యాటిట్యూడ్‌ స్టార్‌కు మరో షాక్.. కేసు నమోదు..! | Another Case Filed on Attitude Star Chandrahas in jubilee hills PS | Sakshi
Sakshi News home page

Chandrahas: యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌కు షాక్.. మరో కేసు నమోదు..!

Feb 6 2026 3:38 PM | Updated on Feb 6 2026 3:42 PM

Another Case Filed on Attitude Star Chandrahas in jubilee hills PS

బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పటికే చంద్రహాస్‌పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్‌ను పాడిన చంద్రహాస్‌.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement