మంటల్లో స్కూల్‌ బస్సు... తప్పిన పెను ప్రమాదం.. | School Bus Caught Fire In Bhupalpally District | Sakshi
Sakshi News home page

మంటల్లో స్కూల్‌ బస్సు... తప్పిన పెను ప్రమాదం..

Feb 7 2026 6:47 PM | Updated on Feb 7 2026 7:26 PM

School Bus Caught Fire In Bhupalpally District

సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల మండలం జూకల్ ప్రధాన రహదారిపై షార్ట్ సర్క్యూట్‌ కారణంగా స్కూల్ బస్సు దగ్ధమైంది. రైసింగ్ సన్ స్కూల్‌కు చెందిన బస్సులో పొగలు రావడం గమనించిన డ్రైవర్‌.. అప్రమత్తమై విద్యార్థులను దింపడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో స్కూల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనపై రవాణా శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్కూల్ బస్సు ఫిట్నెస్ వివరాలతో పాటు మంటలు వ్యాప్తికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement