ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు | Mother Gives Birth To Three children at the same time In Jagtial Dist | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

Aug 11 2026 8:22 AM | Updated on Aug 11 2026 8:40 AM

Mother Gives Birth To Three children at the same time In Jagtial Dist

మెట్‌పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ఓ ఆసుపత్రిలో రాజలక్ష్మి ఒకే కాన్సులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. వివరాలు.. మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి, నరేందర్‌ దంపతులు. తొలిసారి గర్భం దాల్చిన రాజ్యలక్ష్మికి ప్రసవ నొప్పులు రావడంతో సోమవారం పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రసవం చేయగా, ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. 

ప్రస్తుతం తల్లి, శిశువులు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశువుల బరువు తక్కువగా ఉండడంతో పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలు జన్మించడంతో   రాజలక్ష్మి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement