బిగ్‌బాస్ షోకు ఒకేసారి రెండు భాషల్లో శుభం కార్డు పడింది. ఆదివారం (జనవరి 18న) నాడు అటు తమిళ బిగ్‌బాస్ 9, ఇటు కన్నడ బిగ్‌బాస్ 12వ సీజన్ ముగిసింది. తమిళ బిగ్‌బాస్ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన దివ్య గణేశ్ విజేతగా నిలిచింది. తమిళ బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 5న మొదలైంది. విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించిన ఈ సీజన్‌లో మొత్తం వైల్డ్‌కార్డ్స్‌తో కలిపి 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు.
రూ.50 లక్షల ప్రైజ్‌మనీ
దివ్య గణేశ్, శబరీనాథన్, విక్కాల్స్ విక్రమ్, అరోరా సిన్‌క్లయర్.. నలుగురే ఫైనలిస్టులుగా నిలిచారు. ఉత్కంఠగా జరిగిన ఈ సీజన్‌లో అందర్నీ వెనక్కు నెట్టి దివ్య గణేశ్ లేడీ విన్నర్‌గా నిలిచింది. బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. అలాగే ఒక కారును సైతం గెలుపొందింది.
కన్నడ బిగ్‌బాస్
కన్నడ బిగ్‌బాస్ 12వ సీజన్ విషయానికి వస్తే.. గతేడాది సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. వరుసగా పన్నెండవ సారి కూడా హీరో కిచ్చా సుదీప్ ఈ సీజన్‌కు హోస్టింగ్ చేశాడు. ఈ సీజన్‌లో కమెడియన్ గిల్లి నాట (నటరాజ్), రక్షిత, అశ్విని, కావ్య, రాఘవేంద్ర, ధనుష్ టాప్ 6గా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు.
హోస్ట్ సర్‌ప్రైజ్
వీరిలో అందర్నీ వెనక్కునెడుతూ గిల్లి నాట టైటిల్ విజేతగా నిలిచాడు. ఇతడు రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ఒక ఎస్‌యూవీ కారును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, హీరో కిచ్చా సుదీప్ అతడికి మరో రూ.10 లక్షలు గిఫ్ట్ ఇస్తూ ఆ గెలుపును మరింత స్పెషల్‌గా మార్చేశాడు.


