సాక్షి, హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాగా ఆ లేఖలో శాసనసభ నిబంధనలకు తిలోదకాలు చేస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ హరీష్ మండిపడ్డారు.
రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు.
హరీష్ రావు డిమాండ్స్
1.ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి.
2.ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.
3.అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి.
4.అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి.
5.డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి.
6.ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి.
7.సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలి.
8.పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


