ప్రమాణ స్వీకారంలో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్
ఇరువర్గాలు కుర్చీలతో గొడవ
నర్సంపేట రూరల్ : ప్రమాణ స్వీకారోత్సవంలో డీజే పాట పెద్ద పంచాయితీకి దారి తీసింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణస్వీకారోత్సవంలో బీఆర్‌ఎస్‌కు సంబం«ధించిన పాట వస్తుండగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు.
దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వనపర్తి శోభన్‌కు, బీఆర్‌ఎస్ పార్టీ మూడో వార్డుకు చెందిన మూడు రమేశ్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి ఎస్సై రాజేశ్‌రెడ్డి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తొలుత కాంగ్రెస్, అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.


