అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు! | Bigg Boss Rithu Chowdary About Life After Arunachalam Visit | Sakshi
Sakshi News home page

అరుణాచలం వెళ్లాక నా జీవితమే మారిపోయింది: రీతూ చౌదరి

Jan 18 2026 5:26 PM | Updated on Jan 18 2026 5:54 PM

Bigg Boss Rithu Chowdary About Life After Arunachalam Visit

బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టింది. రీతూ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా చాలా జరిగాయి. అటు హౌస్‌లో ఫైర్‌ స్ట్రామ్స్‌ (వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లు) వచ్చి రీతూ బ్యాడ్‌ అనేవారు. పవన్‌ను వాడుకుంటోంది అన్నట్లుగా కామెంట్స్‌ చేశారు. ఎందుకిలా అంటున్నారని నాకు చాలా బాధసింది. మరోపక్క బయట (హీరో ధర్మ మహేశ్‌తో సంబంధం అంటగడుతూ) నన్ను మరింత దారుణంగా చిత్రీకరించారు. 

అదొక్కటే సంతృప్తి
ఇవన్నీ చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఎలిమినేట్‌ అయి నేను బయటకు వచ్చేస్తే బాగుండనుకుంది. నేను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా తోటి ఆర్టిస్టులెవరూ నాకు సపోర్ట్‌ చేయలేదు. నాకు ఓటు వేయమని అమ్మ ఫోన్‌ చేసి అడిగితే కూడా మీడియాలో రీతూ క్యారెక్టర్‌ బ్యాడ్‌ అని వస్తోందని కామెంట్‌ చేశారంట. నన్ను ఇంత చెడ్డదానిలా చిత్రీకరించినా, నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేసినా ప్రేక్షకులు నన్ను నమ్మి ఓట్లేశారు. నన్ను నన్నుగా ప్రేమించారు. ఆ విషయంలో సంతోషంగా అనిపించింది.

డబ్బు లేకపోయినా పర్లేదు
నాకు కాబోయేవాడి విషయానికి వస్తే.. అందం గురించి పట్టించుకోను. అర్థం చేసుకుంటే చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు కానీ ఉన్నదాంట్లో మంచిగా చూసుకోవాలి. నేను హైపర్‌ యాక్టివ్‌ కాబట్టి తనకు ఓపిక, సహనం ఎక్కువుండాలి. ప్రతి అమ్మాయిని గౌరవించాలి. పెళ్లయ్యాక ఎవరూ పని మానేయకూడదు. ఇద్దరం కలిసి పని చేసుకోవాలి. అలాగే మా అమ్మ, అన్నను బాగా చూసుకోవాలి అని చెప్పింది.

దేవుడిపై నమ్మకం
చిన్నప్పుడు నేను సాయిబాబాను ఎక్కువ నమ్మేదాన్ని. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఒక బిజినెస్‌ కోసం నాన్న ఉన్న డబ్బంతా ఒకతడి చేతిలో పెట్టాడు. అంతా సవ్యంగా జరిగేలా చూడమని బాబాకు మొక్కాను. ఉపవాసాలున్నాను. అయినా ఆ డబ్బు తిరిగి రాలేదు. నాన్న ఏం చేసుకుంటాడో అని భయమేసింది. బాబాకు మొక్కినా ఫలితం లేకపోయేసరికి ఆయనపై నమ్మకం పోయింది. నాన్న చనిపోయాక అసలు భగవంతుడిని నమ్మడమే మానేశాను. అదేంటో కానీ కొంతకాలం క్రితం సడన్‌గా నా నోటి నుంచి ఓం నమఃశివాయ అనే మంత్రాలు వచ్చేవి. దాంతో జీవితంలో మొదటిసారి అరుణాచలం వెళ్లాను. 

నావల్ల కాదు
అక్కడి వెళ్లాక నా ఆలోచన విధానమే మారిపోయింది. జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. నేను, మా అమ్మ, అన్న ఎప్పుడూ కలిసే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఏదైనా చెడు జరిగితే నాకే జరగాలి కానీ, వాళ్లకేదీ జరగకూడదు. ఎందుకంటే నాన్నను కోల్పోవడమే నాకు తీరని లోటు.. మళ్లీ ఉన్నవాళ్లను దూరం చేసుకుని ఒక్కదాన్ని బతకడం నా వల్ల కాదు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం, ఇల్లు కొనడం, సక్సెస్‌ అవడం, కారులో తిరగడం.. ఇవన్నీ నాన్న కోరికలు. అవన్నీ నెరవేరే సమయంలో నాన్న లేడన్న బాధ ఉంది అని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement