బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్ నిండి ఉంది. ఆమె అంటే కరణ్‌కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.
టాటూ నిజమైనదా?
ఈ క్రమంలో కరణ్ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్‌గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.
బిగ్‌బాస్ షోలో మొదలైన లవ్
హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌లో కరణ్- తేజస్వి ప్రకాశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్ బంధమని కరణ్-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.


