మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను అలరిస్తోంది.
తాజాగా ఈ సినిమా టీవీల్లోనూ రానుంది. ఈనెల 28న టెలివిజన్ ప్రేక్షకులను అలరించనుంది. జీ తెలుగు ఛానెల్‌లో శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అఫీషియల్‌గా అఫీషియల్‌గా ప్రకటించింది. మెగా పండగ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ ప్రకటనతో టీవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సినిమా చూస్తూ Contest లో పాల్గొంటూ Mega Surprise Gifts ని పొందండి
Don't miss World Television Premiere #ManaShankaraVaraPrasadGaru On Feb 28th, Sat at 5:30 PM On #ZeeTelugu
Streaming Now On #Zee5#ZeeTeluguSpotlight #MegaCallAndWinContest #MegaPandagaOnZeeTelugu… pic.twitter.com/tXMT2igxRk— ZEE TELUGU (@ZeeTVTelugu) February 25, 2026


