బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్‌తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్‌గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.

బిగ్‌బాస్ విజేత తనూజ అని, రన్నర్‌గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్‌డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్‌గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్‌లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్‌బాస్ టీమ్‌తో ఉండవు.


