హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్లుగా హరీష్‌రావు,. సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లన నియమించగా, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలను బీఆర్‌ఎస్ నియమించింది. ఇక మండలిలో బీఆర్‌ఎస్ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం మేరకే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


