బిగ్‌బాస్ షో వల్ల పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. వాళ్లు ఏం చేసినా, చేయకపోయినా ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటారు. వారికి సంబంధం లేని విషయాల్లో కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల పేరు ఇరికించి విమర్శిస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్, నటి తనూజ విషయంలో ఇదే జరిగింది.
తనూజ కోసం నిలబడ్డ పవన్
'ముద్ద మందారం' సీరియల్‌తో ఫేమస్ అయిన తనూజకు ఆ సీరియల్ నటీనటులతో మంచి అనుబంధం ఉంది. ముద్ద మందారం సీరియల్ హీరో పవన్ సాయి కూడా తనకు మంచి మిత్రుడు. తనూజ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసం స్టేజీపైకి కూడా వచ్చాడు. అయితే పవన్ విడాకులకు తనూజయే కారణమని కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.
ఉసురు తగులుతుంది
తాజాగా తనూజ తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేయగా ఓ నెటిజన్ పవన్ సాయి విషయాన్ని ప్రస్తావించాడు. పవన్ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు, ఆమె ఉసురు నిన్ను వెంటాడుతుంది అని శాపనార్థాలు పెట్టాడు. అందుకు తనూజ గట్టి కౌంటర్ ఇచ్చింది. నీ కర్మ కూడా నిన్ను వెంటాడకముందే నీపై నువ్వు ఫోకస్ చేసుకోవడం మంచిది. నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను చాలా బాగున్నాను. నా కర్మఫలం బాగుంది కాబట్టే నా జీవితంలో అంతా మంచే జరుగుతోంది.
కౌంటర్ ఇచ్చిన తనూజ
అయినా ఇలా ముఖం కూడా చూపించకుండా ఫేక్ ఐడీలతో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడానికి కొంచెం కూడా సిగ్గులేదా? నీకు ఎవరి ఉసురు వెంటాడకుండా చూసుకో.. అని ఇచ్చిపడేసింది. చివర్లో తనను విమర్శించేవాళ్లకు కౌంటరిచ్చింది. డియర్ హేటర్స్.. మీరు నా ప్రశాంతతని పాడు చేయలేరు. నన్ను రెచ్చగొట్టేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయినా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.


