డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్.. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా..! | Film Industry In Shock After Actress Anju Krishna Arrested By Chennai Police In Drugs Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Anju Krishna: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి అంజు కృష్ణ అరెస్ట్

Feb 6 2026 4:08 PM | Updated on Feb 6 2026 5:44 PM

Actress Anju Krishna apprehended by chennai police in case

గతంలో డ్రగ్స్ మహమ్మారి టాలీవుడ్‌ను ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చెన్నైలో మలయాళ నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సినీ రంగంలో ఈ డ్రగ్స్ దందా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో  డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో వెంకటేశ్ అనే మరో వ్యక్తితో పాటు నటి అంజు కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేతను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.

కాగా.. కేరళలోని త్రిసూర్‌కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరో' (Aaro) సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా మలయాళంలో 'సుమేశ్ రమేశ్', ఆకాశం కడన్'లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 'వెల్లిమలై' అనే చిత్రంలో మెరిసింది. తాజాగా అంజు కృష్ణ డ్రగ్స్ కేసులో దొరకడం అభిమానులను షాకింగ్‌కు గురి చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement