breaking news
Bigg boss reality show
-
ఇదేమైనా చిన్నపిల్లల ఆటనా?: తనూజను నామినేట్ చేసిన భరణి
మండే వచ్చిందంటే నామినేషన్స్ పండగ. గొడవలు, అరుపులు, కేకలతో బిగ్‌బాస్ హౌస్ దద్దరిల్లుతుంది. గత వారం తనూజ, దివ్య ఎంతలా అరుచుకున్నారో అందరం చూశాం. మరి ఈ వారం ఎవరి మధ్య వార్ జరగనుందో చూడాలి! 12వ వారం నామినేషన్స్‌కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. 12వ వారం నామినేషన్స్ఈసారి నామినేషన్స్ రెండు లెవల్స్‌లో ఉంటుందన్నాడు బిగ్‌బాస్. మొదటగా ప్రైవేట్ నామినేషన్స్ జరుగుతాయన్నాడు. అలా ప్రతి ఒక్కరూ ఫేస్ టు ఫేస్ కాకుండా ప్రైవేట్‌గా నామినేట్ చేశారు. అలా ఇమ్మాన్యుయేల్.. పవన్‌ను, కల్యాణ్.. సుమన్‌ను, పవన్.. కల్యాణ్‌ను నామినేట్ చేశారు. 'ఇద్దరి గొడవల్లో తనూజ మళ్లీ నన్ను లాగింది. ఇదేదో చిన్నపిల్లల ఆటలా అయిపోతుంది. నామినేషన్స్‌లో ఎవరంటే?ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించట్లేదు' అంటూ భరణి.. తనూజను నామినేట్ చేశాడు. నావైపు నిల్చుంటారని కోరుకున్నప్పుడు ఆయన లేరు. అది నా గేమ్‌ను ఎఫెక్ట్ చేసిందంటూ దివ్య.. భరణిని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్ రీతూ తప్ప మిగతా 8 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇమ్మూ బలవంతం.. ఫలించిన బిగ్‌బాస్ స్కెచ్ -
ఇమ్మూపై ఒత్తిడి.. దివ్య సేఫ్.. హర్టయిన తనూజ
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) భలే తెలివైనోడు.. ఇమ్మాన్యుయేల్‌తో కావాలని పవరాస్త్ర వాడించి ఎలిమినేషన్ రద్దు చేశాడు. తర్వాత మాత్రం ఒకరు వెళ్లిపోతే నీకు పోటీ తగ్గేది కదా అని నాగార్జునతో డైలాగులు కొట్టించాడు. మరి సండే ఎపిసోడ్(నవంబర్ 23)లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారో చూసేద్దాం..సుమన్ కోసం పిల్లలుసుమన్ శెట్టి కోసం అతడి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్లను చూడగానే సుమన్‌కు కళ్లలో నీళ్లు తిరిగాయి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి.. గేమ్ బాగా ఆడాలని సుమన్‌కు సూచించాడు. సుమన్, ఇమ్మూ, తనూజా, భరణి, కళ్యాణ్‌ను టాప్ 5లో వరుసగా పెట్టారు. తర్వాత సంజన కోసం ఆమె తల్లి, మేనల్లుడు వచ్చారు. ఎవరి దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా సొంతంగా ఆడు, ఎక్కువ కంప్లైంట్స్ చేయొద్దని సలహా ఇచ్చారు. సంజన, ఇమ్మూ, కల్యాణ్, తనూజ, సుమన్‌ను టాప్ 5లో పెట్టారు.రీతూ కోసం అఖిలతర్వాత రీతూ కోసం ఆమె సోదరుడితో పాటు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ వచ్చారు. నెగెటివిటీ అంతా పోయి పాజిటివిటీతో బయటకు వస్తున్నావ్ అని అఖిల్ చెప్పడంతో రీతూ ఎగిరి గంతేసింది. రీతూ, తనూజా, కళ్యాణ్, ఇమ్మూ, డిమాన్ పవన్‌ను టాప్ 5లో పెట్టారు. అనంతరం తనూజ కోసం ముద్దమందారం సీరియల్ యాక్టర్స్ పవన్ సాయి, హరిత వచ్చారు. వాళ్లను చూడగానే తనూజ ఏడ్చేసింది. మనీష్‌కు కౌంటర్పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. నువ్వు ఎక్కడో పైనున్నావని అర్థం.. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంది హరిత. అలాగే కొన్ని వారాల క్రితం మనీష్ వచ్చి.. ముద్దుముద్దు మాటలు చెప్పి చెవిలో మందారపూలు పెడుతున్నారు అని చెప్పిన డైలాగ్‌కు ఇప్పుడు కౌంటరిచ్చింది. ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందన్నారు. నీ చెవిలో పూలు పెట్టేవాళ్లు నీ చుట్టుపక్కలే ఉంటారు జాగ్రత్త.. ఆ పూలను మాల కట్టి వికసించేలా చేయాలి అని హరిత అంది.దివ్యను కాపాడేందుకు స్కెచ్డిమాన్ పవన్ (Demon Pavan) కోసం ఆయన తండ్రి, స్నేహితుడు స్టేజీపైకి వచ్చారు. నాకు నీతి, నిజాయితీగా ఉండటమే వచ్చు.. నా కొడుక్కి అదే నేర్పించా అన్నాడు తండ్రి. డెమోన్, ఇమ్ము, సంజన, తనూజా, రీతూను టాప్ 5లో పెట్టారు. అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో దివ్య, సంజన మిగిలారు. ఇమ్మాన్యుయేల్ పవరాస్త్ర వాడితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నాడు నాగ్.నో ఎలిమినేషన్ఆ పవరాస్త్రకు ఉన్న శక్తి ఈవారంతో నిర్వీర్యం అయిపోతుందన్నాడు. దీంతో ఇమ్మూ పవరాస్త్ర వాడగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు నాగ్. అనంతరం దివ్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలిపాడు. దివ్య బతికిపోడంతో తనూజ ఫీలైనట్లు కనిపించింది. పవరాస్త్ర ఇప్పుడెందుకు వాడావు? తర్వాత ఫినాలే సమయంలో వాడుకోవచ్చుగా అంది. ఆల్రెడీ నాగ్.. దాన్ని తర్వాతి వారం నుంచి వాడేందుకు వీల్లేదన్నాడు. అయినా తనూజ అలాంటి కామెంట్ చేసిందంటే దివ్య సేవ్ చేసినందుకు కాస్త హర్ట్ అయినట్లే కనిపిస్తోంది!చదవండి: సిక్స్ ప్యాక్‌తో హీరో సెకండ్ ఇన్నింగ్స్ -
అది నా పిల్లరా..: ముద్ద మందారం హీరో
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) కంటెస్టెంట్ల కోసం వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. నిన్న భరణి కోసం నాగబాబు రాగా, నేడు తనూజ కోసం ముద్దమందారం సీరియల్ స్టార్స్ స్టేజీపైకి వచ్చేశారు. సుమన్ కోసం కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.లేడీ సింగంసీరియల్ నటి హరితను చూడగానే తనూజ చాలా మిస్ అయ్యానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు హరిత కూడా ఎమోషనలైంది. ముద్దమందారం హీరో పవన్.. తనూజను లేడీ సింగంగా అభివర్ణించాడు. తర్వాత అర్జున్ రెడ్డి ఫోటో ఉన్న కార్డ్‌ను బయటకు తీశాడు. దీంతో నాగ్.. ఆ సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమన్నాడు. అందుకు పవన్.. అది నా పిల్ల అని చెప్పాడు. నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని భరణికి సలహా ఇచ్చాడు.ఎమోషనల్ ప్రోమోనాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్ను కప్పుతో చూడాలని ఆయన కోరుకుంటున్నారు అని హరిత చెప్పగానే తనూజ భావోద్వేగానికి లోనైంది. ఈ ప్రోమో చూసిన తనూజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నింటికన్నా.. అది నా పిల్ల అనే డైలాగ్ బాగా హైలైట్ అయిందంటున్నారు. మరి దానికి కల్యాణ్ ఎలా ఫీలవుతున్నాడో? ఏంటో! చదవండి: ఈ వారం నో ఎలిమినేషన్.. దివ్యను కాపాడేందుకే! -
తప్పు చేశా.. నన్ను క్షమించండి: శివజ్యోతి
తిరుమలో ఇచ్చే దేవుని ప్రసాదంపై నోరుపారేసుకున్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పింది. ఇటీవల తన సోదరుడు, భర్తతో కలిసి శివజ్యోతి.. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లింది. అక్కడ భక్తుల కోసం ఇస్తున్న ప్రసాదాన్ని తీసుకున్న సోదరుడిని ఉద్దేశించి.. సోనీ కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు.. అని ఎగతాళి చసింది. ఆమె సోదరుడు కూడా.. జీవితంలో ఎప్పుడూ ఇలా అడుక్కోలేదు.. ఫస్ట్ టైమ్ ఇలా అడుక్కుంటున్నానని పేర్కొన్నాడు. నన్ను క్షమించండితిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనని భర్తతో ప్రసాదం గురించి కామెడీ చేసింది. దేవుని ప్రసాదం విషయంలో ఈ చిల్లర కామెంట్స్ ఏంటని సోషల్ మీడియాలో జనాలు మండిపడ్డారు. దీంతో శివజ్యోతి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయి. నా వల్ల హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. తప్పు జరిగిందినన్ను రెగ్యులర్‌గా ఫాలో అయేవారికి నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఎంతిష్టమో బాగా తెలుసు. మూడు, నాలుగు నెలలుగా శనివారాల వ్రతం గురించి ప్రచారం చేస్తూనే ఉన్నా.. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. దురదృష్టవశాత్తూ ప్రసాదం గురించి నేను అన్న కామెంట్స్‌పైనే మాట్లాడుతున్నారు. ఏదేమైనా నావైపు నుంచి తప్పు జరిగింది. నా మాటలు తప్పుగా ఉన్నాయి. కానీ, నా ఉద్దేశ్యం అయితే అదికాదు.ఆయన గురించి ఎలా..?కాస్ట్లీ లైన్లో నిలబడ్డామన్న ఉద్దేశంతో మేము రిచ్ అన్నాను. నా తరపున, నా తమ్ముడి తరపున అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా ఇంట్లో, నా చేతిపై వెంకటేశ్వరస్వామి ఉన్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా నా జీవితంలో అత్యంత విలువైనది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వరస్వామే ఇచ్చిండు. ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతాను? వెంకటేశ్వరస్వామి నా జీవితాన్నే మార్చిండు. ఆయన దయ లేకపోతే నేను అనుభవించేదేదీ నాకు రాదు. తల్లి కాబోతున్న శివజ్యోతితెలిసో తెలియకో మా నోటి నుంచి పొరపాటు వ్యాఖ్యలు వచ్చాయి. అందుకు మన్నించండి అని పేర్కొంది. కాగా పెళ్లయిన 11 ఏళ్లకు శివజ్యోతి తల్లి కాబోతోంది. ఏడు శనివారాల వ్రతం చేయడం వల్లే తాను గర్భం దాల్చానని, జీవితాంతం స్వామివారి సేవలోనే ఉంటానని చెప్తూ పొంగిపోయింది. అంత భక్తితో వెంకన్ను కొలిచిన శివజ్యోతి ఇప్పుడాయన ప్రసాదం గురించి తప్పుగా మాట్లాడటం.. దానిపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పింది. చదవండి: ఈ వారం నో ఎలిమినేషన్ -
ఈ వారం నో ఎలిమినేషన్.. టాప్ 5లో వీళ్లేనా?!
సుమన్ చేసిన పొరపాటు వల్ల, తనూజ కంగారు వల్ల కెప్టెన్సీ చేతికి వచ్చినట్లే వచ్చి పోయింది. రీతూ కెప్టెన్‌గా గెలిచింది. ఇక ఈ వారమంతా ఫ్యామిలీ మెంబర్స్ రాగా వీకెండ్లో కుటుంబసభ్యులతో పాటు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. టాప్ 5లో ఎవరుంటారో తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ విశేషాలు శనివారం (నవంబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..జీవితంలో ముఖం చూడను(Bigg Boss Telugu 9) తనూజతో జరిగిన గొడవ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది దివ్య. మీకిష్టం లేకపోయినా మీ వెంటపడుతున్నానని కామెంట్స్‌తో బాధపెట్టింది. బయటకెళ్లాక జీవితంలో తన ముఖం చూడను అంది. నాగార్జున స్టేజీపైకి వచ్చి తనూజ- దివ్య గొడవ గురించి ప్రస్తావించాడు. కెప్టెన్ అవగానే కళ్లు నెత్తికెక్కాయా? అని తనూజకు క్లాస్ పీకాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ గొడవకు పునాది వేసిందే నువ్వని దివ్యను తిట్టిపోశాడు. అలా ఇద్దరికీ కాస్త గడ్డి పెట్టాక ఫ్యామిలీ మెంబర్స్‌ను స్టేజీపైకి పిలిచాడు.తనూజ నా మనవరాలుమొదటగా భరణి (Bharani Shankar) తల్లితో పాటు నాగబాబు కూడా స్టేజీపైకి వచ్చాడు. తనూజ (Thanuja Puttaswamy)ను మనవరాలు అని పిలిచిన భరణి తల్లి.. దివ్యను మాత్రం పరోక్షంగా జాగ్రత్త అని హెచ్చరించింది. కొడుకుపై అరవొద్దు అన్నట్లుగా సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చింది. వీళ్లు.. భరణి, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనను టాప్ 5లో వరుసగా పెట్టారు. కల్యాణ్ తండ్రి గొప్ప మాటలుతర్వాత కళ్యాణ్ కోసం తండ్రి లక్ష్మణ్‌రావు, తమ్ముడు బాలు వచ్చారు. కొడుకును చూసి ఎమోషనలైన తండ్రి.. నీనుంచి పదిమంది బతకాలి.. పదిమంది నుంచి నువ్వు బతక్కూడదు అంటూ గొప్ప మాటలు చెప్పాడు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ, పవన్‌ను టాప్ 5 పెట్టారు. అనంతరం ఇమ్మాన్యుయేల్ అన్నతో పాటు కమెడియన్ అవినాష్ వచ్చారు. ఇమ్మూ, తనూజ, కల్యాణ్, పవన్, రీతూని టాప్ 5లో పెట్టారు. అవినాష్ తనూజకు మహానటి, కట్టప్ప అవార్డులు ఇచ్చాడు.టాప్5 చివర్లో దివ్యతర్వాత దివ్య తాతయ్య, స్నేహితురాలు వచ్చారు. వీళ్లిద్దరూ.. ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, సుమన్, దివ్యను టాప్ 5లో పెట్టారు. దివ్యను చివర్లో పెట్టిన తాతయ్య.. నువ్వింకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇకపోతే ఈ వారం దివ్య-తనూజ గొడవతో టీఆర్పీలు బద్ధలైపోయాయట. దీంతో బిగ్‌బాస్ టీమ్ దివ్యను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ఈ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించేందుకు సిద్ధమైందట! ఆ సంగతులు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.. -
తనూజ వల్ల సుమన్ బలి.. పవన్‌పై చిన్నచూపు?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో పదకొండోవారం కెప్టెన్ రీతూ అన్న విషయం ఈపాటకే బయటకు వచ్చేసింది. అయినప్పటికీ అదేదో సస్పెన్స్ అన్నట్లుగా సాగదీస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ వేయనేలేదు. ఈరోజు ఎపిసోడ్లో సుమన్, రీతూ కెప్టెన్సీ కోసం ఎలా పోటీపడ్డారో చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు.బోల్తా కొట్టిన సుమన్ఇందులో సుమన్ చకచకా ఆడేశాడు. చివర్లో ఓ బోర్డు సెట్ చేస్తుంటే సంచాలక్‌గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. పర్లేదు, వెళ్లు వెళ్లంటూ పంపించేసింది. అలా ఫస్ట్ సుమన్ కెప్టెన్ అని రాసున్న జెండా ఎగరేశాడు. కొద్ది క్షణాల తేడాతో రీతూ జెండా ఎగరేసింది. అయితే సుమన్ చివరి బోర్డ్ సరిగా పెట్టలేదని డిమాన్ పవన్ ప్రశ్న లేవనెత్తాడు. అది దగ్గరుండి మరీ చూపించాడు. సైలెంట్ అయిన తనూజదాంతో తనూజ.. వాళ్లిద్దరు ఫైట్ చేసుకుంటారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? నువ్వేంటి చెప్పేది? అని పవన్‌ను తీసిపడేసింది. ఇంతలో కల్యాణ్.. నువ్వు డిక్లేర్ చేశాకే సుమన్ చివరి బోర్డ్ వదిలేశాడని వాదించాడు. దీంతో తనూజ సైలెంట్ అయిపోయింది. తనూజ చేసిన ఆగం పని వల్ల సుమన్ బలైపోయాడు. రీతూ కెప్టెన్ అయింది. చదవండి: సీజన్లో పెద్ద లొల్లి.. సీరియల్ స్టార్ వర్సెస్ సింపతీ స్టార్ -
తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు.. వివాదంలో 'శివ జ్యోతి'
యాంకర్ శివ జ్యోతి తరచుగా సోషల్‌మీడియాలో ట్రోల్స్ గురౌతూనే ఉంటారు. బిగ్‌బాస్‌తో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్, పలు ప్రమోషన్స్‌తో బిజీగానే ఉన్నారు. అయితే, తాజాగా తన భర్తతో కలిసి తిరుమల వెళ్లారు. అక్కడ టీటీడీ అందించే ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె మరో వివాదంలో చిక్కుకున్నట్లు అయింది.తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లో శివ జ్యోతితో పాటు తన సోదరుడు, భర్త ఉన్నాడు. సాధారణంగా దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తల కోసం దేవుడి ప్రసాదంగా సాంబార్ రైస్, పెరుగు అన్నం టీటీడీ అందిస్తుంది. ఈ క్రమంలో ఆమె సోదరుడు భక్తుల కోసం ఇచ్చే అన్నప్రసాదం తీసుకుంటుండగా శివ జ్యోతి నోరుపారేసుకుంది. సోనీ కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ప్రెండ్స్ అంటూ కామెంట్ చేసింది. ఆపై ఆమె సోదరుడు కూడా తాను జీవితంలో ఎప్పుడూ కూడా అడుక్కోలేదని.., ఫస్ట్ టైమ్ ఇలా అడుక్కుంటున్నాను అంటూ ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు. తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనని అంటూ తన భర్తతో శివ జ్యోతి కూడా మరోసారి మాటలు తూలింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దేవుని ప్రసాదం విషయంలో ఇలాంటి చిల్లర కామెంట్లు ఏంటి అని ఏకిపారేస్తున్నారు. ఈ ఘటనపై శివ జ్యోతి క్షమాపణలు చెప్పే ఛాన్స్ ఉంది.బిడ్డ కోసం వెంకటేశ్వర స్వామిని పూజించిన శివ జ్యోతిశివ జ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది. తనకు పిల్లలు కలగకపోవడంతో ఆమె చాలాసార్లు ట్రోలింగ్‌కు కూడా గురైంది. ఎన్నోసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకుంది. తిరుమల వెంకన్నను పూజిస్తే తప్పకుండా తన కోరిక తీరుతుందని ఆమెకు కొందరు సలహా ఇవ్వడంతో.. స్వామికి ఇష్టమైన సప్త శనివార వ్రతం చేసింది. 7 శనివారాల పాటు తన ఇంట్లోనే చాలా నిష్టగా పూజలు చేసింది. స్వామి దయతోనే తనకు బిడ్డ కలుగుతుందని ఒక వీడియో పోస్ట్ చేసింది. జీవితాంత స్వామి సేవలోనే ఉంటామని చెప్పింది. ఎన్నో పూజలు చేసినప్పటికీ కలగని సంతోషం సప్త శనివారం వల్ల తమ కోరిక తీరిందని పంచుకుంది. తిరుమల వెంకన్నను అంత భక్తితో పూజించిన శివజ్యోతి ఇప్పుడు దేవుడి ప్రసాదం గురించి తప్పుగా మాట్లడటంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే, కొందరు తెలియకనే నోరు జారిందని చెబుతున్నప్పటికీ ఆమె చేసింది ముమ్మాటికి తప్పేనని అంటున్నారు. -
ఏయ్, నువ్వేం పొడిచావ్? సీజన్లోనే పెద్ద లొల్లి!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లోకి చివరగా ఇమ్మాన్యుయేల్ తల్లి వచ్చింది. నేను వద్దనుకున్న కొడుకే ఈరోజు నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చాడని తెగ మురిసిపోయింది. కొడుక్కి ప్రేమగా గోరుముద్దలు తినిపించింది. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 21వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూకి డబుల్ ధమాకాఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు బిగ్‌బాస్ డబుల్ బొనాంజా ఇచ్చాడు. తల్లిని బయటకు పంపించేశాక ప్రియురాలు పంపిన లేఖ, ఎంగేజ్మెంట్ రింగ్‌ను ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇది చూసి ఇమ్మూ తెగ సంబరపడిపోయాడు. తర్వాత ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ జరిగింది. ముందుగా కెప్టెన్సీకి అనర్హులు అనుకున్నవారిని గేమ్‌లో నుంచి తీసేయాలన్నాడు. దాంతో మొదటగా దివ్య.. తనూజ పేరు చెప్పింది. పర్సనల్ అటాక్ఆల్రెడీ రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది. మళ్లీ ఇంకో వారం ఇమ్యూనిటీ అవసరం లేదంటూ తనూజను తీసేసింది. అది తనూజకు నచ్చలేదు. ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నావ్? అంటూ ఒంటికాలిపై లేచింది. దివ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరూ చాలాసేపు అరుచుకున్నారు. బయట రివ్యూలు సరిపోవన్నట్లు ఇక్కడికి వచ్చి చేస్తున్నావ్.. నువ్వే సింపథీ స్టార్ అంటూ తనూజ మరింత అగ్గిరాజేసింది.గేమ్ కోసం వాడుకోనునీలాగా మనుషుల్ని గేమ్ కోసం వాడుకోను అని దివ్య.. ఒక మనిషి ఇష్టం లేదంటున్నా వెంటపడుతున్నావ్.. అని తనూజ మధ్యలో భరణిని లాగారు. దాంతో ఆయన మధ్యలో నన్ను లాగొద్దని చెప్పానుగా అని అసహనం వ్యక్తం చేశాడు. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.. నేను నీకంటే బెటర్‌గా ఆడా.. అందరిదగ్గరికెళ్లి కెప్టెన్సీ అడుక్కోలేదు.. నిన్ను భరించలేక నన్ను గతంలో కెప్టెన్ చేశారు. నువ్వేం పొడిచింది లేదు. సీరియల్ స్టార్ అంటూ దివ్య తనూజను ఏకిపారేసింది. చివరకు ఆ ఇద్దరుఅలా వీరి గొడవతో హౌస్‌ను తగలబెట్టేసినంత పని చేశారు. దివ్య తర్వాత మెజారిటీ ఇంటిసభ్యులు తనూజను కెప్టెన్‌గా వద్దన్నారు. దీంతో ఆమె గేమ్‌లో లేకుండా పోయింది. అయితే హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విభజించే బాధ్యతను తనూజకు అప్పగించాడు బిగ్‌బాస్. దీంతో ఆమె పవన్, కల్యాణ్, రీతూ, సుమన్‌ను బ్లూ టీమ్‌గా మిగిలినవారిని రెడ్ టీమ్‌గా విభజించింది. వీరికి ఓ మాన్స్టర్ గేమ్ ఇచ్చాడు. ఇందులో చివరకు సుమన్, రీతూ మిగిలారు. అయితే రీతూ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
నీలాగా గేమ్ కోసం వాడుకోను.. తనూజపై రెచ్చిపోయిన దివ్య
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో దివ్యకు తనూజ అంటే ఏమూలనో కోపం, ద్వేషం, అసూయ ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్లో తనూజ కాలికి వాపు వచ్చిందని భరణి ప్రేమగా ఆయింట్మెంట్ పూసి మసాజ్ చేశాడు. అది దివ్య తట్టుకోలేకపోయింది. మీ ఆరోగ్యమే బాగోలేదు. చేయి నొప్పి ఉన్నప్పుడు సేవలు చేయడం అవసరమా? అని అరిచింది. ఎవరో ఒకరు చేస్తారుగా.. మీరెందుకు చేయడం అని తిట్టేసింది.తనూజపై అక్కసుపోనీ నిజంగా తనకు భరణిపై అంత కేరింగ్ ఉందా? అంటే.. పోయినవారం బీబీ రాజ్యం గేమ్‌లో భరణితో మసాజ్ చేయించుకుంది. మరి అప్పుడు భరణి నొప్పి గుర్తురాలేదా? అన్నది తనకే తెలియాలి. ఇప్పుడు తనూజ (Thanuja Puttaswamy)పై కోపాన్ని మరోసారి బయటపెట్టింది. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది. కెప్టెన్సీకి అనర్హులు అనుకుంటున్నవారిని రేసు నుంచి తప్పించాలన్నాడు బిగ్‌బాస్. ఒంటికాలిపై లేచిన తనూజదీంతో దివ్య.. నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. ఆల్రెడీ కెప్టెన్‌గా ఈ వారం ఇమ్యూనిటీ పొందావ్. మళ్లీ అది నీకు అవసరం లేదు అని తనూజను తీసేసింది. దాంతో తనూజ.. నేను కెప్టెన్సీ ఆడి గెలుచుకున్నా.. ఎవరూ నా చేతిలో పెట్టలేదు. నీకు నేనే కనిపిస్తున్నానా? వేరేవాళ్లు కనిపించట్లేదా? అని ప్రశ్నించింది. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరుస్తా.. 100% నేను కరెక్ట్ ఆన్సరిచ్చా అని దివ్య సమర్థించుకుంది.గేమ్ కోసం వాడుకోనుబానే చెప్పుకున్నావ్ పో.. అని తనూజ వెక్కిరించడంతో దివ్యకు బీపీ లేచింది. నువ్వెవరు పో అనడానికి? రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని వేలు చూపించి మాట్లాడింది. అయినా వెనక్కు తగ్గని తనూజ.. ప్రతిదానికి నామీద పడి ఏడుస్తావ్ అని వెటకారం చేసింది. గంటలో పదిసార్లు ఏడ్చేది నువ్వు.. నీలాగా అందర్నీ గేమ్ కోసం వాడుకోను అని దివ్య అంది. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవే జరిగింది. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. చదవండి: ఏడవద్దు డాడీ, హీరోగా బయటకు రా: ఇమ్మాన్యుయేల్ -
ఇమ్మూకి తల్లి ఊహించని గిఫ్ట్! కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో ఫ్యామిలీ వీక్ ముగింపుకు వచ్చేసింది. తనూజ, కల్యాణ్, సుమన్, భరణి, దివ్య, డిమాన్ పవన్, రీతూ, సంజన.. ఇలా అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చి వెళ్లారు. చివరగా ఇమ్మూ ఒక్కడే మిగిలాడు. ఈరోజు అతడి తల్లి బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజైంది.ఏడవద్దు డాడీఇమ్మూ తల్లి అంటూ కొడుక్కి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టింది. తాను కొనిచ్చిన బంగారు గాజులు వేసుకుని రావడం చూసి ఇమ్మూ మురిసిపోయాడు. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో.. ఆ బంగారం రెండు రాష్ట్రాల్లో నాకు పేరు తెస్తున్నాడు.. ఏడవద్దు డాడీ అంటూ కొడుకు కన్నీళ్లు తుడిచింది. కమెడియన్‌గా వచ్చావ్.. హీరోగా బయటకు రావాలంది.తల్లి కోసం పాటకొడుక్కి ఏమాత్రం తీసిపోదన్నట్లుగా అందరితో బాగానే కామెడీ చేసింది. చివర్లో ఇమ్మూ.. సువ్విసువ్వాలమ్మా పాట పాడి అందరి మనసులు పిండేశాడు. ఇక ఇమ్మూ తల్లి కొడుక్కి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమో చూడాలి. అలాగే హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరగ్గా రీతూ చౌదరి కొత్త కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: దివ్యకు దూరంగా ఉండు: భరణికి కూతురి సలహా -
కల్యాణ్ తల్లికి చీర పెట్టిన తనూజ.. అంత స్పెషల్ ఏంటో?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లోకి పవన్ కల్యాణ్, రీతూ, భరణి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వారు ఏం మాట్లాడారు? హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (నవంబర్ 20వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..కల్యాణ్ తల్లికి తనూజ గిఫ్ట్ఫ్యామిలీ వీక్ వద్దని బెట్టు చేసిన కల్యాణ్ (Pawan Kalyan Padala).. తల్లిని చూడగానే చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలని తల్లి కల్యాణ్ దగ్గర మాట తీసుకుంది. చివర్లో తనూజ.. కల్యాణ్ తల్లికి చీర పెట్టి సాగనంపింది. అది చూసిన కల్యాణ్ ఎందుకు స్పెషల్‌గా మా అమ్మకే చీర పెట్టావ్? అని అడిగాడు. అందుకామె.. నువ్వు నాపై ఎంతో కేర్ చూపించావ్, అందుకు బదులుగా తనకు చీర పెట్టాలనిపించింది, పెట్టాను అని సమాధానమిచ్చింది. రీతూ తల్లి ఎంట్రీఅలాగే తనపై లేనిపోని ఆశలు పెంచుకుంటున్న కల్యాణ్‌కు బిగ్‌బాస్ అయిపోయాక నీ జర్నీ నీది.. నా జర్నీ నాది అని క్లారిటీ ఇచ్చింది. అందుకు కల్యాణ్ నువ్వు సంతోషంగా ఉండటమే నాక్కావాలి అంటూ ప్రేమపిపాసిలా డైలాగులు కొట్టాడు. తర్వాత రీతూ తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే రీతూ బోరుమని ఏడ్చేసింది. కానీ, ఆమె తల్లి మాత్రం నువ్వు నాకు నచ్చట్లేదంటూ చపాతీ కర్ర అందుకుని కొట్టబోయింది. కానీ కూతురి ఏడుపు చూసి కొట్టేందుకు చేతులు రాలేదు.మాడిపోయిన పవన్ ముఖంతనూజ, ఇమ్మూని పిలిచి మరీ మాట్లాడింది. కానీ డిమాన్ పవన్‌ను అసలు పట్టించుకోలేదు. దీంతో అతడి ముఖం వాడిపోయింది. గేమ్స్‌లో మాత్రమే ఫోకస్ చేయ్.. ఇంకేం వద్దు అని హెచ్చరించింది. మరి అది రీతూ తలకు ఎక్కించుకుందో? లేదో! ఇదంతా చూసిన పవన్.. రేపటినుంచి రీతూకి దూరంగా ఉండాలని మనసులో అనుకున్నాడు. తర్వాత భరణి కూతురు ఎంట్రీ ఇచ్చింది. తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. దివ్యకి దూరంగా ఉండుతనూజ-నాన్న బంధం తన ఫేవరెట్ అంది. నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుందని తండ్రిని కోరింది. దివ్యను తన తండ్రిపై కమాండింగ్ కాస్త తగ్గించమని కోరింది. ఆమె అటు వెళ్లగానే కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీపై అరుస్తుంటే సైలెంట్‌గా ఉండకండి. అలా అరవడం నచ్చడం లేదని చెప్పండి అని తండ్రికి సలహాలు ఇచ్చింది. ఇక హౌస్‌లోకి అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఒక్క ఇమ్మూకి తప్ప! రేపు అతడి తల్లి ఇంట్లో అడుగుపెట్టనుంది. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. -
ఇంత బాధేంట్రా పిచ్చోడా.. నాకో మాటివ్వు: కల్యాణ్ తల్లి
సామాన్యుడు బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)దాకా రావడమనేది చిన్న విషయం కాదు. షోలో అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా టైటిల్ రేసులో ఉండటం అంటే చాలా గొప్ప విషయం! ట్రోఫీ గెలుస్తాడా? లేదా? అని పక్కనపెడితే టాప్ 3లో చోటు దక్కించుకున్నా సరే అతడు గెలిచాడనే చెప్పాలి. అతడే పవన్ కల్యాణ్ పడాల.విమర్శల నుంచి పొగడ్తల వరకుచిన్న పల్లెటూరు నుంచి ఆర్మీకి... అక్కడ బ్రేక్ ఇచ్చి బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). మొదట్లో తనూజను చూసేవిధానం, మాట్లాడే విధానం ఎవరికీ నచ్చలేదు. అమ్మాయిల పిచ్చోడు అని తనపై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ తిట్టిన నోళ్లతోనే పొగిడించుకునేలా చేశాడు. తన తీరు మార్చుకున్నాడు, ఆట మార్చాడు.వద్దు వద్దంటూ..అందుకే ఇప్పుడు ఎంతోమందికి ఫేవరెట్ అయ్యాడు. చిన్నప్పుడు అమ్మానాన్న సావాసాన్ని మిస్ అయ్యానని చెప్తూ ఇటీవలి ఎపిసోడ్లో బోరుమని ఏడ్చాడు కల్యాణ్. కానీ, ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనకు ఇంట్లోవాళ్లు రావొద్దని, కావాలంటే ఎవరికోసమైనా త్యాగం చేయడానికైనా రెడీ అంటూ పిచ్చిపట్లునట్లు ప్రవర్తించాడు. తీరా కళ్ల ముందు తల్లి కనిపించేసరికి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మాటిచ్చిన కల్యాణ్ఇంత బాధ పెట్టుకున్నావేంట్రా పిచ్చోడా అని తల్లి అడిగేసరికి అమ్మ కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా మారిపోయాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలి అని తల్లి అడిగింది. అందుకు కల్యాణ్ తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటూ ఆమె చేతిలో చేయేసి మాటిచ్చాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఎమోషనల్‌గా సాగనుంది. చదవండి: పెళ్లయి 9 ఏళ్లు.. నాకు తల్లవ్వాలని లేదు: నటి -
నాకు తల్లవ్వాలని లేదు, ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్!
కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలు కావాలనుకోరు. ముందుగా కెరీర్లో స్థిరపడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకుంటారు. కానీ అసలు పిల్లలే వద్దనుకునేవారు చాలా తక్కువమంది. హిందీ బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) భార్య ఆకాంక్ష (Akanksha) ఈ కోవలోకే వస్తుంది. గౌరవ్ హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొన్నాడు.తల్లవ్వాలన్న ఆశ లేదుఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఆకాంక్ష చమోలా హౌస్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వీరి తొమ్మిదో పెళ్లి రోజును హౌస్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు తల్లవ్వాలన్న ఆశ లేదంది ఆకాంక్ష. ఆ మాట విని గౌరవ్ నిశ్చేష్టుడయ్యాడు. అమ్మ అని పిలిపించుకోవాలని నాకెప్పుడూ అనిపించడలేదు. భవిష్యత్తులో కూడా పిల్లల్ని ప్లాన్ చేయాలనుకోవడం లేదు. చాలా కారణాలుపిల్లలుంటే బాగుండన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఇలా పిల్లలు వద్దనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఏదో వంటకం చేసినంత ఈజీ కాదు. అది పెద్ద బాధ్యత. నేను దానికి న్యాయం చేయలేను అని నా ఫీలింగ్. ఇప్పుడే కాదు, ఇకముందు కూడా ఆ బాధ్యత నిర్వర్తించలేను. ప్రస్తుతం నాకు నా కెరీర్ ముఖ్యం. నాకు చాలా లక్ష్యాలున్నాయి. నా కెరీర్ ముఖ్యంజనాలు నన్ను స్వార్థపరురాలిని అనుకున్నా మరేం పర్లేదు. నాకు నా కెరీర్ ముఖ్యం అని చెప్పుకొచ్చింది. అది విన్న గౌరవ్.. నీ సమాధానం తనను మరింత భయపెడుతుందన్నాడు. గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షో విజేతగా నిలిచాడు. గౌరవ్ - ఆకాంక్ష 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.చదవండి: రీతూని నిలదీసిన తల్లి -
నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తుందేంటి?: రీతూ తల్లి
పదివారాలుగా ఇంటిల్లిపాదికి దూరంగా ఉన్న హౌస్మేట్స్ ఈ వారం ఫుల్ జోష్‌లో ఉన్నారు. కారణం.. ఇది ఫ్యామిలీ వీక్. అమ్మానాన్న, చెల్లి, భార్య.. ఇలా ఎవరో ఒక రక్తసంబంధీకులు తమకోసం బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌కు రావడం చూసి ఆనందభాష్పాలు కారుస్తున్నారు. ఇప్పటికే సుమన్, తనూజ, పవన్, దివ్య ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈరోజు రీతూ తల్లి హౌస్‌లోకి రానుంది.రీతూకి క్లాస్ఈమేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో రీతూ తల్లి హౌస్‌మేట్స్‌ను ఓ ఆటాడుకుంది. ఫాస్ట్ ఫార్వర్డ్, ఫ్రీజ్ అంటూ కంటెస్టెంట్లను ఓ ఆటాడించింది. తల్లిని చూడగానే మిస్‌యూ అంటూ రీతూ ఏడుపందుకుంది. కానీ ఆమె తల్లి మాత్రం.. నిన్ను కొడ్తా.. నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? అని పవన్‌తో లవ్ ట్రాక్ గురించి పరోక్షంగా నిలదీసింది.ఏడుపందుకున్న రీతూమనం పక్కకెళ్దాం అమ్మ.. అని రీతూ అడిగితే చపాతీ కర్ర అందుకుని కొట్టేందుకు సిద్ధమైంది. కానీ రీతూ ఏడుపు చూసి కొట్టలేక దగ్గరకు తీసుకుని హత్తుకుంది. ఎంతైనా తల్లి మనసు కదా.. కూతురి కన్నీళ్లు చూశాక కొట్టే సాహనం చేయలేకపోయింది. చదవండి: డిమాన్ పవన్ తండ్రికి క్యాన్సర్ -
నాకు క్యాన్సర్, అప్పటినుంచి తిండి మానేశా..: పవన్ తండ్రి
రీతూ చౌదరితో లవ్ ట్రాక్ వల్ల నెగెటివ్ అయ్యాడు కానీ టైటిల్ గెలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు డిమాన్ పవన్ (Demon Pavan)కు ఉన్నాయి. ఆటల్లో గట్టిపోటీనిస్తాడు. ఎంతమందినైనా సరే ఒంటిచేత్తో ఆపగలడు. అతడు టాస్కులో దిగాడంటే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆటలో రఫ్ అండ్ టఫ్ కానీ మాటలో మాత్రం ఉట్టి డొల్ల. గట్టిగా మాట్లాడటం చేతకాదు. వెనకబడ్డ పవన్తనను ఎవరైనా నిందిస్తున్నా అమయాకుడిలా పడతాడు, అలుగుతాడు తప్ప రివర్స్ కౌంటరివ్వడం, తిట్టడం చేతకాదు. అందుకే విన్నింగ్ రేస్‌లో లేకుండా పోయాడు. ఫ్యామిలీ టైమ్ కోసం ఇచ్చిన గేమ్‌లో పవన్.. తన ఆట మధ్యలో ఆపేసి దగ్గరుండి సుమన్ తాళ్ల చిక్కుముడులు విప్పుతూ అతడికి సాయం చేశాడు. కానీ, అదెవరికీ కనబడలేదు. తండ్రి కోసం బెంగపవన్కు ఎప్పుడూ ఇంతే! అతడు చేసిన మంచి కన్నా, తప్పులే పెద్దగా కనిపిస్తాయి. అదే అతడికి పెద్ద మైనస్. నిన్నటి ఎపిసోడ్లో పవన్ తల్లి హౌస్‌లోకి వెళ్లి కొడుక్కి గోరుముద్దలు తినిపించింది. ఆ సమయంలో తండ్రి గురించి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు పవన్. అసలు పవన్ తండ్రికేమైందో? ఆయన మాటల్లోనే విందాం..క్యాన్సర్పవన్ తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ.. ఓరోజు నా పన్ను నాలుకకి గుచ్చుకుని సెప్టిక్ అయింది. దీనికేం అవుతుందులే అనుకున్నాను. కానీ, తర్వాత సమస్య పెద్దదైంది. దాంతో పవన్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఆస్పత్రిలో చూపిస్తే క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. అలా జూన్‌లో సర్జరీ జరిగింది. 4 గంటలపాటు ఈ ఆపరేషన్ జరిగింది.సరిగ్గా మాట్లాడలేని స్థితిలో..నాలుగు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఐదో రోజు ఇంటికి వెళ్లిపోయాం. కాకపోతే నోటి లోపల చర్మం కట్ చేశారు. దీనివల్ల మాట సరిగా రావడం లేదు. భోజనం చేయడం కూడా మానేశాను. రోజూ జావ తాగుతున్నాను. కేవలం ద్రవపదార్థాలే తీసుకుంటున్నాను అని తెలిపాడు. అందుకే పవన్ తండ్రిపై బెంగ పెట్టుకున్నాడన్నమాట!చదవండి: భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు -
భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో టాస్కులకు బ్రేక్ పడింది. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఇల్లు భావోద్వేగాల నిలయంగా మారింది. ఇప్పటివరకు తనూజ, సుమన్, పవన్, దివ్య, సంజనల కుటుంబ సభ్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. ఈరోజు భరణి ఫ్యామిలీ ఇంట్లోకి రానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అందులో భరణి (Bharani Shankar) కూతురు ఇంట్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది.కూతుర్ని చూడగానే భరణికి కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆమె భరణిని పట్టుకుని ఏడ్చేసింది. నిన్ను చూస్తే గర్వంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ వారం కెప్టెన్‌గా చూడాలని మనసులోని కోరిక బయటపెట్టింది. మరి కూతురి కోరిక భరణి నెరవేరుస్తాడా? లేదా? చూడాలి! -
నన్ను తొక్కుతూనే ఉన్నావ్.. రీతూ ఫ్రస్టేషన్
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఫైర్ స్ట్రామ్స్ అంటూ వచ్చిన ఆరుగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరికంటే ముందు వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన దివ్య మాత్రం ఎలాగోలా నెట్టుకొస్తోంది. కానీ, ఈవారం ఆమెకు కష్టకాలంలాగే కనిపిస్తోంది. నేడు హౌస్‌లో నామినేషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు రెండో ప్రోమో వదిలారు.అన్నీ రివేంజ్ నామినేషన్స్ఇందులో భరణి.. తాను బాగా ఆడలేదన్న ఇమ్మాన్యుయేల్‌ను నామినేట్ చేశాడు. టెడ్డీ బేర్ టాస్క్‌లో ప్రతి రౌండ్లో నువ్వు నాకంటే వెనకే ఉన్నావ్.. అని గుర్తు చేశాడు. కల్యాణ్ కూడా అదే పని చేశాడు. తనను నామినేట్ చేసిన పవన్ (Demon Pavan)ను తిరిగి నామినేట్ చేశాడు. ఇక రీతూ.. దివ్యను నామినేట్ చేసింది. నేను ఈ గేమ్‌లో గెల్చాను. నేను ఇందులో సూపర్.. అందులో సూపర్.. కానీ ఆమె ఏ గేమ్‌లో గెల్చింది? అంటూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ అంది. రీతూ వర్సెస్ దివ్యనీకంటే నేను ఎందుకు బెటరో చెప్తాను.. నీకు టాస్క్ అర్థమే కాదు. అలాంటిది నువ్వు గేమ్స్ గురించి మాట్లాడుతున్నావా? అని దివ్య ఇచ్చిపడేసింది. తర్వాత దివ్య రీతూని నామినేట్ చేసింది. ఈక్రమంలో 'ఇంకా ఎంతకాలం నన్ను తొక్కుతావ్?' అని రీతూ అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ వారం సంజన, దివ్య, పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి నామినేషన్స్‌లో ఉన్నారు. డేంజర్ జోన్లో దివ్యవీరిలో కల్యాణ్, ఇమ్మూలకు ఓట్లు భారీగా పడతాయి. అందులో డౌటే లేదు. పవన్, భరణి, సంజనకి కూడా ఈ మధ్యకాలంలో నెగెటివిటీ లేదు కాబట్టి కాస్త సేఫ్ జోన్లో ఉన్నారు. గత రెండు వారాలుగా దివ్య ఎక్కువ నెగెటివ్ అవుతూ వస్తోంది. ఈ వారం కూడా ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారకపోతే తను వెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ వీక్ కోసం సంజనాను ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ వారం ఆ అవసరం తీరిందని ఆమెను పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చదవండి: పుష్పను కాపీ కొట్టలేదు: మలయాళం హీరో -
రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో రెండు ఊహించనివి జరగబోతున్నాయి. పదివారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న ఇమ్మాన్యుయేల్.. ఎట్టకేలకు పదకొండోవారం నామినేషన్స్‌లోకి వచ్చేశాడు. ఇక ఫ్రెండ్స్‌కు ఎక్కువ, ప్రేమికులకు తక్కువ అన్నట్లుగా ఉండే పవన్-రీతూల మధ్య పెద్ద అగాధం ఏర్పడనుంది. కారణం.. పవన్ రీతూని నామినేట్ చేశాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.నీకు కాన్ఫిడెన్స్ లేదురీతూ.. గేమ్‌లో వెనకబడిపోయింది. తనకు కాన్ఫిడెంట్ లేదు అని ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశాడు. కాన్ఫిడెన్స్ లేనిది నీకంటూ తిరిగి వాదించింది రీతూ. ఇమ్మూ.. భరణి ఆటలో పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టడం లేదన్నాడు. నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే ఇంతకుముందులా ఆడలగలవా? పర్ఫామెన్స్ అంటే కేవలం టాస్కులే కాదు. ప్రతి టాస్క్ నాకు సాధ్యమైనంతవరకు ఆడుతున్నా అని వివరణ ఇచ్చాడు.ఏడిపించేసిన పవన్ఇక పవన్ (Demon Pavan).. రీతూని నామినేట్ చేశాడు. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్లుగా బయటకు వెళ్తుంది. అది బాధగా ఉంది. ప్రతిసారి నీది తప్పు లేదని స్టాండ్ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ, నాపై నమ్మకం లేదంటూ హర్ట్ చేశావ్. ప్రతిసారి నీ మంచే కోరుకున్నా.. అంటూ కన్నీళ్లు దిగమింగుతూ పాయింట్లు చెప్పాడు.మౌనంగా రీతూతనకు ఎదురొచ్చే ఎవరి నోరైనా మూయించే రీతూ (Rithu Chowdary).. ఈసారి మాత్రం మూగబోయింది. అందరికంటే ఎక్కువ ఇష్టపడే పవన్ తనను నామినేట్ చేస్తుంటే తట్టుకోలేక కన్నీళ్ల రూపంలో తన బాధను వ్యక్తపరిచింది. నామినేషన్స్ అయ్యాక నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా.. అని రెండు చేతులతో తల బాదుకుంది. ఎందుకరుస్తున్నావని పవన్ అడిగితే నా వల్ల కావడం లేదంది. నామినేషన్స్‌లో ఆరుగురుఅందుకు పవన్ కూడా.. నావల్ల కూడా కావడం లేదని అరిచి వెళ్లిపోయాడు. మొత్తానికి ప్రోమో అయితే రీతూ-పవన్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేలాగే ఉంది. ఇకపోతే సంజన, రీతూ, దివ్య, డిమాన్, కల్యాణ్, ఇమ్మూ, భరణి నామినేషన్స్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తనూజ కెప్టెన్సీ పవర్‌తో రీతూని సేవ్ చేసినట్లు భోగట్టా! చదవండి: నన్ను బ్యాడ్ చేయొద్దు.. ఇమ్మూపై గరమైన తనూజ -
సంజన కోసం రీతూ త్యాగం.. ఇలాగైతే తనూజ గెలవడం కష్టమే!
వారాలు గడిచేకొద్దీ ఎవరైనా తమను తాము సాన పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ, తనూజ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తోంది. చీటికిమాటికి నోరు పారేసుకుంటూ గొడవపడుతూ చికాకు పుట్టిస్తోంది. తనూజ నా బలహీనత అని ఇమ్మూ శనివారం ఎపిసోడ్లో చెప్పినందుకు అతడ్ని చెడుగుడు ఆడేసుకుంది. మరోవైపు రీతూ ఫేవరెట్ హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చేసరికి తను గాల్లో తేలిపోయింది. హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 16వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూతో గొడవనీకు, నాకు మధ్య ఏ బాండింగ్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. నేనెలా నీకు బలహీనత అవుతాను అంటూ తనూజ (Thanuja Puttaswamy) ఇమ్మూని నిలదీసింది. అందుకతడు.. నువ్వేదైనా అంటే పర్సనల్‌గా ఫీలవుతా.. అది నా వీక్నెస్ అన్నాడు. అక్కడే ఉన్న రీతూ కూడా.. మేము బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువని చెప్పాడు అంది. అప్పటికీ తనూజ తగ్గలేదు. నన్ను చెడ్డదానిగా చిత్రీకరించకుమూడు వారాల తర్వాత మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకుందే లేదంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. నాకైతే ఆ బాండ్ ఉంది అని ఇమ్మూ సింపుల్‌గా తేల్చేశాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంటే.. నన్ను బ్యాడ్ చేయకు.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. నువ్వేదో నాకు సపోర్ట్ చేస్తున్నట్లు, నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా పేరు తేకు అని ఫైర్ అయింది. తనూజకు నాగ్ సలహాసారీ, నీ పేరు ఇంకెప్పుడూ తీసుకోను అని ఇమ్మూ అంటే థాంక్యూ, పాయింట్ ఉంటే నామినేట్ చేయ్ అని సవాలు విసిరింది. ఈ గొడవంతా విన్న నాగార్జున.. అవతలి వారి అభిప్రాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కానీ, సాగదీయకు అని సలహా ఇచ్చాడు. తర్వాత నాగ్ తనయుడు, హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చాడు. రీతూ గెలిస్తేనే ఆఫర్ఈ మధ్యే హైదరాబాద్ రేసింగ్ టీమ్ కొనుగోలు చేశానంటూ తన టీమ్ అందర్నీ పరిచయం చేశాడు. ఇక చైతో రైడ్ అనగానే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానంది రీతూ. ఇప్పుడెందుకు? గెలిచిరా.. అప్పుడు రైడ్‌కు తీసుకెళ్తానన్నాడు చై. చివరగా దివ్యను సేవ్ చేసి గౌరవ్ (Gaurav Gupta) ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి గౌరవ్‌ను సేవ్ చేసి దివ్యను ఎలిమినేట్ చేయొచ్చన్నాడు నాగ్.గౌరవ్ ఎలిమినేట్కానీ, తనూజ ప్రేక్షకుల ఓట్లకు గౌరవం ఇస్తున్నానంటూ తన దగ్గరున్న పవర్ వాడలేదు. దీంతో చిట్టచివరి ఫైర్ స్ట్రామ్ గౌరవ్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి షర్ట్ కోసం సంజనా చీరల్ని పంపించేసిన రీతూ యూటర్న్ తీసుకుంది. సంజనాకు చీరల్ని పంపించండి, నేను షర్ట్ వెనక్కు ఇచ్చేస్తానంది. అందుకు నాగ్ ఒప్పుకోవడంతో ఆమెకు చీరలు రానున్నాయి.చదవండి: గౌరవ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే? -
దివ్యకు తక్కువ ఓట్లు.. ఆ రెండు కారణాల వల్లే!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో పది మంది మిగిలారు. వారిలో నుంచి ఒకరు (గౌరవ్) ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేట్ కానున్నారు. అంటే తొమ్మిది మంది మిగలనున్నారు. వచ్చేవారం వీరందరి కుటుంబసభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ వారం డేంజర్ జోన్లో నిఖిల్, గౌరవ్‌తో పాటు దివ్య కూడా ఉంది. తాజా ప్రోమోలోనూ అదే చూపించారు.ఆ రెండింటి వల్లే..నిఖిల్‌ను నిన్ననే పంపించేయగా నేడు గౌరవ్, దివ్య (Divya Nikhita)ను నిల్చోబెట్టారు. వీరిలో ఒకరే ఎలిమినేట్ అని నాగ్ ప్రకటించాడు. షూటింగ్ ఆల్రెడీ ముగియడంతో వెళ్లిపోయేది గౌరవ్ అని అందరికీ తెలిసిపోయింది. అయితే వైల్డ్ కార్డ్‌గా వచ్చిన దివ్యకు ఓట్లు తక్కువ పడి డేంజర్ జోన్లో ఉండటానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తనూజను టార్గెట్ చేయడం, రెండు భరణిపై పెత్తనం చెలాయించడం.ఆ గేమ్ కొంప ముంచిందిగత వారం కెప్టెన్సీ గేమ్‌లో తనూజను తీసేయనని మాటిచ్చి ఆమెను సైడ్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నాగార్జున ఎదుట దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఇక భరణి ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఆర్డర్లేస్తోంది. అతడు చేసింది ఏదైనా నచ్చకపోతే చాలు ఒకటే నస పెడుతోంది. ఎపిసోడ్లో ఆ సీన్లు కొన్ని ఎత్తేస్తున్నారు కానీ లైవ్ చూసేవాళ్లకు మాత్రం పిచ్చెక్కిపోతోంది.తనూజపై కుళ్లు?ఈ బంధాల్లో చిక్కుకుని బలైపోయిన భరణి.. తనూజ, దివ్యకు దూరంగా ఉండాలనుకున్నాడు. తనూజ దూరంగానే మెదులుతోంది, కానీ దివ్య మాత్రం ఫెవికాల్లా అతుక్కుపోయింది. పైగా ఈ వారం తనూజ కెప్టెన్ అయినప్పుడు భరణి సంతోషంతో ఆమెను ఎత్తుకున్నాడు. అది కూడా చూసి సహించలేకపోయింది దివ్య. నేను కెప్టెన్ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు? అన్న ప్రశ్న లేవనెత్తింది. ఆమె సరదాగా అన్నా, సీరియస్‌గా అన్నా తనకు తనూజ అంటే ఈర్ష్య అని జనాలు బలంగా నమ్మారు.గండంబీబీ రాజ్యంలో కొన్ని సీక్రెట్ టాస్క్‌లు చేసినప్పటికీ ఆ క్రెడిట్ అంతా సుమన్‌కే పోయింది. అయినదానికి, కానిదానికి నోరేసుకుని పడిపోవడం కూడా తనకు మైనస్ అయింది. తన తీరు మార్చుకోకపోతే, మంచి ఎపిసోడ్ పడకపోతే మాత్రం వచ్చేవారం దివ్య ఎలిమినేట్ అవడం ఖాయం. మరి తనను తాను ఎలా కాపాడుకుంటుందో చూడాలి! చదవండి: రీతూని రైడ్‌కు తీసుకెళ్తానన్న చైతన్య -
చైతో బైక్ రైడ్ ఆఫర్.. ఇంట్లో నుంచి వచ్చేస్తానన్న రీతూ
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య (Naga Chaitanya) వచ్చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో చై ఫుల్ ఎనర్జీతో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే పిచ్చి అని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ ప్రారంభించారు. మెలికలు తిరిగిన రీతూఅందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ఓనర్ని నేనే.. అని చై చెప్పడంతో నాగ్ (Nagarjuna Akkineni) సర్ప్రైజ్ అయ్యాడు. నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్? అని అడిగాడు. చైని చూడగానే రీతూ మెలికలు తిరిగిపోయింది. మీరంటే పిచ్చి, ఒక శిల్పాన్ని చెక్కినట్లే ఉంటారు అని చెప్పింది. దీంతో నాగ్ రీతూకి ఓ బంపరాఫర్ ఇచ్చాడు. చైతూకి బైక్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు హౌస్‌లో నుంచి బయటకు వస్తే చై నిన్ను బైక్ రైడ్‌కు తీసుకెళ్తాడు అని చెప్పాడు. రైడ్‌కు తీసుకెళ్తా..అంతే, రీతూ (Rithu Chowdary) ఎగిరి గంతేస్తూ సంతోషంగా బయటకు వచ్చేస్తానంది. అది చూసి ఆశ్చర్యపోయిన చై.. బిగ్‌బాస్ షో ఎందుకు వదులుకుంటావ్? గెలిచిన తర్వాత కూడా నిన్ను రైడ్‌కు తీసుకెళ్లొచ్చు అన్నాడు. అందుకు రీతూ.. మిమ్మల్ని జోష్ నుంచి గెల్చుకుందామనుకుంటున్నా అని అమాయకంగా ముఖం పెట్టింది. అది చూసి తండ్రీకొడుకులిద్దరూ ఏం మాట్లాడలేక నవ్వుకున్నారు. చదవండి: చిరంజీవితో సినిమా షూటింగ్.. నన్ను నేను థూ అని.. -
నేను చచ్చిపోతా.. నన్ను పంపించేయండి.. వెక్కెక్కి ఏడ్చిన సంజనా
Bigg Boss Telugu 9: ఫైర్ స్ట్రామ్స్ అంటూ ఆరుగారు వైల్డ్‌కార్డ్స్‌ను హౌస్‌లోకి తెచ్చారు. వచ్చినవాళ్లందరూ వరుసగా ఎలిమినేషన్ బండెక్కి ఇంటికి వెళ్లిపోయారు. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ ఎలిమినేట్ అవగా ఈరోజు గౌరవ్‌ను పంపించేయనున్నారు. దీంతో ఫైర్ స్ట్రామ్ కాస్తా ఫెయిల్ స్ట్రామ్‌గా మిగిలిపోయింది. మరి శనివారం (నవంబర్ 15వ) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చూసేద్దాం..పవన్‌కు క్లీన్ చిట్బీబీ రాజ్యం అనే గేమ్‌లో రాణి దివ్య ఆదేశాల మేరకు పవన్.. తనూజను కాస్త తోసినట్లు చేశాడు. ఆమాత్రం దానికే తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ పెద్ద నింద వేసింది. ఊరుకుంటే ఎత్తుకునేవాడివేమో అంటూ నానామాటలంది. దానిపై నాగ్ కాస్త సున్నితంగానే తనూజకు క్లాస్ పీకాడు. ఇక్కడ ఆడ,మగ తేడా లేదు. రాణి ఆదేశాలను పవన్ పాటించాడు తప్ప అతడు ఏ తప్పూ చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చాడు.సంజనాపై బిగ్ బాంబ్ఇక హౌస్‌లో రెండు బిగ్బాంబ్స్ వేశాడు నాగ్. ఒకటి డబుల్ ఎలిమినేషన్ కాగా రెండోది చెప్పేముందు ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో మీకు సపోర్ట్‌గా ఉన్నదెవరు? మీ ఆటను ముంచుతోందెవరు? అనేది చెప్పాలన్నాడు. మెజారిటీ ఇంటిసభ్యులు సంజనా (Sanjana Galrani) వల్లే ఆట చెడిపోతుంది అని అభిప్రాయపడ్డారు. దాంతో రెండో బిగ్ బాంబ్ సంజన మీద పడుతుందని నాగ్ అన్నాడు. తీరా ఆ బాంబ్‌లో ఉన్నది మరేంటో కాదు, నో ఫ్యామిలీ వీక్.గుక్కపెట్టి ఏడ్చిన సంజనాఇప్పటికే చంటిపిల్లలకు దూరంగా ఉన్న సంజనా.. రాత్రిళ్లు దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నా రోజంతా మాత్రం చలాకీగానే ఉంటోంది. ఫ్యామిలీ వీక్‌లో పిల్లలు వస్తారన్న ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అలాంటిది తన కోసం ఎవరూ రారని అనడంతో గుక్కపెట్టి ఏడ్చింది. నేను ఇంటికెళ్లిపోతాను సర్.. నా వల్లకాదు, నేను చచ్చిపోతా.. రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను. ఇంక నావల్ల కాదు. నేనిక్కడ ఉండలేను అంటూ వెక్కెక్కి ఏడ్చింది.నన్ను ఇంటికి పంపించేయండి సార్ఇంట్లో మెజారిటీ హౌస్మేట్స్ నీవల్లే వాళ్ల ఆట మునిగిపోతుందన్నారు. వేరేవాళ్ల పేరు వచ్చుంటే ఆ బాంబ్ ఇంకొకరిపై పడేది. ఇది బిగ్‌బాస్ నిర్ణయం అన్నాడు నాగ్. ఇంతలో కల్యాణ్, భరణి.. సంజనా కోసం తమ ఫ్యామిలీ వీక్ త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, అందుకు నాగ్ ఒప్పుకోలేదు. బాధను భరించలేకపోయిన సంజనా.. నన్ను ఇంటికి పంపించేయండి సార్, ఇది నేను పొగరుతో చెప్పడం లేదు అని బతిమాలుకుంది. అప్పటికీ నాగ్ మనసు కరగలేదు. నిఖిల్ ఎలిమినేట్అయితే నిజంగా ఫ్యామిలీ వీక్ లేకుండా పోయే ఛాన్సే లేదు. గతంలో కూడా తేజకు ఫ్యామిలీ వీక్ లేదన్నారు. కట్ చేస్తే చివర్లో అతడి తల్లిని పంపారు. ఇప్పుడు కూడా అలాగే చివర్లో సంజనా ఫ్యామిలీని పంపించి మరింత ఎమోషన్స్ రాబట్టి టీఆర్పీ దండుకునే ప్లాన్ చేస్తున్నారు. ఎపిసోడ్ చివర్లో నిఖిల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. వారమంతా బాగానే కష్టపడ్డా సరే, ఇలా ఎలిమినేట్ చేశారేంటని నిఖిల్ షాక్ అయ్యాడు. అయినా చేసేదేం లేక సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు.చదవండి: బిగ్‌బాస్ 9.. నిఖిల్ పారితోషికం ఎంతో తెలుసా? -
సంతోషంలో పింకీ.. గ్రాండ్‌గా కొడుకు బారసాల ఫంక్షన్
తెలుగు సినీ నటి పింకీ సుదీప (Pinky Sudeepa) తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు కొడుకు పుట్టాడన్న శుభవార్తను ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా బాబు బారసాల ఫంక్షన్ ఘనంగా చేసింది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో బాబును నవమోసాలు మోసిన సుదీప పొట్టను ఆమె భర్త శ్రీరంగనాథ్ ఆప్యాయంగా ముద్దాడాడు. తర్వాత దంపతులిద్దరూ బాబును ఎత్తుకుని చూపించారు. ఇది చూసిన అభిమానులు ఆమెకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసుదీప.. 1994లో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో నటించింది. నువ్వు నాకు నచ్చావ్ మూవీతో పింకీగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొంది. షోలో ఉన్నప్పుడు... తనకు గర్భ స్రావం అయిన విషయాన్ని చెప్తూ ఎమోషనలైంది. తాను 2015లో తొలిసారి గర్భం దాల్చానని, కానీ థైరాయిడ్ ఎక్కువవడం వల్ల బిడ్డను కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Pinky Sudeepa (@pinky_sudeepaofficial) చదవండి: పెళ్లిరోజే గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ హీరో -
కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యంలో మహారాజుగా ఉన్న నిఖిల్, రాణులైన తనూజ, రీతూలకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో తనూజ గెలిచి కెప్టెన్ అయింది. అది కూడా సరిగ్గా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడం విశేషం! మరి తర్వాత హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 14వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నన్నెందుకు ఎత్తుకోలేదు?తనూజ కెప్టెన్ అవగానే భరణి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ఎత్తుకుని తిప్పారు. అది చూసిన దివ్య.. నేను కెప్టెన్ అయినప్పుడు నన్నెందుకు ఎత్తుకోలేదని ప్రశ్నించింది. దానికి సమాదానం చెప్పలేక భరణి నీళ్లు నమిలాడు. తర్వాత హౌస్మేట్స్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి చిన్నప్పటి ఫోటోలను పంపించాడు బిగ్‌బాస్. వాటిని చూసిన వెంటనే తనూజ ఎమోషనలైంది. అది గమనించిన కల్యాణ్.. ఏడవకు తనూజ అని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే.. ఆవిడ మాత్రం చిటపటలాడింది.చస్తా.. ఏడుస్తా..నువ్వు ఏదైనా అడిగినప్పుడు నన్ను పూర్తిగా సమాధానం చెప్పనివ్వు అని మండిపడింది. నువ్వు ఆన్సర్ చెప్పట్లేదు, ఏడుస్తున్నావ్.. ఏడుపు ఆపేయ్ అనడం తప్పా? అని కల్యాణ్ (Pawan Kalyan Padala) అడిగాడు. ఇదే నీలో ఉన్న వరస్ట్ పార్ట్.. ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పనివ్వు. నేను ఏడుస్తానా? చస్తానా? నీకు అనవసరం.. లేకపోతే వదిలెయ్ నన్ను అని చిరాకుపడింది.గుక్కపెట్టి ఏడ్చిన కల్యాణ్తర్వాత కల్యాణ్ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో చూసి ఎమోషనలయ్యాడు. నేను పుట్టినప్పుడు నాన్నకు బిజినెస్‌లో అంతా కలిసొచ్చింది. కొన్నేళ్లకు వాళ్ల ఫ్రెండ్స్ వల్ల జీరోకు వచ్చేశాడు. నన్ను ఫస్ట్ క్లాస్‌లోనే అత్తయ్య దగ్గరకు పంపారు. తర్వాత హాస్టల్లో వేశారు. అమ్మానాన్నతో కలిసి తిరిగింది గుర్తు లేదు. వాళ్లు నా పక్కన లేరని బాధుండేది. నేనేం చేశానని ఇలా దూరం పెడుతున్నారో అర్థమయ్యేది కాదు. హాస్టల్ వార్డెన్ దగ్గర ప్రతి ఆదివారం వారి నుంచి ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. ఏడిపించేసిన ఇమ్మూకానీ నెలకోసారి మాత్రమే ఫోన్ వచ్చేది. నా 23 ఏళ్లలో నేను నాలుగేళ్లు మాత్రమే వాళ్లతో ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్‌కి తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. మా ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. మాది పాక ఇల్లు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న వద్దన్నాడట. అమ్మమ్మ మాత్రం.. పుట్టబోయే వాడి వల్ల మీ జీవితం మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది. అప్పుడు తిండి లేక అమ్మ పొలం దగ్గర మట్టి బుక్కేది. నా జీవితంలో సూపర్ హీరోచిన్నప్పటినుంచే అన్న, నేను పొలం పనులు, పత్తి ఏరడం, సిమెంట్ పని.. ఇలా చాలా చేశాం. ఎంతో కష్టపడ్డాం. నా జీవితంలో మా అన్నే సూపర్ హీరో. ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు, నువ్వెందుకు కాలేదు అని అందరూ అనడంతో వాడు ఫీలైపోయేవాడు. కానీ, కచ్చితంగా ఒకరోజు డైరెక్టర్ అవుతాడు అంటూ ఏడ్చేశాడు. అంతా అమ్మ వల్లే..తనూజకు అక్కతో దిగిన ఫోటో వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. ముగ్గురు ఆడపిల్లలంటే కష్టమే.. పెళ్లి చేసేయండి అని కొందరు నాన్నతో అనేవాళ్లు. నాన్న కూడా భయపడి వీళ్లను చదివించొద్దు, పెళ్లి చేసేద్దామన్నారు. కానీ, అమ్మ.. మా కోసం నాన్నకు దూరంగా ఉన్నా పర్లేదని హైదరాబాద్ వచ్చేసింది. నువ్వు చేయగలవు, ముందుకెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. రౌడీగా దివ్యతర్వాత అమ్మానాన్న కలిసిపోయారనుకోండి. అయినా అమ్మ వల్లే నేనిక్కడ ఉన్నాను అంటూ తనూజ హ్యాపీగా ఫీలైంది. డిమాన్ పవన్.. చెస్ ఛాంపియన్‌గా మెడల్ అందుకున్న ఫోటో చూసి మురిసిపోయాడు. దివ్యకు చిన్నప్పుడు గుండుతో రౌడీగా రెడీ చేసినప్పటి ఫోటో వచ్చింది. రీతూ.. తన చిన్నప్పటి ఫోటో చూపిస్తూ భరణిలా విలన్ అవుతానంది. సుమన్‌కు చైల్డ్‌హుడ్ ఫోటో అందింది. కానీ గౌరవ్, సంజనా, భరణి, నిఖిల్ ఫోటో స్టోరీలను మాత్రం చూపించలేదు.చదవండి: తనూజకు భారీ ఓట్లు.. సీక్రెట్ ఇదే! -
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై దాదాపు 10 వారాలు కావస్తోంది. మాటకు మాట, ఆటకు ఆట అంటూ గేమ్స్ ఆడుతున్న కంటెస్టెంట్లకు ఇంటి మీద బెంగ మొదలై చాలారోజులే అవుతోంది. ఆ బెంగతోనే కదా.. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వారి చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అందించి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.లవ్యూ అమ్మా: తనూజవాటిని చూసి మురిసిపోయిన కంటెస్టెంట్లు వాటి వెనకాల కథను చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మొదటగా తనూజ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో బెస్ట్ సూపర్ హీరో అమ్మ. నావల్ల కాదని వెనకడుగు వేసినప్పుడు.. నీవల్ల సాధ్యమవుతుంది అంటూ నన్ను ముందుకు నడిపించింది. నీవల్లే ఇక్కడున్నా సావిత్రి. లవ్యూ మమ్మీ అని ఎమోషనలైంది.తినడానికి తిండి లేక మట్టిఇక ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. అది చూసిన ఇమ్మూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మా అమ్మకు నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో తినడానికి తిండి లేదంటా! తిండి లేక అమ్మ మట్టి తినేది.. మా అన్న, నేను చిన్నప్పటినుంచి కష్టపడ్డాం. మేము చేయని పనంటూ లేదు. నా జీవితానికి మా అన్నే హీరో. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన కల్యాణ్చిన్నప్పటినుంచి మరో నాన్నలా పెంచాడు. 20 మూటలు మోయాలంటే వాడు 15 మోసి, నన్ను 5 మాత్రమే మోయనిచ్చేవాడు అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కల్యాణ్.. అమ్మానాన్నతో తిరిగింది గుర్తు లేదు. చిన్నప్పుడు ఏదీ అంత తెలిసేది కాదు. హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రతి ఆదివారం ఫోన్ కోసం వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని. కొన్ని నెలలవరకు ఫోన్ వచ్చేది కాదంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి మిగతావారి స్టోరీలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: కల్యాణ్‌ను ఓడించి.. ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా -
Thanuja: కల్యాణ్‌ను ఓడించి ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా.
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యానికి వారెవ్వా చెఫ్ వచ్చి అందరికీ కడుపునిండా భోజనం పెట్టాడు. అయితే రాజుల- రాణిల కోసం ప్రత్యేకమైన వంటకాలను పట్టుకొచ్చాడు. ఇదేదో కల్యాణ్ కోరిక(చికెన్, మటన్ తినాలనుందన్న కోరిక)ను నెరవేర్చేందుకే ఆయన్ను హౌస్‌లోకి తీసుకొచ్చినట్లుగా ఉంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (నవంబర్ 13వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...రాజావారి విందు భోజనంరాజులు కల్యాణ్ (Pawan Kalyan Padala), నిఖిల్, రాణి రీతూ కోసం మాస్టర్ చెఫ్ సంజయ్ అసిస్టెంట్ ప్రణవ్ నాన్‌వెజ్ వంటకాలు సిద్ధం చేశాడు. ఆకలి మీదున్న పులుల్లా వాటిని ఈ ముగ్గురూ ఆవురావురుమని ఆరగించారు. తర్వాత కమాండర్స్ తనూజ, డిమాన్ పవన్, దివ్య, సంజనకు వడ్డించారు. ప్రజలుగా ఉన్న సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, భరణిలను పనోళ్లుగానే చూశారు. అందుకే వారిని కింద కూర్చోబెట్టి కేవలం శాఖాహార భోజనం మాత్రమే వడ్డించారు.కల్యాణ్‌ను ఓడించిన తనూజతర్వాత బిగ్‌బాస్.. రాజు, రాణిలకు చివరగా ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు కల్యాణ్‌తో కమాండర్ తనూజ (Thanuja Puttaswamy) పోటీపడింది. ఈ గేమ్‌లో చురుకుగా, చకచకా ఆడి తనూజ గెలిచింది. అలా కల్యాణ్‌ను రాజు స్థానంలో నుంచి కిందకు దింపి తను రాణిగా మారిపోయింది. బిగ్‌బాస్ రాజ్యానికి మహారాణి అవడమే కాకుండా ఏకంగా పదోవారం కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిసారి కెప్టెన్సీ చేతిదాకా వచ్చినట్లే వచ్చి చేజారిపోయేది. ఈసారి ఏకంగా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.చదవండి: నాతో నటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు: హీరో -
'బిగ్‌బాస్' కెప్టెన్సీ టాస్క్‌లో నటికి తీవ్ర గాయం (వీడియో)
బిగ్ బాస్ తమిళ సీజన్ 9లో VJ పార్వతి అనే కంటెస్టెంట్ తీవ్రంగా గాయపడింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఆమె కంటికి గాయం కావడంతో చాలా ఇబ్బంది పడింది. ‘BB బాటిల్ హంట్’ ఛాలెంజ్ సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆమె గాయపడినప్పటికీ హౌస్‌లో కొనసాగుతానని చెప్పడం విశేషం. ఈ షో తన కెరీర్‌కు చాలా అవసరమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పోరాడుతానని ఈ సీజన్లో కొనసాగుతుంది.బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నటుడు శబరి నాధన్ చేతిలో పార్వతి గాయపడింది. టాస్క్‌లో భాగంగా పొరపాటున అతని మోకాలు పార్వతి కంటికి చాలా బలంగా తగిలింది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో తల్లడిల్లింది. ప్రస్తుతం ఆమె కన్ను భాగం అంతా చాలా వాపు వచ్చినప్పటికీ హౌస్‌లో కొనసాగుతూనే ఉండటం విశేషం. ప్రస్తుతం బిగ్‌బాస్ టైటిల్ రేసులో టాప్-3లో పార్వతి ఉంది. పార్వతి తమిళనాడులో టీవీ యాంకర్‌గా పనిచేస్తుంది. ఆపై పాపులర్ రేడియో జాకీగా గుర్తింపు ఉంది. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో చాలా కష్టాలు పడ్డామని హౌస్‌లోకి వెళ్లే సమయంలో హౌస్ట్ విజయ్ సేతుపతికి చెప్పింది. ముగ్గురు సంతానం కలిగిన కుటుంబాన్ని తన అమ్మగారే ఒక సూపర్ హీరోలా పోషించిందని చెప్పింది. అయితే, ప్రస్తుతం కుటుంబ బాధ్యతలన్నీ తనమీదే ఉన్నాయని పేర్కొంది. పార్వతికి గాయం తగిలినప్పుడు హౌస్ నుంచి వెళ్లిపోవాలని బిగ్‌బాస్ సూచిస్తాడు. కానీ, తనకు ఈ షో చాలా అవసరమని కొనసాగుతానని ఆమె చెప్పింది. ప్రస్తుతం గాయంతోనే ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. తెలుగులో ఇమ్మాన్యూయేల్ ఎలాగో తమిళ్ బిగ్‌బాస్‌లో పార్వతి ఆట కూడా అంతే రేంజ్లో ఉంటుంది.Bloody CHEAP SABARI 🤮🤢😡🥵🥵🥵🤬🤬🤬🤬🤬😡😡😡😡🥵🥵🥵He is the Culprit Full Video and Proof 💯#saintsabari #VJParvathy #BiggBossTamil9 pic.twitter.com/kR0DXimj1t— Vishnu Deva (@iamvishnudeva) November 10, 2025Echcha paiya #Fj 💦💦💦#VJPaaru #VJParvathy #VJParvathi #BiggBossTamil #BiggBossTamil9 #BiggBoss9Tamil #BiggBossSeasonTamil9pic.twitter.com/1d9e5VB2HT— 🅐🅘🅢🅗🅤 (@AishGlowz) November 11, 2025 -
PR కోసం రూ.16 లక్షలు.. తెలుగులోనూ ఇదే జరుగుతోందా?
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ (పబ్లిక్ రిలేషన్ టీమ్)ను సెట్ చేసుకుని వస్తారు. అందుకోసం వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లో ఖర్చు పెడతారు. అంత స్థోమత లేని వారు హౌస్‌లో ఉన్నన్నాళ్లుండి ఏదో ఒక వారం బయటకు వచ్చేస్తుంటారు. ఇటీవలే మలయాళ బిగ్‌బాస్ ఏడో సీజన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సీజన్లో నటి అనుమోల్ విజేతగా నిలిచింది. ట్రోఫీతోపాటు రూ.42.5 లక్షలు, ఒక ఎస్యూవీ కారును గెల్చుకుంది.పీఆర్ కోసం రూ.16 లక్షలుకామన్ మ్యాన్ అనీష్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక ఇదే సీజన్లో పాల్గొన్న బిన్నీ సెబాస్టియన్ అనే కంటెస్టెంట్.. అనుమోల్ (Anumol) పెద్ద పీఆర్‌ను పెట్టుకుందని, అందుకోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు చేసిందని బిగ్‌బాస్ హౌస్‌లోనే కామెంట్ చేశాడు. దీంతో ఆమె పీఆర్ వల్లే గెలిచిందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీనిపై అనుమోల్ స్పందించింది. నేను రూ.16 లక్షలు పెట్టి పీఆర్‌ను సెట్ చేసుకోవడం వల్లే టైటిల్ గెలిచానంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదు.అంత డబ్బు నాకెక్కడిది?అంత డబ్బు నా దగ్గర లేదు. అయితే ప్రతి కంటెస్టెంట్ పీఆర్‌ను పెట్టుకుంటారని నాతో చెప్పారు. అందుకే నేను కూడా ఓ వ్యక్తిని కలిశాను. అతడు రూ.15 లక్షలు అడిగాడు. అంత స్థోమత నాకు లేదని చెప్పాను. కేవలం రూ.1 లక్ష మాత్రమే ఇస్తానన్నాను. రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. షో అయిపోయాక మిగతా సగం ఇస్తానన్నాను. ఈ రూ.16 లక్షల స్టోరీ ఎవరు అల్లారో నాకు అర్థం కావడం లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఉంటే ఈ షోకి వచ్చేదాన్ని కాదు అని క్లారిటీ ఇచ్చింది.ఇక్కడా అదే రిపీట్?మలయాళ బిగ్‌బాస్ 7లో సెలబ్రిటీ విన్నర్ అయితే కామనర్ రన్నరప్ అయ్యాడు. దీంతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లోనూ ఇదే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తనూజకు కప్పిచ్చేస్తారని, కల్యాణ్ రన్నరప్‌గా ఉంటాడని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. పైగా పీఆర్ కోసం వాళ్లే అంత ఖర్చుపెడ్తే తెలుగు కంటెస్టెంట్లు ఇంకే రేంజులో ఖర్చు పెడుతున్నారో? అని గుసగుసలాడుతున్నారు. మరి ఫైనల్లో ఇదే జరుగుతుందా? లేదంటే కామనర్ విన్నింగ్ రేసులోకి వస్తాడా? చూడాలి!చదవండి: రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ వార్నింగ్ -
రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ కల్యాణ్ వార్నింగ్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ బీబీ రాజ్యంగా మారిపోయింది. ఈ రాజ్యంలో కల్యాణ్ రాజయితే, దివ్య, రీతూ మహారాణులు. వీళ్లు నలుగురు కమాండర్లను సెలక్ట్ చేసుకుంటే మిగతావాళ్లు ప్రజలుగా ఉంటారు. మరి ఎవర్ని కమాండర్లుగా తీసుకున్నారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో మంగళవారం (నవంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..వాళ్లదే రాజ్యంబీబీ రాజ్యంలో బిగ్‌బాస్‌కు బుద్ధి పుట్టినప్పుడల్లా గేమ్స్ పెడుతూ ఉంటాడు. వారం ముగిసేసరికి రాజు, రాణులు, కమాండర్స్, ప్రజలు.. వీరిలో ఒక్కరికే ఇమ్యూనిటీ గెలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటగా మహారాజు, రాణులతో చర్చించి తనూజ, సంజనా, పవన్, నిఖిల్‌ను కమాండర్లుగా ఎంచుకున్నారు. మిగిలిన భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్, గౌరవ్ ప్రజలుగా మిగిలిపోయారు. ఈ ప్రజలే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.రీతూ తొండాటమహారాణిగా ఆసీనురాలైన దివ్య.. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా భరణితో తలకు మసాజ్ చేయించుకుంది. తర్వాత కమాండర్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌కు రీతూ (Rithu Chowdary) సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే తను గతంలో చేసిన తప్పే మళ్లీ చేసింది. పవన్ ఔట్ అయినా సరే, కాలేదంటూ అతడిని గేమ్ ఆడించింది. ఈ క్రమంలో సంజనా, తనూజ.. రీతూపై ఎగబడ్డారు. అయినా ఆమె అస్సలు లెక్కచేయలేదు. చివరకు ఈ గేమ్‌లో సంజనా ఓడిపోయింది.కష్టపడ్డ సుమన్కమాండర్స్ నలుగురిలో ఓడిపోయిన సంజనా (Sanjana Galrani) తన పోస్టు కాపాడుకోవాలంటే ప్రజల్లో ఒకరితో తలపడి గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమన్‌ను ఎంచుకుంది. ఈ ఇద్దరికీ కాటన్ డబ్బాలతో టవర్ కట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. సుమన్‌కు మరీ ఎక్కువ ఎత్తులో డబ్బాలు పెట్టడమనేది తన హైట్‌కు కష్టమైన విషయమే! అయినప్పటికీ సంజనాకు గట్టి పోటీనిస్తూ బాక్స్ మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు. బజర్ మోగే సమయానికి సంజన-సుమన్ ఇద్దరి టవర్ ఒకే ఎత్తులో ఉంది. కాకపోతే సంజనా టవర్ నిటారుగా, పర్ఫెక్ట్గా ఉంది కనుక తనే గెలిచింది అని కల్యాణ్ ప్రకటించాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు.కల్యాణ్‌ను తిట్టిపోసిన తనూజటవర్ ఎలా ఉన్నా పర్లేదన్నారు కదా.. చివరి బాక్స్ సుమనే ముందు పెట్టాడుగా అని తనూజ, దివ్యలు నోరేసుకుని పడిపోయారు. అయినప్పటికీ కల్యాణ్ తన నిర్ణయంపై నిలబడి ఉన్నాడు. అప్పటికీ తనూజ ఒప్పుకోలేదు. ఇదంతా నువ్వు ముందు చెప్పాల్సింది. నచ్చినట్లు చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తానంటే ఎలా కుదురుతుంది? చెప్పిన మాట మీద లేవు.. గేమ్ స్టార్ట్ అయ్యేముందు ఒకటి చెప్పావ్, అయిపోయాక ఒకటి చెప్తున్నావ్.. సంచాలక్‌గా ఫెయిల్ అని అరించింది. ఆ మాటతో ఆగ్రహించిన కల్యాణ్.. నోటికొచ్చినట్లు వాగితే బాగోదంటూ బాక్సుల్ని ఒక్కదెబ్బతో గుద్ది పడేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు.చదవండి: నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ -
'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నామినేషన్స్‌కు వచ్చినా కష్టమే, రాకున్నా కష్టమే! ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే, అందులోనూ పర్ఫామెన్స్ బాలేకపోతే ఓవరూ ఓట్లేయరు. అలాంటప్పుడు నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, బాగా గేమ్స్ ఆడుతున్నప్పటికీ నామినేషన్స్‌లోకి రాకపోతే అభిమానులందరూ ఎవరో ఒక కంటెస్టెంట్ వైపు మళ్లే అవకాశముంది. సదరు వ్యక్తికి ఓట్లేయడం మర్చిపోయే ఛాన్సుంది. భరణిని నామినేట్ చేసిన ఇమ్మూఅయితే తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో తొమ్మిదివారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. చూస్తుంటే ఈ వారం కూడా నామినేషన్స్‌కు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఇమ్మాన్యుయేల్ భరణిని నామినేట్ చేస్తూ.. మీరు చాలా విషయాల్లో వెనకాడుతున్నారు. ఫైర్ తగ్గిపోతోందని కారణం చెప్పాడు. ఎమోషనల్ డ్రామా ఎక్కువైందిరీతూ.. దివ్యను నామినేట్ చేస్తూ.. నువ్వొక గ్యాంగ్‌ను పెట్టుకుని వారిని బాణాల్లా వదులుతావ్.. అంది. వాళ్లేమైనా చిన్నపిల్లలా? అని దివ్య కౌంటరిచ్చింది. పర్ఫామెన్స్ లేదు కానీ ఎమోషనల్ డ్రామా ఎక్కువైందని సంజనాను నామినేట్ చేశాడు గౌరవ్. కల్యాణ్.. నిఖిల్‌ను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్ -
బిగ్‌బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ముద్దుబిడ్డ తనూజ అంటున్నారు కానీ ఆమెకంటే ఎక్కువ హింట్లు, సూచనలు ఇమ్మాన్యుయేల్‌కు ఇస్తున్నారు. తన ఆట ఎలా ఉందో ప్రతిసారి ఆడియన్స్‌తో చెప్పిస్తున్నారు. ఈసారేకంగా నామినేషన్స్‌లోకి రావడం లేదు, ఇలాగైతే కష్టమని ఏకంగా నాగార్జునే అనడం గమనార్హం. ఇంతకూ హౌస్‌లో ఏం జరిగిందో నవంబర్ 9వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఇద్దరికీ సమాన ఓట్లుట్రోఫీకి ఎవరు దగ్గర్లో ఉన్నారు? ఎగ్జిట్‌కు ఎవరు దగ్గర్లో ఉన్నారో చెప్పాలన్నాడు నాగ్ (Nagarjuna Akkineni). ఐదురు హౌస్మేట్స్ తనూజను, మరో ఐదుగురు ఇమ్మాన్యుయేల్‌ను ట్రోఫీకి దగ్గర్లో పెట్టారు. సంజన.. డిమాన్ పవన్‌కి ట్రోఫీ గెలిచే అర్హత ఉందని చెప్పింది. ఇమ్మూ.. కల్యాణ్‌కు గెలిచే అర్హత ఉందన్నాడు. ఎగ్జిట్ విషయంలో అయితే మెజారిటీగా ఎనిమిది మంది సాయి వెళ్లిపోతాడని ముందే గెస్ చేశారు.దివ్యకు వాయింపులుఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు నాగ్. దివ్య స్ట్రాటజీ కరెక్ట్.. కానీ, ఒకరి గెలుపు కోసం కష్టపడాలి తప్ప ఒకరి ఓటమి కోసం కాదని చెప్పాడు. తనూజను తీయను అని తనకు, కల్యాణ్‌కు మాటిచ్చి దాన్ని తప్పితే నీ క్రెడిటిబులిటీ పోతుందని హెచ్చరించాడు. రెబల్‌గా దివ్య.. తనను ఆటలో నుంచి తీసేస్తే కల్యాణ్ ఫైట్ చేయడం మానేసి పకపక నవ్వడం.. అది కరెక్టే అని నాగార్జున చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.ఇమ్మూని హెచ్చరించిన నాగ్ఇక బిగ్‌బాస్ చరిత్రలో ఇన్నివారాలు (తొమ్మిది వారాలు) నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే.. అని ఇమ్మాన్యుయేల్‌తో అన్నాడు. అదే నాకూ భయమేస్తుంది సార్, నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తోంది. ఎవరికో ఒకరికి షిఫ్ట్ అయిపోయుంటారేమో, త్వరలోనే వస్తా.. నాకోసం వెయిట్ చేయండి అని ఇమ్మూ వేడుకున్నాడు. 10 వారాలు నామినేషన్స్‌లోకి రాకుండా సడన్‌గా వస్తే.. అప్పటికే ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా.. అంటూ నామినేషన్స్‌లోకి రమ్మని వార్నింగ్ ఇస్తూనే డైరెక్ట్‌గా హింటిచ్చాడు.పవర్ వాడేందుకు ఒప్పుకోని తనూజఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో భరణి, సాయి మిగిలారు. వీరిలో సాయి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నీ దగ్గరున్న పవర్ ఉపయోగించి సాయిని సేవ్ చేయొచ్చు, అప్పుడు భరణి ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పాడు. అందుకు తనూజ ఒప్పుకోకపోవడంతో సాయి ఎలిమినేట్ అయ్యాడు. అతడు స్టేజీపైకి వచ్చి హౌస్‌లో ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సుమన్ కరెక్ట్ అని, భరణి, రీతూ, దివ్య రాంగ్ అని పేర్కొన్నాడు.చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) లో 9వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇంటి మీద బెంగతో రాము స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే సాయి శ్రీనివాస్ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అయ్యాడు. మరి ఆయన ఎలిమినేషన్‌కు కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత చూసేద్దాం..ఇమ్యూనిటీతో హౌస్‌లోకి..అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్ (Sreenivasa Sayee). ఇమ్యూనిటీ పవర్ ఉన్న వజ్రాన్ని అతడి చేతికిచ్చిన నాగ్ కావాల్సినప్పుడు వాడుకోమన్నాడు. అంతేకాదు, ఫస్ట్ వీక్‌లో వైల్డ్‌కార్డ్స్ నామినేషన్‌లోకే రాలేదు. తర్వాతి వారం నామినేషన్లోకి వచ్చినప్పటికీ సేవ్ అయిపోయాడు. కానీ, మరో వైల్డ్ కార్డ్ రమ్య ఎలిమినేట్ అయింది.కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడుఆ తర్వాతి వారం తన ఇమ్యూనిటీ వాడుకుని నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. గత వారం మాత్రం ఈ గండాన్ని తప్పించుకోలేకపోయాడు. తనూజను స్ట్రాంగ్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసిన సాయి ధైర్యాన్ని కొందరు మెచ్చుకున్నారు. కానీ, తనూజ ఫ్యాన్స్‌కు మాత్రం గిట్టలేదు. తనూజతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించాలనుకున్నారు. పోనీ, టాస్కుల్లో అరాచకంగా ఏమైనా ఆడాడా? అంటే అదీ లేదు. అవకాశాలు దక్కించుకోలేక..ఆడేంత సత్తా ఉన్నప్పటికీ అవకాశాన్ని చేజిక్కించుకునే తెలివి లేకుండా పోయింది. టీమ్‌లో ఉన్నాడే కానీ, ముందు వరుసలో ఆడలేకపోయాడు. దివ్య తెలివిగా అతడిని వెనకపడేయడం.. రీతూ మరింత తెలివిగా అతడ్ని ఆటలో తప్పించడంతో గేమ్స్ ఆడే ఛాన్సులు రాలేవు. హౌస్‌లో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్పడంతో మానిప్యులేటర్ అన్న ముద్ర కూడా పడింది. రెమ్యునరేషన్ ఎంత?కెప్టెన్సీ గేమ్‌లోనూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో తడబడ్డాడు. ఎక్కువ అయోమయానికి లోనయ్యాడు. అప్పటికీ నెమ్మదిగా తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, అంత నెమ్మదితనం బిగ్‌బాస్ షోలో పనికిరాదు. ఫలితంగా సాయి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అతడికి వారానికి రూ.2 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నాలుగువారాలకుగానూ రూ.8 లక్షల మేర సంపాదించాడన్నమాట!చదవండి: Bigg Boss 9.. నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి -
Bigg Boss 9 : నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది.. మాధురి కామెంట్స్
ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా.. అని ఓ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు దివ్వెల మాధురికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. బిగ్‌బాస్(Bigg Boss 9 Telugu) హౌస్‌లోకి ఎప్పుడొచ్చాం..ఎప్పుడు పోయామని కాదు.. మనదైన ముద్ర వేశామా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో మాధురి సక్సెస్ అయినట్లే. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆలస్యంగా హౌస్‌లోకి వెళ్లి.. మూడు వారాలకే బయటకు వచ్చినా.. తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఫైర్‌బ్రాండ్‌గానే హౌస్‌లోకి వెళ్లి..ఆట కూడా అలాగే ఆడింది. గొడవలు, అరుపులతో కావాల్సినంత కంటెంట్ ఇవ్వడమే కాదు..టాస్కులు కూడా బాగానే ఆడింది. కానీ మూడోవారం ఓటింగ్ తక్కువ రావడంతో ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.తాను కావాలనుకొనే బయటకు వచ్చానని మాధురి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షో ద్వారా మాధురి భారీగానే సంపాదించిదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మూడు వారాలకు గాను ఏకంగా రూ. 9లక్షల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు.డబ్బుల కోసం వెళ్లలేదు.. బిగ్‌బాస్ షోకి చాలామంది ఫేమ్ కోసమో లేదా మనీ కోసం వెళ్తుంటారు. కానీ మాధురి మాత్రం ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్లారట. డబ్బుల కోసం అయితే తాను బిగ్‌బాస్ షోకి వెళ్లలేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పైవిధంగా చెప్పింది. ‘నేను డబ్బులకు టెంప్ట్ అయి బిగ్‌బాస్ షోకి వెళ్లలేదు. నాకు బయటే రోజు 2-3 లక్షలు వస్తాయి. బిగ్‌బాస్ షో మొత్తం ఆడితే కోటి వరకు వస్తాయేమో కానీ..నేను నెలకే రూ. కోటి సంపాదిస్తాను. అసలు నేను రెమ్యూనరేషన్ విషయంలో డిమాండే చేయలేదు. దేవుడిచ్చిన వరకూ మాకు డబ్బులు బానే ఉన్నాయి.. ఫేమ్ కూడా బానే ఉంది.. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి.. లైఫ్‌లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్లా’ అని మాధురి చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం
రాను బొంబాయికి రాను.., సొమ్మసిల్లి పోతున్నవే.. పాటలతో యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యాడు సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ ఛాన్స్ తెచ్చుకున్నాడు. తొమ్మిది వారాలు హౌస్‌లో ఉన్న రాము అమ్మపై బెంగ పెట్టుకుని లోలోపలే కుమిలిపోయాడు. చిన్నప్పుడు అమ్మనాన్నకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు బిగ్‌బాస్‌కు వచ్చి వాళ్లకు దూరంగా ఉండటం తన వల్ల కావడం లేదంటూ స్వతాహాగా బయటకు వచ్చేశాడు. అసలు రాము పేరెంట్స్ ఏం చేసేవారు? ఎందుకు రాముకు దూరంగా ఉన్నారో వారి మాటల్లోనే చూద్దాం..మేస్త్రీ పనికి..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాము (Ramu Rathod) పేరెత్తగానే అతడి తల్లి.. నా కొడుకును రోజూ చూస్తున్నా, కానీ మాట్లాడలేకపోతున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత తమాయించుకుని ఆమె మాట్లాడుతూ.. నాకు ఐదుగురు సంతానం. పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి మేము ముంబై, పుణె వెళ్లి ఉప్పర్ (మేస్త్రీ) పని చేసేవాళ్లం. పొద్దున 4 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వచ్చేవాళ్లం. మొదట్లో నాకు రూ.30, నా భర్తకు రూ.60 ఇచ్చేవారు. నూకలతో వండిన అన్నం పెట్టేవాళ్లు. అందులో పురుగులు ఏరేసుకుని తినేవాళ్లం. నూకల బియ్యమే ఆహారంఊర్లో నా పిల్లలు సారా అమ్మేవాళ్లు. ఆ డబ్బుతోనే పుస్తకాలు కొనుక్కునేవాళ్లు. నేను కట్టెల మోపు అమ్మగా వచ్చిన డబ్బుతో నూకలు తెచ్చుకుని కుటుంబమంతా తినేవాళ్లం. కరోనా సమయంలో నా ఇంట్లోని నలుగురికి కరోనా వచ్చింది. అప్పుడు నేను, రాము కలిసి ఊరూరు తిరిగి కూరగాయలు అమ్మాం. ఒకప్పుడు మమ్మల్ని చాలా చిన్నచూపు చూసేవాళ్లు. అలా అవమానాలు పడ్డప్పుడు బతకాలనిపించలేదు. రేపు మా గతేంది? అని ఎంతో బాధపడ్డా.. కానీ, నా చిన్నకొడుకు దేవుడిచ్చిన వరం. కుటుంబ బాధ్యతను అతడే చూసుకుంటున్నాడు.నా భర్త కొట్టేవాడునాకు తన సంపాదనతో మొదటగా బంగారు కమ్మలు, మాటీలు కొనిచ్చాడు. అలాగే రూ.10 వేల చీర తెచ్చాడు. అందరూ మనవాళ్లే అంటారు. అన్నల కోసం, అక్క, చెల్లి కోసం చాలా ఖర్చు పెడతాడు. నాకు 6 తులాల బంగారం ఇస్తే, వాడి అక్కకు రూ.3 లక్షలు, చెల్లికి రూ.4 లక్షలు, అన్నకు రూ.16 లక్షలతో బస్ ఇప్పించాడు. అందరం ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్తుంటాడు అని ఎమోషనలైంది. భార్యాభర్తలు గొడవపడేవారా? అన్న ప్రశ్నకు నా భర్త నన్ను కొట్టేవాడు.. కానీ, ఎప్పుడు కొట్లాడుకున్నా వెంటనే కలిసిపోయేవాళ్లం అని చెప్పుకొచ్చింది.చదవండి: రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే.. -
రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!
పచ్చని పల్లెటూరులో బతికే గంగవ్వకు ఏసీ వాతావరణం పడక, హౌస్‌లో ఉండలేక రెండుసార్లు (తెలుగు బిగ్‌బాస్ 4, 8వ సీజన్స్‌లో) సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. గత సీజన్లో మణికంఠ మానసికంగా వీక్ అయిపోయానంటూ పంపించేయమని వేడుకుని బయటకు వచ్చేశాడు. ఇప్పుడదే రకంగా రాము రాథోడ్ కూడా ఇంటి మీద బెంగతో తనంతట తానే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ నుంచి బయటకు వచ్చాడు. నాగార్జున సర్దిచెప్పినా సరే వినకుండా ఎలిమినేషన్‌కే మొగ్గుచూపాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్ 8వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..టాప్ 6లో ఎవరంటే?నాగార్జున, అమల, రామ్‌గోపాల్ వర్మల 'శివ' మూవీ ప్రమోషన్స్‌తో ఎపిసోడ్ మొదలైంది. తర్వాత.. కంటెస్టెంట్లు ఎవరు హిట్టు? ఎవరు ఫ్లాప్? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించారు. అందులో సుమన్, ఇమ్మాన్యుయేల్ (Emmanuel), తనూజ, కల్యాణ్, రీతూ, పవన్ టాప్ 6లో ఉన్నారు. వీరికి నాగ్ కొన్ని బంపరాఫర్స్ ఇస్తూనే కొన్ని కండీషన్స్ పెట్టాడు. వారి కోరికలు నెరవేర్చుకోవాలంటే కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నాడు.ఇమ్మూ స్వార్థంభరణి ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సుమన్ కెప్టెన్సీ కంటెండర్ అవుతాడని తెలిపాడు. దీన్ని సుమన్ తిరస్కరించి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఆడి గెల్చుకుంటానన్నాడు. ఇమ్మాన్యుయేల్‌కు గర్ల్‌ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ వచ్చిందని, అది వినాలంటే గౌరవ్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ పోతుందన్నాడు. ఆ పవర్ పోతే పోనీయ్.. అని భావించిన ఇమ్మూ.. ప్రియురాలి సందేశం విని ఎమోషనలయ్యాడు. తనూజ సోదరి వాయిస్ మెసేజ్ వినాలంటే కల్యాణ్ సీజన్ మొత్తం నామినేట్ అవాలన్నాడు. రీతూకి రెండు సర్ప్రైజ్లురెండువారాల్లో సోదరి పెళ్లి ఉందని ఎమోషనలైన తనూజ.. తన కోసం కల్యాణ్‌ను బలి చేసేందుకు ఒప్పుకోలేదు. కల్యాణ్‌కు వారంపాటు చికెన్, మటన్ కావాలంటే నిఖిల్ రెండు వారాలు నామినేట్ అవ్వాలన్నాడు. దీన్ని కల్యాణ్ తిరస్కరించాడు. రీతూ.. తండ్రి షర్ట్ పొందడం కోసం సంజనా చీరల్ని కోల్పోయింది. పవన్.. ఫ్యామిలీ ఫోటో కావాలంటే రీతూకి తండ్రి ఫోటో రాదన్నాడు. దీంతో అతడు తన ఫ్యామిలీ ఫోటో త్యాగం చేసి రీతూకి ఆమె తండ్రి ఫోటో వచ్చేలా చేశాడు.రాను బిగ్‌బాస్‌కు రానంటూ..ఇంటిమీద బెంగ పెట్టుకున్న రాము (Ramu Rathod)ను నాగ్ కదిలించగానే.. అతడు పాట రూపంలో తన బాధనంతా బయటపెట్టాడు. బయటకు వెళ్లిపోతానన్నాడు. హీరోలు ఆట అంతు చూస్తారు, కానీ మధ్యలో వదిలేయరు అని నాగ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రాము వినిపించుకోలేదు. క్షమించండి సార్, వెళ్లిపోతాను అని పదేపదే అదే మాట అన్నాడు. వెళ్లిపోవాలనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తా.. 10 సెకన్లలో నిర్ణయం చెప్పమంటూ టైమిచ్చినా.. వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. హౌస్మేట్స్ ఆపేందుకు ప్రయత్నించినా లెక్కచేయలేదు. అలా రాము స్వతాహాగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇది సడన్ ఎలిమినేషన్ కావడంతో అతడి జర్నీ వీడియో చూడకుండానే వెళ్లిపోయాడు.చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే.. -
బిగ్‌బాస్ ప్రోమో: అమలతో డ్యాన్స్ చేసిన నాగార్జున..
టాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ నాగార్జున (Nagarjuna Akkineni)-అమల.. కిరాయిదాదా, చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో శివ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 1989 అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శివ సాంగ్‌తో ఎంట్రీఅన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీరిలీజ్ (Siva Movie ReRelease) చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ స్టేజీపైకి ఆర్జీవీతో పాటు శివ రీల్ కమ్ రియల్ లైఫ్ హీరోయిన్ అమల సైతం వచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో నాగార్జున.. బోటనీ పాఠముంది, మ్యాట్నీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా.. పాటతో ఎంట్రీ ఇచ్చాడు. అమలతో నాగ్ డ్యాన్స్ఆ వెంటనే అమల రంగంలోకి దిగి.. నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ జంట కోసం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సైతం జోడీలుగా విడిపోయి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో వారు డ్యాన్స్ చేస్తుంటే స్టేజీపై అమల ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. నిన్ను బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులు ఉండమంటే ఉంటావా? అని నాగ్.. ఆర్జీవీని అడిగాడు. అందుకాయన.. అందరూ సంజనాలాంటి అందమైన అమ్మాయిలుంటే కచ్చితంగా ఉంటానన్నాడు వర్మ. చదవండి: ఓరీపై ట్రోలింగ్.. కొంచెమైనా బుద్ధుందా? అవేం మాటలు! -
ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు అయింది భరణి పరిస్థితి. దివ్య.. తనూజ గొడవపడి అసలు సంబంధమే లేని భరణిని మధ్యలోకి లాగారు. నాతో మాట్లాడొద్దని తనూజ.. మీ పేరొచ్చినప్పుడు మాట్లాడలేరా? స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి అని దివ్య.. భరణిపై ప్రతాపం చూపించారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్7వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..తడబడిన సాయికెప్టెన్సీ కంటెండర్స్‌ను సెలక్ట్ చేసిన బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).. వారిలో ఎవర్ని సైడ్ చేయాలి? ఎవర్ని ముందుకు తీసుకెళ్లాలన్న బాధ్యతను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో కంటెండర్కు సపోర్ట్‌గా నిలబడ్డారు. రాము.. తనూజకు సపోర్ట్ చేస్తానని ఇచ్చిన మాట కోసం భరణిని తీసేశాడు. సాయి శ్రీనివాస్ దివ్యను తీసేయబోతే.. నిన్ను కాపాడుకుంటూ వచ్చా, నన్నే తీస్తున్నావా? అని ధమ్కీ ఇచ్చింది.చివరకు ముగ్గురుదెబ్బకు జడుసుకున్న సాయి (Sreenivasa Sayee).. రీతూ పేరెత్తాడు. నేనేం చేశానని ఆమె ఉగ్రరూపం ఎత్తడంతో సుమన్ పేరు ప్రస్తావించాడు. వాళ్లిద్దరూ నోరేసుకుని పడిపోయారని నామీదకు వచ్చావా? అని సుమన్ ఆగ్రహించాడు. దీంతో సాయి మళ్లీ తను మొదట చెప్పినట్లుగా దివ్యను గేమ్‌లో అవుట్ చేశాడు. నిఖిల్.. సుమన్‌ను తీశాడు. అలా చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్.. ముగ్గురు మిగిలారు. సరిగ్గా ఇప్పుడే దివ్య చక్రం తప్పింది. టార్గెట్ తనూజతనూజ, రీతూ ఉంటే.. రీతూనే తీస్తానన్న ఆమె సడన్‌గా మనసు మార్చుకుని తనూజను సైడ్ చేసింది. అది తట్టుకోలేకపోయిన తనూజ.. మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేశావ్.. భరణిగారి వల్లే తీసేశావ్ అని ఆగ్రహించింది. మధ్యలో నా పేరెందుకొచ్చిందని భరణి షాకై చూశాడు. తనూజను తీసేయవనే ఆ కుర్చీ ఇచ్చానని కల్యాణ్ అంటే.. ఆమె ఉంటే ఇమ్మూకి గెలుపు కష్టమవుతుందనే తనూజను తీసేశానని దివ్య బదులిచ్చింది.దివ్యపై భరణి ఉగ్రరూపంమీ పర్సనల్స్ బయట పెట్టుకో, హౌస్‌లో కాదని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పి ఆవేశంగా లోపలకు వెళ్లిన తనూజ గుక్కపెట్టి ఏడ్చింది. ఆమె మాటలు విన్నారా? ఇప్పుడు హ్యాపీయా? నా గేమ్‌లో మీ పేరెందుకు వచ్చింది? ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోండి అని అందరి ముందే భరణిపై అరిచింది. కాసేపటికి ఒంటరిగా ఉన్న భరణి దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చా? అని అడిగింది. ఆయన కోపంగా ఉన్నాడని అర్థమై ఎందుకంత కోపంగా చూస్తున్నారు? అరిచినందుకు సారీ చెప్దామని వచ్చానంది. ఏం మాట్లాడాలి? నామీద అరవడం ఫస్ట్ టైమా? నువ్వేదో అంటావ్.. తనేదో అంటుంది. ఇలాగైతే నేను ఊరుకోనుమధ్యలో నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి? అవసరమైతే తనతో తర్వాత మాట్లాడతా కదా.. అని భరణి సీరియస్ అయ్యాడు. దీంతో ఆమె సారీ చెప్పి కెప్టెన్ రూమ్‌లోకి వెళ్లిపోయింది. మా మమ్మీడాడీని చూస్తే కూడా నాకు భయమయలేదు. ఆయన కళ్లలో అంత కోపం చూశాను.. నాకు ఆయన అన్నయ్యే కావచ్చు.. కానీ, అది బయటకెళ్లాక చూసుకుంటానిక.. ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అని ఇమ్మాన్యుయేల్‌తో అంది. తర్వాత రీతూ, ఇమ్మాన్యుయేల్‌కు ఓ గేమ్ పెట్టగా అందులో ఇమ్మూ గెలిచి మరోసారి కెప్టెన్ అయ్యాడు. దివ్య ఎత్తుగడ వల్ల తనూజకు జనాల్లో సింపతీ రావడం ఖాయం. ఈ ఎపిసోడ్‌తో తనూజ కప్పు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: హౌస్‌లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే! -
హౌస్‌లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో తొమ్మిదోవారం ఎలిమినేషన్‌కు సమయం ఆసన్నమైంది. ఈసారి భరణి, తనూజ, సుమన్, రాము, సాయి శ్రీనివాస్, సంజన, కల్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెను ఓటింగ్‌లో అగ్రస్థానలో నిలబెడుతూనే వస్తోంది. రెండో స్థానంలో కామన్ మ్యాన్ కల్యాణ్ దూసుకెళ్తున్నాడు. సుమన్ చిన్నగా నవ్వినా, ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా సరే.. ఓట్లు దానంతటదే వస్తాయి. చివర్లో వాళ్లిద్దరుఅలా అతడికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. సంజన ఎలిమినేషన్ గండానికి కాస్త దూరంలోనే ఉంది. భరణికి ఆమె కంటే తక్కువ ఓట్లే పడుతున్నాయి. చివర్లో రాము (Ramu Rathod), సాయి శ్రీనివాస్ మిగిలారు. ఇద్దరికీ చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన సాయికి తానేంటో నిరూపించుకునే టాస్క్ ఒక్కటికూడా పడలేదు. కానీ, నామినేషన్స్‌లో బాగానే మాట్లాడాడు. ఓట్లు పడాలంటే ఇది సరిపోదు. వెళ్లిపోవడానికి రెడీ?కనీసం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో అయినా ఇరగదీద్దాం అనుకుంటే దివ్య, రీతూ.. అతడికి ఆ ఛాన్సు రాకుండా, లేకుండా చేశారు. ఫలితంగా అతడి మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. ఇక రాము విషయానికి వస్తే.. ఎప్పుడు వెళ్లిపోదామా? అని చూస్తున్నాడు. ప్రతి గేమ్‌లో తనంతట తానే పక్కకు తప్పుకుంటున్నాడు. ఆటలో గెలుపోటములు సహజం.. కానీ, ఆడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా పక్కకెళ్లి కూర్చుంటున్నాడు. అన్నింట్లోనూ గివప్ ఇచ్చేస్తున్నాడు. ఇల్లు గుర్తొస్తుందంటూ చాలాసార్లు ఒంటరిగా ఒక్కడే కూర్చుంటున్నాడు. చాలా డల్ అయిపోయాడు. రామును ఎలిమినేట్ చేస్తే బెటర్!ఆరెంజ్ టీమ్‌లో అందరూ సేఫ్ బ్యాడ్జ్ కోసం పోట్లాడుతుంటే నాకూ కావాలని మాటవరసకైనా అనలేదు. నాకొద్దని సింపుల్‌గా తేల్చేశాడు. కనీసం కెప్టెన్సీ కంటెండర్ అవుతాననీ వాదించలేదు. తనే స్వయంగా వదిలేసుకున్నాడు. తనకేదీ అవసరమే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అతడి వాలకం చూసి జనాలకు సైతం చిరాకొస్తోంది. ఇంత హోమ్ సిక్ అయితే రామును పంపించేయండి నాగార్జునగారూ అని కామెంట్లు చేస్తున్నారు. ఇతడికి ఓట్లేసి కాపాడే బదులు ఏదో ఒకటి చేయాలని తాపత్రయం చూపిస్తున్న సాయిని హౌస్‌లో ఉంచితే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి!చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి -
దివ్య ఇచ్చిన షాక్‌తో బోరుమని ఏడ్చిన తనూజ.. ఎంతో కష్టపడ్డానంటూ..
కెప్టెన్సీ ఎవరు కాదనుకుంటారు? అందరూ కోరుకునేదే, అందరికీ బాగా కావాల్సిందే! బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతోంది. అయితే కంటెండర్లకు డైరెక్ట్‌గా గేమ్ పెట్టకుండా.. హౌస్మేట్స్ సాయంతో గెలిచే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్ మాత్రమే మిగిలారు. ఏ హౌస్‌మేట్ అయితే రైలెక్కి కూర్చుంటాడో అతడు ఒకర్ని రేసు నుంచి తీసేయొచ్చు. మోసం చేసిన దివ్య?అలా ఒక్క కుర్చీ కోసం హౌస్మేట్స్ పోటీపడ్డారు. కల్యాణ్ చేతిలో కుర్చీ ఉంటే.. నేను చెప్పేది విను అంటూ అతడికి నచ్చజెప్పి కుర్చీలో కూర్చుంది దివ్య. నా సపోర్ట్ ఇమ్మాన్యుయేల్‌కు అని చెప్తూ.. తనూజను గేమ్‌లో అవుట్ చేసింది. అది విని షాకైన తనూజ.. నీకు కొంచెమైనా ఉందా? వ్యక్తిగత కారణాలతో ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావ్? అని కోప్పడింది. తనూజను ఎలిమినేట్ చేయవు అన్నందుకే కల్యాణ్ నీకు కుర్చీ ఇచ్చాడని గుర్తు చేసింది. చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లుఇంతలో కల్యాణ్ కూడా మధ్యలో కలగజేసుకుంటూ.. నీ నుంచి లాక్కోవడం నాకు పెద్ద విషయమే కాదు, నిన్ను నమ్మి ఇచ్చానని తలపట్టుకున్నాడు. మళ్లీ కెప్టెన్సీకి అడుగు దూరంలో ఆగిపోయిన బాధలో ఉన్న తనూజ.. నాతో మాట్లాడకు, నీకేమైన పర్సనల్స్ ఉంటే హౌస్ బయట పెట్టుకో అని దివ్యకు చెప్పి, ఆ వెంటనే బోరుమని ఏడ్చేసింది. కెప్టెన్ అవాలని చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి వచ్చి ఓదారుస్తుంటే కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడూ మాట్లాడొద్దు అని వేడుకుంది. ఇక చివర్లో రీతూ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ! -
నన్ను బెదిరించేవాడే లేడన్న భరణి.. మళ్లీ అతడే కెప్టెన్!
రెండు రోజులుగా ఎపిసోడ్స్ చూస్తుంటే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) నిద్రమత్తులో ఉన్నట్లే కనిపిస్తోంది. ఏదో టాస్కులిచ్చామా? ఆడించామా? అన్నట్లుగా ఉన్నాయి. అంతేకాదు.. అసలైన రెబల్‌ను వదిలేసి ఎక్కువమంది రెబల్ అనుకునేవ్యక్తిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడమైతే మరీ దారుణం. ఇక గురువారం (నవంబర్ 6వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలైట్స్‌లో చూసేద్దాం..గొడవకు సైపాత రెబల్స్ దివ్య (Divya Nikhita)-సుమన్‌కు ఇచ్చిన పని పూర్తయిందన్నారు. తర్వాత రీతూను కొత్త రెబల్‌గా నియమించి ఒకరితో సీరియస్‌గా గొడవపడమన్నాడు. ఇంకేముంది.. ఇమ్మూతో కయ్యానికి కాలు దువ్వింది. ఈ సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకర్ని తప్పించే పవర్ రీతూకి వచ్చింది. దాని సాయంతో ఆమె సాయిని తీసేసింది. ఏ గేమ్ పెట్టినా గెలుపు మాత్రం ఆరెంజ్ టీమ్‌దే అన్నట్లుగా ఉంది పరిస్థితి. గౌరవ్‌కు బ్యాడ్జ్..మొన్న జరిగిన రెండు టాస్కుల్లో వీరే గెలిచారు. నిన్నటి టాస్కులో ఇమ్మూ, గౌరవ్ ఆడి మరోసారి టీమ్‌ను గెలిపించారు. ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ నాక్కావాలని గౌరవ్ అడిగితే మొదట్లో కుదరదని వాదించారు. కానీ, చివరకు సరేనని ఇచ్చారు. బంధాల వల్లే బయటకు వెళ్లిన భరణి లోపలకు వచ్చాక కూడా పెద్దగా మారలేదు. దీంతో నాగార్జున క్లాస్ పీకడంతో కాస్త బుద్ధి తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. తన అభిప్రాయాన్ని కాస్త ధైర్యంగా చెప్తున్నాడు. నన్ను బెదిరించేవాడే లేడురెబల్ ఎవరనుకుంటున్నారు? అన్న చర్చలో సంజనాయే అని అనుమానపడ్డాడు. తను మీకు చెప్పిందా? అని దివ్య అడగ్గా.. చెప్పకపోతే నెక్స్ట్ వెళ్లిపోయేది మీ టికెటే అని కల్యాణ్ రెచ్చగొట్టాడు. అందుకు భరణి.. నేను వెళ్లిపోయినా పర్లేదు, హౌస్‌లో నన్ను బెదిరించేవాడే లేడు. వాడు రెబల్ అయినా.. రెబల్‌కు బాబు అయినా! ఆల్రెడీ చచ్చి బతికొచ్చినోడ్ని.. అంటూ డైలాగ్ కొట్టాడు.సీక్రెట్ టాస్క్‌లో ఫెయిల్తర్వాత రీతూకు.. ఇమ్మూ ఫ్యామిలీ ఫోటో కొట్టేయమని మరో సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ రీతూ పూర్తి చేయలేదు. తర్వాత బిగ్‌బాస్ అందర్నీ కూర్చోబెట్టి ఎవరు రెబల్ అనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఎక్కువమంది గౌరవ్ పేరు చెప్పడంతో అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే బిగ్‌బాస్ రెబల్స్ దివ్య, సుమన్ శెట్టిని కంటెండర్లుగా ప్రకటించారు. కొత్త కెప్టెన్ ఎవరంటే?సంజన, నిఖిల్, గౌరవ్, డిమాన్, సాయి, కల్యాణ్ రేసులో నుంచి ఇదివరకే ఔట్ అయిపోగా తనూజ, భరణి, రీతూ, రాము, ఇమ్మూ మిగిలారు. వీరిలో నలుగురికే ఛాన్స్ అనడంతో రాము తాను తప్పుకుంటానని ముందుకొచ్చాడు. అలా కెప్టెన్సీ కోసం తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ, దివ్య, సుమన్ పోటీపడనున్నారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం ఇమ్మాన్యుయేల్ మళ్లీ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
పవన్‌కు అన్యాయం.. గౌరవ్‌పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!
డిమాన్ పవన్ టాస్క్‌ల వీరుడు.. అతడితో పోటీపడితే ఓటమి తథ్యం అని హౌస్‌మేట్స్‌కు బాగా తెలుసు. వీళ్లందరికంటే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు మరీ ఎక్కువ తెలుసు. అందుకే.. అతడ్ని సైడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అదెలాగో బుధవారం (నవంబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్ ఔట్రెబెల్స్ దివ్య, సుమన్.. బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులను ఎవరికీ అనుమానం రాకుండా చకచకా పూర్తి చేస్తున్నారు. రెండో టాస్కులో భాగంగా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశారు. కానీ, ఉదయాన్నే ఏమీ తెలియని అమాయకుల్లా ఫేస్ పెట్టారు. దివ్య అయితే.. ప్యాకెట్స్ ఎవరు కొట్టేశారో.. ప్లీజ్, ఇచ్చేయండి అని మహానటిలా నటించేసింది. ఈ దొంగతనం టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినందున హౌస్‌లో ఒకరిని కంటెండర్ రేసు నుంచి తప్పించవ్చన్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. నిఖిల్‌ను తప్పిస్తున్నట్లు చెప్పింది.కెప్టెన్‌కు ఎదురుతిరిగిన గౌరవ్పాల ప్యాకెట్లు కనిపించకపోవడంతో రీతూ (Rithu Chowdery) హస్తం ఉందని తనపైనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ, రాము సరదాగా.. ఏమో దివ్యనే రెబల్ కావొచ్చేమో అన్నాడు. నిఖిల్ మాత్రం.. సీరియస్‌గానే దివ్య రెబల్ అని తేల్చేశాడు. మరోవైపు కిచెన్‌లో మళ్లీ గొడవ మొదలైంది. మధ్యాహ్నానికి కూరగాయలు కట్ చేయమని గౌరవ్‌కు ఆర్డరేసింది దివ్య. ఇంకా బ్రేక్‌ఫాస్టే తినలేదు.. అప్పుడే లంచ్‌కోసం ప్రిపరేషన్ ఏంటి? అని గౌరవ్ వాదించాడు. భోజనమే ఉండదుఈ గొడవ ముదరడంతో.. గౌరవ్‌ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వాష్‌రూమ్స్ క్లీన్ చేయాలని ఆర్డరేసింది కెప్టెన్ దివ్య. తాను ఆ పని చేయనని గౌరవ్ మొండికేయగా.. అలాగైతే రేపు నీకు భోజనమే ఉండదని దివ్య బెదిరించింది. ఇదిలా ఉంటే ఎవరు రెబల్ అనుకుంటున్నారో ఓటింగ్ వేయాలన్నాడు బిగ్‌బాస్. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారన్నాడు. దీంతో కొందరు కావాలని పవన్ పేరు చెప్పి అతడిని ఈజీగా సైడ్ చేశారు. దెబ్బకు జడుసుకున్న రీతూఅనంతరం ఓ హారర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తనూజ భయపడుతూనే టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. తర్వాత దివ్య.. ధైర్యంగా లోనికి వెళ్లి వచ్చింది. అనంతరం రీతూ.. తనకు భయమనేదే లేదు, ఆడపులి అని బిల్డప్ కొడుతూ లోపలకు వెళ్లింది. కానీ అక్కడున్న దెయ్యాల గెటప్స్ చూసి నిలువెల్లా వణికిపోయింది. చివర్లో మాత్రం ఓ నవ్వు నవ్వి దెయ్యాలు సైతం జడుసుకునేలా చేసింది. ఈ గేమ్‌లో తనూజ గెలిచింది.చదవండి: జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్లో.. నటి -
దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ కొన్నిసార్లు దెయ్యాలకొంపలానూ మారిపోతుంటుంది. ఏమాటకామాట.. దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది సోహైల్! భయమనేది మా ఇంటావంటా లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చి చీకటి గదిలోకి వెళ్లాడు. తీరా అక్కడ చిన్న వెలుతురు లేకపోగా వింత శబ్ధాలు, ఫ్లాష్ లైట్లలో దెయ్యం ఆకారాలు చూసి మామూలుగా జడుసుకోలేదు. ఇప్పుడదే టాస్క్ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లోనూ రిపీట్ అవుతోంది.ఆడపులి..ఈ మేరకు ప్రోమో కూడా వదిలారు. తనూజ భయంభయంగానే ఆ గదిలోకి వెళ్లి తనకిచ్చిన టాస్క్ పూర్తి చేసింది. తర్వాత రీతూ వంతు వచ్చింది. లోపల జాగ్రత్త.. అని సంజనా ధైర్యం చెప్తుంటే.. ఆడపులి ఇక్కడ అని బిల్డప్ ఇచ్చింది. తీరా లోపలకు వెళ్లాక ఆ దెయ్యం కాళ్లు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా మారింది. ఇలా చేస్తే నేను బయటకు పోతా.. అన్న ప్లీజ్.. ప్లీజ్.. అంటూ వేడుకుంటూనే ఉంది. చివర్లో మాత్రం దెయ్యంలా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు దెయ్యాలే జడుసుకుని పారిపోవడం ఖాయం! ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సుమన్, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్ టాస్కులు పూర్తి చేస్తున్నారు. మరి చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి! చదవండి: బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్ -
విడిపోనున్న తండ్రీకూతురు.. తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణి
మాధురి వెళ్లిపోయింది.. ఇంక హౌస్‌లో గొడవలు జరుగుతాయో, లేవో? అని నిరాశపడ్డ బిగ్బాస్ప్రియులకు పండగలాంటి వార్త. ఈరోజు నామినేషన్స్‌లో లెక్కలేనన్ని గొడవలు జరగనున్నాయి. కానీ, అన్నీ తనూజ చుట్టే తిరిగేట్లు కనిపిస్తోంది. తనూజ వర్సెస్ భరణి, తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్, తనూజ వర్సెస్ దివ్య.. ఇలా నేటి నామినేషన్స్ జరగనున్నాయి.తనూజ వర్సెస్ ఇమ్మూతాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంది తనూజ. అందుకు ఇమ్మూ మాట్లాడుతూ.. నావల్ల అయినంతవరకు సపోర్ట్ అని మోయగలుగుతాను. భుజాలు నొప్పి వస్తున్నాయి, చచ్చిపోయేలా ఉన్నాను అన్నప్పుడు దింపేస్తాను అన్నాడు. అంత బరువుగా ఉన్నప్పుడు భుజాన ఎక్కించుకోకు అంది తనూజ. అందుకే దింపేశానని ఇమ్మూ.. ఇలా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఏవైనా ఉంటే బయట చూసుకోండిభరణి.. తనూజ నన్నే టాస్కులోనూ సేవ్ చేయలేదు. నేను తనను రెండు టాస్కుల్లో సేవ్ చేశాను. తనకన్నా బాగా ఆడాను అని తెలిపాడు. అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేశారని సులువుగా తేల్చేసింది తనూజ. అక్కడితో ఆగకుండా.. మాటమాటకీ ఇమ్మాన్యుయేల్, దివ్య మధ్యలో వస్తే తనూజ మాట్లాడేందుకు స్పేస్ ఎక్కడుంది? ఏదైనా పాయింట్ మాట్లాడితే అది మీ పర్సనల్ అంటున్నారు. పర్సనల్స్ ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి, హౌస్‌లో కాదు అని అరిచేసింది.తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణిఏదైతే బాండింగ్ వల్ల నేను బయటకు వెళ్లొచ్చానో.. తను కూడా ఒకసారి బయటకు వెళ్లొస్తే పరిస్థితి అర్థం అవుతుంది.. తను వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని భరణి ఒక్క ముక్కలో తేల్చేశాడు. మొత్తానికి కలిసిమెలిసుండే తండ్రీకూతుళ్లు ఈరోజు భారీస్థాయిలోనే గొడవపడేట్లు కనిపిస్తోంది. చదవండి: నేనే హీరోయిన్ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు! -
ఏడ్చేసిన సుమన్.. నామినేషన్స్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో తొమ్మిదో వారం నామినేషన్స్‌కు రంగం సిద్ధమైంది. ఫైర్ బ్రాండ్ మాధురి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్‌లో 13 మంది మిగిలారు. వీరికి గతంలోని పాత బొమ్మల టాస్కే ఇచ్చారు. బజర్ మోగగానే వేరేవారి ఫోటో ఉన్న బొమ్మ తీసుకుని సేఫ్ జోన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆఖరిగా జోన్లో అడుగుపెట్టేవారు, వారి దగ్గరున్న బొమ్మపై ఎవరి ఫోటో ఉంటుందో వారు నామినేషన్ జోన్లోకి వస్తారు.ఏడ్చేసిన సుమన్తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. సంజనా (Sanjana Galrani) మాట్లాడుతూ.. నేను సోలో ప్లేయర్‌గానే ఉన్నాను. కానీ, రీతూ గేమ్‌లో డిమాన్ పవన్ సాయం చేస్తున్నాడు. అది అందరికీ కనిపిస్తుందని చెప్పింది. అది విన్న రీతూ.. మీకెలా బాండ్స్ ఉన్నాయో, నాకూ అలాగే హౌస్‌లో ఒక బాండ్ ఉంది. అది మీకు తప్పనిపిస్తే నేనేం చేయలేను అని ఇచ్చిపడేసింది. సుమన్ మాట్లాడుతూ.. నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి, తనూజను సేవ్ చేసి నేను నామినేట్ అవాలనుకుంటున్నా అని ఏడ్చేశాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు. సుమన్ (Suman Shetty) కళ్లలో నీళ్లు తిరిగేసరికి పవన్, కల్యాణ్ అతడిని ఓదార్చారు.నామినేషన్స్‌లో ఎవరు?మొత్తానికి ఈ వారం భరణి, సంజనా, తనూజ, రాము, సాయి, కల్యాణ్ నామినేట్ అయ్యారని తెలుస్తోంది. తనూజ.. ఇమ్మాన్యుయేల్‌ను నామినేట్ చేశారంటున్నారు. అది నిజమేనా? ఏమైనా మార్పులుచేర్పులున్నాయా చూడాలి! బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇమ్మూ నామినేషన్స్‌లో లేడు. ఇది అతడికే మైనస్ అవుతుంది. నామినేషన్స్‌లోకి వస్తేనే అతడి అభిమానులకు ఓట్లేయడం అలవాటవుతుంది. తనకు ఏ స్థాయిలో ఓట్లు పడతాయి? దాన్ని పెంచేందుకు ఇంకా ఎలా కృషి చేయాలన్నది ఐడియా వస్తుంది? లేదంటే టాప్ 2కి బదులుగా టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి -
బిగ్‌బాస్‌లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) నుంచి ఎలిమినేట్ అయితే ఎవరైనా బాధపడతారు. కానీ మాధురి మాత్రం సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నవంబర్ 4న ఆమె పార్ట్నర్ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజట! ఆయన పుట్టినరోజునాడు పక్కనలేకపోతే ఏం బాగుంటుంది? అందుకే.. అలా పిక్నిక్కు వెళ్లినట్లు బిగ్‌బాస్‌కు వెళ్లి ఇలా బర్త్‌డే సమయానికి బయటకు వచ్చేసింది. బిగ్‌బాస్ బజ్‌లో కూడా అదే విషయాన్ని నొక్కి చెప్తోంది.ఎంట్రీ, ఎలిమినేషన్ అంతా మాధురి చేతిలోనే..తాజాగా రిలీజైన బిగ్‌బాస్ బజ్ ప్రోమోలో యాంకర్ శివాజీ మాట్లాడుతూ.. 100% తెలుగు ఇళ్లలోకి వెళ్లాలనుకున్నారు. నిజంగా వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? అని ముఖం మీదే అడిగేశాడు. అందుకు మాధురి (Divvala Madhuri).. నేను రావాలనుకున్నాను, కాబట్టే బయటకు వచ్చాను. నాకు యాక్టింగ్ రాదు, మాస్కులు లేనే లేవు, నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నాను. బిగ్‌బాస్‌కు వెళ్లాలనుకున్నాను కాబట్టి వెళ్లాను, రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను అని చాలా క్లారిటీగా బదులిచ్చింది.భయం నా బ్లడ్డులోనే లేదుఒకానొక దశలో శ్రీజకు భయపడినట్లు అనిపించింది అని శివాజీ అడగ్గా.. భయమనేది నా బ్లడ్డులోనే లేదని మాధురి డైలాగ్ పేల్చింది. మీరు తోపు అని ఎవరూ అనలేదంటూ శివాజీ కూడా ఆమెకు కౌంటరిచ్చాడు. మాధురి బిగ్‌బాస్ నుంచి వచ్చేముందు కూడా నాగార్జునతో నవంబర్ 4న మా ఆయన బర్త్‌డే.. ఆ పుట్టినరోజుకల్లా రావాలనుకున్నాను, వచ్చేశాను అన్నట్లుగా మాట్లాడింది. ఇప్పుడీ బజ్ ప్రోమో చూస్తుంటే మాధురి పిక్నిక్కు వెళ్లినట్లే కనిపిస్తోంది. మూడు వారాలు హౌస్‌లో ఉన్న మాధురితనపై ఉన్న నెగెటివిటీ పోగొట్టుకోవడానికి బిగ్‌బాస్‌ను ఎంచుకుంది. అక్టోబర్ 12 వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో లేదు. రెండో వారం తననెవరూ నామినేట్ చేయలేదు. కానీ ఆ వారంలో ఆమె రీతూను బండకేసి కొడ్తా.. జుట్టుపట్టుకుని ఈడ్చి కొడ్తా.. అంటూ హద్దులు మీరి మాట్లాడింది. హౌస్మేట్స్ కూడా ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్ అంటూ ఆమె మెడలో ఎక్కువ బోర్డులు వేశారు. దీంతో తనకు డైరెక్ట్ నామినేషన్ అనే పనిష్మెంట్ ఇచ్చింది తనూజ. పిక్నిక్ పూర్తయిందిమాధురి కూడా ఇదే కోరుకుంది. అందుకే తనూజ దగ్గర గోల్డెన్ బజర్ ఉన్నప్పటికీ దాన్ని తనకోసం వాడొద్దని మరీమరీ చెప్పింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం భర్త/ పార్ట్నర్ బర్త్‌డే సమయానికి బయటకు వచ్చేసింది. ఆమె అరుపులు, కేకలు, హద్దులు మీరి మాట్లాడటం చాలామందికి చిరాకు పుట్టించింది. అదే సమయంలో ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నదున్నట్లు చెప్పడంతో తనపై పాజిటివిటీ కూడా వచ్చింది. మొత్తానికి మాధురి ఎలిమినేషన్‌కు పెద్దగా కారణాలంటూ ఏమీ లేదు. తనే వచ్చింది.. తనే దర్జాగా వెళ్లిపోయింది.చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి -
తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి
సరిపోదా శనివారం అన్నట్లు నాగార్జున.. తనూజకు ఒక్కదానికే స్పెషల్‌గా సండేరోజు క్లాస్ పీకారు. దాన్ని క్లాస్ పీకడం అని కూడా అనరు. ఎక్కువగా కోప్పడకు, చెప్పే విధానం మార్చుకో, సహనంగా ఉండటానికి ప్రయత్నించు అని తనూజను బుజ్జగించినట్లే ఉంది. ఎలిమినేషన్‌ను మలుపు తిప్పే అస్త్రం తనూజ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని వాడకుండా భద్రంగా కాపాడుకుంది. మరి ఆదివారం (నవంబర్ 2వ) ఎపిసోడ్లో ఏం జరిగాయో చూసేద్దాం..పర్ఫామెన్స్ ఇరగదీశారుది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక, దీక్షిత్ శెట్టి బిగ్‌బాస్ షోకి వచ్చారు. వీళ్ల ఎదుటే హౌస్‌మేట్స్‌తో కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయించారు. వాళ్ల యాక్టింగ్ చూసి రష్మిక కొన్నిసార్లు నోరెళ్లబెట్టేసింది. యాక్టింగ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇమ్మాన్యుయేల్ ఎగరేసుకుపోయాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న అందరినీ నాగార్జున సేవ్ చేసుకుంటూ రాగా చివరకు గౌరవ్, మాధురి మిగిలారు. గౌరవ్, మాధురి.. ఇద్దర్నీ గేటు బయటకు తీసుకొచ్చాక హౌస్‌మేట్స్‌తో ఓ విషయం చెప్పాడు నాగ్. కాళ్లు పట్టుకున్న రాముఓట్ల పరంగా మాధురి చిట్టచివరి స్థానంలో ఉందన్నాడు. అయితే తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని వెల్లడించాడు. అప్పటికే గౌరవ్‌ను నామినేట్ చేసి కుంగిపోతున్న రాము.. అతడ్ని కాపాడమని తనూజ కాళ్లావేళ్లా పడ్డాడు. చివరకు తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించకపోయేసరికి మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి గౌరవ్‌ను ఇంట్లోకి పంపారు. ఈ సంతోషం పట్టలేక రాము.. తనూజ కాళ్లు మొక్కడం గమనార్హం. మాధురి సంతోషంగానే బయటకు వచ్చేసింది.నా బంగారం తనూజ: మాధురిఎలిమినేట్ అవుతారనుకున్నారా? అని నాగ్ అడగ్గా.. బయటకు రావాలనే కోరుకున్నా.. ఎందుకంటే నవంబర్ 4న మా ఆయన బర్త్‌డే సార్.. అంటూ మాధురి అసలు విషయం చెప్పింది. తన ఏవీ చూసుకుని లైఫ్‌లాంగ్ మెమొరీ అని ఎమోషనలైంది. ముగ్గురికి గులాబీలు, ముగ్గురికి ముళ్లు ఇవ్వమని మాధురికి టాస్క్ ఇచ్చారు. మొదటి గులాబీ.. నా బంగారం తనూజకి ఇస్తా.. తను చాలా స్వీట్, నేను బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్‌తో ఆడుతుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుందన్నారు. అంతా అబద్ధం, తను తనలాగే ఉంది అని కంటతడి పెట్టుకుంది. డిమాన్ పవన్, పవన్ కల్యాణ్‌కు సైతం రోజాలు ఇచ్చింది.100%ఫేక్ముళ్ల గురించి అడగ్గానే మొదటిది భరణికి ఇస్తానంది. 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి గారే.. హౌస్‌లో ఉండటానికి తనకు అర్హత లేదు అని కుండబద్ధలు కొట్టి చెప్పింది. దివ్య కూడా అంతే.. తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. వాళ్ల గొంతు కూడా తనే అయిపోతుంది. అవి తగ్గించుకుని ఆడితే బెటర్ అని పేర్కొంది. వెళ్లిపోయేముందు.. తనూజ, నేనొక్కటే కోరుకుంటున్నా.. నువ్వు స్ట్రాంగ్‌గా, నవ్వుతూ ఉండాలి. విన్నర్‌గా చూడాలి.. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే అని చెప్పి వీడ్కోలు తీసుకుంది.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్ -
వాట్సాప్‌లో మార్ఫ్డ్ వీడియోలు.. ఏడాదిపాటు డిప్రెషన్లో!
'పోవే పోరా' షోతో పాపులర్ అయింది విష్ణుప్రియ (Vishnu Priya Bhimeneni). బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. అప్పుడప్పుడూ కొన్ని సాంగ్స్‌లో తళుక్కుమని మెరుస్తున్న విష్ణు యాంకర్‌గా మాత్రం తెరపై పెద్దగా కనిపించడమే లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.వేరే యాంకర్స్ ఈర్ష్యవిష్ణుప్రియ మాట్లాడుతూ.. నేను యాంకర్‌గా చేసేటప్పుడు వేరే ఛానల్ యాంకర్స్ నాపై కుళ్లుకున్నారు. మేము ఇన్నేళ్లుగా కష్టపడ్డా రాని పేరు ఈమెకు అలా అడుగుపెట్టిన వెంటనే ఎలా వచ్చిందని ఈర్ష్యపడ్డారు. నాతో సరిగా ఉండేవారు కాదు. నాకు యాంకరింగ్ పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఆల్బమ్ సాంగ్స్, సినిమా పాటలు చేస్తున్నాను. బిగ్‌బాస్ షోకి రమ్మని ఆహ్వానం వస్తే అస్సలు వెళ్లను. ఒక్కసారి వెళ్లినందుకే నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలనిపించింది. బిగ్‌బాస్‌పై నా అభిప్రాయంనన్ను నేను ఎంతో తిట్టుకున్నా.. అక్కడ తిండి, నిద్ర ఏవీ ఉండవు. నాకైతే అదొక నరకమే! ఇల్లు కొనడం కోసమే బిగ్‌బాస్‌కు వెళ్లాను. కానీ ఇంకా టైల్స్ పోయిన పాతింట్లోనే ఉన్నాను. అప్పుడప్పుడు అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆ ఇల్లును బ్యాంకువాళ్లు అమ్మేసేవాళ్లే! మా అమ్మ లోన్ కట్టలేకపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన మూడేళ్లలో దాదాపు 12 లక్షల రూపాయల లోన్ మొత్తం తీర్చేశాను. మరో ఐదారు లక్షలు పెట్టి ఇంటిని పునరుద్ధరించాను. సంపాదించిదంతా ఆ ఇంటికే పోయింది.మూడు బ్రేకప్స్ఇప్పటివరకు మూడు బ్రేకప్స్ అయ్యాయి. మొదటగా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కూడా అయిపోతుందనుకున్నాను. కానీ, అది జరగలేదు. అయినా ఏది జరిగినా మన మంచికే అని తర్వాత అర్థమైంది. అలా అని ప్రేమ జోలికి వెళ్లననుకునేరు.. కచ్చితంగా ప్రేమ పెళ్లే చేసుకుంటా.. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి వేదాల గురించి తెలిసుండాలి. సింగింగ్, డ్యాన్స్ వచ్చుండాలి. వంట రావాలి. అలాంటి అబ్బాయి నాకు తారసపడితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే సన్యాసం పుచ్చుకుంటాను. 50 ఏళ్లు వచ్చేసరికి కాశీకి వెళ్లిపోదామా? అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి.అమ్మకు డయాబెటిస్నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోయారు. అమ్మకు ఇష్టం లేదని నాన్నతో మాట్లాడేదాన్ని కాదు. అమ్మ డయాబెటిస్ రోగి. సరిగా మందులు వేసుకునేది కాదు. ఒకరోజు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. మూడు రోజుల కంటే ఎక్కువ బతకదన్నారు. దేవుడి దయ వల్ల ఏడాదివరకు బతికింది. అమ్మ ఆస్పత్రిపాలైనప్పుడు లక్షల్లో బిల్లయింది. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవడంతో మొహమాటం వదిలేసి తెలిసినవాళ్లకు ఫోన్ చేసి డబ్బు సాయం అడిగాను. హాస్పిటల్ బిల్లు కట్టడం కోసమే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. 42 ఏళ్లకే అమ్మ చనిపోయింది. రెండేళ్లపాటు డిప్రెషన్‌కు లోనయ్యాను. అమ్మను తీసుకెళ్లి నన్నెందుకు ఉంచావని దేవుడిని తిట్టుకున్నాను.డిప్రెషన్లో..నేను బాధపడ్డ మరో సందర్భం.. నాపై మార్ఫ్డ్ వీడియోలు చేశారు. దాన్ని వాట్సాప్‌లో షేర్ చేశారు. అది చూడటానికి నిజందానిలాగే ఉంది. తట్టుకోలేకపోయాను. ఆరు నెలల నుంచి ఏడాదిపాటు డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో ఫేస్బుక్ హ్యాకై అశ్లీల పోస్టులు పెట్టారు. నేనెక్కడికి వెళ్లినా.. నీదో వీడియో చూశామని అబ్బాయిలు కామెంట్ చేసేవారు. అమ్మ పెంపకం వల్ల ధైర్యంగా నిలబడ్డా.. లేదంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్‌బాస్ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా.. -
బిగ్‌బాస్ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా చచ్చిపోవాల్సిందే!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి నేషనల్ క్రష్, కాబోయే తెలుగింటి కోడలు రష్మిక మందన్నా (Rashmika Mandanna) వచ్చేస్తోంది. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దీక్షిత్, రష్మిక బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చారు.సీన్స్ రీక్రియేషన్వీరుండగానే హౌస్‌మేట్స్‌తో ఓ ఫన్గేమ్ ఆడించాడు నాగ్.. కొన్ని పాపులర్ సీన్స్ ప్లే చేసి.. వాటిని రీక్రియేట్ చేయాలన్నాడు. ఇంకేముంది, హౌస్మేట్స్ తమ కళనంతా బయటపెట్టారు. పోకిరి, అదుర్స్ వంటి పలు హిట్ సినిమాల్లోని సీన్లను రీక్రియేట్ చేశారు. వారి డైలాగులు, యాక్టింగ్ చూస్తుంటే జనాలు కడుపుబ్బా నవ్వుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. చివర్లో భరణి (Bharani Shankar) బ్రహ్మానందంలా మారిపోయాడు. వెంటనే మాధురి.. ఆ వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలంట ప్రేమ అని భరణిపై సెటైర్లు వేసింది.బ్రహ్మానందంలా మారిపోయిన భరణిఅందరికీ ఏమైనా సిక్స్ ప్యాక్‌లు ఉన్నాయా? అని భరణి అంటుంటే.. ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి అని కోపగించుకుంది. దాంతో భరణి.. నువ్వలా హార్ష్‌గా మాట్లాడకు చందు, హర్టవుతాను అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. అలాగే బామ్మ క్యారెక్టర్లో ఉన్న సంజనాతో.. మీరలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని డైలాగ్ వేశాడు. మొత్తానికి చాలాకాలం తర్వాత ఈ సండే ఫన్‌డేగా మారుతుందని అర్థమవుతోంది. అయితే, సోషల్ మీడియా లీక్స్ ప్రకారం మాధురి ఎలిమినేట్ అయిందట. అంటే రేపటినుంచి మంచి మాస్ మసాలా గొడవలు మిస్ అవుతామన్నమాట! చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ -
షో ఇమేజ్ ఏం కాను? నాగ్ ఉగ్రరూపం.. మోకాళ్లపై కూర్చుని పవన్ వేడుకోలు
వీకెండ్ వచ్చిందంటే క్లాసులు పీకడమే నాగార్జున చేసే ఏకైక పని. సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణికి పెద్ద లెక్చర్లే ఇచ్చాడు. కానీ పవన్‌ను మాత్రం ఏకంగా ఏడిపించేశాడు. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో శనివారం (నవంబర్ 1వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..బెస్ట్ కెప్టెన్రేషన్ మేనేజర్ తనూజ (Thanuja Puttaswamy)కే ఆర్డర్ వేస్తావా? అని కల్యాణ్‌ను, నామినేషన్ చేసిన పాయింటే తప్పని ఇమ్మాన్యుయేల్‌ను ఏకిపారేశాడు నాగ్. సుమన్‌ను అసమర్థ కెప్టెన్ అన్న సంజనాని సైతం తప్పుపట్టాడు. ప్రేక్షకులతో సుమన్ బెస్ట్ కెప్టెన్ అనిపించేలా చేశాడు. కెప్టెన్సీ గేమ్‌లో భరణి గోడమీద పిల్లిలా సేఫ్ గేమ్ ఆడటాన్ని ఖండించాడు. ఇలాగే ఉంటే ఎక్కువరోజులు ఉండలేవని వార్నింగ్ ఇచ్చాడు. ఇక వారమంతా ఎప్పుడుపడితే అప్పుడు గొడవలు పెట్టుకుంటూ, దాన్ని సాగదీస్తూ మహా చిరాకు తెప్పించారు పవన్-రీతూ. డోర్స్ ఓపెన్వీళ్లకు నాగార్జున గట్టి క్లాస్ పీకితేకానీ బుద్ధి రాదని ప్రేక్షకులు ఎదురుచూశారు. తీరా నాగార్జున (Nagarjuna Akkineni) ఊహించినదానికన్నా ఎక్కువ సీరియస్ అవడంతో పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆడపిల్లను తోసేస్తావా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? నీ బ్యాగులు సర్దుకో.. డోర్స్ ఓపెన్ అంటూ తక్షణమే వెళ్లిపోవాలన్నాడు. ఆ మాటకు పవన్ నిలువెల్లా వణికిపోయాడు. ఇంకోసారి ఆ తప్పు రిపీట్ చేయను సార్ అని వేడుకున్నాడు. చేతులు జోడించి వేడుకున్న పవన్అటు రీతూ (Rithu Chowdary) కూడా.. ఇద్దరం గొడవపడుతున్నాం.. నేను వెళ్లిపోతున్నాననే ఆవేశంలో అలా తోశాడు. ఈసారికి వదిలేయండి అని వేడుకుంది. అయినా నాగ్ కనికరించలేదు. బిగ్‌బాస్ ఇంటి డోర్ తెర్చుకోవడంతో పవన్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది రీతూ. నువ్వు కోపంలో అలా చేశావ్, నాకు తెలుసు.. స్ట్రాంగ్‌గా ఉండు.. సార్‌కు అర్థమయ్యేలా వివరించు.. ఆయనకు సారీ చెప్పు అని బోధించింది. దీంతో అతడు సారీ సర్.. ఇంకోసారి రిపీట్ చేయను, ఈ ఒక్కసారికి క్షమించండి అని దీనంగా చేతులు జోడించి అడిగాడు. క్షమించేది లేదన్న నాగ్ఈసారి నాగార్జున హౌస్మేట్స్ అభిప్రాయాలు అడగ్గా.. ఎవరూ కూడా అతడికి ఎలిమినేట్ అయ్యేంత పెద్ద శిక్ష విధించాలని కోరుకోలేదు. అప్పుడు నాగ్.. ఇది హౌస్‌కు మాత్రమే సంబంధించిన విషయం కాదు, షో ఇమేజ్‌కు సంబంధించింది. మీ తరువాత వచ్చేవాళ్లు ఈ సంఘటనను చూసి ఇలాగే ప్రవర్తిస్తే షో పడిపోతుంది. కాబట్టి నేను క్షమించలేను అన్నాడు. ఇంతలో రీతూ మాట్లాడుతూ.. వాడు నన్నేదో చేయాలనే ఉద్దేశం కాదు సార్.. ఇద్దరం గొడవపడుతుంటే మాట వినకుండా వెళ్లిపోతున్నాననే అలా నెట్టాడు. అంత చిన్నదానికి హౌస్‌లో నుంచి పంపించొద్దు అని బతిమాలింది. మోకాళ్లపై కూర్చుని సారీ అందుకు నాగ్ మాట్లాడుతూ.. మాధురి మీది అన్‌హెల్దీ బాండ్ అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. అలా అనడానికి ఆమెకేం హక్కు ఉందనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీది కచ్చితంగా అన్‌హెల్దీ బాండింగే.. అని స్టేట్మెంట్ ఇచ్చాడు. రీతూకే కాదు, ఆడియన్స్‌కు కూడా క్షమాపణ చెప్పాలని పవన్‌ను ఆదేశించాడు. దీంతో పవన్.. రీతూ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. మోకాళ్లపై కూర్చుని.. నేనలా చేసి ఉండకూడదంటూ తలవంచుకుని సారీ చెప్పాడు. అప్పటికి శాంతించిన నాగార్జున.. తెరుచున్న బిగ్‌బాస్ ఇంటి డోర్లను మూయించేశాడు.చదవండి: పవన్‌కి రెడ్ కార్డ్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే? -
మాధురి నోటికాడి కూడు లాక్కుంటారా? దివ్య ఓవరాక్షన్ ఏంటో?
బిగ్‌బాస్ హౌస్ (Bigg Boss Telugu 9)లో ఏది జరిగినా ఒకరోజు ఆలస్యంగా చూపిస్తారు. అలా శుక్రవారం రోజు జరిగినదాన్ని నేడు ఎపిసోడ్లో చూపించనున్నారు. ఇక ఫ్రైడే అంటే పెద్దగా టాస్కులేవీ ఉండవు. కేవలం ఫన్ గేమ్స్ మాత్రమే ఉంటాయి. ఇటువంటి ఫన్ గేమ్స్ దగ్గరా గొడవ పడొచ్చని నిరూపించారు తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ కంటెస్టెంట్స్.తిండి దగ్గర లొల్లితాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిర్యానీ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ పూర్తయ్యాక అందరూ ప్లేటులో బిర్యానీ వేసుకుని ఆవురావురుమని ఆరగించారు. ఓపక్క అందరూ తింటుంటే మాధురి అప్పుడే వచ్చి ప్లేటులో బిర్యానీ వేసుకోబోయింది. అది చూసిన భరణి, దివ్య వెంటనే ఆపేశారు. వేరే టీమ్‌కు ఇంకా పీసులు వెయ్యలేదు, వారికి వేశాక మీకు పెడతాను అని భరణి అడ్డుకున్నాడు. దీంతో మాధురి హర్టయిపోయింది. నీళ్లు తాగి కడుపు నింపుకుంది. ఆయనకు నోరు లేదా?చిన్నచిన్నవాటికెందుకిలా.. అని భరణి (Bharani Shankar) వివరించబోయాడు. ఇంతలో దివ్య.. మధ్యలో కలగజేసుకుని మాట్లాడటంతో మాధురి అక్కడినుంచి లేచి వెళ్లిపోయింది. ప్లేటు పట్టుకున్నప్పుడు అలా అనేస్తే ఎలా తింటాం? అతడు అడుగుతున్నదానికి సమాధానం చెప్తున్నా.. మధ్యలో ఈమె (దివ్య) వివరణ ఇవ్వడం దేనికి? ఆయనకు నోరు లేదా? మాట్లాడలేడా? అని మాధురి.. కల్యాణ్ ఎదుట తన కడుపులో ఉన్నదంతా కక్కేసింది.మీ గేమ్ మీరు ఆడండిఇక ఈ గొడవయ్యాక తనూజ.. భరణితో ఇది మీ గేమ్ మీరు ఆడండి.. మధ్యలో దివ్య ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంది. నిజమే.. దివ్య ఇలా భరణిపై పెత్తనం చెలాయిస్తే అది అతడికే నెగెటివ్ అయి మళ్లీ ఎలిమినేట్ అవడం ఖాయం. మరి భరణి ఏం చేస్తాడో చూడాలి! చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన -
శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)లో రీఎంట్రీ ఇచ్చిన భరణి, శ్రీజలలో ఆడియన్స్ భరణికే ఓట్లు గుద్దిపడేశారు. దీంతో శ్రీజ మరోసారి హౌస్ నుంచి నిష్క్రమించింది. పర్మినెంట్ హౌస్‌మేట్ అయిన భరణికి బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. అదేంటో శుక్రవారం (అక్టోబర్ 31వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..భరణి చేతిలో పవర్ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగుర్ని సెలక్ట్ చేయమని భరణి (Bharani Shankar)కి పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అతడు ఈ వారం తనకు సపోర్ట్ చేసినవారికే ఛాన్స్ ఇస్తానన్నాడు. మాధురి మాత్రం అమ్మాయిలందరికీ ఛాన్స్ ఇవ్వమంది. భరణి మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ అవలేని వారికే ఛాన్స్ ఇస్తానంటూ.. అతడి పేరుతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్‌ను సెలక్ట్ చేశాడు. రీతూను సెలక్ట్ చేయకపోవడంతో ఆమె కాస్త హర్టయింది.తనూజ వర్సెస్ కల్యాణ్రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. బెండకాయలు పాడైపోయేలా ఉన్నాయని, వాటితో కూర వండాలంది. చపాతీలోకి బెండకాయ బాగోదు, ఆలూ కుర్మా కావాలని కల్యాణ్ అడిగాడు. అడిగినవన్నీ చేసిపెట్టేందుకు సర్వెంట్లం కాదు, అన్నిట్లో వేలు పెట్టకు.. అంటూ కల్యాణ్‌పై రెచ్చిపోయింది తనూజ. అతడు కూడా వెనక్కు తగ్గలేదు. అన్నీ నీకు నచ్చినట్లే చేయాలంటే కుదరదంటూ కౌంటరిచ్చాడు. ఇలా కాసేపు వీరిద్దరూ గొడవపడ్డారు. తర్వాత కెప్టెన్సీ కంటెండర్లకు డీజే టాస్క్ పెట్టాడు. డీజే డ్యాన్స్ఈ టాస్కులో భాగంగా పాటలు ప్లే అవుతూ ఉంటే ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. వారికి సపోర్ట్ చేసేవారు మరో ప్లాట్‌ఫామ్‌పై డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది సపోర్టర్స్ ఉంటే వారే గెలిచినట్లు. రాము సంచాలక్‌గా వ్యవహరించాడు. ఎలాగో అందరూ ఊహించినట్లే నిఖిల్, సాయికి ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయలేదు. భరణిని కూడా లైట్ తీసుకున్నారు. దివ్య, తనూజకు మాత్రం పోటాపోటీగా మద్దతు పలికారు. బొమ్మలా నిల్చున్న భరణిదీంతో వీళ్లిద్దరూ రెండో రౌండ్లో పాల్గొన్నారు. అయితే ఈ రౌండ్ ప్రారంభమవడానికి ముందే దివ్య తెలివిగా.. భరణికి సపోర్ట్ చేసేవారి దగ్గరికెళ్లి సాయం చేయమని అడిగింది. దీంతో రాము, సుమన్, సంజన.. ఇలా చాలామంది ఆమెకు మాటిచ్చి ఆ మాటపై నిలబడ్డారు. రెండో రౌండ్లో తనూజ కోసం మాధురి, రీతూ, డిమాన్, కల్యాణ్ నిలబడ్డారు. దివ్య కోసం ఇమ్మూ, గౌరవ్, సుమన్, సాయి, సంజన నిల్చున్నారు. ఒక్క ఓటు తేడాతో దివ్య గెలిచి కెప్టెన్ అయింది. ఈ గేమ్‌లో భరణి.. ఎటూ తేల్చుకోలేక మధ్యలో నిలబడి సినిమా చూడటం విశేషం!కెప్టెన్‌గా దివ్యతనూజ.. గతవారం కూడా టాప్ 2దాకా వచ్చి కెప్టెన్సీ చేజార్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో తనకు దుఃఖం ఆగలేదు. రీతూ ఓదారుస్తుంటే మాధురి మాత్రం తన దుమ్ము దులిపేసింది. అందరినీ నమ్ము.. అది ఏడిస్తేనే బాగుంటుంది. ఏడవినవ్వవే.. ఎంత దారుణం.. నాన్న నాన్న అని వెళ్లిపట్టుకో అంటూ ఫైర్ అయింది. తనూజ మాత్రం ఏడుస్తూనే.. ఇప్పుడైనా నమ్ముతావా? నా గేమ్ నేను ఆడుతున్నా.. మాటలకు వస్తారు, కానీ సపోర్ట్ చేయరు అంటూ బాధపడింది. అందరినీ బతిమాలుకోవడం అలవాటైన రీతూ.. అదే పని చేసి రేషన్ మేనేజర్ పోస్ట్ దక్కించుకుంది. ఈ మధ్య అరుపులు, ఆజమాయిషీతో ఓవర్ చేస్తున్న దివ్య.. కెప్టెన్‌గా ఎలా ఉంటుందో చూడాలి!చదవండి: ప్రపంచకప్ ఫైనల్.. టీమిండియా కోసం నటి ఆండ్రియా గిఫ్ట్ -
నిర్మాతగా యాక్టర్.. నెక్స్ట్ లెవల్ స్టార్ట్ అంటూ పోస్ట్
తమిళ నటుడు ఆరవ్ (Aarav) నిర్మాతగా మారారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కణ్మణి చిత్రం ద్వారా ఆరవ్ నటుడిగా పరిచయం అయ్యారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఆ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు మిత్రుడిగా నటించారు. ఆ తరువాత సైతాన్, విడాముయర్చి (పట్టుదల) వంటి కొన్ని చిత్రాల్లో నటించిన ఈయన మార్కెట్ రాజా, ఎంబీబీఎస్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని మరింత పాపులర్ అయిన ఆరవ్ ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఆరవ్ స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీని గురించి తెలియజేస్తూ.. పలు ఏళ్లుగా ప్రేక్షకుల ప్రేమ, అంగీకారం లభించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. అందమైన సినీ పరిశ్రమలో తననూ ఒక భాగంగా మార్చిందన్నారు. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడానికి ఆరవ్ స్టూడియోస్ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. మంచి కథలను చెప్పాలనే తపన, ఆసక్తి నుంచి ఈ సంస్థ పుట్టిందన్నారు. ఈ విజువల్స్, క్రియేటివ్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని సహజమైన కథలతో చిత్రాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. భగవంతుడి ఆశీస్సులు, సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి కథా చిత్రాలను నిర్మిస్తాననే నమ్మకంతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆరవ్ తెలిపారు. View this post on Instagram A post shared by Arav (@actorarav) చదవండి: మహేశ్‌తో సందీప్ సినిమా? -
మాధురితో గుంజీలు తీయించిన మహానుభావుడు.. కల్యాణ్‌తో తనూజ లొల్లి
హౌస్‌లో ఒక్కొక్కర్ని చెడుగుడు ఆడేసుకుంటోంది దివ్వెల మాధురి (Divvala Madhuri). తనకు ఎదురు తిరిగినవారిని మాటల ప్రవాహంతోనే దడదడలాడిస్తోంది. ఆమె నోట్లో నోరు పెట్టడమంటే సింహం బోనులో వెళ్లి కూర్చోవడమే అవుఉతంది! అలాంటి మాధురిని పిల్లిని చేశాడో కంటెస్టెంట్. అతడెవరో కాదు, కామెడీ కింగ్, టాస్కుల వీరుడు ఇమ్మాన్యుయేల్..మాధురితో గుంజీలు తీయించిన ఇమ్మూమాధురి సైలెంట్ అయిపోయిందంటే ఏదో తప్పు చేసే ఉంటుంది. లేకపోతే పిల్లిలా ఎందుకు మారిపోతుంది! ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆమె తప్పుల్ని, ఆమెకిచ్చిన పనిష్మెంట్స్ను చూచాయగా చూపించారు. అందులో ఆమె పొద్దెక్కినా కూడా నిద్రపోతోంది. దీంతో కుక్కలు మొరిగాయి. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ఆమెతో 20 గుంజీలు తీయించాడు. అయినా మాధురికి నిద్ర ఆగితే కదా.. మళ్లీ కునుకు తీస్తూనే ఉంది. దీంతో ఆమెతో పచ్చిమిర్చి తినిపించాడు.మరీ ఓవర్ చేస్తున్నారుఇక మరో ప్రోమోలో తనూజ, పవన్ గొడవపడ్డారు. రాత్రి బెండకాయ వద్దని పవన్.. నువ్వు ఎక్స్‌ట్రాలు మాట్లాడకు, నువ్వెవరు చెప్పడానికి.. నీలాగా ఎవరూ చేయట్లేదు అని ఒంటికాలిపై లేచింది. అటు దివ్య కూడా కాఫీ విషయంలో రీతూపై అరిచింది. ఈ గొడవలు చూస్తున్న జనాలు.. భరణి నాన్న వచ్చాక వీళ్లిద్దరూ మరీ ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అసలు తనూజను రేషన్ మేనేజర్‌గా తీసేయండ్రా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు -
దివ్య, ఇమ్మూ అసలైన తోపులు.. ఓవర్ చేసిన శ్రీజ.. మరోసారి బైబై!
హౌస్‌లో టెంపరరీ హౌస్‌మేట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అప్పుడే పొగరు చూపిస్తోంది. షో మొదలైన మొదటి రెండు వారాలు తన యాటిట్యూడ్, అరుపులతో పరమ చెత్తగా అనిపించిన ఆమె ఎలిమినేషన్ ముందు మాత్రం మంచి పేరుతోనే బయటకు వచ్చేసింది. కానీ, బయట వస్తున్న సింపతీ, అభిమానం చూశాక గర్వం తలకెక్కింది. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో గురువారం (అక్టోబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అన్నం మీద అలిగిన మాధురితనూజ ఏ ముహూర్తాన రేషన్ మేనేజర్ అయిందో కానీ కిచెన్‌లో ఒకటే గొడవలు.. ఈ సారి ఆ గొడవల్లో మాధురి బలైంది. అన్నం మీద అలిగి కూర్చుంది. తను తినకుండా ఉంటే భరణి (Bharani Shankar) చూసి తట్టుకోలేకపోయాడు. అతడే కాదు, సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్.. ఇలా అందరూ తినమని బతిమాలారు. అందరూ పదేపదే అడిగేసరికి కాదనలేక తినేసింది. అలక తగ్గిపోయాక తనూజతో కలిసిపోయి తనకు జడేసింది.తనూజకి పొగరు: శ్రీజమధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూర కాస్త మిగిలింది, కావాలనుకున్నవాళ్లు రండని పిలిచింది తనూజ (Thanuja Puttaswamy). దీంతో సాయి సహా మరికొందరు వెళ్లి కూర వేసుకున్నారు. కాసేపటికి శ్రీజ.. కర్రీ ఉందా? అని అడగ్గా తనూజ స్పందించలేదు. దాంతో శ్రీజ.. నేను టెంపరరీ హౌస్మేట్ని అయినా అడిగినప్పుడు చెప్పండి, అంత యాటిట్యూడ్ అవసరం లేదు.. ఆమె(తనూజ)కు పొగరని ఇందుకే అన్నానంటూ ఫైర్ అయింది. ఇక్కడ పవన్.. తనూజకోసం స్టాండ్ తీసుకోవడం గమనార్హం!కల్యాణ్‌ను చిత్తు చేసిన ఇమ్మూఇక బిగ్‌బాస్.. కట్టు-పడగొట్టు టాస్క్‌ను రద్దు చేసి మరో గేమ్ ఇచ్చాడు. భరణి పరిస్థితి బాలేనందున అతడి కోసం దివ్య ఆడింది. శ్రీజ ఈ గేమ్‌లో అట్టర్ ఫ్లాప్ అవగా దివ్య అలవోకగా ఆడి గెలిచేసింది. మరో గేమ్‌లో శ్రీజ కోసం కల్యాణ్, భరణి కోసం రాము బరిలో దిగారు. ఇందులో కల్యాణ్ చకచకా ఆడి గెలిచేశాడు. తర్వాతిచ్చిన టాస్క్‌లో మాత్రం కల్యాణ్ చిత్తుగా ఓడిపోయాడు. భరణి కోసం ఆడిన ఇమ్మూ మరోసారి తన పవర్ చూపించాడు. ఇలా భరణి రెండు టాస్కులు గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు.హర్టయిన పవన్అయితే శ్రీజ కోసం తాను ఆడతానన్నా తన పేరు లెక్కలోకి తీసుకోకపోవడంపై డిమాన్ పవన్ హర్టయ్యాడు. టాలెంట్, స్కిల్ ఉన్నా గుర్తించకపోతే బాధగా ఉంటుంది. ఈజీ గేమ్.. కల్యాణ్ ఆడలేకపోయాడు అని కామెంట్ చేశాడు. ఈ విషయంలో పవన్-శ్రీజకు గొడవ అయింది. తర్వాత కల్యాణ్.. గేమ్‌లో ఓడిపోయినందుకు శ్రీజకు సారీ చెప్పాడు. సారీ చెప్తే గూబ పగిలిపోద్ది.. అన్నీ మనమే గెలుస్తామా? అంటూ ఫ్రెండ్‌ను ఓదార్చింది. శ్రీజ రెండోసారి ఎలిమినేట్గతంలో నామినేషన్స్‌లో ఉన్నప్పుడు పవన్ సేవ్ చేయడం వల్లే శ్రీజ మరికొన్ని వారాలు హౌస్‌లో ఉంది. అతడే మొన్నటి టాస్క్‌లో దెబ్బలు తగిలించుకుని మరీ శ్రీజను గెలిపించాడు. అయినా పవన్‌ను పక్కనపెట్టడం ఏంటో ఆమెకే తెలియాలి! హౌస్‌లో ఆమె చేస్తున్న ఓవరాక్షన్ వల్ల ఓట్లు కూడా సరిగా పడలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అవగా భరణి హౌస్‌లో ఉండిపోయాడని తెలుస్తోంది.చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్ -
బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్
తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్, మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్, ఆర్జే సూర్య (RJ Surya) జీవితంలో పెళ్లి ఘడియలు వచ్చేశాయి. బుల్లితెర నటి సుధీర చెల్లెలు, ఆర్జే శౌర్యతో అతడి నిశ్చితార్థం జరిగింది. గురువారం జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్జే సూర్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ఈ ఎంగేజ్మెంట్కు బుల్లితెర నటి సుష్మ కిరణ్ సహా పలువురు హాజరయ్యారు. సుధీర.. కథలో రాజకుమారి సీరియల్లో యాక్ట్ చేసింది. ఆర్జే సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అమ్మ బీడీలు చుడితే నాన్న తాపీ పని చేసేవాడు. తండ్రి పనికి వెళ్తేనే ఆ కుటుంబానికి పూట గడిచేది. కుటుంబ పరిస్థితి వల్ల సూర్య స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పాన్ షాప్‌లో సోడా సీసాలు క్లీన్ చేసే పనికి కుదిరాడు. అలా రోజుకు 10 రూపాయలు సంపాదించాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ఓ అమ్మాయితో బ్రేకప్ అయి డిప్రెషన్లో ఉన్న సమయంలో ఆర్జేగా ఆఫర్ వచ్చింది. ఇంకేముంది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీరోల గొంతును మిమిక్రీ చేస్తూ ఆకట్టుకున్నాడు. వాక్చాతుర్యంతో అబ్బురపరిచాడు. అలా తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొని ఎనిమిది వారాలు హౌస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో కలిసి బీబీ జోడీ సీజన్ 1లో పాల్గొని విన్నర్‌గా నిలిచాడు.చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం.. -
స్కిన్ ఇన్ఫెక్షన్, డయేరియా.. బిగ్‌బాస్‌లో ఏం జరిగిందో మీకు తెలీదు!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఆరోగ్యం బాగోలేక వెళ్లిపోయిన ఏకైక కంటెస్టెంట్ ఆయేషా. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వైల్డ్ ఫైర్‌లా అగ్గి రాజేస్తుందని అంతా అనుకున్నారు. నామినేషన్స్‌లో ఆమె ఊపు, అరుపులు, కేకలు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ పనిగట్టుకుని గొడవలు పడటం జనాలకు చిరాకు తెప్పించింది. టైఫాయిడ్, డెంగ్యూ వల్ల పట్టుమని పదిరోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నా అవతారంపై మీమ్స్అదే వారం పచ్చళ్ల పాప రమ్య మోక్ష (Ramya Moksha Kancharla) కూడా ఎలిమినేట్ అయింది. అయితే తాను కూడా బిగ్‌బాస్ హౌస్‌లో అనారోగ్యంతో బాధపడ్డానని, అవేవీ షోలో చూపించలేదని చెప్తోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పలు పోస్టులు పెట్టింది. అందులో రమ్య ఏమందంటే.. నా లుక్‌పై కామెంట్స్ చేస్తూ మీమ్స్ వేశారు. వాటిలో కొన్ని నేనూ చూశాను. నాకు థైరాయిడ్ ఉంది. బిగ్‌బాస్ కోసం డైట్ స్కిప్ చేశాను. ఇంతలో టాన్సిల్స్ అయ్యాయి. దానివల్ల గొంతు, కింది దవడ ఉబ్బిపోయింది.బిగ్‌బాస్ హౌస్‌లో అనారోగ్యంతో బాధపడ్డా!సడన్‌గా హైదరాబాద్ వచ్చి ఇక్కడి వాటర్ తాగేసరికి మరింత ఇబ్బందిపడ్డా.. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చేతులు, మెడ, మొత్తం శరీరమంతా రాషెస్ వచ్చాయి. కేవలం నీళ్ల వల్లే ఈ ప్రాబ్లమ్ ఎదురైంది. ఇది చాలదన్నట్లు జంక్ ఫుడ్ తిని, సోడా తాగడంతో హౌస్‌లో విపరీతమైన జ్వరం వచ్చింది. డయేరియా (నీళ్ల విరేచనాలు)తో బాధపడ్డా.. ఇలా నా ఆరోగ్య సమస్యలేవీ టీవీలో చూపించనేలేదు. అసలు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో త్వరలోనే ఓ వీడియో చేసి వివరంగా చెప్తాను.మేకప్ కూడా వేసుకోనుఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నా. నేను ఎలిమినేట్ అయినరోజు నా ముఖం కాస్త సన్నగా కనిపించింది. అదే నిజమైన నేను. టీవీలో చబ్బీగా కనిపించాను. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, నేను బక్కగానే ఉంటాను. స్నాప్‌చాట్ వంటి యాప్స్ కూడా ఏవీ నేను వాడను. అసలవి ఎలా వాడాలో కూడా తెలీదు. మేకప్ వేసుకుంటే నా కళ్లు ఎర్రబడి, నీళ్లు కారతాయి. జలుబు, తలనొప్పి వస్తుంది. అందుకే మేకప్ కూడా వేసుకోను. ఇకపోతే నెగెటివిటీ గురించి నేనసలు లెక్కచేయను. వాటిని ఎలా గాలికొదిలేయాలో నాకు బాగా తెలుసు అని రమ్య చెప్పుకొచ్చింది.చదవండి: ఆ హీరో అలాంటివాడే.. ఆడిషన్ అని పిలిచి గదిలో..: హీరోయిన్ -
శ్రీజకు మళ్లీ అన్యాయం? 'మేమేం పాపం చేశాం? ఎందుకింత వివక్ష': ప్రియ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ వీళ్లే.. అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ ఆల్‌రౌండర్.. కానీ, అసలు నామినేషన్స్‌లోకే రాకపోవడం తనకే పెద్ద మైనస్ అవుతోంది. రీఎంట్రీఇంతలో ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు రీఎంట్రీ అంటూ ఓ హైప్ తీసుకొచ్చాడు బిగ్‌బాస్. షో మొదలైన తర్వాత ఎన్ని ఎంట్రీలు వచ్చాయి! అగ్నిపరీక్ష నుంచి మూడోవారం దివ్యను హౌస్‌లోకి పంపారు. తర్వాత సంజనాను మిడ్వీక్లో ఎలిమినేట్ చేసి వీకెండ్లో మళ్లీ లోనికి పంపించారు. ఆ తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్స్‌ను తీసుకొచ్చారు. వారు లోనికి వస్తూనే శ్రీజను ఎలిమినేట్ చేశారు. ఆ మరుసటి వారమే భరణి ఎలిమినేషన్ కూడా జరిగింది.భరణికే ఎందుకు ప్రాధాన్యత?అయితే భరణికి నిజంగానే తక్కువ ఓట్లు పడ్డాయా? అని ప్రేక్షకుల్లో కొంత అనుమానం ఉంది. అటు శ్రీజ (Srija Dammu) ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. తను రీఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ బిగ్‌బాస్ దాకా వెళ్లింది. కానీ, అడగ్గానే పంపితే బిగ్‌బాస్ ఎందుకవుతాడు. ఇంకేదో కొత్తగా.. కాదు, చెత్తగా ఆలోచించాడు. శ్రీజతో పాటు భరణిని హౌస్‌కి పంపించాడు. వీళ్లకు హౌస్‌లో గేమ్స్.. బయటేమో ఓటింగ్ పెట్టాడు. ఇదేం వివక్ష?శ్రీజను ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్‌కార్డులు అన్యాయంగా బయటకు తోసేశారు కాబట్టి తన రీఎంట్రీని పరిగణనలోకి తీసుకోవడం సమంజసం.. మరి భరణిని ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నారన్నదే ప్రశ్న! ఎలిమినేట్ అయిన మిగతా కంటెస్టెంట్లకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వొచ్చుగా! ఇదే ప్రశ్న ప్రియ కూడా లేవనెత్తింది. ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన వ్యక్తికి రెండో ఛాన్స్.. మరి మేమేం పాపం చేశాం? మాకు ఆ ఛాన్స్ పొందే అర్హత లేదా? అందరినీ సమానంగా చూడాలి. అంతేకానీ ఇదేం వివక్ష? అని ఆవేదన వ్యక్తం చేసింది. తను బాధపడటంలో తప్పేం లేదు.మళ్లీ అన్యాయం?ఇక భరణి కోసం తనూజ ఫ్యాన్స్ ఓట్లు గుద్దిపడేస్తున్నారు. శ్రీజ హౌస్‌లోకి వస్తే కల్యాణ్‌కు ఎక్కడ పోటీ అవుతుందో అని అటు అతడి ఫ్యాన్స్ కూడా భరణికే ఓట్లేస్తున్నారట.. దీంతో ఓటింగ్‌లో భరణి లీడ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు హౌస్‌లో జరుగుతున్న గేమ్స్‌లో కూడా భరణి తన హవా చూపిస్తున్నాడట! ఈ లెక్కన బిగ్‌బాస్.. భరణిని పర్మినెంట్ హౌస్‌మేట్‌గా ప్రకటించాడని తెలుస్తోంది. దీంతో శ్రీజకు మరోసారి అన్యాయం జరిగినట్లయింది. ఓటింగ్ ద్వారా ఈసారి ప్రేక్షకులు కూడా అన్యాయం చేసినట్లే లెక్క!చదవండి: దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్ -
ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా?
సెకండ్ ఛాన్స్ కోసం భరణి, శ్రీజ బిగ్‌బాస్ హౌస్‌లో పోటీపడుతున్నారు. వీరిలో ఒక్కరికే స్థానం ఉంటుందన్న బిగ్‌బాస్.. రకరకాల టాస్కులిచ్చాడు. అందులో భరణి గాయాలపాలై ఆస్పత్రికి కూడా వెళ్లొచ్చాడు. అటు రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజకు గొడవలు తప్పడం లేదు. ఏకంగా రాజు (మాధురి)తో కూడా గొడవ జరిగింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఫెయిలైన సంచాలకులుశ్రీజ- భరణి కోసం మొదటగా కట్టు- పడగొట్టు టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భరణి, ఇమ్మాన్యుయేల్‌ను ఒక్కటే కట్టడి చేసి శెభాష్ అనిపించుకున్నాడు డిమాన్ పవన్. కానీ, అతడి కష్టాన్ని ప్రేక్షకులకు కనిపించకుండా ఎపిసోడ్లో సరిగా వేయనేలేదు. ఫస్ట్ రౌండ్లో శ్రీజ గెలిచిందని కల్యాణ్.. కాదు, భరణి గెలిచాడని సుమన్ వాదించారు. దీంతో బిగ్‌బాస్.. ఈ ఇద్దర్నీ సంచాలకులిగా తప్పించాడు. కొత్త సంచాలక్ మాధురి.. శ్రీజ గెలిచినట్లు ప్రకటించింది.మాధురి వర్సెస్ తనూజరెండో రౌండ్లో భరణి (Bharani Shankar) గాయాలపాలవడంతో పాటు ఎవరూ గెలవలేదు. భరణిని ఆస్పత్రికి తీసుకెళ్లి మళ్లీ హౌస్‌లోకి పంపించారు. ఇక కిచెన్‌లో గొడవ మొదలైంది. చపాతీలు లావుగా వస్తున్నాయని తనూజ అంది. పక్కనే చపాతీ చేస్తున్న మాధురి.. మేమేమీ హోటల్ సర్వర్లము కాము.. మాకు రాదు అంటూ అక్కడ పడేసి వెళ్లిపోయింది. మేము కూడా హోటల్లో పని చేసి రాలేదు, అయినా పని చేస్తున్నాం. రాకపోతే చెప్పండి, వేరేవాళ్లు చేసుకుంటారని తనూజ కౌంటరిచ్చింది.అన్నంపై అలిగిన సంజనాతగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావేమో.. ప్రేమకి తగ్గుతున్నా.. నువ్వు అరుస్తుంటే తగ్గట్లేదు. నేను మాటలు పడటానికి రాలేదు. మీకు సపోర్ట్‌గా ఉంటే బాగుంటుంది. న్యాయం వైపుంటే నచ్చదు అంటూ మాధురి (Divvala Madhuri) సెటైర్లు వేసింది. మీరు టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లకండి.. నాన్నను సేవ్ చేయమని అడిగానా? అంటూ తనూజ వాదించగా కాసేపు గొడవ జరిగింది. అటు అన్నం కొద్దిగానే ఉండటంతో.. అన్నం పెట్టుకునేముందు చెప్పాలిగా అని తనూజ సంజనాను ప్రశ్నించింది. దీంతో ఆమె తినే ప్లేటు మీద నుంచి అలిగి వెళ్లిపోయింది. అందుకే మాధురిపై కోపం లేదుమరోవైపు రీతూ-పవన్‌ల గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్స్ రోజు మాధురి.. నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు? అని గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాన్ పవన్‌కు తిక్క రేగింది. ఆమెను అక్కా అని పిలుస్తున్నా, అందుకే కోపం రాలేదన్నాడు. దీంతో రీతూ మరింత అరిచింది. ఆవేశంలో పవన్ ఓ మాట జారాడు. ఇక చాలు, గుడ్‌బై అని రీతూ అక్కడినుంచి వెళ్లబోతుంటే పవన్ తనను తోసేశాడు.మాధురికి రీతూ తల్లి ఫోన్ఈ గొడవలతో పిచ్చెక్కిపోతున్న మాధురి.. పవన్‌తో ఒక్కమాట అడుగుతా.. మీది హెల్తీ రిలేషన్ అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు నాకు ఫోన్ చేస్తారా? నీతో మాట్లాడుతుంటే ఆమె తల్లి ఏడుస్తుందని నాకు చెప్తారా? నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే సారీ అనేసింది. ఆ తర్వాత కూడా వీళ్లు గొడవపడటం.. కాసేపటికి రీతూ ఎప్పటిలాగే డిమాన్‌కు తినిపించడం జరిగిపోయింది. ఇదంతా వాళ్లకెలా ఉందోకానీ, చూసేవారికి మాత్రం తల బొప్పికడుతోంది.చదవండి: కల్కి క్రెడిట్ నుంచి దీపికా పదుకొనే పేరు తొలగింపు -
రోజుకు 22 గంటలు షూటింగ్‌లోనే.. నేలపై నిద్రపోయేవాడిని!
కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలాగైతే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగాలు చేస్తారో.. సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి టైమింగ్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్ అంటే కష్టం.. అందులోనూ లెక్క లేకుండా రోజంతా ఎక్కువ గంటలు పని చేయించుకుంటామంటే కుదరదు, 8 గంటల షిఫ్టే ఉండాలి అని దీపికా పదుకొణె వంటి స్టార్ హీరోయిన్స్ కొత్త కండీషన్స్ పెడుతున్నారు.సరిగా నిద్రుండేది కాదుఈ డిమాండ్లకు కొందరు నిర్మాతలు కుదరదని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. అయితే రోజుకు ఎనిమిది గంటలు కాదు, ఏకంగా 22 గంటలు పని చేసేవాడిని అని చెప్తున్నాడు హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు హితేన్ తేజ్వాని (Hiten Tejwani). తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. కెరీర్ తొలినాళ్లలో నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. నెలలో 30 ఎక్స్ట్రా షిఫ్టులు చేసేవాడిని. నా చెక్ నేనే వెళ్లి తెచ్చుకునేవాడిని. రూ.1 లక్ష చెక్ అందుకోగానే సంబరపడిపోయేవాడిని.ఛాన్స్ దొరికితే నేలపై నిద్రపొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ అనేవారు. తీరా అది ఉదయం ఐదింటివరకు సాగేది. రెండు గంటల గ్యాప్‌తో నెక్స్ట్ షిఫ్ట్ మొదలయ్యేది. అలా 22 గంటలు పనిచేసేవాడిని. మిగతా రెండుగంటలు నేలపై నిద్రించేవాడిని. నా టైమింగ్స్ నచ్చక చాలామంది డ్రైవర్స్ సడన్‌గా పని మానేసేవారు. దాంతో నేనే కారు నడిపేవాడిని, ఓసారైతే డివైడర్‌ను ఢీ కొట్టాను. నిజానికి వేరే ఉద్యోగం చూసుకుంటే పనిగంటలు తక్కువ ఉండేవి, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని చాలాసార్లు అనుకున్నాను. అయినా ఇష్టపడి, కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్హితేన్.. సుకన్య, ఘర్ ఏక్ మందిర్, కభీ సౌతన్ కభీ సహేలి సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసేవాడు. కుటుంబ్ సీరియల్‌తో బ్రేక్ అందుకున్నాడు. క్యూంకీ సాస్ భీ కభీ బహుతీ, కుసుమ్, బాలికా వధు, కసౌటీ జిందగీ కే వంటి పలు ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యూంకీ సాస్ భీ కభీ బహు తీ 2 సీరియల్ చేస్తున్నాడు. హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: టాస్కుల్లో పవన్‌ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి! -
టాస్కుల్లో పవన్‌ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి!
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9.. ఇది చదరంగం కాదు, రణరంగమే అన్న ట్యాగ్‌లైన్‌కు నేటి ఎపిసోడ్ పూర్తిస్థాయిలో న్యాయం చేయనున్నట్లు కనిపిస్తోంది. రీఎంట్రీ కోసం శ్రీజ, భరణి.. ఇద్దరు రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ హౌస్‌మేట్స్‌లో నుంచి కొందరిని ఎన్నుకుని రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుంది. ఆ టీమ్ మెంబర్స్ ఆయా కంటెస్టెంట్ కోసం గేమ్ ఆడి గెలవాలి.కంటెస్టెంట్స్‌కి దెబ్బలురీఎంట్రీ అంటే మామూలు విషయం కాదు.. అందుకే ఏదో మామూలు టాస్క్‌లకు బదులుగా మంచి టాస్కులే ప్లాన్ చేశారు. అలా బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) పెట్టిన గేమ్‌లో హౌస్మేట్స్ కిందామీదా పడి ఆడి, దెబ్బలు తగిలించుకుని గాయపడ్డారట! భరణిని అయితే ఏకంగా గాయంతో హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఏమైనా ఫ్రాక్చర్ అయ్యారా? అని హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కానింగ్స్ చేయించారు.మట్టికరిపించిన పవన్అక్కడ బానే ఉందని రిపోర్ట్స్ రావడంతో తిరిగి అతడిని హౌస్‌కు పంపించారు. అయితే అందరి ఆట ఒకెత్తయితే.. డిమాన్ పవన్ ఆట మాత్రం మరో ఎత్తు. చేతులతో నిఖిల్‌ను కట్టడి చేస్తే కాళ్లతో భరణిని లాక్ చేసి ముందుకెళ్లనివ్వలేదు. ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీలను ఒక్కడే కట్టడి చేయమనేది మామూలు విషయం కాదు. ఇప్పుడనే కాదు, పవన్ తనకు ఏ టాస్క్ ఇచ్చినా సరే గట్టిగా ఆడతాడు. గెలుపు కోసమే ప్రయత్నిస్తాడు. తోపు కంటెస్టెంట్.. కానీ!ఫిజికల్ టాస్క్‌లో తాండవం చూపిస్తాడు. కానీ, రీతూతో లవ్ ట్రాక్ వల్ల పవన్‌పై జనాల్లో చిన్నచూపు ఉంది. అటు బిగ్‌బాస్ టీమ్, నాగార్జున కూడా అతడిని ఎక్కువగా హైలైట్ చేయరు. ఆ ట్రాక్ గనక లేకుంటే పవన్ కూడా టాప్ 3 రేసులో ఉండేవాడే! మరి శ్రీజను గెలిపించడం కోసం దెబ్బలు తగిలించుకుని మరీ ఆడుతున్నాడు. అతడు కోరుకున్నట్లుగా శ్రీజ రీఎంట్రీ ఇస్తుందా? వీకెండ్లో నాగార్జున.. పవన్ ఆటను మెచ్చుకుంటాడా? చూడాలి! చదవండి: హీరోయిన్గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ -
వదిలించుకుందామన్నా వదలరుగా! హౌస్‌లో శ్రీజ, భరణి రీఎంట్రీ!
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఒకర్ని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే! అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు నామినేషన్ చేసే పవర్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారు? రీఎంట్రీ కోసం ఎవరు రేసులో ఉన్నారో మంగళవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..భరణి రాకతో ఆనందభాష్పాలుభరణి (Bharani Shankar) హౌస్‌లో అడుగుపెట్టగానే దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. మిస్ అయ్యా నాన్నా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్లను కాస్త పక్కకు వదిలించుకున్న భరణి.. బాడీ షేమింగ్ చేయడం తప్పంటూ సంజనాకు ఓ కత్తి పొడిచాడు. రెండో కత్తి నాక్కావాలి, మీ ముందే చెప్పాలని మీరొచ్చే వరకు వెయిట్ చేశా.. అని దివ్య డిమాండ్ చేసింది. కానీ భరణి తనను పట్టించుకోకుండా నిఖిల్‌కు ఇవ్వడంతో దివ్య ముఖం మాడ్చుకుంది.దివ్యను పట్టించుకోని భరణినిఖిల్.. కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌ను గేమ్ మీకోసం వదిలేయమని అడుక్కోవడం నచ్చలేదని తనూజను నామినేట్ చేశాడు. భరణి వెళ్లిపోతూ తనూజతో.. బాండ్స్ వల్లే ఇప్పుడిలా బాధపడుతున్నావ్, బాండ్స్ కలుపుకోకు అని సలహా ఇచ్చింది. నా వల్లే మీరు వెళ్లానంటున్నారని తనూజ ఏడవడంతో ఛ, అలా ఏం కాదని సముదాయించి వెళ్లిపోయాడు. ఈ బంధాల జోలికి వెళ్లకూడదనుకున్నాడో, ఏమో కానీ.. దివ్యను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్ అయింది.నామినేషన్స్‌లో ఎనిమిది మందిశ్రష్టి.. డిమాన్ పవన్ (Demon Pavan)ను నామినేట్ చేసి, ఎనిమిదోవారం కల్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన, మాధురి, తనూజ, గౌరవ్, రాము నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భరణిని తల్చుకుని దివ్య ఏడ్చేసింది. తర్వాతి రోజు భరణి, శ్రీజ హౌస్‌లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు మాత్రమే హౌస్‌లో ఉంటారన్నాడు బిగ్‌బాస్.రీఎంట్రీ.. ఒక్కరికే ఛాన్స్ఇక దివ్య.. భరణిని పక్కకు తీసుకెళ్లి.. నా నామినేషన్ ఎవరనుకుంటున్నారు? తనూజ అని బాంబు పేల్చింది. మొత్తానికి భరణి.. బంధాలకు దూరంగా ఉందామనుకున్నా అటు వాళ్లు వదిలేరా లేరు. ఇక శ్రీజ, భరణి కోసం హౌస్మేట్స్ గేమ్ ఆడనున్నారు. అలాగే వీరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయనున్నారు. మరెవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి!చదవండి: సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్ -
కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
గత సీజన్లో జరిగిన నామినేషన్స్ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో (Bigg Boss Telugu 9) రిపీట్ కాబోతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేయనున్నారు. అయితే కాస్త డిఫరెంట్‌గా ఈ ప్రక్రియ జరగనుంది. కత్తితో పొడిచి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయినవాళ్లు ఒక కత్తితో వారే స్వయంగా నామినేట్ చేస్తారు. వాళ్లు ఎవరికైతే మరో కత్తిస్తారో.. వారు ఇంకొకర్ని నామినేట్ చేయాలన్నమాట!సంజనాకు క్లాస్ పీకిన ప్రియఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా.. హౌస్‌లో అడుగుపెట్టారు. బాడీ షేమింగ్ చేసిన సంజనాను ప్రియ నామినేట్ చేస్తూ ఆమెకు కత్తి గుచ్చింది. క్లాస్ అనే పదం వాడటం కూడా తప్పేనని క్లాస్ పీకింది. మనీష్.. కల్యాణ్‌కు కత్తి గుచ్చాడు. సర్ప్రైజ్ ఏంటంటే శ్రీజ కూడా కల్యాణ్‌నే నామినేట్ చేసిందట! ఇక ఇమ్మాన్యుయేల్.. తనూజను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.నామినేషన్స్‌లో ఎనిమిదిమందిసోషల్ మీడియాలో వైరలవుతున్న లీక్స్ ప్రకారం ఎనిమిదోవారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజనా, డిమాన్ పవన్, కల్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయినవారిలో కొద్దిమంది బిగ్‌బాస్ ట్రోఫీ కోసం మీతో పోటీపడి, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో శ్రీజ పేరు ముందునుంచి వినిపిస్తున్నదే! మరి తనతో పాటు ఇంకెవరైనా హౌస్‌లో అడుగుపెడతారా? చూడాలి! చదవండి: అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే? -
అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే?
పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలేఖ్య ఫేమస్ అయితే.. ఫిట్నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది. పైగా వర్కవుట్స్ అంటూ గ్లామర్ వీడియోలు షేర్ చేయడంతో ఓ పక్క తిడుతూనే ఆమెను ఫాలో అయ్యారు చాలామంది. సోషల్ మీడియాలో విపరీతైమన నెగిటివిటీ తెచ్చుకున్న రమ్యకు బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా.. వచ్చేస్తున్నా అంటూ వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ రెండువారాల్లోనే ఎలిమినేట్ అయింది. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం..నో ట్రాక్స్బిగ్బాస్ హౌస్‌లో బంధాలు పెట్టుకోవడానికి రాలేదంది రమ్య. అన్నట్లుగానే ఫేక్ రిలేషన్స్, లవ్ ట్రాకుల జోలికి వెళ్లలేదు. కానీ ఇది ఒకరకంగా ఆమెకు మైనసే అయింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న సంజనా సేవ్ అవడానికి కారణం.. ఇమ్మాన్యుయేల్‌తో తనకున్న బంధమే! ఇమ్మూ నామినేషన్స్‌లో లేడు కాబట్టి అతడి ఓట్లన్నీ ఆమెకు వేశారు. అలా సంజనా సేవ్ అయింది.అదే ముఖ్య కారణంరమ్య (Ramya Moksha) ఎలిమినేషన్‌కు ఆమె స్వయంకృతాపరాధం ముఖ్య కారణం. తను వచ్చీరావడంతో కుంభస్థలాన్ని కొట్టాలనుకుంది. తనూజ, కల్యాణ్‌లపై నోటికొచ్చినట్లు మాట్లాడింది. తనపై కల్యాణ్ చెయ్యేస్తే కిందపడేసి తొక్కుతానంది. తనూజను స్ట్రాంగ్ పాయింట్స్‌తో నామినేట్ చేసింది. కానీ చెప్పే విధానం సరిగా లేదు, హద్దులు దాటి మాట్లాడటంతో అది తనూజకే ప్లస్ అయింది. పైగా ఓసారి.. పక్కకెళ్లి ఆడుకోపో అని తనూజకు టిష్యూ పేపర్‌పై రాసివ్వడం చూసేవారికి కాస్త ఓవర్‌గా అనిపించింది.అది మర్చిపోతే ఎలా?తనూజ (Thanuja Puttaswamy) ఎలిమినేషనే టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ, తనూజను కిందకు లాగాలంటే ముందు తాను హౌస్‌లో ఉండాలన్న విషయం మర్చిపోయింది. ఇప్పటికే బయటున్న నెగెటివిటీ చాలదన్నట్లు తనూజ- కల్యాణ్‌లపై నోరు జారడం.. దాన్ని నాగార్జున తప్పుపట్టినా మరేం పర్లేదన్నట్లుగా ప్రవర్తించడం, హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. గేమ్‌పై కన్నా తనూజపైనే ఎక్కువ ఫోకస్ చేసి.. ఆమెను ఢీ కొట్టాలని చూసి బొక్కబోర్లాపడింది. రెమ్యునరేషన్ఇలా పదేపదే తనూజను టార్గెట్ చేయడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇంకేముంది, నామినేషన్స్‌లో ఎవరు బలహీనంగా ఉంటారో వారికి ఓట్లు గుద్ది.. రమ్యను డేంజర్ జోన్లో పడేశారు. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో పెద్దగా కనిపించలేదు. దీంతో రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఆమెకు వారానికి రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకుగానూ దాదాపు రూ.4 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.చదవండి: కల్యాణ్‌ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య -
కల్యాణ్‌ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్‌బాస్‌కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్‌కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్‌గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్‌పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్‌లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్‌బిన్‌లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్‌బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్‌లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్‌పై సీఎం ప్రశంసలు -
బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ అసలు నామినేషన్స్‌లోకే రాకపోవడం మైనస్‌గా మారనుంది.తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ఏడు వారాలు గడిచాయి. రానురాను కంటెస్టెంట్లు రాటుదేలతారనుకుంటే మరీ వరస్ట్‌గా తయారవుతున్నారు. సంజనా నోటికి హద్దే లేకుండా పోయింది. తొక్కిపడేస్తా, నేలకేసి కొడతా అంటూ మాధురి మరీ నీచంగా మాట్లాడుతోంది. వీళ్లకు సరైన కోటింగ్ ఇచ్చాడు నాగార్జున. మరి ఇంకా ఏమేం జరిగాయో శనివారం (అక్టోబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రాజాతో రీప్లేస్ చేశావా?ఇమ్మాన్యుయేల్.. కల్యాణ్‌తో తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేయించాలనుకున్నాడు. అది నేరుగా చెప్పకుండా ఏదేదో వాగాడు. ఈ టాపిక్‌ను నాగ్ ప్రస్తావిస్తూ అది సేఫ్ గేమ్, డైరెక్ట్‌గా నువ్వు చేయొచ్చుగా? అని ఇమ్మాన్యుయేల్‌కు క్లాస్ పీకాడు. తనూజ-మాధురిని బంధాల గురించి అడిగాడు. నాన్నని రాజాతో రీప్లేస్ చేశావా? అని నిలదీశాడు. అందుకు తనూజ.. మాది ఫేక్ బాండ్ కాదు సర్. నేను ఆవిడపై అరిచేస్తున్నా, తిట్టేస్తున్నా.. కానీ ఆవిడ నాతో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. తోసేసినా వెళ్లనంటోందివచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు.. మరిప్పుడెందుకు క్లోజ్ అవుతున్నారు? ఇది నాకు నెగెటివ్ అవుతుంని చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. నీతో జెన్యూన్‌గా ఉన్నా.. నువ్వు తోసేసినా వెళ్లనని నాతో అంది సార్. ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా అని కూడా చెప్పాను అని పేర్కొంది. మాధురికి క్లాస్ఇక తనూజ-సాయి మాట్లాడుతుంటే మధ్యలో రాము వచ్చి కూర్చోగా.. తనూజ చిరాకుతో మాటలనేసి వెళ్లిపోయిన వీడియో వేసి క్లాస్ పీకాడు. అయితే అది మాకు అలవాటే అని రాము అనడం గమనార్హం. ఇక దివ్యను రోడ్ రోలర్, లావు అని మాటలనడం, సంజ్ఞలు చేయడం తప్పని సంజనాకు క్లాస్ పీకాడు. రీతూపై మాటలు తూలిన మాధురికి కూడా క్లాస్ పడింది. గేమ్‌లో రీతూ.. తన డబ్బులన్నీ పవన్‌కు ఇవ్వడం.. కంటెండర్‌షిప్ కోసం తనను సైడ్ చేయడం జీర్ణించుకోలేకపోయింది. అది కడుపులో పెట్టుకుని రీతూను నానామాటలంది. బయట తోపు.. ఇక్కడ కాదు!బయట ఇలా చేసుంటే నేలకేసి తొక్కుతా.. నీ బిహేవియర్ బాలేదు, నీ నోరే చెత్త.. ఇలా చాలానే వాగింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. మీరు బయట తోపైతే బయట చూసుకోండి. బిగ్‌బాస్ హౌస్‌లో కాదు అని కాస్త సాఫ్ట్‌గానే హెచ్చరించాడు. ఇక ఈ ఎపిసోడ్లో ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్.. అంటూ ఎక్కువ బోర్డులు మాధురి మెడలోనే పడ్డాయి. దీంతో ఆమెకు ఓ పనిష్మెంట్ ఇవ్వనున్నారు. అది డైరెక్ట్ నామినేషన్ అని తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్లో కల్యాణ్‌ను మాత్రమే సేవ్ చేశారు. సేవ్ అయితే ఏదో చెప్తానన్నావ్.. అని నాగార్జున కూపీ లాగే ప్రయత్నం చేశాడు. కానీ కల్యాణ్ మెలికలు తిరుగుతూ తర్వాత చెప్తానంటూ దాటేశాడు.చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్! -
హీరోయిన్గా బిగ్‌బాస్ బ్యూటీ రతిక.. ఏకంగా మూడు భాషల్లో!
తెలుగు బిగ్‌బాస్ 7వ సీజన్లో పాల్గొని బాగా పాపులర్ అయింది రతిక (Rathika Ravinder). ఈ షోలో ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ తనపై వచ్చిన నెగెటివిటీ పోగొట్టుకోలేకపోయింది. ఇక సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు వేసే రతికా హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎక్స్‌వై. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్రానా, అనిజ్ ప్రభాకర్, శ్రీధర్ ఇతర పాత్రలు పోషించారు. ఎంకే సాంబశివం నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది.సినిమాఇటీవల ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పిజ్జా, సూదు కవ్వుమ్, ఇరుది సుట్రు వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడంతో పాటు మాయవన్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీవీ కుమార్. తాజాగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఆయన దర్శకత్వం వహించిన మరో ప్రయోగాత్మక చిత్రం ఎక్స్ వై. ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ మూవీ అని ప్రేక్షకుల నుంచి కచ్చితంగా కితాబులు అందుకుంటుంది అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: హరిహరన్ ఆనందరాజా, సంగీతం: శ్రీకాంత్ కృష్ణ. చదవండి: ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్ -
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్‌లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్‌పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్‌లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్‌గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్‌కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్‌ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్‌కు పిలిచారు. టైఫాయిడ్‌తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్‌బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్‌బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే అందిన లీకుల ప్రకారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సర్కిల్లో టోపీ పెట్టారు. బజర్ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్‌గా ఎవర్ని చూడొద్దనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి. కెప్టెన్సీ గేమ్అలా నిఖిల్ పోటీ పడి.. టోపిని గెలిచి గౌరవ్ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్.. కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎలిమినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు టోపీ ఇవ్వగా ఆమె దివ్యను ఎలిమినేట్ చేసింది. మరో రెండు మాధురికి ఇవ్వగా ఆమె నిఖిల్‌ను సైడ్ చేసింది. అలా చివరకు ఇమ్మాన్యుయేల్, తనూజ మిగలగా.. ఇమ్మూ గెలిచాడు. అయితే చివర్లో తనూజ కళ్లు తిరిగి పడిపోయినట్లు కనిపిస్తోంది. అటు ఆయేషా.. ఇప్పుడు తనూజ?నీళ్లు కొట్టి లేపినా ఆమె కళ్లు తెరవకపోయేసరికి హౌస్మేట్స్ కాస్త కంగారుపడ్డారు. అయితే అలిసిపోయి అలా పడిపోయింది తప్ప భయపడాల్సిందేమీ లేదు. మరోవైపు ఆయేషా కూడా డీహైడ్రేషన్‌కు గురైంది. దీనివల్ల టాస్కుల్లోనూ పాల్గొనలేకపోతోంది. ఆమెకు టైఫాయిడ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తనను షో నుంచి పంపించేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి.రీఎంట్రీ?హౌస్‌మేట్స్‌తో కొన్ని టాస్కులాడించేందుకు లేదా, నామినేట్ చేయడానికి.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రానున్నారని ఓ వార్త వైరలవుతోంది. దాదాపు నామినేట్ చేసేందుకే వస్తారు! అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు హౌస్‌లోనే పాగా వేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఏంటి? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. చదవండి: సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్ -
సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీకి చాలా పవర్ ఉంది. అందర్నీ ఆజమాయిషీ చేయడం కన్నా ఒక వారం ఇమ్యూనిటీ వస్తుందన్న క్రేజే ఎక్కువ. కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ ఎంచక్కా నామినేషన్స్ తప్పించుకుని కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చని హౌస్మేట్స్ భావిస్తుంటారు. అలాంటి కెప్టెన్సీని గతంలో ఇమ్మాన్యుయేల్ (Emmanuel) చేతులారా వదిలేసుకున్నాడు.సంజనా కోసం త్యాగంసంజనా (Sanjana Galrani)ను హౌస్మేట్స్ మిడ్వీక్లో ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే కదా! తను హౌస్‌లోకి రావాలంటే కొన్ని త్యాగాలు చేయాలని నాగార్జున కండీషన్ పెట్టారు. తనూజ కాఫీ వదిలేయాలని, రీతూ జుట్టు కత్తిరించుకోవాలని, భరణి.. తనకిష్టమైన లాకెట్ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ వదిలేయాలన్నారు. వీళ్లందరూ ఆ త్యాగాలు చేశారు కాబట్టే సంజనా హౌస్‌లో ఉంది.మళ్లీ సంపాదించిన ఇమ్మూఅలా ఇమ్మాన్యుయేల్ తన కెప్టెన్సీని కనీసం ఒకరోజైనా ఫీల్ అవలేకపోయాడు. అయితేనేం మళ్లీ ఆడి గెలిచే సత్తా తనకుంది. అది ఈ వారం మరోసారి రుజువు చేసుకున్నాడని తెలుస్తోంది. ఫోకస్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి కెప్టెన్‌గా ఇమ్మూ రూలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం! చదవండి: బిగ్‌బాస్ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్ ఏంటయ్యా! -
బిగ్‌బాస్ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్ ఏంటయ్యా!
బిగ్‌బాస్‌కు కొత్త ఐడియాలు రావడం లేదేమో! కొన్నిసార్లు పిచ్చి టాస్కులిస్తున్నాడు. నీళ్లు ఉమ్మే టాస్క్ అయితే మరీ దారుణం. అమర్దీప్- అర్జున్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఉపశమనంగా కనిపిస్తుంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో గురువారం (అక్టోబర్ 23వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మట్టి కరిపించిన డిమాన్ పవన్సంజనా సైలెన్సర్- మాస్ మాధురి గ్యాంగ్స్‌కు జెండాలే ఎజెండా టాస్క్ ఇచ్చాడు. ఇందులో సంజనా తరపు నుంచి బరిలో దిగిన డిమాన్-గౌరవ్.. మాధురి గ్యాంగ్ నుంచి వచ్చిన ఇమ్మాన్యుయేల్, కల్యాణ్‌ను మట్టి కరిపించారు. డిమాన్ పవన్ మరోసారి టాస్కుల వీరుడు అని నిరూపించుకున్నాడు. సంజనా రాను రాను శృతి, గతి అన్నీ తప్పుతోంది. నోటికి ఏదొస్తే అది అనేస్తోంది. చెత్తబుట్ట తీసుకొచ్చి.. ఇది ఖాళీ చేయలేదు.. పని చేయకుండా పిక్నిక్కు వచ్చారా? అని అరిచేసింది. చెండాలం టాస్క్కెప్టెన్స్ గౌరవ్, సుమన్తోనూ.. నేనేమైనా మీ పనిమనిషినా? నేను మీ సర్వెంట్ కాదంటూ చిందులు తొక్కింది. తర్వాత బిగ్‌బాస్ ఓ దరిద్రపు టాస్క్ ఇచ్చాడు. నోట్లో నీళ్లు పోసుకుని ఎక్కువ దూరంలో ఉన్న బకెట్లో ఉమ్మితే ఎక్కువ పాయింట్లు అట! ఇదే ఒక చెత్త టాస్క్ అంటే.. మా బకెట్లో చుక్క నీరు పడింది.. అక్కడ పడలేదంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ గేమ్‌లో సంజన టీమ్ గెలిచింది. మీరు తోపు.. మేము తుప్పాస్దీంతో బిగ్‌బాస్ చెప్పినట్లుగా మాధురి టీమ్ మెంబర్స్ అంతా మోకాళ్లపై కూర్చుని మీరు తోపు.. మేము తుప్పాస్ అని సంజనాకు చెప్పారు. ఇక ఈ వాంటెడ్పేట గేమ్‌లో రాము, రమ్య దగ్గర ఒక్క రూపాయి లేకపోవడంతో కంటెండర్ రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్లు అమర్దీప్-అర్జున్ పోలీస్ గెటప్స్‌లో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. కాసేపు కామెడీ చేసి నవ్వించారు. ఇది నేటి ఎపిసోడ్లో కూడా కొనసాగనుంది.చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా? -
బిగ్‌బాస్ 9: సడన్‌గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే?
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ఇప్పటివరకు ఏడుగురు వెళ్లిపోయారు. ఒకరు మళ్లీ తిరిగొచ్చారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, హరిత హరీశ్, శ్రీజ, భరణి వరుసగా వెళ్లిపోయారు. మధ్యలో సంజనాను మిడ్వీక్లో హౌస్మేట్స్ ఎలిమినేట్ చేశారు. కానీ, బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఆమెను సీక్రెట్ రూమ్‌కు పంపించాడు. వీకెండ్లో సంజనా వెళ్లిపోతుందని సంబరపడ్డారా? ఛాన్సే లేదంటూ మళ్లీ హౌస్‌లోకి పంపించారు.నామినేషన్స్‌లో 8 మందిఇక ఏడోవారం నామినేషన్స్‌లో ఎనిమిది మందున్నారు. వారే.. తనూజ, పవన్ కల్యాణ్, రీతూ చౌదరి, సంజన గల్రాని, రాము రాథోడ్, దివ్య, రమ్య, శ్రీనివాస్ సాయి. వీరిలో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్య, శ్రీనివాస్, రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్లోనే లేని వ్యక్తి ఒకరు ఎలిమినేట్ కావొచ్చు. ఆ కంటెస్టెంటే ఆయేషా. తను హైపర్ యాక్టివ్. ఫుల్ జోష్‌తో హౌస్‌లో అడుగుపెట్టింది. ఆరోగ్య సమస్యలుఅరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లేలా చేసింది. చీటికిమాటికి గొడవలు పడుతూ జనాలకు మాత్రం చిరాకు తెప్పించింది. వచ్చిన వారంలో ఉన్నంత జోష్ తర్వాతి వారంలో లేదు. కారణం.. ఆయేషా (Ayesha Zeenath)కు ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎపిసోడ్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే డాక్టర్ రూమ్‌కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వైద్యులు ఓకే అంటేనే హౌస్‌లో కొనసాగుతుంది. లేదంటే మాత్రం ఆమెను బయటకు పంపించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. రీతూను టార్గెట్ చేసి..నిజానికి ఆమె హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి ఫైర్ బ్రాండ్ అవుతుందనుకున్నారంతా! కానీ అనవసరపు గొడవలు, అరుపులతో అందరికంటే వరస్ట్ అనిపించుకుంది. రీతూను టార్గెట్ చేసి ఆమె నెగెటివిటీని కాస్త పోగొట్టేందుకు సాయపడింది. ఆమె నామినేషన్స్‌లోకి వస్తే పంపించేందుకు జనాలు రెడీగా ఉన్నారు. కానీ, వాళ్లకు పని చెప్పకుండా తనే స్వయంగా వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా వెళ్లిపోతుందా? వెళ్తే తిరిగొస్తుందా? ఆరోగ్యం కుదుటపడి హౌస్‌లోనే కొనసాగుతుందా? అనేది చూడాలి!చదవండి: సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమన్న మాధురి -
సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమన్న మాధురి
పాములు పట్టేవాడు పాముకాటుకే బలైనట్లు దొంగతనాలు చేసే సంజనానే దొంగదెబ్బ తీశారు సుమన్, తనూజ. బిగ్‌బాస్ ఇంటిని వాంటెడ్ పేట అని దొంగలనివాసంగా మార్చేశారు. బిగ్‌బాసే చెప్పాక కంటెస్టెంట్లు ఆగుతారా? ఏముంది, దొరికిన డబ్బు దోచేసుకున్నారు. కానీ, ఒక్క చోరీకే రుసరుసలాడింది సంజన.. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..మాస్ మాధురి Vs సంజన సైలెన్సర్బిగ్బాస్ హౌస్ గ్యాంగ్‌స్టర్ అడ్డాగా మారింది. మాస్ మాధురి, సంజన సైలెన్సర్ గ్యాంగుల మధ్య పోటీ జరుగుతోంది. సంజన (Sanjana Galrani) డబ్బులు పోవడంతో అందరిపైనా గరమైంది. హౌస్మేట్స్ అసలే గజదొంగల వేషాల్లో ఉన్నారు. అయ్యోపాపం.. అని డబ్బు తిరిగిస్తారా? ఛాన్సే లేదు. అవతలి టీమ్‌లో ఉన్న తనూజ, సుమన్‌లు ఆ డబ్బు ఎప్పుడో పంచేసుకున్నారు. కానీ అది జీర్ణించుకోలేని సంజనా.. లాక్కోవడం గీక్కోవడం మన క్లాస్ కాదు. బయట ఆర్టిస్టులం.. అంటూ సంబంధం లేని డైలాగులు వల్లె వేసింది.అమ్ముకోమంటే పూటుగా లాగించేశారుదాన్ని దివ్య మోసుకెళ్లి మాధురి (Divvala Madhuri) చెవిలో పడేసింది. అందుకామె ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమని చెప్పు అని సంజనాపై అసహనం వ్యక్తం చేసింది. తర్వాత రెండు గ్యాంగ్ లీడర్లకు కాఫీ షాప్, పానీపూర్ స్టాల్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ద్వారా డబ్బు సంపాదించుకోమన్నాడు. కానీ, అమ్మడంపై ఫోకస్ పెట్టడం మానేసి.. తేరగా వచ్చిందని తినడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారంతా! దీంతో బిగ్‌బాస్ ఆ స్టాల్ టాస్క్ ఎత్తేశాడు.గెలిచిన మాధురికి జేజేలుతర్వాత ధమాకా కిక్.. కాళ్లలో దమ్ము ఉండటం అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కాలును ఉపయోగించి చెప్పును గోడపై వీలైనంత ఎక్కువ ఎత్తులో అతికించాలి. ఇందులో అందరికంటే రీతూ చౌదరి బాగా ఆడింది. ఈ గేమ్‌లో మాధురి టీమ్ గెలవడంతో ఓడిపోయిన సంజనా టీమ్ మెంబర్స్ ఆమెను ఎత్తుకుని జై కొడుతూ ఇల్లంతా ఊరేగించారు.చదవండి: బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా -
పండగపూట ప్రమాదం.. నా భుజం వరకు మంటలు..: బుల్లితెర నటి
దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియా మాలిక్ (Priya Malik) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్ అంటుకుంది.ఫోటోలు దిగుతుండగా..క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్‌కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.నాకే ఆశ్చర్యం!చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ 9తో పాపులర్ అయిన ప్రియ మాలిక్.. 2022లో ఎంటర్ప్రెన్యూర్ కరణ్ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్ జన్మించాడు.చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది!
పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్ బారిన పడటం ఖాయం! బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి, మోడల్ నివాశియ్ని కృష్ణన్ (Nivaashiyni Krishnan) గ్లామర్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్‌ను హీరో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రీపోస్ట్ చేశారు.చిన్న తప్పిదం!ఇది గమనించిన కొందరు నెటిజన్లు వెంటనే దాన్ని స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జరిగిన తప్పును గ్రహించిన ఉదయనిధి.. వెంటనే సదరు పోస్ట్‌ను డిలీట్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అటు నివాశి గ్లామర్ పోస్ట్‌కు కామెంట్లను ఆఫ్ చేసింది. అప్పటికీ నెటిజన్లు ఆగడం లేదు.. వేరే పోస్టుల కిందకు వెళ్లి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మా అన్న ఎలా ఉన్నారు? డీఎంకే పార్టీలోకి స్వాగతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఎవరా బ్యూటీ?అటు ఉదయనిధి అభిమానులు మాత్రం ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. పొరపాటను ఉదయనిధి చేయి టచ్ అయి అలా రీపోస్ట్ అయిందని సమర్థిస్తున్నారు. నివాశి విషయానికి వస్తే.. తమిళనాడు మూలాలున్న నివాశి సింగపూర్‌లో మోడల్‌గా రాణిస్తోంది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసినట్లు తెలుస్తోంది. తమిళ బిగ్‌బాస్ ఆరో సీజన్లో కామనర్‌గా పాల్గొంది. ఓహో ఎంతన్ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. Udhaya Anna 🤣❤️🔥 Sunday rowdy time Monday Ena time ??? 🤣 pic.twitter.com/tTjI2UkpNT— விழுப்புரம் கிருபா (@Admk_Kiruba) October 21, 2025 చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు!
నామినేషన్స్ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్‌పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్‌పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్ 21వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నామినేషన్స్ లొల్లితనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్ చేసే పవర్‌ను కల్యాణ్‌కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్రెడీ తనూజను నామినేట్ చేసింది. నాకు ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదు అని కల్యాణ్ వివరణ ఇచ్చాడు.తనూజను ఎప్పుడో వదిలేశా!అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్‌గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్ ఇచ్చిన ఆన్సర్‌కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్ గేమ్ ఆడితే తర్వాతి వారం నామినేట్ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్.ఇమ్మాన్యుయేల్‌పై రంకెలేసిన తనూజమరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్‌పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్‌తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్‌లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్ చేయాలని బలంగా డిసైడ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.దొంగలుగా హౌస్మేట్స్బిగ్బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ టీమ్ లీడర్స్‌ను ప్రకటించాడు. గేమ్స్ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్‌లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్ అవుతారన్నాడు. మొదటి గేమ్‌లో మాధురి టీమ్ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్ పూల్‌లో ముంచేశారు.చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
నాన్న అందుకే వెనకబడ్డాడు! ఆకాశానికెత్తి పాతాళంలో పడేశారు!
నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బంధాల మధ్యలో చిక్కుకుని బయటకు రాలేక అవస్థ పడ్డాడు. కూతురు, తమ్ముడు, సోదరుడు, స్నేహితుడు.. ఇలాంటి బంధాల్లో కూరుకుని నిండా మునిగిపోయాడు. బిగ్‌బాస్ ఆటను మర్చిపోయి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే ఆయన ఎలిమినేషన్‌కు తొలి, చివరి కారణం! తన కోసం తగ్గిన భరణిబిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) ప్రారభమైన మొదటివారం భరణి మాటతీరు చాలామందికి నచ్చింది. తర్వాతి వారం ఆటతీరు నచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనూజ.. నాన్న, నాన్న అంటూ వెనకపడటంతో ఆమె కోసం కొన్నిచోట్ల తగ్గాల్సి వచ్చింది. నాన్న.. నాకోసం నిలబడతాడు, నాకోసం ఏదైనా చేస్తాడు అంటూ గంపెడాశలు పెట్టుకున్న తనూజ కోసం కొన్నిసార్లు ఆటలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అటు రాము రాథోడ్‌ను కొడుకులా దగ్గరకు తీసుకున్నాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్ కూడా చేశాడు.టాప్ 1 అని..కానీ, అదే సమయంలో రీతూకు సైతం సాయం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేనందుకు నానామాటలు పడ్డాడు. ఇంతలో అగ్నిపరీక్ష నుంచి వైల్డ్‌కార్డ్‌గా సరాసరి హౌస్‌లోకి వచ్చింది దివ్య. వచ్చీరావడంతోనే భరణి (Bharani Shankar)ని నెం.1 స్థానంలో నిలబెట్టింది. అందరూ తనే టాప్ 1 అని పైకి లేపేసరికి పొంగిపోయాడు. దివ్యను ఇంకో కూతురిగా చూసుకున్నాడు. తనకు ఎదురొచ్చినవారు ఎలిమినేట్ అవుతున్నారంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఆ పని చేసుంటే..కానీ, రోజురోజుకీ తన గ్రాఫ్ పడిపోతుందని అర్థం చేసుకోలేకపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున పదేపదే హెచ్చరించినా దాన్ని పెడచెవిన పెట్టాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా భరణి గేమ్ ఆడుంటే ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. కానీ బంధాలతో నోరు కట్టేసుకున్నాడు, తనకు తానే ఓ బందీ అయిపోయాడు. దీనికి తోడు భరణికి భుజం నొప్పి కూడా ఉంది. ఎలాగో వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి, ఇక అతడితో పని లేదని భావించిన ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేశారు.చదవండి: బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి! -
నీకెందుకే అంత యాటిట్యూడ్? రీతూపై విషం కక్కిన ఆయేషా..
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్, శ్రీజ, భరణి వరుసగా హౌస్ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఇప్పుడు మరొకరిని పంపించేందుకు నామినేషన్స్ షురూ అయ్యాయి. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది.కెప్టెన్ల చేతిలో పవర్నామినేషన్ చేసే హక్కును కూడా పోరాడి గెలవాల్సి ఉంటుందన్నాడు బిగ్‌బాస్. ఆ పోరాటానికి ఇద్దర్ని ఎంపిక చేసుకోమని కెప్టెన్స్‌కు పవర్స్ ఇచ్చారు. దీంతో గౌరవ్.. ఆయేషాను, సుమన్.. ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశాడు. ఆయేషా, ఇమ్మూకి బిగ్‌బాస్ బెలూన్ల టాస్క్ ఇచ్చాడు. బెలూన్ పగలగొట్టినప్పుడు అందులో ఓ చిట్టీ వస్తుంది. దానిపై రాసున్నదాని ప్రకారం నామినేషన్స్ ముందుకు సాగుతాయి. ఈ క్రమంలో ఆయేషా.. రీతూను డైరెక్ట్‌గా నామినేట్ చేసింది. నామినేషన్స్నువ్వు, నీ ఓవరాక్షన్ నచ్చలేదు. నువ్వు లవ్ కంటెంట్ కోసం వచ్చావు అంటూ పర్సనల్ అటాక్ చేసింది. దానికి రీతూ.. నేను లవ్ చేస్తున్నానని చెప్పానా? అని నిలదీసింది. అప్పటికీ తగ్గని ఆయేషా... నీకంత యాటిట్యూడ్ ఎందుకే? నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు అని మండిపడింది. చూస్తుంటే వీరిమధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. రమ్య, సాయి, రీతూ, తనూజ, దివ్య, రాము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయేషా నామినేషన్లో ఉండాల్సింది. కానీ గౌరవ్ సేవ్ చేయడంతో ఆమె గండం గట్టెక్కింది. -
బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!
బిగ్‌బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్‌వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. పేరడీ సాంగ్స్నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్‌మేట్స్‌పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు. హైపర్ ఆది హింట్స్మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్‌కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్‌సెట్ తీసేసి పాజిటివ్‌గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్‌కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.భరణి ఎలిమినేట్ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు. నావల్ల నీ ఒక్కడికే అన్యాయంస్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్‌లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్‌కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే.. -
ఏంటి సంజనా.. నీకు, నాకు పెళ్లిచూపులా?: నాగార్జున
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నేడు దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. హోస్ట్ నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ సాంప్రదాయంగా ముస్తాబయ్యారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. పండగ పూట హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా పంపించాడు నాగ్. అలాగే వారి ఫ్యామిలీస్‌తో వీడియో కాల్ మాట్లాడించాడు. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. భర్త, ఇద్దరు పిల్లల్ని చూడగానే సంజనా కళ్లలో నీళ్లు తిరిగాయి.ఎమోషనల్‌గా దీపావళి స్పెషల్ ఎపిసోడ్అటు డిమాన్ పవన్, సుమన్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు నెలన్నర తర్వాత ఇంట్లోవాళ్లను స్క్రీన్‌పై చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. ఇక కుర్తాపైజామాలో ఉన్న నాగార్జునను చూసి సంజనా ఓ డైలాగ్ వేసింది. పెళ్లిచూపులకు రెడీ అయినట్లుగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకు నాగ్.. ఏంటి? నీకు, నాకా? అని సరదాగా అన్నాడు. అది విని హౌస్మేట్స్ ఆశ్చర్యపోయారు. ఈ దీపావళి ఎపిసోడ్ నేడు రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్ -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్‌బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్‌కార్డ్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్‌కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్‌తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్‌ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్‌ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్‌కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్
బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత షో పరుగులు పెడుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరూ ఊహించని వ్యక్తి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే గతవారంలో ప్రేక్షకుల ఓటింగ్‌తో ప్రమేయం లేకుండానే షాకింగ్ ఎలిమినేషన్‌తో శ్రీజ దమ్ము బయటకు వచ్చేసింది. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో ఉన్న భరణి, దివ్య, తనూజ, పవన్, రాము, సుమన్‌లలో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అందరూ దివ్య, రాములలో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ, బిగ్‌బాస్ అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశాడు. ఒక టాప్ కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి పంపించేశాడు.ఈ వారం భరణి ఎలిమినేట్ అయిపోయారు. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఈ అదివారం బిగ్‌బాస్ నుంచి బయటకు రానున్నారు. కేవలం ఎక్కువ బాండిగ్స్ పెట్టుకోవడం వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఆపై ఈ వారంలో సంజన మీద ఆయన ఫైర్ తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఆపై అతని గేమ్ స్ట్రాటజీని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. టాప్‌లో తనే ఉన్నాననే భ్రమలో భరణి ఉండటంతో గేమ్‌పై పట్టు కోల్పోయారు. ముఖ్యంగా దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో భరణిని టాప్ 2లో ఉన్నారని చెప్పింది. ఆపై అతనితోనే దివ్య ఉండటంతో నమ్మేశాడు. దీంతో ఆయనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఏకంగా తనను నామినేట్ చేసిన వారందరూ హౌస్ నుంచి వెళ్లిపోయారని కూడా కామెంట్ చేశారు. అంతలా తనపై తాను అతి నమ్మకం పెట్టుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న భరణి ఆట చూసి ఇంట్లోకి వెళ్లిన దివ్య కూడా సలహాలు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆట పతనానికి దారి తీసింది. కేవలం తన స్వయం కృతాపరాధం వల్లే భరణ ఎలిమినేట్ అయ్యారని చెప్పవచ్చు. అయితే, ఎలాంటి నెగటివిటి లేకుండా బిగ్‌బాస్ నుంచి వచ్చేశారు. -
అమ్మాయిల పిచ్చి! నువ్వు చూశావా? రమ్యకు నాగ్ కౌంటర్
బిగ్‌బాస్ షోలో (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) అక్షింతలు వేస్తున్నాడు. నోరుంది కదా అని అందరిమీదా పెత్తనం చెలాయించాలని చూసిన మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. మాటతీరు మార్చుకోమని హెచ్చరించాడు. ఇప్పుడిక రమ్య వంతు వచ్చింది. ఈమె వచ్చీరావడంతోనే కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని అతడిపై ముద్ర వేసింది. రమ్య కామెంట్స్.. నోరెళ్లబెట్టిన కల్యాణ్నిజానికి కల్యాణ్ (Pawan Kalyan Padala) చూపులు, ప్రవర్తన.. కాస్త తేడాగా ఉన్నప్పటికీ మరీ అమ్మాయిల పిచ్చి అనేయడం తప్పుగానే అనిపించింది! నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని రమ్య మాట్లాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్‌లో ప్లే చేశాడు నాగ్. అది చూసి నోరెళ్లబెట్టాడు కల్యాణ్. ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్. ఫుల్ క్లారిటీకల్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా? లేదా? అని ప్రేక్షకుల్ని అడగ్గా సగం మంది అవునని, మిగతా సగం మంది కాదని బదులిచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు కల్యాణ్ షాకయ్యాడు. అంటే జనాల్లో తనపై ఏ విషయంలో వ్యతిరేకత ఉందో ఈ ఎపిసోడ్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మారాడు. ఇంకా ఆటపై ఫోకస్ పెడితే మాత్రం కల్యాణ్ విన్నింగ్ రేస్‌లో దూసుకుపోవడం ఖాయం! చదవండి: మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక! -
మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లున్నారు. వీరిలో ఆరుగురు కొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డ్స్ ఉన్నారు. వారిలో ఎక్కువ హైలైట్ అవుతుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు మాధురి, మరొకరు ఆయేషా! అరుపులు, ఏడుపులు తప్ప ఏదీ కనిపించడం లేదంటూ తనూజను నామినేట్ చేసిన ఆయేషా.. వచ్చినప్పటినుంచి అరుస్తూనే కనిపించింది. నిన్న ఒక్క గేమ్ ఓడిపోయేసరికి బోరుమని ఏడ్చింది. వాయించేసిన నాగ్మాధురి (Divvala Madhuri).. హౌస్‌కు రెండో బిగ్బాస్లా ఫీలవుతోంది. అందరిపై ఆజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌తో ఓ గొడవ కూడా జరిగింది. ఆ గొడవలో తప్పెవరిది? అని కెప్టెన్ సుమన్‌ను అడిగాడు నాగ్. అందుకు సుమన్ తడుముకోకుండా మాధురిదే తప్పన్నాడు. ఆరోజు ఏం జరిగిందో వీడియో క్లిప్పింగ్ వేసి మరీ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పు లేదు.. కానీ, మాట్లాడిన తీరు తప్పు అని మాధురికి క్లాస్ పీకాడు. నా గొంతే అలా ఉంటుందని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించుకోగా దాన్ని నాగ్ ఖండించాడు.సూపర్ పవర్ నిర్వీర్యంమరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా.. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని హెచ్చరించాడు. మాధురికి ఉన్న సూపర్ పవర్ ఉంచాలా? తీసేయాలా? అని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగ్గా వారు తీసేయడమే మంచిదన్నారు. వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చినరోజు ఆమెకు ఎలిమినేషన్‌ను రద్దు చేసే పవర్ ఇచ్చారు. ప్రేక్షకుల తిరస్కారంతో ఆ పవర్ ఇప్పుడు నిర్వీర్యమైపోయింది. చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం -
రూ.1 కోటి లోన్‌తో కొత్తిల్లు.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇప్పుడీ రెండు పనులు భుజానేసుకున్నారు బుల్లితెర జంట ప్రియాంక జైన్ (Priyanka Jain)- శివకుమార్ (Shivakumar). కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ పెళ్లిని ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలని డిసైడయ్యారు. ఈ ఏడాదే పెళ్లి అని ప్రకటించారు.. కానీ అది వాయిదా పడేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం మరో ముఖ్యమైన పని మీద పడ్డారు.గతేడాది ల్యాండ్ కొన్న జంటప్రస్తుతం అద్దె ఇంట్లో కలిసుంటున్న ప్రియాంక -శివ్ గతేడాది హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్నారు. భూమి కొని.. అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ మజాయే వేరంటూ 2024 ఏప్రిల్‌లో భూమి కొని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఆ విషయాన్ని ఈ ప్రేమపక్షులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కోటి రూపాయల లోన్‌తో ఇల్లు కట్టుకుంటున్నట్లు తెలిపారు.మా ఫ్యూచర్ కళ్లముందు..ఇది కేవలం ఇటుకలతో కాదు, ఎన్నో ఆశలు, కలలతో నిర్మితమవుతోన్న ఇల్లు. నిలువైన గోడల్ని చూస్తుంటే మా భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ఇంటికి పునాది పడలేదు. జీవితకాల జ్ఞాపకాల సమాహారానికి పునాది పడింది. ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడ అందమైన జ్ఞాపకాలను కూడబెట్టుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఇది మా శాశ్వత నివాసం అని రాసుకొచ్చింది. సీరియల్స్‌తో పాపులారిటీఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు ప్రియాంక-శివ్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా వీరిద్దరూ మౌనరాగం సీరియల్లో జంటగా నటించారు. అప్పుడే వీరి పరిచయం ప్రేమగా మారింది. జానకి కలగనలేదు సీరియల్‌తో ప్రియాంక మరింత పాపులారిటీ సంపాదించింది. తర్వాత తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. టాప్ 5లో ఒకరిగా నిలిచింది. శివకుమార్ ప్రస్తుతం తెలుగులో ఓ సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: 25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న దంగల్ నటి -
ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం పట్టుకుందా?
సుమన్, గౌరవ్ కెప్టెన్స్ అయ్యారని ముందే లీక్ అవడంతో ఎపిసోడ్లో పస లేకుండా పోయింది. హౌస్‌మేట్స్‌ను వచ్చినప్పటినుంచి చెడుగుడు ఆడేసుకుంటున్న ఆయేషా ఒక్క గేమ్‌లో ఓడిపోయినందుకు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అంతా నావల్లే..కెప్టెన్సీ కంటెండర్లను జంటలుగా విడిపోమన్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). సుమన్‌తో జత కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు గౌరవ్ అతడితో జోడీ కట్టాడు. మాధురి- రమ్య, ఆయేషా- సాయి, గౌరవ్- సుమన్ జంటలు కెప్టెన్సీ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో సుమన్-గౌరవ్ చాలా ప్రశాంతంగా ఆడి గెలిచారు. ఓటమిని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. నాకు చీకట్లో కళ్లు సరిగా కనిపించలేదు, నా వల్లే గేమ్ పోయిందంటూ తన చెంపపై తనే కొట్టుకుంటూ ఏడ్చింది. ఆమెనలా చూసి మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.పవన్ వాడేసిన నిఖిల్గెలిచిన జంట సుమన్ (Suman Shetty)- గౌరవ్‌ను కెప్టెన్స్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్.. తన కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్స్‌లో ఒకర్ని చాలెంజ్ చేయొచ్చన్నాడు. దీంతో అతడు గౌరవ్‌తో తలపడతానన్నాడు. అలా వీరిద్దరికీ సాండ్ టాస్క్ పెట్టగా ఇందులో గౌరవ్ గెలిచి తన కెప్టెన్సీ కాపాడుకున్నాడు. అలా గెలిచాడో, లేదో.. అప్పుడే సుమన్‌తో చర్చించి ఆయేషాకు ఓ వరమిచ్చాడు. భరణిలో భయం మొదలైందా?ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కాబట్టి.. ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మేము బయట మిగిలిన బెడ్స్‌పై పడుకుంటాం అన్నాడు. ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక బంధాల సుడిగుండంలో చిక్కుకున్న భరణి (Bharani Shankar)కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇమ్మాన్యుయేల్ మాటల్లో స్పష్టమైంది. సంజనతో ఇమ్మూ మాట్లాడుతూ.. ఎప్పుడైనా నేను డేంజర్లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా? అని భరణి అన్న అడిగాడని చెప్పాడు. మహా ముదురుఆ మాటకు సంజనా అవాక్కైపోయి.. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట! మహా ముదురు అని కామెంట్ చేసింది. ఇంకా ఇమ్మూ మాట్లాడుతూ.. హౌస్‌లో 15 మంది ఒకవైపు, నువ్వొకడివే ఒకవైపు ఉంటే.. నీవైపు న్యాయం ఉంటే.. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా.. అని ఇమ్మూ సంజనాతో చెప్పుకొచ్చాడు. అంటే భరణిలో ఎలిమినేషన్ భయం మొదలైందన్నమాట!చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా!
బోల్డ్ సినిమాల్లో నటించి పాపులర్ అయింది వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్ (Rekha Boj). సినిమా అవకాశాలు ఎక్కువ పెద్దగా అవకాశాలు రాకపోయేసరికి యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్ చేస్తోంది. ఆ మధ్య పుష్ప మూవీలోని సామి సామి.. పాట కవర్ సాంగ్ చేసేందుకు రెండు గాజులు అమ్ముకుంది. అంతటితో ఆగడం లేదు.. కుదిరితే కిడ్నీలైనా అమ్ముకుంటాను కానీ యాక్టింగ్‌ను మాత్రం వదిలేది లేదని తెగేసి చెప్తోంది.షార్ట్‌ఫిలింతో జర్నీ మొదలురేఖా భోజ్ మాట్లాడుతూ.. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం 'లవ్ ఇన్ వైజాగ్'. షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి యాక్ట్ చేశాను. తర్వాత డర్టీ పిక్చర్ అనే లఘు చిత్రం చేశాను. కాలాయా తస్మై నమః సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాను. నా జీవితంలో ఫస్ట్ కవర్ సాంగ్ సామి సామి.. బంగారు గాజులు అమ్మి మరీ ఈ పాట చేశాను. ఈ సాంగ్ వల్లే మాంగళ్యం సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ మూవీ నాకు మంచి పేరు తీసుకొచ్చింది.కమిట్మెంట్స్ ఇచ్చుంటే..గత ఐదారేళ్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ కమిట్మెంట్స్ అడుగుతున్నారు. బంగ్లా రాసిస్తా.. అవి కొనిస్తా.. అదీ ఇదీ అని మభ్యపెట్టేవారు. కమిట్మెంట్ అడిగినవాళ్లకు గట్టిగానే కౌంటర్లిచ్చాను. అలాంటివి చేసుంటే ఈపాటికి చాలా సంపాదించేదాన్ని. నేనేదో.. నా దగ్గరున్న వస్తువులు అమ్ముకుంటూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ ఇండస్ట్రీని వదిలి ఎక్కడికీ వెళ్లలేను. నాతో పనిచేసేందుకు నిర్మాతలు ముందుకు రాకపోతే నా ఆస్తి అమ్మేసైనా సరే.. ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. గాజులమ్మగా వచ్చిన రూ.4 లక్షలతో సామి సామి పాట ఎలా చేశానో.. కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో సినిమా చేద్దామనుకుంటున్నా.. నాలుగేళ్లుగా బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు..ఎందుకంటే సినిమానే నా ప్రపంచం. ఇకపోతే పాపులారిటీ కోసం బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కి వెళ్లేందుకు ప్రయత్నించాను. గత నాలుగేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నా.. గతేడాది ఇంటర్వ్యూ కూడా అయింది. అంతా ఓకే అన్నారు.. ఇంకో వారంలో షో స్టార్ట్ అన్న సమయంలో రిజెక్ట్ చేశారు. ముక్కూమొహం తెలియనివాళ్లు కూడా షోకి వస్తున్నారు. మరి నన్నెందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. నాకు అవకాశం ఇచ్చుంటే దాన్ని బాగా ఉపయోగించుకునేదాన్ని. బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్‌కు సైతం వీడియో పంపించాను. కానీ అదృష్టం కలిసి రావడం లేదు అని రేఖా బోజ్ చెప్పుకొచ్చింది.చదవండి: ఈసారి ఇద్దరు కెప్టెన్స్.. సుమన్ ప్రమాణ స్వీకారం! -
ఈసారి ఇద్దరు కెప్టెన్స్.. సుమన్ ప్రమాణ స్వీకారం!
దివ్వెల మాధురి బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంటి మహారాణిలా ఫీలైపోతుంది. సున్నితంగా చెప్పేదగ్గర కూడా ఆర్డర్లు జారీ చేస్తోంది. అటు భరణి-దివ్యల బంధం రోజురోజూకి బలపడుతోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నా ఆరోగ్యం పాడైపోతోందిలైట్లు ఆఫ్ అయ్యాక మాట్లాడకూడదు, గుసగుసలు వినిపించకూడదు. పొద్దున సాంగ్ కంటే ముందే లేచినవారు మౌనంగా ఉండాలి.. అంటూ రూల్స్ పెట్టింది మాధురి (Divvala Madhuri). ఇదేమైనా బిగ్‌బాస్ రూలా? అని రీతూ అనడంతో మాధురి గయ్యిమని లేచింది. నా ఆరోగ్యం పోతుంది.. నా రూల్స్ ఒప్పుకోకపోతే పోండి అని అరిచేసింది. ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎవరూ పడరు... నచ్చకపోతే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది.దొంగతనాలకు రెడీ అవుతున్న రమ్యఇక రమ్య ఆర్డర్ చేసిన వంటకాలన్నీ పంపించాడు బిగ్‌బాస్. సుమన్‌తో కలిసి కడుపునిండా ఆరగించింది. ఈ క్రమంలో సంజనాతో దొంగతనాలు చేస్తా.. సంజన 2.0 అవుతా అంది. మరోవైపు భరణి.. రీతూతో క్లోజ్‌గా ఉండటం నచ్చలేదని దివ్యతో అన్నాడు. నువ్వు టాస్కులో ఎంతో సాయం చేశావ్.. అయినా సంబంధం లేకుండా తర్వాతి రోజే నిన్ను నామినేట్ చేస్తే ఏం అనుకోవాలి? ఇంత జరిగాక ఆమె పక్కన కూర్చుని జోకులేసి నవ్వుకుంటుంటే ఎలా తీసుకోవాలి? అని ప్రశ్నించాడు. రీతూతోనే కాదు, వేరేవాళ్లతోనూ మాట్లాడానని దివ్య అంది.ఏడ్చేసిన భరణి- దివ్యచెప్పాలనిపించింది చెప్పాను. నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు. వింటావా? వినవా? నీ ఇష్టం అని భరణి అన్నాడు. దీంతో.. ఎందుకిలా అపార్థం చేసుకుంటున్నారంటూ దివ్య చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆమెనలా చూసి భరణి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. మీరు ఏడవకండంటూ దివ్య భరణిని ఓదార్చింది. తర్వాత బిగ్‌బాస్ వైల్డ్‌కార్డులను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు. వీరు మిగతావారి నుంచి ఐదుగురిని సెలక్ట్ చేసుకుని గేమ్ ఆడాలన్నాడు. అందులో గెలిచి కంటెండర్‌షిప్ కాపాడుకోవాలన్నారు. ఇద్దరు కెప్టెన్స్అలా సంజన, భరణి, దివ్య, తనూజ, సుమన్ (Suman Shetty)ను ఎంపిక చేసుకుని బాల్ టాస్క్ ఆడారు. ఇందులో రమ్య, గౌరవ్, శ్రీనివాస్.. చాలా బాగా ఆడారు. ఇందులో వైల్డ్ కార్డులతో పాటు చివరి వరకు సుమన్ నిలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సూపర్ పవర్ ఉన్న నిఖిల్ కూడా కెప్టెన్సీ రేసులో నిలబడ్డాడు. లైవ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఈపాటికే అయిపోయింది. గౌరవ్, సుమన్ గెలిచి కొత్త కెప్టెన్లుగా నిలిచారు. నీతి, నిజాయితీగా ఉంటానంటూ సుమన్ ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు తన సత్తా ఏంటో చూపించాడు. ఒకేసారి ఇద్దరు కెప్టెన్లు ఉండటమనేది తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం!చదవండి: సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే! -
దెబ్బలు తగిలించుకున్న రమ్య.. ఆ ముగ్గురిలో ఒకరే కెప్టెన్!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కల్యాణ్ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్‌ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. కాకపోతే ఆ కండెండర్షిప్ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్ కార్డులు ఎంచుకున్న హౌస్‌మేట్స్‌తో తలపడి గెలిచి కంటెండర్‌షిప్ కాపాడుకోవాలన్నాడు.కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురుగార్డెన్ ఏరియాలో బాల్‌తో గోల్ చేయమని గేమ్ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్ వద్దని వైల్డ్ కార్డ్స్ అంటుంటే.. స్టార్ట్ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్ తర్వాత ఫైనల్‌గా సుమన్, గౌరవ్ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్‌కు ఇచ్చిన పవర్ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. -
బిగ్‌బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. ప్రేమికుడు చేసిన సంచలన ఆరోపణ
బిగ్‌బాస్ 9 తెలుగులో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆయేషా దుమ్మురేపుతుంది. కేరళకు చెందిన ఆమె అసలు పేరు ఆయేషా జీనత్.. అయితే, కోలీవుడ్‌లోనే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. 2019లో ఆమె నటించిన సత్య సీరియల్ తమిళ్లో పాపులర్ అయింది. దీంతో ఏకంగా సత్య-2 కూడా రన్ చేశారు. అలా తమిళ్ బిగ్‌బాస్-6లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ సుమారు 60రోజుల పాటు కొనసాగింది. తెలుగులో స్టార్‌మా సీరియల్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి ప్రాజెక్ట్‌లతో మెప్పించింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌లో కూడా తన స్టైల్లోనే పవర్‌ఫుల్‌గా టాలెంట్ చూపుతుంది.రెండుసార్లు నిశ్చితార్థంఆయేషా రెండుసార్లు నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాపర్‌గా సినిమా పరిశ్రమలోనే కొనసాగాడు. కొన్ని ప్రాజెక్ట్‌లకు వారిద్దరూ కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఆయేషా బ్రేకప్ చెప్పింది. ఇదే విషయాన్ని తమిళ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె పంచుకుంది. అయితే, 2023లో యోగేష్ (యోగి)తో డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది. కానీ, ఎంగేజ్మెంట్తోనే అతనికి కూడా ఆమె గుడ్‌బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని ఆమె పలుమార్లు చెప్పుతూ వచ్చింది. కెరీర్ మీద మాత్రమే తన ఫోకస్ ఉంటుందని, ఈ ప్రేమలు తనకు పడవని ఒక క్లారిటీ వచ్చినట్లు పలు ఇంటర్వ్యూలో తెలిపింది.మోసం చేసిందని ఆయేషాపై కామెంట్ చేసిన మొదటి ప్రేమికుడుఆయేషా హీరోయిన్గా మూడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ్ బిగ్‌బాస్‌లో చాలా వివాదాస్పద కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. తోటి కంటెస్టెంట్స్‌ను ఆవేశంతో దూషించడం వల్ల తను చెడ్డపేరు మూటకట్టుంది. దీంతో హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో వారికి క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. ఒకసారి హౌస్ట్‌గా ఉన్న కమల్ హాసన్‌నే ఎదిరించి వైరల్ అయింది. అయితే, ఆమె తమిళ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆయేషాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందని కామెంట్ చేశాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి తనను అవమానించడమే కాకుండా.. కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని మరో ఇద్దరితో ఆమె ప్రేమాయణం నడిపిందని చెప్పాడు. అయితే, అతను చేసిన ఆరోపణల గురించి ఆయేషా మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఫైనల్‌గా ఆయేషా జీవితంలో మూడు ప్రేమకథలు బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్‌లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్!
(Bigg Boss Telugu 9) వైల్డ్‌కార్డులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారో, ఏమో కానీ గొడవలు పడుతూనే ఉన్నారు. మాధురి తగ్గేదేలే అన్న లెవల్లో కొట్లాటకు సిద్ధం అవుతుంటే ఆయేషా కావాలని కొందరిని టార్గెట్ చేసి మరీ తిడుతోంది. మరి నిన్నటి (అక్టోబర్ 15వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం...ప్రాంక్ పేరుతో..సంజనాతో కలిసి ప్రాంక్ గొడవ ప్లాన్ చేసింది మాధురి (Divvala Madhuri). ప్రాంక్ పేరుతో మనసులో ఉన్న కోపం, అక్కసునంతా సంజనాపై కక్కేసింది. ఆమె తిట్ల దండకానికి జడుసుకున్న సంజనా.. వెంటనే కట్ చెప్పేసి ఇదంతా ఊరికనే చేశామని చెప్పి ఊపిరి పీల్చుకుంది. మాధురి.. దివ్యను టార్గెట్ చేసిందో ఏంటోకానీ, మరోసారి ఆమెతో గొడవపడింది. దివ్య సాధారణంగా మాట్లాడుతుంటే కూడా నువ్వెంత? అని చీప్‌గా తీసిపడేసే ప్రయత్నం చేసింది. రూల్స్ పాటించనని, తనకు నచ్చినట్లుగానే ఉంటానని, అది నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోమని దివ్యకు ఆర్డర్ వేసింది. లైవ్‌లో హౌస్మేట్స్ అందరికీ ఇంకా చాలానే ఆంక్షలు పెట్టింది.నా రూల్స్ నచ్చకపోతే వెళ్లిపోరాత్రి ఇకఇకలు పకపకలు ఉండొద్దని, లైట్స్ ఆఫ్ అయ్యాక అంతా సైలెంట్‌గా ఉండాలంది. మీ అల్లరి వల్ల తన నిద్ర చెడిపోతే క్షమించను అని వార్నింగ్ ఇచ్చింది. పొద్దున పాట వచ్చేవరకు మాట్లాడొద్దని కండీషన్ పెట్టింది. అంతగా మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాకి వెళ్లి సైలెంట్‌గా మాట్లాడుకోమంది. ఈ రూల్స్‌కు రీతూ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన మాట వినేందుకు ఇక్కడికి రాలేదు. బిగ్‌బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తా అని కరాఖండిగా చెప్పింది. నా రూల్స్ నచ్చకపోతే బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోమనగా.. నేనెందుకు వెళ్తా.. కావాలంటే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది రీతూ. మాధురి రూల్స్ పెడుతుంటే కెప్టెన్ ఏం చేస్తున్నాడో మరి!ఓవరాక్షన్ ఆపవే..కిచెన్‌లో గిన్నెలు తోమే దగ్గర ఆయేషా, రీతూకి పంచాయితీ అయింది. రాత్రి గిన్నె కడగనని ఆయేషా.. అది అర్ధరాత్రి సింక్‌లో వేశారని రీతూ గొడవపడ్డారు. నీ పని నువ్వు చేయకపోతేనే కదా అడుగుతున్నాను.. ఫస్ట్ కరెక్ట్‌గా ఉండు.. అని కోప్పడింది ఆయేషా. నువ్వు కూడా ఉండని రీతూ అనగా.. నువ్వు ఊరుకోవే.. ఏం పని చేయవు, అడిగితే న్యన్యన్య అంటావ్ అని ఆయేషా వెక్కిరించింది. మధ్యలో మాధురి కూడా దూరిపోయి రీతూపై రెచ్చిపోయింది. ఏయ్.. నీకో స్టాండ్ లేదా? అబద్ధాలు ఆడుతున్నావ్ అంటూ మండిపడింది. రీతూ కూడా తగ్గకుండా ఆమెకు కౌంటర్లిచ్చింది. ఇక గిన్నెలు తోముతున్న ఆయేషా.. ఆపవే ఓవరాక్షన్.. మాటలు ఆపేయ్ ఫస్ట్.. అంటూ రీతూను వాయించేసింది.పెద్ద లిస్ట్ చదివిన పచ్చళ్ల రమ్యమరోవైపు పచ్చళ్లపాప రమ్య మోక్ష తన సూపర్ పవర్ ఉపయోగించేసింది. ఈరోజు కోసం నిన్న ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ అంటే ఏదో బిర్యానీ, ఐస్‌క్రీమ్ అంతేగా అనుకునేరు.. కాదుకాదు! టిఫిన్‌లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ.. లంచ్‌లోకి ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, వెజ్ టిక్కా పిజ్జా.. సాయంత్రం బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు, మిక్చర్, ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్, చాక్లెట్స్.. డిన్నర్‌కు చికెన్, వెజ్ పికిల్స్, నాన్‌వెజ్ పికిల్స్.. ఇలా పేద్ద లిస్ట్ చదువుకుంటూ పోయింది. ఈ ఫుడ్‌ను హౌస్మేట్స్ అందరూ ఆస్వాదించేందుకు వీల్లేదు. కేవలం రమ్య.. ఆమె సెలక్ట్ చేసిన సుమన్ మాత్రమే కలిసి షేర్ చేసుకోవాలి.చదవండి: దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. -
చాంతాడంత లిస్ట్ ఆర్డర్ చేసిన రమ్య.. తిన్న వెంటనే వాంతులు!
వైల్డ్‌కార్డులు హౌస్‌లో అడుగుపెట్టేముందు ఒక్కొక్కరికి ఒక్కో పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). అలా పచ్చళ్లమ్ముకునే రమ్య మోక్షకు బంపరాఫర్ ఇచ్చాడు. తనకు ఎప్పుడంటే అప్పుడు.. ఏది కావాలంటే అది.. నచ్చిన వంటకాలను అడిగితే బిగ్‌బాస్ కాదనుకుండా పంపిస్తాడని నాగార్జున చెప్పాడు. ఇంత మంచి ఛాన్స్ రమ్య (Ramya Moksha) వదులుకుంటుందా? సమస్యే లేదు.పెద్ద లిస్ట్ ఇచ్చిన రమ్యటిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరీ, మైసూర్ బజ్జీ.. లంచ్‌కి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, వెజ్ టిక్కా పిజ్జా, బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు కావాలంటూ సరుకుల లిస్ట్ చదువుతూనే ఉంది. ఈ లిస్ట్ విని బిగ్‌బాస్ గుడ్లు తేలేయడం ఖాయం. ఈ ఫుడ్‌ను సుమన్‌తో షేర్ చేసుకుంటానంది. అక్కడితో ఆగలేదట! 5 కిలోల చికెన్ కూడా అడిగేసిందట! పనిలో పనిగా చికెన్ పచ్చడి పెడుతుందేమో మరి!తినలేక తంటాలుదొరికిందే ఛాన్స్ అని ఆర్డర్ పెట్టింది కానీ ఆ వంటకాలన్నీ తినలేక నానా అవస్థ పడినట్లు తెలుస్తోంది. ఏకంగా వాంతులు కూడా చేసుకుందంటున్నారు. మరి ఆర్డర్ చేసిన వంటకాలను మిగతా హౌస్‌మేట్స్‌కు పంచారా? లేదంటే రమ్య కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని బిగ్‌బాస్ ఏమైనా ఆర్డర్లు వేశారా చూడాలి! చదవండి: అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. -
అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. ఎంతో ఏడ్చా!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటం గర్ల్‌గా పలు సినిమాలు చేసింది దీప్షిక నగ్పాల్ (Deepshikha Nagpal). షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'కోయిల' మూవీ (Koyla Movie)లో ఓ అభ్యంతకర సన్నివేశంలో యాక్ట్ చేసింది. అందులో దుస్తులు తొలగిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ.. అది నిజం కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కోయిల మూవీ డైరెక్టర్ రాకేశ్ సర్ నాకు ఆ సన్నివేశం గురించి ముందే చెప్పారు. నా తల్లి ఎదురుగానే సీన్ వివరించారు. సరే, షూటింగ్ ఎప్పుడు? అని ఎటువంటి బెరుకు లేకుండా అడిగాను.డ్రెస్ ధరించే సీన్ కంప్లీట్ చేశానేను చెప్పింది అంతా గుర్తుందిగా? అని ఆయన మరోసారి క్రాస్‌చెక్ చేసుకున్నారు. గుర్తుందని బదులిస్తూనే మీరేం భయపడవద్దని ధైర్యం చెప్పాను. కెమెరాను నా ఎదురుగా కాకుండా టాప్ యాంగిల్లో పెట్టమన్నాను. కేవలం నా భుజాల వరకే కనిపించేలా జాగ్రత్తపడ్డాను. నేను డ్రెస్ తీసేస్తున్నట్లుగా మీకు కనిపించింది కానీ, మినీ టాప్, అలాగే జీన్స్ నా ఒంటిపై అలాగే ఉన్నాయి. బట్టలు ధరించే ఎంతో సులువుగా ఆ సీన్ పూర్తి చేశాం. కానీ సినిమా రిలీజయ్యాక ఆ సీన్ ఎంతో వివాదాస్పదమైంది. హేళన చేశారుకెమెరా ముందు దుస్తులు తొలగించావా? అని నా అనుకున్నవాళ్లే నన్ను దారుణంగా విమర్శించారు. ఆ మాటలకు ఎన్నోసార్లు ఏడ్చాను. ఒకసారి నా కూతురు కోయిల సినిమా సీడీని కోపంతో విరిచేసింది కూడా! సినిమాల్లోలాగే నిజ జీవితంలో కూడా నేను అలాగే చేస్తానని నా క్యారెక్టర్‌ను తప్పుపట్టారు. నా పిల్లలు కూడా నన్ను గౌరవించరని హేళన చేశారు అని చెప్తూ ఎమోషనలైంది. ఒకప్పుడు సినిమాలు చేసిన దీప్షిక.. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఈమెకు రెండు పెళ్లిళ్లవగా రెండుసార్లు విడాకులయ్యాయి. హిందీ బిగ్‌బాస్ 8వ సీజన్లో పాల్గొనగా మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయింది.చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ -
బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో జైలు జీవితం అంటే ఎవరైనా బాధపడతారు, అవమానంగా ఫీలవుతారు. కానీ, ఫ్లోరా మాత్రం తెగ సంబరపడిపోయింది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా జైల్లో అడుగుపెట్టింది. ఆమెను రిలీజ్ చేయమని బిగ్‌బాస్ కెప్టెన్‌ను ఆదేశించినప్పుడు మాత్రం తెగ బాధపడిపోయింది. అప్పుడే అయిపోయిందా! అని నిరాశచెందింది.ఐదో వారం ఎలిమినేట్దానికి కారణం.. హౌస్‌మేట్స్‌తో పెద్దగా కలవదు. తన పనేదో తను చేసుకుపోతోంది. హౌస్‌లో ఉండాలన్న ఆసక్తి కూడా తనకేమంత లేదు. ప్రతివారం ఎలిమినేషన్‌కు రెడీగా ఉంది. ఒకానొక సమయంలో తను సేవ్ అయినట్లు నాగార్జున చెప్పగానే ఏంటి? నిజమా! అని నోరెళ్లబెట్టింది. తను కోరుకున్నట్లుగా ఐదో వారం హౌస్ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేసింది. తాజాగా సాక్షి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లోరా పెళ్లి గురించి ఓపెన్ అయింది. అందుకే నాకు పెళ్లొద్దు'నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే.. పెళ్లి చేసుకున్న రెండుమూడేళ్లకే విడాకులు అవుతున్నాయి. అలా నా ఫ్రెండ్స్‌ను చాలామందిని చూశాను. కాబట్టి వివాహం జోలికి వెళ్లకూడదనుకుంటున్నా.. రిలేషన్షిప్లోనే సంతోషంగా ఉన్నాను' అని ఫ్లోరా సైనీ చెప్పుకొచ్చింది. ఫ్లోరా సైనీ మరో పేరు ఆశా సైనీ. ఈ బ్యూటీ తెలుగులో ప్రేమ కోసం, నువ్వు నాకు నచ్చావ్, చాలా బాగుంది, నవ్వుతూ బతకాలిరా, నరసింహనాయుడు వంటి పలు సినిమాలు చేసింది. పదేళ్లుగా హిందీలోనే చిత్రాలు చేస్తోంది.చదవండి: 30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ -
శ్రీజ ఎలిమినేషన్ .. సర్ఫ్ ఎక్సెల్‌తో కడిగినా సరే మరక పోదు.. ఇలా అవమానిస్తారా?
బిగ్‌బాస్ 9 నుంచి దమ్ము శ్రీజ ఎలిమినేషన్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఆడియన్స్ ఓట్స్‌తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ నుంచి పంపించేయడంతో షో పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌లలో శ్రీజ చాలా స్ట్రాంగ్ అని షో చూస్తున్న వారికి ఎక్కువగా అభిప్రాయం ఉంది. టోటల్లీ అన్‌ఫెయిర్ బిగ్‌బాస్ అంటూ కొందరు.. ఇదంతా దొంగాట అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.వాస్తవంగా శ్రీజ ఆట మొదటి రెండు వారాలు పరమ చెత్తగా ఉండేది. అయితే, ప్రియ ఎలిమినేషన్ తర్వాత తన పంతా పూర్తిగా మార్చేసుకుంది. ఒక శివంగిలా ప్రతి టాస్క్‌లలో దూసుకుపోయింది. ఎదురుగా ఎంత మంది ఉన్నా సరే సమాధానం చెబుతుంది. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంటుగా తనను తాను మార్చుకుంది. కానీ, హౌస్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల అభిప్రాయంతో ఆమెను తరిమేయడం ఏంటి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. హౌస్‌లోకి వచ్చిన ఆరుగురిలో నలుగురు శ్రీజ వద్దు అనగానే ఇలా పంపించేయడం ఏంటి..? అలాంటప్పుడు ఓట్లు, పోల్స్, వీకెండ్లో నాగార్జున షో ఎందుకు అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. ప్రజాభిప్రాయం అనేది లేనప్పుడు ఈ షో ఎందుకు అంటూ బిగ్‌బాస్‌ను తప్పుబడుతున్నారు. బిగ్‌బాస్‌లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమె జర్నీని కూడా చూపించకుండా చాలా అవమానకరంగా ఇలా గెంటేయడం ఏంటి దుమ్మెత్తిపోస్తున్నారు. సర్ఫ్ ఎక్సెల్‌తో కడిగినా సరే బిగ్‌బాస్ చరిత్రలో ఈ మరక పోదని అంటున్నారు. మా ఇష్టం వచ్చిన వాల్లను ఇంటికి పంపించేస్తామనే దోరణిలో తెలుగు బిగ్‌బాస్ ఉంది. కేవలం రేటింగ్ కోసమే కామనర్స్‌ను తీసుకున్నారా.. ఏడుగురు హౌస్‌లోకి వెళ్తే ఇప్పటికే నలుగురు ఇంటి బాట పట్టించారు. కనీసం శ్రీజకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చి హౌస్‌లోకి రప్పించాలని , అలాగైన బిగ్‌బాస్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రీఎంట్రీపై దమ్ము శ్రీజ కామెంట్శ్రీజ ఎలిమినేషన్ వంద శాతం కావాలనే చేశారని ఎవరైనా చెబుతారు. దీంతో ఆమె రీ ఎంట్రీ కోసం చాలా సోషల్ మీడియా ఖాతాలు ఓటింగ్ పెట్టాయి. ప్రతి దానిలో ఆమె రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ గురించి ఆమె ఇలా మాట్లాడారు. దేవుని దయ వల్ల రీ ఎంట్రీ వుంటే తప్పకుండా హౌస్‌లోకి వెళ్తాను. నా కోసం ఇంత సపోర్ట్ ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. సామాన్యులకు హౌస్‌లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు. నేను ఎలిమినేషన్ అవుతానని కూడా ఊహించలేదు. సీక్రెట్ రూమ్ ఉంటుంది అనుకున్నాను. ఎప్పుడైతే నన్ను బజ్ ప్రోగ్రామ్‌కు పంపించారో అర్థం అయింది. సడెన్‌గా తీసుకున్న నిర్ణయం వల్ల నా జర్నీని కూడా టెలికాస్ట్ చేయలేదు. అని శ్రీజ అన్నారు. -
నా మీద చెయ్యేస్తే కిందేసి తొక్కుతా.. కల్యాణ్‌పై రమ్య చీప్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ఎలిమినేషన్(ఫ్లోరా సైనీ, శ్రీజ) తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చేశారు. అయితే, సోమవారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల హంగామా కనిపించింది. వాళ్ల రాకతో బిగ్‌బాస్‌లో వైల్డ్ తుపాన్ మొదలౌతుందని నాగార్జున సూచించారు. కానీ, అక్కడ అంత సీన్ ఏమీ లేదు. వచ్చిన వారందరూ కూడా పూర్తి కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష పక్కా ప్లాన్‌తోనే కల్యాణ్, తనూజలను టార్గెట్ చేశారని తెలుస్తోంది. టాప్‌లో ఉన్న వీరిద్దరిని టార్గెట్ చేస్తే వారిని ఇష్టపడని ఓటర్స్‌ను తమ వైపు లాగేయవచ్చనే స్ట్రాటజీ మొదలుపెట్టారనిపిస్తుంది.సోమవారం ఎపిసోడ్లో కెప్టెన్‌గా ఉన్న కల్యాణ్‌ను మాధురితో పాటు రమ్య టార్గెట్ చేశారు. మొదట కల్యాణ్‌తో దివ్వెల మాధురి గొడవ పెట్టుకున్నారు. కూర్చోండి మేడం అని చాలా మర్యాదగా ఆమెకు గౌరవం ఇచ్చాడు కల్యాణ్. కానీ, ఇంత చిన్న విషయానికి ఆమె గొడవకు దిగారు. నువ్వేమైనా నా బాస్ అనుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యారు. కుర్చుంటేనే మాట్లాడుతారా అంటూ వెటకారంగా అనేశారు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఈ గొడవను భరణి ఆపాలని చూసినా మాధురి మాత్రం తగ్గలేదు. అయితే, కల్యాణ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత సమయం తర్వాత మాధురి మేడం సారీ అంటూ కల్యాణ్ కోరాడు. మీరు జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. నేను చిన్నపిల్లోడినే క్షమించేయండి అంటూ కోరుతాడు. దీంతో మాధురి కూడా మంచిగానే రియాక్ట్ అయి ఆ గొడవను క్లోజ్ చేస్తారు.నోరుజారిన రమ్య మోక్షసోమవారం ఎపిసోడ్ మొత్తం కల్యాణ్ చుట్టే నడిచింది. అతనిపై రమ్య మోక్ష చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగానే ఉన్నాయి. ఒక సందర్భంలో మాధురితో కూర్చొని మాట్లాడుతూ.. కల్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అంటూ పెద్ద కామెంట్ చేసింది. శ్రీజ ఎలిమినేషన్ రౌండ్లో తన బెలూన్ కట్ చేశానని ఆ అబ్బాయి కల్యాణ్ ప్రవర్తన వేరేలా ఉందంటూ చెప్పింది. అసలు తనతో కల్యాణ్ మాట్లాడట్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎదురు పడితే ముఖం తిప్పుకోవడమే కాకుండా కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని మోక్ష చెప్పింది. అయితే, ఈ సమయంలో మాధురి కూడా రమ్యకు వంత పాడుతుంది. ఆ అబ్బాయితో మాట్లాడానికి ఇక్కడికి వచ్చామా లేదు కదా అని మాధురి చెబుతుంది. అతనికి (కల్యాణ్) అమ్మాయిల పిచ్చి ఫస్ట్.. అంటూ రమ్య మళ్లీ పైర్ అవుతుంది. ఈ సమయంలో మాధురి కూడా నోరు జారుతుంది. ఆ అబ్బాయి ప్రొఫెషన్ (ఆర్మీ) ఏంటో కూడా మర్చిపోయి ఇలా అమ్మాయిలతో చేస్తున్న బిహేవ్ బాగాలేదంటుంది.నా మీద చెయ్యి వేస్తే కిందేసి తొక్కేస్తా: రమ్యరమ్య బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక కల్యాణ్, తనూజలనే టార్గెట్ చేసింది. వారిద్దరూ ప్రస్తుతం టాప్‌లో ఉన్నారు. కాబట్టి వారిని ట్రిగ్గర్ చేస్తే.. తనకు లాభం అనే స్ట్రాటజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎవరైతే కల్యాణ్, తనూజలను ఇష్టపడరో వారందరూ రమ్య వైపు తిప్పుకునేందుకే ఇలా స్కెచ్ వేస్తుందనిపిస్తుంది. ఈ క్రమంలోనే తనూజతో కల్యాణ్ బిహేవ్ చేస్తున్న తీరుపై రమ్య గట్టిగానే రియాక్ట్ అయింది. వారిద్దరి బాండింగ్ గురించి ఆమె ఇలా కామెంట్ చేసింది. " తనూజ, కల్యాణ్‌లను చూస్తుంటే చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. ఆమె (తనూజ) మీద కల్యాణ్ చేతులు ఇలా వేసేసి తడుముతుంటే చూసేందుకు నాకే ఏదోలా ఉంది. అదే విధంగా నాతో ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా.. కిందేసి తొక్కేస్తా.. ఈ విషయంలో తనూజ ఎందుకు ఊరుకుంటుదో తెలియడం లేదు. కల్యాణ్‌ను కూడా ఆమె ఆపేయడం లేదు. హేహే అంటుందే కానీ.. అతన్ని ఆపదు. అందుకే కదా అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు. వారిద్దరి కాంబినేషన్ ఏంటో అర్థం కావడం లేదు. అంటూ రమ్య కామెంట్స్ చేసింది. అదంతా విన్న తర్వాత అక్కడే ఉన్న మాధురి కూడా నిజమే కదా అంటూ తల ఊపడం మరింత ఆశ్చర్యాన్ని ఇస్తుంది.ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు..?ఎపిసోడ్ చివరలో నామినేషన్ ప్రారంభమైంది. అయితే, వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు నామినేషన్లో లేరు. కానీ, వారి నుంచే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఇప్పటి వరకు తనూజ వల్ల సుమన్ శెట్టి, రామూ రాథోడ్ వల్ల పవన్, సంజన వల్ల భరణి నామినేట్ అయ్యారు. మిగిలిన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్లో చూపించనున్నారు. అయితే.. తనూజ , దివ్య, రాము కూడా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి (Madhuri Divvala). ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్ అంటూ హౌస్‌మేట్స్‌కు వార్నింగ్ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. అంతేగాకుండా ఇకపై తన పేరు దివ్వెల కాదు దువ్వాడ మాధురి అని ప్రకటించింది. హౌస్‌లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది.కెప్టెన్‌తో గొడవకిచెన్లో పని చేస్తున్న మాధురిని కూర్చోమన్నాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోమంటూ గౌరవంతో కుర్చీ ఆమెవైపుకు జరిపాడు. అందులోనూ పెడార్థం వెతికింది మాధురి. నేను వెళ్లాలి.. కూర్చోకపోతే ఊరుకోరా? అని అడిగింది. అప్పటికీ కల్యాణ్ ఎంతో ఓపికగా.. ఈరోజు వంట చాలా లేట్ అయింది.. రేపటినుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని సుతిమెత్తగా హెచ్చరించాడు. ఎవర్నీ లెక్క చేయని మాధురినేను అరగంట కూర్చున్నాను. అప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పుడేం చేశారు? అని తిరిగి కెప్టెన్‌నే తప్పుపట్టింది మాధురి. మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అని వార్నింగ్ ఇచ్చాడు కల్యాణ్. దీంతో దివ్య మధ్యలో కలగజేసుకుని వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వినిపించుకుంటేగా! అస్సలు లెక్కచేయలేదు. నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందన్న కల్యాణ్ మాటల్ని మాత్రం బలంగా పట్టుకుంది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్?అందుకు కల్యాణ్.. నేను గౌరవంతో కూర్చోమని చెప్పాను.. అందుకామె వెటకారంగా మాట్లాడటం అవసరమా? అని వాదించాడు. ఏయ్.. వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? అని మాధురి కల్యాణ్‌పై కోప్పడింది. అందరిపై అరిచేసిన మాధురి చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. అనాల్సిన మాటలన్నీ అనేసి లాస్ట్‌లో ఏడవడం దేనికని కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఫైర్ బ్రాండ్ అనుకున్న మాధురి అప్పుడే కన్నీటి కుళాయి తిప్పడం.. చూసేవారికి కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది. చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా -
నేను కూర్చుంటే లేచి వెళ్లిపోయేవారు.. పవన్-రీతూల లవ్‌ట్రాక్ ఫేక్!
బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ఐదోవారం ఎలిమినేషన్ పూర్తయింది. జనాల ఓటింగ్స్ తక్కువ రావడంతో ఫ్లోరా ఎలిమినేట్ అయింది. స్వయంకృతపరాధం + వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ వల్ల శ్రీజ (Srija Dammu) ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత వీరిద్దరూ నటుడు శివాజీ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ బజ్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఎంత టార్చర్ చేస్తే..ఈ సందర్భంగా శివాజీ.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నది మనసులో బలంగా పెట్టుకున్నావని, నీకు అదే పెద్ద మైనస్ అయిందని శ్రీజకు చెప్పాడు. ఇక శ్రీజ.. ఒక మనిషిని నువ్వు నెగెటివ్.. నెగెటివ్.. నువ్వు ఎవరికీ సెట్ కావు, నీతో మాట్లాడకూడదు అంటే ఆటోమేటిక్‌గా ఎక్కడో డౌన్ అవుతాం. పైగా నేను కొందరి దగ్గర కూర్చుంటే వాళ్లు అక్కడుండేవారు కాదు, వెళ్లిపోయేవారు అని తెలిపింది. అందుకు శివాజీ.. హౌస్మేట్స్ నిన్ను చూసి పారిపోతున్నారంటే ఆ రెండువారాలు ఎంత టార్చర్ చేసుంటావు? అని కౌంటరిచ్చాడు.కంటెంట్ కోసం లవ్ ట్రాక్డిమాన్ పవన్ (Demon Pawan) గురించి చెప్తూ.. 'నేను వెళ్తే లవ్ యాంగిల్ ఏదైనా ట్రై చేయొచ్చు, నాకు లవ్ యాంగిల్ వేయొచ్చేమో.. అని డిమాన్ బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నాతో అన్నాడు. కంటెంట్ కోసం అలా చేస్తున్నాడు!' అంటూ పవన్-రీతూల లవ్ యాంగిల్ ఫేక్ అని బయటపెట్టింది. నిజానికి హౌస్‌లో డిమాన్ పవన్ గేమ్ చాలా బాగా ఆడతాడు. కానీ రీతూతో లవ్ ట్రాక్ వల్ల తనపై అనవసరమైన నెగెటివిటీ వస్తోంది. తను ఎంత కష్టపడ్డా సరే అది హైలైట్ కాకుండా పోతోంది. పవన్‌కు ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్ అయిన శ్రీజ.. అతడిది ప్రీప్లాన్డ్ లవ్ ట్రాక్ అని బయటపెట్టింది.చదవండి: 'నువ్వే కావాలి'@25.. ఒక ట్రెండ్ సెట్టర్.. కానీ, వదిలేసిన స్టార్ హీరో -
తన గోతిలో తనే పడ్డ శ్రీజ.. ఆడపులి రెమ్యునరేషన్ ఎంతంటే?
వరుసగా సామాన్యులను బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. మనీష్, ప్రియ, హరిత హరీశ్.. ఇప్పుడు శ్రీజ! అందదరూ తమ చేతులారా ఎలిమినేషన్‌ను కొనితెచ్చుకున్నవాళ్లే! మొదటి రెండువారాల్లో శ్రీజను చూసిన జనాలు ఈమె ఎప్పుడు వెళ్లిపోతుందిరా బాబూ.. నోరేసుకుని పడిపోతుంది! అని అసహనం వ్యక్తం చేశారు. శ్రీజ ఎలిమినేట్ కావాల్సిందే! అని బలంగా కోరుకున్నారు.అన్‌ఫెయిర్ ఎలిమినేషన్కానీ ఇప్పుడు సీన్ మారింది. శ్రీజ (Srija Dammu) ఎలిమినేషన్‌ను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కదా విజయం అంటే! తన తప్పులు తెలుసుకుంది. నాగార్జున చెప్పిన హింట్స్‌ను, వీకెండ్లో స్టూడియోలో జనాల రెస్పాన్స్‌ను అన్నింటినీ శ్రద్ధగా గమనించింది. ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చింది.వరస్ట్ నుంచి తోపు కంటెస్టెంట్‌గా..అరవడం తగ్గించింది. అవసరమైనచోట మాత్రం ఆడపులిలా నిలబడి మాట్లాడింది. ఆటలో అయితే ఆడ,మగ తేడా లేకుండా అందరిపైనా విరుచుకుపడింది. గెలుపొక్కటే నా లక్ష్యం అన్నచందంగా ఆడింది. చెత్త కంటెస్టెంట్ నుంచి తోపు కంటెస్టెంట్‌గా నిలిచింది. స్నేహితుడు పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన మాట ప్రకారం అతడిని కెప్టెన్‌ను చేసింది. ఈ క్రమంలో తనే బలిపశువైంది. గతవారం ఇంటిసభ్యులను జంటలుగా విడిపోమంటే శ్రీజ అతి తెలివితో కల్యాణ్‌తో జత కట్టలేదు. వైల్డ్‌కార్డ్స్ వల్ల గేమ్ నుంచి అవుట్ఒకే జట్టుగా ఉంటే అందరికీ ఈజీ టార్గెట్ అయిపోతామని.. చివర్లో మనిద్దర్లో ఒకరికి మాత్రమే ఏదైనా మంచి జరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. అలా పవన్.. తనూజతో, శ్రీజ.. సుమన్‌తో జత కట్టింది. గేమ్స్ అన్నీ అయిపోయేసరికి పవన్-తనూజ జట్టు సేఫ్ అయ్యారు. శ్రీజ-సుమన్ డేంజర్ జోన్లో పడ్డారు. తన స్ట్రాటజీ వల్ల పవన్‌కు కలిసొచ్చింది కానీ శ్రీజ చిక్కులో పడింది. ఇప్పుడేకంగా వైల్డ్ కార్డ్స్ ఆమెను గడ్డిపోచలా ఆటలో నుంచి తీసేశారు. ఆడపులి రెమ్యునరేషన్గెలిచే వస్తానని కొండంత ఆశలు పెట్టుకున్న శ్రీజకు ఇది జీర్ణించుకోలేని విషయం. ఏదేమైనా తిట్టిన నోళ్లతోనే ఆడపులి అని పిలిపించుకోవడమంటే ఆషామాషీ కాదు. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్న అందరిలాగే శ్రీజకు సైతం వారానికి రూ.60-70 వేల మేర రెమ్యునరేషన్ అందింది. ఈ లెక్కన ఐదు వారాలకుగానూ రూ.3 లక్షల నుంచి రూ. 3.50 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు -
నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు!
బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో దివ్వెల మాధురి (Madhuri Divvala) వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే బంధాలు, బంధుత్వాలు జాన్తానై.. ఆడేందుకు వచ్చా, గెలిచే పోతా అని ధీమాగా చెప్తోంది. అంతేకాదు, తన పేరును దువ్వాడ మాధురిగా మార్చేసుకుంది. తన ఇంట్రో వీడియోలో ఇంకా ఏమందంటే.. నాది ముక్కుసూటిగా ఉండేతత్వం.. అందుకే ఫైర్‌బ్రాండ్ అని పిలుస్తుంటారు. నాకు ఇంటర్‌లోనే పెళ్లి చేశారు. ఆరాధ్య, అర్హ, అఖిల.. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వీళ్లే నా ప్రపంచం.కలిసుందామని ప్రయత్నించా..మొదటినుంచీ నాకు, నా భర్తకు మధ్య అండర్స్టాండింగ్ తక్కువ. అయినా సరే కలిసుండేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. కానీ, అస్సలు కుదురలేదు. చివరకు విడిపోవాల్సి వచ్చింది. కుటుంబ సమస్యల వల్ల ఒంటరిగా మిగిలినప్పుడు అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు ఒంటరిగా కనిపించారు. తనతో నా జర్నీ మొదలైంది. మాధురి అంటే శ్రీనివాస్.. శ్రీనివాస్ అంటే మాధురిగా నాలుగేళ్లుగా కలిసి బతుకుతున్నాం.అర్థమైందా రాజాఅయితే ఈ నాలుగేళ్లలో నేను నరకం చూడని రోజంటూ లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో నాపై నెగెటివ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లలని చూడకుండా నా కూతుర్లని ట్రోల్ చేశారు. నిజంగా నేనేంటో మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడు దువ్వాడ మాధురి 2.0ని బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తారు, అర్థమైందా రాజా.. అని ఇంట్రో వీడియోలో పేర్కొంది. ఆయన వద్దంటే షోకి రాకపోయేదాన్నినాగార్జున దగ్గర కూడా మాట్లాడుతూ.. సమాజమంతా ఒకవైపు నిలబడితే.. నేనొకవైపు నిలబడ్డాను. నా జీవితం నాకు నచ్చితే చాలు, ఎవరికీ నచ్చాల్సిన అవసరం లేదు. దాదాపు 80% మంది నన్ను అర్థం చేసుకున్నారు. ఇంకా 20% మంది ఎందుకు నాకు నెగెటివ్‌గా ఉండాలి. వారిని కూడా నావైపు తిప్పుకోవడానికే బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్తున్నా.. దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం ఏదైనా వదులుకుంటాను. ఆయన చెప్పారు కాబట్టే ఈ షోకి వచ్చాను. ఆయన వద్దని అభ్యంతరం చెప్పుంటే రాకుండా ఉండిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. మరి దువ్వాడ మాధురి హౌస్‌లో ఎలా ఉంటుంది? వైల్డ్ ఫైర్‌లా అగ్గి రాజేస్తుందా? అనేది చూడాలి!చదవండి: పవన్‌ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా -
ఆరోజు షూటింగ్‌కి వెళ్లా.. నాన్న చనిపోయారు: రమ్య మోక్ష
బిగ్‌బాస్ 9లో ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా రమ్య మోక్ష (Ramya Moksha) హౌస్‌లో అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ.. తన జర్నీ గురించి ఏవీ వీడియోలో చెప్పుకొచ్చింది. రాజమండ్రిలో రోజ్మిల్క్ ఎంత ఫేమస్సో నేనూ అంతే ఫేమస్.. మాదొక చిన్న ఫ్యామిలీ. అమ్మా నాన్న.. రమ్య, అలేఖ్య, సుమ. ఇదే మా కుటుంబం. షూటింగ్‌కు వెళ్లిన రోజే..నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. నేను చేసిన ఫిట్నెస్ వీడియోలకు క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించాం. తక్కువ సమయంలోనే మా వ్యాపారం బాగా ఎదిగింది. ఒకరోజు సినిమా షూటింగ్ ఉందని కొడైకెనాల్ వెళ్లాను. ఆరోజు ఉదయం ఐదు గంటలకు నాన్న చనిపోయారు. నేను వచ్చేసరికి నాన్నను తీసుకెళ్లిపోయారు. సినిమా చేయకుండా ఉండాల్సిందినేను ఎంతో బతిమాలి చివరకు రెండు నిమిషాలు నాన్నను కడసారి చూసుకున్నాను. నేను ఆరోజు షూట్‌కు వెళ్లకుండా ఉండాల్సింది. అసలు ఆ సినిమాయే చేయకుండా ఉండాల్సింది అనిపించింది. నాన్న చనిపోయిన తర్వాతి వారమే ఆడియో రిలీజ్లంటూ వివాదాల్లో చిక్కుకున్నాం. ఎవరెవరో వచ్చి ఊరికనే తిట్టేవాళ్లు. చాలా ఫేస్ చేశాం. అప్పుడు మా అక్క కోపం తట్టుకోలేక రివర్స్‌లో తిట్టింది. కెరీర్‌పై ఫోకస్ పెట్టా..క్షణికావేశంలో జరిగిన తప్పు వల్ల మా జీవితాలు తారుమరయ్యాయి. బిజినెస్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు బిగ్‌బాస్‌లాంటి ప్లాట్ఫామ్లో అవకాశం దొరికితే నేను వదలుకుంటానా? కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా నేను రెడీ అని చెప్పుకొచ్చింది. మరి బిగ్‌బాస్ షోలో రమ్య మెప్పిస్తుందా? ట్రోలర్స్‌కు ఛాన్స్ ఇస్తుందా? చూడాలి! -
పవన్‌ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా
బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఐదోవారం నామినేషన్స్ పూర్తవగానే ఎలిమినేట్ అయ్యేదెవరనేది ఫిక్స్ అయిపోయింది. కానీ రీతూ, ఫ్లోరా డేంజర్ జోన్లో ఉన్నట్లు కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేశాడు నాగ్. హౌస్‌లో ఉంచినా సరే, పంపించినా సరే అన్నట్లుగా ఫ్లోరా చాలా కూల్‌గా ఉంది. కానీ, రీతూ మాత్రం ఏడుపందుకుంది. ఇద్దరినీ యాక్టివిటీ రూమ్‌కు పిలిచిన నాగ్.. చివరిసారి మీ మనసులోని మాటలు చెప్పమన్నాడు.ఆ విషయం సంజనాకు మాత్రమే తెలుసుఅప్పుడు ఫ్లోరా (Flora Saini) మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నేను నా బెడ్‌పై చాలాసార్లు ఏడ్చాను. ఆ విషయం సంజనా ఒక్కరికే తెలుసు. తను మాత్రమే నా దగ్గరకు వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు కూడా సంజనా ఒక్కరే వచ్చింది. సంజనాను నేను మిస్ అవుతాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ గేమ్ ఎంజాయ్ చేయ్ అంటూ కాస్త ఎమోషనలైంది. రీతూ వంతు రాగా ఏడుస్తూనే మాట్లాడింది.వెళ్లి పవన్‌ను హగ్ చేసుకో..పవన్, నిన్ను చాలా మిస్ అవుతా.. నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు. బాగా ఆడు.. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏకధాటిగా ఏడ్చేసింది. తర్వాత నాగ్.. ఫ్లోరా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అప్పటికీ రీతూ ఏడుపు ఆపకపోయేసరికి ఫ్లోరా.. నువ్వు సేఫ్ అయ్యావ్, ఎందుకేడుస్తున్నావ్.. హ్యాపీగా వెళ్లు, పవన్‌ను హగ్ చేసుకో అని చెప్పింది. సంజన, ఇమ్మాన్యుయేల్, దివ్య, శ్రీజలకు థంబ్స్ అప్ ఇచ్చి తనూజ, భరణికి థంబ్స్ డౌన్ సింబల్ ఇచ్చింది. సుమన్ శెట్టి.. థంబ్స్ అప్, థంబ్స్ డౌన్‌కు మధ్యలో ఉన్నాడంది. అందరికీ గుడ్‌బై చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
హీరో ప్రదీప్ డేంజర్ అన్న బ్యూటీ.. బిగ్‌బాస్ స్టేజీపై దివ్వెల మాధురి డ్యాన్స్
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్‌బాస్ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్‌బాస్‌ల హోస్ట్లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు. ప్రదీప్ చాలా డేంజర్పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్‌లు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి -
భరణికి గట్టిగానే హెచ్చరిక.. కెప్టెన్సీ కోసం కల్యాణ్, పవన్‌ల మోసం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రణరంగంలానే ఉంది. గతంలోకంటే ఎక్కువ టాస్క్‌లు పెడుతూ బిగ్‌బాస్ జోరు పెంచాడు. తాజాగా శనివారం ఎపిసోడ్ నాగార్జున ఎంట్రీతో మరింత హీట్ పెరిగింది. ఈ వారంలో భరణి చేసిన తప్పులతో పాటు రితూ, పవన్‌లను కూడా నాగ్ ఎండగట్టారు. తనూజాకు ఒక వీడియో చూపించి అసలు విషయం తెలుసుకోవాలంటూ సూచన ఇచ్చారు. ఇకనైన గేమ్ మీద ఏకాగ్రత పెట్టాలని నాగ్ సలహా ఇచ్చారు.ఈ వారం ఉత్తమ ప్రదర్శనతో ఇమ్మాన్యుయేల్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. గోల్డెన్ స్టార్ల మనసు కూడా గెలుచుకున్నాడు. దీంతో పవర్ అస్త్ర పోటీలో కూడా ఇమ్మూ తనదైన ముద్రవేశాడు. తనూజ,దివ్య రాము, కళ్యాణ్,భరణిలతో కలిసి పవర్ అస్త్ర పోటీలో ఇమ్మూ ఉన్నారు. ఈ టాస్క్‌లో పవర్ అస్త్రను అతను గెలుచుకున్నాడు.భరణిని గట్టిగానే హెచ్చిరించిన తెలంగాణ అమ్మాయితెలంగాణ అమ్మాయి శ్రుతి ప్రస్తుతం యూకేలో ఉంటుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్లో ఆమె ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొంది. ఈ క్రమంలోనే షో గురించి మాట్లాడాలని ఆమెకు నాగార్జున మైక్ ఇచ్చారు. తనకు ఫేవరేట్ ఇమ్మానుయేల్ అని చెప్పిన ఆమె భరణి ఆట మాత్రం నచ్చదని సూటిగానే చెప్పేసింది. ఇదే విషయాన్ని భరణితోనే డైరెక్ట్‌గానే అనేసింది. మీ ఆట మార్చుకోండి లేదంటే బిగ్‌బాస్‌లో మేము ఉంచమని పేర్కొంది. బంధాలు పెట్టుకున్నవాళ్లతోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉంటున్నారని చెప్పింది. బంధాలు పెట్టుకోని వాళ్లను మాత్రం కిందకు తోసేస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే శ్రీజాని కూడా తోసేశారని చెప్పింది. అది ఎంతమాత్రం ఆడియన్స్‌కు నచ్చలేదని క్లారిటీ ఇచ్చింది.పవన్, కల్యాణ్‌ల మోసంబిగ్బాస్లో చాలామందిని మెప్పించిన కంటెస్టెంట్ తనూజ.. ఈ వారంలో ఆమె ఆట బాగున్నప్పటికీ బంధాల విషయంలో కాస్త ఇబ్బంది పడిందని చెప్పాలి. ఈ క్రమంలోనే నాగార్జున ఆమెను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి మాట్లాడారు. కెప్టెన్‌గా కల్యాణ్ గెలిచాడు కదా అందుకు సబంధించిన వీడియో ఒకటి చూడాలని ప్లే చేస్తాడు. అందులో కల్యాణ్ గెలుపు కోసం డెమాన్ పవన్ తన షూస్‌తో చేసిన పనిని వీడియోలో నాగ్ చూపించారు. ఈ వీడియోలో ఏం గమనించావ్ అని తనూజని నాగ్ కోరుతారు. అతను (పవన్) కాలితో ఎటు వైపు లైట్ వెలిగిందో కళ్యాణ్‌కి చూపిస్తున్నట్లు ఉందన్ని తనూజ చెబుతుంది. దాంతో నాగార్జున అసలు విషయం చెప్తాడు. నాన్నా నాన్నా అంటూ బంధం పెంచుకున్న భరణి లైట్ ఆఫ్ చేశాడని డెమాన్ పవన్ క్లియర్‌గా కళ్యాణ్‌కి అలా తన లెగ్‌తో చూపించాడని క్లారిటీ ఇస్తాడు. కళ్యాణ్ కూడా దీని ఆధారంగానే సమాధానం చెప్పాడని నాగ్ అంటారు. కానీ, ఈ విషయం నీతో ఎవరూ చెప్పలేదని క్లారిటీ ఇస్తారు. ఇకనైనా సరే జాగ్రత్తగా ఆట ఆడాలని తనూజను నాగ్ కోరుతారు.ఆటలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా కిందపడిపోయిన భరణికొన్ని గేమ్స్‌లలో భరణి ఆడిన తీరు మెచ్చి నాగార్జున గోల్డెన్ స్టార్ ఇస్తారు. దానిని దివ్య చేతుల మీదుగా తీసుకుంటానని ఆయన కోరతాడు. దీంతో తనూజలో కనిపించని బాధను వ్యక్తం చేస్తుంది. దివ్య ఎంట్రీ తర్వాత భరణి కూడా తనూజకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే బెడ్ టాస్క్ గురించి నాగార్జున మాట్లాడుతారు. శ్రీజాని అలా తోసేయడం కరెక్ట్ అనిపించిందా భరణి అని నాగ్ అడుగుతారు. డెమాన్ పవన్ కంటే ముందే నువ్వు బెడ్ నుంచి పడిపోయావ్ కదా అని నాగ్ వీడియోతో చూపిస్తాడు. దీంతో చేసేది ఏం లేక స్వార్ధంగా ఆలోచించాను సార్ అని తప్పును ఒప్పుకుంటాడు. దీంతో నాగార్జున కూడా చురకలు అంటిస్తాడు. ‘ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు.. మా దృష్టిలో నుంచి కూడా కిందికి పడ్డావ్ అంటారు. మహాభారతంలో ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడో నువ్వు కూడా అన్ని చేస్తున్నావ్ అంటూ క్లాస్ తీసుకున్నారు. ఆటలో ముందుకు వెళ్లాల్సిన శ్రీజాను కిందకు తోసేశావ్. నీవల్ల ఆమె ఆటే ఆగిపోయింది. కేవలం పొరపాటు వల్లే జరిగింది. అని భరిణిపై గట్టిగానే నాగ్ హెచ్చరించారు. Demon Pavan gave a shoe signal to Kalyan Padala in the captaincy taskI really doubt you r a real soldierKalyan can't win a single task on his own without cheatingWorst to the coreShame on the BB team for encouraging this shit#BiggBossTelugu9 #BiggBoss9Telugu #Thanuja pic.twitter.com/b1XToXizj3— Aadarshini Aadarshini (@a_aadarshini) October 11, 2025 -
ఫ్లోరా ఎలిమినేషన్ ఫిక్స్? బిగ్‌బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా!
ఫ్లోరా సైనీ (Flora Saini).. ఈపాటికే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్! అలా అని తనపై జనాల్లో అంత వ్యతిరేకత ఉందా? అంటే రవ్వంతైనా లేదు. కానీ, తనపై పాజిటివిటీ కూడా లేదు. హౌస్‌లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించకపోవడమే ఫ్లోరాకు పెద్ద మైనస్. అయితే కామనర్స్ చేసిన ఓవరాక్షన్ వల్ల ఫ్లోరాకు ఓట్లు పడ్డాయి. తనను లేటుగానైనా పంపించొచ్చు, ముందు తలనొప్పిగా తయారైన కంటెస్టెంట్లను తరిమేద్దాం అన్న ఉద్దేశంతో మనీష్, ప్రియ, హరీశ్‌లను బయటకు తోసేశారు.స్కెచ్ వర్కవుట్ అయినట్లేనా?కానీ, తన వల్ల షోకి ఎటువంటి ప్లస్ లేకపోయేసరికి బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).. ఫ్లోరా ఎలిమినేషన్‌కు పెద్ద స్కెచ్ వేశాడు. తనను రెండువారాలు డైరెక్ట్‌గా నామినేట్ చేశాడు. పైగా ఈవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురిని హౌస్‌లో దింపుతున్నారు. కాబట్టి తనతో పనేం లేనందున ఫ్లోరాను హౌస్ నుంచి సాగనంపుతున్నారు.ఫ్లోరా ఏం చేసింది?ఫ్లోరా సైలెంట్‌గా తన పని తను చేసుకుంటూ పోతుంది. తిన్నామా, పడుకున్నామా, గేమ్స్ ఆడామా.. అంతే! అంతకుమించి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదు. సంచాలక్‌గా ఉన్నప్పుడైతే తప్పుల మీద తప్పులు చేస్తోంది. ఎవరైనా తనను నామినేట్ చేసినా, ప్రశ్నించినా సైలెంట్‌గా ఉంటుందే తప్ప తిరిగి కౌంటర్లివ్వడం చాలా అరుదు. ఇలాంటి సైలెంట్ కంటెస్టెంట్ జనాలకు అంతగా నచ్చరు. అందుకే లక్స్ పాప ఈ వారం బయటకు వచ్చేస్తోందన్నమాట!చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్: బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్, ఇద్దరితో పెళ్లి!
కుటుంబం గురించైనా, వ్యక్తిగత విషయాల గురించైనా కొందరు ఓపెన్‌గా మాట్లాడుతుంటారు. మరికొందరు మాత్రం అన్నీ గోప్యంగానే ఉంచాలనుకుంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునికా సదానంద్ (Kunickaa Sadanand) మొదటి కోవకు చెందుతుంది. దాపరికాల్లేకుండా అన్నీ బాహాటంగానే మాట్లాడుతుంది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొంది.మందుకు బానిసయ్యాబిగ్బాస్ (Bigg Boss Reality Show) హౌస్‌లో తనకున్న చెడు అలవాట్ల గురించి ఓపెన్ అయింది. నేనెప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. కానీ నాకు మందు తాగే అలవాటుంది. బ్రేకప్ అయినప్పుడు మందుకు బానిసయ్యాను. బాధతో ఇంకా ఎక్కువ తాగేసి చాలా బరువు పెరిగిపోయాను. డబ్బింగ్ చెప్పడానికి స్టూడియో వెళ్లినప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుని షాకయ్యాను. నేనిలా అయిపోయానేంటి? అనుకున్నాను. గుండెనిండా బాధతో పగలూరాత్రీ తేడా లేకుండా మద్యం సేవించేదాన్ని. పట్టపగలే బీర్ తాగేదాన్ని. యాక్టర్స్‌ను ప్రేమించలేదురాత్రి క్లబ్‌కు వెళ్లి మళ్లీ మందు తాగుతూ కూర్చునేదాన్ని. మందు తాగడం మానేయ్ అని నాన్న హెచ్చరించినా లెక్క చేయలేదు. రిలేషన్స్ విషయానికి వస్తే.. నేను ఇద్దరితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా.. నలుగురితో రొమాన్స్ చేశా.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. కానీ యాక్టర్స్‌తో మాత్రం ప్రేమలో పడలేదు. యాక్టర్స్ ఎప్పుడూ అద్దంలో వారి ముఖాన్ని చూసుకుని మురిసిపోతుంటారు. పక్కవాళ్లకంటే ముందు వారినే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ అద్దం ముందు ఉండేవాళ్లతో నేనెలా ఉండగలను? అని చెప్పుకొచ్చింది.పర్సనల్ లైఫ్కాగా కునికా సదానంద్.. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ బాబు పుట్టాడు. కానీ, దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్‌ను పెళ్లి చేసుకోగా.. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కానీ, ఈ జంట కూడా కలిసుండలేకపోయింది. భార్యాభర్తలిద్దరూ విడిపోయారు.చదవండి: వాడికి యాక్టింగ్ వద్దు.. కోహ్లి బ్యాట్ కావాలి, రోహిత్..: కరీనా కపూర్ -
వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్‌గా కల్యాణ్.. గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్ కల్యాణ్. అతడిని సేఫ్ జోన్లో పడేయడంతో పాటు కెప్టెన్ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్ 10వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..పూల్ టాస్క్కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్ జోన్లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్ జోన్లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్ జోన్‌కు పంపించేందుకు బిగ్‌బాస్ చివరి ఛాన్స్‌గా పూల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్ బాగా ఆడాడు. ఈ గేమ్‌లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.కల్యాణ్‌ను గెలిపించిన శ్రీజసేఫ్ జోన్లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలన్నది డిసైడ్ చేయమని డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్ ఉంది.. కల్యాణ్‌కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్ కల్యాణ్‌కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్‌గా నిలిచాడు.కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజకెప్టెన్సీ బ్యాండ్ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్ ప్లేయర్ అన్న దివ్యతో బ్యాండ్ కట్టించుకుని కాలర్ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్ అవ్వాల్సిన తను.. డేంజర్ జోన్‌కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్‌ను కెప్టెన్ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.చదవండి: కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్ అవార్డ్: స్టార్ డైరెక్టర్ -
బంధాల్లో చిక్కుకుపోయిన భరణి.. కొత్త కెప్టెన్ అతడే!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) బంధాల షోగా మారిపోయింది. మీరంతా రిలేషన్స్ పెట్టుకోవడానికి హౌస్‌కి రాలేదు, గేమ్ ఆడటానికి వచ్చారని నాగ్ చురకలంటించినా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. గతవారం తనూజ ఫేవరెట్ వస్తువులను భరణితో.. భరణికి ముఖ్యమైన వస్తువులను తనూజతో పగలగొట్టించి.. ఈ రిలేషన్స్‌కు ఫుల్స్టాప్ పెట్టమని డైరెక్ట్‌గా చెప్పారు. అబ్బే, తలకెక్కితే కదా!కనుక్కోండి చూద్దాంఈ బంధాల మధ్యలో ఎక్కువ నలిగిపోతుంది భరణియే (Bharani Shankar)! దానివల్ల ఇప్పుడేకంగా కెప్టెన్సీ కూడా చేజారింది. సేఫ్ జోన్లో ఉన్న ఇమ్మాన్యుయేల్, రాము, భరణి, దివ్య, పవన్ కల్యాణ్, తనూజ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. వీళ్లందరి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. తమ తలపై ఉన్న బల్బును ఎవరు ఆఫ్ చేశారో కరెక్ట్‌గా చెప్తే వాళ్లు ఎలిమినేట్!కెప్టెన్‌గా కల్యాణ్అలా దివ్య మొదటగా రామును తీసేసింది. కల్యాణ్ వంతు వచ్చేసరికి.. భరణి పేరు గెస్ చేశాడు. ఆయన తనూజ, దివ్యను ఎలాగో తీయడు. ఇమ్మాన్యుయేల్‌పై కొంత అనుబంధం ఉంది. కాబట్టి నన్ను తీసేయాలనుకున్నాడు అని కరెక్ట్‌గా గెస్ చేశాడు. అలా ఈ కనుక్కోండి చూద్దాం ఆటలో గెలిచి పవన్ కల్యాణ్ ఐదో కెప్టెన్‌గా నిలిచాడు. చదవండి: కమల్ హాసన్‌పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ -
కమల్ హాసన్‌పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభమై నెలరోజులవుతోంది. మొదటి రెండు వారాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేకుండా పోయింది. గొడవలతో అట్టుడికిన హౌస్ తర్వాత చప్పున చల్లారిపోయింది. కంటెస్టెంట్లకు ఎక్కువ హింట్స్ వెళ్లడం వల్లే అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో? అన్న జంఝాటంలో పడిపోయారు. ఇలాగైతే ఈ సీజన్.. ఆరో సీజన్ కంటే అట్టర్ ఫ్లాప్‌గా మారడం ఖాయం. ఆరుగురు కన్ఫార్మ్!అందుకే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డులను దింపబోతున్నాడు. ఈ ఆదివారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరి), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషా, శ్రీనివాస్ సాయి హౌస్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఆయేషా జీనత్‌పై కాస్త హైప్ ఎక్కువగా ఉంది. ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసింది. తమిళ బిగ్‌బాస్‌లో..తమిళంలో అనేక సీరియల్స్ చేసింది. ఉప్పు పులి కారం అనే తమిళ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. తమిళ చిత్రం రాంబోలోనూ నటించింది. అయితే ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం బిగ్‌బాస్ షో! అవును, ఆయేషా తమిళ బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్‌గా నిలిచింది. ఓపక్క అల్లరి చేస్తూ, మరోపక్క తనను విమర్శిస్తే ఉగ్రరూపం చూపిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసింది. ఆ సమయంలో ఆయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు.రెండుసార్లు పెళ్లి?ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి అవమానించారని, కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని కొంతకాలం నటుడు విష్ణుతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత అతడిని వదిలేసి యోగేశ్‌తో రిలేషన్షిప్ మొదలుపెట్టిందని ఆరోపించాడు. తనకిప్పటికే రెండుసార్లు పెళ్లయిందని బాంబు పేల్చాడు. వీటన్నింటి గురించి ఆయేషా క్లారిటీ ఇవ్వలేదు. అయితే యోగేశ్‌తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఆయేషా.. తర్వాత ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.కమల్ హాసన్‌నే ఎదిరించిన లేడీఇక షోలో ఆయేషాతో వేరే కంటెస్టెంట్లకు మధ్య ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్. హోస్ట్ బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఆయేషా మాత్రం.. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని ఎదురుతిరిగింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. బిగ్‌బాస్ షోలో రెండు నెలలవరకు కొనసాగింది. మరి ఈ బ్యూటీ ఇక్కడ కూడా వైల్డ్‌ఫైర్‌లా ఉంటుందా? తన ఆటతో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి! View this post on Instagram A post shared by AYSHA🦋 (@aysha7__official) చదవండి: ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె -
అందుకే బిగ్‌బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ
కన్నడ బిగ్‌బాస్ సీజన్– 12 (Kannada Bigg Boss 12) ఊపిరి పీల్చుకుంది. గురువారం నుంచి పునఃప్రారంభమైంది. బిడది వద్ద ఓ స్టూడియోలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌కు కాలుష్య నియంత్రణ మండలితో సహా వివిధ శాఖల అనుమతులు లేవంటూ మంగళవారం నాడు జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు ఆగమేఘాలపై షోను బంద్ చేసి హౌస్‌కు తాళం వేయడం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేకెత్తించింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే మూసివేయించారని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఇది కక్ష సాధింపు చర్యగా అభిప్రాయపడ్డారు. అయితే చివరకు హౌస్ మళ్లీ తెరుచుకుంది. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిసార్టులో ఉంచిన పోటీదారులను గురువారం తెల్లవారుజామున బిగ్‌బాస్ స్టూడియోకు తరలించారు. హౌస్‌కు వెళ్లగానే కార్యక్రమం తిరిగి మొదలైంది.డిప్యూటీ సీఎం చెప్పారు: కలెక్టరుఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనల మేరకే బిగ్‌బాస్‌కు అనుమతించినట్లు జిల్లా కలెక్టర్ యశవంత్ గురకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇద్దరు కలిసి మూతపడిన గేటును తెరిచారు. ఆ తరువాత పోటీదారులు లోపలకు వెళ్లారు. దీంతో శివకుమార్‌కు యాంకర్, హీరో కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు.బెస్కాం నోటీసులుబిగ్బాస్ స్టూడియోలో అన్ని సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించుకోవాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని బిడది బెస్కాం ఎఈఈ మోహిత నోటీసులిచ్చి వెళ్లారు. అనుమతులు లేనందువల్ల స్టూడియోకు ఎందుకు కరెంట్‌ను కట్ చేయాకూడదో చెప్పాలని నోటీసులో కోరారు. పర్యావరణ అనుమతులు లేవన్న కారణంతోనే.. బిగ్‌బాస్ ఇంటికి ఒకరోజు తాళం వేశారు. కాగా, బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా స్టూడియో ముందు కన్నడ సంఘాలు ధర్నా చేశాయి. ఇకపోతే కన్నడ బిగ్‌బాస్ 12వ సీజన్.. సెప్టెంబర్ 28న ప్రారంభమైంది.చదవండి: సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్ -
'బిగ్‌బాస్' షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కన్నడకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షూటింగ్ ఆపేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్లో బిగ్‌బాస్ సెట్ ఉన్న విషయం తెలిసిందే.కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న ప్రకారం.. బిగ్‌బాస్ హౌస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్ వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. బిగ్‌బాస్ సెట్ దగ్గరలో 250 KLD-సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ, ఆ సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని.. STP యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు గుర్తించారు.అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలు అన్నీ బహిరంగంగానే వేశారని చెబుతున్నారు. అదనంగా, 625 kVA, 500 kVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇది మరింత పర్యావరణ ఆందోళనలను రేకెత్తిస్తోందని చెప్పారు. దీంతో వెంటనే బిగ్‌బాస్ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది.బిగ్ బాస్ కన్నడ సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. కిచ్చా సుదీప్ హోస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడంతో సోషల్‌మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. -
విలన్‌గా భరణి.. తనూజ కోసం శ్రీజ బలి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5వ వారం నామినేషన్స్ కార్యక్రమం పూర్తి అయింది. అయితే, కెప్టెన్ రాము రాథోడ్ మినహా అందరినీ నామినేషన్స్‌లోకి బిగ్‌బాస్ తీసుకెళ్లాడు. కానీ, మళ్లీ వారికి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వడంతో అందరూ గందరగోళంలో పడ్డారు. ఫైనల్‌గా ఇమ్మాన్యుయేల్ (Emmanuel) టాస్క్‌లో గెలిచి ఇమ్యూనిటీని సాధించుకున్నాడు.బిగ్‌బాస్ రణరంగంలో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిపించారు. ఇమ్యూనిటీ కోసం మీరు చేస్తున్న యుద్ధంలో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్‌పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరినీ బెడ్ నుంచి కిందకి దింపాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ బెడ్‌పై ఎక్కువ సమయం ఉంటారో వారు ఇమ్యూనిటీకి అంత చేరువ అవుతారని చెప్తారు. ఈ గేమ్‌లో బలమైన కంటెస్టెంట్స్ డీమాన్, కళ్యాణ్, ఇమ్మూ, భరణి ఒక టీమ్‌గా అయిపోయి.. వారి ప్రయారటీ ప్రకారం వరుసుగా బెడ్‌పై నుంచి కిందకు తోసేస్తారు. మొదటి రౌండ్లో సంజన, తర్వాతి రౌండ్లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత దివ్య,డీమాన్, శ్రీజ ఆట నుంచి విరమిస్తారు.శ్రీజను బలంగా నెట్టేసిన భరణిచివరి రౌండ్లో భరణి, శ్రీజ, తనూజ, కళ్యాణ్, ఇమ్మూ, మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కరిని మాత్రమే కిందకు తోసేయాలి. అయితే, గతంలో ఒకసారి తనూజకి ఇమ్యూనిటీ వచ్చిందని తనని తోసేద్దామని శ్రీజ సలహా ఇచ్చింది. ఆ మాటలకు కళ్యాణ్‌తో పాటు ఇమ్మూ కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ, భరణి, తనూజకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. ఇలా వారందరూ చర్చలు చేస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా భరణి ఒక్కడే శ్రీజని బలంగా కిందకి తోసేశాడు. ఈ క్రమంలో శ్రీజకి గాయం కూడా అయింది. దీంతో శ్రీజను ఓదార్చేందుకు భరణి వెళ్తాడు. ఇలా మంచితనంగా నటించకండి అన్నా అంటూ భరణిపై శ్రీజ పైర్ అవుతుంది. చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా తోసేయడం ఏంటి అంటూ సీరియస్ అయింది. మంచోడిలా నటించకండి. నీలా మంచిదానిలా నటించడం నాకు రాదన్నా.. అంటూ బాధ పడుతుంది. రేలంగి మావయ్యలా నటిస్తున్నావంటూ భరణిని శ్రీజ దుమ్ములేపింది. ఇక్కడ గెలిచిన భరణి, తనూజ, కళ్యాణ్, ఇమ్మూలకు గాలి- నిప్పు- నీరు టాస్క్‌ను బిగ్‌బాస ఇస్తాడు. ఇందులో విజేతగా ఇమ్మాన్యుయేల్ నిలుస్తాడు.కన్నీళ్లు పెట్టుకున్న దివ్యఈ టాస్క్‌లో అమ్మాయిల నుంచి ఎక్కువగా పోరాడింది దివ్య మాత్రమే... నమ్మిన భరణి కూడా తనకు సాయం చేయకపోవడంతో ఆమె బాధ పడింది. భరిణి ఎక్కువగా తనూజకు మాత్రమే అండగా నిలబడటం దివ్య సహించలేకపోయింది. బెడ్ మీద నుంచి తనను తోసేస్తున్నా కూడా భరణి అడ్డు పడలేదు. ఆపై అమ్మాయిలు ఎవరూ కూడా ఆమె కోసం నిలబడలేదు. దీంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంది.విలన్‌గా భరణి..బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో చివర రౌండ్ జరుగుతున్న సమయంలో మాటల్లో పెట్టి శ్రీజను భరణి తోసేశారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. గతంలో తనూజకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆమె కిందకు పంపితే బాగుంటుందని శ్రీజ చెబుతుంది. అందరూ శ్రీజ కరెక్ట్ అంటున్న సమయంలో తనూజ కోసం భరణి చేసిన పని ఎంత మాత్రం కరెక్ట్ కాదని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ఈ టాస్క్‌లో దివ్య తర్వాత ఎక్కువగా గేమ్ ఆడింది కూడా శ్రీజానే.. కానీ, తనూజ మాత్రం కనీసం ఆటలో భాగం కాకుండా అలా ఉండిపోయింది. ఆమెను సేవ్ చేసి శ్రీజను తొలగించడం ఎవరికీ నచ్చలేదు. గతంలో సుమన్‌కు ఇమ్యూనిటీ వచ్చిందనే కదా కిందకు తోసేశారు.. మరి తనూజాను ఎందుకు తోయలేదంటూ భరణిని ప్రశ్నిస్తుంది. ఇలా బుల్లెట్ లాంటి ప్రశ్నలతో శ్రీజ దుమ్ములేపుతుంది. రేలంగి మామయ్య రూపంలో ఉన్న విలన్ భరణి అంటూ విమర్శలు వస్తున్నాయి. -
2015లో మిస్క్యారేజ్.. ఇన్నాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన పింకీ
'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో పింకీ గుర్తుందిగా.. ఇప్పుడా పింకీ తల్లి కాబోతోంది. పింకీ అలియాస్ సుదీప (Sudeepa Pinky) గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్త శ్రీరంగనాథ్తో కలిసి మెటర్నటీ షూట్ చేయించుకోగా.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది.. ప్రేమ మమ్మల్ని బలంగా ఉంచింది. ఇప్పుడు మా కుటుంబం పెద్దదవుతోంది అని రాసుకొచ్చింది. అయితే తనకు ఈ మధ్యే డెలివరీ అయిందని, మెటర్నటీ షూట్ ఫోటోలను ఆలస్యంగా పోస్ట్ చేసిందంటున్నారు. మరి తన డెలివరీ గురించి సుదీప క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.2015లో మిస్క్యారేజ్సుదీపకు పెళ్లయి దాదాపు 12 ఏళ్లవుతోంది. 2015లో తొలిసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించింది. 2015లో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ, అప్పుడు రెడీగా లేను. అయినా సరే, చూద్దామని ప్రెగ్నెన్సీని అలాగే ఉంచుకున్నాను. కొంతకాలానికి పొట్టలో బిడ్డతో మాట్లాడటం మొదలుపెట్టాను. బేబీ హార్ట్‌బీట్ కూడా బాగానే ఉంది. నాకు థైరాయిడ్ సమస్య ఉండేది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, థైరాయిడ్ ఎక్కువవడంతో బిడ్డను కోల్పోయాను అని చెప్తూ ఏడ్చేసింది.సినిమా1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో వచ్చిన ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పింకీ. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ఆ మధ్య తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొంది. అందరినీ కమాండ్ చేస్తూ బాస్ లేడీ అన్న ట్యాగ్ అందుకుంది. ఆరోవారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించనేలేదు. View this post on Instagram A post shared by Pinky Sudeepa (@pinky_sudeepaofficial) చదవండి: నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య -
నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య
బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్.. వరుసగా షోకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు ఐదో వికెట్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. కెప్టెన్ రాము మినహా అందరూ నామినేట్ అయినట్లు ప్రకటించాడు. కానీ ఇక్కడే ఓ అవకాశం కల్పించాడు. ఇమ్యూనిటీ దక్కించుకుని ఈ గండం గట్టెక్కవచ్చని తెలిపాడు. బలమున్నోడిదే గెలుపుఅందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ పెద్ద బెడ్‌ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. నామినేట్ అయినవాళ్లంతా ఆ బెడ్ ఎక్కి.. ఒక్కొక్కరిని కిందకు తోసేస్తూ ఉండాలి. బెడ్‌పై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ అందుతుంది. మొదట అందరూ కలిసి ఫ్లోరాను, తర్వాత సంజనాను తోసేసినట్లు తెలుస్తోంది. సుమన్, డిమాన్ పవన్‌ను కూడా తోసేశారు. దివ్యను తీసేయడానికి వస్తుంటే ఆమె తిరగబడింది. ఏ కారణంతో తీసేస్తున్నారని నిలదీసింది. ఎవరికీ ఏం పాయింట్ లేదని ఇమ్మాన్యుయేల్ కూల్‌గా ఆన్సరిచ్చాడు. నిలదీసిన దివ్యదాంతో దివ్యకు మరింత తిక్కరేగింది. ఈ రౌండ్లో నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్పులు పోతాయి, మీ బాండ్లు పోతాయి.. అని ఆవేశంతో ఊగిపోయింది. దీంతో శ్రీజ.. ధైర్యం, దమ్ము అనే పదాలు అనవసరంగా వాడుతున్నావని కౌంటరిచ్చింది. భరణి అన్న నిన్ను తోసేయడానికి రాలేదు.. అంటే స్నేహం కోసం ఆగిపోయాడా? అని నిలదీసింది. అలా గొడవలు, తోసుకోవడాలతోనే ఈ గేమ్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఫ్లోరా, సుమన్, డిమాన్ పవన్, సంజనా, తనూజ, రీతూ చౌదరి, దివ్య నిఖిత నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్‌గా జరుపుకుంటా!: శివజ్యోతి -
ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్‌గా జరుపుకుంటా!: శివజ్యోతి
బిగ్‌బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శివజ్యోతి (Shiva Jyothi) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. వచ్చే ఏడాది తన పొత్తిళ్లలోకి పండంటి బిడ్డ రానుందని ఈ మధ్యే ప్రెగ్నెన్సీ వార్తను షేర్ చేసింది. పెళ్లయిన పదేళ్లకు తల్లి కాబోతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా శివజ్యోతి సీమంతం జరిగింది. మా ఇద్దరి హృదయాలు ఓ చిన్ని గుండెచప్పుడి కోసం ఎదురుచూస్తున్నాయంటూ ఐదో నెల సీమంతం ఫోటోలను షేర్ చేసింది.మీరు లేకుండా ఎలా?ఇది చూసిన చాలామంది మమ్మల్ని ఎందుకు పిలవలేదు అక్కా? అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో శివజ్యోతి.. ఇది ఊర్లో జరిగిన వేడుక అని.. 7 లేదా 9వ నెలలో మళ్లీ ఘనంగా సీమంతం వేడుకలు జరుపుకుందామని చెప్పుకొచ్చింది. మీరు నాకు చాలా ఇంపార్టెంట్, నా బిడ్డ కోసం మీరంతా ఎదురుచూశారు. మీరు లేకుండా నా సీమంతం ఎలా జరుగుతుంది? అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అంటే మరోసారి ఈ వేడుకను మరింత గ్రాండ్‌గా జరుపుకోనుందన్నమాట!ఎవరీ శివజ్యోతి?శివజ్యోతి.. తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు పొందింది. తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అక్కడినుంచి బిగ్‌బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టి పాపులారిటీ దక్కించుకుంది. ఈ షోలో టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షో తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ షోలలో పాల్గొంటూ బాగానే సంపాదించింది. తన ఊరికి చెందిన గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి -
జడుసుకున్న దివ్య.. రీతూ ఓవరాక్షన్! ఆ ముగ్గురు మాస్క్‌తోనే..
Bigg Boss Telugu 9: సండే ఎపిసోడ్ అంటే ఆటపాటలతోనే సాగిపోతోంది. కానీ ఈ సీజన్లో హుషారుగా డ్యాన్సులే చేయడం లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో తోపులనిపించుకునే డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ మైండ్ గేమ్‌లో చాలా వీక్ అని ఇట్టే తేలిపోయింది. హరీశ్ ఎలిమినేషన్‌తో ఇద్దరు షాక్‌లో ఉన్నారు. ఇంకా ఏం జరిగిందో నేటి (అక్టోబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సరదా గేమ్స్నాగార్జున (Nagarjuna Akkineni) ఫస్ట్ హౌస్‌మేట్స్‌తో కొన్ని గేమ్స్ ఆడించాడు. కొందరికి ఫిజికల్ గేమ్, మరికొందరికి మైండ్ గేమ్, ఇంకొందరికి ఇమిటేట్ చేయమని టాస్క్.. ఇలా రకరకాల పనులు అప్పగించాడు. పవన్, కల్యాణ్ ఇద్దరూ మైండ్ గేమ్స్‌లో వీక్ అని చెప్పకనే చెప్పారు. రీతూ.. తనకు బలం బాగానే ఉందని నిరూపించింది. ఇక ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వస్తున్న నాగ్.. రీతూ చౌదరి సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఏడ్చేసిన రీతూఅయితే ఎలిమినేట్ అవుతానని ఊహించిందో, ఏమో కానీ రీతూ (Rithu Chowdary) ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూసి నాగ్ సైతం షాకయ్యాడు. దీంతో తనవి ఆనంద భాష్పాలు అంటూనే ఐ లవ్యూ సర్ అంది. ఇన్ని సీజన్స్ చేశాను.. ఇటువంటి రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు నాగ్. రీతూ ఏడుపు కాస్త ఓవరాక్షన్లాగే కనిపించింది. చివర్లో హరీశ్, దివ్య మిగిలారు. వీరిలో హరీశ్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించాడు. వైల్డ్ కార్డ్‌గా వచ్చాను, పంపించేస్తారేమో అని భయంతో ఉన్న దివ్యకు తను సేఫ్ అని తెలియగానే అప్పటిదాకా ఉన్న భయం అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. శ్రీజకు తుత్తర ఎక్కువేఇక హరీశ్ (Mask Man Harish) వెళ్లిపోయే ముందు హౌస్‌లో మాస్క్ వేసుకున్న వారి బండారం బయటపెట్టాడు. ఇమ్మాన్యుయేల్, భరణి, డిమాన్ పవన్.. ముగ్గురూ మాస్క్ వేసుకున్నారని, ఒరిజినాలిటీ, శక్తి సామర్థ్యాలు ఇంకా బయటకు రావాలని చెప్పాడు. శ్రీజ, తనూజ, పవన్ కల్యాణ్ మాస్క్ వేసుకోలేదన్నాడు. శ్రీజకు తుత్తరెక్కువే.. 10 సెకన్లు ముందే ఉంటుంది. ముందూవెనక ఆలోచించకుండా టకటకా మాట్లాడుతుంది. కానీ కొన్నిసార్లు బుల్లెట్‌లాంటి పాయింట్స్ పెడుతుంది. రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేయ్కల్యాణ్.. అగ్నిపరీక్షలో నేను నాన్న అని పిలిచింది ఒక్కర్నే.. తను తనలా ఉన్నారని నమ్ముతున్నా.. కొంచెం ఆ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా బాగా ఆడగలరు. తనూజ.. ఆమెలో నన్ను నేను చూసుకుంటా.. మా ఇద్దరి ఫేస్ సీరియస్‌గా ఉన్నట్లు ఉంటుంది, కానీ మనసులో ఏం ఉండదు. కాకపోతే ముక్కుమీద కోపం ఎక్కువ. అందుకే అసహనం, చిరాకు కనిపిస్తుంది. రిలేషన్స్ దాంట్లో పడిపోతే గేమ్‌పై ఫోకస్, క్లారిటీ మిస్ అవుతాం అని సలహాలు, సూచనలు ఇచ్చి హరీశ్ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?
హరిత హరీశ్, మాస్క్ మ్యాన్, హృదయ మానవ్.. ఇవన్నీ ఒక్కరి పేర్లే! అయినా హరీశ్.. మాస్క్ మ్యాన్‌గానే ఎక్కువ ఫేమస్. అగ్నిపరీక్షలో అతడి ముక్కుసూటితనం మెచ్చిన జడ్జిలు బిగ్‌బాస్ 9కి పంపారు. ఈ సీజన్లో తిరుగులేని కంటెస్టెంట్ అనుకున్నారు. అతడికి ఎవరూ ఎదురునిలబడలేరనుకున్నారు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో అంతా తలకిందులైంది. హౌస్‌లో అగ్గిరాజేస్తాడనుకుంటే తనే అగ్గిలో దూకి బూడిదలా మిగిలాడు (Mask Man Haritha Harish).అలక బూనిన హరీశ్ఇతడు ముక్కుసూటిగా మాట్లాడతాడు. కానీ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడే ఆగిపోతాడు. షోలో గొడవలు కామన్.. అప్పుడే పోట్లాడుకుంటారు, అంతలోనే కలిసిపోతారు. కానీ ఇతడు మాత్రం గొడవ దగ్గరే ఆగిపోయాడు. అవతలివారు కలుపుకుపోవాలన్నా కూడా దూరం పెట్టాడు. జనాలు అతడిని ఇంకొన్నివారాలు ఉంచాలనుకున్నా సరే నేను రానంటూ ఒక మూలన సైలెంట్‌గా కూర్చుండిపోయాడు. అన్నం మీద అలక చూపించాడు.ఆ ఒక్క సంఘటనతో సైలెంట్'ఇన్నాళ్లూ ఇమ్మాన్యుయేల్, భరణి మగాళ్లనుకున్నా.. కానీ ఆడవాళ్లతో ఫైట్ చేస్తున్నానని ఇప్పుడర్థమైంది' అని ఆవేశంలో ఓ కామెంట్ పాస్ చేశాడు. దీంతో ఆడవాళ్లంటే అంత చులకనా? అని అతడికి పెద్ద క్లాస్ పడింది. నా ఉద్దేశ్యం అది కాదు, నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని హర్టయ్యాడు. అప్పటినుంచి డౌన్ అవుతూ వచ్చాడు. నాగార్జున అన్నట్లుగానే ఇంట్లో వస్తువులకు, హరీశ్‌కు మధ్య పెద్ద తేడా లేనట్లుగానే కనిపించింది.ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే!తనకు ఆడాలని, హౌస్‌లో ఉండాలని కాస్తయినా ఆసక్తి లేకపోతే ప్రేక్షకులు మాత్రం ఏం చేస్తారు? అందుకే బయటకు పంపించేశారు. అయితే ఓ విషయంలో మాత్రం హరీశ్‌ను మెచ్చుకుని తీరాల్సిందే! ఓ గేమ్‌లో హరీశ్.. దివ్యను జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినా ఆమె చూసి పట్టుకోండి.. అంటూ అనవసర కామెంట్లు చేయడంతో అతడు ఆమె కాళ్లు మొక్కాడు. అక్కడ హరీశ్ అందరికీ నచ్చేశాడు. గుండెలో ఎంత బాధుంటే అలా చేస్తాడు! అని హరీశ్‌పై జాలిపడ్డారు.రెమ్యునరేషన్తను ఎలిమినేట్ అయినప్పుడు కూడా అతడి ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఇంట్లో ఉండాలని లేదు, ఇలాంటి మనుషుల మధ్య ఉండలేను అని చాలాసార్లు అన్న హరీశ్.. ఎట్టకేలకు వారి మధ్య నుంచి బయటకు వచ్చేస్తున్నందుకు లోలోన సంతోషించాడేమో! ఇకపోతే హరీశ్ వారానికి రూ.60-70 వేల మేరకు పారితోషికం తీసుకున్నాడు. ఈ లెక్కన నాలుగు వారాలకు గానూ రూ.2.50 లక్షల పైచిలుకు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది! -
ఆయన రూ. 50 ఇస్తేనే తినేవాడిని.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు: మహేశ్ విట్టా
మహేశ్ విట్టా.. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి... షార్ట్ ఫిల్మ్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చి కమెడియన్‌గానూ ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్‌బాస్ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. తండ్రి కూడా అయ్యాడు. మంచి ఫేం అయితే సంపాదించాడు కానీ ఆర్థికంగా మాత్రం ఇంకా స్థిరపడలేదంటున్నాడు మహేశ్. ఇప్పటికీ ఆయనకంటూ సొంత ఇల్లు లేదట. తనకే కాదు తన ఫ్యామిలీ వాళ్లకు కూడా ఆస్తులేమి లేవని అంటున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మహేశ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.సినిమాలంటే పిచ్చి..నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఇంటర్ అయిపోగానే నేను సినిమాల్లోకి వెళ్తా అని ఇంట్లో చెప్పా. మా వాళ్లు..చదువు అంతా పూర్తయిన తర్వాత పంపిస్తా అన్నారు. దీంతో కడప ప్రొద్దుటూరులోనే డిగ్రీ పూర్తి, హైదరాబాద్‌లో ఎంసీఏ పూర్తి చేశా. ఒక ఏడాది పాటు ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకి చెప్పి ఇండస్ట్రీకి వచ్చా. డైరెక్టర్ కావాలని నా ఆశ. వచ్చిన మూడు నెలల్లోనే నాకు ఫన్ బకెట్ సిరీస్ చాన్స్ వచ్చింది. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్. కానీ అనుకోకుండా నేను నటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్లు యాక్టింగ్ చేస్తేనే డబ్బులు ఇస్తా అన్నారు. దీంతో ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ చేశా. తినడానికి డబ్బులు లేకుంటే.. ఊరికనే ఆఫీస్‌కి వెళ్లి అటు ఇటు తిరిగేవాడిని. ఎవరైనా అడిగితే డైరెక్టర్ హర్ష పిలిచాడని అబద్దం చెప్పేవాడిని. ఆయన అడిగితే మేడం పిలిచిందని చెప్పేవాడి. ఆయనే అర్థం చేసుకొని రూ. 50 జేబులో పెట్టి తిని రమ్మని చెప్పేవాడు. అలా నన్ను ఆరు నెలల పాటు చంటి పిల్లాడిలా కాపాడాడు. ఇక్కడ లేదు.. ఊర్లో లేదు..ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చా. మంచి ఫేం అయితే సంపాదించా కానీ డబ్బులు మాత్ర జమ చేయలేదు. ఇప్పటి వరకు నాకంటూ సొంత ఇల్లు లేదు. సిటీలోనే కాదు ఊర్లో కూడా నాకు ఇల్లు లేదు. మా ఫ్యామిలీ పేరున ప్రాపర్టీస్ కూడా లేవు. ఉన్నంతలో సంతోషంగా అయితే ఉన్నాం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కోటి రూపాయలు సంపాదిస్తే చాలు హ్యాపీగా బతకొచ్చు అనుకున్నా. కానీ కోటీ రూపాయలు జమ చేయాలంటే ఎన్ని సినిమాలు చేయాలి? పైగా ఇక్కడ చాలా వరకు డబ్బులు రావు. చాలామంది నిర్మాతలు నాకు డబ్బులు ఎగ్గొట్టారు. షూటింగ్ అంతా పూర్తయ్యాక.. డబ్బులు ఇవ్వమని ముఖంపైనే చెప్పేవాళ్లు. కొంతమంది అకౌంట్లో వేస్తామని చెప్పి.. వేయరు. గట్టిగా అడుగుదామంటే.. మిగతావాళ్లకు ఎక్కడ తప్పుగా చెప్పి అవకాశాలు రాకుండా చేస్తారోననే భయం. నాకే కాదు ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులది ఇదే పరిస్థితి’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు. -
నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి
అగ్నిపరీక్షలో దుమ్ము లేపింది శ్రీజ దమ్ము (Srija Dammu). ఏ టాస్క్ ఇచ్చినా చకచకా ఆడేసేది. బ్రేకుల్లేని బైకులా మాట్లాడటం మొదలుపెడితే ఆపేదే కాదు. ఫుల్ ఎనర్జీతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో అడుగుపెట్టింది. కానీ, ఇక్కడకు వచ్చాక సీన్ రివర్స్ అయింది. తనకు ఉన్న క్రేజ్, వచ్చిన పాజిటివిటీ అంతా కూడా నెగెటివ్‌గా మారింది.గంజి తాగి స్కూలుకి..ప్రతివిషయానికి నోరేసుకుని పడిపోవడంతో శ్రీజపై నెట్టింట ట్రోల్ జరిగింది. అయితే తనపై వ్యతిరేకత వస్తున్న విషయం గ్రహించి శ్రీజ తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసింది. కాస్త సైలెంట్ అయిపోయింది. ఆటలో మాత్రం శివంగిలా ఆడుతోంది. తాజాగా శ్రీజ తండ్రి దమ్ము శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీజ చిన్నప్పుడు గంజి తాగి స్కూలుకు వెళ్లేది. సన్మానించారుతనకు ఒక్క మార్కు తక్కువ వేసినా ఊరుకునేది కాదు. ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది. అగ్నిపరీక్షకు వెళ్లే ఒకరోజు ముందు తను సెలక్ట్ అయినట్లు చెప్పింది. తనకు మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు. బిగ్‌బాస్‌కు వెళ్తానంటే సరేనన్నాం. ఎంతోమందిని దాటుకుని షో దాకా వెళ్లడమే గొప్ప విషయం. వైజాగ్ అమ్మాయి శ్రీజ.. బిగ్‌బాస్‌కు వెళ్లిందంటూ నన్ను పిలిచి మా ఊర్లో సన్మానం చేశారు.కించపరిచేలా ట్రోలింగ్నేను పారిశుద్ధ్య కార్మికుడిని. నా వృత్తిని కించపరిచేలా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్నారు. చెత్త తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ చేతులతో చెత్త పట్టుకోవడం అంత ఈజీ కాదు. నా కూతురు చెత్త బ్యాగ్ పట్టుకున్న వీడియోను.. చెత్తబండివచ్చిందమ్మా చెత్తబండి అన్న వాయిస్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. నా పనిని కించపరుస్తూ నా కూతురిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో చాలా బాధేసింది అని చెప్పుకొచ్చారు. కాగా శ్రీజ.. రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ జాబ్‌ను పక్కన పెట్టి మరీ బిగ్‌బాస్‌కు వెళ్లడం విశేషం.చదవండి: సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. రీతూది మోసం కాదట! -
అమ్మ మరణం తర్వాత సినిమాలు వద్దనుకున్నా: బిగ్‌బాస్ బ్యూటీ
కమలహాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది. ఆ హీరోయిన్స్ అంటే ఇష్టంకమల్తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. సినిమాలు వద్దనుకున్నా..ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట! -
సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. శ్రీజను ఇరికించి, రీతూది మోసం కాదని..
అందరి నోటికాడ గుడ్లు దొంగతనం చేసిన సంజనాకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి, అవతలివారు బాధపడేలా కాదని హెచ్చరించాడు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో వేయించాడు. అంతే కాదు ఓ పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అవేంటో అక్టోబర్ 4వ ఎపిసోడ్ హైలైట్స్‌లో మీరూ చూసేయండి..సంజనాను శిక్షించిన నాగ్సంజనాను దొంగ వేషాలు మానుకోమని తిట్టిపోశాడు నాగార్జున (Nagarjuna Akkineni). అంతేకాదు, ఓనర్ నుంచి తప్పించి టెనెంట్‌గా మార్చాడు. హౌస్‌లో ఏ పని కావాలన్నా సంజనాతో చేయించుకోవచ్చని ఆమెను శిక్షించాడు. ఇప్పటికైనా ఆమె తప్పు తెలుసుకోకుంటే మాత్రం సంజనా ఎక్కువకాలం హౌస్‌లో ఉండటం కష్టమే! మాస్క్ మ్యాన్ ఒంటరిగా ఉండటం గురించి చురకలు అంటించాడు నాగ్. ఇంట్లో ఉన్న వస్తువులకు, మీకూ తేడా లేనట్లే ఉందన్నాడు. గోల్డెన్ స్టార్తర్వాత కంటెస్టెంట్లకు పర్ఫామెన్స్ ఆధారంగా స్టార్ బ్యాడ్జ్‌లు ఇచ్చాడు. నాలుగు వారాలుగా కామెడీతో, ఆటతో, మాటతో మెప్పించిన ఇమ్మాన్యుయేల్‌కు గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. తర్వాత శ్రీజను లేపి.. నువ్వు ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావ్.. అంటూ కెప్టెన్సీ టాస్క్‌లో ఆమె సృష్టించిన గందరగోళం... దాని వల్ల కల్యాణ్- రీతూ, పవన్ మధ్య ఏర్పడిన అగాధం గురించి కాసేపు ప్రస్తావించాడు. శ్రీజ, సుమన్, రాము, డిమాన్, కల్యాణ్, భరణి, దివ్య, రీతూకు సిల్వర్ స్టార్ ఇచ్చాడు.తనూజను హెచ్చరించిన నాగ్హౌస్కు గెలవడానికి వచ్చావా? బంధాల కోసం వచ్చావా? ఈ బంధాలనేవి ఇంకా పెరిగితే భారంగా మారతాయి. ఏడుస్తూ ఉంటే అదే నీ ఆటను మంచేస్తుంది అని తనూజ (Thanuja Puttaswamy)కు సలహా ఇచ్చాడు. సంజనా- తనూజల పోపు గొడవ గురించి ప్రస్తావిస్తూ.. టీ కప్పులో తుపానులా.. మీ గొడవ పోపులో సునామీలా ఉందని సెటైర్లు వేశారు. రీతూ చౌదరి కెప్టెన్సీ టాస్క్‌లో.. కల్యాణ్‌ను తీసేయమని చెప్పడం కరెక్టేనని వంత పాడాడు నాగ్. కానీ తప్పించడం ఒకటే కాదు, గెలిచి చూపించాలన్నాడు. కల్యాణ్‌పై ప్రశంసలుఅటు కల్యాణ్‌తో మాత్రం.. మూడువారాలు ఆడిందేమీ లేదు, కానీ ఈవారం అదరగొట్టావ్ అని మెచ్చుకున్నాడు. అలాగే (రీతూ చేతిలో) మోసపోయావనీ అన్నాడు. సంజనాకు అసిస్టెంట్‌లా ఉన్న ఫ్లోరాకు, ఒంటరివాడిగా మిగిలిపోయిన హరీశ్‌కు బ్లాక్ స్టార్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు అనర్హులు అని ఓటింగ్ పెట్టగా మెజారిటీ ఫ్లోరాకు ఓట్లేసి ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో నాగార్జున ఆమెను వరుసగా రెండు వారాలకు నామినేట్ చేశారు.చదవండి: బిగ్‌బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే! -
పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా!
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ (Actress Hema). టాలీవుడ్లో వందలాది సినిమాలు చేసిన ఆమె ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ వస్తోంది. తాజాగా తన జర్నీ గురించి యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకుంది. హేమ మాట్లాడుతూ.. అమ్మకు సినిమాలంటే ఇష్టం. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ సపోర్ట్ లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లవుతోంది.పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదుకెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సినిమాకు, ఫంక్షన్‌కు, ఓ ఇంటర్వ్యూకు.. అలా కాసేపు బయటకు వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్డ్గా ఉంటాడు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్‌కు వెళ్లేదాన్ని. తిరిగి రాగానే మళ్లీ వంట చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్‌లో ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది. అందుకే బిగ్‌బాస్‌కు వెళ్లా..లాక్డౌన్లో 40 ఏళ్ల వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ.. ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో షోకి వెళ్లిపోయా.. బిగ్‌బాస్ హౌస్‌లో అందరికీ బాగా వండిపెట్టాను. నాకు నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను ఎదురుచెప్పలేను. బహుశా అందుకే నన్ను వారం రోజులకే ఎలిమినేట్ చేశారు. కానీ ఆ షో వల్ల ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో కలిసి చిల్ అయ్యేదాన్ని. నాగార్జున వస్తే..త్వరగానే డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. చిన్న చిన్న బిజినెస్‌లు చేశాను. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్‌కి నాగార్జున, అమలతో కలిసి వచ్చారు. గంటన్నరసేపున్నారు. ఇంకా ఉండాలనుకున్నారు. కానీ అక్కడున్నవాళ్లు ఫోటోల కోసం ఇబ్బందిపెడుతుండటంతో ఇక వెళ్లిపోండి.. అని నాగార్జునను బతిమాలి పంపించేశాను. నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ ఒక్క 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా కష్టాలపాలయ్యాను. ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది. ఈ నటి తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొంది.చదవండి: ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ -
బిగ్‌బాస్‌లోకి 'ప్రభాస్' ఫ్రెండ్‌తో పాటు మరో నలుగురికి ఎంట్రీ!
బిగ్‌బాస్-9 తెలుగులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కామనర్స్ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వారి పేర్లు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తవారు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బిగ్‌బాస్‌లో ఆట మరింత రణరంగంగా మారనుందని చెప్పవచ్చు.సినీ నటుడు ప్రభాస్ శీను(Prabhas Sreenu) బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్తున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 11,12 తేదీలలో వీరందరూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హీరో ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆయన పేరునే ట్యాగ్‌లైన్‌గా మార్చుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో సంఖ్య పెరగడంతో పాటు ఆట మరింత ఆసక్తిగా ఉండనుందని సమాచారం. బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్(Nikhil Nair) కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం. భారీ కటౌట్‌తో ఉన్న నిఖిల్ సిరీయల్స్‌తో మెప్పించాడు. ఇంటింటి గృహలక్ష్మి, పలుకే బంగారమాయెనా సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు.అలేఖ్య చిట్టి పికిల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య(Ramya) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ గురించి పెద్ద కాంట్రవర్సీ జరగడంతో ఆమె పేరు బాగా వెలుగులోకి వచ్చింది. దీంతో బిగ్‌బాస్ టీమ్ ఆమెతో సంప్రదింపులు జరిపారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్.లఘు చిత్రాలు, వెబ్ సీరిస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్(Akhil Raj) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయినట్లు సమాచారం. అయితే, సోషల్‌మీడియాలో అతనికి పెద్దగా గుర్తింపు లేదు. ఇలా బిగ్‌బాస్‌తో అందరికీ దగ్గరకావాలనే ప్లాన్ ఉన్నాడు. యూకేలో నివసిస్తున్న మౌనిషా చౌదరి(Mouneesha Chowdary) బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది. -
సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్‌స్టోరీ
దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజనా. ఒకటీరెండు కాదు ఏకంగా 8 గుడ్లు తినేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో చక్రం తిప్పడంతో కల్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు కర్త, కర్మ, క్రియ రీతూ అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు. ఇక ఇమ్మూ తన లవ్‌స్టోరీ చెప్పాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాది శాడిజం: హరీశ్సంజనా.. అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది. దాదాపు 8 గుడ్లు తినేయడంతో హరీశ్.. ఇది సైకోయిజం, శాడిజం.. మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). తనకు కల్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది. పవన్.. బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే! దీంతో బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాన్ పవన్.. కల్యాణ్‌ను ఎలిమినేట్ చేశాడు. అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు.నాలుగో కెప్టెన్తర్వాత శ్రీజ (Srija Dammu).. ఇమ్మూను ఎలిమినేట్ చేసింది. అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది. రీతూకు సపోర్ట్ చేయమని ఓరకంగా బ్లాక్మెయిల్ చేసింది తనూజ. కానీ అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తర్వాతెప్పుడైనా సాయం చేస్తాను, కానీ, ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు. అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ. మోసపోయానని బాధనన్ను గేమ్‌లో తీసేయమన్నావా? అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ (Rithu Chowdary). దీంతో చేయ్ తీయ్ అంటూ సీరియస్ అయ్యాడు. రీతూ, పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్కచేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్? అని మనసులో బాధను బయటపెట్టాడు. నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే.. ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కల్యాణ్. ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ.చూడకుండానే లవ్తర్వాత రాంబో ఇన్ లవ్ వెబ్‌సిరీస్ హీరోహీరోయిన్ హౌస్లోపలకు వచ్చారు. తమ ప్రేమకథల్ని చెప్పమన్నారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు ఓ అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది. నా నెంబర్ ఇవ్వమని అడిగింది. అలా రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు షోలు లేవు, ఫేమస్ అవలేదు. తన ముఖం చూడకుండానే ప్రేమించాను. అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చచ్చినా, బతికినా దీనితోనే కలిసుండాలనుకున్నాను. అంత మంచి అమ్మాయి. కానీ, తర్వాత షూటింగ్స్‌లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైమ్ ఇచ్చేవాడ్ని కాదు. తనకోసం కప్పు గెలుస్తా..చిరాకుపడేవాడ్ని, తిట్టేవాడ్ని. బిగ్‌బాస్‌కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా.. రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను. నా అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. ఈ నవంబర్‌కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? తనకోసం గెలవాలి, కప్పు తన చేతిలో పెట్టాలనే ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.చదవండి: అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార -
స్టార్ క్రికెటర్ సోదరి.. 'బిగ్‌బాస్'లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) హోస్ట్‌గా ‘బిగ్‌బాస్ 19’( Bigg Boss 19) ఆగష్టులో మొదలైంది. హిందీలో కొనసాగుతున్న ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే, ఈ షోలోకి భారత క్రికెటర్ అక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు బాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పలు పోస్ట్‌లు కనిపిస్తున్నాయి.ఇండియన్ క్రికెటర్ దీపక్ చాహర్(Deepak Chahar) సోదరి మాల్తీ చాహర్(Malti Chahar) హిందీ బిగ్‌బాస్-19లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ పలు సినిమాల్లో కూడా నటించింది. సోషల్‌మీడియాలో ఆమె కంటెంట్ క్రియేటర్‌గా కూడా రాణిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాల్తీకి సుమారు పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె 2014లో ఫెమినా మిస్ ఫోటోజెనిక్, మిస్ సుడోకు కిరీటాలను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్‌స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్‌లతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్‌గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది. View this post on Instagram A post shared by Malti Chahar (@maltichahar) -
తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. అతడే కొత్త కెప్టెన్!
షోలో కనిపించట్లేదు, కేవలం ఓదార్పులు తప్ప ఇంకేమీ లేదు అని మాటలు పడ్డ కల్యాణ్ గ్రాఫ్ ఈ ఒక్క ఎపిసోడ్‌తో ఎక్కడికో వెళ్లనుంది. కసిగా గేమ్ ఆడుతున్నాడు. తనను తాను నిరూపించుకుంటున్నాడు. అటు సంజనా మాత్రం తన గేమే కాదు, టీమ్ గేమ్‌ను సైతం చెడగొట్టేసింది. మరి హౌస్‌లో ఏం జరిగిందో అక్టోబర్ 2 ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రెడ్ టీమ్ బీభత్సంకెప్టెన్సీ కంటెండర్, మటన్, లగ్జరీ అంటూ కొన్ని కార్డులను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). వాటిని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నాడు. మొదట బాల్స్ గేమ్‌లో కల్యాణ్ (రెడ్ టీమ్) బాగా ఆడి గెలిచి కంటెండర్‌షిప్ సాధించాడు. నెక్స్ట్ హిప్పో గేమ్‌లో రెడ్ టీమ్ ప్లేయర్స్ ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ బీభత్సంగా ఆడారు. ఈ గేమ్‌లో సంజనా.. తన ఎల్లో టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్‌కు సహకరించింది. ఇదేంటని ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి ప్రశ్నించగా.. అన్నా, మనం ఎలాగో గెలవం.. రెడ్ టీమ్‌కు సపోర్ట్ చేద్దాం.. నువ్వు కూడా చేయ్ అని ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సుమన్ ఒప్పుకోలేదు. సంజనాపై సుమన్ అసహనంఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలవగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు కంటెండర్ షిప్ కార్డ్ అందింది. మరో గేమ్‌లో రెడ్ టీమ్ గెలిచి కిక్ ఔట్ కార్డు సాధించారు. దీని ద్వారా గ్రీన్ టీమ్(భరణి, దివ్య, శ్రీజ)ను ఆటలో లేకుండా ఎలిమినేట్ చేశారు. మరోవైపు సంజనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుమన్.. ఆమె నోట్లో నేరు పెట్టలేను. పెద్దాయన పెద్దాయన అంటూ నన్ను తొక్కేస్తోందంటూ డిమాన్ పవన్, రీతూల దగ్గర తన ఫ్రస్టేషన్ వెళ్లగక్కాడు.బోరున ఏడ్చేసిన తనూజతర్వాత బిగ్‌బాస్ కంటెండర్లుగా అర్హత సాధించిన కల్యాణ్, ఇమ్మాన్యుయేల్‌కు పెద్ద బాధ్యత అప్పగించాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీపడే మూడు జంటల్ని ఎంచుకోమన్నాడు. అలా వీరు.. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రామును మూడు జంటలుగా విభజించారు. వీళ్లకు గార్డెన్ ఏరియాలో ఓ గేమ్ పెట్టారు. అందులో తనూజ (Thanuja Puttaswamy) ఫౌల్ చేయడంతో గేమ్ నుంచి తీసేశారు. దీంతో తను బాత్రూమ్లోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. డోర్ తీయమని బతిమాలిన రీతూ.. తను కూడా లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.ఆ నలుగురే కెప్టెన్సీ కంటెండర్స్తర్వాత గేమ్స్‌లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్సయ్యారు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము కెప్టెన్సీ కోసం పోటీపడగా వీరిలో రాము కెప్టెన్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు హరీశ్ కళ్లలో భయం, బాధ కనిపించింది. ఇప్పటికే ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడంటూ అతడిపై నింద పడింది. దానివల్ల ఒంటరిగా కుమిలిపోతున్న హరీశ్.. ఓ గేమ్‌లో దివ్యను ముందుకు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి.. సరిగా పట్టుకోండి అని కావాలనే చీదరించుకుంది. తను జాగ్రత్తగా డీల్ చేసినా ఇలాంటి కామెంట్లు రావడంతో ఆయన వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాడు.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
పేరెంట్స్ చూస్తున్నారు.. లవ్ట్రాక్స్ అవసరమా? కల్యాణ్ నాతో..
ప్రియా శెట్టి (Priya Shetty)... అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు అందరూ క్యూట్ అన్నారు. తీరా బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9)కి వచ్చాక ఈమె మాకొద్దని అందరూ దండం పెట్టేశారు. ఈమె అరుపులకు, గొడవలకు చెవులకు చిల్లులు పడేలా ఉన్నాయంటూ మూడోవారమే తనను బయటకు పంపేశారు. తాజాగా తన బిగ్‌బాస్ అనుభవాన్ని బయటపెట్టింది ప్రియ. ఆమె మాట్లాడుతూ.. నేను హైపర్ యాక్టివ్. బిగ్‌బాస్ షోలో నేను నాలా ఉన్నాను. గొడవలు జరిగినప్పుడు నేనే కాదు, అందరూ అరిచారు. లేడీ లక్.. అప్పుడే నచ్చలేహౌస్లో అందరికంటే నేనే ఎక్కువ ఏడ్చాను. కానీ ఎపిసోడ్లో అది కనిపించలేదు. అగ్నిపరీక్షలో షాకీబ్తో కలిసి లేడీ లక్ అని లవ్ ట్రాక్స్ క్రియేట్ చేశారు. జనాలు నన్ను ఆ కోణంలో చూడటం నాకు నచ్చదు. అలాంటి లవ్ ట్రాకులు నాకు గిట్టవు. షోలో ప్రేమాయణాలు నడిపించడమనేది ఇష్టం లేదు. షోలో నాకెవరూ నచ్చరని ఫిక్సయ్యే షోకి వెళ్లాను. అమ్మానాన్న నాకోసం సంబంధాలు చూస్తున్నారు. నేనేమైనా పిచ్చిపనులు చేస్తే.. ఏంటండి? మీ అమ్మాయి అలా చేస్తోందని అడుగుతారు. అలాంటివన్నీ అవసరమా?అక్క అని పిల్చేవాడు కాదుఅలాంటి ట్రాకులు నాకొద్దు అని క్లారిటీతో ఉన్నాను. నాకంటూ కొన్ని హద్దులు గీసుకున్నాను. పవన్ కల్యాణ్.. నాకంటే చిన్నోడు. వాడు నన్నెప్పుడూ పెద్దమ్మ, శూర్పనఖ, పెద్దక్క అని పిలుస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు అక్క అని పిలవమంటే పిలిచేవాడు కాదు. పిలవలేక కాదు, నన్ను విసిగించాలని! గయ్యాళి, రాక్షసి అనే పిలిచేవాడు. మొదటినుంచి మా ఇద్దరి మధ్య అక్కాతమ్ముడి అనుబంధమే ఉంది. తనెప్పుడూ అసౌకర్యంగా టచ్ చేయలేదు. నేను ఏడుస్తున్నప్పుడు నన్ను ఓదార్చడానికి వస్తే.. వద్దురా బాబు, నన్ను వదిలెయ్ అని తోసేదాన్ని. కల్యాణ్‌నే కాదు ఎవర్నీ నా దగ్గరకు రానివ్వలేదు అని ప్రియ క్లారిటీ ఇచ్చింది.ఓదార్పు యాత్రబిగ్బాస్ హౌస్‌లో ట్రయాంగిల్, స్క్వేర్ అని కొన్ని ట్రాకులు నడుస్తున్నాయి. ఇద్దరు పవన్‌ల మధ్య రీతూ చౌదరి ఉండటంతో ఇదో ట్రయాంగిల్లా మారింది. ఇక పవన్ కల్యాణ్.. ఎవరైనా ఏడిస్తే చాలు ఓదార్పు యాత్ర మొదలుపెట్టేవాడు. అమ్మాయిలకు హగ్గులిచ్చి చిన్నపిల్లల్ని ఓదార్చినట్లు ఓదార్చేవాడు. తను చూసే పద్ధతి కూడా అస్సలు బాగుండేది కాదు. ఇక చాలాసార్లు ప్రియ.. అతడు హగ్ ఇవ్వడానికి వస్తుంటే తప్పించుకుని పారిపోయేది. ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రియను ప్రేక్షకులు మెచ్చుకున్నారు.చదవండి: దేనికీ భయపడను, ఎవరికీ తలవంచను: దీపికా పదుకొణె -
ఇంగ్లిష్ వచ్చా? ఎక్కడినుంచి వచ్చావ్? నోరు పారేసుకున్న సంజనా
గతంలో గౌతమ్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చి నెగెటివ్ అయ్యాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ ఓవర్ డైలాగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు సంజనా పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. మిడ్‌వీక్ ఎలిమినేట్ అయి వీకెండ్లో మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంజనా.. బ్రేకులు ఫెయిలైన బండిలా నోటికేదొస్తే అది మాట్లాడేస్తోంది. మొన్న తనూజను చీప్ అంటూ తిట్టిన ఆమె ఇప్పుడు రాముపై మాటలు వదిలింది. అసలేం జరిగిందో నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..వెరైటీ నామినేషన్స్ఈవారం నామినేషన్స్ కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). హౌస్‌మేట్స్‌తో లూడో గేమ్ ఆడించాడు. కాకపోతే డైస్ తిప్పడం.. దాని ప్రకారం ఎవరు పావులు ముందుకు జరపాలన్నది కెప్టెన్ పవన్ చేతిలో పెట్టాడు. దాంతో అతడు తనకు నచ్చిన టీమ్‌కు ఛాన్సులిచ్చుకుంటూ పోయాడు. అలా ఓ గేమ్‌లో సుమన్ శెట్టి టీమ్(సుమన్, ఫ్లోరా, రాము రాథోడ్) గెలిచింది. కెప్టెన్సీలో పవన్‌కు ఫేవర్ చేశావంటూ పాత కారణమే చెప్పి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు సుమన్. సుమన్ టీమ్‌కే మరొకర్ని నామినేట్ చేసే ఛాన్స్ రాగా.. రాము సంజనాను నామినేట్ చేశాడు.ఇంగ్లిష్ వచ్చా?మీ వల్ల హౌస్ హార్మొని చెడిపోతుంది... మేము అమ్మలం కాబట్టి ఇలా చూస్తున్నారు. వాళ్లు అమ్మాయిలు కాబట్టి అలా చూస్తున్నారు అన్న మాట నచ్చలేదని కారణాలు చెప్పాడు. దీనికి సంజనా (Sanjana Galrani) ఒప్పుకోలేదు. దీందో రామ్.. హౌస్‌లో మోస్ట్ ఆఫ్ ది వయొలెన్స్ అంటూ ఏదో చెప్పబోయాడు. వయొలెన్స్ అంటే అర్థం తెలుసా? ఇంగ్లిష్ తెలుసా? వయొలెన్స్ అంటే కొట్లాట.. అంటూ కించపరిచినట్లు మాట్లాడింది. అక్కడితో ఆగలేదు. ఎక్కడినుంచి వచ్చావో.. నువ్వు ఓపిక అనేది నేర్చుకో అని మరో మెట్టు దిగి మాట్లాడింది.హరీశ్ బెదిరింపులుఎక్కడినుంచి వచ్చావంటే ఏంటి అర్థం? అని రాము నిలదీయగా.. అందులో తపఏపముంది? నాకు తెలుగొచ్చు, మీరు నేర్పించకండి అంటూ ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత ఫ్లోరా.. తనను బెదిరించాడంటూ హరీశ్‌ను నామినేట్ చేసింది. నేను బెదిరించలేదు. తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకే సమస్యవుతుందని చెప్పాని వివరణ ఇచ్చాడు. అప్పటికీ తగ్గని ఫ్లోరా.. దివ్య మేకప్ సామాన్లు దొంగతనం చేయాలని హరీశ్ చెప్పారు. నామినేషన్స్‌లో ఆరుగురుకానీ దివ్య బట్టలు దొంగతనం అయినప్పుడు మాత్రం అది చాలా తప్పు అన్నారు. ఇదే డబుల్ ఫేస్ అంటూ బాగానే పాయింట్లు లాగింది. ఇంతలో రాము, తనూజ కూడా హరీశ్‌పై తమ పాయింట్లు చెప్పేందుకు మధ్యలో వచ్చారు. రీతూ.. శ్రీజను, శ్రీజ.. దివ్యను నామినేట్ చేశారు. ఇక ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్ నామినేట్ అయ్యారు. ఏదేమైనా మనీష్, ప్రియల ఎలిమినేషన్‌తో శ్రీజలో మార్పు వచ్చింది. అరుపులతో ఓటింగ్‌లు పడవు అని అర్థమై సైలెంట్ అయిపోయింది. కోపాన్ని, గొడవలను కాస్త పక్కనపెట్టి ఓర్పుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు -
సంజనాను కాపాడుతున్న బిగ్‌బాస్.. తనూజపై నెగటివ్
బిగ్‌బాస్ సీజన్-9 నుంచి ప్రియ ఎలిమినేట్ తర్వాత శ్రీజలో కాస్త ఎక్కువ ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్‌లో శ్రీజ చాలా జాగ్రత్తగా తన ఆట ఆడింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో దివ్య ఉంటే తాను సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనే స్ట్రాటజీ శ్రీజ వేసింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ కంటే ఇమ్యూనిటీ టాస్కులు పెట్టి బిగ్‌బాస్ తన పంతా మార్చుకున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ఇందులో భాగంగా ఇద్దరికి ముందుగానే నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. సోమవారం ఎపిసోడ్లో కిచెన్ చుట్టూ సంజన, తనూజ మధ్య పెద్ద వార్ నడిచింది. అయితే, తనూజపై సంజనా చేసిన కామెంట్స్‌ను బిగ్‌బాస్ కొన్ని టెలికాస్ట్ చేయలేదు. కేవలం తనూజాదే తప్పు అన్నట్లుగా ఎపిసోడ్లో చూపించారు. లైవ్ చూసిన నెటిజన్లు ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు.సోమవారం ఎపిసోడ్ కిచెన్ నుంచే మొదలైంది. కొంచెం పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను సంజనా అడుగుతుంది. దీనికి తనూజ ఓకే చెప్పింది. దీంతో సంజనా కిచెన్ దగ్గరికెళ్లి అక్కడున్న దివ్య, కెప్టెన్ డీమాన్‌తో చెప్పకుండానే తనపని తాను చేసుకుంటుంది. అలా మీరే ఫుడ్ చేసుకుంటే ఎలా అంటూ వాళ్లిద్దరూ ఆమెను ఆపేస్తారు. ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేశాం మళ్లీ ఇది దేనికి అని డీమాన్ అడుగుతాడు. మరోవైపు దివ్య కూడా రెడీ అవ్వాలి ఎక్కువ టైమ్ లేదంటూ కెప్టెన్‌తో చెప్పింది. అప్పుడు శ్రీజతో చేయించుకుంటానని సంజన అంటుంది. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే తనూజ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మధ్యలో శ్రీజ ఎందుకు వచ్చిదంటూ తనూజ అడుగుతుంది. దీంతో సంజనా ఫైర్ అవుతుంది. అయ్యో ఏంటమ్మా చిన్న పోపు పెట్టుకుంటా అంటే ఇంత చేస్తున్నారు అంటూ తన నోటికి పని చెప్పింది. ఆమెకు కౌంటర్‌గా తనూజ కూడా వాయిస్ పెంచింది. నా డిపర్ట్మెంట్కి వచ్చి మీరు వాయిస్ రైజ్ చేయకండి అంటూ సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే వారి మధ్య జరిగిన వాదనను పూర్తిగా బిగ్‌బాస్ చూపించలేదు.సంజనా కావాలనే ట్రిగ్గర్ చేస్తుందా..?సోమవారం ఎపిసోడ్ చూసిన వారందరూ తనూజాది తప్పు.. సంజనానే కరెక్ట్ అనుకుంటారు. కానీ, బిగ్‌బాస్ లైవ్ చూసిన వారికి మాత్రమే అసలు విషయం తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో సంజనాది మొత్తం నెగటివ్‌నే ఉంటుంది. తనూజపై ఆమె దారుణమైన కామెంట్లు చేసినప్పటికీ వాటిని టెలికాస్ట్ చేయలేదు. దీంతో తనూజపై నెగటివిటీ కనిపిస్తుంది. బిగ్‌బాస్ లైవ్ చూసిన వారందరూ ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఆమె కావాలనే కంటెస్టెంట్స్‌ను ట్రిగ్గర్ చేస్తుందని అర్థం అవుతుంది. సంజనా రీఎంట్రీ కోసం తనూజ చేసిన సాయం గురించి తెలిసిందే. కానీ, దానిని కూడా తక్కువ చేస్తూ ఆమె ఇమాన్యూల్తో విమర్శలు చేస్తుంది. అదొక సాయమా ఏంటి అంటూ దాటేసింది. ఆపై తనూజకు సిగ్గు, లజ్జా లేదంటూ సంజనా విరుచుకుపడింది. అదొక చీప్, చెత్త, చీప్ మెంటాలటీ అంటూ తనూజపై నోటికి వచ్చిన మాటలు సంజనా అనేసింది. ఆపై శ్రీజను కూడా విమర్శించింది. తన కోసం దుస్తులు కూడా త్యాగం చేయలేదంటూ శ్రీజను కూడా తిట్టేసింది. ఇవన్నీ బిగ్‌బాస్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. దీంతో అందరూ సంజనానే కరెక్ట్ అంటూ అనుకోవడం సహజమే.ఇద్దరికీ ఇమ్యూనిటీఈ వారం నామినేషన్స్ నుంచి ఇద్దరికి ఇమ్యూనిటీ లభించింది. అందుకోసం 'వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు' అంటూ ఒక టాస్క్‌ను పెట్టారు. ఇందులో 12 మందిని ఇద్దరిద్దరు చొప్పున ఆరు టీములుగా బిగ్‌బాస్ విభజించాడు. అయితే, ఫైనల్‌గా సుమన్ శెట్టి, తనూజ తమ గేమ్‌తో పాటు ఇంటి సభ్యుల సపోర్ట్‌తో ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకున్నారు.Sacrifice chesina gratitude kuda ledu 🤮 siggu lajja anta 👎🏻#BiggBossTelugu9 pic.twitter.com/ewyzHv3atI— Voice 🏎️ (@Ak12Mr_) September 30, 2025 -
అమ్మకు క్యాన్సర్.. నాన్నకలా జరిగితే ఏడవలేదు: షణ్ను ఎమోషనల్
షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth).. యూట్యూబ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగాడు. వెబ్ సిరీస్‌లు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్‌తో బాగా క్లిక్కయ్యాడు. టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్న సమయంలోనే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. అలా తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న ఇతడు బిగ్‌బాస్‌లో మాత్రం సిరి హన్మంత్‌తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.వివాదాల్లో షణ్నుషో నుంచి బయటకు వచ్చాక దీప్తి సునయనతో బ్రేకప్.. ఓ కేసులో ఇరుక్కోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతూ సినిమాలు చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత తొలిసారి షణ్ముఖ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈమేరకు గ్లింప్స్ వదిలారు. అందులో షణ్ను మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్‌పై చాలా ఆసక్తి ఉందని మా నాన్నకు చెప్తే చెప్పు తెగుద్ది అన్నారు. జీవితం అయిపోయిందనుకున్నానేను బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. తర్వాత ఓ కేసులో నా పేరు వచ్చింది. చాలా బాధపడ్డాను. దాన్నుంచి అంత ఈజీగా బయటపడలేకపోయాను. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. అలా ఒకరోజు రోడ్డుపై వెళ్తుంటే ఒక పిల్లాడు నన్ను పిలిచి, నువ్వంటే చాలా ఇష్టం అన్నా.. కానీ, ఇప్పుడు నచ్చట్లేదని చెప్పాడు. అప్పుడు నాలో ఆలోచన మొదలైంది. కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆరోజే నిర్ణయించుకున్నాను.అమ్మకు క్యాన్సర్ఈ మధ్య మా నాన్న రైలు అందుకోవాలన్న ఆత్రంతో ప్లాట్‌ఫామ్‌పై పరిగెడుతుండగా బీపీ ఎక్కువై పడిపోయాడు. ఆరోజు నేను బాధను పంటికింద బిగపట్టాను. ఎందుకంటే అమ్మకు క్యాన్సర్. తనకు సర్జరీ జరిగింది. నేను ఏడిస్తే తను ఏడుస్తుంది. అమ్మ ఏడిస్తే కుట్లు ఊడిపోతాయి. అందుకని ఆరోజసలు నేను ఏడవనేలేదు. ఏదేమైనా నేను మా నాన్నకు మంచి కొడుకును కాలేకపోయాను అంటూ షణ్ముఖ్ ఎమోషనలయ్యాడు.చదవండి: పేదల బతుకుల్లో విషాదం.. విజయ్ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్ -
కోర్ట్ జంట డ్యాన్స్.. రీతూ తల్లి వాయిస్ మెసేజ్.. దద్దరిల్లేలా దసరా ఎపిసోడ్!
మరో నాలుగు రోజుల్లో దసరా (అక్టోబర్ 2న విజయదశమి) పండగ రాబోతోంది. కానీ బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో ఈ పండగ ముందే వచ్చేసింది. నేడు దసరా స్పెషల్ ఎపిసోడ్ రానుంది. రాత్రి 7 గంటలకే ఈ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. దేత్తడి హారిక డ్యాన్స్, లిప్సిక సాంగ్, తెలుసు కదా హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, రాఖీ ఖన్నా, శ్రీనిధి శెట్టి.. కె ర్యాంప్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా స్పెషల్ ఎంట్రీతో ప్రోమో దద్దరిల్లింది. నీ గేమ్ నీకోసం ఆడు: రీతూ తల్లికోర్ట్ జంట రోషన్-శ్రీదేవి డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఫ్యామిలీ నుంచి లెటర్స్, ఆడియో మెసేజ్ మిస్సయిన హౌస్‌మేట్స్‌కు ఈరోజు బంపరాఫర్ ఇచ్చారు. ముందుగా రీతూ చౌదరికి ఆమె తల్లి పంపిన వాయిస్ మెసేజ్ వినిపించారు. హలో అమ్ములు, నేనిక్కడ బానే ఉన్నాను. నీ గేమ్ నీకోసమే ఆడుకో నాన్న. ఎవరి కోసమో నువ్వు వెళ్లలేదు. నేను దేనిగురించి అంటున్నానో నీకు తెలుసు. కొంచెం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంది. తల్లి గొంతు వినగానే రీతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అబ్బాయిలతో గేమ్ పక్కన పెట్టి నీ గేమ్ నువ్వు ఆడు అని రీతూ తల్లి చెప్పకనే చెప్పింది. మరి ఇకనైనా రీతూ మారుతుందా? లేదా? చూడాలి!చదవండి: ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన -
లత్కోర్ హరీశ్.. దారుణంగా అవమానించిన నాగ్! జుట్టు కత్తిరించుకున్న రీతూ
నామినేషన్స్‌లోనే లేని సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేసిన ఇంటిసభ్యులు.. ఏంటి? నిజమే? అంత సీన్ లేదు! అలా స్టేజీపైకి పిలిచి అందరినీ తిట్టించి మళ్లీ ఇలా హౌస్‌లోకి పంపించారు. సంజనాలోని వైల్డ్ఫైర్తో శనివారం ఎపిసోడ్ ఎంటర్టైనింగ్గానే సాగింది. ముందుగా సంజనా స్టేజీపైకి రాగానే తనకోసం స్టాండ్ తీసుకోలేదని భరణిని ఏకిపారేసింది. బిడ్డా, బిడ్డా అంటూ తలమీద పెట్టుకుని చూసుకుంటే తన తలతో ఫుట్‌బాల్ ఆడాడని రాముపై మండిపడింది. త్యాగాలు చేస్తే హౌస్‌లోకి సంజనా..అన్నపూర్ణలా వండిపెట్టాలని చెప్పే హరీశ్ ఒకే డ్రెస్సుతో నాలుగురోజులుగా వంటచేస్తున్నాడు, ఏం చెప్పినా వినడు, ఈ మనిషితో బతకడం కష్టం అని మాస్క్ మ్యాన్ గురించి తన అభిప్రాయం చెప్పింది. ఇమ్మాన్యుయేల్‌ను కప్పు నీదే అని పదేపదే నొక్కి చెప్పింది. తర్వాత సంజనాకు బై చెప్పిన నాగ్.. ఆమె వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ మళ్లీ పిలిచాడు. బిగ్‌బాస్ ఆమెను ఇంట్లోకి పంపించే అవకాశం ఇస్తున్నాడు. కానీ, దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలన్నాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్సీ వదిలేయాలన్నాడు. క్షణం ఆలోచించకుండా ఇమ్మూ తన కెప్టెన్సీ బ్యాండ్ తిరిగిచ్చేశాడు. జుట్టు కత్తిరించుకున్న రీతూతనూజకు ఎంతో ఇష్టమైన కాఫీ జోలికి సీజన్ అయిపోయేవరకు వెళ్లకూడదన్నాడు. అందుకు తనూజ కోసం ఒప్పేసుకుంది. రీతూ చౌదరిని టామ్‌బాయ్ హెయిర్‌కట్ చేయించుకోవాలన్నాడు. నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించేది, తనకోసం జుట్టు కత్తిరిచ్చుకోవడానికి రెడీ అని లేచి నిల్చుంది. దీంతో దివ్య నిఖిత.. రీతూ హెయిర్ కట్ చేసింది. జుట్టు కట్ చేస్తుంటే చిన్న పిల్లా ఏడ్చింది రీతూ. శ్రీజ ఇప్పుడు వేసుకున్న డ్రెస్‌తోనే సీజన్ అంతా ఉండాలి.. తన బట్టలన్నీ త్యాగం చేయాలన్నాడు నాగ్. ఒప్పుకోని సుమన్, శ్రీజఅందుకు శ్రీజ ఒప్పుకోలేదు. పోనీ సుమన్.. సిగరెట్స్ త్యాగం చేయాలన్నాడు.. సుమన్ కూడా కుదరదంటూ తల అడ్డంగా ఊపాడు. భరణి.. తనకెంతో ఇష్టమైన లాకెట్ బాక్స్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు. వెంటనే భరణి దిగ్గున లేచి బెడ్రూమ్లో ఉన్న బాక్స్ తీసుకుని స్టోర్ రూమ్‌లో పెట్టి ఎమోషనలయ్యాడు. తనకోసం ఈ నలుగురూ ఇంత త్యాగం చేసేసరికి సంజనా షాక్‌లో ఉండిపోయింది. ఈ త్యాగాల ఫలితంగా ఆమెను తిరిగి హౌస్‌లోకి పంపారు. ఆమె రావడమే గిట్టని హరీశ్.. డెవిల్ ఈజ్ బ్యాక్ అని కామెంట్ చేశాడు.లత్కోర్ పంచాయితీఇకపోతే నామినేషన్స్‌లో హరీశ్.. పవన్-రీతూలు చాక్లెట్ తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించిన విషయం గురించి ప్రస్తావిస్తూ లత్కోర్ పనులు అన్నాడు. దాని గురించి మాట్లాడేందుకు నాగ్.. లత్కోర్ హరీశ్ అని పిలిచాడు. నేను వ్యక్తిని అనలేదు, అతడు చేసిన పనిని మాత్రమే అన్నానని హరీశ్ వివరణ ఇచ్చాడు. అయినా నాగార్జున వినలేదు. లత్కోర్ పదం తప్పు.. నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలని క్లాస్ పీకాడు. ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చిన టాస్క్‌లో సంచాలక్‌గా తుత్తరపడ్డ శ్రీజకు.. మళ్లీ బిగ్‌బాస్ చెప్పేవరకు ఈరోజు వేసుకున్న డ్రెస్‌లోనే ఉండాలని కండీషన్ పెట్టాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ద ట్రయల్ 2 సిరీస్ రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే! -
మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్‌లా సంజనా
బిగ్ షాక్.. సంజనా ఎలిమినేట్ అంటూ అందరిచెవిలో పూలు పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). అది నమ్మించడం కోసం ఆమెను ఇప్పుడు స్టేజీపైకి తీసుకొచ్చారు. ఎలిమినేట్ అయినవాళ్లు ఎలాగైతే వీడ్కోలు చెప్తారో.. తనతోనూ అలాగే చెప్పిస్తూ భలే డ్రామా క్రియేట్ చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. సుమన్ స్టాండ్ తీసుకోడుఅందులో సంజనా (Sanjana Galrani).. నేను ఎలిమినేట్ అవ్వడానికి అంత చెడ్డపనులేమీ చేయలేదు కదా! అని అమాయకంగా ముఖం పెట్టింది. దానికి నాగార్జున.. దొంగతనం ఒక్కసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి అదే చేస్తే వాళ్లకు కూడా చిరాకొస్తుందన్నాడు. ఇక ఇంటిసభ్యుల గురించి సంజనా మాట్లాడుతూ.. సుమన్ దేనికీ స్టాండ్ తీసుకోడు. హరీశ్.. ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు. ఏం బిడ్డా? తక్కువ చూశానా?ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం. తనే గొప్ప.. తనే ప్రధానమంత్రి అని ఫీలవుతాడు. మనుషుల్ని తొక్కుతున్నాడు. అతడితో బతకలేం.. ఒక్కసారి కూడా తన తప్పు ఒప్పుకోడు. రాము (Ramu Rathod).. నేను కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా ట్రీట్ చేస్తానని చెప్పాడు. నిన్నెప్పుడు తక్కువగా ట్రీట్ చేసాన్రా బిడ్డా.. నేను చీప్ అమ్మాయినా? అని నిలదీసింది.రికార్డింగ్ ఉంది, ఊరుకో..అందుకు రాము.. నేను చీప్ అనలేదండి అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. రికార్డింగ్ ఉంది, ఊరుకో.. అని నోరు మూయించింది. భరణితో.. ప్రతిరోజు అన్నాచెల్లిలా ఉండాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు నిలబడాలంటూ అతడిని కడిగిపారేసింది. ఇక ఇమ్మూ పేరెత్తగానే అటు ఇమ్మూ, ఇటు సంజనా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఒళ్లో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తొచ్చేది అని ఏడ్చాడు. చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్ -
'బిగ్‌బాస్' సంజనాకు సుప్రీం కోర్ట్ నోటీసులు
డ్రగ్స్ కేసులో సినీ నటి సంజన గల్రానీకి సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2020లో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఆ సమయంలో సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు సినీ నటి సంజనా గల్రానీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో 14వ నిందితురాలిగా సంజనాను చేర్చారు. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో జైలు నుంచి విడుదలయ్యారు.సంజన గల్రానీపై కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాల వినియోగించడంతో పాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2024 మార్చి 25న, కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, Section 219 CrPC ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్‌లో జరపలేమని పేర్కొంది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు సంజనా గల్రానీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు గురించి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.సంజన గల్రానీ మత్తు పదార్థాలు వినియోగించడమే కాకుండా నైజీరియన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించే లాయర్ పేర్కొన్నారు.. ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో ఆమె వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించిందని, అందుకు సంబంధించిన ఆధారాలను సుప్రీం కోర్టుకు అందించారు. సినీ, రాజకీయాలతో సంబంధం ఉన్న చాలామంది డ్రగ్స్ వాడినట్టు సమాచారం ఉంది. విచారణలో వారి పేర్లు చెప్పాలని సంజనాను గతంలోనే బెంగళూరు పోలీసులు కోరారు. కానీ, ఆమె ఆ వివరాలు చెప్పలేదని సమచారం. ఇప్పుడు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో మరిన్ని వివరాలు మళ్లీ తెరపైకి రానున్నాయి.బిగ్‌బాస్9లో సంజనబిగ్బాస్9 తెలుగు సీజన్లో సంజన గల్రానీ సత్తా చాటుతున్నారు. ఈ సీజన్‌కు హైప్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందారు. అయితే, ఎలిమినేషన్ పేరుతో ఆమెను సీక్రెట్ రూమ్‌కు బిగ్‌బాస్ పంపారు. ప్రస్థుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఆమె రాణిస్తున్నారు. -
మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్‌రూమ్‌కు!
ఏమాటకామాట.. ఈ సీజన్‌కు హైప్ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి సంజనా. ఆమె గుడ్డు దొంగతనం చేయకపోయుంటే హౌస్మేట్స్ అసలు రూపాలు, ఎమోషన్స్ అంత ఈజీగా బయటపడేవి కావు. నెగెటివ్ అవుతానని తెలిసినప్పటికీ షో కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న ఆమె కోరిక, తాపత్రయం మెచ్చుకుని తీరాల్సిందే! కానీ ఒక్కసారి క్లిక్ అయింది కదా అని పదేపదే దొంగతనాలు చేయడమే ఆమె విషయంలో నెగెటివ్‌గా మారుతూ వచ్చింది. అదే ఈరోజు కొంపముంచింది. అసలేం జరిగిందో చూసేద్దాం...మళ్లీ దొంగతనం.. ఈసారి శ్రీజ తోడుబిగ్బాస్ 9లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే హౌస్‌లో ఉన్నవారిని 1 నుంచి 13 ర్యాంకుల్లో నిల్చోబెట్టింది. టాప్ 7లో నుంచే కెప్టెన్సీ కంటెండర్లున్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. తనతోపాటు సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజను కంటెండర్లుగా ప్రకటించింది. వీళ్లలో ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. మరోపక్క సంజనా.. కొత్తగా వచ్చిన దివ్య బట్టలు కాజేసి దాచిపెట్టింది. ఇందుకు శ్రీజ కూడా సాయం చేసింది. ఆమె బట్టల్ని కొట్టేయడమనేది చాలామందికి నచ్చలేదు. ఈ దొంగతనమే ఆమెను ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది.అర్ధరాత్రి సైరన్ మోగించిన బిగ్బాస్ఇక బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు సడన్‌గా ఏదో గుర్తొచ్చినవాడిలా అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటిసభ్యులను నిద్రలేపాడు. చక్రవ్యూహంలో మరో అధ్యాయానికి సమయం వచ్చింది.. ఇప్పటివరకు మీకు లభించిన ఫలాల్లో బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు ఎరుపు రంగు విత్తనాలు పొందినవారి వంతు.. వారికి ఇంట్లో ఒకర్ని బయటకు పంపే అధికారాన్నిస్తున్నా.. దివ్య నేను పంపిన సభ్యురాలు, ఫ్లోరా ఇమ్యూనిటీ గెల్చుకుంది. కాబట్టి వీరిద్దరూ మినహా.. రెడ్ సీడ్ పొందనివారిలో నుంచి ఒకర్ని బయటకు పంపాలన్నాడు. అందరి నిర్ణయం ఒక్కటేదీంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీశ్, కల్యాణ్, పవన్, రాము చర్చలు మొదలుపెట్టారు. ముందుగా హరీశ్.. ఈ షోని దొంగతనాల షో అనిపించుకోవడం నాకిష్టం లేదు. అన్నీ దొంగిలిస్తుంది.. తనది సైకో ఆనందం అంటూ సంజనా (Sanjana Galrani) పేరు చెప్పాడు. దివ్య విషయంలో అలా చేయడం నచ్చలేదని భరణి కూడా వంతపాడాడు. అందరూ ఆమె పేరే నిర్ణయించుకుని చెప్పారు. అప్పుడు సంజనా మాట్లాడుతూ.. ఈరోజు చేసిన దొంగతనంలో నేను ఒంటరిగా లేను. సంజనా అవుట్.. ఏడ్చేసిన ఇమ్మూఅలాగే దివ్య నాకు మూడో ర్యాంక్ ఇచ్చింది. నేను స్ట్రాంగ్, కాంపిటీషన్ కాబట్టే కార్నర్ చేసి పంపించేయాలనుకుంటున్నారు. ఎవరినీ నేను హర్ట్ ఏయలేదు. అందరితోనూ స్వీట్‌గానే ఉన్నాను. ఈ షో కోసం నేను 100% కాదు, 500% ఎఫర్ట్స్ ఇచ్చాను అంది. సంజనా వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయేల్ పిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు నువ్వే గెలవాలంటూ సంజనా అతడికి ధైర్యం చెప్పి బయటకు వెళ్లిపోయింది. అటు ఇమ్మూ మాత్రం కన్నీళ్లు ఆపలేదు.ఒంటరివాడ్ని అయిపోయా!నెగెటివ్ అయినా పర్లేదు, షో కోసం ఏదో ఒకటి చేస్తా.. నేను తప్పులు చేసేటప్పుడు దగ్గరకు రావొద్దని నన్ను దూరం పెట్టేది. ఇప్పుడు ఒంటరివాడ్ని అయిపోయా! ఆవిడ లేకపోతే హౌస్‌లో మజా ఉండదు. తను రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడ్చేది. రెండువారాలు ఏడుస్తూనే ఉంది. ఏరోజూ బాధను బయటకు చూపించేది కాదు అని ఏడుస్తుంటే సీక్రెట్ రూమ్‌లో ఉన్న సంజనా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భరణి, హరీశ్, రాము కూడా.. తను సీక్రెట్ రూమ్‌లో ఉండొచ్చని బలంగా నమ్మారు.చదవండి: దీపికా పదుకొణెకు మరో బిగ్ సినిమా ఛాన్స్ -
సంజనా ఎలిమినేట్! వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఈవారం మొదట్లో హౌస్‌మేట్స్‌కు కొన్ని ఫలాలిచ్చాడు. అందులో రంగురంగుల విత్తనాలున్నాయి. నీలిరంగు విత్తనం అందుకున్నవారు ఫ్యామిలీ నుంచి సర్ప్రైజ్లు అందుకున్నారు. నలుపు రంగు విత్తనం అందుకున్నవారు ఇమ్యూనిటీ కోసం పోటీపడ్డారు. ఇప్పుడిక ఎరుపు విత్తనం అందుకున్నవారికి పెద్ద టాస్కే ఇచ్చాడు బిగ్‌బాస్.గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్హౌస్లో ఒకర్ని బయటకు పంపాలన్నాడు. ఈ షోని దొంగతనాల షోగా మార్చడం నాకిష్టం లేదంటూ సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సూచించాడు హరీశ్. భరణి, రాము, డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ అందరూ కలిసి చర్చించుకున్నారు. మెజారిటీ సభ్యులు సంజనాకే ఓటేశారు. దీంతో సంజనాను వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లమన్నాడు బిగ్‌బాస్. ఆమె అలా వెళ్లడంతోనే ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడ్చాడు. కానీ, ఈ ఎలిమినేషన్ అనేది ఉట్టి డ్రామానే అని తెలుస్తోంది.నామినేషన్స్‌లోనే లేదుఆమెను అలా బయటకు పంపించినట్లే పంపించి మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు. అప్పటివరకు సీక్రెట్‌రూమ్‌లో ఉంచుతారు. అయితే ఈ విషయం హౌస్‌మేట్స్‌కు దాదాపు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే సంజనా అసలు నామినేషన్స్‌లోనే లేదు. అలాంటప్పుడు తనను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఇదంతా స్టంట్ అని అటు కంటెస్టెంట్లకు, ఇటు ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది. చదవండి: 8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్! -
వాళ్లను టాప్ 5లో పెట్టిన వైల్డ్‌కార్డ్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. అయితే దానికంటే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులను వారి ఆట,మాట ఆధారంగా వరుస ర్యాంకుల్లో నిల్చోబెట్టమన్నాడు. దాదాపు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అలాగే హౌస్‌మేట్స్‌కు ర్యాంకులిచ్చింది. రెండుమూడు మాత్రం కాస్త అటుఇటుగా ఉన్నాయి.ర్యాంకింగ్..భరణిని టాప్ 1లో, ఇమ్మాన్యుయేల్‌ను రెండో స్థానంలో, సంజనాను మూడు, డిమాన్ పవన్‌ను నాలుగు, తనూజను ఐదో స్థానంలో నిలబెట్టింది. సుమన్, రీతూ, ప్రియ, హరీశ్, శ్రీజ, కల్యాణ్, రాము, ఫ్లోరాకు వరుసగా ఆరు నుంచి 13 స్థానాలిచ్చింది. దివ్య ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 5లో ఉన్నవారు మాత్రేమ కెప్టెన్సీకి పోటీ పడతారని ప్రకటించాడు బిగ్‌బాస్.కెప్టెన్సీ టాస్క్వీరితోపాటు దివ్యను కూడా కంటెండర్‌గా అనౌన్స్ చేశాడు. వీళ్లకు తప్పిస్తారా? గెలిపిస్తారా? అన్న గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో భరణి, ఇమ్మాన్యుయేల్ చివరి వరకు పోరాడారు. హౌస్మేట్స్ సహకారంతో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్సీకి పోరాడి ఓడియాడు. మూడోసారి మాత్రం గెలిచి దక్కించుకున్నాడు. మరి ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్‌గా ప్రకటించేశారా? లేదంటే బిగ్‌బాస్ మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇచ్చాడా? అన్నది ఎపిసోడ్లో చూడాలి! చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్
అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ! ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది బిగ్‌బాస్ బ్యూటీ, నటి వితికా షెరు (Vithika Sheru). చెల్లి కృతికను చంటిపాపలా చూసుకుంటుంది. తన పెళ్లి కూడా వితిక చేతుల మీదుగానే జరిగింది. 2022లో కృతిక- కృష్ణల వివాహం ఎంతో ఆడంబరంగా, కన్నులపండగ్గా జరిగింది. రెండు రోజుల క్రితం కృతిక.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.చెల్లెలికి సర్ప్రైజ్వితికాకు అసలే సర్ప్రైజ్లంటే చాలా ఇష్టం. తన భర్తను, ఫ్రెండ్స్‌ను ఎప్పుడూ ఏదో ఒకరంగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి చెల్లెలికి ఊహించని కానుకనిచ్చింది. అదే ఆమె సీమంతం. ఒక గదిని అందంగా డెకరేట్ చేసి చెల్లెలి సీమంతం జరిపింది. ఫ్రెండ్స్, కజిన్స్ సమక్షంలో సర్ప్రైజ్ సీమంతం జరుపుకోవడంతో కృతిక మనసు సంతోషంతో నిండిపోయింది. పెద్దమ్మ గిఫ్ట్వీళ్లంతా కలిసి చిన్నపాటి బేబీ డ్రెస్‌పై బొమ్మలు పెయింట్ వేశారు. వితిక అయితే అక్షరాభ్యాసానికి రెడీగా టీషర్ట్‌పై తెలుగు అక్షరాలను గీసింది. అందులో పెద్దమ్మ అనే అక్షరాలను పొందుపరిచి వాటిని అండర్లైన్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను వితికా అభిమానులతో పంచుకుంది. అది చూసిన అభిమానులు.. మీ ఓపికను మెచ్చుకుని తీరాల్సిందే! అవతలివారి సంతోషంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటారు, గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru)చదవండి: ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి తల్లి కన్నుమూత -
బలవంతంగా ఆర్మీకి.. మాతో కలిసి భోజనం కూడా చేయడు: పవన్ పేరెంట్స్
పవన్ కల్యాణ్ పడాల.. అగ్నిపరీక్షలో ఇతడిని చూసి విన్నింగ్ మెటీరియల్ అనుకున్నారంతా! ఫోకస్ అంతా ఆటపైనే ఉండేది. ఆలోచనంతా గెలుపుపైనే ఉండేది. ఇలాంటి వ్యక్తి బిగ్‌బాస్ షోలో అడుగుపెడితే అసలైన మజా ఉంటుంది, అవతలి కంటెస్టెంట్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని భ్రమింపజేశాడు. కానీ, బిగ్‌బాస్‌కు వచ్చీరావడంతోనే తన ఫోకస్, ఆలోచనలన్నీ పక్కనపెట్టేశాడు. ట్రాక్ తప్పిన పవన్అసలు లక్ష్యాన్ని గాలికొదిలేసి రీతూ, తనూజలను ఓరచూపులు చూడటం, అమ్మాయిలు ఏడిస్తూ వారిని హత్తుకుని ఓదార్చడం తప్ప ఏమీ చేయట్లేదు. ఇది చూసిన బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ప్రియులకు నీరసమొచ్చేసింది. ఆర్మీ జాబ్‌కు బ్రేక్ తీసుకుని మరీ బిగ్‌బాస్‌కు వచ్చిన పవన్ ట్రాక్ తప్పడం ఒకింత ఆశ్చర్యమనే చెప్పవచ్చు. అయితే పవన్.. పేరెంట్స్ కోసమే బలవంతంగా ఆర్మీకి వెళ్లాడు. ఇష్టం లేకుండా సైన్యంలో చేర్పించారని తల్లిదండ్రులతో ఏడాదిన్నరపాటు మాట్లాడనేలేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేక..ఈ విషయం గురించి పవన్ (Pawan Kalyan Padala) తండ్రి మాట్లాడుతూ.. నేను, నా భార్య కొన్నేళ్లక్రితం తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాం. చావు అంచులవరకు వెళ్లొచ్చాం. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. ఆ సమయంలో వాడిని వాళ్ల అత్త దగ్గరకు పంపించాం. అక్కడ నాలుగైదేళ్లున్నాడు. అక్కడినుంచి హాస్టల్లో చేర్పించాం. చదువైపోగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరను, ఇంటికొచ్చేస్తా.. అన్నాడు. అలాగైతే నా ఇంటికి రావొద్దని చెప్పాను. బలవంతంగా ఉద్యోగానికి..ఆరోజు వచ్చేయ్‌రా అనుంటే ఈ పరిస్థితిలో ఉండేవాడా? మా బాబాయ్, అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తారు. అలా నా కొడుకుని కూడా అదే రంగంలో చూడాలనుకున్నాను. బలవంతంగా ఆర్మీకి పంపించామని 14 నెలలు మాతో మాట్లాడలేదు. మేము ఫోన్ చేసినా కట్ చేసేవాడు. నెల రోజులపాటు సెలవులకు ఇంటికి వచ్చినా సరే బయట ఫ్రెండ్స్‌తో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. మాతో కూర్చుని పావుగంటైనా మాట్లాడేవాడు కాదు.. కనీసం మాతో కలిసి భోజనం కూడా చేయడు.నా డబ్బుతోనే పెళ్లి చేస్తానేను తిరగడానికి వచ్చాను, మీతో ఊసులాడటానికి కాదంటాడు. వాడికెలా ఉండాలో తెలీదు. వాడు స్నానం చేయడానికి వెళ్తే కూడా బాత్రూమ్లో నేనే నీళ్లు పెట్టేవాడిని. నేను ఒకప్పుడు డ్రైవర్‌ను. ఒంట్లో ఓపిక లేకపోవడం వల్ల కిరాణ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నా. కల్యాణ్ డబ్బు ఇస్తానంటాడు.. కానీ నేను తీసుకోను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే వాడి పెళ్లి చేస్తాను. అదే భయంగా ఉందిఅగ్నిపరీక్షకు అప్లై చేసిన విషయం చెప్పలేదు. సెలక్ట్ అయ్యాక చెప్పాడు. మా ఇష్టాన్ని తను కాదనలేదు కాబట్టి తన ఇష్టాన్ని మేమూ అంగీకరించాం. బిగ్‌బాస్ షోలో కల్యాణ్ ఆట గురించి ఎవరైనా చెప్తుంటే ఆ క్షణం ఆనందంగా ఉంటుంది, కానీ మనసుకు నచ్చదు. ఆ షో నుంచి వచ్చాక ఉద్యోగానికి వెళ్తాడా? లీవ్ గురించి అక్కడేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్నదే భయంగా ఉంది అని పవన్ తండ్రి చెప్పుకొచ్చాడు.చదవండి: హౌస్‌మేట్స్‌ను వెర్రిపప్పలను చేసిన బిగ్‌బాస్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు -
హౌస్‌మేట్స్‌ను వెర్రిపప్పలను చేసిన బిగ్‌బాస్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు!
మీరు పొడిచిందేమీ లేదు, మీ వల్ల షోకి మజా కూడా లేదు అనుకున్నాడో ఏమోకానీ వైల్డ్‌కార్డులను దింపబోతున్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో అగ్నిపరీక్ష నుంచి నలుగురు కంటెస్టెంట్లను హౌస్‌కి పంపించాడు. అందులో ఎవరు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోమని కంటెస్టెంట్లకు బాధ్యత అప్పగించాడు. ముందుగా వచ్చిన నలుగురు.. షాకిబ్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత, అనూష రత్నం తామెందుకు అర్హులనేది పాయింట్స్ చెప్పారు. శ్రీజ, కల్యాణ్‌కు కౌంటర్లుఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చనగానే శ్రీజ (Srija Dammu) పైకి లేచింది. హౌస్‌లోకి రావాలనుకుంటే ఎవర్ని స్వాప్ చేసుకుంటావ్? అని అడిగింది. అందుకు అనూష.. నీతోనే స్వాప్ చేసుకుంటా.. నీ ఇగో సంతృప్తి చెందకపోతే పుండు మీద పిన్నీస్ పెట్టి పొడుస్తూనే ఉంటావ్.. నీ అంత నెగెటివిటీ ఎవరి దగ్గరా లేదు అని చెప్పింది. అటు దివ్య కూడా.. శ్రీజతోనే స్వాప్ చేసుకుంటానంది. షాకిబ్, నాగ.. పవన్ కల్యాణ్‌తో స్వాప్ చేసుకుంటామన్నారు. అగ్నిపరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ లేదన్నారు.వీడికి ఇంకో అమ్మాయి కావాలట! ఈ చర్చలయ్యాక బిగ్‌బాస్ వారిని బయటకు పంపించాడు. దివ్య ఓవర్ కాన్ఫిడెన్స్, అనూష ఓవర్ స్మార్ట్.. నాగ, షాకిబ్లో ఎవరైనా ఓకే అని రీతూ అంది. డిమాన్ మాత్రం.. దివ్య అయితే బాగుంటుందన్నాడు. పక్కనే ఉన్న సంజనా.. వీడికి ఇంకో అమ్మాయి కావాలట.. అంటూ ఏడిపించింది. అనంతరం బిగ్‌బాస్.. ఏ కంటెస్టెంట్ కావాలన్నది హౌస్‌మేట్స్‌తో ఓటింగ్ వేయించాడు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చాడు. ట్రయాంగిల్ కాస్తా..ఈ ఆటలో మీ పావు మీరు కదిపారు. ఇప్పుడు నేను అసలైన ఆట ఆడతా అన్నట్లుగా అందరికీ దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. హౌస్‌మేట్స్‌ను ఆటలో అరటిపళ్లను చేస్తూ తక్కువ ఓట్లు వచ్చిన దివ్య నిఖితను హౌస్‌లోకి పంపించాడు. ఈ దెబ్బకు హౌస్మేట్స్ షాకై చూస్తుండిపోయారు. ఇక రావడంతోనే దివ్య.. హౌస్‌లో ట్రయాంగిల్ నడుస్తోంది.. అది దాదాపు స్క్వేర్ యాంగిల్ అవుతుందేమోనని చెప్పింది.అందరూ షేకయ్యారుఆ ఒక్క మాటతో అందరూ వణికిపోయారు. ఇద్దరు పవనాలు (డిమాన్ పవన్, పవన్ కల్యాణ్) మధ్యలో రీతూ అన్న విషయం అందరికీ తెలిసిందే! స్క్వేర్ అన్నదంటే కల్యాణ్.. తనూజను లింక్ చేస్తోందని అర్థం. దివ్య కావాలనే ఈ లవ్ ట్రాక్ గురించి బయటపెట్టింది. నేను ఒక్క మాట చెప్తే దానికి నలుగురు షేక్ అయ్యారు. ఇప్పుడు వాళ్లు ఎలా ఉంటారో చూస్తానుద! ఏది నిజమైన లవ్ ట్రాక్? ఏది డ్రామా? తెలిసిపోతుంది అని కెమెరాలతో మాట్లాడింది. మళ్లీ దొంగతనం గోలఇక సంజనా.. రానురానూ గజదొంగలా మారిపోతోంది. దొంగతనం తప్ప ఏదీ చేయను అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. తనూజ కాఫీ పౌడర్, సుమన్ సిగరెట్స్ దాచేసిన ఆమె.. ఇప్పుడు దివ్య నిఖిత మేకప్ సామాన్ కొట్టేయాలని పథకం రచించింది. దొంగతనం ఒకసారి చేస్తూ క్యూట్ ఏమో కానీ, ఇలా పదేపదే చేస్తుంటే అది చూసేవారికి రోత పుట్టిస్తుంది. ఈ విషయంలో ఈసారైనా నాగ్.. సంజనాకు క్లాస్ పీకుతాడేమో చూడాలి!చదవండి: నాకు పిల్లలు కావాలి: సల్మాన్ ఖాన్ -
బిగ్‌బాస్‌లోకి మరో కంటెస్టెంట్ ఫిక్స్.. శ్రీజ, పవన్‌ను ఏకిపారేశారు!
బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం పదమూడు మంది కంటెస్టెంట్లున్నారు. విన్నింగ్ మెటీరియల్ అనిపించేలా ఏ ఒక్కరూ లేరు. అంతో ఇంతో ఇమ్మాన్యుయేల్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆటకు ఆట.. వినోదానికి వినోదం, ఎమోషన్స్‌కు ఎమోషన్.. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు అతి మంచితనం చూపిస్తున్నాడు.అగ్నిపరీక్ష నుంచి మరొకరుఇకపోతే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ ప్రేక్షకులకు విపరీతంగా విసుగు తెప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా! అయితే అదే అగ్నిపరీక్ష నుంచి మరో ఇద్దర్ని హౌస్‌కు పంపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో షాకిబ్, దివ్య నిఖిత, నాగ ప్రశాంత్, అనూష రత్నం ఉన్నారు. వీరిలో ఒకర్ని మీరే ఎంపిక చేయాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు బాధ్యత అప్పగించాడు. ఉన్నదున్నట్లు మాట్లాడిన అనూషదానికంటే ముందు అనూష.. శ్రీజ (Dammu Srija)కు వరుస కౌంటర్లిచ్చింది. నీ ఇగో సంతృప్తి చెందకపోతే పుండుపై పిన్నుతో గుచ్చినట్లు పొడుస్తూనే ఉంటావ్. 24 గంటలు నెగెటివ్ ఎనర్జీతో ఉండే నీతోనే స్వాప్ చేసుకోవాలనుకుంటున్నా అంది. ఆ మాటకు శ్రీజ షాకై అలా చూస్తూ కూర్చుండిపోయింది. షాకీబ్.. పవన్ కల్యాణ్ స్థానాన్ని తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. టైంపాస్ చేయడానికా?అక్కడితో ఆగలేదు. పవన్ చేస్తున్న పనుల్ని ఎండగట్టాడు. షోకి ఎందుకొచ్చినం బ్రో? టైంపాస్ చేయడానికి కాదు కదా.. బయటకు వెళ్లగొడితే ఎట్లుంటదనేది నేను ఆల్రెడీ చూసేశిన. ఆ ఫీలింగ్ మీకు తెలియదు అన్నాడు. మొత్తానికి వచ్చీరావడంతోనే శ్రీజ, పవన్ కల్యాణ్‌కు ఆడియన్స్ ఎలా ఫీలవుతున్నారనేది చెప్పి వారికి హింట్లు ఇచ్చేశారు. ఇక హౌస్మేట్స్ అందరూ దివ్య నిఖితను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ముచ్చుముఖం రీతూ.. నా భర్తకు ఏదో అలవాటు చేసింది -
లక్స్ పాప సేఫ్.. నీలా బూతులు మాట్లాడనంటూ రీతూను రెచ్చగొట్టిన శ్రీజ
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss Telugu 9) మొదలై రెండు వారాలైందంతే.. అప్పుడే ఫ్యామిలీ కోసం బోరుమని ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. ప్రతిసారి కనీసం నెల రోజుల తర్వాతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లెటర్లు గట్రా పంపేవాడు. అదేంటో కానీ ఈసారి రెండువారాలకే ఈ కుటుంబ ఎమోషన్స్ ఎపిసోడ్ మొదలుపెట్టేశారు. బ్లూ సీడ్స్ అందుకున్నవారికే ఈ అవకాశం కల్పించాడు. సీక్రెట్ బాక్స్ ఓపెన్అందులో భాగంగా ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ ఫోటో గెల్చుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో తనూజ, ప్రియ ఇంటినుంచి లెటర్స్ అందుకున్నారు. సుమన్ ఇంటినుంచి ఏదైనా అందుకోవాలంటే భరణి సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయాలని బిగ్‌బాస్ మెలిక పెట్టాడు. దీంతో అతడు తన బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో ఒక చైన్, లాకెట్ ఉంది. లాకెట్లో అమ్మ, గురువు అని రాసుంది. వీరిద్దరూ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని చెప్పాడు.శ్రీజ, రీతూ మధ్యే అసలైన పోటీఅలా సుమన్ తండ్రి ఫోటో అందుకున్నాడు. కానీ సంజనాకు ఏదీ అందలేదు. ఇకపోతే బ్లాక్ సీడ్స్ ఉన్న ముగ్గురు రీతూ, శ్రీజ, ఫ్లోరాకు గురి తప్పద్దు అనే గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌కు సంజనాను సంచాలక్‌గా పెట్టారు. ఇక బరిలో దిగిన శ్రీజ, రీతూ పోటాపోటీగా ఆడారు. రీతూ విజయం తథ్యం అన్న సమయంలో శ్రీజ ఆటను మలుపు తిప్పింది. తను గెలవకపోయినా పర్లేదు కానీ రీతూ గెలవకూడదన్న ఉద్దేశంతో ఫ్లోరాకు సాయం చేసింది.నీలాగా బూతులు మాట్లాడట్లేదుగాఅది చూసిన రీతూ.. గేమ్ సరిగా ఆడు, నువ్వు గెలవాలని ఆడు కానీ, ఇదేంటి? అని చిరాకు పడింది. అందుకు శ్రీజ.. నా గేమ్ నా ఇష్టం. నువ్వు మొన్న రాముకు సపోర్ట్ చేయలేదా? నేను ఫ్లోరాకు సమాన అవకాశం రావాలని చేస్తున్నా.. నీలాగా బూతులు మాట్లాడి వేరొకరినైతే హర్ట్ చేయట్లేదుగా అని కౌంటరిచ్చింది. చివరకు ఈ గేమ్‌లో ఫ్లోరా గెలిచి ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకుంది.ఎప్పుడూ ఇంతే..అంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కకపోవడంతో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు అదృష్టం కలిసిరాదు, ఎప్పుడూ ఇంతే.. అని బోరుమని ఏడవడంతో అందరూ ఆమెను ఓదార్చారు. ఇక ఈ వారం ఫ్లోరా గెలవడంతో నామినేషన్స్‌లో ఐదుగురే మిగిలారు. వారే ప్రియ, రాము, రీతూ, పవన్ కల్యాణ్, హరీశ్. వీరిలో ప్రియ డేంజర్ జోన్లో ఉంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి!చదవండి: స్టార్ హీరో ఇల్లు వేలం.. రోడ్డు మీదకు సతీమణి -
బిగ్‌బాస్‌కు వద్దన్నాం.. మీరే ఓట్లేశారు.. మరిప్పుడెందుకు తిడుతున్నారు?
సామాన్యుల్లో నుంచి వజ్రాల్ని వెలికితీసి పంపాలనుకుంది బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) టీమ్. అందుకే అగ్నిపరీక్ష కార్యక్రమం నిర్వహించింది. దానికి బిందుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగానూ వ్యవహరించారు. గేమ్స్ ఆడుతూ, ముక్కుసూటిగా మాట్లాడిన వారిని, చలాకీగా ఉన్నవారిని సెలక్ట్ చేసి పంపారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లోకి వెళ్లాక అంతా రివర్స్ అయింది. కామనర్లపై నెగెటివిటీఆట సంగతి పక్కనపెడితే మాటలు, గొడవలు, రూల్స్, ప్రవర్తన.. అన్నిరకాలుగా పెంట పెంట చేశారు. దీంతో కామనర్లు మాకొద్దురా బాబూ అని జనం తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే గతవారం కామనర్ల నుంచి మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చంటున్నారు. అందులో ప్రియ పేరు బలంగా వినిపిస్తోంది. పుట్టుకతో వచ్చిన గొంతుఈ క్రమంలో ప్రియ (Priya Shetty) పేరెంట్స్ సురేఖ-వివేకానంద ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వారు మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వద్దనే చెప్పాం. అగ్నిపరీక్షకు ట్రై చేస్తుంటే కూడా వద్దన్నాం. తనే గట్టిపోటీనిస్తానంటూ షోకి వెళ్లింది. అగ్నిపరీక్షలో ఆదరించిన ప్రేక్షకులే ఇప్పుడు బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు విమర్శిస్తున్నారు. పుట్టుకతో వచ్చిన గొంతుకకు మనమేం చేయలేం. చాలా తప్పుతను ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుంది. వాయిస్ వల్ల మీకు డిఫరెంట్‌గా కనిపిస్తుందంతే! గొంతు వల్ల ఆమెను ట్రోల్ చేయడం చాలా తప్పు. అగ్నిపరీక్షలో కూడా అదే గొంతుంది. అప్పుడేమో క్యూట్ అంటూ ఓట్లేశారు. ఇప్పుడెందుకు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు? ఈ ట్రోలింగ్ చూస్తుంటే బాధేస్తోంది. బిగ్‌బాస్ వల్ల తన పెళ్లికి ఏమీ ఎఫెక్ట్ కాదు. తనను అర్థం చేసుకునే వ్యక్తితోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు.చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్ -
అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్
బిగ్‌బాస్ హౌస్‌లో రీతూ చౌదరి (Rithu Chowdary) వేసే వేషాలు చూస్తుంటే జనాలకు చిరాకు పుడుతోంది. అయితే డిమాన్ పవన్, లేదంటే పవన్ కల్యాణ్‌తో కూర్చుని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ, ఏదో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్‌బాస్ హౌస్‌ను పార్క్‌లా మార్చేసింది. కెప్టెన్‌గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరున ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నవాడిలా కల్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, హత్తుకుని ఓదారుస్తున్నాడు.భార్యను వదిలి రీతూతో..చిన్నచిన్నవాటికే కన్నీళ్లుపెట్టుకుంటున్న రీతూ బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో! హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా! అయితే తను గర్భంతో ఉండగా మహేశ్.. రీతూతో క్లోజ్‌గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడంది.రీతూ, నేను ఫ్రెండ్స్తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేశ్ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. నాకు, రీతూకు మధ్య ఏం లేదు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే! తనను ఫ్రెండ్‌లా చూస్తాను. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటోంది కదా.. కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు. నేను డిప్రెషన్లో ఉన్నాను. సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు?ఇల్లు ఖాళీ చేయించిందిఏడేళ్లు కష్టపడి ఇంతదాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. నటి లవ్‌స్టోరీ
డిమాన్ కెప్టెన్ అవ్వడం కోసం అడ్డదారులు తొక్కిన రీతూ చౌదరి (Rithu Chowdary)కి పెద్ద ఝలక్ తగిలింది. కెప్టెన్‌గా డిమాన్ ఒకర్ని సేవ్ చేయొచ్చంటే అతడు రీతూకి బదులుగా శ్రీజను సేవ్ చేశాడు. అది చూశాక రీతూ.. నా హార్ట్ బ్రేక్ అయిందంటూ ఏడ్చేసింది. అటు శ్రీజ.. ఓనర్లందరూ కలిసి తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదన్నారంటూ ఏడుపు అందుకుంది. దీంతో ఇమ్మూ రంగంలోకి దిగి నువ్వు నా చెల్లివి.. అని ఓదార్చడంతో తను కుళాయి కట్టేసింది. తర్వాత బిగ్‌బాస్ రీతూను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. చికెన్ కోసం సీక్రెట్స్ బట్టబయలుఅక్కడ తనకెంతో ఇష్టమైన చికెన్ ఎదురుగా కనిపించేసరికి ఏడుపు ఆపుకోలేకపోయింది రీతూ. అమ్మ, అన్నయ్య నాకు ప్రేమగా చికెన్ చేసి పెడతారు.. అంటూ వాళ్లను గుర్తు చేసుకుంది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటిసభ్యుల రహస్యాలు చెప్తేనే ఆ చికెన్ తినొచ్చన్నాడు. తనూజకు.. కల్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ పైకి మాత్రం చూపించదు. అతడు దగ్గరుంటే తను సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. డిమాన్ గురించి అడగ్గా.. పవన్ సింగిల్, గతంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ తనకు కరెక్ట్‌గా ప్రపోజ్ కూడా చేయలేదు.సీక్రెట్ చెప్పి సంజనాదీంతో తను వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు ఎవర్నీ సరిగా ప్రేమించలేదన్నాడు. ఇప్పుడైతే నా మీద మంచి అభిప్రాయం ఉందన్నాడు అని ఉన్నదంతా చెప్పేసింది. ఇవి అందరికీ తెలిసినవేగా! మంచి రహస్యాలు కావాలన్నట్లుగా బిగ్‌బాస్ డిమాండ్ చేశాడు. దీంతో రీతూ.. సాయంత్రం లోపు కనుక్కుని మంచి సీక్రెట్స్ చెప్తానంది. అలా సంజనా దగ్గర ఓ రహస్యాన్ని కనుక్కుంది. సంజనా మాట్లాడుతూ.. కాలేజీలో ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. అయితే, అతడు నన్ను కొట్టేందుకు ప్రయత్నించాడు. నా తలపై కొడితే కుట్లు వేస్తారు.. ముఖం పాడవుతుంది, హీరోయిన్ కాలేను, అప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చనుకున్నాడు. సినిమా చూపిస్తాతర్వాత మా మధ్య గొడవై నేను వదిలేశాను. అప్పుడతడు పిచ్చోడై గడ్డం, మీసాలు పెంచాడు. ఓ రోజు కారు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పింది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీల గురించి అందరికీ హింటిచ్చాడు. నేనే స్వయంగా రంగంలోకి దిగి ఆటను నా చేతిలోకి తీసుకోబోతున్నా.. అసలు సినిమా ఎలా ఉంటుందో వచ్చేవారం చూపిస్తా.. జరగబోయేది మీ ఊహకు మంచి ఉండబోతోంది అన్నాడు. గార్డెన్ ఏరియాలో చెట్టుపై ఎవరి పేర్లు రాసి ఉన్న పండ్లను వారు తీసుకోవాలన్నాడు. అందులోని విత్తనం మీ భవిష్యత్తును సూచిస్తుందన్నాడు. అప్పుడే ఇంటి నుంచి సందేశాలుఅయితే ఫలాన్ని మార్చుకోవాలనుకునేవారు ముందుకు రమ్మంటే రీతూ, ప్రియ, శ్రీజ ముందుకొచ్చారు. దీంతో వాళ్లు తమ పండ్లకు బదులుగా బిగ్‌బాస్ పంపిన మరో మూడు పండ్లను తలా ఒకటి తీసుకున్నారు. ఒక్కో రంగు విత్తనం దేన్ని సూచిస్తుందనేది సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాడు. ముందుగా బ్లూ విత్తనం వచ్చినవారి (ఇమ్మాన్యుయేల్, సంజన, సుమన్ శెట్టి, తనూజ, ప్రియ)కి బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఏడ్చేసిన ఇమ్మూఇంటి నుంచి వచ్చిన సందేశాలను, జ్ఞాపకాలను గెలుచుకోవాలన్నాడు. ఇందుకోసం 100% ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లగా.. తండ్రి లెటర్ కావాలంటే బ్యాటరీలో 45%, తల్లి ఆడియో మెసేజ్ కావాలంటే 35%, ఫ్యామిలీ ఫోటో కావాలంటే 25% బ్యాటరీని వాడాల్సి ఉంటుందన్నాడు. అన్నింటికంటే తక్కువ బ్యాటరీ ఖర్చయ్యే ఫోటోను ఇమ్మూ సెలక్ట్ చేసుకుని ఎమోషనలయ్యాడు. చదవండి: రాజకీయాల్లోకి హీరో వరుణ్ సందేశ్ తల్లి -
Bigg Boss 9: ‘సారీ అమ్మా.. ’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన కమెడియన్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 9వ సీజన్ చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇంట్లో నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. మూడోవారం నామినేషన్స్‌లో హరీశ్, ప్రియ, కల్యాణ్, రాము, రీతూ,ఫ్లోరా ఉన్నారు. వీరిలో నుంచి ఒకరు బయటకు వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. ఇప్పటికి వరకు కండబలం, బుద్ది బలంపై ఫోకస్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు భావోద్వేగ బలంపై దృష్టిపెట్టాడు. కంటెస్టెంట్స్ ఎమోషన్‌తో గేమ్ ప్లాన్ చేసినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. హౌస్‌లో ఉన్నవాళ్లకు బిగ్ బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరైతే తొలుత బజర్ ప్రెస్ చేస్తారో..వారికి ఫ్యామిలీ వాళ్లు అందించిన సందేశాలను పంపిస్తామని చెప్పాడు. అయితే అది పొందాలంటే కొంత మూల్యం చెల్లించాల్సిందే అంటూ అక్కడ వందశాతం నిండి ఉన్న బ్యాటరీని చూపించాడు.బటన్ ప్రెస్ చేసి అవకాశం దక్కించుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ముందు మూడు ఆప్షన్లు పెట్టాడు బిగ్‌బాస్. నాన్న నుంచి వచ్చిన లేఖను పొందలాంటే హౌస్ బ్యాటరీ నుంచి 45 శాతం తగ్గింపోతుందని, అమ్మ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్‌ని పొందాలంటే 30 శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, ఫ్యామిలీ ఫోటోని పొందాలంటే 25శాతం తగ్గుతుందని చెప్పి.. ఇందులో ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. ఇది విని ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ‘నేను ఏడిస్తే..మా అమ్మ తట్టుకోలేదు’ బిగ్‌బాస్ అంటూ కన్నీళ్లు తూడ్చుకున్నాడు. తోటి కంటెస్టెంట్స్ కోసం ఇమ్మాన్యుయేల్ చివరి ఆప్షన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది. -
అందరూ కలిసి హరీశ్‌ను బలి చేశారుగా! నామినేషన్స్‌లో ఎవరంటే?
తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ప్రారంభమైంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తవగా సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. టెనెంట్లు.. ఐదుగుర్ని నామినేట్ చేయాలన్నాడు. అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయుండాలన్నారు.నామినేషన్స్కెప్టెన్ అయ్యాక సంజనాకు అహం పెరిగిపోయిందని హరీశ్, ప్రియ.. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వదని శ్రీజ అభిప్రాయపడ్డారు. అలా మొదట సంజనాను నామినేట్ చేశారు. అలాగే రీతూ చౌదరి, సుమన్, ఫ్లోరాను నామినేట్ చేశారు. ఇక టెనెంట్స్‌లో ఒకర్ని అనగానే అందరూ కలిసి హరీశ్‌ను నామినేషన్స్‌లో ఇరికించేశారు. ఇంతటితో అయిపోలేదు. బిగ్‌బాస్ ఈ ప్రక్రియలో ఓ ట్విస్ట్ ఇచ్చాడట! గండం గట్టెక్కిన సంజనానామినేషన్స్లో ఉన్నవారు ఎవరితోనైనా స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడట! దీంతో సంజనా.. రాము రాథోడ్‌తో స్వాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే టెనెంట్స్లోనుంచి ప్రియ, కల్యాణ్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి రీతూ, సుమన్, ఫ్లోరా, రాము, ప్రియ, కల్యాణ్, హరీశ్ నామినేషన్స్‌లో ఉన్నారా? లేదంటే మళ్లీ ఏవైనా ట్విస్టులు ఇచ్చారా? అన్నది ఎపిసోడ్లో చూడాలి! చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే? -
హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్‌బాంబ్ వేసిన మనీష్
బిగ్‌బాస్ షోలో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్, అతి చేష్టలతో ఎలిమినేషన్ ఏరికోరి తెచ్చుకున్నాడు. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కామనర్‌గా నిలిచాడు. వెళ్తూ వెళ్తూ కామనర్‌పై ఓ బిగ్‌బాంబ్ విసిరాడు. మరి సండే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.. రీతూ చౌదరి వల్ల కెప్టెన్సీ పెంటపెంటయింది. దీంతో కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేసి మళ్లీ గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ కష్టపడి కెప్టెన్సీ సాధించుకున్నాడు. తర్వాత ఓ ఫన్ గేమ్ ఆడించగా అందులో కామనర్స్ గెలిచారు.మనీష్ ఎలిమినేటెడ్ఇక నాగ్ ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ రాగా చివరకు ఫ్లోరా, మనీష్ (Manish Maryada) మిగిలారు. ఎలాగో ఫ్లోరా ఎలిమినేషన్ ఖాయమని ఫిక్సయిన కామనర్లు.. ఆమెకు ఆల్ ద బెస్ట్, మిస్ యూ అంటూ డైలాగులు చెప్పారు. తీరా ఫ్లోరా సేఫ్, మనీష్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించగానే అందరూ నోరెళ్లబెట్టారు. మనీష్ వెళ్లేముందు అతడితో ఓ గేమ్ ఆడించారు. ఈ షోలో టాప్ 3 ఎవరు? బాటమ్ 3 ఎవరు? చెప్పాలన్నాడు. బాటమ్ 3లో శ్రీజఅందుకు మనీష్ ముందుగా బాటమ్ 3లో శ్రీజ (Dammu Srija) పేరు చెప్తూ తను గేమ్ సరిగా ఆడట్లేదన్నాడు. తర్వాత ఫ్లోరా సైనిని బాటమ్‌లో పెడుతూ.. ఆమె పని తప్ప గేమ్ కనిపించట్లేదన్నాడు. సుమన్‌ను కూడా బాటమ్ 3లో యాడ్ చేశాడు. సుమన్ అన్నా.. హ్యాట్సాఫ్. మీరు ఏం ఆడుతున్నారన్నా.. నేనసలు ఊహించనేలేదు. అయినా బాటమ్‌లో ఎందుకున్నారంటే.. అలా కనిపించి, ఇలా వెళ్లిపోతారు. మీకంటూ ఓ స్టాండ్ తీసుకోరు అని చెప్పుకొచ్చాడు. తర్వాత టాప్ 3 గురించి మాట్లాడాడు. ఆయనే నెం.1నా ప్రకారం భరణిగారు నెం.1. ఆయన అందరి కోసం ఆలోచిస్తారు, మరోపక్క గేమ్ కూడా ఆడతారు. మీరు చాలా స్ట్రాంగ్ కంటెండర్. మీలాంటివాళ్లతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు, మీతో ఫైట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయేల్.. మొదట ఇతడిని నేను సీరియస్‌గా తీసుకోలేదు. కామెడీ చేస్తారంతే అనుకున్నా.. కానీ ఇచ్చిపడేసిండు. కామెడీ, ఎమోషన్స్, గేమ్.. అన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మిమ్మల్ని తప్పకుండా టాప్ 3లో చూడాలనుకుంటున్నా.. వేరేవాళ్ల కోసం ఆటను వదిలేయకండి అని సూచనలిచ్చాడు.అపార్థం చేసుకున్నా..కామనర్ల నుంచి ఏకైక వ్యక్తిని టాప్ 3లో చేర్చాడు. అతడే హరీశ్. ఎమోషన్స్ దగ్గరే ఆగిపోకండి. కొంచెం కోపం తగ్గించుకుంటే టాప్ 1కి వెళ్తారు అన్నాడు. తర్వాత నాగార్జునను అడిగి మరో వ్యక్తిని టాప్ 4గా వెల్లడించాడు. ఆవిడే సంజన. సంజనను నేను ఎంత అపార్థం చేసుకున్నానో తర్వాత అంత అర్థం చేసుకున్నాను. నాకు, తనకు ఇంట్లో ఏ పనీ లేదు. అయితే పని రాలేదు కాబట్టి తనే పని తెచ్చుకుంటా.. అది కూడా గేమే అంది. అప్పుడే నాకు మైండ్ బ్లాక్ అయింది.రాత్రి ఒంటరిగా కన్నీళ్లుపగలంతా అందర్నీ సతాయిస్తుంది. రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఎక్కువ మిస్ అయ్యేది సంజననే.. అని ఎమోషనలయ్యాడు మనీష్. అందరినీ పని అడిగాను, ఎవరూ ఇవ్వలేదు. ఈమె ఒక్కరే నాకు వర్క్ ఇచ్చింది. తనకు నేను వంట చేసి పెట్టాను. మీరు టాప్ 3లో ఉండాలి. భాష నీకు అడ్డు కాదు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనీష్ ధైర్యం చెప్పాడు. జైల్లోకి ఫ్లోరా..అందుకు సంజనా.. నేను తెలుగమ్మాయినే, నాకు భాష ఏం అడ్డం కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో మోస్ట్ బోరింగ్ మనిషిగా ఫ్లోరాను ఎంపిక చేశారు. దీంతో ఆమె జైల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆమె చేసే వాష్‌రూమ్ డ్యూటీ టెనెంట్స్‌లో ఒకరికి వేయాలన్నాడు నాగ్. దీంతో ఈ బిగ్‌బాంబ్‌ను మనీష్ ఇది నా రివేంజ్ అంటూ ప్రియకు ఆ క్లీనింగ్ పని అప్పగించి సెలవు తీసుకున్నాడు.చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే? -
ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో రెండోవారం కూడా ఫ్లోరా సేవ్ అయింది. ఆ విషయం ఆమె కూడా నమ్మలేకపోతోంది. అందుకే నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున.. ఫ్లోరా సేవ్, మనీష్ ఎలిమినేట్ అనగానే ఏంటి? ఇది నిజమేనా? అని కొన్ని క్షణాలపాటు షాక్‌లో ఉండిపోయింది. ఆమెకే కాదు హౌస్‌మేట్స్‌కు కూడా ఇది పెద్ద షాకే! అందులోనూ కామనర్లకు మరీ పెద్ద షాక్!తన గోతి తనే తవ్వుకున్న మనీష్మనీష్ (Maryada Manish) ఎలిమినేషన్‌కు ఎవరూ కారణం కాదు, ఆయన స్వీయతప్పిదాలే తన కొంప ముంచాయి. హౌస్‌లో ఓవర్ థింకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కామనర్లను ఓనర్లను చేయగానే ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. కారణం లేకుండానే సెలబ్రిటీ రాము రాథోడ్‌ను ఈసడించుకున్నాడు, కసురుకున్నాడు. భరణిని సైతం అసహ్యంగా చూశాడు. అలాంటి వ్యక్తి పక్కన పడుకుంటే నాకు నిద్ర కూడా పట్టదు. నా బెడ్ షేర్ చేసుకోను అని భరణిని శత్రువును చూసినట్లే చూశాడు.కన్నీళ్లు వృథాఓ గేమ్‌లో సంచాలక్‌గా వ్యవహరించి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రియ, శ్రీజల వల్ల ఎక్కువ ఇబ్బందిపడింది మనీషే! మూలన కూర్చుని ఏడువుపో అని శ్రీజ అతడిని కూరలో కరివేపాకులా తీసిపడినా మాటలు పడ్డాడు, పక్కకెళ్లి ఏడ్చాడు, తప్ప ఆమెను నామినేట్ చేయలేదు. ప్రియ మానిటర్‌గా ఉంటే భోజనం కూడా చేయనని భీష్మించుకున్నాడు తప్ప ఆమెను కూడా నామినేట్ చేయలేదు. కొంప ముంచిన నామినేషన్వీళ్లిద్దరి వల్ల మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్న మనీష్.. నామినేషన్స్‌లో మాత్రం వాళ్లను వదిలేసి సెలబ్రిటీలను నామినేట్ చేయడం ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఈ డబుల్ స్టాండర్డ్స్ అతడిపై నెగెటివిటీని మరింత పెంచాయి. మనీష్ ఎలిమినేషన్‌కు ఇదే బలమైన కారణం! వాళ్లను నామినేషన్ చేసుంటే మనీష్ సేవ్ అవడంతో పాటు అతడి గ్రాఫ్ విపరీతంగా పెరిగుండేది. ఇకపోతే మనీష్.. ఇంగ్లీష్ దొరలా ఎప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉండేవాడు. లైవ్‌లో అయితే మరీ దారుణంగా తెలుగు తప్ప ఇంగ్లీషే మాట్లాడేవాడు.రెమ్యునరేషన్ ఎంత?ఈ విషయంపై బిగ్‌బాస్ నుంచి వార్నింగ్స్ కూడా వచ్చాయి. తెలుగు రాని ఫ్లోరా, సంజనాయే చక్కగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే మనీష్ మాత్రం మహామేధావిలా ఇంగ్లీష్‌లోనే ఎందుకు వాగుతాడన్న అసహనం కూడా జనాల్లో ఉంది. ఇలా తను చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండోవారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కామనర్లందరికీ దాదాపు రూ.70-80 వేలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మనీష్ రెండు వారాలకుగానూ లక్షన్నర సంపాదించాడన్నమాట!చదవండి: నా భర్తతో బిగ్‌బాస్ రీతూ ఎఫైర్.. వీడియో విడుదల చేసిన నటుడి భార్య -
రీతూ వల్ల కెప్టెన్సీ పాయే.. కానీ మళ్లీ గెలిచి సాధించిన పవన్
నువ్వు అనుకుంటే అయిపోద్ది సామీ! అన్నది సినిమా డైలాగ్.. అయితే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)లోనూ రీతూ బలంగా కోరుకుంటే అది జరిగి తీరాల్సిందే! డిమాన్ పవన్ కెప్టెన్ అవాలని ఆశపడింది. తాను సగం చాక్లెట్ తిని.. ఎంగిలి చేసిన చాక్లెట్‌ను పవన్‌కు ఇస్తూ నువ్వే కెప్టెన్ అవాలి అని కళ్లతోనే ఆర్డరేసింది. తీరా సంచాలక్ పదవి తన చేతికే రావడంతో పవన్‌ను కెప్టెన్ చేసేసింది.మళ్లీ కెప్టెన్ అయిన పవన్‌కానీ నాగార్జున ఈ వ్యవహారాన్నంతా వీడియో వేసి మరీ చూపించాడు. సంచాలక్‌గా రీతూ.. భరణిని అవుట్ చేయడం తప్పని చెప్పాడు. పవన్‌ను కావాలనే గెలిపించిందన్నాడు. దీంతో పవన్.. నిజాయితీగా కెప్టెన్సీ గెలుస్తాను, ఇది నాకొద్దంటూ కెప్టెన్సీ బ్యాడ్జ్ తిరిగిచ్చేశాడు. దీంతో హౌస్‌లో మరోసారి కంటెండర్లు భరణి, మనీష్, ఇమ్మాన్యుయేల్, పవన్ మధ్య గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ గెలిచి మళ్లీ కెప్టెన్సీ సాధించాడని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ పవన్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌తో కనిపించాడు. చదవండి: నాగార్జుననే ఎదిరించిన శ్రీజ, ప్రియ.. ఉతికారేసిన హోస్ట్ -
నాగార్జుననే ఎదిరించిన శ్రీజ, ప్రియ.. ఉతికారేసిన హోస్ట్
జింతాత జితా జితా.. జింతాత తా.. శనివారం ఎపిసోడ్ చూశాక ఈ పాట కచ్చితంగా వేసుకోవాల్సిందే! ఆ రేంజ్లో ఉంది నాగార్జున హోస్టింగ్. మేమే తోపు, ఇల్లంతా మాదే అన్న భ్రమలో బతికేస్తున్న సామాన్యుల మబ్బులు విడిపోయేలా క్లాస్ పీకాడు. ముఖ్యంగా ప్రతిదానికీ గొడవపడటం ఒక్కటే మార్గం అన్నట్లుగా నోరేసుకుని పడిపోతున్న ప్రియ, శ్రీజల నోటికి తాళం వేసేలా మాట్లాడాడు. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరంగా చూసేద్దాం..ఒళ్లంతా కళ్లు లేవునాగార్జున (Nagarjuna Akkineni) వచ్చీరావడంతోనే రీతూ చౌదరి సంచాలక్‌గా ఫెయిలైందని వీడియో ఆధారాలతో సహా బయటపెట్టాడు. భరణిని కావాలనే గేమ్‌లో ఎలిమినేట్ చేసిందని చూపించాడు. పవన్ కెప్టెన్ అవాలని ముందునుంచే నిర్ణయించుకున్న ఆమె అనుకున్న ప్రకారం అతడిని కెప్టెన్ చేసిందన్నాడు. రీతూ మాత్రం.. నాకున్నవి రెండే కళ్లు, బాడీ మొత్తం లేవు కదా.. టాస్క్‌లో పవన్ వేరేవాళ్లకు రంగు పూసింది కనిపించలేదు. నాకతడిపై సాఫ్ట్ కార్నర్ లేదు. కావాలని గెలిపించలేదు అని కహానీలు చెప్పింది. సారీ చెప్పిన రీతూకానీ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ రీతూ (Rithu Chowdary) తప్పు నిర్ణయం తీసుకుంది సార్. ప్రియ, శ్రీజ, మనీష్ శాడిస్టులుగా ప్రవర్తించారు. టెనెంట్స్‌కు అన్యాయం జరిగింది అన్నారు. దాంతో రీతూ చేసేదేంలేక సారీ చెప్పింది. అయితే ప్రియ, శ్రీజ మాత్రం మేమేం తప్పు చేశాం? అని ఏమీ ఎరగనట్లే మాట్లాడారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నాం, అందులో తప్పేముంది? అని ప్రశ్నించింది. ప్రియ, శ్రీజలకు ఇచ్చిపడేసిన నాగ్దీనికి నాగ్.. షోకి వెళ్లేవరకు మాత్రమే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మాత్రమే అని క్లాస్ పీకాడు. ఎంతసేపూ తుత్తుత్తు అంటూ మాట్లాడతారు. ఇద్దరూ కాదు, ఎవరో ఒకరే మాట్లాడండి అని ప్రియ, శ్రీజలను హెచ్చరించాడు. అలాగే ప్రియ సంచాలక్‌గా ఫెయిలైన వీడియో (చక్రం టాస్క్‌లో పవన్ కల్యాణ్ ఫౌల్ గేమ్) కూడా ప్లే చేశాడు. మొదట తనది తప్పేనని ఒప్పుకున్న ఆమె.. తర్వాత తనసలు తప్పు చేయలేదు, అంతా కరెక్ట్‌గానే ఉందని నాగార్జునతోనే వాదించింది.ఇది కరెక్ట్ కాదు సార్ఇక మరోవైపు డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేసిన నాగ్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ పెడతానని ప్రకటించాడు. ఈసారి కూడా రీతూ చౌదని సంచాలక్‌గా ఉంటుందని వెల్లడించాడు. ఇది నచ్చని శ్రీజ.. ఇది కరెక్ట్ కాదు సార్.. అంటూ నాగార్జుననే ఎదిరించింది. సంచాలక్ చేసిన తప్పుకి ప్లేయర్‌ను తీసేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. పవనే ఈ కెప్టెన్సీ వద్దనుకుంటున్నాడు. ఫెయిర్‌గా ఆడి గెలవాలనుకుంటున్నాడు. నీకేంటి సమస్య? ప్రతి విషయంలో తుత్తుత్తు అని వస్తావ్ అని శ్రీజ దుమ్ము దులిపేశాడు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లంటే ఇదే!అలా నెత్తికెక్కిన కామనర్ల కళ్లు కిందకు వచ్చేలా చేశాడు. నాగార్జున కామనర్లపై విరుచుకుపడినప్పుడల్లా ప్రేక్షకుల చప్పట్లతో స్టూడియో దద్దరిల్లిపోయింది. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. ఓనర్లను టెనెంట్లుగా, టెనెంట్లను ఓనర్లుగా మార్చేశాడు. ఓనర్షిప్ గెలిచి సాధించుకున్న రాము, భరణి ఓనర్లుగానే కొనసాగుతారన్నాడు. మరి టెనెంట్లయ్యాకైనా కామనర్ల గర్వం అణుగుతుందేమో చూడాలి!చదవండి: బిగ్‌బాస్ 9 రెండో ఎలిమినేషన్.. సామాన్యుడు ఔట్!


