Sangareddy: అతివేగంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా | Dolphin Travels bus accident in Sangareddy District | Sakshi
Sakshi News home page

Sangareddy: అతివేగంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

Dec 23 2025 10:11 AM | Updated on Dec 23 2025 11:13 AM

Dolphin Travels bus accident in Sangareddy District

సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అతివేగంతో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు కాగా, మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement