breaking news
Pawan Kalyan Padala
-
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్‌బాస్' రివ్యూవర్స్.. ?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. పైనల్ ఎపిసోడ్ ముగిసి విజేతగా ప్రకటించినా సరే కల్యాణ్, తనూజ పేర్లు నెట్టింట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక విజేతకు రావాల్సిన మైలేజ్‌ను ఎన్నడూ లేని విధంగా తనూజ కూడా హైజాక్ చేసింది. వాస్తవంగా 10 వారాల పాటు ఎలాంటి ఓటింగ్ పోల్స్ చూసినా సరే తనూజనే విన్నర్‌గా కనిపించేది. కానీ, ఆ తర్వాత సీన్ మారిపోయింది. హఠాత్తుగా ఓటింగులో దూసుకొచ్చాడు కల్యాణ్ పడాల.. తనూజ వెనుకబడిపోయింది. దీంతో CRPF జవాను కల్యాణ్ బిగ్‌బాస్ 9 విజేత అయ్యాడు. అయితే, కల్యాణ్ విజయంలో రివ్యూవర్ల పాత్ర ఎక్కువ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆపై మరికొందరు టీవీ యాక్టర్స్ కూడా తనూజ గురించి నెగటివ్‌గా చెప్పడంతోనే ట్రోఫీ జారిపోయిందనే వాదన కూడా ఉంది. మరికొందరు మాత్రం అగ్నిపరీక్ష-2 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ చేస్తుందని అందుకే ఒక కామనర్‌ను కావాలనే గెలిపించారనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్లతో కల్యాణ్‌లో కూడా గెలుపు సంతోషం లేకుండా పోయింది.అర్జునుడిలా కల్యాణ్.. కృష్ణుడి స్థానంలో గీతూబిగ్బాస్ రివ్యూవర్లు ఆదిరెడ్డి, గీతూ రాయల్ సపోర్ట్ కల్యాణ్‌కు పుష్కలంగా దొరికిందని కొందరు నెటిజన్లు డీకోడ్ చేశారు. వారిద్దరితో పాటు మరికొందరు రివ్యూవర్లు కూడా కల్యాణ్‌కు పీఆర్ మాదిరిగా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గీతూ రాయల్ మొదటి నుంచి ప్రతి ఎపిసోడ్‌ను చక్కగా రివ్యూ చెప్పింది. కానీ, ఫైనల్‌కు వచ్చేసరికి కల్యాణ్‌కు ఓటు వేయాలంటూ తనకు అనుకూలంగానే వీడియోలు పోస్ట్ చేసింది. ముమ్మాటికీ గీతూ ఇక్కడ తప్పు చేసిందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రివ్యూవర్ ఎప్పుడూ కూడా ఒక కంటెస్టెంట్ కోసం స్టాండ్ తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ విధానం రాబోయే సీజన్లలో వారు చెప్పే రివ్యూలకు క్రెడిబులిటీ ఉండదని పేర్కొంటున్నారు. ఈ పాయింట్‌ను గీతూ గ్రహించలేకపోయిందని చెప్పాలి. పైగా కల్యాణ్ గెలిచిన తర్వాత షేర్ చేసిన ఒక పోస్టర్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఒక రథంపై ఆర్జునుడి స్థానంలో కల్యాణ్ ఉంటే.. కృష్ణుడి స్థానంలో గీతూ రాయల్ ఉండేలా క్రియేట్ చేసిన పోస్టర్‌ను ఆమె షేర్ చేసింది. దీంతో ఇంతకంటే నీతితక్కువ పని ఏమైనా ఉంటుందా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.మొదటిసారి గాడి తప్పిన ఆదిరెడ్డిబిగ్బాస్ రివ్యూ చెప్పడంలో ఆదిరెడ్డి దిట్ట... తను చెప్పే స్టైల్‌కు చాలామంది ఫిదా అయిపోతారు. బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు ఉన్నంత రేంజ్లో ఆదిరెడ్డి రివ్యూకు ఉంటుంది. ముఖ్యంగా అతని రివ్యూ తీరు మన పక్కింటి అబ్బాయి చెబుతున్నంత దగ్గరగా ఉంటుంది. ఏ సీజన్లో లేని విధంగా ఈసారి ఆదిరెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కల్యాణ్ గెలుపు కోసమే రివ్యూలు చేశాడంటూ నెటిజన్లు వేల కొద్ది కామెంట్లు చేశారు. వాస్తవంగా అతని రివ్యూలు కూడా కల్యాణ పక్షం వైపే ఉన్నాయని సులువుగా అర్థం అవుతుంది. తనూజ ఏం చేసినా సరే తప్పు అనేలా చెప్పడం.. ఆదే టైమ్‌లో కల్యాణ్ ఏం చేయకున్నా సరే తోపు, తురుం అంటూ ఎలివేషన్ ఇవ్వడంతో బజ్ క్రియేట్ అయిపోయింది. చాలామంది రివ్యూవర్లు కూడా ఆదిరెడ్డిని కాపీ కొట్టి తమ స్టైల్లో రివ్యూ షేర్ చేశారు. అలా అని ఆదిరెడ్డి డబ్బులకు అమ్ముడుపోయాడని చెప్పడం తప్పే.. తను అనుకుంటే ఏదైన కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఏడాదికి కోట్లలో సంపాదించగలడు. కానీ, మొదటిసారి తన రివ్యూలు గాడి తప్పాయని విమర్శలు రావడంతో తన క్రెడిబులిటికి ఒక మచ్చలా మిగిలిపోనుంది.కల్యాణ్ గెలుపులో ఐదుగురుబిగ్బాస్ 9 ట్రోఫీ కల్యాణ్ అందుకున్న తర్వాత తన స్నేహితులు శ్రీజ, ప్రియలను కలుసుకున్నాడు. ఆ సమయంలో కల్యాణ్‌తో శ్రీజ ఇలా అంటుంది. 'ఐదుగురు అమ్మాయిలు సపోర్ట్ చేయడం వల్ల కల్యాణ్ గెలిచాడు.' అంటూ ఓపెన్‌గా చెబుతుంది. అయితే ముగ్గురు ఉన్నారని మరో ఇద్దరు అందుబాటులో లేరని తెలుపుతుంది. ఆ ఐదుమంది పేర్లను కూడా నెటిజన్లు రివీల్ చేస్తున్నారు. శ్రీజ, ప్రియ, గీతూ రాయల్, సత్య, రేష్మి అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.#KalyanPadala fans should accept the fact that Kalyan won BB and good name using sympathy card Army card caste card language card region card etc but he is lossing very thing just because this 5 evil and negitive mindsets around him.accept the fact#BiggBossTelugu9 #Thanuja pic.twitter.com/a4czq9IMub— santhosh (@Santhoshh_99) December 23, 2025 View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) -
టాప్ 2లో నా పక్కన ఇమ్మూ... తనూజతో ఆ బాండ్ లేదు!
అగ్నిపరీక్షలో కల్యాణ్ అందరికీ నచ్చాడు. కానీ బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రారంభంలో ఎవరికీ నచ్చలేదు. కారణం.. ఆట పక్కనపెట్టి అమ్మాయిలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. నాగార్జున కూడా అతడి తీరును ఎండగట్టాడు. ఇక ప్రియ, శ్రీజ ఎలిమినేషన్ తర్వాత కల్యాణ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌లా మారి అన్నీ చూసుకుంది తనూజ. అతడి కోసం గేమ్స్‌లో కలబడింది, నిలబడింది.కల్యాణ్ కోసం నిలబడ్డ తనూజటికెట్ టు ఫినాలేలో ఇమ్మాన్యుయేల్‌ను పక్కనపెట్టి కల్యాణ్‌కే సపోర్ట్ చేసింది. అతడినెవరైనా టార్గెట్ చేస్తే వాళ్లను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి మరీ కల్యాణ్ కోసం టవర్ గేమ్‌లో చేయి నొప్పిని లెక్కచేయకుండా కష్టపడి ఆడింది. చాలా గేమ్స్‌లో అతడికే ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం టాస్కులపరంగానే కాకుండా మాటలతోనూ సపోర్ట్ చేసింది. అతడి గెలుపును తన విజయంలా భావించి ఎన్నోసార్లు సంతోషించింది.చివరి ప్రాధాన్యతబిగ్బాస్ ఫినాలే స్టేజీపై కూడా కల్యాణ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ముందుగా ప్రియ, శ్రీజకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరగా తనూజ గురించి మాట్లాడుతూ.. కల్యాణ్గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించిందే తనూజ అని ఒప్పుకుంటున్నా అని అందరిముందు చెప్పాడు. కానీ, బిగ్‌బాస్ బజ్‌లో, బయట ఇంటర్వ్యూలలో మాత్రం మాట మార్చాడు. టాప్ 2లో ఇమ్మూ..బజ్‌లో మాట్లాడుతూ.. ఫైనల్స్‌లో స్టేజీపై నా పక్కన ఇమ్మూ అన్న ఉంటాడనుకున్నాను. తనకు ఎక్కువ ఓట్లు వస్తాయనుకున్నా.. అయినా ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారన్నది మనకు తెలిదు. తను నాలా ఆలోచిస్తాడు, నాకు, ఇమ్మూ అన్నకు మధ్య బాండింగ్ బాగుంటుంది. మళ్లీ తనూజ, నాకు మధ్య ఆ బాండింగ్ లేదు అన్నాడు. మరో ఇంటర్వ్యూలో.. తనూజ గేమ్ పరంగా సపోర్ట్ ఇవ్వలేదు, ఉట్టి మాటలతోనే సపోర్ట్ చేసిందన్నాడు.బాగానే డ్రామాలు చేస్తున్నావ్..ఇది చూసిన తనూజ అభిమానులు కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తనూజ నీ పక్కన లేకపోతే స్క్రీన్‌స్పేస్ కూడా దక్కేది కాదంటున్నారు. ఫ్రెండ్స్‌ను, నాన్న(భరణి)ని పక్కనపెట్టి మరీ నీకు కెప్టెన్సీ, టికెట్ టు ఫినాలేలో సపోర్ట్ చేస్తే కనీస కృతజ్ఞత లేదంటూ తిట్టిపోస్తున్నారు. క్రెడిట్ తనూజకు ఇవ్వొద్దని శ్రీజ ఏమైనా చెప్పిందా? అందుకే ఇలా మాట మార్చేశావా? అని అడుగుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన కల్యాణ్.. వెంటనే మెట్టు దిగొచ్చాడు. టికెట్ టు ఫినాలేలో తనూజ తనకోసం ఆడిందని చెప్పాడు. అయినప్పటికీ తనూజ ఫ్యాన్స్ శాంతించలేదు. ఒక్కోదగ్గర ఒక్కో మాట మాట్లాడుతూ బాగానే డ్రామాలు చేస్తున్నావ్.. అని మండిపడుతున్నారు. -
బిగ్‌బాస్ బజ్: కల్యాణ్ పడాల నెక్స్ట్ టార్గెట్ అదే!
ఒక సామాస్యుడు బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచినట్లు చరిత్రలోనే లేదు. కానీ ఆ చరిత్రను తిరగరాశాడు కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ పడాల. సీఆర్పీఎఫ్ జవాన్‌గా అగ్నిపరీక్షలో అడుగుపెట్టాడు. అక్కడ తన టాలెంట్‌తో జడ్జిలను మెప్పించి తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టాడు.21 మందిని వెనక్కు నెట్టి..హౌస్‌లో టైంపాస్ చేసేసరికి ఎక్కువరోజులు ఉండడులే అని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌తో కల్యాణ్ అలర్ట్ అయి గేమ్‌పై ఫోకస్ పెట్టాడు. గేమ్ కోసం ఏదైనా చేసేవాడు. అలా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొన్న 21 మంది వెనక్కు నెట్టి బిగ్‌బాస్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లిపోయాడు.కేక్ కటింగ్బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే బజ్ ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. తాజాగా బజ్‌లో శివాజీతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో శివాజీ మాట్లాడుతూ.. తననే తాను చెక్కుకున్న శిల్పి అని పొగిడాడు. తన గేమ్ ఛేంజ్ అవడానికి కారణం దివ్య అని గుర్తు చేశాడు. నీలో స్పిరిట్ రగిలించిందే తను అనడంతో కల్యాణ్ దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశాడు.గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాఎలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నావ్? అన్న శివాజీ ప్రశ్నకు కల్యాణ్ మాట్లాడుతూ.. స్టార్, హీరో అని కాకుండా గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాను. నాలుగు నెలల క్రితం నేనెవరికీ తెలియదు. మా ఊర్లోనే ఎవరికీ తెలీదు. అలాంటిది ఈ అవకాశం ఇచ్చి అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు. -
కల్యాణ్ పడాల విజయంలో 'లేడీ క్వీన్'
బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫైనల్లో తనూజ, కల్యాణ్‌లు చరిత్ర తిరగ రాశారు. ఫైనల్ వరకు చేరుకున్న వారిద్దరూ హౌస్‌లో మంచి బాండింగ్‌తో ఉంటూనే రేసులో ఉన్నారు. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ విజేతగా నిలవడం గొప్ప విషయమేనని చెప్పాలి. సీజన్-7లో కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్‌లు కూడా ఇలాంటి బాండింగ్‌నే కొనసాగించారు. పల్లవి ప్రశాంత్ విజయంలో శివాజీ పాత్ర ఎంత కీలకమో తెలిసిందే.. అయితే, కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా అంతే రేంజ్లో ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదే పాయింట్‌ను కల్యాణ్ కూడా స్టేజీపైనే ఒప్పుకున్నాడు. తన గెలుపులో ఆత్మవిశ్వాసం నింపిన వారిలో ఫస్ట్ ప్రియ, సెకండ్ శ్రీజ ఉంటారని చెబుతూ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేడీ క్వీన్ తనూజకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడం విశేషం. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ ఇలా చెప్పాడు. ' ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా ఒకానొక సందర్భంలో కల్యాణ్ గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనూజానే.. నేను ఒప్పుకుంటా అది.." అంటూ క్లారిటీ ఇచ్చాడు.బిగ్‌బాస్ రివ్యూవర్లు కూడా చాలామంది ఇదే మాట చెప్పడం విశేషం. బిగ్‌బాస్ సీజన్-7లో కూడా ఇలాంటి మ్యాజిక్‌నే జరిగింది. పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ చాలా బలంగా నిలిచారు. తను 2వ రన్నర్‌గా నిలిచినప్పటికీ ఎలాంటి బాధను చూపలేదు. హౌస్‌లో ప్రతిచోట పల్లవి ప్రశాంత్ కోసం స్టాండ్ తీసుకుంటూ తన గెలుపు కోసం రోడ్ క్లియర్ చేశారు. ఫైనల్‌గా అమర్‌దీప్‌కు ట్రోఫీ అందుతుందని అందరూ అనుకుంటే శివాజీ గేమ్ స్ట్రాటజీ వల్ల ప్రశాంత్ సులువుగా విన్నర్ అయిపోయాడు. అయితే, ఈ సీజన్లో కూడా తనూజ వరుసగా పదివారాల పాటు టాప్‌లో ఉంది. 11వ వారం నుంచి ఒక్కసారిగా కల్యాణ్ రేసులోకి వచ్చేశాడు. అందుకు కారణం తనూజానే అని తను కూడా పలుమార్లు చెప్పాడు. తన గెలుపు కోసం తనూజ ఇచ్చిన సలహాలు చాలా వున్నాయని కల్యాణ్ ఒప్పుకోవడం విశేషం.#KalyanPadala acknowledging his Sisters- Priya SrijaMentor- ThanujaThis is who he isHe never forgets to show gratitude ❤️❣️Thanks Kalyan for proving the Haters that we supported right person#BiggBossTelugu9pic.twitter.com/lMkB9P4qO1— Jeeva S (@JeevaS4853) December 21, 2025 -
బిగ్‌బాస్-9 విజేతగా కల్యాణ్.. ట్రోఫీతో ఎక్స్ కంటెస్టెంట్స్ (ఫోటోలు)
-
ఛీ కొట్టినవారితో చప్పట్లు.. కల్యాణ్ విజయానికి కారణాలివే!
తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. బిగ్‌బాస్ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్నిపరీక్షలో కల్యాణ్ దూకుడు, అతడిలోని కసి చూసి.. ఇలాంటి కంటెస్టెంట్ కదా బిగ్‌బాస్‌కు కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్ మెటీరియల్ అని ముందుగానే ఫిక్సయిపోయారు.(Kalyan Padala Bigg Boss Winning Reasons)అంతా తలకిందులుకట్ చేస్తే బిగ్‌బాస్ 9కి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. పిక్నిక్కు వచ్చినట్లు ఓ మూలన కూర్చునేవాడు. ఏదో కరువులో ఉన్నట్లు అమ్మాయిలను ఓరగా చూస్తూ అదే పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ఇతడు చేసిన పనులకు మూడోవారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయేవాడే! కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాళ్ల చేతులు రాస్తూ కూర్చోవడమేనా? అని నాగ్ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో అలర్ట్ అయ్యాడు.రూటు మార్చాడుఅప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్ అవుతుండటంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఆట, మాట, తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్నిపరీక్షలో కనిపించిన కల్యాణ్‌ను తిరిగి చూపించాడు. నాలుగోవారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులు వస్తే గెలిచేవరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.జనాలకు కనెక్ట్..తనకు ఇష్టమైనవాళ్లు ఎలిమినేట్ అయినా, బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్లకు ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువ ఏడ్చేవాడు. అలా కల్యాణ్ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కల్యాణ్ పడ్డచోటే లేచి నిల్చున్నాడు. ఛీ కొట్టినవారితోనే శెభాష్ అనిపించేలా చేసుకున్నాడు. తనూజతో పోటీపడేవాళ్లే లేరా? అన్న సమయంలో అందరికీ ఓ ఆశాదీపంలా కనిపించాడు.కలిసొచ్చిన ప్రచారంకల్యాణ్ కోసం సోషల్ మీడియాలో బోలెడంత సింపతీ ప్రచారం జరిగింది. సోల్జర్ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్‌లో మాత్రం అతడెప్పుడూ ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్‌బాస్ మాత్రం కుదిరినప్పుడల్లా అతడు జవాన్ అని గుర్తు చేశాడు. 'జై జవాన్' అన్న నినాదం అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది. -
బిగ్‌బాస్ 9 విన్నర్‌గా కల్యాణ్.. రూ.50 లక్షలు సొంతం!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. నేడు (డిసెంబర్ 21న) జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తనూజపై కామనర్ పవన్ కల్యాణ్ పడాల గెలిచాడు. బిగ్‌బాస్ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు. సామాన్యుడు తల్చుకుంటే జరనిదంటూ ఏమీ ఉండదని నిరూపించాడు. అతడి సంకల్ప బలానికి, ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిల్చాడు. సెలబ్రిటీ తనూజను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు.రెమ్యునరేషన్ ఎంత?సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది బిగ్‌బాస్ టీమ్. అలా అందరిలాగే కల్యాణ్‌కు సైతం ప్రతి వారానికి రూ.70,000 అందాయి. పదిహేను వారాలకుగానూ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే! కానీ, పవన్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు తన సొంతం చేసుకున్నాడు. రాఫ్ టైల్స్ వారు మరో రూ.5 లక్షలు గిఫ్టిచ్చారు. అలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్ కారును సైతం తన సొంతం చేసుకున్నాడు. ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది. -
బిగ్‌బాస్-9 ఫైనల్.. విన్నర్‌గా కల్యాణ్ పడాల
బిగ్‌బాస్‌లో 105 రోజుల రణరంగం.. చివరి అంకానికి చేరింది. ఈరోజు ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం రాత్రి 10గంటల సమయంలోపు బిగ్‌బాస్ తెలుగు 9 ట్రోఫీ విజేత ఎవరు అనేది తేలిపోతుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన ఉన్నారు. వీరిలో విజేత ఎవరు..? సూటుకేసు తీసుకునేది ఎవరు..? అనేది తేలిపోతుంది. అయితే, తనూజ- కల్యాణ్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవనున్నారని తెలిసిందే.. -
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌కు మరికొద్ది గంటల్లో శుభం కార్డు పడనుంది. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఎంతోమంది గెస్టులు బిగ్‌బాస్ స్టేజీపైకి రానున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో మంగ్లీ, పాయల్ రాజ్‌పుత్ వంటి పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్తో అల్లాడించారు. అలాగే ఛాంపియన్, అనగనగా ఓ రాజు సినిమా హీరోహీరోయిన్లు కూడా సందడి చేశారు.బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీకాంత్హీరో శ్రీకాంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఒకర్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి టీషర్ట్‌పై అన్‌సేఫ్ అని రాస్తారో వారు ఎలిమినేట్ అయినట్లు లెక్క! ఇక్కడ అందరికంటే ఎక్కువ కల్యాణ్ భయపడ్డాడు. తాను వెళ్లిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడు. కానీ కొంత షూటింగ్ నిన్ననే అయిపోవడంతో ఫస్ట్ సంజనా ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. రోబో ఎలిమినేట్!తర్వాత రోబోను పంపించగా ఆ రోబో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఓపక్క టెన్షన్, మరోపక్క ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్ దేశంలోనే టాప్ 1లో ఉందన్నారు నాగార్జున. బిగ్‌బాస్ 9 ట్రోఫీని చూపించేటప్పుడు మగువా మగువా.. పాట బీజీఎమ్ వేశారు. అంటే తనూజ గెలుస్తుందని ఏమైనా హింట్ ఇచ్చారా? అని నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ ప్రోమో మీరూ చూసేయండి..& -
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్‌తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్‌గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్‌బాస్ విజేత తనూజ అని, రన్నర్‌గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్‌గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్‌బాస్ టీమ్‌తో ఉండవు.బిగ్‌బాస్ -9 విజేతగా నిలిచిన కల్యాణ్బిగ్బాస్9 విజేతను అధికారికంగా కల్యాణ్ పడాల అంటూ హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో వికీపీడియాలో వచ్చిన అప్డేట్ పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. దీంతో వికీపీడియా కూడా కొంత సమయం తర్వాత దానిని సవరిస్తూ మరో లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో కల్యాణ్ విజేతగా పేర్కొంది. -
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
బిగ్‌బాస్ షో.. వంద రోజుల యుద్ధానికి తెర దించే సమయం ఆసన్నమైంది. ఫైనల్ ఓటింగ్స్ నిన్నటితో ముగిశాయి. ఈసారి కామనర్ గెలుస్తాడా? లేదా తనూజ గెలిచి లేడీ విన్నర్‌గా చరిత్ర సృష్టించనుందా? ఆన్లైన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఓటింగ్ ట్రెండ్ ఎటువైపు బలంగా ఉంది ఓసారి చూసేద్దాం..టాప్ 5 ఫైనలిస్టులుతెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలైనప్పుడు విన్నర్ మెటీరియల్‌లా ఒక్కరూ కనిపించడం లేదని జనాలే అనుకున్నారు. అలాంటి సమయంలో తనూజ తన రియల్ ఎమోషన్స్ చూపిస్తూ.. కసిగా గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ముందుకొచ్చింది. కమెడియన్‌గా నవ్విస్తూనే, టాస్కుల్లో దులిపేస్తూ నేనున్నానంటూ ముందుకు దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. కామనర్‌గా వచ్చిన కల్యాణ్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అది సరిపోదుమొన్నటిదాకా రీతూతో గొడవ వల్ల కనిపించకుండా పోయిన డిమాన్ పవన్ ఫైనల్ వీక్‌లో మాత్రం తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. కానీ కప్పు గెలిచేందుకు ఇది సరిపోదు. గేమ్స్ అందరూ ఆడతారు.. కానీ ఆడించడం తెలిసుండాలి... స్కోప్ లేని దగ్గర కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది సంజనా. అలా ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న ఆమె టాప్ 5లో చివరి స్థానంతోనే సరిపెట్టుకోనుంది.ఓట్లు గుద్దిపడేసిన అభిమానులుటాప్ 5లో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా హౌస్‌లో కష్టపడ్డారు. వారికోసం బయట అభిమానులు కూడా బీభత్సంగానే కష్టపడ్డారు. మిస్డ్ కాల్స్, హాట్‌స్టార్‌లో ఓటింగ్‌తో దుమ్ము లేపారు. గత సీజన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారం ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా సంజనా చివరి స్థానంలోనే ఉంది. పవన్‌కు పెరిగిన ఓటింగ్మూడు, నాలుగు స్థానాలు మాత్రం మారుతూ వచ్చాయి. పవన్‌లో హుషారు చూసి అతడికి ఓట్లు గుద్దిపడేశారు. దీంతో అప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న ఇమ్మూ సడన్‌గా నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి ఇమ్మూ మళ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకినట్లు వినికిడి. అసలు సిసలైన విన్నర్ పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరుగుతోంది. వీళ్లిద్దరికీ హోరాహోరీగా ఓట్లు నమోదయ్యాయి.ఈ ఇద్దరి మధ్యే పోటీఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తనూజకు భారీగా ఓట్లు పడగా.. తర్వాత కల్యాణ్‌కు సడన్‌గా ఓటింగ్ రేంజ్ పెరిగిందంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్, మరొకరు రన్నర్‌గా నిలవనున్నారు. ప్రతి సీజన్లో విన్నర్, రన్నర్ మధ్య గొడవలు జరిగాయి. కానీ, ఈ సీజన్లో మాత్రమే ఇద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉన్నారు. వైరం పెట్టుకోకుండా ముందుకు సాగారు.తనూజపై అక్కసువాళ్లిద్దరూ బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇక ఆడవారికి ఆడవాళ్లే శత్రువు అన్నట్లు తనూజపై చివరి వారంలో కొందరు సెలబ్రిటీలు విషం కక్కారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పోల్స్‌లో కల్యాణ్ గెలిచే ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని పోల్స్ మాత్రమే తనూజ గెలుపు తథ్యమని చెప్తున్నాయి. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు!ఓటింగ్‌లో కూడా కల్యాణ్ బుల్లెట్ స్పీడ్‌లో దూసుకెళ్లాడని టాక్! మరి ఇదే నిజమై కల్యాణ్ కప్పు గెలుస్తాడా? లేదా తనూజ కోరుకున్నట్లుగా టైటిల్ ఆమె వశమవుతుందా? అనేది రేపటి గ్రాండ్ ఫినాలేలో చూడాలి! ఇది బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు లెక్కలు తారుమారు కూడా అవొచ్చు! -
కల్యాణ్ పడాల తలకు కట్టు... అతడికేమైంది?
బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనలిస్టులు ఐదుగురు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు వారిని పలకరించేందుకు దాదాపు ఐదారుగురు సెలబ్రిటీలు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శివాజీ, లయ, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ మొదటగా వచ్చారు. బుల్లితెర యాంకర్స్తర్వాత రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు, క్వీన్ శ్రీముఖి అడుగుపెట్టారు. ఈ మేరకు వరుస ప్రోమోలు వదులుతున్నాడు బిగ్‌బాస్. బీబీ జోడీ రెండో సీజన్ మొదలు కాబోతోంది.. ఈ సీజన్ నుంచి కూడా జంటలు రావాలని కోరుకుంటున్నా అని ప్రదీప్ అనగానే కల్యాణ్.. వస్తాం అన్నా అంటూ సంతోషంగా ఆన్సరిచ్చాడు. ఎలాగో ఈ షోలో పవన్-రీతూ జంటగా కనిపించడం ఫిక్స్! కల్యాణ్ తలకు కట్టుమరి తనూజ- కల్యాణ్ కూడా జోడీగా వస్తారా? లేదా? అనేది చూడాలి! ఇక శ్రీముఖి వచ్చినప్పుడు ఇమ్మూ చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. పుష్ప స్కిట్లో భాగంగా కల్యాణ్.. తనూజను గిల్లేశాడు. ఈ ప్రోమోలో కల్యాణ్ తలకు కట్టుతో కనిపించాడు. అయితే అతడికి పెద్ద గాయం ఏమీ అవలేదు. నిధి వచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించింది. అప్పుడు కల్యాణ్ తలకు చిన్న దెబ్బ తగలడంతో కట్టు కట్టారు. కాబట్టి అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు. -
విన్నర్ రేంజ్ ఎలివేషన్...మీసం మెలేసిన కల్యాణ్
బిగ్‌బాస్ షోలో హౌస్మేట్స్ ఫైనల్ వీక్‌ను సరదాగా గడిపేస్తున్నారు. కాఫీ పంపిస్తే డిమాన్ పవన్‌కు చీర కట్టి అందంగా రెడీ చేసి డ్యాన్స్ వేయిస్తాం అన్నారు. అన్నట్లుగానే పవన్‌ను అమ్మాయిగా ముస్తాబు చేసి ఓ ఆటాడుకున్నారు. తర్వాత కల్యాణ్ జర్నీ వీడియో ప్లే చేశారు. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..ఆడవేషం కట్టిన పవన్ఆడవేషంలో ఉన్న పవన్ డ్యాన్స్‌తో ఎపిసోడ్ ఉత్సాహంగా మొదలైంది. వీళ్ల జోష్ చూసిన బిగ్‌బాస్ కాఫీ పౌడర్‌తో పాటు ఏకంగా మటన్ పంపించాడు. తర్వాత కల్యాణ్ గార్డెన్ ఏరియాలో తన కటౌట్ చూసుకుని మురిసిపోయాడు. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ.. కానీ, జీరోగా ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్నిపరీక్షను దాటి సొంతం చేసుకున్నారు.ఓనర్‌గా మొదలై...ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్నిచ్చారు. ఓనర్‌గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం.. మొదట్లో సులువుగా అనిపించినా పోనుపోను ఎన్నో కఠినమైన పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితేకానీ, మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే కానీ.. ముందుకు కదల్లేని పరిస్థితిలో ఒకరి స్నేహం మీకు బాసటగా నిలిచింది.కుంగదీసినా తేరుకున్నారుమీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. ధైర్యాన్ని నింపింది. వారికోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ప్రయాణం మొదలుపెట్టినవారందరూ ఒక్కొక్కరిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. తప్పులను సరిచేసుకున్నారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. గుండె బలంతో..బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించినది గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్‌గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలోని యోధుడిని నిద్ర లేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ చివరి కెప్టెన్‌గా నిలిచారు.ఎంతోమందికి దిక్సూచిలా..అంతేక కాక ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్ తల్చుకుంటే ఏం చేయగలడో ప్రపంచానికి తెలిసేలా చేశారు. లక్ష్మణ్ రావు- లక్ష్మీల కొడుకు కల్యాణ్ అనే మాట ఇప్పటివరకు! కానీ వీళ్లు కల్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్ ఎగరేసే గర్వాన్ని అందించారు. గొప్ప కలలు కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్‌కు దిక్సూచిలా నిలిచి, స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో చూపించాడు. అది చూసిన కల్యాణ్ ఆనందంతో మీసం మెలేశాడు. అయితే తనూజ జర్నీ వీడియోలో హైప్ ఇచ్చే మూమెంట్ ఒక్కటి కూడా లేదు.. కానీ కల్యాణ్ వీడియో మొత్తం హైప్‌తో నిండిపోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
ఒక కామనర్ తలుచుకుంటే.. కల్యాణ్‌పై 'బిగ్‌బాస్' ప్రశంసలు
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరనేది ఈ ఆదివారం ఎపిసోడ్‌తో తేలనుంది. అయితే, టాప్-5 కంటెస్టెంట్స్‌కు సంబంధించిన జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపుతున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, పవన్‌ల బిగ్‌బాస్ ప్రయాణాన్ని చూపించారు. అయితే, శుక్రవారం ఎపిసోడ్స్‌లో కల్యాణ్ పడాల, సంజనల జర్నీ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.బిగ్‌బాస్‌లో ఒక సామాన్యుడిలా కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే పాయింట్‌తో బిగ్‌బాస్ ఎలివేషన్ ఇచ్చారు. ఆటలో తనకు ఎదురైన కష్టాలను మరోసారి గుర్తుచేశాడు. గెలవాలనే కసితో ఒక్కోవారం పోరాడుతూ కెప్టెన్‌గా రెండుసార్లు నిలిచాడు.. ఆపై ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. తన బుద్ధి బలానికి కండ బలం తోడు కావడంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గెలుపు వైపు అడుగులు వేశాడు. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో బిగ్‌బాస్ షోతో కల్యాణ్ ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడంటూ.. బిగ్‌బాస్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. -
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
బిగ్‌బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్‌లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్‌తో పాటు తనూజ-కల్యాణ్‌ల ట్రాక్ కూడా కొనసాగింది. అయితే, తనూజ పట్ల కల్యాణ్ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు సులువుగా అర్థం అవుతుంది. కానీ, తనూజ మాత్రం తనతో ఫ్రెండ్‌గానే బంధాన్ని కొనసాగిస్తుంది. అయితే, సోమవారం జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లు లేవు కాబట్టి బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరినీ బిగ్‌బాస్ అడిగాడు. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ అనేది తనూజ, కల్యాణ్‌ల మధ్యే ఉంది. టైటిల్ రేసులో ఉన్న వారిద్దరూ కూడా చాలా స్నేహంగా ఉన్నారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే, తన జర్నీ గురించి హౌస్‌మేట్స్‌తో కల్యాణ్ ఇలా చెప్పుకొచ్చాడు. తనకు 8 ఏళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అంటూ తెలిపాడు. వెండితెరపై తన పేరు కూడా కనిపించాలనే ఆశ ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు. బిగ్‌బాస్ జర్నీ తనకు గుర్తుండిపోయే సన్నివేశాలను చాలానే ఇచ్చింది అన్నాడు.తనూజపై కల్యాణ్ ప్రేమతనూజ, కల్యాణ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్యాణ్ బయటపడ్డాడు. తన జర్నీ గురించి చెప్పే క్రమంలో.. తనూజ వైపు కల్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు 'జీవితాంతం ఈమె (తనూజ) ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను.. కాదు, ఫ్రెండ్షిప్ను మించి అంటూ స్ట్రెయిటుగా చెప్పేశాడు. తనూజతో ఉన్న ఈ బాండ్ ఇలాగే ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే గుణం తనూజలో ఉంది. అందుకే మోర్ దేన్ ఫ్రెండ్షిప్ తనూజతో ఉండాలని అనుకుంటున్నాను.' అని కల్యాణ్ అన్నాడు. అయితే, ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి. కాస్త సిగ్గుతో ఆమె తలదించుకుంది.ఇప్పుడు ఇద్దరూ సెలబ్రిటీలేకామనర్గా కల్యాణ్ బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. కానీ, తనూజ అప్పటికే సెలబ్రిటీ. సిరీయల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరూ తక్కువ కాదు. కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కల్యాణ్ మదర్ హౌజులోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరెను గుర్తుగా ఇచ్చింది. దీని గురించి కల్యాణ్ కూడా తనూజను పలు ప్రశ్నలు అడిగాడు కూడా.. కానీ, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో వారిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే తనూజ కోసం కప్ త్యాగం చేస్తావా అని బిగ్‌బాస్ అడిగితే.. వెంటనే కల్యాణ్ ఓప్పేసుకుంటాడేమో అనేలా తన పరిస్థితి ఉంది. -
తనూజకు కల్యాణ్ ఫుల్ సపోర్ట్.. అయినా టాప్‌లో భరణి
బిగ్‌బాస్ 9 సీజన్ దాదాపు చివరకొచ్చేసింది. మరో పదిరోజులు మాత్రమే మిగిలున్నాయి. నేపథ్యంలో ఉండాల్సినంతా డ్రామా కనిపించట్లేదు. పైపెచ్చు టాప్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఉండాల్సింది పోయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇదే కాస్త చిత్రంగా అనిపిస్తుంది. తాజా ఎపిసోడ్లో అయితే తనూజకు కల్యాణ్ ఫుల్ సరెండర్ అయిపోయాడు. ఇంతకీ బుధవారం ఏమేం జరిగింది?కల్యాణ్ తొలి ఫైనలిస్ట్ అయిపోయాడు. దీంతో రెండో ఫైనలిస్ట్ రేసులో తదుపరి గేమ్ ఆడకుండా ఒకరిని తప్పించాలని బిగ్‌బాస్ చెప్పడంతో హౌస్ మెజారిటీ ప్రకారం సంజన తప్పుకొంది. తర్వాత మిగిలున్న ఐదుగురికి 'పట్టుకో పట్టుకో' అనే పోటీ పెట్టారు. ఇందులో భాగంగా సంచాలక్స్ కల్యాణ్, సంజన వేసే బంతుల్ని.. జంబో ప్యాంట్స్ వేసుకున్న పోటీదారులు పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తనూజకు కల్యాణ్ ఫుల్‌గా సపోర్ట్ చేశాడు. 10లో 7 బంతులు ఆమెకే వేయడం విశేషం. మరోవైపు సుమన్ పక్కనే నిలబడ్డ భరణి.. అతడి బంతుల్ని పట్టేసుకున్నాడు. అన్నా అది నా బల్ అని సుమన్ అంటున్నా గానీ భరణి సైలెంట్‌గానే ఉండిపోయాడు. ఈ పోటీలో తనూజ తొలి స్థానం దక్కించుకోగా భరణి, పవన్, ఇమ్మూ, సుమన్ మిగతా స్థానాల్లో నిలిచారు.గేమ్ తర్వాత తనూజ-కల్యాణ్ గురించి భరణి-సంజన మాట్లాడుకున్నారు. మరి అంత దారుణంగా.. కూర్చో అంటే కూర్చుంటున్నాడు నిలబడు అంటే నిలబడుతున్నాడు.. నేను రిలేషన్‌ని తప్పుబట్టను.. వాళ్లిద్దరూ ఎందుకో పాపం.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం కానీ తనూజ మరీ ఓవర్ కమాండ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు అని భరణి అన్నాడు. బాల్ టాస్క్ తర్వాత లీడర్ బోర్డ్‌లో ఇమ్మానుయేల్, డీమాన్ పవన్ టాప్-2లో ఉన్నారు. దీంతో ఈసారి ఇద్దరిని తర్వాత గేమ్ నుంచి తప్పించాలని బిగ్‌బాస్ పుల్ల పెట్టాడు. అలా కాసేపు హౌస్మేట్స్ తర్జన భర్జన తర్వాత వీళ్లిద్దరినీ తప్పించారు.తర్వాత 'పట్టు వదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా పజిల్ పూర్తి చేసి, రోల్ అవుతున్న తాడుని పట్టుకోవాల్సి ఉంటుంది. తొలి స్థానంలో నిలిచిన వాళ్లకు 100 పాయింట్లు వస్తాయని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో తనూజ, సంజన.. త్వరగానే పజిల్ పూర్తి చేశారు గానీ తాడుని ఎక్కువసేపు పట్టుకోలేక కింద పడేశారు. ఇక్కడే తెలివి చూపించిన భరణి.. ఆలస్యంగా పజిల్ పూర్తి చేసి తాడు చివరలో ఉండగా వెళ్లి, కాసేపు దాన్ని పట్టుకుని టాస్క్ పూర్తి చేశాడు. 100 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. సుమన్ అయితే ఈ టాస్క్ పూర్తి చేయలేకపోయాడు.పట్టు వదలకు టాస్క్ పూర్తి చేసిన భరణి(230).. ఒకేసారి 100 పాయింట్లు రావడంతో లీడర్ బోర్డ్‌లో టాప్‌లోకి వచ్చేశాడు. తర్వాత తనూజ (220), ఇమ్మాన్యుయేల్ (170), డీమన్ పవన్ (150), సంజన (140), సుమన్ (100) వరసగా నిలిచారు. ఇక టాప్-2లో నిలిచిన భరణి, తనూజలో ఒకరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమని చెప్పగా.. హౌస్‌లోకి వచ్చిన ఆడియెన్స్, తనూజ పేరు చెప్పారు. దీంతో ఈమె ఓటు అప్పీలు చేసుకుంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. -
'బిగ్‌బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
బిగ్‌బాస్ గేమ్ అంటేనే అందులోని కంటెస్టెంట్స్‌కు చాలా స్ట్రాటజీలు ఉంటాయి. కొందరైతే ముందుగానే బిగ్‌బాస్ టీమ్‌తో డీల్ సెట్ చేసుకుంటారు. తను ఎన్నివారాలు ఉండాలో దానికి తగినట్టు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమ పీఆర్ టీమ్స్‌తో ప్రేక్షకులను ముందుగా రెచ్చగొడతారు. ఆపై కులం, మతం, ప్రాంతం పేరుతో తమ కంటెస్టెంట్స్ కోసం నెట్టింట ట్రోలింగ్‌కు దిగుతారు. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్లో కూడా అదే జరగుతోంది. టాప్ 2పై ట్రోలింగ్కన్నడ అమ్మాయి అంటూ తనూజపై తీవ్రమైన ట్రోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు కల్యాణ్ మా కులపోడు అంటూ కొందరు భుజాన ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి పీఆర్ టీమ్ దానిని వైరల్ చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌పై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో కుల, ప్రాంతీయ జాడ్యం బిగ్‌బాస్‌ను కూడా తాకింది. కల్యాణ్ మా కులపోడు అంటూ ఇప్పటికే తన సామాజిక వర్గం పెద్దలు రంగంలోకి దిగారు. వేరేవాాళ్లను తొక్కితేనే..అతనిపై కామన్ మ్యాన్, ఆర్మీ మ్యాన్, తెలుగు వాడు అంటూ పీఆర్ టీమ్స్ వైరల్ చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అదే ఫార్ములా పాటిస్తున్నారు.కమ్యూనిటీ పేరెత్తితే ఏమైంది?బిగ్‌బాస్ టైటిల్ రేసులో కల్యాణ్, తనూజ ఉన్నారు. ఆమె కన్నడ అమ్మాయి కావడంతో తన భాష, ప్రాంతం గురించి చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక గేమ్ అనే సోయి కూడా చాలామందికి లేదు. ఇక్కడ ప్రాంత, కుల, భాషాభేదాలు అవసరం లేదు. ఆటను ఆటగా చూడాలనే ఆలోచన ఎవరికీ లేదు. గతంలో మెహబూబ్ కూడా కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపాడు. లాస్ట్‌కు తనే ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.ఐపీఎల్లో ఇలాంటివేం లేదేఇక్కడ కన్నడ, తెలుగు అనే ప్రాంతీయతతో పనేంటి..? ఐపీఎల్ మాదిరి బిగ్‌బాస్ కూడా ఒక గేమ్‌లా అనుకోవడమే బెటర్. ఐపీఎల్లో నగరాల పేర్లతో టీమ్స్ ఉన్నాయి. అనేక దేశాల నుంచి క్రికెటర్లు ఆయా జట్టులో ఉన్నారు. అక్కడ మనం ప్రాంతం, దేశం, కులం, భాష అనే తేడా లేకుండా చూస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలాంటి అభిప్రాయం రాదేమో..గత సీజన్ల నుంచి ఇదే ట్రోలింగ్ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొక పాయింట్ ఉంది. కన్నడ, కన్నడ అంటూ తనూజ గేమ్‌ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా యష్మి, శోభా శెట్టి, ప్రేరణ, నిఖిల్, పృథ్వి వంటి వారు కూడా ఇదే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. వీళ్లందరూ కూడా చక్కగా తెలుగు మట్లాడుతారు. వాళ్లు అవకాశాలు అందిపుచ్చుకుని నటించేది, ఆధారపడి జీవిస్తుంది తెలుగు గడ్డపైనే.. వారికి ఆధారం కూడా తెలుగు సీరియళ్లే.. వాళ్లందరూ ఇదే విషయం పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. గేమ్ పక్కట్టి..కానీ, సోషల్‌మీడియాలో ఆవేశం, దూకుడు, పిచ్చి కూతలతో పీఆర్ టీమ్స్ వారిని ట్రోలింగ్ చేస్తున్నాయి. గత సీజన్లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లను స్టార్‌మా బ్యాచ్ అని ముద్రవేసి శివాజీ టార్గెట్ చేశారు. బయట తన పీఆర్ టీమ్ ఆటతో పనిలేకుండా ఆ గ్రూప్‌పై ఇలాంటి ఎదురుదాడితోనే విరుచుకుపడింది. పీఆర్ టీమ్‌లకు గేమ్‌తో పనిలేదు. ఇదేం బాగోలేదుకేవలం ఆడవాళ్లను అవమానించేందుకే ఉన్నామనేలా సెకనుకొక కామెంట్‌తో రెచ్చిపోతున్నారు. తమ కంటెస్టెంట్లో పాజిటివ్‌ను వెతుక్కుని హైలైట్ చేసుకోవడానికి బదులు అవతలివారిని నెగెటివ్ చేయడంపైనే స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. కానీ, ఇలా కుల, ప్రాంతీయ బేధాలు తీసుకురావడం ఏమాత్రం సబబు కాదని బిగ్‌బాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు. View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) Mana Telaga Caste vadu kabatti Kalyan ki votes veyyandi ani beg chesukuntunnaru Caste Card use chesi ...🤮🤮Matladuthundhi Telaga Community President anta 👇👇#BiggBossTelugu9 #KalyanPadala pic.twitter.com/RIwmqK9pga— Arachakame (@Arachakame) December 7, 2025 -
కల్యాణ్ డ్యూటీ చేసేది మాతోనే.. తనను తొలగించలేదు!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే ఉంది. అయితే తనూజ కన్నడ అమ్మాయి అని ట్రోల్ చేస్తుంటే పవన్ కల్యాణ్ పడాల అసలు ఆర్మీ జవానే కాదని విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఇండియన్ ఆర్మీలో లేడని సీఆర్పీఎఫ్ (కేంద్ర రిజర్వు పోలీస్ దళం) అని ఓ సుందర్ అనే జవాన్ ఓ వీడియో చేశారు. కల్యాణ్ ఫ్రెండ్ క్లారిటీఅంతేకాకుండా కల్యాణ్ బయటకు వచ్చి 90 రోజులు అయిపోయింది కాబట్టి అతడిని విధుల నుంచి కూడా తొలగించి ఉంటారని పేర్కొన్నారు. ఈ వివాదంపై పవన్ కల్యాణ్ ఫ్రెండ్, సీఆర్పీఎఫ్ పోలీస్ మణికంఠ స్పందించాడు. కల్యాణ్ పడాలను ఎవరూ విధుల్లో నుంచి తీసేయలేదు. పర్మిషన్ తీసుకునే బిగ్‌బాస్‌కు వచ్చాడు. పెట్టిన లీవులన్నీ అయిపోయినా సరే ఏదైనా అత్యవసరం ఉందంటే దాన్ని పొడిగిస్తారు. కల్యాణ్‌ను తొలగించలేదుమాతో పాటు డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి మాకు తెలుసు.. తనను తీసేయలేదు. తనను తీసేయాలంటే అతడి సంతకం కచ్చితంగా ఉండాలి. కల్యాణ్ వెళ్లిపోవాలన్నా సరే.. సోల్జర్ను తొలగించడం అంత ఈజీ అయితే కాదు. దానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. పవన్ కల్యాణ్.. మొదట్లో తాను ఒక సోల్జర్ అని చెప్పుకున్నాడు. కానీ ఈ జర్నీలో తనెప్పుడూ సోల్జర్ అని చెప్పి, ఓట్లేయమని అడుక్కోలేదు. నాగార్జున అడిగితేనే..బిగ్‌బాస్ షోలో తన గేమ్, ప్రవర్తన చూసి ఓట్లేయండి. అతడెప్పుడూ సోల్జర్ అని చెప్పి సింపతీ కార్డు ఉపయోగించలేదు. నాగార్జున సార్.. కల్యాణ్, ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించు అని అడిగాడు. అప్పుడు మాత్రమే కల్యాణ్ సెల్యూట్ కొట్టి చూపించాడు. అంతే తప్ప అందులో ఏం లేదు. తనను బ్యాడ్ చేయకండి. తను చాలా బాగా ఆడుతున్నాడు అని పేర్కొన్నారు. ఈ వీడియోను పవన్ కల్యాణ్ టీమ్ అతడి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.యూటర్న్అలాగే కల్యాణ్ (Pawan Kalyan Padala)ను విమర్శించిన ఎస్జే సుందర్ అనే జవాన్ సైతం యూటర్న్ తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీ అయినా, సీఆర్పీఎఫ్ అయినా, ఏ డిఫెన్స్ ఫోర్స్ అయినా.. చేసేది దేశసేవే. వన్స్ ఎ సోల్జర్.. ఆల్వేస్ సోల్జర్. వీలైతే గెలిపించండి అని వీడియో చేశారు. మొత్తానికి ఈ రెండు వీడియోలతో కల్యాణ్‌పై వివాదానికి ఫుల్స్టాప్ పడి, నెగెటివిటీ తగ్గుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. కాగా సీఆ్పీఎఫ్.. దేశ అంత్గత భద్రతను కాపాడుతుంది. శాంతి భద్రతల విధుల్లో, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్పీఎఫ్ను వినియోగిస్తారు. View this post on Instagram A post shared by Pavan Kalyan Padala (@kalyanpadala881) View this post on Instagram A post shared by Sundara Rao Jadde (@sj_______sundar) -
పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
ఏంటో.. బిగ్‌బాస్ షోలో ఒక్క సీజన్లో ఒక్కో కార్డు వాడుతున్నారు. ఏడో సీన్లో రైతు బిడ్డ.. జై కిసాన్ అంటూ పల్లవి ప్రశాంత్‌ను పైకి లేపారు. ఈ సీజన్లో పవన్ కల్యాణ్‌ను ఆర్మీ జవాను.. జై జవాన్ అంటూ బోలెడంత హైప్ ఇస్తున్నారు. ఆఖరికి నాగార్జున సైతం రెండుసార్లు కల్యాణ్‌కు ఆర్మీ సెల్యూట్ చేశాడు. అతడు కూడా హోస్ట్‌కు రివర్స్‌లో సెల్యూట్ చేశాడు.డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారుఅయితే కల్యాణ్ ఆర్మీ జవానే కాదంటున్నాడో సైనికుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్జే సుందర్ అనే జవాన్ మాట్లాడుతూ.. 89 రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడు. వారిని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. కల్యాణ్ బిగ్‌బాస్‌కు వచ్చి 90 రోజులవుతోంది. అంటే అతడిని డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారు. ఈరోజుతో అతడు సోల్జర్ ఐడెంటిటీని కోల్పోయాడు. ఇప్పుడతడు కామన్ మ్యాన్ మాత్రమే!సెల్యూట్ కొట్టరు మరో ముఖ్య విషయం.. అతడు ఇండియన్ ఆర్మీ కాదు, సీఆర్పీఎఫ్ అని పేర్కొన్నారు. దీనిపై కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆయన లీవ్ పెట్టుకునే వచ్చాడు, మీరు కావాలనే నెగెటివ్ చేస్తున్నారని ఆగ్రహించారు. దీనికి సుందర్ స్పందిస్తూ.. నిజమైన ఆర్మీ జవాన్ ఎప్పుడూ బిగ్‌బాస్ లాంటి షోలో సెల్యూట్ కొట్టరు అని క్లారిటీ ఇచ్చారు. పెళ్లికే లీవ్ ఇవ్వరుమరో వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సైనికుడికి లీవ్ దొరకడం చాలా కష్టం. తన పెళ్లి కోసం లీవ్ అడిగితే కూడా.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమంత అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అని చెప్తుంటారు. మరో విషయం.. కల్యాణ్ ముందే రిజైన్ చేసి ఉండాలి, లేదంటే ఇప్పుడైనా తనన డిస్మిస్ చేసుండాలి. ఎవరికి పడితే వారికి సెల్యూటా?ఆయన మూడు సంవత్సరాలు సేవలందించానని చెప్పాడు. కానీ, అది నిజం కాదు.. తొమ్మిది నెలలు ట్రైనింగ్, ఆరు నెలలపాటు డ్యూటీ చేసి వచ్చేశాడు. సోల్జర్ భారతీయ జెండాకు లేదా కమాండర్‌కు మాత్రమే సెల్యూట్ కొడతాడు. ఎవరికి పడితే వారికి కాదు అన్నారు. మరి కల్యాణ్ బయటకు వచ్చాక ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by jadde sundara Rao (@sj_______sundar) చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్.. రజనీకాంత్ చెప్పిన విశేషాలు -
టార్గెట్ 'తనూజ'.. బిగ్‌బాస్ ఇదేం 'ట్రై యాంగిల్'
బిగ్‌బాస్ తెలుగు 9 చివరిదశకు చేరుకుంది. నేడు జరగనున్న ఎలిమినేషన్ తర్వాత టాప్-5లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరు అనేది తేలనుంది. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తనూజను కావాలనే బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తుందని స్టార్ మా విడుదల చేస్తున్న ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, బిగ్‌బాస్ టీమ్ వాటిని కూడా హైడ్ చేయడం లేదా తొలగించడం చేస్తున్నట్లు స్క్రీన్ షాట్స్ కూడా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.ట్రై యాంగిల్ (త్రిభుజాకారం)తో రచ్చబిగ్బాస్ గేమ్‌లో భాగంగా ట్రై యాంగిల్ ఆకారంలో ఉన్న వస్తువును ఒకే వరుసలో ఉంచాలని, అవన్నీ ఒకే సైజ్‌లో ఉండాలని రూల్ పెట్టారు. అయితే, రీతూ ఎంచుకున్న వస్తువు ట్రై యాంగిల్లో లేదని మొదట తనూజ పాయింట్ పెడుతుంది. దీంతో అదే గేమ్‌లో రీతూతో తలపడి ఓడిపోయిన భరణి ఫైర్ అయిపోతాడు. కానీ, తనూజ ఎక్కడా కూడా నోరు జారలేదు. తన సందేహం మాత్రమే చెప్పింది. అదే బిగ్‌బాస్‌కు నచ్చినట్లు లేదు.బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లుట్రై యాంగిల్ (త్రిభుజాకారం) పాయింట్ గురించి ఈ శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కూడా మాట్లాడారు. అయితే, తనూజను టార్గెట్ చేస్తూ బిగ్‌బాస్ టీమ్ రంగంలోకి దిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తనూజ తప్పులేకున్నా సరే నాగార్జున చేత అనేక మాటలు అనిపించి బిగ్‌బాస్ టీమ్ రెచ్చిపోయిందని అంటున్నారు. గ్రూప్ గేమ్ ఆడిన ఇమ్ము, కల్యాణ్‌ల గురించి నాగ్ ప్రశ్నించలేదు. రింగ్ దాచేసిన రీతూను ఒక్కమాట కూడా అనలేదు. కానీ, తనూజ తప్పులు లేకున్నా సరే ఆమెను బిగ్‌బాస్ టార్గెట్ చేశారని పోస్టులు చేశారు. దీంతో తనూజ పేరు ఏకంగా ట్రెడింగ్‌లోకి వచ్చేసింది. ట్రై యాంగిల్‌ను తప్పుగా రెడీ చేశారని నాగార్జునే చెప్పారు. అలాంటప్పుడు తనూజను తిట్టడం ఎందుకు అంటూ నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు కూడా భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్ రివ్యూవర్లు కూడా తనూజను కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్పడం విశేషం. ఒక టాస్క్‌లో కల్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటే .. చాలా ఎమోషనల్ అయ్యావ్ ఎందుకు అని నాగార్జున ప్రశ్నిస్తారు. మరి తనూజ కన్నీళ్లు పెట్టుకుంటే అదేదో చాలాతప్పు అన్నట్లుగా నాగార్జున అనడం ఎందుకు అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తనూజ చేసిన చిన్నచిన్న తప్పులను వెతికి మరి బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తుందని అంటున్నారు. చివరకు ప్రోమోలలో కూడా తనూజను తప్పుగా చూపిస్తారని, ఎపిసోడ్స్‌లో చూస్తే ఏమీ ఉండదని అంటున్నారు. ఇదంతా కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ గేమ్ ఆడుతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. Even reviewer fraternity who worked day&night to pull down #ThanujaPuttaswamy is now talking about how she is being targeted by #BiggBossTelugu9 team to help their blue eyed boy #KalyanPadala Audience are watching & they will stand for Thanuja pic.twitter.com/t8myeDDwEC— VMR (@VMR199507) December 6, 2025Biggboss reviewer on How biggboss targeting Thanuja 🤷🙏#BiggBossTelugu9 #BiggBoss9Telugu #Thanuja #demonpavan #KalyanPadala #Reethu #bharani #SumanShetty #sanjana #Emmanuel pic.twitter.com/caO9luSpU7— Common Man (@commonmanfromTG) December 7, 2025https://x.com/phantom242628/status/1994974214286389755?s=20adi reddy about targeted negative promos on Thanuja by bb team finally he addressed it #thanuja #ThanujaPuttaswamy #BiggBossTelugu9 pic.twitter.com/vE0AjCeL0l— phantom (@phantom242628) November 30, 2025We are also seeing how much more bullying you will do. Tanuja is an example of how difficult it is for a woman to rise up in our India.#BiggBossTelugu9 #Thanuja🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹pic.twitter.com/LGr0XnARS0— karthi (@karthi129867) December 6, 2025 -
తనూజకు క్లాస్ పీకిన నాగ్.. వాళ్లు ట్రోఫీకి అనర్హులు!
టికెట్ టు ఫినాలేలో కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను నాగార్జున ఎత్తిచూపాడు. ఇమ్మాన్యుయేల్ తాడు వదిలేయడం వీడియో వేసి చూపించాడు. అలాగే భరణి ట్రయాంగిల్ గోల గురించి చర్చించాడు. అనవసరమైన గొడవ మొదలుపెట్టిందే తనూజ అని క్లాస్ పీకాడు. అలాగే పవన్ ఓడిపోయిన ప్లాంకుల టాస్కు గురించి మాట్లాడుతూ.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రవర్తించావు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టికెట్ టు ఫినాలే గెలుస్తానని చెప్పి ఓడిపోయావ్ అని సెటైర్లు వేశాడు. మరి తర్వాతేం జరిగిందో శనివారం (డిసెంబర్ 6వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సుమన్ అనర్హుడుబిగ్బాస్ ట్రోఫీకి తామెందుకు అర్హులో హౌస్మేట్స్ చెప్పాలన్నాడు. మొదటగా సుమన్.. గేమ్ బాగా ఆడుతున్నాను, ఆ మేరకు ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్నాడు. ఆయనకు కప్పు గెలిచే అర్హత లేదని సంజనా, ఇమ్మాన్యుయేల్, రీతూ, పవన్ అభిప్రాయపడ్డారు. తనూజ, భరణి, కల్యాణ్ మాత్రం ఆయనకు గెలిచే అర్హత ఉందన్నారు. ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. జనాలను ఎంటర్టైన్ చేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఏ సీజన్లోనూ కమెడియన్ గెలవలేదు. ఈ సీజన్లో నేను గెలవాలనుకుంటున్నా అని చెప్పాడు. ఆయన మాటలతో హౌస్మేట్స్ అందరూ ఏకీభవించారు. వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదుతర్వాత భరణి.. నాకు దెబ్బలు తగిలినా సరే ఎక్కడా తగ్గకుండా ఆడాను. కంటెంట్ కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న పవన్‌ను ఓడించాను. కచ్చితంగా కప్పుకు అర్హుడినే అన్నాడు. రీతూ, పవన్ మినహా మిగతా అందరూ ఆయన మాటలతో ఏకీభవించారు. సంజనా.. నేను మాస్క్ వేసుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాను. చూసిందే మాట్లాడాను. నిజాయితీగా ఉన్నాను అని చెప్పగా సుమన్, భరణి, పవన్ ఆమెకు కప్పు గెలిచే అర్హత లేదని భావించారు.కల్యాణ్‌కు ఫుల్ సపోర్ట్పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నా ఇల్లు అనుకున్నాను. ఏ పని చెప్పినా అన్నీ చేశాను. ఎక్కడా మాట తప్పలేదు. బంధాల వల్ల గేమ్ తగ్గిపోతుందని తెలిసినా నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. అన్ని టాస్కుల్లోనూ బాగానే ఆడాను అని చెప్పుకొచ్చాడు. అతడికి రీతూ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ మాత్రమే సపోర్ట్ చేశారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. డిసిప్లేన్, డిటర్మినేషన్, డెడికేషన్.. ఈ మూడింటితోపాటు కమిట్మెంట్తో ఆడాను.లేడీ విన్నర్అందరితో బాగున్నా.. జెన్యూన్‌గా ఆడా.. ఎవరికీ అన్యాయం చేయలేదు అని చెప్పగా అందరూ ఇతడు అర్హుడనే తలూపారు. తనూజ మాట్లాడుతూ.. నాకు కుటుంబం, వర్క్ ప్లేస్ తప్ప మిగతాది తెలియదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నానంటే ఇప్పటికీ ఓ కలలా ఉంది. ఎక్కడా ఫేక్‌గా ఉండకుండా జెన్యూన్‌గా ఉన్నాను. నావల్ల అయినంతవరకు ఆడాను. లేడీ విన్నర్ అవ్వాలని, అది నేనే అవాలనుకుంటున్నా అని చెప్పింది. అందరూ ఆమె చెప్పింది కరెక్టేనన్నారు.ముగ్గురికే కప్పు గెలిచే అర్హతరీతూ మాట్లాడుతూ.. ప్రతి గేమ్‌లో ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నాకు ఏదనిపిస్తే అది చేశాను. గెలిచినా, ఓడినా.. ఎలా అయినా ఫైనల్స్‌లో ఉండాలన్న కసితోనే ఆడాను. ఏదో ఒకటి చేసి ముందుకెళ్లాలన్న తపనతోనే ఉన్నాను అని పేర్కొంది. సుమన్, భరణి తప్ప మిగతా అందరూ ఆమెకు అర్హత ఉందని ఓటేశారు. మొత్తానికి ఈ ఓటింగ్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ మాత్రమే అర్హులంటూ వారికి పూర్తిస్థాయిలో ఓట్లు పడ్డాయి.చదవండి: బిగ్‌బాస్ 9 షాకింగ్ ఎలిమినేషన్.. రీతూ అవుట్ -
కల్యాణ్‌కు నాగ్ సెల్యూట్.. ఇమ్మూ చీటింగ్ బట్టబయలు!
వీకెండ్లో ముందు ఫైర్ చూపించి, తర్వాత సరదాగా ఉంటాడు కింగ్ నాగార్జున. కానీ, ఈసారి ఫైర్‌ను పక్కనపెట్టేసి అందరితో కబుర్లు చెప్తూ కూల్‌గా కనిపించాడు. ముందుగా పవన్‌ను లేపి అతడి డ్రెస్ బాగుందన్నాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇమ్మాన్యుయేల్.. ఆ డ్రెస్‌లో పవన్ మ్యాజిక్ షోలు చేసేవాడిలా ఉన్నాడని కామెడీ చేశాడు. షర్ట్‌లో నుంచి పావురాలు, పాములు తీస్తాడని సెటైర్లు వేశాడు. కల్యాణ్‌కు సెల్యూట్ఆ సంగతిని నాగ్ గుర్తు చేస్తూ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను అభినందించాడు. అతడు చివరి కెప్టెన్ అయినప్పుడు ఎలాగైతే సెల్యూట్ చేశాడో, ఇప్పుడు కూడా అలాగే మరోసారి సెల్యూట్ చేసి మరీ ప్రశంసించాడు. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో ఇమ్మాన్యుయేల్ చేసిన తప్పును వీడియో వేసి చూపించాడు నాగ్.తప్పును ఎత్తి చూపుతూనే పొగడ్తలుసంజనాతో ఇమ్మూ పోటీపడ్డ టాస్క్ అది. అందులో ఇమ్మాన్యుయేల్ తాడును మధ్యలో ఒకసారి వదిలేశాడు. గేమ్ రూల్స్ ప్రకారం తాడు వదిలేస్తే ఔట్.. కానీ దాన్ని సంచాలక్ రీతూ గమనించకపోయేసరికి అతడే గెలవడం.. అలా తర్వాతి టాస్కులు కూడా గెలిచి చివరి వరకు రావడం జరిగింది. అలా తాడును వదిలేయడాన్ని తప్పుపట్టిన నాగ్.. లెక్కల్లో మాత్రం ఇరగ్గొట్టేశావ్.. అని మెచ్చుకున్నాడు. చదవండి: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది: రాజ్ పిన్ని -
పవన్ కల్యాణ్.. బిగ్‌బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా?
సామాన్యుడు బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, సీజన్ ట్రోఫీ కూడా గెలుస్తాడు అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో హుషారుగా చెప్తున్న మాట! కానీ అది సాధ్యమవుతుందా? టికెట్ టు ఫినాలే గెలిస్తే విజయానికి అడుగు దూరంలో ఆగిపోతారా? లేదా గెలిచి ప్రభంజనం సృష్టిస్తారా? ఇంతకుముందు సీజన్స్ ఏమని చెప్తున్నాయి? అనేవి ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం...ఎప్పుడు మొదలైంది?జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫస్ట్ తెలుగు బిగ్‌బాస్ సీజన్లో టికెట్ టు ఫినాలే అనే ప్రస్తావనే రాలేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ నుంచే ఇదంతా మొదలైంది. ఆ సీజన్లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలిచి అందరికంటే ముందు టాప్ 5లో అడుగుపెట్టాడు. గెలవడం పక్కనపెడితే ఫైనల్స్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.టికెట్ టు ఫినాలే నాదే.. ట్రోఫీ నాదే!మూడో సీజన్ నుంచి బిగ్‌బాస్ బాధ్యతను నాగార్జున తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సీజన్లోనే రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. ఫైనల్స్‌లో శ్రీముఖిని ఓడించి విజేతగా నిలిచాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయి ట్రోఫీ కొట్టిన ఒకే ఒక్కడుగా తెలుగు బిగ్‌బాస్ చరిత్రకెక్కాడు. ఇంతవరకు దాన్నెవరూ టచ్ కూడా చేయలేకపోయారు. నాలుగో సీజన్లో అఖిల్ గెలిచినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఐదో సీజన్లో అందరికంటే ముందు ఫైనల్స్‌లో అడుగుపెట్టిన శ్రీరామచంద్ర.. సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. గెలుపును కాదనుకుని సూట్కేస్ఆరో సీజన్లో మాత్రం ఓ అద్భుతం జరిగింది. శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. కానీ, నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షలకు టెంప్ట్ అయిపోయి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అలా రేవంత్ విజేతగా నిలిచాడు. ఇక్కడే నాగార్జున ఓ ట్విస్ట్ బయటపెట్టాడు. ప్రేక్షకులు ఎక్కువ ఓట్లేసి గెలిపించింది శ్రీహాన్‌నే అని వెల్లడించాడు. దీంతో ట్రోఫీ గెలిచిన రేవంత్ ముఖం వెలవెలబోగా.. అటు ప్రేక్షకుల అభిమానం, ఇటు డబ్బు రెండూ సొంతమయ్యేసరికి శ్రీహాన్ ముఖం కళకళలాడింది.చివరి స్థానాల్లోనే...ఇక ఏడో సీజన్లో టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్న అంబటి అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. కానీ, వైల్డ్‌కార్డ్‌గా రావడం వల్ల తనపై పాజిటివిటీ కన్నా నెగెటివిటీయే ఎక్కువ వచ్చింది. అలా టాప్ 6లో చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఎనిమిదో సీజన్లో కమెడియన్ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటికీ టాప్ 5లో చివరి స్థానంలోనే ఉండిపోయాడు.ఈసారం ఏం జరగనుంది?ఈ సారి కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇతడికి భారీ ఓటింగ్ ఉంది. ఈ కారణంగా అతడు గెలిచి చరిత్ర సృష్టించనూవచ్చు. లేదంటే రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోనూవచ్చు. ఇవేవీ కాకుండా సూట్‌కేస్ తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి కల్యాణ్ ఏం చేస్తాడో చూడాలి!చదవండి: టికెట్ టు ఫినాలే గెలిచిన కల్యాణ్ పడాల -
ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్.. ట్రోఫీకి దూరం.. తనూజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
బిగ్‌బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. వరుస గేమ్స్‌లలో తన సత్తా చూపి ప్రేక్షకులను ఫిదా చేశాడు. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఎప్పటికీ కల్యాణ్ పేరు నిలిచిపోతుంది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మూడోవారం డేంజర్ జోన్లోకి వెళ్లి ఎలిమినేట్ అవుతాడనుకున్నారు. అమ్మాయిల పిచ్చోడు అంటూ వచ్చిన నిందలు భరించాడు. అదే అమ్మాయి కల్యాణ్ గెలుపులో మూలస్థంభంగా నిలబడింది. కల్యాణ్ కేవలం సెలబ్రిటీల చుట్టు మాత్రమే తిరుగుతున్నాడని హేళన చేశారు. ఇలా ఎన్నో భరించిన కామన్ మ్యాన్ కల్యాణ్ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. ఏకంగా ఫస్ట్ పైనలిస్ట్‌గా నిలిచి అదే సెలబ్రిటీల చేత శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ, టికెట్ టూ ఫినాలే కల్యాణ్‌కు దక్కడం పెద్ద మైనస్ కానుంది. ఈ విజయం ఫైనల్ కప్‌కు దూరం చేసే ఛాన్స్ బలంగా ఉంది.భరణి, రీతూల మాటల యుద్ధంబిగ్బాస్ సీజన్-9లో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచేందుకు కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, భరణి గట్టిగానే ఫైట్ చేశారు. అయితే, రీతూ చేతిలో భరణి ఓడిపోయాడు. దీంతో ఆయన టాస్క్ నుంచి విరమించాల్సి వచ్చింది. గేమ్ పూర్తి అయిన తర్వాత సంచాలక్ సంజన తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆధారాలతో సహా తనూజ చూపుతుంది. దీంతో భరణికి కోపం వచ్చి సంజన పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరుస్తాడు. ఆపై రీతూతో పెద్దగొడవే జరిగింది. నేను గెలిచిన ప్రతిసారి ఇలా ఎదో ఒకటి చేస్తారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో భరణి వాదన కరెక్ట్‌గానే ఉంది. సంజన ఇచ్చిన తీర్పు కూడా కరెక్ట్‌గానే ఉంది. కానీ, టాస్క్‌లో భాగంగా ఇచ్చిన ట్రయాంగిల్ (త్రిభూజాకారం) వస్తువును కావాలనే బిగ్‌బాస్ టీమ్ అలా డిజైన్ చేసిందా... పొరపాటున తప్పిదం జరిగిందా తెలియాలంటే నాగార్జున చెప్పాల్సిందే. అయితే, ఈ టాస్క్‌లకు ఎలాంటి సంబంధం లేని కల్యాణ్‌ని భరణి లాగి గొడవపడ్డాడు. దీంతో కల్యాణ్‌తో కూడా గొడవ జరుగుతుంది.విన్నర్‌కు కల్యాణ్ దూరంకల్యాణ్కు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే అర్హత వంద శాతం ఉంది... అదే సమయంలో తనూజ నుంచి కూడా గట్టిపోటీ ఉంది. తనకు మహిళల బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కల్యాణ్ విన్నర్ అవడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ తీసుకుని బిగ్‌బాస్ విన్నర్ ట్రోఫీ వదిలేశాడేమో అనిపిస్తుంది. రీతూ, కల్యాణ్‌ల మధ్య జరిగిన చివరి టాస్క్ కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ ఇచ్చాడనిపిస్తుంది. అతనొక ఆర్మీ సైనికుడు కావాలనే పూర్తి ఫిజికల్ టాస్క్ పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయి ప్రత్యర్థిగా ఉంటే ఇలాంటి టాస్క్ అవసరం లేదు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన కల్యాన్ మరో రెండు వారాలు ఓటింగ్‌లో కనిపించడు. ఈ వారం కెప్టెన్ కావడంతో ఇప్పటికే ఓటింగ్‌లో లేడు. దీంతో టైటిల్ కోసం ఓటింగ్ రేసులో మాత్రమే కల్యాణ్ కనిపిస్తాడు. తనూజ దాదాపు ప్రతి వారం రేసులో ఉంటుంది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది. కల్యాణ్ కెప్టెన్ కావాలని ఆమె బలంగా కోరుకుంది. ఆపై అతనికి సపోర్ట్ కూడా చేసింది. ఇలా తనూజకే చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దీంతో దాదాపు బిగ్‌బాస్ విన్నర్ తనూజ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో రాహుల్ మినహా టికెట్ టూ ఫినాలే అందుకున్న ఎవరు కూడా బిగ్‌బాస్ ట్రోఫీ గెలవలేదన్నది గమనార్హం. -
కల్యాణ్ కోసం తనూజ.. తొక్క, తోటకూర అంటూ 'రీతూ' ఫైర్
బిగ్‌బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ముగ్గురు బరిలో ఉన్నారు. శుక్రవారం ఎపిసోడ్లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది తేలిపోతుంది. అయితే, ఈ ముగ్గురికి కట్టు! నిలబెట్టు అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. బ్రిక్స్‌తో వారు ఒక టవర్‌ను పేర్చి.. పడిపోకుండా దానిని కాపాడుకోవాలి. ఇదే సమయంలో బాల్స్‌తో ఇతర కంటెస్టెంట్స్ దాడి చేస్తుంటారు. సీజన్-7లో అమరదీప్ ఇదే టాస్క్‌తో బాగా వైరల్ అయ్యాడు. హౌస్మేట్స్ అందరూ అమర్‌ని టార్గెట్ చేయడంతో రేయ్ వద్దురా ప్లీజ్ అంటూ వేడుకుంటాడు. ఇప్పుడు రీతూ విషయంలో కూడా అదే జరిగింది. కానీ, ఇక్కడ తనూజ, సుమన్ మాత్రమే రీతూ టవర్‌ను టార్గెట్ చేశారు.'కట్టు నిలబెట్టు' టాస్క్‌కు సంచాలక్‌గా సంజనా ఉంటుంది. రీతూ కోసం డీమాన్ పవన్ ఒక్కడే నిలబడ్డాడు. అయితే, తను సైడ్ నుంచి కల్యాణ్ టవర్‌ను కూల్చేందుకు బాల్స్ విసురుతూ ఉంటాడు. దీంతో తనూజ ఫైర్ అవుతుంది. కల్యాణ్‌ను ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్లని తాను టార్గెట్ చేస్తానంటూ రీతూ టవర్‌పై బాల్స్ విసురుతుంది. దీంతో రీతూ కూడా తనూజపై భగ్గుమంటుంది. తొక్క, తోటకూర అంటూ తనూజపై రీతూ విరుచుకుపడుతుంది. అయితే, డీమాన్ దూకుడుగా బాల్స్ విసురుతున్న క్రమంలో లైన్ దాటుతాడు. దీంతో అతను డిస్‌క్వాలిఫైడ్ అవుతాడు. ఇంకేముంది రీతూ టవర్‌ను సులభంగా కూల్చేశారు. -
అంతా చీటింగే అన్న భరణి.. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్
నామినేషన్స్‌లో కూడా నవ్వుతూ ఉన్న భరణి.. టాస్కుల్లో మాత్రం ఫైర్ చూపించాడు. ఇప్పుడేకంగా కయ్యానికి కాలు దువ్వాడు. నిన్నటి టాస్క్ కాస్త గందరగోళంగా నడిచిన సంగతి తెలిసిందే కదా! దానికి కొనసాగింపుగా తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో భరణి.. సరిగా త్రిభుజాకారం లేని వస్తువుని ట్రయాంగిల్ అని ఎలా అంటారు? అని మండిపడ్డాడు. ఇప్పటికే కల్యాణ్, ఇమ్మూ కలిసి గ్రూప్గేమ్ ఆడుతున్నారని పసిగట్టిన భరణి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకునేందుకు సిద్ధపడలేదు.భరణి ఫ్రస్టేషన్సంజనా సంచాలకురాలిగా తప్పు చేసిందని వాదించాడు. మరోవైపు రీతూ.. ఎవరైనా ఒకరు గెలిస్తే దాన్ని రచ్చ చేయాలి, చెండాలం చేయాలి. ఒకరు హ్యాపీగా ఉండకూడదు! అని అసహనం వ్యక్తం చేసింది. సీజన్లో ఎక్కడెక్కడ చీటింగ్ జరిగాయి? ఎక్కడెక్కడ షూ చూపిస్తే మనుషుల్ని గుర్తుపట్టారు.. మొత్తం వీడియోలతో సహా బయటకు వచ్చాయి. అయినా సరే, ఇప్పటికీ నోరు మూసుకునే కూర్చున్నా అంటూ తన ఫ్రస్టేషన్ అంతా వెళ్లగక్కాడు. చీటింగ్‌తో కల్యాణ్ కెప్టెన్ఇంతకీ ఆ షూ గొడవేంటంటే.. కళ్లకు గంతలు కట్టి లైట్లు ఆఫ్ చేసే కెప్టెన్సీ టాస్క్‌లో కల్యాణ్ (Pawan Kalyan Padala) లైట్ ఆఫ్ చేసిందని భరణి అని పవన్.. అతడివైపు షూ చూపిస్తూ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఆ వారం కల్యాణ్ కెప్టెన్ అయ్యాడు. దాన్నే తర్వాత తనూజకు కన్ఫెషన్ రూమ్‌లో వీడియో వేసి మరీ చూపించారు. భరణి బయటకు వెళ్లొచ్చాక ఆ ఎపిసోడ్ చూశాడు కాబట్టి తనకూ తెలిసిపోయింది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్మరి కల్యాణ్‌కి ఎలా తెలిసిందంటే.. శ్రీజ రీఎంట్రీ ఇచ్చి కల్యాణ్‌కు కావాల్సినన్ని ఇన్పుట్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఈ తతంగాన్ని బయటపెట్టింది. కానీ ఇదే విషయాన్ని డిమాన్ పవన్‌తో మాత్రం చర్చించలేదు. అందుకే ప్రోమోలో కూడా వీళ్లు దేని గురించి అంటున్నారో తెలియక పవన్ సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు. భరణి, కల్యాణ్ మాత్రం కొట్టుకునేంతలా పైపైకి వెళ్లారు. ఈ గొడవను పక్కనపెడితే ఈ సీజన్లో కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినట్లు తెలుస్తోంది. -
భరణికి అన్యాయం! కనిపెట్టేసిన తనూజ
టికెట్ టు ఫినాలే రేస్‌లో ఒక్కొక్కరూ అవుట్ అవుతూ రాగా చివరకు భరణి, సుమన్, పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ మిగిలారు. మరి వీరిలో ఎవరు గేమ్స్‌లో పాల్గొన్నారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది గురువారం (డిసెంబర్ 4వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..కల్యాణ్ విన్నర్మొదటగా కలర్ గేమ్ ఛాలెంజ్‌లో భరణి, రీతూ, కల్యాణ్ ఆడారు. ఈ ఆటలో రీతూ గెలిచింది. అయితే రీతూ పూసిన పసుపు కలర్ ఎక్కువగా ఉన్నప్పటికీ తనూజ.. రెడ్ కలర్ ఎక్కువగా ఉదంటూ కల్యాణ్‌ను విన్నర్‌గా ప్రకటించింది. అతడు తన ప్రత్యర్థిగా సుమన్‌ను ఎంచుకున్నాడు. వీరికి వస్తువులు పగలగొట్టే గేమ్ ఇచ్చారు. త్రాసులో ఎవరి వస్తువులు ఎక్కువ బరువుంటే వారే గెలిచినట్లు! టార్గెట్ భరణిఈ ఆటలో కల్యాణ్ గెలవడంతో సుమన్ రేసు నుంచి అవుట్ అయ్యాడు. ఇమ్మూ, రీతూ, కల్యాణ్.. కలిసి భరణిని టార్గెట్ చేశారు. ఇమ్మూ, కల్యాణ్.. రీతూను గెలిపించి.. ఆమె భరణితో పోటీపడేలా ప్లాన్ చేశారు. వీళ్ల ప్లాన్ తిప్పికొట్టేందుకు బిగ్‌బాస్ బ్యాలెన్స్ గేమ్ ఇచ్చాడు. అయినా బిగ్‌బాస్‌నే బురిడీ కొట్టించారిద్దరూ. ఈ గేమ్‌లో కల్యాణ్, ఇమ్మూ, రీతూ స్టిక్స్ పట్టుకుంటే దానిపై హౌస్మేట్స్ కాయిన్స్ పెట్టాల్సి ఉంటుంది.ఫస్ట్ ఫైనలిస్ట్ అతడేనా?ఇమ్మూ, కల్యాణ్ ముందుగా అనుకున్నట్లుగానే ఓడిపోవడంతో రీతూ గెలిచింది. రీతూ.. భరణిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. వీరికి ట్రయాంగిల్- స్క్వేర్ అంటూ ఓ గేమ్ పెట్టారు. సంజనా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రీతూ గెలిచింది. అయితే తనూజ మాత్రం.. రీతూ పెట్టిన ఓ ట్రయాంగిల్ సరిగా లేదని చెప్తుండగా ఎపిసోడ్ ముగిసింది. అదే నిజమైతే భరణికి అన్యాయం జరిగినట్లే! ఇక ఈ టికెట్ టు ఫినాలే కల్యాణ్ గెలిచినట్లు తెలుస్తోంది. -
టికెట్ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!
టికెట్ టు ఫినాలే ఎవరికి అవసరం? ఆడగలిగే సత్తా ఉండి ఓట్ బ్యాంక్ లేనివారికి ఉపయోగకరం. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో టికెట్ టు ఫినాలే.. సుమన్, భరణి, సంజనా, రీతూ, పవన్.. వీరిలో ఎవరికి వచ్చినా ప్రయోజనం ఉండేది. వీరికి కాదని తనూజ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్‌కు వస్తే పెద్ద యూజ్ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్లకు భారీ ఓటింగ్ ఉంది. టికెట్ టు ఫినాలేవీళ్లు టికెట్ టు ఫినాలే కొట్టినా, కొట్టకపోయినా.. ప్రతివారం నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయి మరీ ఫైనల్లో చోటు దక్కించుకోగలరు. పైగా ఈ ముగ్గురూ టాప్ 3 అని ఈపాటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసు నుంచి సంజనా, తనూజ, పవన్ సైడైపోయారు. తాజా ప్రోమో ప్రకారం సుమన్ కూడా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురి మధ్యే పోటీఅలాగే భరణి కూడా ఔట్ అయ్యారట. ఈ లెక్కన రీతూ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్ ఈ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడుతున్నారు. వీరిలో కల్యాణ్, ఇమ్మూ ఇది గెలిచినా, గెలవకపోయినా వారు టాప్ 3లో ఉండటం ఖాయం. కానీ రీతూ గెలిచిందంటే మిగతా హౌస్మేట్స్ (సంజన, భరణి, సుమన్, పవన్)కి టాప్ 5లో ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. మరి ఈ టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారు? టాప్ 5లో ఎవరు మొదట అడుగుపెట్టబోతున్నారో చూడాలి! -
బిగ్‌బాస్ 9.. ట్రెండింగ్‌లో కల్యాణ్ పడాల
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ చివరకొచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలున్నాయి. దీంతో ఫైనల్‌కి ఎవరొస్తారు? ఎవరు విజేతగా నిలుస్తారు? అనే ఆసక్తి.. షో చూస్తున్న వారిలో నెలకొంది. మరోవైపు హౌస్‌కి చివరి కెప్టెన్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. దీంతో ఎక్స్(ట్విటర్)లో తెగ ట్రెండ్ అయిపోతున్నాడు. గతం వారం రోజుల్లో లక్షలాది ట్వీట్స్ ఇతడి గురించి రావడం వస్తుండటం విశేషం.స్వతహాగా ఆర్మీ జవాన్ అయిన కల్యాణ్.. బిగ్‌బాస్ షో అంటే ఇష్టంతో, ఈ సీజన్ కోసం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనలాంటి చాలామంది సామాన్యులని దాటుకుని షోలో అడుగుపెట్టాడు. ప్రారంభంలో ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. కానీ వారం వారానికి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతానికైతే ఫినాలే రేసులో ఉన్నాడు. తనూజతో నువ్వా నేనా అన్నట్లు కల్యాణ్ గేమ్ సాగుతోంది.ఈ వారం కల్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కాబట్టి నామినేషన్స్‌లో లేడు. వచ్చే వారంలో నామినేషన్స్ ఉన్నాసరే కల్యాణ్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. మరి కల్యాణ్.. ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
నొప్పితో విలవిల్లాడిన పవన్.. రీతూ, కల్యాణ్ కన్నీళ్లు
చివరి కెప్టెన్సీని హౌస్మేట్స్ చేతిలోనే పెట్టాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం ఇతర ఇంటిసభ్యులు గేమ్ ఆడాలన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్లగా చివరికి పవన్, కల్యాణ్ మిగిలారు. ఈ ఇద్దరూ ఆడిన ఆటలో కల్యాణ్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఆ ప్రక్రియ ఎలా జరిగిందో శుక్రవారం (నవంబర్ 28వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..హౌస్మేట్స్ చేతిలో పవర్తనూజ, సుమన్, భరణిలలో ముందుగా డాగర్ అందుకున్నవారు కంటెండర్స్‌లో ఒకరిని సపోర్ట్ చేయవచ్చు. వీళ్లు ఎవరికైతే డాగర్ ఇస్తారో... ఆ వ్యక్తి మరో కంటెండర్‌ను రేసు నుంచి తీసేస్తారు. అలా సంజనా, దివ్య, ఇమ్మాన్యుయేల్, రీతూ వరుసగా అవుట్ అయ్యారు. చివరకు పవన్, కల్యాణ్ మాత్రం మిగిలారు.పవన్ వర్సెస్ కల్యాణ్వీరికి కంకర ఇచ్చి రోడ్డు వేసే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో పవన్, కల్యాణ్ ఇద్దరూ చాలా బాగా ఆడారు. కల్యాణ్‌కు అందరూ సపోర్ట్ చేస్తుంటే.. పవన్‌కు రీతూ ఒక్కతే సపోర్ట్ చేసింది. అయితే పవన్ వెన్ను నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ నొప్పికి ఏడుపొక్కటే తక్కువ అంటూనే కష్టపడ్డాడు. ఏడ్చేసిన పవన్అతడి నొప్పి చూసి రీతూ (Rithu Chowdary), కల్యాణ్ ఏడ్చేశారు. గేమ్ అయిపోగానే అతడు మెడికల్ రూమ్‌కు వెళ్లివచ్చాడు. నొప్పి వల్ల ఆడలేకపోయా.. మా మమ్మీడాడీ కూడా బాధపడి ఉంటారు అని పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, అంతలోనే.. పోనీలే, మనోడు కెప్టెన్ అయ్యాడు అని సంతోషించాడు. బిగ్‌బాస్ 9లో చివరి కెప్టెన్‌గా కల్యాణ్ జెండా ఎగరేశాడు. -
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. 'రీతూ' వల్ల సేఫ్
బిగ్‌బాస్ సీజన్-9లో ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కల్యాణ్-పవన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అదే సమయంలో రీతూపై సంజన చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ అయ్యాయి. ఈ వారం నామినేషన్లో కల్యాణ్ అయితే పూర్తిగా కంట్రోల్ తప్పి రీతూపై రెచ్చిపోయాడు. తను అమ్మాయి అనే సంగతి కూడా మర్చిపోయి మీదకి దూసుకెళ్లాడు. దీంతో కల్యాణ్‌ను ఆపేందుకు డీమాన్ పవన్ మధ్యలో రావడంతో పరిస్థితి మరింత పెద్దదైంది.కల్యాణ్, డీమాన్ పవన్‌ల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో కల్యాణ్ పీకని డీమాన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు. ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్లో నాగార్జున ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కల్యాణ్ పీకని డీమాన్ పట్టుకున్న ఘటన గురించి సంజన పదేపదే హౌస్‌లో తీసుకొస్తుంది. దీంతో పవన్‌కు ఎక్కువ బ్యాడ్ నేమ్ రావచ్చని మరుసటిరోజు రీతూ జోక్యం చేసుకుంది.గొడవ కల్యాణ్‌తో జరిగింది కాబట్టి అతనితోనే రీతూ మాట్లాడింది. 'అసలు డీమాన్ ఏం చేశాడు నీ దగ్గరకు వచ్చి అంటూ కల్యాణ్‌ను రీతూ ప్రశ్నించింది. దీంతో కల్యాణ్ కూడా ఇలా సమాధానం చెప్పాడు. 'గొడవ జరిగిన సమయంలో వాడు నా పీక పట్టుకున్నాడని చెబుతున్నారు.' అని తెలిపాడు. దానికి రీతూ కూడా ఇలా చెప్పింది. వాడి ఎమోషన్ గురించి నీతో పాటు హౌస్‌లో ఉన్న వారందరికీ తెలుసు. జరిగిన గొడవలో నీ మీద వాడికి (డీమాన్) కోపం లేదు. నిన్ను ఆపేందుకే మాత్రమే వాడు వచ్చాడు. అనుకోకుండా జరిగిన విషయాన్ని సంజన చెడుగా చూపుతూ మాట్లాడుతుంది. ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియడం లేదు. వాడిని ఇలా ఎన్నిసార్లు తొక్కేస్తారు రా..' అంటూ రీతూ బాధపడుతుంది. అయితే, కల్యాణ్ కూడా డీమాన్‌కు అండగా మాట్లాడాడు. వీకెండ్లో నాగార్జున గారు ఏదైనా అడిగితే పెద్ద గొడవ ఏం జరగలేదని చెబుతానంటూ వెళ్లిపోయాడు. View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) -
బిగ్‌బాస్9: ఈసారి లేడీ విన్నర్? లేదా కల్యాణ్ గెలుస్తాడా?
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో ఫస్ట్ నుంచి బోలెడంత పాపులారిటీ ఉన్న వ్యక్తి తనూజ. అందుకే అందరికంటే ముందుగా ఈమె విన్నింగ్ రేసులోకి వచ్చింది. మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరి నిజంగా వార్ వన్‌సైడ్ అయిందా? తనూజయే గెలుస్తుందా స్పెషల్ స్టోరీలో చూసేద్దాం.తనూజ చుట్టూ బిగ్‌బాస్ 9ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కానెక్టయిన వ్యక్తి తనూజ (Thanuja Puttaswamy). గేమ్స్ తనవరకు వస్తే బాగానే ఆడుతుంది. తన తప్పు ఉందని ఎవరైనా అంటే గట్టిగా వాదిస్తుంది. షో మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే గేమ్ అంతా తనచుట్టూనే ఎక్కువగా తిరిగింది. కాకపోతే తనపై తనకు నమ్మకం తక్కువ. బలమైన ఓటింగ్అన్నింటికీ సపోర్టింగ్ గేమ్ కావాలనుకుంటుంది. అలాగైతే ఈజీగా గెలిచేస్తానని తన అభిప్రాయం. కానీ వీకెండ్లో మాత్రం తనకెవరూ సపోర్ట్ చేయడంలేదని అవలీలగా అబద్ధం చెప్తుంది. ఇలా రెండు నాలుకల మాటలు తనకు వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయినప్పటికీ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో (ఓటీటీ సీజన్ మినహా) తొలి లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. తనకు అభిమానులతో పాటు సీరియల్ ప్రేక్షకుల ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది.నెక్స్ట్ పవన్ కల్యాణ్ పడాలమొదట్లో కల్యాణ్ (Pawan Kalyan Padala) ఎందుకున్నాడు? అని జనాలే విమర్శించారు. అమ్మాయిలను అదోలా చూస్తూ ఛాన్స్ దొరికితే వారి చేయి పట్టుకుంటూ కాస్త తేడాగా ప్రవర్తించాడు. కానీ, నాగ్ ఎప్పుడైతే చేతులు పిసకడం ఆపేయ్ అని ముఖం పట్టుకుని అన్నాడో అప్పుడే తన పంథా మార్చుకున్నాడు. కల్యాణ్ అంటే ఏంటో చూపించాడు. గేమ్సై్ బాగా ఆడాడు. కాకపోతే నామినేషన్స్ తీసుకునేవాడు కాడు. ఇది టాప్ 5కి సరిపోతుంది. గెలుపుకు కాదు. ఇక్కడ అతడి ఫ్యాన్స్ జవాన్ అన్న కార్డు ఉపయోగించారు. మరో పల్లవి ప్రశాంత్జై జవాన్ అంటూ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. ఏడో సీజన్లో రైతు బిడ్డ అనే ఏకైక సింపతీ కార్డుతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. ఇప్పుడదే విధంగా సైనికుడు అనే కార్డుతో కల్యాణ్ టైటిల్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతడి పీఆర్ స్ట్రాటజీలు ఆ రేంజ్లో ఉన్నాయి. జై జవాన్ జై కిసాన్ అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ నినాదాలు మొదలుపెట్టారు.మంచోడే కానీ ఎక్కువ హైప్కల్యాణ్కు యాక్టింగ్ అంటే ఇష్టం.. ఇక్కడ అవకాశాలు వస్తే సైనిక వృత్తిని వదిలేస్తా అని అతడు ఓపెన్‌గా చెప్పినాస సరే ఓ సైనికా.. అంటూ పాటలు, మీమ్స్‌తో కావాల్సినదానికంటే ఎక్కువ హైప్ తీసుకొస్తున్నారు. దీంతో ఓటింగ్‌లోనూ తనూజతో పోటీపడే స్థాయికి చేరుకున్నాడు. పైగా బిగ్‌బాస్ టీమ్ కూడా ఈ మధ్య కల్యాణ్‌ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్ అతడిని గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.మిగిలింది ఇమ్మాన్యుయేల్ఇమ్మాన్యుయేల్ (Emmanuel) ఆల్‌రౌండర్. గేమ్స్ వచ్చాయంటే ప్రాణం పెట్టి ఆడతాడు. మిగతా సమయాల్లో కడుపుబ్బా నవ్విస్తాడు. కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. భయపడకుండా ఆడాలి. అది ఇమ్మూకి లేదు. నామినేషన్స్ అంటే భయం. ఎవరైనా నామినేట్ చేస్తే నిలువెల్లా వణికిపోతాడు. దాదాపు 10 వారాలపాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం మైనస్ అయింది. కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడటం కూడా జనాల్లో కాస్త నెగెటివిటీ తీసుకొచ్చింది. అయినప్పటికీ అతడికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి. సూట్‌కేస్ తీసుకోవడం మేలుకానీ, గెలవాలంటే ఇది సరిపోదు. ఓట్ల సంఖ్య మరింత పుంజుకోవాలి. ఒకవేళ ఫైనల్లో తన స్థానం టాప్ 3 అని తెలిస్తే మాత్రం అతడు లక్షలు ఉన్న సూట్‌కేస్ తీసుకోవడమే ఉత్తమం. తన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బయినా పనికొస్తుంది. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ 9కు శుభం కార్డు పడనుంది. మరి ఈ లోపు ఓటింగ్‌ను తారుమారు చేసేలా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి!చదవండి: బిగ్‌బాస్9 : చివరి కెప్టెన్‌గా కల్యాణ్? పవన్ ఓడించి మరీ.. -
టాస్క్‌లో ట్విస్ట్.. కల్యాణ్ రెండోసారి కెప్టెన్!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో చివరి కెప్టెన్సీ జరుగుతోంది. దీనికోసం రీతూ, సంజన, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, దివ్య పోటీపడుతున్నారు. రేసులో లేని ముగ్గురు భరణి, సుమన్, రీతూ వీళ్ల కోసం ఆడాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా డాగర్ తీసుకుంటారో.. తాము కెప్టెన్‌గా చూడాలనుకునే వ్యక్తికి ఆ డాగర్ ఇవ్వాలి.సంజనను తప్పించిన రీతూఅలా ముందుగా సుమన్.. రీతూకి డాగర్ ఇచ్చాడు. గేమ్ గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేస్తున్నావంటూ సంజనను రేసు నుంచి తీసేసింది రీతూ. నీ గేమ్ ఏముంది?పొద్దున్నే లేచి నువ్వా మూలను, అతడు ఇంకో మూలకు పోతాడు. కాసేపటికి ఇద్దరూ ప్యాచప్ అవుతారు అని చెప్పింది. అవును, నేను రియల్‌గా, జెన్యూన్‌గా ఉన్నాను అంది రీతూ. ఇక సంజనా కోసం జుట్టు త్యాగం చేసి తప్పు చేశానని బాధపడింది.మండిపడ్డ ఇమ్మూతర్వాత భరణి.. పవన్‌కు డాగర్ ఇచ్చాడు. అతడు ఇమ్మాన్యుయేల్‌ను రేసు నుంచి తీసేశాడు. అది ఇమ్మూ తీసుకోలేకపోయాడు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.. నువ్వు నవ్వితే నాకు నవ్వొస్తుంది.. ఇలాంటివి వద్దు.. అంటూ వేలు చూపించి మాట్లాడాడు. ఇకపోతే ఈ గేమ్‌లో డిమాన్ పవన్ కెప్టెన్ అయినట్లు తొలుత లీక్స్ బయటకు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తెలుస్తోంది.చివరి కెప్టెన్‌గా కల్యాణ్ఈ గేమ్‌లో చివరగా పవన్, కల్యాణ్ మిగిలారట. వీరిద్దరికీ పెట్టిన గేమ్‌లో కల్యాణ్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఫైర్ స్ట్రామ్ వచ్చినప్పుడు కల్యాణ్ ఫస్ట్ టైమ్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు సీజన్లో చివరగా మరోసారి కెప్టెన్ అయ్యాడు. ఇది ఫ్యాన్స్ మంచి కిక్కిచ్చే వార్తే అవుతుంది! చదవండి: ఓవర్ చేసిన యావర్.. కెప్టెన్సీ కంటెండర్స్ వీళ్లే -
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్‌కు ఛాన్సే లేదు!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ యేటికాయేడు షోకి వచ్చే సెలబ్రిటీలు తగ్గిపోతున్నారు. ఈసారి కూడా అదే జరగబోతుందని ఊహించిన బిగ్‌బాస్ టీమ్ కామనర్స్‌కు వెల్కమ్ చెప్తూ అగ్నిపరీక్ష షో పెట్టింది. తద్వారా ఆణిముత్యాలను వెలికి తీసి బిగ్‌బాస్ 9కి పంపింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగుర్ని హౌస్‌లోకి పంపింది. (Bigg Boss 9 Telugu Top 5 Contestants Prediction)కామనర్స్వాళ్లే కల్యాణ్, హరిత హరీశ్, డిమాన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మర్యాద మనీష్. లెక్క సరిపోలేదనుకున్నాడో ఏమోకానీ బిగ్‌బాస్.. అగ్నిపరీక్ష నుంచి దివ్యను సైతం హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్‌గా పంపించాడు. అయితే షో ప్రారంభంలో కామనర్లు మూటగట్టుకున్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు. తామేదో తోపులం, బిగ్‌బాస్ ఇంటికి మహారాజులం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేసరికి మనీశ్, ప్రియ, హరీశ్, శ్రీజను బయటకు పంపించేశారు. హౌస్‌లో 9 మందిదివ్య కూడా వెళ్లిపోయేదే కానీ గొడవలకోసం తనను ఆపేశాడు బిగ్‌బాస్. ఫైర్స్ట్రామ్స్ అయితే ఒక్కరూ మిగల్లేదు. ఇప్పుడు బిగ్‌బాస్ 12వ వారం నడుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది మిగిలారు. వారే భరణి, కల్యాణ్, పవన్, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ, దివ్య. వీరిలో తనూజ మొదటినుంచి విన్నింగ్ రేస్‌లో ఉంది. ఏడుపు గోల ఉన్నప్పటికీ సహనం కోల్పోకుండా అన్నింట్లోనూ ది బెస్ట్ ఇస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. నెగెటివిటీ నుంచి టాప్ 2కి..కల్యాణ్ (Pawan Kalyan Padala).. మొదటి మూడు వారాలు ఆడిందే లేదు. పైగా అమ్మాయిలను అదోలా చూస్తూ నెగెటివిటీ సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే నాగార్జున హింట్స్ ఇచ్చాడో వెంటనే తీరు మార్చుకుని గేమ్‌పై ఫోకస్ పెట్టాడు. అలా ఇప్పుడేకంగా కప్పు కోసం పోటీపడుతున్నాడు. ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే.. ఇతడు ఆల్‌రౌండర్. గేమ్స్ బాగా ఆడతాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. కానీ సేఫ్ గేమ్ ఒక్కటే అతడికి పెద్ద మైనస్. దానివల్లే కాస్త వెనకబడ్డాడు. 11వ వారాలు నామినేషన్స్‌లోకి రాకపోవడం కూడా అతడికి దెబ్బేసింది.(Bigg Boss Telugu 9 Top 5 Contestants Analysis) టాప్ 5లో ఎవరు?తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్.. ఈ ముగ్గురు టాప్ 3లో ఉండటం ఖాయం. మరి తర్వాతి రెండు స్థానాల్లో ఎవరన్నది అసలైన ప్రశ్న. గుడ్డు దొంగతనంతో ఈ సీజన్‌పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసిన సంజనా తర్వాత మాత్రం దారి తప్పింది. ఇటీవల జరిగిన నామినేషన్స్‌లో అయితే రీతూ క్యారెక్టర్‌ను తప్పు పడుతూ మాట్లాడింది. అసలే పెద్దగా ఫ్యాన్ బేస్ లేని తనకు ఇది కచ్చితంగా నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఆమె టాప్ 5 బెర్త్ గల్లంతయినట్లే!ఈ ముగ్గురు కష్టమే!దివ్య ఆల్రెడీ గతవారమే ఎలిమినేట్ అవాల్సిన క్యాండిడేట్.. పైగా తనూజను టార్గెట్ చేయడం సీరియల్ ఆడియన్స్‌కు అస్సలు నచ్చలేదు. పైగా భరణికి కనీస గౌరవం ఇవ్వకుండా నోరు పారేసుకోవడం చూసేవారికి కూడా కోపం తెప్పిస్తోంది. ఇవన్నీ దివ్యను టాప్ 5కి వెళ్లకుండా ఆపుతున్నాయి. సుమన్ కూడా టాప్ 5కి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. మిగతావారందరితో పోలిస్తే గేమ్‌లో సుమన్ చాలా వెనకబడి ఉన్నాడు. పైగా హౌస్‌లో మెరుపుతీగలా ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఫైనల్స్‌కు వెళ్లడం కష్టమే!భరణికి ఛాన్స్తనూజ, దివ్య మధ్య నలిగియిన భరణి (Bharani Shankar)ని జనాలు పట్టించుకోవడం మానేశారు. అందుకే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, రీఎంట్రీ తర్వాత తనలో కామెడీ యాంగిల్ చూపించాడు. తనూజ, దివ్యను నామినేట్ చేశి వారికే ఎదురెళ్లాడు. ఇది జనాలకు నచ్చింది. అతడిపై పాజిటివిటీ పెరుగుతోంది. కాబట్టి టాప్ 5లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. పవన్ - రీతూ.. ఏ సీజన్లో అయినా లవ్‌ట్రాక్ వల్ల పేరొస్తుంది. కానీ ఈ సీజన్లో మాత్రం బోలెడంత నెగెటివిటీ వచ్చింది. కొన్నివారాలపాటు వీళ్లిద్దరినీ విమర్శించనివాళ్లే లేరు. కానీ, రానురానూ ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారింది. ఎవరెన్ని మాటలన్నా కలిసే ఉండటంతో వీళ్ల బంధం నిజమైనదే అని జనాలు అభిప్రాయపడ్డారు. ఒకరి కోసం ఒకరు నిలబడటాన్ని మెచ్చుకున్నారు. దీంతో వీళ్లిద్దరు లేదా ఎవరో ఒకరు టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది.అదే పవన్‌కు మైనస్నిజం చెప్పాలంటే పవన్ ఆటకు, మాటతీరుకు అతడు టాప్ 3లో ఉండాల్సినవాడు. కానీ, అతడికి రావాల్సినంత హైప్ రాలేదు. పైగా అతడేం చేసినా నెగెటివే అవుతోంది. పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా అతడికి మైనస్‌గా మారింది. మరి అతడు ఈ అడ్డంకులను దాటుకుని ఫినాలేకు వెళ్తాడేమో చూడాలి! రానున్న రోజుల్లో కంటెస్టెంట్ల ఆటతీరు, మాట తీరును బట్టి టాప్ 5 స్థానాలు మారే ఛాన్స్ ఉంది!చదవండి: బిగ్‌బాస్: ప్రేరణతో తలపడి ఓడిపోయిన తనూజ -
కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోపోయా.. భరణి భావోద్వేగం
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్ (Bigg Boss Telugu 9) ముగింపుకు దగ్గరపడేకొద్దీ మరింత రంజుగా మారుతోంది. నామినేషన్స్ ఈసారి అగ్గిరాజుకున్నాయి. ముఖ్యంగా సంజన.. ప్లాన్ చేసి మరీ గొడవ పడింది. రీతూ క్యారెక్టర్‌ను తప్పు పట్టిన తను ఆమెకు సారీ చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. మరోవైపు మాజీ కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశారు. ఆ విశేషాలు మంగళవారం (నవంబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...చూసిందే చెప్పా!రీతూ (Rithu Chowdary)- పవన్ ఫ్రెండ్స్‌కు ఎక్కువ, ప్రేమికుల కన్నా తక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. రాత్రిపూట ఒకే బెడ్‌పై కూర్చుని ముచ్చట్లు కూడా పెడుతుంటారు. కానీ, జరగరానిదేదో జరిగినట్లు దాన్ని చాలా చెండాలంగా చిత్రీకరించింది సంజన. తొమ్మిదివారాలుగా నేను కనబడలేనంటుందా? సంజనా ఉందని తనకివాళ తెలిసుంటుంది అని శాడిజం చూపించింది. సారీ చెప్పనుసారీ చెప్పమని ఎవరు అడిగినా కుదరదని కరాఖండిగా చెప్పింది. నేను చూసిందే చెప్పా.. అందులో తప్పేం లేదని అడ్డంగా వాదించింది. అంతగా కావాల్సి వస్తే ఆమె సారీ చెప్తేనే నేను చెప్తా అని మొండిగా వాదించింది. ఇదంతా చూస్తుంటే రీతూపై పగ తీర్చుకున్నట్లే కనిపిస్తోంది. ఇక హౌస్‌లో ఈసారి కెప్టెన్సీ టాస్క్ వెరైటీగా సాగింది. పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లు వస్తుండగా.. వారితో తలపడి ఆడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అవాలి.బిగ్‌బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్లుమొదటగా బిగ్‌బాస్ 7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ (Priyanka Jain) హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. తను కల్యాణ్‌తో పోటీపడతానంది. వీరిద్దరికిచ్చిన చేప గేమ్‌లో కల్యాణ్ ప్రియాంకను ఓడించి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పంచెకట్టుతో హౌస్‌లో ప్రవేశించాడు. ఇప్పటివరకు కెప్టెన్ అవని భరణికి తనతో తలపడే ఛాన్స్ ఇచ్చాడు.భరణి ఎమోషనల్అసలే టాస్కుల్లో దిట్ట అయిన గౌతమ్.. భరణి (Bharani Shankar)ని ఇట్టే ఓడించేశాడు. కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోయిందంటూ భరణి ఎమోషనలయ్యాడు. కెప్టెన్ అవాలి నాన్న అని కూతురు ప్రేమగా కోరిన ఒక్క కోరికను నెరవేర్చలేకపోయానని బాధపడ్డాడు. నాకు కెప్టెన్సీ రాసి లేదు. సారీ హనీ పాప, సారీ ఫ్రెండ్స్, సారీ అమ్మా.. అని బాధపడుతుంటే తనూజ అతడిని ఓదార్చింది. రేపు మరికొందరు మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి రానున్నారు. -
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
గతవారం ఫ్యామిలీ వీక్ కావడంతో బిగ్‌బాస్ హౌస్ అంతా ప్రశాంతంగా కనిపించింది. హౌస్మేట్స్ కుటుంబ సభ్యులు, కన్నీళ్లు, భావోద్వేగాలు ఇలా చూడముచ్చటగా అనిపించింది. ఆదివారం దివ్య బయటకు వెళ్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇమ్ము పవర్ వల్ల ఆమె సేవ్ అయిపోయింది. దీంతో ఎవరూ ఔట్ కాలేదు. సోమవారం వచ్చేసరికి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. కాకపోతే ఈసారి అటు పవన్, ఇటు సంజన.. బిగ్‌బాస్ గీత దాటి ప్రవర్తించారు. ఒకరు నోరు జారితే మరొకరు ఫిజికల్ హ్యాండ్లింగ్ చేశారు. ఇంతకీ 78వ రోజు ఏం జరిగింది? నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు?ఈసారి నామినేషన్స్ ప్రక్రియని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. మొదటి సీక్రెట్‌గా ఒకరి పేరు రాసి, ఆ కార్డ్‌ని బాక్స్‌లో వేయాల్సి ఉంటుందని చెప్పగా అందరూ దీన్ని ముగించారు. ఇక సాధారణ నామినేషన్ ప్రక్రియ మాత్రం ఈసారి రచ్చ రచ్చ అనేలా సాగింది. కొట్టుకోవడం, నోరు జారడం లాంటివి చాలా జరిగాయి. మొత్తం ఎపిసోడ్లో కల్యాణ్-పవన్ వివాదం, సంజన-రీతూది మాత్రం హైలైట్ అయింది.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్)ఇమ్ముని పవన్ నామినేట్ చేశాడు. గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో మనం మాట్లాడుకున్నాం, నేను నీకు సపోర్ట్ చేస్తాను.. నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని అనుకున్నాం. కానీ నువ్వు అలా చేయలేదు అని డీమాన్ పవన్ తన పాయింట్ చెప్పాడు. వీళ్లిద్దరూ ఎవరికి వాళ్లు తమని డిఫెండ్ చేసుకుంటుండగా.. మధ్యలో కల్యాణ్ ఎంటరయ్యాడు. వేర్వేరు టీమ్స్‌లో ఉండగా.. పవన్ ఇలాంటి డీల్ చేసుకోవడం ఏంటని అడిగాడు. డీమన్-కల్యాణ్ మధ్య డిస్కషన్ జరుగుతుండగా.. రీతూ కూడా దీనిలోకి ఎంటరైంది. నువ్వు అరిచినంత మాత్రాన ఏం కాదు, ఆరోజు ఇమ్మూ అన్నతో డీల్ మాట్లాడుకున్నానని నా మీద నింద వేశావ్. మరి ఇప్పుడు డీమన్ చేసింది ఏంటి అని కల్యాణ్ రీతూపై రెచ్చిపోయాడు.కల్యాణ్ మాటలకు రెచ్చిపోయిన రీతూ.. గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో కల్యాణ్ కూడా ఎక్కడా తగ్గలేదు. నువ్వు నీకు నచ్చినట్లు మాట్లాడకు.. ఏది పడితే అది వాగకు అంటూ రీతూ అనేసరికి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు శనివారం వచ్చినప్పుడు వీడియో ప్లే చేయించు.. నేను టీమ్ కోసం ఆడదామని చెప్పిన దానికి డీమన్ ఓకే చెప్పలేదని చూపించు. నేను షో నుంచి వెళ్లిపోతాను అని కల్యాణ్, రీతూకి సవాల్ చేశాడు. దీంతో మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అడ్డుకునే క్రమంలో కల్యాణ్ పీకని డీమన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు.దీని తర్వాత కెప్టెన్ రీతూ.. సంజనని నామినేట్ చేసింది. దీంతో మరో గొడవ మొదలైంది. ఫైర్ స్ట్రామ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అసలు కనిపించడం లేదు. కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మూ సపోర్ట్ చేయలేదని చాలా ఫీలయ్యారు. కానీ ఈరోజు ఇమ్మూని మీరు నామినేట్ చేసే అవకాశమున్నా చేయలేనని చెప్పారు అని రీతూ తన కారణాలు చెప్పింది. తర్వాత బూతులు మాట్లాడుతున్నారని ఒకరి గురించి ఒకరు కౌంటర్స్ వేసుకున్నారు. తర్వాత పవన్-రీతూ రిలేషన్ గురించి సంజన దారుణమైన కామెంట్స్ చేసింది. నీ అంత పెద్ద బూతులు ఎవరూ వాడలేదు, నీలాంటి స్ట్రాటజీలు ఈ హౌస్‌లో ఎవరికీ లేవు రీతూ. పవన్‌తో నువ్వు రాత్రి కూర్చుంటావ్.. కళ్లు మూసుకోవాల్సి వస్తుంది నేను అని సంజన అనేసింది. ఇలా అనకూడదని చెప్పి సంజనని హౌస్మేట్స్ అంతా సముదాయించారు. కానీ ఆమె వినలేదు. చివరగా రీతూ తప్పితే హౌస్‌లోని అందరూ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది) -
కల్యాణ్ తల్లికి చీర పెట్టిన తనూజ.. అంత స్పెషల్ ఏంటో?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లోకి పవన్ కల్యాణ్, రీతూ, భరణి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వారు ఏం మాట్లాడారు? హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (నవంబర్ 20వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..కల్యాణ్ తల్లికి తనూజ గిఫ్ట్ఫ్యామిలీ వీక్ వద్దని బెట్టు చేసిన కల్యాణ్ (Pawan Kalyan Padala).. తల్లిని చూడగానే చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలని తల్లి కల్యాణ్ దగ్గర మాట తీసుకుంది. చివర్లో తనూజ.. కల్యాణ్ తల్లికి చీర పెట్టి సాగనంపింది. అది చూసిన కల్యాణ్ ఎందుకు స్పెషల్‌గా మా అమ్మకే చీర పెట్టావ్? అని అడిగాడు. అందుకామె.. నువ్వు నాపై ఎంతో కేర్ చూపించావ్, అందుకు బదులుగా తనకు చీర పెట్టాలనిపించింది, పెట్టాను అని సమాధానమిచ్చింది. రీతూ తల్లి ఎంట్రీఅలాగే తనపై లేనిపోని ఆశలు పెంచుకుంటున్న కల్యాణ్‌కు బిగ్‌బాస్ అయిపోయాక నీ జర్నీ నీది.. నా జర్నీ నాది అని క్లారిటీ ఇచ్చింది. అందుకు కల్యాణ్ నువ్వు సంతోషంగా ఉండటమే నాక్కావాలి అంటూ ప్రేమపిపాసిలా డైలాగులు కొట్టాడు. తర్వాత రీతూ తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే రీతూ బోరుమని ఏడ్చేసింది. కానీ, ఆమె తల్లి మాత్రం నువ్వు నాకు నచ్చట్లేదంటూ చపాతీ కర్ర అందుకుని కొట్టబోయింది. కానీ కూతురి ఏడుపు చూసి కొట్టేందుకు చేతులు రాలేదు.మాడిపోయిన పవన్ ముఖంతనూజ, ఇమ్మూని పిలిచి మరీ మాట్లాడింది. కానీ డిమాన్ పవన్‌ను అసలు పట్టించుకోలేదు. దీంతో అతడి ముఖం వాడిపోయింది. గేమ్స్‌లో మాత్రమే ఫోకస్ చేయ్.. ఇంకేం వద్దు అని హెచ్చరించింది. మరి అది రీతూ తలకు ఎక్కించుకుందో? లేదో! ఇదంతా చూసిన పవన్.. రేపటినుంచి రీతూకి దూరంగా ఉండాలని మనసులో అనుకున్నాడు. తర్వాత భరణి కూతురు ఎంట్రీ ఇచ్చింది. తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. దివ్యకి దూరంగా ఉండుతనూజ-నాన్న బంధం తన ఫేవరెట్ అంది. నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుందని తండ్రిని కోరింది. దివ్యను తన తండ్రిపై కమాండింగ్ కాస్త తగ్గించమని కోరింది. ఆమె అటు వెళ్లగానే కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీపై అరుస్తుంటే సైలెంట్‌గా ఉండకండి. అలా అరవడం నచ్చడం లేదని చెప్పండి అని తండ్రికి సలహాలు ఇచ్చింది. ఇక హౌస్‌లోకి అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఒక్క ఇమ్మూకి తప్ప! రేపు అతడి తల్లి ఇంట్లో అడుగుపెట్టనుంది. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. -
ఇంత బాధేంట్రా పిచ్చోడా.. నాకో మాటివ్వు: కల్యాణ్ తల్లి
సామాన్యుడు బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)దాకా రావడమనేది చిన్న విషయం కాదు. షోలో అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా టైటిల్ రేసులో ఉండటం అంటే చాలా గొప్ప విషయం! ట్రోఫీ గెలుస్తాడా? లేదా? అని పక్కనపెడితే టాప్ 3లో చోటు దక్కించుకున్నా సరే అతడు గెలిచాడనే చెప్పాలి. అతడే పవన్ కల్యాణ్ పడాల.విమర్శల నుంచి పొగడ్తల వరకుచిన్న పల్లెటూరు నుంచి ఆర్మీకి... అక్కడ బ్రేక్ ఇచ్చి బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). మొదట్లో తనూజను చూసేవిధానం, మాట్లాడే విధానం ఎవరికీ నచ్చలేదు. అమ్మాయిల పిచ్చోడు అని తనపై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ తిట్టిన నోళ్లతోనే పొగిడించుకునేలా చేశాడు. తన తీరు మార్చుకున్నాడు, ఆట మార్చాడు.వద్దు వద్దంటూ..అందుకే ఇప్పుడు ఎంతోమందికి ఫేవరెట్ అయ్యాడు. చిన్నప్పుడు అమ్మానాన్న సావాసాన్ని మిస్ అయ్యానని చెప్తూ ఇటీవలి ఎపిసోడ్లో బోరుమని ఏడ్చాడు కల్యాణ్. కానీ, ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనకు ఇంట్లోవాళ్లు రావొద్దని, కావాలంటే ఎవరికోసమైనా త్యాగం చేయడానికైనా రెడీ అంటూ పిచ్చిపట్లునట్లు ప్రవర్తించాడు. తీరా కళ్ల ముందు తల్లి కనిపించేసరికి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మాటిచ్చిన కల్యాణ్ఇంత బాధ పెట్టుకున్నావేంట్రా పిచ్చోడా అని తల్లి అడిగేసరికి అమ్మ కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా మారిపోయాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలి అని తల్లి అడిగింది. అందుకు కల్యాణ్ తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటూ ఆమె చేతిలో చేయేసి మాటిచ్చాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఎమోషనల్‌గా సాగనుంది. చదవండి: పెళ్లయి 9 ఏళ్లు.. నాకు తల్లవ్వాలని లేదు: నటి -
కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యంలో మహారాజుగా ఉన్న నిఖిల్, రాణులైన తనూజ, రీతూలకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో తనూజ గెలిచి కెప్టెన్ అయింది. అది కూడా సరిగ్గా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడం విశేషం! మరి తర్వాత హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 14వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నన్నెందుకు ఎత్తుకోలేదు?తనూజ కెప్టెన్ అవగానే భరణి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ఎత్తుకుని తిప్పారు. అది చూసిన దివ్య.. నేను కెప్టెన్ అయినప్పుడు నన్నెందుకు ఎత్తుకోలేదని ప్రశ్నించింది. దానికి సమాదానం చెప్పలేక భరణి నీళ్లు నమిలాడు. తర్వాత హౌస్మేట్స్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి చిన్నప్పటి ఫోటోలను పంపించాడు బిగ్‌బాస్. వాటిని చూసిన వెంటనే తనూజ ఎమోషనలైంది. అది గమనించిన కల్యాణ్.. ఏడవకు తనూజ అని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే.. ఆవిడ మాత్రం చిటపటలాడింది.చస్తా.. ఏడుస్తా..నువ్వు ఏదైనా అడిగినప్పుడు నన్ను పూర్తిగా సమాధానం చెప్పనివ్వు అని మండిపడింది. నువ్వు ఆన్సర్ చెప్పట్లేదు, ఏడుస్తున్నావ్.. ఏడుపు ఆపేయ్ అనడం తప్పా? అని కల్యాణ్ (Pawan Kalyan Padala) అడిగాడు. ఇదే నీలో ఉన్న వరస్ట్ పార్ట్.. ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పనివ్వు. నేను ఏడుస్తానా? చస్తానా? నీకు అనవసరం.. లేకపోతే వదిలెయ్ నన్ను అని చిరాకుపడింది.గుక్కపెట్టి ఏడ్చిన కల్యాణ్తర్వాత కల్యాణ్ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో చూసి ఎమోషనలయ్యాడు. నేను పుట్టినప్పుడు నాన్నకు బిజినెస్‌లో అంతా కలిసొచ్చింది. కొన్నేళ్లకు వాళ్ల ఫ్రెండ్స్ వల్ల జీరోకు వచ్చేశాడు. నన్ను ఫస్ట్ క్లాస్‌లోనే అత్తయ్య దగ్గరకు పంపారు. తర్వాత హాస్టల్లో వేశారు. అమ్మానాన్నతో కలిసి తిరిగింది గుర్తు లేదు. వాళ్లు నా పక్కన లేరని బాధుండేది. నేనేం చేశానని ఇలా దూరం పెడుతున్నారో అర్థమయ్యేది కాదు. హాస్టల్ వార్డెన్ దగ్గర ప్రతి ఆదివారం వారి నుంచి ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. ఏడిపించేసిన ఇమ్మూకానీ నెలకోసారి మాత్రమే ఫోన్ వచ్చేది. నా 23 ఏళ్లలో నేను నాలుగేళ్లు మాత్రమే వాళ్లతో ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్‌కి తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. మా ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. మాది పాక ఇల్లు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న వద్దన్నాడట. అమ్మమ్మ మాత్రం.. పుట్టబోయే వాడి వల్ల మీ జీవితం మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది. అప్పుడు తిండి లేక అమ్మ పొలం దగ్గర మట్టి బుక్కేది. నా జీవితంలో సూపర్ హీరోచిన్నప్పటినుంచే అన్న, నేను పొలం పనులు, పత్తి ఏరడం, సిమెంట్ పని.. ఇలా చాలా చేశాం. ఎంతో కష్టపడ్డాం. నా జీవితంలో మా అన్నే సూపర్ హీరో. ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు, నువ్వెందుకు కాలేదు అని అందరూ అనడంతో వాడు ఫీలైపోయేవాడు. కానీ, కచ్చితంగా ఒకరోజు డైరెక్టర్ అవుతాడు అంటూ ఏడ్చేశాడు. అంతా అమ్మ వల్లే..తనూజకు అక్కతో దిగిన ఫోటో వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. ముగ్గురు ఆడపిల్లలంటే కష్టమే.. పెళ్లి చేసేయండి అని కొందరు నాన్నతో అనేవాళ్లు. నాన్న కూడా భయపడి వీళ్లను చదివించొద్దు, పెళ్లి చేసేద్దామన్నారు. కానీ, అమ్మ.. మా కోసం నాన్నకు దూరంగా ఉన్నా పర్లేదని హైదరాబాద్ వచ్చేసింది. నువ్వు చేయగలవు, ముందుకెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. రౌడీగా దివ్యతర్వాత అమ్మానాన్న కలిసిపోయారనుకోండి. అయినా అమ్మ వల్లే నేనిక్కడ ఉన్నాను అంటూ తనూజ హ్యాపీగా ఫీలైంది. డిమాన్ పవన్.. చెస్ ఛాంపియన్‌గా మెడల్ అందుకున్న ఫోటో చూసి మురిసిపోయాడు. దివ్యకు చిన్నప్పుడు గుండుతో రౌడీగా రెడీ చేసినప్పటి ఫోటో వచ్చింది. రీతూ.. తన చిన్నప్పటి ఫోటో చూపిస్తూ భరణిలా విలన్ అవుతానంది. సుమన్‌కు చైల్డ్‌హుడ్ ఫోటో అందింది. కానీ గౌరవ్, సంజనా, భరణి, నిఖిల్ ఫోటో స్టోరీలను మాత్రం చూపించలేదు.చదవండి: తనూజకు భారీ ఓట్లు.. సీక్రెట్ ఇదే! -
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై దాదాపు 10 వారాలు కావస్తోంది. మాటకు మాట, ఆటకు ఆట అంటూ గేమ్స్ ఆడుతున్న కంటెస్టెంట్లకు ఇంటి మీద బెంగ మొదలై చాలారోజులే అవుతోంది. ఆ బెంగతోనే కదా.. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వారి చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అందించి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.లవ్యూ అమ్మా: తనూజవాటిని చూసి మురిసిపోయిన కంటెస్టెంట్లు వాటి వెనకాల కథను చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మొదటగా తనూజ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో బెస్ట్ సూపర్ హీరో అమ్మ. నావల్ల కాదని వెనకడుగు వేసినప్పుడు.. నీవల్ల సాధ్యమవుతుంది అంటూ నన్ను ముందుకు నడిపించింది. నీవల్లే ఇక్కడున్నా సావిత్రి. లవ్యూ మమ్మీ అని ఎమోషనలైంది.తినడానికి తిండి లేక మట్టిఇక ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. అది చూసిన ఇమ్మూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మా అమ్మకు నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో తినడానికి తిండి లేదంటా! తిండి లేక అమ్మ మట్టి తినేది.. మా అన్న, నేను చిన్నప్పటినుంచి కష్టపడ్డాం. మేము చేయని పనంటూ లేదు. నా జీవితానికి మా అన్నే హీరో. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన కల్యాణ్చిన్నప్పటినుంచి మరో నాన్నలా పెంచాడు. 20 మూటలు మోయాలంటే వాడు 15 మోసి, నన్ను 5 మాత్రమే మోయనిచ్చేవాడు అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కల్యాణ్.. అమ్మానాన్నతో తిరిగింది గుర్తు లేదు. చిన్నప్పుడు ఏదీ అంత తెలిసేది కాదు. హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రతి ఆదివారం ఫోన్ కోసం వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని. కొన్ని నెలలవరకు ఫోన్ వచ్చేది కాదంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి మిగతావారి స్టోరీలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: కల్యాణ్‌ను ఓడించి.. ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా -
Thanuja: కల్యాణ్‌ను ఓడించి ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా.
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యానికి వారెవ్వా చెఫ్ వచ్చి అందరికీ కడుపునిండా భోజనం పెట్టాడు. అయితే రాజుల- రాణిల కోసం ప్రత్యేకమైన వంటకాలను పట్టుకొచ్చాడు. ఇదేదో కల్యాణ్ కోరిక(చికెన్, మటన్ తినాలనుందన్న కోరిక)ను నెరవేర్చేందుకే ఆయన్ను హౌస్‌లోకి తీసుకొచ్చినట్లుగా ఉంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (నవంబర్ 13వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...రాజావారి విందు భోజనంరాజులు కల్యాణ్ (Pawan Kalyan Padala), నిఖిల్, రాణి రీతూ కోసం మాస్టర్ చెఫ్ సంజయ్ అసిస్టెంట్ ప్రణవ్ నాన్‌వెజ్ వంటకాలు సిద్ధం చేశాడు. ఆకలి మీదున్న పులుల్లా వాటిని ఈ ముగ్గురూ ఆవురావురుమని ఆరగించారు. తర్వాత కమాండర్స్ తనూజ, డిమాన్ పవన్, దివ్య, సంజనకు వడ్డించారు. ప్రజలుగా ఉన్న సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, భరణిలను పనోళ్లుగానే చూశారు. అందుకే వారిని కింద కూర్చోబెట్టి కేవలం శాఖాహార భోజనం మాత్రమే వడ్డించారు.కల్యాణ్‌ను ఓడించిన తనూజతర్వాత బిగ్‌బాస్.. రాజు, రాణిలకు చివరగా ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు కల్యాణ్‌తో కమాండర్ తనూజ (Thanuja Puttaswamy) పోటీపడింది. ఈ గేమ్‌లో చురుకుగా, చకచకా ఆడి తనూజ గెలిచింది. అలా కల్యాణ్‌ను రాజు స్థానంలో నుంచి కిందకు దింపి తను రాణిగా మారిపోయింది. బిగ్‌బాస్ రాజ్యానికి మహారాణి అవడమే కాకుండా ఏకంగా పదోవారం కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిసారి కెప్టెన్సీ చేతిదాకా వచ్చినట్లే వచ్చి చేజారిపోయేది. ఈసారి ఏకంగా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.చదవండి: నాతో నటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు: హీరో -
రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ కల్యాణ్ వార్నింగ్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ బీబీ రాజ్యంగా మారిపోయింది. ఈ రాజ్యంలో కల్యాణ్ రాజయితే, దివ్య, రీతూ మహారాణులు. వీళ్లు నలుగురు కమాండర్లను సెలక్ట్ చేసుకుంటే మిగతావాళ్లు ప్రజలుగా ఉంటారు. మరి ఎవర్ని కమాండర్లుగా తీసుకున్నారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో మంగళవారం (నవంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..వాళ్లదే రాజ్యంబీబీ రాజ్యంలో బిగ్‌బాస్‌కు బుద్ధి పుట్టినప్పుడల్లా గేమ్స్ పెడుతూ ఉంటాడు. వారం ముగిసేసరికి రాజు, రాణులు, కమాండర్స్, ప్రజలు.. వీరిలో ఒక్కరికే ఇమ్యూనిటీ గెలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటగా మహారాజు, రాణులతో చర్చించి తనూజ, సంజనా, పవన్, నిఖిల్‌ను కమాండర్లుగా ఎంచుకున్నారు. మిగిలిన భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్, గౌరవ్ ప్రజలుగా మిగిలిపోయారు. ఈ ప్రజలే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.రీతూ తొండాటమహారాణిగా ఆసీనురాలైన దివ్య.. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా భరణితో తలకు మసాజ్ చేయించుకుంది. తర్వాత కమాండర్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌కు రీతూ (Rithu Chowdary) సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే తను గతంలో చేసిన తప్పే మళ్లీ చేసింది. పవన్ ఔట్ అయినా సరే, కాలేదంటూ అతడిని గేమ్ ఆడించింది. ఈ క్రమంలో సంజనా, తనూజ.. రీతూపై ఎగబడ్డారు. అయినా ఆమె అస్సలు లెక్కచేయలేదు. చివరకు ఈ గేమ్‌లో సంజనా ఓడిపోయింది.కష్టపడ్డ సుమన్కమాండర్స్ నలుగురిలో ఓడిపోయిన సంజనా (Sanjana Galrani) తన పోస్టు కాపాడుకోవాలంటే ప్రజల్లో ఒకరితో తలపడి గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమన్‌ను ఎంచుకుంది. ఈ ఇద్దరికీ కాటన్ డబ్బాలతో టవర్ కట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. సుమన్‌కు మరీ ఎక్కువ ఎత్తులో డబ్బాలు పెట్టడమనేది తన హైట్‌కు కష్టమైన విషయమే! అయినప్పటికీ సంజనాకు గట్టి పోటీనిస్తూ బాక్స్ మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు. బజర్ మోగే సమయానికి సంజన-సుమన్ ఇద్దరి టవర్ ఒకే ఎత్తులో ఉంది. కాకపోతే సంజనా టవర్ నిటారుగా, పర్ఫెక్ట్గా ఉంది కనుక తనే గెలిచింది అని కల్యాణ్ ప్రకటించాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు.కల్యాణ్‌ను తిట్టిపోసిన తనూజటవర్ ఎలా ఉన్నా పర్లేదన్నారు కదా.. చివరి బాక్స్ సుమనే ముందు పెట్టాడుగా అని తనూజ, దివ్యలు నోరేసుకుని పడిపోయారు. అయినప్పటికీ కల్యాణ్ తన నిర్ణయంపై నిలబడి ఉన్నాడు. అప్పటికీ తనూజ ఒప్పుకోలేదు. ఇదంతా నువ్వు ముందు చెప్పాల్సింది. నచ్చినట్లు చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తానంటే ఎలా కుదురుతుంది? చెప్పిన మాట మీద లేవు.. గేమ్ స్టార్ట్ అయ్యేముందు ఒకటి చెప్పావ్, అయిపోయాక ఒకటి చెప్తున్నావ్.. సంచాలక్‌గా ఫెయిల్ అని అరించింది. ఆ మాటతో ఆగ్రహించిన కల్యాణ్.. నోటికొచ్చినట్లు వాగితే బాగోదంటూ బాక్సుల్ని ఒక్కదెబ్బతో గుద్ది పడేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు.చదవండి: నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ -
రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!
పచ్చని పల్లెటూరులో బతికే గంగవ్వకు ఏసీ వాతావరణం పడక, హౌస్‌లో ఉండలేక రెండుసార్లు (తెలుగు బిగ్‌బాస్ 4, 8వ సీజన్స్‌లో) సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. గత సీజన్లో మణికంఠ మానసికంగా వీక్ అయిపోయానంటూ పంపించేయమని వేడుకుని బయటకు వచ్చేశాడు. ఇప్పుడదే రకంగా రాము రాథోడ్ కూడా ఇంటి మీద బెంగతో తనంతట తానే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ నుంచి బయటకు వచ్చాడు. నాగార్జున సర్దిచెప్పినా సరే వినకుండా ఎలిమినేషన్‌కే మొగ్గుచూపాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్ 8వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..టాప్ 6లో ఎవరంటే?నాగార్జున, అమల, రామ్‌గోపాల్ వర్మల 'శివ' మూవీ ప్రమోషన్స్‌తో ఎపిసోడ్ మొదలైంది. తర్వాత.. కంటెస్టెంట్లు ఎవరు హిట్టు? ఎవరు ఫ్లాప్? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించారు. అందులో సుమన్, ఇమ్మాన్యుయేల్ (Emmanuel), తనూజ, కల్యాణ్, రీతూ, పవన్ టాప్ 6లో ఉన్నారు. వీరికి నాగ్ కొన్ని బంపరాఫర్స్ ఇస్తూనే కొన్ని కండీషన్స్ పెట్టాడు. వారి కోరికలు నెరవేర్చుకోవాలంటే కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నాడు.ఇమ్మూ స్వార్థంభరణి ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సుమన్ కెప్టెన్సీ కంటెండర్ అవుతాడని తెలిపాడు. దీన్ని సుమన్ తిరస్కరించి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఆడి గెల్చుకుంటానన్నాడు. ఇమ్మాన్యుయేల్‌కు గర్ల్‌ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ వచ్చిందని, అది వినాలంటే గౌరవ్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ పోతుందన్నాడు. ఆ పవర్ పోతే పోనీయ్.. అని భావించిన ఇమ్మూ.. ప్రియురాలి సందేశం విని ఎమోషనలయ్యాడు. తనూజ సోదరి వాయిస్ మెసేజ్ వినాలంటే కల్యాణ్ సీజన్ మొత్తం నామినేట్ అవాలన్నాడు. రీతూకి రెండు సర్ప్రైజ్లురెండువారాల్లో సోదరి పెళ్లి ఉందని ఎమోషనలైన తనూజ.. తన కోసం కల్యాణ్‌ను బలి చేసేందుకు ఒప్పుకోలేదు. కల్యాణ్‌కు వారంపాటు చికెన్, మటన్ కావాలంటే నిఖిల్ రెండు వారాలు నామినేట్ అవ్వాలన్నాడు. దీన్ని కల్యాణ్ తిరస్కరించాడు. రీతూ.. తండ్రి షర్ట్ పొందడం కోసం సంజనా చీరల్ని కోల్పోయింది. పవన్.. ఫ్యామిలీ ఫోటో కావాలంటే రీతూకి తండ్రి ఫోటో రాదన్నాడు. దీంతో అతడు తన ఫ్యామిలీ ఫోటో త్యాగం చేసి రీతూకి ఆమె తండ్రి ఫోటో వచ్చేలా చేశాడు.రాను బిగ్‌బాస్‌కు రానంటూ..ఇంటిమీద బెంగ పెట్టుకున్న రాము (Ramu Rathod)ను నాగ్ కదిలించగానే.. అతడు పాట రూపంలో తన బాధనంతా బయటపెట్టాడు. బయటకు వెళ్లిపోతానన్నాడు. హీరోలు ఆట అంతు చూస్తారు, కానీ మధ్యలో వదిలేయరు అని నాగ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రాము వినిపించుకోలేదు. క్షమించండి సార్, వెళ్లిపోతాను అని పదేపదే అదే మాట అన్నాడు. వెళ్లిపోవాలనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తా.. 10 సెకన్లలో నిర్ణయం చెప్పమంటూ టైమిచ్చినా.. వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. హౌస్మేట్స్ ఆపేందుకు ప్రయత్నించినా లెక్కచేయలేదు. అలా రాము స్వతాహాగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇది సడన్ ఎలిమినేషన్ కావడంతో అతడి జర్నీ వీడియో చూడకుండానే వెళ్లిపోయాడు.చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే.. -
కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
గత సీజన్లో జరిగిన నామినేషన్స్ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో (Bigg Boss Telugu 9) రిపీట్ కాబోతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేయనున్నారు. అయితే కాస్త డిఫరెంట్‌గా ఈ ప్రక్రియ జరగనుంది. కత్తితో పొడిచి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయినవాళ్లు ఒక కత్తితో వారే స్వయంగా నామినేట్ చేస్తారు. వాళ్లు ఎవరికైతే మరో కత్తిస్తారో.. వారు ఇంకొకర్ని నామినేట్ చేయాలన్నమాట!సంజనాకు క్లాస్ పీకిన ప్రియఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా.. హౌస్‌లో అడుగుపెట్టారు. బాడీ షేమింగ్ చేసిన సంజనాను ప్రియ నామినేట్ చేస్తూ ఆమెకు కత్తి గుచ్చింది. క్లాస్ అనే పదం వాడటం కూడా తప్పేనని క్లాస్ పీకింది. మనీష్.. కల్యాణ్‌కు కత్తి గుచ్చాడు. సర్ప్రైజ్ ఏంటంటే శ్రీజ కూడా కల్యాణ్‌నే నామినేట్ చేసిందట! ఇక ఇమ్మాన్యుయేల్.. తనూజను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.నామినేషన్స్‌లో ఎనిమిదిమందిసోషల్ మీడియాలో వైరలవుతున్న లీక్స్ ప్రకారం ఎనిమిదోవారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజనా, డిమాన్ పవన్, కల్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయినవారిలో కొద్దిమంది బిగ్‌బాస్ ట్రోఫీ కోసం మీతో పోటీపడి, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో శ్రీజ పేరు ముందునుంచి వినిపిస్తున్నదే! మరి తనతో పాటు ఇంకెవరైనా హౌస్‌లో అడుగుపెడతారా? చూడాలి! చదవండి: అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే? -
కల్యాణ్‌ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్‌బాస్‌కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్‌కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్‌గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్‌పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్‌లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్‌బిన్‌లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్‌బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్‌లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్‌పై సీఎం ప్రశంసలు -
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్‌లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్‌పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్‌లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్‌గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్‌కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్‌ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్‌కు పిలిచారు. టైఫాయిడ్‌తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్‌బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్‌బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు!
నామినేషన్స్ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్‌పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్‌పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్ 21వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నామినేషన్స్ లొల్లితనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్ చేసే పవర్‌ను కల్యాణ్‌కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్రెడీ తనూజను నామినేట్ చేసింది. నాకు ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదు అని కల్యాణ్ వివరణ ఇచ్చాడు.తనూజను ఎప్పుడో వదిలేశా!అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్‌గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్ ఇచ్చిన ఆన్సర్‌కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్ గేమ్ ఆడితే తర్వాతి వారం నామినేట్ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్.ఇమ్మాన్యుయేల్‌పై రంకెలేసిన తనూజమరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్‌పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్‌తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్‌లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్ చేయాలని బలంగా డిసైడ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.దొంగలుగా హౌస్మేట్స్బిగ్బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ టీమ్ లీడర్స్‌ను ప్రకటించాడు. గేమ్స్ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్‌లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్ అవుతారన్నాడు. మొదటి గేమ్‌లో మాధురి టీమ్ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్ పూల్‌లో ముంచేశారు.చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్‌బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్‌కార్డ్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్‌కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్‌తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్‌ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్‌ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్‌కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి (Madhuri Divvala). ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్ అంటూ హౌస్‌మేట్స్‌కు వార్నింగ్ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. అంతేగాకుండా ఇకపై తన పేరు దివ్వెల కాదు దువ్వాడ మాధురి అని ప్రకటించింది. హౌస్‌లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది.కెప్టెన్‌తో గొడవకిచెన్లో పని చేస్తున్న మాధురిని కూర్చోమన్నాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోమంటూ గౌరవంతో కుర్చీ ఆమెవైపుకు జరిపాడు. అందులోనూ పెడార్థం వెతికింది మాధురి. నేను వెళ్లాలి.. కూర్చోకపోతే ఊరుకోరా? అని అడిగింది. అప్పటికీ కల్యాణ్ ఎంతో ఓపికగా.. ఈరోజు వంట చాలా లేట్ అయింది.. రేపటినుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని సుతిమెత్తగా హెచ్చరించాడు. ఎవర్నీ లెక్క చేయని మాధురినేను అరగంట కూర్చున్నాను. అప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పుడేం చేశారు? అని తిరిగి కెప్టెన్‌నే తప్పుపట్టింది మాధురి. మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అని వార్నింగ్ ఇచ్చాడు కల్యాణ్. దీంతో దివ్య మధ్యలో కలగజేసుకుని వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వినిపించుకుంటేగా! అస్సలు లెక్కచేయలేదు. నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందన్న కల్యాణ్ మాటల్ని మాత్రం బలంగా పట్టుకుంది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్?అందుకు కల్యాణ్.. నేను గౌరవంతో కూర్చోమని చెప్పాను.. అందుకామె వెటకారంగా మాట్లాడటం అవసరమా? అని వాదించాడు. ఏయ్.. వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? అని మాధురి కల్యాణ్‌పై కోప్పడింది. అందరిపై అరిచేసిన మాధురి చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. అనాల్సిన మాటలన్నీ అనేసి లాస్ట్‌లో ఏడవడం దేనికని కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఫైర్ బ్రాండ్ అనుకున్న మాధురి అప్పుడే కన్నీటి కుళాయి తిప్పడం.. చూసేవారికి కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది. చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా -
వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్‌గా కల్యాణ్.. గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్ కల్యాణ్. అతడిని సేఫ్ జోన్లో పడేయడంతో పాటు కెప్టెన్ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్ 10వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..పూల్ టాస్క్కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్ జోన్లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్ జోన్లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్ జోన్‌కు పంపించేందుకు బిగ్‌బాస్ చివరి ఛాన్స్‌గా పూల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్ బాగా ఆడాడు. ఈ గేమ్‌లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.కల్యాణ్‌ను గెలిపించిన శ్రీజసేఫ్ జోన్లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలన్నది డిసైడ్ చేయమని డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్ ఉంది.. కల్యాణ్‌కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్ కల్యాణ్‌కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్‌గా నిలిచాడు.కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజకెప్టెన్సీ బ్యాండ్ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్ ప్లేయర్ అన్న దివ్యతో బ్యాండ్ కట్టించుకుని కాలర్ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్ అవ్వాల్సిన తను.. డేంజర్ జోన్‌కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్‌ను కెప్టెన్ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.చదవండి: కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్ అవార్డ్: స్టార్ డైరెక్టర్ -
బంధాల్లో చిక్కుకుపోయిన భరణి.. కొత్త కెప్టెన్ అతడే!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) బంధాల షోగా మారిపోయింది. మీరంతా రిలేషన్స్ పెట్టుకోవడానికి హౌస్‌కి రాలేదు, గేమ్ ఆడటానికి వచ్చారని నాగ్ చురకలంటించినా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. గతవారం తనూజ ఫేవరెట్ వస్తువులను భరణితో.. భరణికి ముఖ్యమైన వస్తువులను తనూజతో పగలగొట్టించి.. ఈ రిలేషన్స్‌కు ఫుల్స్టాప్ పెట్టమని డైరెక్ట్‌గా చెప్పారు. అబ్బే, తలకెక్కితే కదా!కనుక్కోండి చూద్దాంఈ బంధాల మధ్యలో ఎక్కువ నలిగిపోతుంది భరణియే (Bharani Shankar)! దానివల్ల ఇప్పుడేకంగా కెప్టెన్సీ కూడా చేజారింది. సేఫ్ జోన్లో ఉన్న ఇమ్మాన్యుయేల్, రాము, భరణి, దివ్య, పవన్ కల్యాణ్, తనూజ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. వీళ్లందరి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. తమ తలపై ఉన్న బల్బును ఎవరు ఆఫ్ చేశారో కరెక్ట్‌గా చెప్తే వాళ్లు ఎలిమినేట్!కెప్టెన్‌గా కల్యాణ్అలా దివ్య మొదటగా రామును తీసేసింది. కల్యాణ్ వంతు వచ్చేసరికి.. భరణి పేరు గెస్ చేశాడు. ఆయన తనూజ, దివ్యను ఎలాగో తీయడు. ఇమ్మాన్యుయేల్‌పై కొంత అనుబంధం ఉంది. కాబట్టి నన్ను తీసేయాలనుకున్నాడు అని కరెక్ట్‌గా గెస్ చేశాడు. అలా ఈ కనుక్కోండి చూద్దాం ఆటలో గెలిచి పవన్ కల్యాణ్ ఐదో కెప్టెన్‌గా నిలిచాడు. చదవండి: కమల్ హాసన్‌పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ -
సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్‌స్టోరీ
దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజనా. ఒకటీరెండు కాదు ఏకంగా 8 గుడ్లు తినేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో చక్రం తిప్పడంతో కల్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు కర్త, కర్మ, క్రియ రీతూ అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు. ఇక ఇమ్మూ తన లవ్‌స్టోరీ చెప్పాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాది శాడిజం: హరీశ్సంజనా.. అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది. దాదాపు 8 గుడ్లు తినేయడంతో హరీశ్.. ఇది సైకోయిజం, శాడిజం.. మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). తనకు కల్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది. పవన్.. బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే! దీంతో బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాన్ పవన్.. కల్యాణ్‌ను ఎలిమినేట్ చేశాడు. అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు.నాలుగో కెప్టెన్తర్వాత శ్రీజ (Srija Dammu).. ఇమ్మూను ఎలిమినేట్ చేసింది. అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది. రీతూకు సపోర్ట్ చేయమని ఓరకంగా బ్లాక్మెయిల్ చేసింది తనూజ. కానీ అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తర్వాతెప్పుడైనా సాయం చేస్తాను, కానీ, ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు. అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ. మోసపోయానని బాధనన్ను గేమ్‌లో తీసేయమన్నావా? అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ (Rithu Chowdary). దీంతో చేయ్ తీయ్ అంటూ సీరియస్ అయ్యాడు. రీతూ, పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్కచేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్? అని మనసులో బాధను బయటపెట్టాడు. నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే.. ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కల్యాణ్. ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ.చూడకుండానే లవ్తర్వాత రాంబో ఇన్ లవ్ వెబ్‌సిరీస్ హీరోహీరోయిన్ హౌస్లోపలకు వచ్చారు. తమ ప్రేమకథల్ని చెప్పమన్నారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు ఓ అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది. నా నెంబర్ ఇవ్వమని అడిగింది. అలా రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు షోలు లేవు, ఫేమస్ అవలేదు. తన ముఖం చూడకుండానే ప్రేమించాను. అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చచ్చినా, బతికినా దీనితోనే కలిసుండాలనుకున్నాను. అంత మంచి అమ్మాయి. కానీ, తర్వాత షూటింగ్స్‌లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైమ్ ఇచ్చేవాడ్ని కాదు. తనకోసం కప్పు గెలుస్తా..చిరాకుపడేవాడ్ని, తిట్టేవాడ్ని. బిగ్‌బాస్‌కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా.. రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను. నా అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. ఈ నవంబర్‌కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? తనకోసం గెలవాలి, కప్పు తన చేతిలో పెట్టాలనే ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.చదవండి: అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార -
తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. అతడే కొత్త కెప్టెన్!
షోలో కనిపించట్లేదు, కేవలం ఓదార్పులు తప్ప ఇంకేమీ లేదు అని మాటలు పడ్డ కల్యాణ్ గ్రాఫ్ ఈ ఒక్క ఎపిసోడ్‌తో ఎక్కడికో వెళ్లనుంది. కసిగా గేమ్ ఆడుతున్నాడు. తనను తాను నిరూపించుకుంటున్నాడు. అటు సంజనా మాత్రం తన గేమే కాదు, టీమ్ గేమ్‌ను సైతం చెడగొట్టేసింది. మరి హౌస్‌లో ఏం జరిగిందో అక్టోబర్ 2 ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రెడ్ టీమ్ బీభత్సంకెప్టెన్సీ కంటెండర్, మటన్, లగ్జరీ అంటూ కొన్ని కార్డులను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). వాటిని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నాడు. మొదట బాల్స్ గేమ్‌లో కల్యాణ్ (రెడ్ టీమ్) బాగా ఆడి గెలిచి కంటెండర్‌షిప్ సాధించాడు. నెక్స్ట్ హిప్పో గేమ్‌లో రెడ్ టీమ్ ప్లేయర్స్ ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ బీభత్సంగా ఆడారు. ఈ గేమ్‌లో సంజనా.. తన ఎల్లో టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్‌కు సహకరించింది. ఇదేంటని ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి ప్రశ్నించగా.. అన్నా, మనం ఎలాగో గెలవం.. రెడ్ టీమ్‌కు సపోర్ట్ చేద్దాం.. నువ్వు కూడా చేయ్ అని ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సుమన్ ఒప్పుకోలేదు. సంజనాపై సుమన్ అసహనంఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలవగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు కంటెండర్ షిప్ కార్డ్ అందింది. మరో గేమ్‌లో రెడ్ టీమ్ గెలిచి కిక్ ఔట్ కార్డు సాధించారు. దీని ద్వారా గ్రీన్ టీమ్(భరణి, దివ్య, శ్రీజ)ను ఆటలో లేకుండా ఎలిమినేట్ చేశారు. మరోవైపు సంజనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుమన్.. ఆమె నోట్లో నేరు పెట్టలేను. పెద్దాయన పెద్దాయన అంటూ నన్ను తొక్కేస్తోందంటూ డిమాన్ పవన్, రీతూల దగ్గర తన ఫ్రస్టేషన్ వెళ్లగక్కాడు.బోరున ఏడ్చేసిన తనూజతర్వాత బిగ్‌బాస్ కంటెండర్లుగా అర్హత సాధించిన కల్యాణ్, ఇమ్మాన్యుయేల్‌కు పెద్ద బాధ్యత అప్పగించాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీపడే మూడు జంటల్ని ఎంచుకోమన్నాడు. అలా వీరు.. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రామును మూడు జంటలుగా విభజించారు. వీళ్లకు గార్డెన్ ఏరియాలో ఓ గేమ్ పెట్టారు. అందులో తనూజ (Thanuja Puttaswamy) ఫౌల్ చేయడంతో గేమ్ నుంచి తీసేశారు. దీంతో తను బాత్రూమ్లోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. డోర్ తీయమని బతిమాలిన రీతూ.. తను కూడా లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.ఆ నలుగురే కెప్టెన్సీ కంటెండర్స్తర్వాత గేమ్స్‌లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్సయ్యారు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము కెప్టెన్సీ కోసం పోటీపడగా వీరిలో రాము కెప్టెన్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు హరీశ్ కళ్లలో భయం, బాధ కనిపించింది. ఇప్పటికే ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడంటూ అతడిపై నింద పడింది. దానివల్ల ఒంటరిగా కుమిలిపోతున్న హరీశ్.. ఓ గేమ్‌లో దివ్యను ముందుకు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి.. సరిగా పట్టుకోండి అని కావాలనే చీదరించుకుంది. తను జాగ్రత్తగా డీల్ చేసినా ఇలాంటి కామెంట్లు రావడంతో ఆయన వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాడు.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
బలవంతంగా ఆర్మీకి.. మాతో కలిసి భోజనం కూడా చేయడు: పవన్ పేరెంట్స్
పవన్ కల్యాణ్ పడాల.. అగ్నిపరీక్షలో ఇతడిని చూసి విన్నింగ్ మెటీరియల్ అనుకున్నారంతా! ఫోకస్ అంతా ఆటపైనే ఉండేది. ఆలోచనంతా గెలుపుపైనే ఉండేది. ఇలాంటి వ్యక్తి బిగ్‌బాస్ షోలో అడుగుపెడితే అసలైన మజా ఉంటుంది, అవతలి కంటెస్టెంట్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని భ్రమింపజేశాడు. కానీ, బిగ్‌బాస్‌కు వచ్చీరావడంతోనే తన ఫోకస్, ఆలోచనలన్నీ పక్కనపెట్టేశాడు. ట్రాక్ తప్పిన పవన్అసలు లక్ష్యాన్ని గాలికొదిలేసి రీతూ, తనూజలను ఓరచూపులు చూడటం, అమ్మాయిలు ఏడిస్తూ వారిని హత్తుకుని ఓదార్చడం తప్ప ఏమీ చేయట్లేదు. ఇది చూసిన బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ప్రియులకు నీరసమొచ్చేసింది. ఆర్మీ జాబ్‌కు బ్రేక్ తీసుకుని మరీ బిగ్‌బాస్‌కు వచ్చిన పవన్ ట్రాక్ తప్పడం ఒకింత ఆశ్చర్యమనే చెప్పవచ్చు. అయితే పవన్.. పేరెంట్స్ కోసమే బలవంతంగా ఆర్మీకి వెళ్లాడు. ఇష్టం లేకుండా సైన్యంలో చేర్పించారని తల్లిదండ్రులతో ఏడాదిన్నరపాటు మాట్లాడనేలేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేక..ఈ విషయం గురించి పవన్ (Pawan Kalyan Padala) తండ్రి మాట్లాడుతూ.. నేను, నా భార్య కొన్నేళ్లక్రితం తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాం. చావు అంచులవరకు వెళ్లొచ్చాం. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. ఆ సమయంలో వాడిని వాళ్ల అత్త దగ్గరకు పంపించాం. అక్కడ నాలుగైదేళ్లున్నాడు. అక్కడినుంచి హాస్టల్లో చేర్పించాం. చదువైపోగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరను, ఇంటికొచ్చేస్తా.. అన్నాడు. అలాగైతే నా ఇంటికి రావొద్దని చెప్పాను. బలవంతంగా ఉద్యోగానికి..ఆరోజు వచ్చేయ్‌రా అనుంటే ఈ పరిస్థితిలో ఉండేవాడా? మా బాబాయ్, అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తారు. అలా నా కొడుకుని కూడా అదే రంగంలో చూడాలనుకున్నాను. బలవంతంగా ఆర్మీకి పంపించామని 14 నెలలు మాతో మాట్లాడలేదు. మేము ఫోన్ చేసినా కట్ చేసేవాడు. నెల రోజులపాటు సెలవులకు ఇంటికి వచ్చినా సరే బయట ఫ్రెండ్స్‌తో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. మాతో కూర్చుని పావుగంటైనా మాట్లాడేవాడు కాదు.. కనీసం మాతో కలిసి భోజనం కూడా చేయడు.నా డబ్బుతోనే పెళ్లి చేస్తానేను తిరగడానికి వచ్చాను, మీతో ఊసులాడటానికి కాదంటాడు. వాడికెలా ఉండాలో తెలీదు. వాడు స్నానం చేయడానికి వెళ్తే కూడా బాత్రూమ్లో నేనే నీళ్లు పెట్టేవాడిని. నేను ఒకప్పుడు డ్రైవర్‌ను. ఒంట్లో ఓపిక లేకపోవడం వల్ల కిరాణ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నా. కల్యాణ్ డబ్బు ఇస్తానంటాడు.. కానీ నేను తీసుకోను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే వాడి పెళ్లి చేస్తాను. అదే భయంగా ఉందిఅగ్నిపరీక్షకు అప్లై చేసిన విషయం చెప్పలేదు. సెలక్ట్ అయ్యాక చెప్పాడు. మా ఇష్టాన్ని తను కాదనలేదు కాబట్టి తన ఇష్టాన్ని మేమూ అంగీకరించాం. బిగ్‌బాస్ షోలో కల్యాణ్ ఆట గురించి ఎవరైనా చెప్తుంటే ఆ క్షణం ఆనందంగా ఉంటుంది, కానీ మనసుకు నచ్చదు. ఆ షో నుంచి వచ్చాక ఉద్యోగానికి వెళ్తాడా? లీవ్ గురించి అక్కడేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్నదే భయంగా ఉంది అని పవన్ తండ్రి చెప్పుకొచ్చాడు.చదవండి: హౌస్‌మేట్స్‌ను వెర్రిపప్పలను చేసిన బిగ్‌బాస్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు


