: హైదరాబాద్ నగరానికి మేము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాకు ఎందుకు జై కొడుతారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్‌కు వణుకు పుడుతోంది. సీఎం రేవంత్ అసహనంతో మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సొంత గడువు పెట్టుకున్న కాంగ్రెస్.. ఏడు వందల రోజులు కావస్తున్నా ఒక్కటీ నెరవేర్చలేదు. కాంగ్రెస్‌కు మరోమారు ఓటేస్తే రాష్ట్రాన్ని అడుగు పట్టించడం ఖాయం. నేను మంత్రిగా పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేశానో బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో అయినా చర్చకు సిద్ధమే. దమ్ముంటే సీఎం చర్చకు రావాలి. పేమెంట్ కోటా సీఎం రేవంత్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుని మమ్మల్ని దూషిస్తే ధీటుగా సమాధానం చెప్తాం. సాక్షి: ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్, బీజేపీ నడుమ బంధాన్ని సీఎం రేవంత్ లేవనెత్తడంపై ఏమంటారు? కేటీఆర్: ఫార్ములా ఈ రేసు కేసులో నన్ను విచారించేందుకు ప్రభుత్వం గతంలోనే గవర్నర్ అనుమతి తీసుకుంది. ఆ తర్వాతే నా మీద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో నన్ను అరెస్టు చేసేందుకు మరోమారు గవర్నర్ అనుమతి అవసరం లేదు. మగాడివైతే ‘ఫార్ములా ఈ’కేసులో నాపై చార్జిïÙటు వేయించు (సీఎంను ఉద్దేశించి). నాతోపాటు సీఎం రేవంత్‌పైనా ఏసీబీ కేసులు ఉన్నాయి. ఈ విషయంలో నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. సీఎం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ ‘కాళేశ్వరం ప్రాజెక్టు’పై విచారణ పేరిట కొండను తవ్వి ఎలుకను పట్టింది. బీజేపీకి సీబీఐ జేబు సంస్థ అని రాహుల్‌గాంధీ విమర్శిస్తూ ఉంటారు. కానీ రేవంత్ మాత్రం అదే సీబీఐకి కాళేశ్వరం విచారణను అప్పగిస్తారు. రాష్ట్రంలో సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలు లేవా? సీబీఐ కేసు పెట్టి ఏం పీకుతాడు. మేము తప్పు చేయలేదు. ఎవరికీ భయపడం. సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ఎలా భావిస్తోంది? కేటీఆర్: ఉప ఎన్నికలను తెలంగాణ ఉద్యమంలో సాధనంగా వాడుకుని రాజకీయ పార్టీల డొల్లతనాన్ని బయట పెట్టడంతో పాటు రాజకీయ అనివార్యత సృష్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీర్పు ఇచ్చే అవకాశం ప్రజలకు వచ్చింది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు గొంతు వినిపించేందుకు అరుదైన సందర్భం ఇది. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి, సంక్షేమానికి.. కాంగ్రెస్ రెండేళ్ల అరాచక, సంక్షోభ, విధ్వంసకర పాలనకు నడుమ పోటీ ఈ ఉప ఎన్నిక. ఈ ఎన్నిక రాష్ట్ర ప్రజల మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుంది. సాక్షి: ఉప ఎన్నిక ప్రచారంలో హైడ్రా కూల్చివేతలనే ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు? కేటీఆర్: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్యం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శిస్తారు. కానీ ఇక్కడ హైడ్రా పేరిట పేదల ఇళ్లను రేవంత్ సర్కారు కూల్చివేయటం ఆయనకు కనిపించడం లేదు. సీఎం సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ తదితరుల భవనాలు చెరువుల్లో ఉన్నా హైడ్రా ఎందుకు ముట్టుకోవడం లేదు? మూసీకి అడ్డుగా భారీ బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నా హైడ్రాకు కనిపించడం లేదా? ఇళ్లు కూల్చుతూ, మా పార్టీ తరఫున పనిచేస్తున్న చిన్నా చితక వ్యాపారుల దుకాణాలను తొలగిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దమ్ముంటే రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలి. సాక్షి: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రభావం చూపుతుందా? కేటీఆర్: బీఆర్ఎస్ హయాంలో మైనారిటీ వర్గానికి చెందిన మంత్రికి రెవెన్యూ, హోమ్ వంటి కీలక శాఖలు ఇచ్చాం. అజహరుద్దీన్‌కు ఇచ్చేందుకు మైనారిటీ సంక్షేమం తప్ప వేరే శాఖలు లేవా? అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశతో ఉంది. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు, బీజేపీ లేకపోతే హిందువులు ఉండరనుకోవటం ఆ పారీ్టల భావదారిద్య్రం. రేవంత్ మూలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మరో 15 ఏళ్లపాటు తిరిగి లేచే పరిస్థితి ఉండదు. బీజేపీకి ఎంఐఎం పార్టీ బీటీమ్ అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శిస్తున్నా ఆ పార్టీ ఎందుకో స్పదించడం లేదు. సాక్షి: రౌడీ షీటర్‌ను కాంగ్రెస్ అభ్యరి్థగా పెట్టారని మీ పార్టీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై ఏమంటారు? కేటీఆర్: కాంగ్రెస్ అభ్యర్థి గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. కానీ రాష్ట్రంలో సీఎం సర్కారు నడుపుతున్నారో.. రౌడీ దర్భారు నడుపుతున్నారో అర్ధం కావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు అడిగిన ప్రైవేటు విద్యా సంస్థలను విజిలెన్స్ దాడుల పేరిట భయపెడుతున్నారు. ఏరియర్స్ అడిగిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు, రిటైర్డు ఉద్యోగులపై కేసులు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్న మా నాయకుల మీద దాడులు చేస్తూ సీఎం రేవంత్ నీచ రాజకీయం చేస్తున్నారు. సాక్షి: మీ సోదరి కవితతో విభేదాలు, మీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాకపోవడాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి కదా? కేటీఆర్: కేసీఆర్ తమను ఫుట్‌బాల్ ఆడుకుంటారని బీజేపీ, కాంగ్రెస్‌లకు భయం. ఆ రెండు పారీ్టలకు అభివృద్ధి, సంక్షేమం గురించి తెలంగాణలో ఏం చెప్పాలో తెలియడం లేదు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు. దీంతో కేసీఆర్, బీఆర్ఎస్ లక్ష్యంగా అనేక విమర్శలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ప్రచారానికి సంబంధించి దిశా నిర్దేశం చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. కవిత విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. సాక్షి: జూబ్లీహిల్స్‌లో మీ ప్రచార తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? కేటీఆర్: గడపగడపకూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ కాంగ్రెస్ చేతిలో మరోమారు మోసపోవద్దని చెప్తున్నాం. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి నడుమ పోటీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గణాంకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజల మద్దతు కూడగట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు మిగిలిన మూడేళ్లు ప్రజల కోసం పనిచేసేలా ఒత్తిడి తెస్తాం. సాక్షి: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తారా? కేటీఆర్: మా అధినేత ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కథానాయకుడు క్లైమాక్స్‌లోనే వస్తాడు. -
‘కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే’
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ని కేసీఆర్ బీజేపీకి తాకట్టుపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది. ప్రధాని మోదీకి ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే.కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలైంది.ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. సోనియా,రాహుల్‌ను ఈడీ విచారించింది. కేసీఆర్,కేటీఆర్,హరీష్‌ను ఎందుకు పిలవలేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితి ఉంది’అని పునరుద్ఘాటించారు. -
ఉపఎన్నికల ప్రచారంలో మారుమోగుతున్న KCR పేరు
-
జోరు.. టాప్ గేరు!
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో గేరు మార్చాయి. వీధులన్నీ రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలతో హోరెత్తుతున్నాయి. ఈ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీధివీధిలో పాదయాత్రలు నిర్వహిస్తూ, ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. తమ అభ్యర్థకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదునైన విమర్శనా్రస్తాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మాస్ క్యాంపెయిన్‌పై దృష్టి.. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రచార శైలికి భిన్నంగా బీజేపీ ముందుకెళుతోంది. ప్రత్యర్థి పార్టీలు కార్నర్ మీటింగ్, రోడ్ షో అంటూ పెద్దఎత్తున జన సమీకరణ చేస్తుండగా, బీజేపీ నేరుగా కాలనీల్లో ఓటర్ల ఇంటికి పాదయాత్రగా వెళుతోంది. బీజేపీ 50 మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితా విడుదల చేసింది. కార్పెట్ బాంబింగ్ అంటూ కొత్త తరహా ప్రచారానికి తెరతీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రం జన సమీకరణకు మొగ్గుచూపుతున్నాయి. కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారంతో నాయకులు బస్తీల్లో కలియదిరుగుతున్నారు. పేరుకు పెద్దదే అయినా.. పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినా ఆ రాజసం ఆ ప్రాంతంలో కనిపించదు. బస్తీల్లో గుంతలుగా మారిన అంతర్గత రహదారులు, పొంగుతున్న మురుగు నీటి పారుదల వ్యవస్థ, వెలగని విద్యుత్తు లైట్లు, పార్కులు, ఫుట్ పాత్ల ఆక్రమణలపై విమర్శణా్రస్తాలు సంధిస్తున్నాయి. ఈ పాపం మీదంటే మీదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరినొకరు నిందిస్తుండగా, ఈ దుస్థితికి ఆ రెండు పార్టీలే కారణమంటూ బీజేపీ వాదిస్తోంది. ఈసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటోంది. ఆ ముగ్గురే కీలకం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్లో కేటీఆర్ ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. ఇతర నేతలంతా కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు, జన సమీకరణ, ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఎవరెవరిని గెస్ట్లుగా పిలవాలి తదితర అంశాలన్నీ ఆయా నేతలు చూస్తున్నారు. పార్టీ అభ్యరి్థని విజయ తీరాలకు చేర్చే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. -
ఇది సర్కారా? రౌడీ దర్బారా..? : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే మహోన్నత లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్య పొందే హక్కు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ అంధకారం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమాజిగూడలో భారీ రోడ్‌షోలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు కట్టకుండా విజిలెన్స్ దాడులతో కాలేజీలను బెదిరిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు డీఏ, పీఆర్సీలు లేవు. రిటైరైనవారు, ఉద్యోగులు, విద్యార్థులను బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్‌రెడ్డీ? తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లోంచి పది శాతం కటింగ్ అన్నారు కదా! పెన్షనర్లు నీ తల్లిదండ్రుల్లాంటి వారేకదా.. నీ జీతంలోంచి కోత పెట్టాలా? ఇంతమందిని వేధించి ఏం సాధిస్తావు? మీరు నడుపుతున్నది సర్కారా లేక రౌడీ దర్బారా?’అని దుయ్యబట్డారు. మీరే న్యాయమూర్తులు ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆషామాషీ ఎన్నిక కాదు. పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధికి, రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న పోటీ. ఇది బీఆర్ఎస్ వికాసానికి, కాంగ్రెస్ విధ్వంసానికి, సంక్షేమానికి– సంక్షోభానికి మధ్య జరుగుతున్న పోటీ. ఎవరి పాలన బాగుంటే వారికి ఓటెయ్యండి. 4 కోట్ల మంది 4 లక్షల ఓటర్ల వైపు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో సరైన వారినే గెలిపించండి. మీరే న్యాయనిర్ణేతలు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడున్న జనరేటర్లు, ఇన్వర్టర్లు, నీటికోసం ధర్నాల వంటి సమస్యల్ని ఒక్కటొక్కటిగా పరిష్కరించాం. అందరినీ అమ్మలా అక్కున చేర్చుకునే హైదరాబాద్‌లో కార్మీకులకు పని కల్పించాం. పదిలక్షలకు పెరిగిన ఐటీ ఉద్యోగులతోపాటే రియల్ ఎస్టేట్, వివిధ వ్యాపారాలు పెరిగాయి. శాంతి భద్రతల సమస్యల్లేకుండా నగరాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్‌ది. మడిలో ఉండే రైతును, బడిలో ఉండే టీచర్‌ను, గుడిలో ఉండే పూజారిని, చర్చిలో ఉండే పాస్టర్‌ను, మసీదులో ఉండే ఇమాంను ఇలా.. సబ్బండ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. కేసీఆర్, కేటీఆర్‌ల రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చనందున ఇప్పుడు నిరుద్యోగులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’అని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత నీటి పథకం కూడా ఎత్తివేసి వేలకువేల బిల్లులు ఇస్తుందని అన్నారు. హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతుందని.. మంత్రులు, పెద్దల జోలికి పోదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ కావాలని తెలిపారు. -
ఒక్క చాన్సిస్తేనే రాష్ట్రం భ్రష్టుపట్టింది.. మరో చాన్స్ కావాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కారు–బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోటీలో పేదలపైకి బుల్డోజర్ రాకుండా ఉండాలంటే, హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు గుర్తునే గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమవారం రాత్రి బోరబండలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సీఎం కుర్చీ కాపాడుకునేందుకు మాత్రం రాహుల్‌గాందీకి, ఢిల్లీకి వందలు, వేల కోట్లు పంపే రేవంత్‌రెడ్డికి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మాత్రం పైసలుండవని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి రెండేళ్ల కింద ఒక్క ఛాన్సిచ్చినందుకే కదా ఏ ఒక్క పథకమూ అమలు కాకుండాపోయిందని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్సిచ్చినందుకే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారర్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయకుండా ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదని ధ్వజమెత్తారు. ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని, నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అట్టర్‌ఫ్లాప్ అనే పేరొచ్చిందని మండిపడ్డారు. 700 మంది రైతులు చనిపోయే దుస్థితి ఏర్పడిందని, కౌలురైతులు, రైతు కూలీలను కూడా మోసగించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి మరో ఛాన్సివ్వొద్దని పిలుపునిచ్చారు. హింస, అరాచకత్వంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే చరమగీతం పాడాలన్నారు. గల్లాపట్టి అమలు చేయిస్తాం బీఆర్ఎస్ను గెలిపిస్తే కాంగ్రెస్ గల్లా పట్టి సంక్షేమ పథకాలు అమలు చేయిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. తమను మోసగించినందుకు నిరుద్యోగులు పోటీచేస్తే వారిపై దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని లూటిఫికేషన్ చేయడం తప్ప నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రాలేదన్నారు. మీఠా మాటలు చెప్పిన రాహుల్‌గాంధీ పత్తాలేడని విమర్శించారు. ‘ప్రజలు తలచుకుంటే హిట్లర్ వంటి వాళ్లేపోయారు. నువ్వెంత’అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం పైసలివ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. అందుకే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వంద కోట్లు కావాలని ప్రపంచబ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు కులాలు, మతాలకతీతంగా అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్, రేవంత్ పాలనను పోలుస్తూ కొన్ని ఉర్దూ కవితలతో ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించారు. పథకాలు అమలు చేయని తీరు, హైడ్రా బాధితుల కడగండ్లు టీవీల ద్వారా ప్రదర్శించి చూపారు. ‘రేపు మీ బోరబండకి బుల్డోజర్ రాకుండా ఉండాలంటే కారునే గెలిపించాలి. మీకు అండగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామ’ని అన్నారు. పార్టీ మారలేదని టార్చర్ చేసి తమ ఇల్లు కూల్చారని ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ భార్య యాస్మిన్ కేటీఆర్ దృష్టికి తెచ్చారు. -
పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారు. ఈ రెండేళ్లలో రేవంత్‌రెడ్డి సర్కారు ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదు. రేవంత్‌రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూలగొట్టడమే’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రానుందని, అప్పుడు బాధితులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆదివారం హైడ్రా బాధితులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన.. హైడ్రా కూల్చివేతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘హైడ్రా అరాచకాలు: పెద్దలకు న్యాయం, పేదలకు అన్యాయం’పేరుతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం లభిస్తోందని దుయ్యబట్టారు. చాంద్రాయణగుట్టలో స్కూళ్లు కూడా కూల్చివేసిన ప్రభుత్వం, గర్భిణులను పక్కకు తోసేసి, మూడేళ్ల చిన్నారులు భోజనం లేకుండా ఏడ్చేలా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒక ఇంటì గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. బుల్డోజర్ వచ్చి కూల్చేసింది. ఇది మానవత్వం లేని చర్య‘అని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా బాధితుల బాధ అందరికీ అర్థమవ్వాలని అన్నారు. గత రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది కేవలం కూల్చివేతలే‘అని విమర్శించారు.వాళ్ల దగ్గరకు హైడ్రా వెళ్లగలదా?ప్రభుత్వానికి అందరూ సమానమైతే అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న పెద్దవాళ్ల జోలికి ఎందుకు వెళ్లటంలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘పెద్దపెద్ద బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదు? పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్టు? పేదల ఇళ్లు కూలగొట్టలేదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. పేపర్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా.. ఆలస్యం చేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని అంటున్నారు. ఇలా చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? కోర్టులు ఎందుకు? ఎఫ్టీఎల్లో ఇళ్లు కడితే ఎవరినీ వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నారు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతిరెడ్డిది ఒప్పా? ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి నోటీసులు ఇచ్చే దమ్ము హైడ్రా అధికారులకు ఉందా? శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజులరామారంలో 11 ఎకరాల ఆక్రమణకు ప్రభుత్వమే అండగా ఉంది. పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన బిల్డింగ్‌ను కూడా ఇప్పటివరకు ఆపలేదు. మంత్రులు, పెద్దపెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..పేదలపైకి బుల్డోజర్లు పంపుతుంది. అందుకే మేం హైడ్రాను వ్యతిరేకిస్తున్నాం’అని కేటీఆర్ స్పష్టంచేశారు. రాహూల్ మాటలేమయ్యాయి?‘బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే బుల్డోజర్ తెలంగాణలో ఇళ్లను కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? కొండాపూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ప్లాట్లు ఇచ్చారు. వారిని కూడా హైడ్రా వెళ్లగొట్టింది. ఆర్మీ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూలగొట్టడం తప్పు అని, తెలియక తప్పు జరిగితే సరిదిద్దాలని చెప్పారు. ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. -
అరెకపూడి ఆక్రమణ హైడ్రాకు కనపడదా?
నిజాంపేట్/మణికొండ: పెద్దలను కాపాడేందుకు పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని, హైడ్రాతో ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ మంత్రులు ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గాజులరామారంలోని సర్వే నంబర్ 307లోని భూమిని పరిశీలించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కుటుంబ సభ్యులు ఈ సర్వే నంబర్లో 11 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ నిరసన తెలిపారు.సర్వే నంబర్ 307లో పేదలకు చెందిన సుమారు 270 ఇళ్లను కూల్చిన హైడ్రా అధికారులు.. అరెకపూడి గాంధీకి చెందిన 11 ఎకరాల స్థలానికి వేసిన బారికేడ్లను కూల్చిన వెంటనే తిరిగి నిర్మిస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గాం«దీ.. పార్టీ మారినందుకు రూ.1,100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నజరానాగా కట్టబెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద్, మధుసూదనాచారి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సునీతా లక్ష్మారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, శంభీపూర్ రాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మరోవైపు నార్సింగిలోని శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ మూసీ నదిలో నిర్మిస్తున్న భవనాన్ని ఎమ్మెల్యేలు సు«దీర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.పేదలు కట్టుకున్న గృహాలను మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేశారని, అదే మూసీ నదిలో నిర్మిస్తున్న శ్రీఆదిత్య నిర్మాణానికి ఎందుకు మార్కింగ్ వేయలేదని ఆమె ప్రశ్నించారు. పేదల ఆస్తులు కూల్చటం, పెద్దల వద్ద డబ్బులు దండుకోవటమే హైడ్రా పనా? అని నిలదీశారు. నేను సిద్ధం.. మీరు సిద్ధమా: అరెకపూడిఆల్విన్ కాలనీ: తన భూములపై వస్తున్న ఆరోపణలపై అరి కెపూడి ఆదివారం వివరణ ఇచ్చారు. ‘సర్వే నంబర్ 307లో 11 ఎకరాలు కొన్న మాట వాస్తవమే. 9 మంది కుటుంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్ శోభనాద్రి, నిజామాబాద్‌కు చెందిన కొందరు కలిసి 11 ఎకరాలను 1991లో కొనుగోలు చేశాం. 2014 నుంచి 2024 దాకా ఏ ఎమ్మెల్యే ఎంత అక్రమాస్తులు సంపాదించాడో తేల్చేందుకు సీబీఐ, ఈడీతో దర్యాప్తునకు మీరు సిద్ధమేనా?’ అని సవాల్ చేశారు. -
రేవంత్ పాలనలో అభివృద్ధి నిల్
గోల్కొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యమని.. అందుకే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగున నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆదివారం ఆయన షేక్‌పేట్ డివిజన్లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డి పాలనను ఎండగట్టారు. జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లకు చెక్ పెట్టాం.. పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాభివృద్ధితో గ్రామీణ ప్రజలతోపాటు హైదరాబాద్‌వాసుల మన్ననలు పొందారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు లెక్కకు మించి ఉండేవని.. తమ పాలనలో అవన్నీ మాయమయ్యాయన్నారు. కేసీఆర్ కరెంటు కోతలకు చెక్ పెట్టడమే కాకుండా కృష్ణా, గోదావరి నీటిని నగర ప్రజలకు అందించారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఉద్యోగాల కోసం వేలాది మంది హైదరాబాద్ వచ్చారన్నారు. కోవిడ్ సమయంలోనూ ఒక్క హైదరాబాద్‌లోనే 42 ఫ్లైఓవర్లు నిర్మించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నత్తనడకన అభివృద్ధి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా అభివృద్ది చెందలేదన్నారు. ఆరు గ్యారంటీలంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఒక్క సీట్లోనూ గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇందుకోసం ఎంఐఎంకు బానిసగా మా రి ఆ పార్టీ షరతులన్నింటినీ ఒప్పుకుందని దుయ్యబట్టారు. నగరవాసులు ఓటేయకుంటే రిగ్గింగ్‌కు అవకాశం నగరవాసుల ఓటింగ్ సరళిలోనూ మార్పు రావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోతే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రసంగాల కోసం.. సైన్యాన్ని అవమానిస్తారా..?సీఎం రేవంత్‌పై ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారతీయ సైన్యంపై చేసిన అవమానకర, దిగజారుడు వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘యూనిఫాం ధరించిన వీరులు సరిహద్దుల్లో అత్యంత క్రూరమైన పరిస్థితుల్లో కష్టపడుతుంటేనే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాం. ఎన్నికల ప్రసంగం కోసం భారతీయ సైన్యాన్ని తక్కువ చేసి పాకిస్తాన్‌ను పొగడటం ఏమిటి.. భారతీయ సైన్యానికి క్షమాపణ చెప్పి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నోట్ల కట్టలతో పట్టుబడిన వ్యక్తి గూండాలను, రౌడీ షీటర్లను ఆరాధించడం సహజమే. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. తెలంగాణ ప్రతినిధిగా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, సైనికులను గౌరవించాలి’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
మజ్లిస్ ముందు మోకరిల్లుతున్నాయ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్‌కు మోకరిల్లుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఇప్పుడు మజ్లిస్ కనుసన్నల్లో ఉందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు మజ్లిస్ ఓటు బ్యాంకే ముఖ్యంగా మారిందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల నుంచి జూబ్లీహిల్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితమైంది కాదని.. మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసేలా కీలకంగా మారిందని చెప్పారు. మజ్లిస్ సానుభూతిపరుల ఓట్ల కోసమే సోనియా, రాహుల్‌గాం«దీలు అజహరుద్దీన్‌ను మంత్రి పదవి కట్టబెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ అవకాశవాద రాజకీయాలపై కార్పెట్ బాంబింగ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట, రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదలను దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు, వివాహమైతే తులం బంగారం వంటి పథకాలను అమలు చేయాలంటూ ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని.. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ సొంత కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం పథకం కేవలం ప్రచారానికి వాడుకొని కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేశాయని పార్టీలకు ప్రజలు ఓటు వేయాలని కిషన్‌రెడ్డి నిలదీశారు. పాకిస్తాన్ అంటే వాళ్లకు ప్రేమ శత్రు దేశమైన పాకిస్తాన్‌పై కాంగ్రెస్ పార్టీ గురు, శిష్యులకు ప్రేమ ఎక్కువని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్‌ను చులకన చేసి భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పాక్‌కు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న బీజేపీకి ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. -
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/రహ్మత్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి రహ్మత్‌నగర్ డివిజన్లో నిర్వహించిన భారీ రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశతో సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయకుంటే అన్నీ రద్దుచేస్తామని ధమ్కీ ఇస్తున్నారని విమర్శించారు. ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు ప్రభుత్వమే పతనమయ్యే రోజు వస్తుందని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని రేవంత్‌రెడ్డి ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు. ‘గోపన్న లేడని, సునీతమ్మ ఆడబిడ్డ అని అనుకోవద్దు. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి. రౌడీలు సతాయిస్తే ఎట్లా అని అనుకోవద్దు. జనతా గ్యారేజ్ వంటి బీఆర్ఎస్ భవన్ పక్కనే ఉంది. మీరు ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వస్తా. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది’అని భరోసా ఇచ్చారు. గోపీనాథ్ కాపాడిన శివమ్మ పాపిరెడ్డి హిల్స్ స్థలంలో పెద్ద స్టేడియం కట్టించి ఆయన పేరు పెడతామన్నారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు సీఎం, మంత్రులు కాలికి బలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో రేవంత్‌రెడ్డిది పేగుబంధం సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధమైతే.. బీజేపీతో ఉన్నది పేగు బంధమని కేటీఆర్ ఆరోపించారు. బతికి ఉన్నప్పుడు ఆయన మామ జైపాల్‌రెడ్డిని బండబూతులు తిట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సెటిల్మెంట్లు చేసే బ్లాక్‌మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో రూపాయి ఆమ్దానీ లేకున్నా కేసీఆర్ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదని, ఇప్పుడు సీఎంకు కనీసం గురుకుల పాఠశాలలు నడపడం తెలియట్లేదని ఎద్దేవా చేశారు. సీఎం ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్కు భారీ విజయం దక్కబోతోందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు దేశపతి శ్రీనివాస్, మాగంటి సునీత, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బీఆర్ఎస్లో చేశారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. -
అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!
అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండు మూడేళ్ల గడువు ఉన్న సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉండే ప్రభావశీల వర్గాలు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మెలగడం చూస్తూనే ఉన్నాము. స్థానిక సమస్యల పరిష్కారానికి కదలిక వచ్చే అవకాశముంటుందన్న ఆశ సహజం కనుక అధికార పార్టీ వైపు కొంత మొగ్గు ఉంటుంది. అధికార దుర్వినియోగమనే ఆయుధాన్ని కూడా పాలకపార్టీలిప్పుడు యథేచ్ఛగా వాడేస్తున్నాయి.తెలంగాణలో మొన్నటి సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. అప్పటికే బీఆర్ఎస్ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం పరుచుకుంటున్న దశ అది. బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంలో గణనీయమైన పలుకుబడి ఉన్నది. అర్థబలం, అంగబలం కూడా ఆయనకు దండిగానే ఉన్నాయి. అయినప్పటికీ అధికార పార్టీకి ఉండే వనరుల దన్నుతో బలమైన రాజగోపాల్‌రెడ్డిని బీఆర్ఎస్ ఓడించ గలిగింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలే ఉన్న దశలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నది. పార్టీ తరఫున పదిమంది మంత్రులు, పలువురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు నియో జకవర్గ వ్యాప్తంగా జాతర చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు, నేటి ప్రజా ప్రభుత్వాలు తలుచుకుంటే డబ్బులకు కరువేముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బలమైన బీసీ వర్గం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు రౌడీషీటరా? సంఘసేవకుడా? అనే మీమాంసను పక్కనబెడితే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ అంతో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తే.సంఘ సేవకులకు మాత్రమే టిక్కెట్లిస్తామనే నియమాన్ని దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టుకోకపోవడం ఒక నయా వాస్తవి కత. రౌడీషీటర్, యాంటీసోషల్ వగైరా టైటిళ్లు బలహీన వర్గాలకు లభించినంత సులభంగా ఉన్నత వర్గాలకు లభించవు. అదేవిధంగా కొన్ని బిరుదులూ, సత్కారాలూ ఉన్నత వర్గాలకు లభించినంత తేలిగ్గా బలహీన వర్గాలకు దక్కవు. ఇదొక సామాజిక రీతి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వలసవచ్చిన ప్రజలు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం కనుక, దాదాపు లక్షమంది అపార్టుమెంట్లలో నివసిస్తున్న భద్రలోకులు కనుక రౌడీషీటర్ ప్రచారం వల్ల తమకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.మైసూర్ పాక్‌లో మైసూర్ ఉండదనే కుళ్లు జోకు తరహాలోనే హైదరాబాద్‌లోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, యూసఫ్‌గూడ, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ వంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు షేక్‌పేట, రహ మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి కార్మికులు, చిరుద్యో గులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు శాతం మంది ముస్లిం మైనారిటీలు. మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ ఉన్న సందర్భాల్లోనే ముస్లిం ఓటు కాంగ్రెస్‌కు పడే సంప్రదాయం ఉన్నది. రెండు సెక్యులర్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు ముస్లిం ఓటు ఏకపక్షంగా ఉండదు.జూబ్లీ హిల్స్‌లో బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్‌ల మధ్యనే నెల కొన్నట్టు ప్రచార పర్వంలో నిరూపితమైంది. ముస్లిం ఓటు కూడా ఏకపక్షంగా లేదని అర్థమైనందువల్లనే హఠాత్తుగా అజారుద్దీన్‌కు మంత్రిపదవి నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకున్నట్టు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ సంకల్పమైతే ఇంతకు ముందే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండేది. కొత్తగా ముగ్గుర్ని మంత్రివర్గంలోకి తీసుకున్న సందర్భంలోనే వారికే ప్రాతినిధ్యం కల్పించి ఉండేది. అలాకాకుండా ఉప ఎన్నిక పోలింగ్‌కు సరిగ్గా పది రోజుల ముందు అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కచ్చితంగా అనైతిక చర్యగానే భావించవలసి ఉంటుంది.అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటరు కాక పోవచ్చు. కానీ ఆ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన పార్టీ ప్రచార రంగంలో మైనారిటీ ఓటుపై భరోసా కనిపించకపోవడం వల్లనే ఇప్పుడు ఆదరాబాదరాగా మంత్రి పదవి కట్టబెట్టిందనే వాదనలో ఔచిత్యం కనిపిస్తున్నది. క్రీడారంగంలో దేశానికి అజర్ చేసిన సేవకు గుర్తింపుగానే ఆయనకు మంత్రిపదవి ఇచ్చినట్టు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో పస లేదు. అటువంటి గ్రహింపు కేవలం పోలింగ్‌కు పది రోజుల ముందే కలగడమేమిటనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు.ఆరు మాసాల్లోగా అజర్ భాయ్ శాసనమండలికో, శాసనసభకో ఎన్నిక కావలసి ఉన్నది. లేకపోతే ఈ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్‌గా ఆయనపై జీవితకాల నిషేధం కొనసాగుతున్నది. హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఉన్న కాలంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన క్రిమినల్ కేసును ఎదు ర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి కేంద్రం ఏ మేరకు సహక రిస్తుందనేది అనుమానమే. గడువులోగా ఏదో సభకు ఎన్నిక కానట్టయితే ‘దేశానికి అజర్ చేసిన సేవలకు’గాను ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అవమానించినట్టవుతుంది.మజ్లిస్ మద్దతు కారణంగా గుండుగుత్తగా పడే మైనారిటీ ఓట్లతో జూబ్లీ హిల్స్ గెలుపు తమకు నల్లేరుపై బండి నడకే కాగలదని కాంగ్రెస్ పార్టీ తొలుత భావించినట్టుంది. క్షేత్ర స్థాయిలో ఏదో తేడా కొట్టడంతోనే హడావిడిగా అసందర్భంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారనే అభిప్రాయం బల పడుతున్నది. బీజేపీ అభ్యర్థిని ప్రధాన పోటీదారుగా నియోజక వర్గ ప్రజలు భావించడం లేదు. అందువల్ల అక్కడ మతపరమైన పోలరైజేషన్ ఏమాత్రం కనిపించడం లేదు. ప్రధాన పోటీ దార్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్–బీఆర్ఎస్లు అభివృద్ధి ఎజెండానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఓటర్లు కూడా ఇదే ప్రాతిపదికన చీలుతున్నారు. ఇందులో మైనారిటీ, మెజారిటీ అన్న తేడాలేమీ కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం వల్లనో, ముంబైలో సల్మాన్‌ఖాన్‌తో ముఖ్యమంత్రి దిగిన ఫొటోలను సీఎమ్ఓ విడుదల చేయడం వల్లనో మైనారిటీలు ప్రభావితులయ్యే అవకాశాలు తక్కువ.ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సానుకూల స్పందనే ఉన్నది. అదే సందర్భంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అక్కడక్కడా మహిళలే నిలదీస్తున్న వార్తలు కూడా మీడియాలో రిపోర్టవుతున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండున్నర వేల గురించి అడుగుతున్నారు. తులం బంగారం సంగతేమిటని నిలదీస్తున్నారు. ‘మాకు స్కూటీలిస్తామన్నారు, ఇంకెప్పుడి స్తార’ని ఒకచోట పది మంది బాలికలు ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.ఉప ఎన్నికలకు ముందు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు కూడా! ఇది కాంగ్రెస్ అభ్యర్థికి మేలు చేసే అంశం. కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ముందు అక్కడ కాంగ్రెస్ వాళ్లు అనేక హామీలు గుప్పించి మోసం చేశారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళల టీమ్ ఒకటి జూబ్లీ హిల్స్‌లో విస్తారంగా ప్రచారం చేస్తున్నది. ఇటువంటి ఉదంతాలు కొన్ని స్వచ్ఛందంగా జరిగి ఉండవచ్చు. కొన్ని ప్రతిపక్ష పార్టీ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చు. ఎలా జరిగినా ఇవి కాంగ్రెస్ ప్రచారానికి ఇబ్బంది కలిగించే విషయాలే! కేసీఆర్ హయాంలో తమకు అందిన రంజాన్ తోఫా, షాదీ ముబారక్‌ల గురించి కూడా మైనారిటీ ప్రజలు గుర్తు చేస్తున్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గానికి జరిగిన లబ్ధిపై బీఆర్ఎస్ పార్టీ ఒక పత్రాన్ని విడుదల చేసింది. దానితోపాటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎగవేసిన అంశాలను ఉటంకిస్తూ ఒక బాకీ పత్రాన్ని కూడా ఆ పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇవి జనంలో చర్చనీయాంశాలుగా మారాయి. సినీ రంగంలో పనిచేసే కార్మికులు దాదాపు పది హేను వేలమంది వరకు ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి స్వయంగా ముఖ్య మంత్రే ఒక సభకు హాజరై, వారికి అనేక హామీలిచ్చారు. కానీ ఆ కార్మికులు సంతృప్తి చెందినట్లయితే కనిపించలేదు. పదివేల మంది వరకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి.గడచిన రెండేళ్ళలో మార్కెట్లో ద్రవ్య చలామణీ బాగా తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. దాని ప్రభావం అన్ని రంగాల మీద కనిపిస్తున్నది. జీఎస్టీ వసూళ్లలో, స్థిరాస్తి రిజి స్ట్రేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అథోముఖయానం దీన్ని ధ్రువీక రిస్తున్నది. కేసీఆర్ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో జనం పోల్చి చూసుకుంటున్నారు. ఈ రకంగా క్షేత్రస్థాయి నాడి కాంగ్రెస్‌కు అంత సానుకూలంగా ఏమీ లేదు. కానీ అధికార పార్టీగా దానికుండే బలాలను కూడా తీసిపారేయలేము. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్ల కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం వేసిన ఎత్తుగడ మిస్ఫైరయినప్పటికీ అందులోంచి ప్రయోజనం పొందడం కోసం ప్రయత్నాలను మానలేదు. నియోజకవర్గంలో విస్తృత సంబంధాలున్న కుటుంబాన్ని బరి లోకి దింపింది. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం పంపిణీ చేయడం కూడా కలిసొస్తుందని ఆ పార్టీ ఆశిస్తున్నది. కొత్తగా నియోజకవర్గంలో నలభై వేల రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే వెయ్యికి మించి పంపిణీ చేయలేదని తెలిసింది. ఇక డబ్బులు వెద జల్లడం, ప్రలోభాలకు తెరలేపడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి అనుకూలాంశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఏదో తెలియని అలజడి కనిపిస్తున్నది. ఓడిపోతే తర్వాత పర్యవసానాలెలా ఉంటాయోనన్న కలవరం ఆ శిబిరంలో నెలకొన్నది. ఉపఎన్నిక పోలింగ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉంది. ఆలోగా అధికార పార్టీకి అనుకూలంగా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మాపై దుష్ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పని చేస్తుంటే... బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మాపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ స్వార్ధ రాజకీయాల కోసం బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇప్పుడు కొత్త డైవర్షన్ డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా వక్రీకరించుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క ప్రధాన సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని, ఆపలేదన్నారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను రాజు కాదు అని ప్రజల సొమ్ముకు ధర్మకర్త మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత బీఆర్ఎస్ కు గానీ బీజేపీకి గానీ లేదన్నారు. ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగదని, జరగనివ్వమన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించే ముందు, పేదలకు పునరావాసం కల్పించాకే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అధికారుల అత్యుత్సాహాన్ని సహించమన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు. ప్రతిపక్షాల జూటా మాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టి.ఎం.ఆర్.పి.ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ టీజీఆర్ఎస్ఏ తదితర 9 దళిత సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథ్, ఎమ్మెల్యేలు విజయ రామరావు, మక్కన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
హీటెక్కిన పాలి'ట్రిక్స్'..
సాక్షి, హైదరాబాద్: అధికార, ప్రతిపక్షాల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంటింటి ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శనాస్త్రాలు గుప్పిస్తూనే.. నియమావళి ఉల్లఘనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పరంపర కొన సాగిస్తున్నాయి. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొనగా.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగినట్లయింది. మరోవైపు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్లో డివిజన్లవారీగా తిష్ట వేసి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అభివృద్ధి మంత్రం జపిస్తుండగా, విజయం సాధిస్తామని ధీమాతో బీఆర్ఎస్, పాగా వేసేందుకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. అందరి దృష్టి ఇక్కడే.. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు, సెలబ్రిటీలు, సంపన్నుల ఓట్లు కూడా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పక్షా లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊ హకు అందని విధంగా నిర్ణయాలతో ట్విస్టులపై ట్విస్టు లు ఇస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఏకంగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మాటా ముచ్చటా కార్యక్రమంతో టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించడంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలన విజయాలను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తోంది. రోడ్ షోలు అదుర్స్ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ శుక్రవారం రాత్రి పోటా పోటీగా నిర్వహించిన రోడ్ షోలు ఆ పారీ్టల శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన రోడ్ షోకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షో గులాబీవనాన్ని తలపించింది. నందినగర్‌లోని నివాసం నుంచి రోడ్ షోకు బయలుదేరేముందు పార్టీ మహిళా నేతలు కేటీఆర్‌కు హారతి పట్టారు. అడుగడుగునా గులాబీ జెండాలతో ఘన స్వాగతం పలికారు. వారి ఉత్సాహం చూసి కేటీఆర్ సైతం జెండా ఊపారు. ‘అందరూ బాగున్నారా. ‘కొడుతున్నామా జూబ్లీహిల్స్‌ను మళ్లీ. కేసీఆర్ నాయకత్వం వరి్ధల్లాలి’ అన్నారు. దీనికి స్పందిస్తూ జనం చేయి చూపడంతో అది చూపొద్దు. మొండిచేయి డేంజర్. పిడికిలి బిగించాలి అని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. -
ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా?
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పేదల ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్‌రెడ్డి సర్కారు హైడ్రా బుల్డోజర్తో వేల ఇళ్లు కూల్చిందని ఆరోపించారు. ఆ పేదల శాపాలే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉరితాళ్లై చుట్టుకుంటాయని దుయ్యబట్టారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పలుచోట్ల ఆయన రోడ్ షోలు నిర్వహించారు. తొలుత షేక్‌పేటలో ప్రచార వాహనం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 58, 59 కింద 1.5 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చిందని గుర్తుచేశారు. ఒక్క జూబ్లీహిల్స్లోనే 3,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు సరికదా పేదల ఇళ్లు కూలగొడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు డిపాజిట్ పోతేనే ప్రజలకు బాకీలన్నీ వస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయిన 4 కోట్ల మంది ప్రజల గోస తీర్చే అవకాశం 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి చిత్తుచిత్తుగా ఓడితేనే ప్రజలకు రావాల్సిన బాకీలన్నీ వస్తాయన్నారు. మైనారిటీలను ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని కేబినెట్‌ను కొనసాగించిన రేవంత్‌రెడ్డి.. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.బీఆర్ఎస్ కులమతాల పునాదులపై పనిచేయదని.. కానీ కాంగ్రెస్ ఆ పని చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డలు, వృద్ధులు, ఆటోడ్రైవర్లు సహా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ 420 హామీలిచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో ప్రజలకు రూ. 5 వేల చొప్పున ఇచ్చి ఓట్లు కొనేందుకు వస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలిచ్చే డబ్బు తీసుకొని ఆడపడుచులైతే మిగతా రూ. 55 వేలు ఏవని అడగాలని.. మిగతా వారు వారికిచ్చిన హామీలకు అనుగుణంగా మిగతా అప్పు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాడు అగ్రస్థానం.. నేడు అట్టడుగుకు.. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టిలో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ ప్రస్తుతం రేవంత్ సర్కారు పాలనలో అట్టడుగున 28వ ర్యాంక్‌కు పడిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిందని.. ఆటోవాళ్ల ఉపాధి దెబ్బతీయడం వల్ల 162 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. నగర ప్రజల్ని, గ్రామీణ రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ రెండేళ్ల పాలనను, పదేళ్ల కేసీఆర్ పాలనను చూసిన ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. -
‘మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే!’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తుండడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి గురువారం బీజేపీ ఫిర్యాదు చేసింది. అజారుద్దీన్ మంత్రి పదవి అంశంపై తెలంగాణ బీజేపీ బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీఈవోతో జరిగిన భేటీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ లీగల్ టీం పాల్గొంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నియామకాన్ని Model Code of Conduct (MCC) ఉల్లంఘనగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.ఈ అంశంపై బీఆర్కే భవన్ వద్ద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మంత్రివర్గ విస్తరణకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే పదవి కి పోటీ చేశారు. ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ అంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్లే. ఒక వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఆ వర్గం ప్రజలు ఇది గమనించాలి. కేవలం ఓట్ల కోసమే ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మినిస్ట్రీ ఇస్తున్నారు. ఎన్నికల లబ్ధి కోసమే మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ పాల్పడుతోంది. సీఎం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన విషయంలో సంబంధిత అధికారులకు ఈసీ నోటీసులు ఇవ్వాలి’’ అని అన్నారు..పాయల్ శంకర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఉల్లంఘించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ ఉండగా...ప్రకటన చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే. ఎలక్షన్ కోడ్ ఉండగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కోడ్ ఉల్లంఘించడమే. ఒక వర్గం ఓటర్లతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొక పది రోజులు ఆగితే మోడల్ కోడ్ కండక్ట్ ముగిసిపోతుంది కదా!. 20శాతం వర్గం మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను 80శాతం వర్గం ప్రజలు గమనిస్తున్నారు. CEO మంత్రి వర్గ విస్తరణ ను ఆపాలని కోరాం. జూబ్లీహిల్స్ ప్రాంత ఓటర్లకు ప్రభావితం చేసే ఏ నిర్ణయం తీసుకోవద్దు అని అన్నారు.కేటీఆర్ ఏమన్నారంటే.. మరోవైపు ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్లోకి తీసుకోవడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమేనని అన్నారాయన. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపదమొక్కులు మొక్కుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనం. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. అందుకే కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సరైన వేదిక అని కేటీఆర్ అన్నారు. అయితే అజారుద్దీన్ వ్యవహారంపై ఈసీని ఆశ్రయించే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. I guess desperate times call for desperate measures 😁After 2 years in Govt, looks like Congress party is finally waking up to ground realities Promising the moon to cine workers, inducting Azharuddin in cabinet and ministers desperately running around in Hyderabad Gullies…— KTR (@KTRBRS) October 30, 2025మాజీ ఎంపీ, గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్.. ఈ ఉప ఎన్నిక బరిలో నిలబడతారనే ప్రచారం ఉధృతంగా సాగింది. అయితే అనూహ్యంగా ఆయన్ని గవర్నర్ కోటా ద్వారా MLCని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో అజారుద్దీన్ నేడో, రేపో మంత్రిగా ప్రమాణం చేస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఉంటే.. ఎలక్షన్ కోడ్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారానికి ఈసీ అనుమతిస్తుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో?? చూడాలి. -
సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించడంతో పాటు, సుమోటోగా కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ కార్మికుల ఓట్లకోసం సన్మానాల పేరిట కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు అందజేశాం. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్‌ను తొలగించడంతో పాటు కేంద్ర పోలీసు బలగాలను మోహరించాలని కోరాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఇచి్చన ఫిర్యాదులో కోరాం. తనకు అడ్డువస్తే చంపేస్తానని నవీన్ యాదవ్ బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు’అని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. -
దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించినట్లు తెలిసిందని, ప్రజలు ఎలాగూ ఓటు వేయరని తెలిసి, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఈ నియోజకవర్గంలో 13 వేల దొంగ ఓట్లు సృష్టించారని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్‌కు చెందిన వారు ఎవరో ఒకరు ఓటు వేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన ‘మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం’లో కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రులు కొత్త వేషాలు వేసుకుని అభివృద్ధి చేస్తామని గల్లీ లీడర్లలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను అంగట్లో సరుకులా కొని ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆయన గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓటర్లు ఆలోచించాలని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క పని చేయలేదన్నారు. అభివృద్ధి నిధుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక్కరూ సంతోషంగా లేరు ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించడంతో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటూ.. పేదల కోసం ఒక్క ఇల్లు కట్టకున్నా హైడ్రా పేరిట బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చారు. యూసుఫ్‌గూడలో సన్మానం పేరిట ముఖ్యమంత్రే వెళ్లి సినీ కార్మికులతో శాలువాలు కప్పించుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట మోసగించారు. బడ్జెట్లో ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు పెడతామని, ఆ దిశగా రేవంత్ ప్రయత్నం చేయలేదు’అని కేటీఆర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేస్తోంది
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ జోరు పెంచించింది. మంగళవారం ఉత్తరాది తరహా కార్పెట్ బాంబింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, శ్రీనగర్‌కాలనీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నియోజకవర్గవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...‘గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి, దుర్మార్గపు పాలన పోవాలని, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. కేసీఆర్ రహదారులను అద్దంలా తయారు చేస్తా అన్నారు.బోరబండ, రహ్మత్‌నగర్, షేక్‌పేట్, శ్రీనగర్ కాలనీ, ఎక్కడైనా గంట పాదయాత్ర చేసి ఓట్లు అడగాలి’అని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. పేరుకే జూబ్లీహిల్స్ ఇక్కడ రోడ్డుపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలదే బాధ్యత కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్పోటీ చేస్తోందన్నారు. ఎంఐఎం నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్‌ను కబ్జా చేయడానికి మజ్లిస్ పార్టీ ప్రయత్నిస్తోందని చెప్పారు.ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో దీపక్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడానికి అది నాందిగా నిలుస్తుందన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, రెండేళ్లు కావొస్తున్నా హామీల అమలులో చిత్తశుద్ధి లేదని చెప్పారు. -
ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్న బీఆర్ఎస్ నేతలు
-
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఐదు ముక్కలవుతుందని అన్నారాయన. అంతేకాదు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి తగ్గ వ్యక్తి కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇంటికి బుల్డోజర్: కేటీఆర్
బంజారాహిల్స్/గోల్కొండ: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం తెలంగాణ హోటల్స్ కార్మీక యూనియన్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మీక నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనూ, అనంతరం జూబ్లీహిల్స్ ప్రచారంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ‘మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి అని చెప్పారు.. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది’అని అన్నారు. తుపాకీ రోహిన్‌రెడ్డి పెట్టిండా.. సుమంత్ పెట్టిండా అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్ట్ కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐఏఎస్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని, ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాలేదన్నారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని, పెద్దవాళ్లకు రూల్స్ ఉండవన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసునని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్లను గెలిపిస్తారా? అన్నారు. కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బుల్డోజర్ ఇంటికి వస్తుందన్నారు. మైనార్టీలకు ప్రాతినిధ్యమేదీ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతిని, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను చూసి ప్రజలు జూబ్లీహిల్స్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారి వచ్చిందన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి సెక్యులర్ ప్రభుత్వం అంటూనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారిగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఈ విషయంపై రాహుల్‌గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం స్వయంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రులకూ లేదని ఎద్దేవాచేశారు. జూబ్లిహిల్స్‌లో రౌడీ కుటుంబానికి చెందిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, లోపాయికారిగా ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుందని ఆరోపించారు. -
ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్‌కాలనీ: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడటం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.భారీ మెజారిటీకోసం కష్టపడాలని నేతలకు సూచించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులందరూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు ఉన్న బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ‘బీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు హైదరాబాద్ సమస్యలపై అవగాహన ఉంది.హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి’అని కేటీఆర్ సూచించారు. ప్రచారంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి సమస్యలను ఎత్తి చూపాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని పక్కన పెట్టి, కాంగ్రెస్ కేవలం రాజకీయాలకే పాల్పడుతోందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రజూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, ఈ నియో జకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో షేక్‌పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేశ్‌తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
గల్లా పట్టి నిలదీయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్‌ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇజ్జత్ (గౌరవం) ఉంటుందా? రౌడీషీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవంతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను ఓటర్లు కాపాడుకుంటారనే నమ్మకం ఉంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై అవగాహన కల్పించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించేలా కష్ట పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లి నివాసంలో గురువారం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ అభ్యర్థి గెలుపు, భారీ మెజారిటీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పెద్దలను గల్లా పట్టి నిలదీయాలి ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నిలిచిపోవడం గురించి ఇంటింటికీ తిరిగి వివరించండి. హైడ్రా పేరిట బుల్డోజర్లను పేదల గుడిసెల మీదికి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మానవీయ కోణంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ నుంచి కళ్యాణలక్ష్మి వరకు పథకాలు నిలిచిపోవడానికి కారకులైన కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలి. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం, కానీ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండివుంది. ప్రజల చేతిలో పైసలు ఆడక పరేషాన్లో ఉన్నారు. రెండేళ్లు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేసింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అని తెలంగాణ సమాజం స్పష్టతతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారు. భారీ మెజారిటీ సాధించేలా ప్రజలతో కలిసి పనిచేయడం మీ బాధ్యత’అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా పతారా (పరపతి) ఉంటేనే అతార (డిమాండ్) పెరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గురించి ప్రజలు ఆలోచించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక చార్టును తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు. ఎర్రవల్లి నివాసంలో నేతల సందడి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితోపాటు ఉప ఎన్నికలో పార్టీ తరపున డివిజన్, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రచారం చేస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసం సందడిగా మారింది. సమావేశానికి వచ్చిన నేతలను కేసీఆర్ పేరు పేరునా పలకరించారు. పార్టీ అభ్యర్థి వెంట ప్రచారంలో ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. -
‘జూబ్లీహిల్స్’పై నేడు కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారపర్వంపై దృష్టి కేంద్రీక రించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ డివిజన్ ఇన్ చార్జ్‌లు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. గురువారం జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్ దిశానిర్దే శం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, ఓటరు మనోగతం తదితరాలపై చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్టు తెలిసింది.బహిరంగ సభకు విముఖత: ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విస్తృత ప్రచారానికి అవలంబించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దృష్టి సారించారు. నగరంలో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాల జోలికి వెళ్లకుండా డివిజన్ల వారీగా హాల్ మీటింగ్స్, కార్నర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్లకు చేరువయ్యేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్టీ బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించేలా షెడ్యూల్ రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రచారం చివరిదశలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఫిరాయింపుల విచారణ తిరిగి షురూ!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం హైదరాబాద్‌కు చేరుకుంటారు. బార్బడోస్, ఫ్రాన్స్, లండన్, ఇటలీలో స్పీకర్‌తోపాటు మండలి చైర్మన్, వైస్ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శితో కూడిన ప్రతినిధి బృందం 18 రోజుల పర్యటన అనంతరం రాష్ట్రానికి చేరుకుంటోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గత నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ సెప్టెంబర్ 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని బీఆర్ఎస్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌఖిక, లిఖిత పూర్వక వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఈ నెల 4 వరకు ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.మరో నలుగురి విచారణకు షెడ్యూల్?పది మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా నలుగురికి సంబంధించిన విచారణ షెడ్యూల్‌ను మాత్రమే స్పీకర్ గతంలో ప్రకటించారు. మరో నలుగు రు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకటరావుపై బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై నెలాఖరులోగా స్పీకర్ విచారణ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కోర్టు విధించిన అక్టోబర్ 30 గడువులోగా విచారణ పక్రియ ముగిసే అవకాశం కనిపించడం లేదు.మరోవైపు స్పీకర్ నోటీసు లు అందుకున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తమ వివరణ ఇచ్చి ఉంటే సంబంధిత కాపీలు తమకు అంది ఉండేవని బీఆర్ఎస్ శాసనసభాపక్షం వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కోరాలనే యోచనలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్లు సమాచారం. -
బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు రెడీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పార్టీకి చెందిన 40 మంది ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గుప్తా ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రచార వాహనాల పాస్‌లు మంజూరు చేసింది. ఈసీ అనుమతి పొందిన స్టార్ క్యాంపెయినర్లు వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించేలా అనుమతి ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇంకా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, వి.ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఉన్నారు. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్‌జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు, ఎల్.రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రచారంలో పాల్గొంటారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్దన్‌రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, నేతలు రావుల శ్రీధర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, అబ్దుల్లా సోహైల్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. -
రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పండి
శేరిలింగంపల్లి/బండ్లగూడ: (హైదరాబాద్): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారుకు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు కోరారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి లింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్షాకోట్లో హైడ్రా కూల్చివేతల బాధితుల దీపావళి పండుగలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..బస్తీల ప్రజలకు ఇబ్బంది కలగవద్దని, గడప దగ్గరలోనే వైద్య సేవలు అందించేలా రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. అందులో 350 బస్తీ దవాఖానాలను ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేస్తే, ఇప్పుడు వాటిని నిర్వీర్యంగా మార్చారు. కనీసం బీపీ మీటర్లు కూడా పనిచేయడం లేదు. గతంలో బస్తీ దవాఖానాలలో 134 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తూ 110 రకాల మందులు అందించే వాళ్ళం. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటికి సుస్తీ పట్టింది. ప్రస్తుతం 60 నుంచి 70 రకాల మందులే ఇస్తున్నారు. 40 రకాల మందులు సరఫరా చేయడం లేదు. వైద్య పరీక్షలు కూడా అన్నీ జరగడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి. సీఎం సొంత నియోజకవర్గంలోనే 108 సర్వీస్ సకాలంలో రాక, వైద్యం సకాలంలో అందక మనిషి ప్రాణం పోయింది..’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు ‘ఆస్పత్రులలో కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్ల 20 శాతం ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలి వెళుతున్నారు. రూ.1,400 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండగా.. వాటిని చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా మారిందో అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ బీజేపీతో కలవదు. మాది లౌకిక పార్టీ. కానీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నగరంలో పేదల ఇళ్లు కూల్చడం ఆగాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రేవంత్‌రెడ్డి నయా నరకాసురుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వారికి కునుకు లేకుండా చేస్తోంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బస్తీ దవాఖానాల్లో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేశారని రేవంత్‌రెడ్డి అనుకుంటాడు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటెయ్యాలి. హైదర్షాకోట్ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు తమకు అండగా ఉండాలని కోరారు. మీ కష్టాల్లో అండగా ఉన్నది బీఆర్ఎస్ పారీ్టయే..’అని హరీశ్‌రావు చెప్పారు. పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
‘‘కేసీఆర్‌పై కోపంతో..’’ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీష్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు.AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్‌రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్‌కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్‌పై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్ విమర్శించారు. -
కమీషన్ల కోసం మంత్రుల కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టులు, బిల్లులు మొదలుకొని అన్ని పనుల్లో కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడు కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి దాట వేత «ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే రద్దు చేసి హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తన సొంత భూముల కోసం సీఎం రేవంత్ ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జూబ్లీహిల్స్ నేత అంజిబాబుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.కసరత్తు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు‘ఎలాంటి కసరత్తు చేయకుండానే రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో దొంగ పోరాటాలు చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలి. ఢిల్లీలో జరిగే ప్రయత్నాలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో ఓటర్లు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.ప్రజలు బాధ పడుతున్నారు.. సబిత: ప్రతీ సందర్భంలో ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని, దేవుడి పాలన కోల్పోయామని జూబ్లీహిల్స్ ప్రజలు బాధ పడుతున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు మెట్రో పనులు ప్రారంభించడంతోపాటు 111 జీవో నుంచి విముక్తి కలిగిస్తామని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రకటించారు.పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండరాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ అండగా నిలిచారు. కుట్టుపని ద్వారా జీవనోపాధిపొందుతున్న అర్చనకు పారా త్రోబాల్ క్రీడలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్ షిప్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అర్చన ఆదివారం కేటీఆర్‌ను కలవగా, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు. -
బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విష్ణు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.అయితే, సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది. -
ఆ రెండు పార్టీలు తలచుకుంటే ఆపేదెవరు?
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతు న్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీసీ రిజర్వేషన్ల పెంపుదలను ఎవరు ఆపగలరు? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీల బలం ఉన్నా బీసీలను మభ్య పెడుతూ ఢిల్లీలో కొట్లాడకుండా గల్లీలో డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్పుడు కులగణన చేయని కాంగ్రెస్, నాలుగేళ్లుగా జనగణనను వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ.. బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు మంత్రిత్వ శాఖను కోరిందే కేసీఆర్: కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కేసీఆర్ కోరా రని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో రెండు సార్లు తీ ర్మానం చేయడంతో పాటు ప్రధానిని కూడా స్వయంగా కలిశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వే షన్లు కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవే టు బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. -
గులాబీ సైన్యమంతా ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారపర్వంలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఓటరును కలవడం లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సుమారు 60 మంది క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు. స్థానిక కేడర్‌తో సమన్వయంజూబ్లీహిల్స్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డివిజన్లలో సంపూర్ణంగా, మరో మూడు డివిజన్లలో పాక్షికంగా విస్తరించి ఉంది. యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్‌పేట, బోరబండ డివిజన్లు పూర్తిగా, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ డివిజన్లు పాక్షికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. డివిజన్ వారీగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. వీరు స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన 60 మంది ముఖ్యనేతలకు మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ముఖ్యనేత తమతోపాటు వచ్చిన అనుచరులతో కలిసి తమకు కేటాయించిన బూత్‌లలో ప్రచారం చేస్తున్నారు. అలాగే, బయటి నుంచి సుమారు వేయి మంది జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి నేతలు ప్రచారానికి తరలివచ్చినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బూత్‌ల వారీగా ముఖాముఖి సమావేశం నిర్వహించి ఇన్‌చార్జీలకు ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. భారీగా నకిలీ ఓటర్లు నమోదయ్యారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఓటరు జాబితాను వడపోస్తూ అసలైన ఓటర్లను చేరుకోవాలని భావిస్తోంది.సాదాసీదాగా నామినేషన్నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా సాగేలా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఈ నెల 19న మరో సెట్ దాఖలు చేయనున్నారు. 19న భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు రోడ్ షోలు, హాల్ మీటింగ్స్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మంత్రులు వారి పంచాయితీలు చెప్పుకోవడానికే క్యాబినేట్ మీటింగ్‌లు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం (అక్టోబర్ 17) తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ మాట్లాడుతూ.. ‘మంత్రులు గ్రూపులుగా విడిపోయారు. దంళుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా మారింది. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే క్యాబినెట్ మీటింగ్. కేసీఆర్ ఢిల్లీలో తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాటా, నీళ్ల వాటాను సాధించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి కమీషన్లు.కాంట్రాక్టుల వాటాల కోసం కొట్లాడుతున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనతో అతితక్కువ ఇండస్ట్రీలు వచ్చాయి. టీఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత పరిశ్రమల రాక సంఖ్య పెరిగింది.మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యాత ఇచ్చాం. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు గురి పెడుతున్నారు. గన్ కల్చర్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓటర్ల జాబితాపై జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై బీఆర్ఎస్ అభ్యర్థి సమర్పించిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించినందున తమ జోక్యం అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల నమోదు, తొలగింపు నిరంతర ప్రక్రియ అని, ఈ నెల 21 వరకు సమయం ఉన్నందున సరైన చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అత్యంత అనివార్యమైతే తప్ప న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రస్తావించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూసుకోవాలని సుప్రీం హెచ్చరించిందని వ్యాఖ్యానించింది. ఇక ఈ పిటిషన్లో ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విచారణ ముగించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లతోపాటు బయటి వ్యక్తుల పేర్లు చేర్చారంటూ మాగంటి సునీతతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలేంటంటే... పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘బీఆర్ఎస్ అభ్యర్థి ఈసీ అధికారిక వెబ్సైట్ నుంచి ఓటర్ల జాబితాను తీసుకున్నారు. నియోజకవర్గంలో 12 వేల బోగస్ ఓట్లతోపాటు బయటి వ్యక్తులు జాబితాలో ఉన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ తో కుమ్మక్కైన ఈసీ ఓటర్ల జాబితా సమగ్రతను దెబ్బతీసేలా ఎన్నికల దురి్వనియోగానికి పాల్పడింది. బోగస్ ఓట్లు తొలగించి.. నవంబర్ 11న ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఈసీని ఆదేశించాలి’అని చెప్పారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుంది. ఈ నెల 21న నామినేషన్లు పూర్తయ్యే వరకు సవరణకు అవకాశం ఉంది. జాబితాపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. సెప్టెంబర్ 2న ఈసీ విడుదల చేసిన ప్రాథమిక జాబితా ప్రకారం 3.92 లక్షల ఓటర్లున్నారు. సవరణల తర్వాత 6,976 మందిని కొత్తగా చేరగా, 663 మందిని తొలగించారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30న ప్రచురించాం. మొత్తం ఓటర్ల సంఖ్య 3.99 లక్షలు. జాబితాపై ఓటర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. 12వేల బోగస్ ఓట్లు చేర్చారన్న వాదన సమర్థనీయం కాదు’అని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ చర్యలు ప్రారంభించినందున ప్రత్యేక ఉత్తర్వులు అనవసరం లేదని పేర్కొంది. పిటిషనర్లు తమ ఫిర్యాదుపై చర్యలకు వేచిచూడకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పింది. -
మాగంటి సునీత ఆస్తులివే..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయగా..తన ఆస్తుల వివరాలు అఫిడవిట్లో పొందుపరిచారు. ఈ మేరకు ఆమె వద్ద 4097 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే చేతిలో నగదు 38,800 రూపాయల నగదు ఉండగా మూడు బ్యాంకు ఖాతాల్లో కలిసి సుమారు 32 లక్షలు, బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారు వెండి ఆభరణాలు మొత్తం కలిపి 6,18,54,274 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముగ్గురు పిల్లల పేరిట షేర్లు, ఆభరణాల విలువ సుమారు రూ.4.62 కోట్లుగా పేర్కొన్నారు. సిరాస్తులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 34 లో ఓ ప్లాటు, గోపనపల్లిలో ఓ ప్లాటు ఉన్నట్లు, వీటి మొత్తం విలువ 6.11 కోట్ల రూపాయలు, పిల్లల పేరిట 8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా సునీత పేరిట రూ.4.44 కోట్లు అప్పు ఉండగా, పిల్లల పేరుపై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమెపై ఎన్నికల నియామావళి ఉల్లంఘించినందుకు గతవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర
బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లో జరిగే ఉప ఎన్నిక పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదని పదేళ్ల అభివృద్ధి పాలనకు, రెండేళ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండేళ్ల రాక్షస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారన్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని, రాష్ట్రంలో మరోసారి గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతోందని చెప్పారు. బుధవారం తమ పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరే ముందు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. గోపీనాథ్ విశేష సేవలందించారు‘లక్షల మంది రైతన్నలు, నిరుద్యోగులు సునీత గెలవాలని కోరుకుంటున్నారు. తమ ఇళ్లు కూలగొట్టడం లాంటి అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలకు అడ్డుకట్ట పడాలని నగర పేదలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాద్‌లో కట్టలేదు.. కానీ నగరంలో కేసీఆర్ కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ ప్రజలకు గుర్తున్నాయి. బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్ని విషయాల్లో మోసపోయామని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గుర్తించారు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడానికి వారితో పాటు మైనారిటీలు కూడా సిద్ధంగా ఉన్నారు. దళితబంధు, అభయహస్తం అమలుకాక దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రతిఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్. ఆయన అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆయన సతీమణి సునీతకు టికెట్ కేటాయించారు. రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతిఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి..’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా సునీత గోపీనాథ్ బుధవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కేటీఆర్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఈనెల 18న బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు
-
నేడు మాగంటి సునీత నామినేషన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నా రు. హంగూఆర్భాటానికి తావు లేకుండా తొలిసెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామి నేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.కాగా మాగంటి సునీత మంగళవారం ఎర్రవల్లి నివా సంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేతుల మీదుగా సునీత బీఫామ్‌ను అందుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున సునీతకు రూ.40 లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు ఉన్నారు. -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీపై నేడు హైకోర్టుకు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓటర్లను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. డూప్లికేట్ ఓటర్ల నమోదు ద్వారా అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా విశ్వసనీయత ప్రశ్నార్థకమైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ఓట్ చోరీకి సంబంధించిన రుజువులను తమ పార్టీ కార్యకర్తల సహకారంతో రెండు రోజుల వ్యవధిలోనే ప్రజల ముందు పెట్టామన్నారు. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఓటరు జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలపై మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు దాటినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అసాధారణంగా ఓట్లు పెరిగాయ్.. ‘తెలంగాణ ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలి. బిహార్‌లో ఓటు చోరీ జరిగితే తెలంగాణలో ఓట్ల చోరీ ద్వారా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో నీతి సూక్తులు వల్లె వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కింది అధికారులతో కుమ్మక్కైన అంశాన్ని రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకొని ఇక్కడ జరిగిన దొంగ ఓట్ల అంశంపై స్పందించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 23వేల ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం చెబుతోంది. మరో 12వేల ఓట్లు తొలగించామని చెబుతున్నా అసాధారణంగా ఓట్లు పెరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి అక్రమంగా ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కిందిస్థాయి అధికారులను కాంగ్రెస్ ఉపయోగించుకుందనే అనుమానం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్న తర్వాత స్వేచ్ఛగా ఎన్నిక జరుగుతుందని ఎలా అనుకోవాలి. ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
Jubilee Hills by Election: బీఆర్ఎస్ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మొదటి రోజైన సోమవారం ప్రధాన రాజకీయపారీ్టలేవీ నామినేషన్లు దాఖలు చేయలేదు. పోలింగ్‌కు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రచారాల్లో మునిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. దీంతో, తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టకోవడమే కాక, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పేందుకు ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే తలంపులో బీఆర్ఎస్ ఉంది. గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే తమ అభ్యర్థిగా అందరి కంటే ముందే ప్రకటించిన బీఆర్ఎస్, ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించగా, తాజాగా సోమవారం రహ్మత్‌నగర్‌లో పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలుపు ఇప్పటికే ఖాయమైందని, ఎక్కువ మెజార్టీ పొందడమే ముందున్న లక్ష్యమని కార్యకర్తలను ప్రోత్సహించారు. అనంతరం కేటీఆర్, అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో భారీ యెత్తున దొంగ ఓట్లు చేర్చిందంటూ ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఓవైపు పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. మరోవైపు బస్తీల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ నియోజకవర్గాల్లోని వారి సహకారం కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి తదితరులను కలిసి ఎన్నికలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవడంతో బహిరంగంగా ప్రచార కార్యక్రమాలేవీ లేనప్పటికీ, లోపాయికారీగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల తొలిరోజు దృశ్యాలిలా ఉండగా, మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశాక ప్రచార కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. -
పట్టుకోసం బీఆర్ఎస్.. పాగా వేయాలని కాంగ్రెస్..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పారీ్టకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్‌గా మారగా, ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టలు తమ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, ఇంకా బీజేపీ అభ్యరి్థని ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనకబడి ఉంది. ఈఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్లకు నువ్వా..నేనా..! అన్నట్లుగా మారడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వేడెక్కుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా సానుభూతితో గెలవాలని బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యరి్థగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. ఇక స్థానికుడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ యువనేత వి.నవీన్యాదవ్ను అభ్యరి్థగా ప్రకటించింది. నేడో రేపో భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,549 (43.9 శాతం)ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 64,212 (35 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 25,866 (14.1 శాతం) ఓట్లు, ఎంఐఎం అభ్యరి్ధగా పోటీ చేసిన మహ్మద్ రాషేద్ పరాజుద్దీన్కు 7,848 (4.2 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా..? కాంగ్రెస్‌దే పై‘చేయి’ అవుతుందా? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నవీన్.. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్‌యాదవ్‌కు 41,656 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన మాగంటి గోపీనాథ్ పైనే పోటీ చేశారు. తాజాగా మూడోసారి మాగంటి భార్యతో పోటీ పడుతున్నారు. -
ఢిల్లీ కాంగ్రెస్‌కు సెగ తగలాలి: కేటీఆర్
రహమత్‌నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపించే కాంగ్రెస్ పార్టీకి, ప్రజల మేలు కాంక్షించే కారు పార్టీకి మధ్యే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ కావాలో, హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చేయడమే ఎజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సెగ తగిలేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. రహమత్‌నగర్ డివిజన్ క్వారీ మైదానంలో సోమవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరాన్ని ‘హైడ్రా’బాద్‌గా మార్చి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్చోరీ అంటుంటే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీయే ఓట్‌చోరీకి పాల్పడిందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లను చేర్చిందని ఆరోపించారు. ఇదే మోకా.. బీఆర్ఎస్ కార్యకర్తల కసి, పట్టుదల, తపన పార్టీ విజయానికి నాంది కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నవారు సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ధోకా తిన్న తెలంగాణకు ఇవాళ మోకా వచి్చంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలి. గులాబీ జెండా రెపరెపలాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలి’అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వృద్ధులకు రూ.48 వేలు, పెళ్లి అయిన ఆడబిడ్డలకు తులం బంగారం, మహాలక్ష్మి కింద మహిళలకు రూ.40 వేల చొప్పున బాకీ ఉందని అన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అందులో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కొడితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్ల వరకు అందరి చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల వైపే ఉందని కేటీఆర్ అన్నారు. ‘ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమా? ఎంతో మంది నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్ గెలిస్తే ఏమీ ఇవ్వకున్నా గెలిచామని, ప్రజలు తనకే ఓట్లు వేస్తారని సీఎం రేవంత్ అనుకుంటారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. గలీజ్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని, ఇంత దివాళాకోరు సీఎంను ఎక్కడా చూడలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సునీత గెలుపు ఖాయం: హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖాన వైద్యులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేశారు. ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు ఖాయమే. భారీ మెజారిటీ కోసమే మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన దివంగత మాగంటి గోపీనాథ్.. నియోజకవర్గ అభివృద్ధితో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన ఆశయాలు నేరవేర్చాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని హరీశ్‌రావు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నేతలు వద్దిరాజు రవిచంద్ర, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కౌషిక్ రెడ్డి, వేములు ప్రశాంత్‌రెడ్డి, ముఠా గోపాల్, మల్లారెడ్డి, వివేకానంద్‌గౌడ్, సుధీర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, దాసోజు శ్రవణ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సునీత కంటతడి.. ఓదార్చిన సబిత ఎస్పీఆర్ హిల్స్‌లో సోమవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో తన భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్న నాయకులు మౌనంగా ఉండిపోయారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునీతను ఓదార్చారు. -
నికర జలాలు పోయేట్లు ఉన్నాయ్.. బనకచర్లపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే.. ఇక్కడి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణాకు ప్రమాదంగా మారబోతోంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్‌కు ఇరువై రోజుల క్రితం లేఖ రాశారు. సీడబ్యూసీ(CWC) నిబంధనల ప్రకారం నికర జలాల మీదే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వరద జలాలపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఇస్తారు?.. రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా ? సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా ?. 112 టీఎంసీల నీళ్లు ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. పైన కృష్ణా, కింద గోదావరి జలాలు పోతే తెలంగాణ పరిస్థితి రెంటికి చెడిన రేవడిగా మారుతుంది. ఫ్లడ్ వాటర్ తో ప్రాజెక్ట్ కట్టుకోవాలనుకుంటే తాము కూడా ప్రాజెక్ట్ కట్టుకుంటామని మహారాష్ట్ర అంటోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. పోలవరం రైట్ కెనాల్ ద్వారా 11 వేల 500 క్యూసెక్కుల కెపాసిటీ కేంద్రం అనుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 23 వేల క్యూసెక్కుల కెపాసిటీతో కాలువలకు ఎలా టెండర్లు పిలిచారు ?. కాలువలు తవ్విన టీడీపీ ది తప్పు అయితే బీజేపీ ఎందుకు కళ్ళు మూసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు కనీస బాధ్యత లేదా ?. అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే కేంద్ర మంత్రులు ఎందుకు పెదవులు మూసుకుంటారా?. చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతోంది. బీజేపీ తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ఒక విధంగా, ఇతర రాష్ట్రాలకు మరో రకంగా వ్యవహరిస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు?. అటు కేంద్రం పట్టించుకోదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదుకేంద్ర మంత్రి లేఖ రాసి ఇరువై రోజులు అయ్యింది.. కర్ణాటక లేఖ రాసి రెండు వారాలు అవుతుంది. ఇంకోవైపు మహారాష్ట్ర మరోవైపు లేఖ రాసింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. వరద జలాలే కాదు.. నికర జలాలు పోయేటట్లు ఉన్నాయి. వరద జలాల మీద ప్రాజెక్ట్ ఎలా కడతారు అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?. కేంద్ర మంత్రి, కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలు అబద్దమా?. ఢిల్లీ వెళ్లి ఎందుకు రేవంత్ కొట్లాడడం లేదు?. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్.. కృష్ణా జలాలు ఆపుతామని అంటే పిల్లిలా మారారా?. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఖర్గే, సిద్దరామయ్యతో ఎందుకు మాట్లాడం లేదు?. కనీసం రాహుల్ గాంధీతో ఫోన్ కూడా చేయించలేకపోతున్నారా?.రేవంత్ రెడ్డి బ్యాగులు మోయడమే కాదు తెలంగాణ బాగోగులు కూడా పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని హరీష్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ఆ కండిషన్‌తో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చట! -
బీఆర్ఎస్, బీజేపీలే అడ్డుకున్నాయి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అడ్డుకున్నాయని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో గురువారం గాం«దీభవన్‌లో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2018లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ 50 శాతం మించకుండా చట్టం చేసిందని, అదే ఉరితాడుగా తయారైందని అన్నారు. 2019లో ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కులగణన చేసి జీవో ఇచ్చేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ఎంపిరికల్ డాటా అవసరమని హైకోర్టు చేసిన సూచనతోనే ప్రభుత్వం సైంటిఫిక్‌గా అధ్యయనం చేసి జీవో 9 తీసుకొచ్చిందన్నారు. బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపితే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం దానిని చట్టం కాకుండా నిలిపివేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కొని బీసీల నోటికాడి ముద్దను దూరం చేశాయన్నారు.రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ఆలోచన: మహేశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను గౌరవిస్తుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన తరువాత పరిశీలించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ కుటిలయత్నాలు చేస్తున్నాయని, అడుగడుగునా బీసీలను అణగదొక్కిన పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం పొన్నం, జూపల్లి, వాకిటి శ్రీహరి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. చట్టపరంగా, న్యాయపరంగా బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి.. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి.. బీసీ బిల్లుకు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్‌కు పంపించామని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం బాధాకరమని జూపల్లి అన్నారు. బీసీలకు నోటికాడికి వచ్చిన ముద్ద లాగేసినట్లు చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణలోని బీసీలంతా ఆలోచించాలని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. -
Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికలు క్లిష్టంగా మారాయి. పార్టీ మారామని చెప్పుకోలేని పరిస్థితి ఓవైపు.. కొత్త కండువా వేసుకుని తమ అనుచరులకు మద్దతుగా ప్రచారం చేయలేని పరిస్థితి మరోవైపు వీరిని ఇబ్బంది పెడుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసు, స్పీకర్ విచారణ ఇరకాటంలోకి నెట్టాయి. సంస్థాగతంగా పట్టుకోసం తమ అనుచరులను జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా బరిలోకి దించేందుకు ఇప్పటికే అధిష్టానానికి పలు పేర్లను సిఫార్సు చేసినప్పటికీ.. అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వద్ద వీరిద్దరూ సీఎం సమక్షంలో కండువా కప్పుకొన్న ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వీరు స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్తే న్యాయస్థానంతో పాటు స్పీకర్‌కు నేరుగా సాక్ష్యం అందించిన వారవుతారనేది అక్షర సత్యం. అభివృద్ధి కోసం అటుఇటు..! చేవెళ్ల నియోజకవర్గంలో మెయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లితో పాటు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాలున్నాయి. జిల్లా పరిధిలో నాలుగు జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ, 109 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రాజకీయ ప్రస్థానం తన సొంత మండలమైన నవాబుపేట నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. అనంతరం 2014లో అదే పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అధికార బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంపై పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 2024లో కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కారు దిగి.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించడం, బంతి స్పీకర్ కోర్టులోకి నెట్టడం, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ సదరు ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. నెత్తిన అనర్హత కత్తి వేలాడుతున్న నేపథ్యంలోనే విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. జెడ్పీ పీఠం కోసం.. ఈసారి జిల్లా పరిషత్ పీఠాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడం తన నియోజకవర్గంలోని షాబాద్ ఎస్సీ మహిళకు, చేవెళ్ల, శంకర్పల్లి మండలాలు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో షాబాద్ లేదా చేవెళ్ల నుంచి తన కోడలిని నిలబెట్టి జెడ్పీ చైర్పర్సన్ సీటు దక్కించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్న ట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ కండువా వేసుకుని నేరుగా ప్రచారం చేయలేని సంకటం ఎదురైంది. ప్రకాశ్గౌడ్దీ ఇదే పరిస్థితి.. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట మండలాల్లోని రాజేంద్రనగర్ మండలం పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లింది. గండిపేటలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు లేవు. కేవలం శంషాబాద్ మండలంలోనే స్థానిక సంస్థలున్నాయి. ఇక్కడ 21 గ్రామ పంచాయతీలు, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సైతం రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి వరకు తనను నమ్ముకుని, వెంట వచి్చన అనుచరులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఒకవేళ వీరికి అవకాశం వచి్చనా నేరుగా ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి.. ఎవరీ నవీన్ యాదవ్..?
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. కాంగ్రెస్ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది . గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి.. ఎన్నికల బరి నుంచి తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. గత ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయింది. రెండుసార్లు పోటీ ⇒ ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ⇒ ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. ⇒ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు అవకాశం దక్కినట్లయింది. మజ్లిస్ మద్దతు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మజ్లిస్ దూరం పాటిస్తున్న కారణంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల్లో యువనేతను ఎన్నుకోవాలని పిలుపునివ్వడం, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించడంతో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి మంత్రంతో విజయావకాశాలను సుగమం చేసుకున్నా.. అభ్యర్థిత్వం ఖరారులో మాత్రం మజ్లిస్ పార్టీ జోక్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లను కాదని యువనేతకు అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది. -
తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. సెప్టెంబర్ 29న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేసింది. -
జూబ్లీహిల్స్ కోసం బీఆర్ఎస్ వార్ రూమ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార వ్యూహం అమలు, పార్టీ నేతలు, ప్రచార బృందాల నడుమ సమన్వయం తదితరాల కోసం ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. వార్ రూమ్ ఇన్చార్జిలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వ్యవహరిస్తారు. ఈ నెల 12 నుంచి క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పండితుల సూచనల మేరకు మంచి ముహూర్తం చూసుకుని మాగంటి సునీతా గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డివిజన్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి తదితరులతో పాటు మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కూడా హాజరయ్యారు. నేడు, రేపు బూత్ కమిటీలతో భేటీలుబీఆర్ఎస్ ప్రచార బృందాల పనితీరు, రోడ్ షోలు, రోజూ వారీ ప్రచార షెడ్యూలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. వార్ రూమ్ నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా ప్రచార వ్యూహానికి పదు ను పెట్టాలని నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో బూత్ కమిటీలతో డివిజన్ ఇన్చార్జిలుగా వ్యవహరి స్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలు నిర్వ హించి ప్రచార వ్యూహాన్ని వివరిస్తారు. ఈ నెల 10 వ తేదీలోగా బూత్‌కమిటీల సమావేశాలు పూర్తి చేసి 12వ తేదీ నుంచి ప్రచార పర్వంలో అడుగు పెట్టా లని కేటీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగని పక్షంలో ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలను కూడా ఉప ఎన్నిక ప్రచారంలో భాగస్వాములను చేస్తారు. ప్రచారం ముగింపులో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
బూత్‌ల వారీగా ప్రచార బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు మంగళవారం భేటీ అయ్యారు. నందినగర్ నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో పార్టీ పరంగా అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బుధవారం హైకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పక్షంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. బూత్‌లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు ప్రతికూలంగా స్పందిస్తే ఇతర ప్రాంత నేతలకు కూడా జూబ్లీహిల్స్‌లో పార్టీ తరపున బాధ్యతలు అప్పగించే అవకాశముంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చిన రీతిలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇతర జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ప్రచార పర్వంలో మోహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.నేడు మరోమారు భేటీజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు బుధవారం బీఆర్ఎస్ కీలక నేతలు మరోమారు భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఒకరిద్దరు కీలక నేతలు కూడా పాల్గొంటారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందున ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, హాల్ మీటింగ్స్ ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ షెడ్యూల్‌పై చర్చిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశముంది.ఆర్టీసీ ప్రైవేటీకరణకు యత్నంఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఇన్నోవేటివ్ థింకింగ్’ పేరిట ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఫ్రీ టికెట్ ఇస్తూ భర్త నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని, అలాగే పిల్లల బస్‌పాస్‌ల రేట్లు పెంచారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చార్జీల పెంపు ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటోందని విమర్శించారు. చార్జీల పెంపుతో ఒక్కో కుటుంబంపై 20 శాతం మేర అదనపు భారం పడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంటూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తోందన్నారు. హైదరాబాద్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కనందునే ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు చార్జీలు పెంచిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చార్జీల పెంపునకు కాంగ్రెస్ పార్టీ ప్రతిఫలాన్ని అనుభవిస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. -
ఉప ఎన్నికకు సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రసవత్తర రాజకీయ పోరుకు తెరలేచింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు దీనిపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండేందుకే ఎక్కువ అవకాశం ఉంది. సిట్టింగ్ పార్టీ బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ బరిలో ఉండే అవకాశాలున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక, ఎంఐఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ లెక్కలు మారతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటోన్మెంట్‌ను కైవసం చేసుకున్నట్టే.. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. ఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యరి్థని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ యాదవ్‌ల పేర్లను పరిశీలిస్తోంది. అయి తే ఏఐసీసీకి పంపిన జాబితాలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు ఉండటం గమనార్హం. రేసులో ‘కారు’జోరు నియోజకవర్గంలో ఉన్న పార్టీ సంస్థాగత బలంతో పాటు, మాగంటి గోపీనాథ్ కుటు ంబంపై ఉన్న సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న ఎంతో కొంత వ్యతిరేకత సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేలా చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు చేయడం ద్వారా మిగిలిన పక్షాల కంటే ముందంజలో ఉంది.పార్టీ సీనియర్ నేతలతో పలు దఫాలుగా భేటీ అయిన కేసీఆర్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. తాజాగా షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కీలక భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుమారు నెల రోజుల నుంచే పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసే పనిలో ఉన్నా రు. ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసే ందుకు ఆరు డివిజన్లకు పార్టీ ఇన్చార్జిలను ఇప్పటికే నియమించారు. హైదరాబాద్‌లో సత్తా చాటేందుకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో సత్తా చాటేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని, హిందూత్వ ఎజెండాతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ బలహీనతలను ఆసరాగా చేసుకుని జూబ్లీహిల్స్‌పై కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఆశపడుతున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకెల దీపక్‌రెడ్డితో పాటు, అట్లూరి రామకృష్ణ, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, బండా రు విజయలక్ష్మీ, సినీనటి జయసుధ, ఆకుల విజయ పోటీ పడుతున్నారు.ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యరి్థని ప్రకటించనున్నట్టు సమాచారం. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడంతో ఈ ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంఐఎం కార్యాచరణపై మాత్రం ఇంతవరకు స్పష్టత రావడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమైన మజ్లిస్ ఈసారి ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీపీఐ, సీపీఎం, జనసమితిలు అధికార కాంగ్రెస్ వైపే నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. విచారణ వాయిదా వేసిన స్పీకర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన విచారణ వాయిదా పడింది. నేడు నలుగురు ఎమ్మెల్యేలను విచారిస్తామని ప్రకటించిన స్పీకర్, చివరికి ఇద్దరినే విచారించారు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తిప్పి తిప్పి ప్రశ్నలు అడగడంతో సమయం పూర్తయ్యింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణకు తగిన సమయం లేకపోవడంతో, విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ రోజు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్యల విచారణ పూర్తయింది. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విచారణ వాయిదా పడింది. -
స్థానిక పోరులోకి పార్టీలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. మెజారిటీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలనే లక్ష్యంతో కసరత్తు ముమ్మరం చేశాయి. జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తోపాటు సర్వ శక్తులూ కూడదీసుకుంటున్నాయి. ఇతర పార్టీలు సైతం ఎన్నికలపై దృష్టి నిలిపాయి. 70–80 శాతం సీట్లు గెలిచేలా..స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో కనీసం 70 నుంచి 80 శాతం స్థానాలు సాధించి మిగతా పార్టీలపై ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, కచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో పార్టీ ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ ఎన్నికల కోసం జిల్లాకు ఒక పరిశీలకుడిని నియమించనున్నారు. ఎన్నికల పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు తీసుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ బలపరిచేవారిని గెలిపించే పూర్తి బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలపైనే మోపేందుకు అధిష్టానం సిద్ధమైంది.ఈ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జిల్లా కమిటీలను వేసి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ, సాదా బైనామాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన తదితరాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోనుంది. గత బీఆర్ఎస్ పాలన తీరును ఈ ఎన్నికల్లో ఎండగడతామని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి స్థానిక అంశాలపై కూడా ప్రధానంగా దృష్టిపెడతామని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైనే బీఆర్ఎస్ ఫోకస్ గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను లేవనెత్తి, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని ప్రజలకు చూపించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ భావిస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లెల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటే, కాంగ్రెస్ వాటన్నింటినీ నిర్లక్ష్యం చేసిందని ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యూహంతోమంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసాన్ని ముఖ్యనేతలు వ్యక్తంచేస్తున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే ఎన్నికల కసరత్తు చేపట్టేలా టెలి కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలవారీగా ఇతర పార్టీల నుంచి వచ్చిన అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకోవటంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్ర పథకాలపైనే ఆశలు స్థానిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా కేంద్ర పథకాలపైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశంగా భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించింది. మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది.కేంద్ర పథకాల వల్ల తెలంగాణకు వివిధ రూపాల్లో లభించిన ప్రయోజనాలు, వివిధ శాఖలు, రంగాలకు సంబంధించి అందిన సహాయం గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ముఖ్య నాయకులు హైదరాబాద్‌కు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయని బలంగా ప్రచారం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. -
పల్లెల్లో ‘స్థానిక’ సందడి
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టిన అన్ని పార్టీల నేతలు, మరోవైపు తాము పోటీ చేయాలనుకునే స్థానాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆర్థిక వనరులను, మందీ మార్బలాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు. మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 9న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలై, నవంబర్ 11న ఫలితాల వెల్లడితో ఈ ప్రక్రియ ముగియనుండడంతో.. దాదాపు నెల రోజులు అభ్యర్థులకు ఖర్చుల మోత మోగిపోతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దసరా, ఆ తర్వాత దీపావళి పండుగల మధ్యలో ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో విందు భోజనాలు, మందు పార్టీల జోరుతో ఎన్నికల హడావుడి పతాకస్థాయికి చేరడం ఖాయమని అంటున్నారు. తొలుత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ముందుగా రాజకీయ పార్టీల గుర్తులపై రెండు దశల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరగనుండడంతో.. ఆయా సీట్లలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయా స్థానాలకు ముందుగానే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆ మేరకు ఓటర్లకు చేరవయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీకి ఎంపిక చేసుకున్న స్థానాల్లో ప్రజలను కలుసుకోవడం, పలానా స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టుగా వారికి తెలిసేలా ప్రాథమిక ప్రచార నిర్వహణపై దృష్టి పెడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో ముందుగా రాజకీయ పార్టీల జిల్లా స్థాయి నాయకత్వాలను ఒప్పించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు ఎంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుందోనని అంచనాలు వేసుకుంటున్నారు. ఎలాగైనా టికెట్ సాధించి రాజకీయంగా ఎదగాలనే తమ కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇలావుండగా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీని అమలుపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రెండు స్థానాలకూ పోటీ చేయొచ్చు! ఒక అభ్యర్థి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు రెండింటికీ ఏకకాలంలో పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలను బట్టి తెలుస్టోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకే మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎలాంటి అవకాశం ఉండదు. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారు ఆ జిల్లాలోని గ్రామీణ ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లా ఓటరుకు జిల్లాలోని ఏ జెడ్పీటీసీ స్థానం నుంచి అయినా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసే వారు సంబంధిత మండలం ఓటరై ఉండాలి. ఆ ఓటరు ఆ మండలంలోని ఏ ఎంపీటీసీ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు (రిజర్వేషన్ స్థానం వర్తింపును బట్టి) అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు పూర్తై ఉండాలి ⇒ నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి 21 ఏళ్ల వయసు పూర్తిచేసుకుని ఉండాలి ⇒ ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేయాలంటే.. తెలంగాణకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించిన ఏదేని ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందినవారై ఉండాలి. ఎస్టీలు ఏ వర్గానికి రిజర్వ్ కాని సీటు (జనరల్)కు కూడా పోటీ చేయొచ్చు. ⇒ ఎస్సీలు, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన ఏదైనా సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ వర్గాల వారు కూడా ఏ విధంగానూ రిజర్వ్ కాని స్థానాలకు పోటీ చేయొచ్చు. ⇒ మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లలో వారే పోటీ చేయాలి. జనరల్ కేటగిరీ సీటుకు కూడా మహిళలు పోటీ పడొచ్చు. శిక్ష పడితే అనర్హులు ⇒ క్రిమినల్ కోర్టు ద్వారా శిక్ష పడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు అనర్హులు. శిక్ష ముగిసిన తేదీనుంచి ఐదేళ్ల పాటు అనర్హత వర్తిస్తుంది. ⇒ 1955 పౌరహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం శిక్ష పడినవారు కూడా అనర్హులు. ⇒ 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 22, 23, 24 సెక్షన్ల ప్రకారం అనర్హులై ఉండకూడదు. ⇒ మతస్థిమితం లేనివారు, చెవిటి లేదా మూగవారు అనర్హులు ⇒ దివాలా తీసిన లేదా దివాలా నుంచి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించినవారు లేదా అందుకు (ఇన్సాల్వెన్సీ) దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులు. ⇒ మండల, జిల్లా పరిషత్ లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా చేపట్టిన ఏదైనా పనికి సంబంధించిన కాంట్రాక్ట్ పొందినవారు, అందులో భాగస్వామ్యం ఉన్నవారు అనర్హులు. ⇒ ఏదైనా పారితోషికం పొందుతూ గ్రామ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న వారు అనర్హులు. ⇒ 1973 నేర శిక్షా స్మృతి ప్రకారం మేజిస్ట్రేట్‌గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు అనర్హులు. ⇒ ప్రస్తుతం లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి బకాయి పడి, ఆ బకాయి చెల్లించాలని బిల్లు/నోటీస్ ద్వారా తెలియజేసినా నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వారు అనర్హులు. ⇒ గ్రామ సహాయకునిగా (వీఆర్ఓ)గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిగా కానీ లేదా స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఏదైనా సంస్థల్లో ఉద్యోగిగా ఉన్నవారు అనర్హులు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో కార్యవర్గ సభ్యుడిగా ఉండకూడదు. ⇒ అవినీతికి పాల్పడినందుకు కేంద్రం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగింపబడిన వారు తొలగించిన తేదీ నుంచి అయిదేళ్ల వరకు పోటీకి అనర్హులు. ⇒ గతంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పిచనందుకు, సరైన పద్ధతిలో సమర్పించనందుకు ఎన్నికల సంఘం ద్వారా అనర్హులుగా ప్రకటించినవారు పోటీకి అనర్హులు. బ్యాంకు ఖాతా తెరవాల్సిందే.. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు వివరాల నిమిత్తం ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలి. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒకరోజు ముందుగా ఈ ఖాతా తెరిచి ఉండాలి. నామినేషన్ దాఖలు సమయంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఈ బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేయాలి. ఆ ఖాతానుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చు చేయాలి. అభ్యర్థి తన సొంత నిధులతో పాటు ఎన్నికల కోసం ఇతరుల నుంచి వచ్చే నిధులను కూడా ఈ ఖాతాలోనే జమ చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. తమ రోజువారీ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలు చూపించాలి. అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలను పర్యవేక్షించే బాధ్యతను ఎంపీడీఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అప్పగించింది. -
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును ఆపుతావా?
సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తోందని, నల్లమల పులిగా చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఆల్మట్టి పనులు ఆపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ రోడ్‌షో నిర్వహించిన అనంతరం జరిగిన జనగర్జన బహిరంగసభలో మాట్లాడారు. ఆల్మట్టి నిర్మాణంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచే పోరాటం సాగిందన్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం రూ.70వేల కోట్లతో ఆల్మట్టి ఎత్తును 5 మీటర్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇదే జరిగితే కృష్ణానది నుంచి పాలమూరుకు ఒక్క చుక్కనీరు కూడా రాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి పనులు ఆపాలని కోరారు. నల్లమల పులిగా గర్జిస్తారా? లేక పిల్లిలా ఇంట్లో కూర్చుంటారా? సీఎం రేవంత్ తేల్చుకోవాలన్నారు. అప్పుడే ఆయన నల్లమల పులో లేక నక్కో తేలుతుందని చెప్పారు. రాహుల్‌గాంధీ తనను సీఎం పదవి నుంచి ఎప్పుడు తీసేస్తాడోనన్న భయంతో రేవంత్ గడుపుతున్నారన్నారు. కేసీఆర్‌కు పేరొస్తదనే పాలమూరు ముట్టుకోవడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి కాగా, మిగిలిన 10 శాతం పనులను సీఎం రేవంత్ రెండేళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఈ ప్రాజెక్టును ముట్టుకోవడం లేదన్నారు. చరిత్రలో ఏ సీఎం ఇంత హీనంగా మాట్లాడలేదు గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ వంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఏనాడూ సీఎం రేవంత్ తరహాలో హీనంగా మాట్లాడలేదని కేటీఆర్ చెప్పారు. గుడ్లతో గోటీలాడుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంటానంటూ గలీజు మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రం దివాలా తీసిందని, కేన్సర్ పేషెంట్లా ఉందంటూ, తనను కోసినా రూపాయి రాదంటూ మాట్లాడటం ఆయన చిల్లర బుద్ధికి నిదర్శనమన్నారు.స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అచ్చంపేటలో ఎమ్మెల్యే ఓడినా కేసీఆర్ గెలుస్తారని ఇక్కడి ప్రజలు అనుకున్నారని, రాష్ట్రమంతా ఇలాగే అనుకునే మోసపోయారని కేటీఆర్ చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. గత ఏడాది మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు చేసి నోట్ల కట్టలు దొరికాయని వార్తలు వచ్చాయని, ఇప్పుడు ఈడీ, మంత్రి ఎవరూ నోరు విప్పడం లేదని చెప్పారు. దీనిని బట్టే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తెలుస్తోందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. సభలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డితోపాటు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు
సాక్షి, హైదరాబాద్: కాలం కలిసివచ్చి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కారణజన్ములు కాలేరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుని దర్పంతో కారణజన్ములుగా తమకుతామే భావించారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాల్సినవారు తమ కుటుంబ సంక్షేమం, కుటుంబ సభ్యుల ఉపాధి మాత్రమే చూసుకున్నారని ఆరోపించారు.పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. ఒక్క గ్రూప్–1 ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం ఆ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 19 నెలల్లోనే ఏకంగా 562 గ్రూప్–1 ఉద్యోగాలు భర్తీచేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు శిల్పకళావేదికలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు. నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో నరేందర్‌రెడ్డి, కేశవరావు, జూపల్లి, పొంగులేటి, రామకృష్ణారావు, పొన్నం, శ్రీహరి, జితేందర్ తదితరులు తెలంగాణ ఇక్కడే ఉంది.. ఉంటది.. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండుసార్లు నమ్మి అధికారాన్ని కట్టబెడితే నమ్మక ద్రోహం చేశారని బీఆర్ఎస్పై సీఎం మండిపడ్డారు. వాళ్లు ఇప్పుడు నమ్మక ద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ‘తెలంగాణ ఎక్కడుందంటూ కొందరు అప్పుడప్పుడు విమర్శిస్తున్నారు. వారికి నేను చెబుతున్నా... తెలంగాణ ఎక్కడికీ పోలేదు. ఇక్కడే ఉంది.. ఇక్కడే ఉంటది. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఏ పల్లెకు వెళ్లినా తెలంగాణ స్ఫూర్తి ఉట్టిపడుతుంది. యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, యాదిరెడ్డిలాంటి వాళ్ల త్యాగాలను గత పాలకులు అపహాస్యం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అర్హత లేనివారిని పబ్లిక్ సర్విస్ కమిషన్‌లో సభ్యులుగా నియమించారు.సరైన జ్ఞానం లేనివారిని నియమిస్తే వారు రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసు ఉద్యోగులను ఎలా భర్తీ చేస్తారు. అందుకే అప్పట్లో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో కనిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. పారదర్శకతతో పరీక్షలు నిర్వహించాం. కొంతమందికి అది నచ్చలేదు. కడుపునిండా విషం పెట్టుకుని రేవంత్‌రెడ్డి రూ.2 కోట్లు, రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని సిగ్గులేకుండా ఆరోపణలు చేశారు.అలాంటి వ్యాఖ్యలను నేను ఏమాత్రం పట్టించుకోకుండా మీ భవిష్యత్ కోసమే పోరాడా. నాడు అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు... నాకు నిరుద్యోగుల భవిష్యత్ మాత్రమే కనిపించింది. మీరంతా తెలంగాణ మోడల్. కోచింగ్ సెంటర్ల కుట్రను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏళ్ల తరబడి సెంటర్ల చుట్టూ తిరిగి ఇప్పుడు ఉద్యోగాలు అందుకుంటుంటే కొందరు రూ.లక్షలు ఫీజు ఇచ్చి కేసులు వేస్తున్నారు’అని విమర్శించారు జీడీపీలో మన వాటా పది శాతానికి పెంచుదాం తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక నమూనాగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడుతున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఎకానమీ రూ.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ధీమా వ్యక్తంచేశారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 నుంచి 10 శాతానికి పెరిగేలా అభివృద్ధి చేస్తున్నామని, అందరం కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దామని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కొత్త గ్రూప్–1 అధికారులకు సూచించారు. ‘మీ భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏమాత్రం సహించబోము. నిర్దాక్షిణ్యంగా మీ జీతాల్లోంచి పది శాతం కోత పెట్టి వారి ఖాతాలో జమచేస్తాం. ఈ మేరకు త్వరలో చట్టాన్ని తీసుకువస్తాం’అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మేధాశక్తిని ప్రపంచానికి చాటుదాం: భట్టిప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అజేయంగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్లలో కూడా ఇంతపెద్ద సంఖ్యలో గ్రూప్–1 ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేయలేదని చెప్పారు. ఈ గ్రూపు–1 పరీక్షల్లో వ్యవసాయ కూలీ బిడ్డ మొదలుకొని, పంచర్లు వేసే కుటుంబానికి చెందిన బిడ్డలు కూడా ఉన్నతాధికారులుగా నియమితులు కావడం ఎంతో షంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 22,500 కోట్లతో లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదవారి కలలు నెరవేరుస్తోందని అన్నారు.యువత మేధాశక్తిని ఉపయోగించుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రపంచంతో పోటీపడే స్థాయికి యువత మేధాశక్తిని తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.అక్క, బావ ప్రోత్సాహంతోనే.. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ కేన్సర్‌తో మృతి చెందింది. నాన్న వ్యవసాయానికి దూరమయ్యాడు. అన్నయ్య ఆటో నడిపిస్తున్నాడు. అక్క పుష్పలత, బావ వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి రాగలిగాను. 2017లో బీటెక్ పూర్తి చేశాను. 8 ఏళ్లుగా గ్రూప్–1 కోసం చదువుతున్నా. ఇప్పుడు 142వ ర్యాంకు వచ్చింది. డీఎస్పీగా ఉద్యోగం వచ్చింది. గతంలో పేపర్ లీకేజీల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇటీవల ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు మమ్మల్ని బాధించాయి. నా కుటుంబ నేపథ్యం చూస్తే ఉద్యోగం కొనటం సాధ్యమయ్యేదేనా? – ఆంజనేయులు, చోడంపల్లి, నార్కట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లానా విజయం చూడకుండానే నాన్న చనిపోయారు చిన్నప్పటి నుంచి చదువులో నేను టాపర్నే. ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. జేఎ న్టీయూ హైదరాబాద్‌లో గోల్డ్ మెడల్ సాధించా. సివిల్స్ లక్ష్యంగా ప్రిపేర్ అయ్యాను. ఐదేళ్లు ఇంట్లోనే ఉండి సొంతంగానే చదువుకున్నాను. గ్రూప్స్–1లో 39వ ర్యాంకు సాధించాను. డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. నన్ను ఎంతగానో ప్రోత్సహించే మా నాన్న గత ఫిబ్రవరిలో చనిపోయారు. నా విజయం చూడకుండానే ఆయన దూరమైనందుకు బాధగా ఉంది. ఆయన లెగసీని పూర్తి చేసేందుకు సర్విస్‌లో డెడికేటెడ్‌గా పనిచేస్తాను. -మోక్షిత, ఇటిక్యాల, పుల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా.నేను ఐఏఎస్ కావాలన్నది నాన్న కోరిక మా నాన్న సురేశ్ ఉపాధ్యాయుడు. నేను ఐఏఎస్ కావాలన్నది ఆయన కోరిక. ఆయనే నా ఇన్స్పిరేషన్. బీఏ పూర్తి చేశాక యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాను. ప్రిలిమ్స్ 3 సార్లు రాశా. గ్రూప్–1లో 270 ర్యాంకు వచ్చింది. ఈ మధ్య మాపై వచ్చిన ఆరోపణలు బాధించాయి. అందరూ నిజాయితీగా ఉద్యోగాలు సాధించారు. ఎట్టకేలకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాను. చాలా సంతోషంగా ఉంది. – గడ్డం నాగవైష్ణవి, భూపాలపల్లి -
కాంగ్రెస్, బీఆర్ఎస్కు బీజేపీ ఫోబియా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బీజేపీ ఫోబి యా పట్టుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎంతో సహా ప్రతి ఒక్కరు బీజేపీపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి పనిచేశారని, ప దవులు పంచుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వారు బీజేపీకి నీతులు, కథలు చెప్పాల్సిన పనిలేదన్నారు. కాశేళ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సీబీఐ పరిశీలిస్తోందని, త్వర లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు అభివృద్ధి, విస్తరణ పనులపై ఆయనతో చర్చించారు. అనంతరం తన నివాసంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 26 ప్రాజెక్టులు డీపీఆర్ స్టేజ్‌లో ఉన్నాయని.. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎప్పుడు ప్రాజెక్టులు పూర్తవుతాయనే వివరాలు వెల్లడిస్తామన్నారు. రేవంత్ వ్యవహారం సరిగాలేదు.. ‘మెట్రో విస్తరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని సమంజసంగా లేదు. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ముందు వరుసలో నేనుంటాను. నేను కానీ, కేంద్రం కానీ మెట్రో రాకుండా అడ్డుకోవడం లేదు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విషయంలో అందరికంటే ముందే మేం చురుగ్గా వ్యవహరించాం. ట్రిపుల్ ఆర్కు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నప్పుడు చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతాయి. మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీన్ని వారే తేల్చుకోవాలి. మెట్రో విషయంలో అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది’అని కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.30,425 కోట్లతో 1,174 కిలోమీటర్లకుపైగా జాతీయ రహదారులు ‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ సంవత్సరం.. కొత్తగా 767 కిలోమీటర్ల మేర రూ.29,555 కోట్లు విలువైన వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనుంది. దీనికి అదనంగా ఈ సంవత్సరం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఐఆర్ఎఫ్) కూడా మంజూరయ్యాయి. తెలంగాణలో 422 కిలోమీటర్ల సీఐఆర్ఎఫ్ రోడ్డుకు రూ.868 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం కలిపి 1,174 కిలోమీటర్లకు గానూ.. రూ.30,425 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు తెలంగాణలో ప్రారంభమవుతాయి. హైదరాబాద్–శ్రీశైలం రోడ్డు మార్గంలో భక్తులు, పర్యాటకుల సౌకర్యం కోసం.. 4లేన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్, కల్వకుర్తి మధ్యలో 4లేన్ కావాలని అడిగాం. దానిపై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పారు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
అలైన్మెంట్ అడ్డగోలు మార్పుతో తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రీజినల్ రింగు రోడ్డు(ట్రిపుల్ ఆర్) అలైన్మెంట్ మార్పుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రీజినల్ రింగు రోడ్డు మూలంగా ఎవరికీ నష్టం జరగకుండా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాం«దీతో ఎన్నికల ముందు హామీలు ఇప్పించారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచిపోయిందని మండిపడ్డారు. రీజినల్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పుతో నష్టపోతున్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు సంగారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు.మాజీమంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలైన్మెంట్ మార్పుతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి వ్యవసాయరంగాన్ని సుభిక్షం చేశాం. గతంలో భూసేకరణ సమస్యలు ఎదురైనప్పుడు మా ప్రభుత్వం నేరుగా రైతులతో చర్చలు జరిపి పునరావాసం కల్పించడంతోపాటు శాశ్వత పరిష్కారాలు చూపించింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు విషయంలోనూ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అలైన్మెంట్లు మార్చి పేదల, రైతుల జీవితాలను ఆగం చేస్తోంది’అని కేటీఆర్ ఆరోపించారు.ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుతో నష్టపోతున్న వారికి బీఆర్ఎస్ అండగా నిలవడంతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. అలైన్మెంట్ శాశ్వతంగా జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఐకమత్యం ప్రదర్శించాలి. గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దిగి వస్తాయి’అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ అనేది ‘జనతా గ్యారేజ్’.. అని రైతులు ఎప్పుడైనా తెలంగాణ భవన్‌కు వచ్చి న్యాయ నిపుణులను సంప్రదించవచ్చన్నారు. -
‘నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారు’
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అసంబ్లీ సెక్రటరీని కలిశారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 22వ తేదీ) మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..పార్టీ ఫిరాయిచిన ఎమ్మెల్యేలపై అదనపు సమాచారమిచ్చారు. అఫిడవిట్ రూపంలో సెక్రటరీకి సమాచారమిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ నియోజక వర్గ ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారు. వారికి సంబంధించి అన్ని ఆధారాలు సెక్రటరీకి సమర్పించాము. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తారని కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. సోయి జ్ఞానంతో మాట్లాడాలి. స్పీకర్ నిర్ణయం ఏదైనా ప్రజల దృష్టిలో వారెంటో అర్థం అయింది. ఉప ఎన్నికలు రావటం ఖాయం...పార్టీ మారిన ఎమ్మెల్యేలు మట్టి కరవటం ఖాయం. బిఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఫిరాయింపుల చట్టం వచ్చింది. ఫిరాయింపులు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ. ఫిరాయింపులకు కారణం కాంగ్రెస్, బీజేపీలే’ అని ధ్వజమెత్తారు. -
‘నిన్న గాజులరామారం.. రేపు బోరబండ బస్తీపైకి హైడ్రా బుల్డోజర్లు’
సాక్షి, హైదరాబాద్: సెలవు దినాల్లో కూల్చివేతలు చేయొద్దని హైడ్రాకు హైకోర్టు స్పష్టంగా చెప్పిందని.. అయినా హైడ్రా ఆ ఆదేశాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన తాజా పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఆదివారం ఎందుకు కూల్చివేస్తున్నారు?. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారు, రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు... హైడ్రా బూల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు. ముఖ్యమంత్రి సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ తదితరులు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల పైన ఇళ్లు కట్టినా వారిని కూల్చివేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే. మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారు. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది అని కేటీఆర్ అన్నారు. -
యువతను విస్మరిస్తే ఉద్యమాలు
సాక్షి, హైదరాబాద్: యువత ఆకాంక్షలను విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని అంటుతుండగా పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ మందిర్– మస్జిద్ పేరిట ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని మండిపడ్డారు.ముంబైలో శనివారం సాయంత్రం జరిగిన ‘ఎన్డీటీవీ యువ 2025’సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ‘దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రధాని మోదీ గాలికొదిలేశారు. చైనా, జపాన్‌తోపాటు అమెరికా వంటి పశ్చిమ దేశాలను అధిగమించే ప్రయత్నం చేయకుండా మనకంటే వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జెన్ జీ శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు ‘ప్రస్తుత తరం యువత (జెన్–జీ) కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కాకుండా సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలి. జెన్ జీ శక్తిని పాలకులు తక్కువగా అంచనా వేయొద్దు. తెలంగాణలో 400 ఎకరాల అటవీ భూమిని అమ్మే ప్రభుత్వ ప్రయత్నాలు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటంతో నిలిచిపోయింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత రాజకీయాల్లోకి వచ్చి భవిష్యత్తు నిర్ణేతలు కావాలి. దేశంలోని యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అణుబాంబు దాడితో సర్వనాశనమైన జపాన్ కేవలం 23 ఏళ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించింది’అని కేటీఆర్ గుర్తు చేశారు. పదేళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ‘గడిచిన పదేళ్లలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతోపాటు అమెజాన్¯ అతిపెద్ద క్యాంపస్, అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ వంటివి తెలంగాణలో సాధ్యమయ్యాయి. ఇదే రీతిలో మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయింది. మనదేశంలోని 38 కోట్ల జెన్–జీ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. ప్రస్తుతం తెలంగాణలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చి (రీకాల్) చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ను గెలిపించుకోనందుకు (రిగ్రెట్) బాధపడుతున్నారు. త్వరలోనే అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే (రివోల్ట్)కు అవకాశం ఉంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రహదారి భద్రతా సెస్ పేరుతో ప్రజలపై భారం వేస్తారా?: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రహదారి భద్రతా సెస్ పేరుతో ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు భారం వేయాలని చూడటం పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని దగా చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే.. వాటిని అమలు చేయాల్సింది పోయి వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ఏమిటని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పైసా పైసా కూడబెట్టుకుని, లేదా అప్పు చేసి వాహనాలు కొనుగోలు చేసే పేద, మధ్యతరగతివారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు కాంగ్రెస్ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలని, రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
డివిజన్ల భేటీలు.. నేతలకు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్ : బిహార్ శాసనసభ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీతో నవంబర్‌లో ఎన్నిక జరుగుతుందని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ ఉప ఎన్నిక దిశగా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయ డంపై దృష్టి సారించింది. ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మున్సిపల్ డివిజన్ల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక భేటీలు నిర్వహిస్తున్నారు.బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యేలోపు పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించాలని కేటీఆర్ ఆదేశించారు. మైనారిటీ ఓటర్లకు చేరువయ్యేందుకు డివిజన్ల వారీ గా కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ‘ఓట్ చోరీ’ఎక్కువ మొత్తంలో ఉంటోందనే అనుమానంతో ఓటరు జా బితాలోని ప్రతీ ఓటరు పూర్వాపరాలను పరిశీలించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీ వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున సమన్వయకర్తను నియమించడంపై కసరత్తు జరుగుతోంది.నిరంతర సర్వేలతో మదింపుఉప ఎన్నికలో సొంత పార్టీ బలంతోపా టు ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్, బీజేపీ బలాబలాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు బీఆర్ఎస్ క్రమానుగత సర్వేలు నిర్వ హిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనే అంశంపై నిర్వహించిన అంతర్గత సర్వేలో మాగంటి సునీత అభ్యరి్థత్వం వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో సునీత అభ్యరి్థత్వాన్ని కేసీఆర్ దసరా తర్వాత ప్రకటించనున్నా రు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ 43.94% ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 35.03%, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి 14.11%, ఎంఐఎం అభ్యర్థి ఫరాజుద్దీన్ 4.28% ఓట్లు సాధించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు 50,83%, బీజేపీకి 36.65%, బీఆర్ఎస్కు 10.43% ఓట్లు పోల య్యాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటును ఒడిసి పట్టేలా కార్యాచరణకు బీఆర్ఎస్ పదును పెడుతోంది.మాగంటి భార్య సునీతకే అవకాశం!దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఆయన సోదరుడు వజ్రనాథ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి అభ్యరి్థత్వాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. చివరకు మాగంటి భార్య సునీత అభ్యరి్థత్వానికే కేసీఆర్ మొగ్గు చూపడంతో క్షేత్రస్థాయిలో ఆమె చురుగ్గా పర్యటిస్తున్నారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న డివిజన్ల వారీగా పార్టీ సమావేశాల్లోనూ సునీత పాల్గొంటున్నారు. మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కూడా తల్లి వెంట డివిజన్లలో పర్యటిస్తూ సోషల్ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు.పార్టీ కేడర్‌ను ఉప ఎన్నిక దిశగా సన్నద్ధం చేయడంతోపాటు ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లకు పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు (రహమత్‌నగర్), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (యూసుఫ్‌గూడ), దాసోజు శ్రవణ్ (షేక్‌పేట) డివిజన్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ (బోరబండ), ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి (వెంగళరావునగర్), కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (ఎర్రగడ్డ) డివిజన్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. -
వీడిన సస్పెన్స్.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణిని అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రకటన చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హైదరాబాదులో మాత్రం బీఆర్ఎస్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్ను అన్ని స్థానాల్లో గెలిపించారు. ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చింది. అందరూ ఆమెను ఆశీర్వదించండి అని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
‘ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు ముడుపుల రేవంత్‌రెడ్డి’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నడపడం లేదని సర్కస్ నడుపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ జరిపారు. ఈ చిట్‌చాట్‌లో.. త్వరలోనే పాదయాత్ర ఉంటుంది. పబ్లిక్‌లోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో.. అప్పుడే వస్తారు. జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసు. సీఎం రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే పెట్టుకొనివ్వని వారు నియంత.సర్కార్ నడపడం లేదు సర్కాస్ నడుపుతున్నారు. మంత్రులది ఓమాట సీఎంది మరో మాట. కోర్ట్ చెప్పిన సీఎం వినరు. సృజన్‌రెడ్డికి సింగరేణిలో రూ.300 కోట్ల టెండర్లు ఇచ్చారు. గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్ చేసిన పనినీ చెప్పలేక పోయాం కాబట్టే ఓడిపోయాం. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు ఇచ్చాం.. కేటీఆర్ పైన కోపం సిరిసిల్ల పైన చూపిస్తున్నారు. నేతన్నపై జీఎస్టీ వేసీని ఘనత సీఎం రేవంత్‌దే. పది నియోజక వర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు పోవాలి. బీసీ బిల్లుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఆర్ఆర్ఆర్ సౌత్ సైడ్ అలైన్ మెంట్ మార్చారు.. సీఎం రేవంత్ బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారు. అలైన్ మెంట్ మార్చితే ఆర్ఆర్ఆర్కి డబ్బులు ఇవ్వం అని కేంద్రం చెప్పింది.సౌత్ సైడ్ ఆర్ఆర్ఆర్ మేమే కడతామని రేవంత్ కేంద్రానికి చెప్పారు. సౌత్ సైడ్ ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చడం వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా అలైన్ మెంట్ మార్చే పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బంధువుల భూములు రెట్లు పెంచేందుకు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు. ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, వారి బంధువుల డ్రామాలు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి. ఎల్అండ్టీ వాళ్ళని ముడుపుల కోసం సీఎం రేవంత్ ప్రయత్నించాడు. అందుకే మెట్రో నడపం అని వెళ్ళిపోతాం అంటున్నారు.ముఖ్యమంత్రి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంటుంది. ముఖ్యమంత్రి ముడుపుల కోసం వేధిస్తున్న వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతున్నది. రాష్ట్రంలోని తమ కార్యకలాపాల నుంచి ఎల్అండ్టీ తప్పుకుంటుంది. గతంలో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని జైల్లో పెడతా అన్నారు. వాళ్లని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయి.రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటాయి. గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు. రేవంత్ పీసీసీ పదవి కొన్నాడు.సీఎం సీట్ కొన్నాడు.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను బీజేపీకి అమ్మారు. రేవంత్ అన్నిట్లో దిట్ట. 8మంది ఎంపీలను అమ్మాడు. హైడ్రా కాస్త హైడ్రామా అయింది. హైడ్రాకు పెద్ద వాళ్ళ ఇళ్ళు కనిపించవు. కాంగ్రెస్ పార్టీ తమ చేతి గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలిరేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని ఎవరూ అనుకోవడం లేదు, ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే. రేవంత్ రెడ్డిని పొగుడాలంటే బట్టి విక్రమార్కని తొక్కేయాలా..?ప్రజా పాలనా అంటూ కోటి అప్లికేషన్లు తీసుకున్నారు. ఎంత మందికి ఇండ్లు ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం లేదు కానీ ఎనుముల ఫ్యామిలీలో మాత్రం వికాసం ఉంది’ -
మోసమే కాంగ్రెస్ నైజం
సాక్షి, హైదరాబాద్ : ప్రజలను మోసగించడమే కాంగ్రెస్ నైజమని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాత రోజులను తిరిగి తెచ్చి పాలనా సామర్థ్యం లేక గత ప్రభుత్వంపై నెపం నెడుతోందని విమర్శించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈ సమావేశంలో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లుగా మారారని, కాంగ్రెస్‌కు దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి లక్కీలాటరీలో మంత్రి పదవి దక్కించుకొని అహంకారంతో మాట్లాడుతున్నారు..పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దాం అని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రల ను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బలంగా నిలబడుతుందని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై బీజేపీకి గౌరవం లేదు వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తమ పార్టీ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు పట్ల ఏ మాత్రం గౌరవం లేదని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి దేహాలను మూడు రోజులైనా గుర్తించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు. -
అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
-
అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యహహారంపై అటు అధికారం కాంగ్రెస్- ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, ఆ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు. తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే తమ పార్టీ నుంచి గెలిస్తే బీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమిలకు వారు ఎందుకు దూరంగా ఉంటున్నారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. దీన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో భాగంగా ఆ ఎమ్మెల్యేల సమాధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అదనపు కార్యదర్శికి వివరణ ఇచ్చారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆదారాలు సమర్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారిక కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆధారాలు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పాల్గొన్న మరిన్ని ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో జగదీష్‌రెడ్డి, వివేక్ గౌడ్ చింతా ప్రభాకర్ తదితరులు ఉన్నారు.అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘ వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే ాపార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్‌తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు. -
నీ అభివృద్ధి కోసం పార్టీ మారావా...?: కేటీఆర్
జోగులాంబ గద్వాల్: తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గద్వాలను జిల్లా చేసింది.. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగుమార్చి ప్రారంభించిందన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో కూడ గద్వాల ముందుంది. కాంగ్రెస్ నాయకులు మాయామాటలు మాట్లాడుతున్నారు. రైలుకింద తలపెట్టిన చనిపోతా కాని కాంగ్రెస్‌లో చేరనన్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎందుకు మారాడు. నీ సొంత అభివృద్ధి కోసం పార్టీ మారావా ఎమ్మెల్యే. కాంగ్రెస్ హయంలో నియోజకవర్గానికి పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే ఒక్క రూపాయ తెచ్చాడా?, కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. సిగ్గులేని విధంగా రేవంత్ రెడ్డి సంకలచిక్కి సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు స్దానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి. సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది పార్టీ పిరాయింపు చేసిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు.6 నుంచి 9 మాసాల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రావడం ఖాయం. గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్ది 50 వేల మెజారిటీతో గెలవటం ఖాయం. దొంగలముఠాలో బండ్ల చేరాడు..ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించాలి. స్కూటీలు మరిచి సీఎం లూఠీలు చేస్తున్నారు. స్దానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను గెలిపించాలి. ఉపఎన్నికల్లో డంకామోగించాలి’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఓట్ల చోరీపై మాట్లాడే రాహుల్.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీని వీడిన పలువురు కాంగ్రెస్‌లో చేరారని బీఆర్ఎస్ అంటుంటే, వారు తమ పార్టీలో చేరలేదని కాంగ్రెస్ అంటోంది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చోరీకి పాల్పడిందని కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాహుల్ ఫోటోలు దిగారని, ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఏంటని ప్రశ్నించారు. ఓట్ల చోరీపై మాట్లాడే రాహుల్.. దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు కేటీఆర్.ఇక తాము కాంగ్రెస్‌లో చేరలేదని ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చాయో ఆ ఎమ్మెల్యేలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ను కలిశామని అంటున్నారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు. -
‘మేం పార్టీ మారలేదని నోటీసుకు సమాధానం ఇవ్వడమేంటి?’
సూర్యాపేట జిల్లా: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు పోతామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం అనేది ఎలా ఉంటుందో తమకు తెలుసన్నారు. ఒకవేళ ఆ నిర్ణయం సరిగా లేకపోతే దానికి సంబంధించిన అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని, ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు హాస్యాస్పదంగా ఉంది. మేం పార్టీ మారలేదని నోటీసుకు సమాధానం ఇవ్వడమేంటి?, పార్టీ మారకపోతే సీఎం రేవంత్ వద్దకు తాజాగా ఎందుకు వెళ్లినట్లు? అని ప్రశ్నించారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు. -
అంగట్లో గ్రూప్ –1 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు గ్రూప్–1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో మంత్రులు, సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్–1 పరీక్షను అక్రమాలకు తావులేకుండా తాజా నోటిఫికేషన్ వేసి మళ్లీ నిర్వహించాలన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో పాటు ఆ పార్టీ నేతల కాసుల కక్కుర్తి వల్లే గ్రూప్–1 పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని కేటీఆర్ సూచించారు. కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్షిప్’అవార్డు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికిగాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సెపె్టంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటంమాజీ మంత్రి హరీశ్రావుసాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలను సక్రమంగా నిర్వహించలేక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. డైవర్షన్ రాజకీయాలతో గ్రూప్–1 పరీక్షలో అవినీతి, అవకతవకలను కప్పిపుచ్చాలనే ప్రభుత్వ ఆటలు సాగవు. గ్రూప్–1 పరీక్షలో జరిగిన అక్రమాలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చి, వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆయన విమర్శించారు. గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి బీఆర్ఎస్వీ నేతల డిమాండ్ చిక్కడపల్లి (హైదరాబాద్): గ్రూప్–1 పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు. గురువారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం ముందు గ్రూప్–1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులతో కలసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న వారిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టుచేసి అబిడ్స్, ముషీరాబాద్ పోలీసుస్టేషన్లకు తరలించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు పేపర్ వాల్యుయేషన్‌లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేయాలని, తప్పుచేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుంగబాలు మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందున, నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
సుప్రీంకోర్టు నోటీసులు.. యూటర్న్ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు.బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు.కాంగ్రెస్‌లో చేరలేదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా.బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు-పోచారం శ్రీనివాస్ రెడ్డిమా ఫోటోలను మార్ఫ్ చేశారు. నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా.నాది బీఆర్ఎస్ ఐడియాలజీ- బండ్ల కృష్ణ మోహన్ రెడ్డినేను బీఆర్ఎస్లోనే ఉన్నా.కాంగ్రెస్‌లో చేరానన్నది అబద్ధం- కాలే యాదయ్యనేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నా. కాంగ్రెస్‌లో చేరలేదు. ఇప్పటికి బీఆర్ఎస్కే నా మద్దతు- గూడెం మహిపాల్ఇప్పటికి బీఆర్ఎస్లోనే ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా- అరికెపూడి గాంధీ వివరణిచ్చారు. -
ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమే..: కేటీఆర్
శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్): ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటువేస్తే మీ ఇళ్లను కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని స్థానిక ప్రజలను హెచ్చరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. బుధవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ రహమత్‌నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బున్న పెద్దల జోలికెళ్లదు.. ‘కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చేశారు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. హైడ్రా ఇల్లు కూలగొడుతుందన్న భయంతో కూకట్‌పల్లిలోని బుచ్చమ్మ అనే మహిళ ప్రాణాలు తీసుకుంది. డబ్బున్న పెద్దల జోలికి ఈ ప్రభుత్వం పోదు. దుర్గం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము అధికారులకు ఉందా? ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోంది. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపివేస్తామంటూ ప్రజలను బెదిరిస్తోంది. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓటు అడిగే హక్కు ఆ పార్టీకి లేదు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లే.. ‘ప్రధాని మోదీని పెద్దన్నలా భావించి ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్న బీజేపీ సీఎం రేవంత్‌రెడ్డి అన్న సత్యాన్ని మైనార్టీలు ఇప్పటికైనా గుర్తించాలి. రాహుల్‌గాంధీని తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ పార్టీని రేవంత్‌రెడ్డి తన పార్టీగా భావిస్తున్నారని, కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రజలు గమనించాలి. తెలంగాణాలో కాంగ్రెస్‌కు ఓటువేస్తే పీఎం నరేంద్ర మోదీ, బీజేపీకి ఓటు వేసినట్లే. రాష్ట్ర చరిత్రలో తొలిసారి మైనార్టీ మంత్రి ప్రభుత్వంలో లేరంటే.. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఏమిటో గుర్తించాలి. మాగంటి కుటుంబానికి అండగా నిలవాలి బీఆర్ఎస్ మైనార్టీలకు సముచిత స్థానం ఇచ్చింది. బీఆర్ఎస్తోనే మైనార్టీల సంక్షేమం సాధ్యం. ప్రజలు అన్నీ గమనించి, ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచిన దివంగత మాగంటి గోపీనాథ్‌కు నివాళిగా..సంక్షేమాన్ని చేతల్లో చూపించిన బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్‌లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అండగా నిలబడే వాడు. ఆయన కుటుంబానికి ప్రజలు అండగా నిలవాలి. కారు గుర్తుకు ఓటువేసి హస్తానికి తగు బుద్ధి చెబుతూ రేవంత్‌రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో అన్ని సీట్లను బీఆర్ఎస్కు అందించారని, అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్‌లో గెలిపించి, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 14వ తేదీ నుంచి కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి, మాగంటి చేసిన పనులను, ఆయన సేవలను ఓటర్లకు గుర్తు చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కోరుకంటి చందర్, మాగంటి సతీమణి సునీత, రహమత్‌నగర్ ఇన్చార్జి టి.రవీందర్రావు పాల్గొన్నారు. -
ఇంతకీ ఆ ఎమ్మెల్యేది ఏ పార్టీ : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీటింగ్‌లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్ఎస్లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చర్చాంశనీయంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో గత వారం తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఏం చర్చించారనే అంశం గురించి తెలియాల్సి ఉంది.‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అంటే ఒప్పుకోం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు ఆదేశించింది. పదో షెడ్యూల్ ప్రకారం, స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. తద్వారా స్పీకర్ నిర్ణయం ఆలస్యం చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అనే పరిస్థితిని అంగీకరించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం సమంజసం కాదని పేర్కొంది.పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించింది.ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వీళ్లేనా? 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్‌లు ఉన్నారు.వీరిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. తాను ఇప్పటికీ గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని కృష్ణమోహన్‌రెడ్డి అంటుంటే.. కేటీఆర్ మాత్రం గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌నని చెప్పుకుని.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు గైర్హాజరవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. -
అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రూ.1,100 కోట్లతో అంచనాలను రూపొందించగా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దాన్ని రూ.7,390 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు ఆరోపించారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచడాన్ని బీఆర్ఎస్ అడ్డుకుందని.. దీంతో రూటు మార్చిన రేవంత్‌రెడ్డి విడతల వారీగా జనం సొమ్మును దోచుకునేందుకే గోదావరి జలాల తరలింపు పనులు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయ పోరాటం చేస్తాం.. ‘సము‘ద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా రావల్కోల్ చెరువుకు, అక్కడి నుంచి 540 మీటర్ల ఎత్తున ఉన్న గండిపేటకు తరలించడం ద్వారా మూసీతో అనుసంధానం చేసే వీలుంది. అయినా 560 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించేలా ప్రతిపాదనలు మార్చి నీటి శుద్ధి కేంద్రాలు, పంప్ హౌస్‌లు ఎవరి లాభం కోసం కడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి. కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు దండుకునేందుకే సీఎం ఈ పనులు చేపడుతున్నారా? హైదరాబాద్‌కు గోదా వరి జలాల తరలింపులో అవినీతిపై న్యాయ పోరాటం చేస్తాం..’అని కేటీఆర్ చెప్పారు. కుర్చీ కాపాడుకునేందుకే.. ‘కాళేశ్వరం ప్రాజెక్టును విఫల పథకంగా ప్రచారం చేసిన రేవంత్, కాంగ్రెస్ నేతలు ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణకు ఆదేశించిన రేవంత్‌రెడ్డి.. అదే ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్నసాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే కాళేశ్వరంపై చెప్పిన అబద్ధాలను కప్పి పుచ్చుకునేందుకు మల్లన్నసాగర్‌కు బదులుగా గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టు చేసిన కాంట్రాక్టు కంపెనీకి. రేవంత్ తాను నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖలో అంతర్భాగమైన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు నుంచి రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును ఇచ్చారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకుని ఢిల్లీకి మూటలు పంపి, వాటాలు పంచి తన సీఎం కురీ్చని కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నారు..’అని మాజీమంత్రి ఆరోపించారు. యూరియా కొరతపై స్పందించని బీజేపీ, కాంగ్రెస్ ‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరూ మంచి అభ్యర్థులే. అయితే మేము రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న యూరియా కొరతపై బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా స్పందించక పోవడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాం. నోటా ఉంటే దానికే వేసేవాళ్లం కానీ, ఆ అవకాశం లేనందున ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నాం. కవిత విషయంలో అవసరమైన నిర్ణయం తీసుకున్నాం.. ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ వేదికపై, అంతర్గతంగా చర్చించి అవసరమైన నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఓ టీవీ చర్చలో అంగీకరించి అప్రూవర్‌గా మారాడు. నేరాంగీకారం తర్వాత ఇంకా విచారణ ఎందుకు? వేటు వేయాల్సిందే. మహారాష్ట్ర పోలీసులు ఫ్యాక్టరీ కార్మీకులుగా అవతారం ఎత్తి తెలంగాణలో రూ.12 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయి? డ్రగ్స్ వ్యవహారంలో సీఎం రేవంత్‌కు ముడుపులు ముట్టినందునే తెలంగాణ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారా?..’అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశంలో పాల్గొన్నారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల సమస్యలు, ముఖ్యంగా యూరియా కొరతను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ, నిరసన రూపంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించిన మీదటే మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ‘యూరియా సమస్యను పరిష్కరించాలని మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పలుమార్లు కోరాం. కానీ, రెండు ప్రభుత్వా లూ రైతుల గోడును పట్టించుకోకుండా పూర్తిగా విఫలమయ్యాయి. ప్రభుత్వాల ఈ రైతు వ్యతిరేక వైఖరికి నిరసన తెలిపేందుకే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాం’అని సురేశ్‌రెడ్డి చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్‌పై నోటాకు అవకాశం లేనందున, తమ నిరసనను తెలిపేందుకు ఎన్నికకు దూరంగా ఉండటమే సరైన మార్గమని భావించామన్నారు. అభ్యర్థులను గౌరవిస్తాం...కానీ రైతుల సమస్యే ముఖ్యం ‘పోటీలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిలను మేము గౌరవిస్తాం. సుదర్శన్‌రెడ్డి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయినా, రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్న ప్రస్తుత తరుణంలో మా నిరసనను బలంగా వినిపించడమే మా కర్తవ్యం’అని సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తోందని, ఇలాంటి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. -
కవిత వ్యాఖ్యలపై KTR రియాక్షన్
-
ఏం చేద్దాం.. ఏం చెప్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరు కావడం విశేషం. వీరి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించడం, సుప్రీం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపుపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల గడువు ముగుస్తుండడం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి తమకు పాత కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యల పరిష్కారం పైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ జారీ చేసిన నోటీసుల విషయంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చెప్పాలి అనేది నిర్ణయించేందుకే ఈ భేటీ జరిగిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సమావేశంలో ఏఏజీ..! ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. కాగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికపూడి గాం«దీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకటరావు, కాలె యాదయ్యలు పాల్గొన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ భేటీలో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు, స్పీకర్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరిగింది. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం.. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిసామనే రీతిలో సమాధానమివ్వాలనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని, పార్టీని, తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోమని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని, నియోజకవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కోర్టు కేసుల విషయంలో కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం. గతంలోనే కలవాలనుకున్నాం.. సమావేశం అనంతరం ఓ ఎమ్మెల్యే ’సాక్షి’తో మాట్లాడుతూ.. అందరం కలిసి సీఎంతో సమావేశం అవుదామని గతంలోనే నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ మేరకే ఆయన్ను కలిశామని, అనేక అంశాలపై చర్చించామని, సీఎం కూడా తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. -
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ
సాక్షి,తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు పంపించారు. తాజా సీఎం రేవంత్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలో సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నందిగామ: ‘గత పాలకులకు పేదవాడి ఆ త్మగౌరవం పట్టలేదు. కమీషన్లు రావనే వారికి ఇళ్లు కట్టివ్వలేదు. అదే కమీషన్లు వస్తాయనే దురాశతో రూ.లక్షల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు.’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. శనివారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నందిగామ: ‘గత పాలకులకు పేదవాడి ఆ త్మగౌరవం పట్టలేదు. కమీషన్లు రావనే వారికి ఇళ్లు కట్టివ్వలేదు. అదే కమీషన్లు వస్తాయనే దురాశతో రూ.లక్షల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు.’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. శనివారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి పట్టాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయా సభల్లో పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ పేదోడి ప్రభుత్వమని.. వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి సోమవారం దశల వారీగా నిర్మించిన మేరకు ఇళ్లకు నిధులు విడుదల చేస్తామన్నారు.రాష్ట్రంలో ఫౌండేషన్ కట్టనివి కొన్ని ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో దశలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేరు చేర్చేలా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్ప డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెనే కొరి వి దెయ్యంఅని.. ఇంకా బీఆర్ఎస్లో చాలా దెయ్యా లు ఉన్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి పట్టాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయా సభల్లో పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ పేదోడి ప్రభుత్వమని.. వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి సోమవారం దశల వారీగా నిర్మించిన మేరకు ఇళ్లకు నిధులు విడుదల చేస్తామన్నారు.రాష్ట్రంలో ఫౌండేషన్ కట్టనివి కొన్ని ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో దశలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేరు చేర్చేలా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్ప డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెనే కొరి వి దెయ్యంఅని.. ఇంకా బీఆర్ఎస్లో చాలా దెయ్యా లు ఉన్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్కు దోచిపెడతారు?
కొత్తపల్లి (కరీంనగర్): గ్రానైట్ వ్యాపారులు గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి దోచిపెడుతూనే ఉన్నారని, ఇలా ఇంకెన్నాళ్లు దోచిపెడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఒక్కో గ్రానైట్ కటింగ్ మిషన్ ఇండస్ట్రీ నుంచి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలదాకా.. దాదాపు 350 నుంచి 500 షాపుల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని, ఆ సొమ్మును ఏం చేశారో చెప్పాలని అన్నారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి రూ.వెయ్యికోట్లు తీసుకున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేసినా ఎవరూ ఖండించలేదని వ్యాపారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియెజకవర్గంలోని మానకొండూర్, చింతకుంటలో గురువారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సంజయ్‌కు పలువురు గ్రానైట్ వ్యాపారులు ఎదురుపడ్డారు. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లొచ్చాక ఆ దేశంతో వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని అసోసియేషన్ నేతలు చెప్పగా.. సంజయ్ స్పందిస్తూ కనీసం ప్రెస్‌మీట్ పెట్టి మోదీకి థ్యాంక్స్ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అంటూ నిలదీశారు. 20 ఏళ్లుగా బీఆర్ఎస్కు దోచిపెడుతూనే మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటుండగా.. మరికొందరు రాజకీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటూ ఆ సొమ్ముతో రాజకీయాలు చేస్తూ.. మాలాంటోళ్లను ఓడగొట్టాలని చూస్తార ని చురకలంటించారు. గ్రానైట్ అసోసియేషన్ కేంద్రానికి చెల్లించింది రూ. 300 కోట్లకు మించి లేదని, కానీ రూ.వెయ్యి కోట్లు ఇచి్చనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహించారు. ఎవ్వరికీ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని కల్పిస్తానని, సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలని సంజయ్ సూచించారు. -
‘నేను అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చా’
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బయటకి వచ్చింది కేసీఆర్, కేటీఆర్ వల్లేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కవిత చెప్పినట్లు హరీష్‌రావు వల్ల ఎవరూ పార్లీని వీడలేదని, కేవలం కేసీఆర్, కేటీఆర్‌ల వల్లే పార్టీనే వీడారన్నారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 4వ తేదీ) సాక్షి టీవీతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ‘కేసీఆర్, కేటీఆర్ అహంకారం, అవినీతి వల్లే నేను బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాను. కంట్రోల్ మొత్తం కేసీఆర్, కేటీఆర్ చేతిలోనే ఉంది. కవిత ఏమైనా సుద్ధపుసనా.. ఆమె అవినీతి చేయలేదా?, కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్‌దే. హరీష్ కూడా కేవలం సంతకాలు చేయడానికే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ఒక్కటే సీబీఐకి ఇచ్చారు. కాళేశ్వరం మొత్తం సీబీఐకి ఇవ్వాలి . కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వం. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్ట్ కడతానని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా. ప్రాణహిత జలాలు చేవెళ్ల వరకు తేవడం తెలివి తక్కువతనమే. ఎకరాకు రెండు లక్షలకు పైగా ఖర్చు చేసి చేవెళ్ల కు నీళ్ళిచ్చే బదులు... చేవెళ్ల రైతులకు ఎకరాకు 20 వేల రూపాయల రైతుబంధు ఇవ్వాలి’ అని అన్నారు. -
ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఎర్రవల్లి నివాసంలో బుధవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ తరహా ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, దానిని పార్టీకి అనువుగా మలుచుకోవాల్సిన తీరు.. తదితరాలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు వచ్చిన మణుగూరు ప్రాంత నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌ను కలిశారు. కాగా కవిత రాజీనామా, ప్రెస్‌మీట్‌కు సంబంధించి అంశాలపై కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన చేయలేదని సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎల్.రమణ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు ముఠా జైసింహ, ఆజం ఆలీలు ఈ భేటీలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలోని ఓటరు జాబితాను డివిజన్లు, బూత్‌ల వారీగా లోతుగా పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, డివిజన్లు, బూత్‌ల వారీగా మైనారిటీ విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు కోరారు. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మరోమారు సమావేశం జరుగుతుందని ముఖ్యనేతలు వెల్లడించారు.


