తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ విన్నర్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. తొలిసారి ఒక సామాన్యుడు గెలిచి చరిత్ర సృష్టించాడు. తన గెలుపు తర్వాత దాన్ని అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవడంలో చాలా బిజీ అయిపోయాడు. అయితే ఫేమ్ ఉండగానే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన చేశాడు. తనకు వచ్చిన ఐడియాను అమల్లో పెట్టేశాడు.
గుడ్‌న్యూస్
ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ ఆ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ కల్యాణ్ ఏం చేశాడంటే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. తన వ్యక్తిగత విషయాలు, సరదా క్షణాలు, గుణపాఠాలు.. ఇలా ప్రతీది అభిమానులతో పంచుకునేందుకు వీలుగా యూట్యూబ్ మొదలుపెట్టినట్లు వెల్లడించాడు.
జీవితాంతం రుణపడి ఉంటా..
ప్రేక్షకుల ప్రేమ వల్లే ఇంతదూరం వచ్చానని, ఇప్పుడు యూట్యూబ్ జర్నీకి మీ అందరి సపోర్ట్ కావాలని పోస్ట్ పెట్టాడు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. తన గేమ్ నచ్చి ఓటు వేసినవారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. కొత్త యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టానని, తన ఛానల్‌కు సపోర్ట్ చేయమని కోరాడు. ఇది చూసిన అభిమానులు అతడి కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


