తొలిసారి కూతురి ఫోటో షేర్‌ చేసిన అర్జున్‌ | Bigg Boss Ambati Arjun, Surekha Shares Daughter photo on their 7th Anniversary | Sakshi
Sakshi News home page

Ambati Arjun: 7 ఏళ్ల క్రితం మొదలైన జర్నీ.. మా ప్రేమకు ప్రతిరూపం

Feb 21 2026 1:29 PM | Updated on Feb 21 2026 1:37 PM

Bigg Boss Ambati Arjun, Surekha Shares Daughter photo on their 7th Anniversary

సీరియల్‌ నటుడు, తెలుగు బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి గతేడాది తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అర్జున్‌- సురేఖ దంపతులు 2025 జనవరి 9న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కూతురికి అర్ఖ అని నామకరణం చేశారు. తన పేరులోని ఆర్‌.. సురేఖ పేరులోని ఖ అక్షరాలు తీసుకుని అర్ఖ అని వచ్చేలా పేరు పెట్టామని వెల్లడించాడు.

తొలిసారి కూతురి ఫోటో
అయితే పాప ఫోటోలు మాత్రం వీరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయలేదు. తాజాగా అర్జున్‌- సురేఖ దంపతులు తమ ఏడో పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను షేర్‌ చేశారు. అందులో వారి కూతురి ముఖాన్ని తొలిసారి చూపించారు. ఇక సురేఖ భర్త గురించి చెప్తూ ఎమోషనలైంది. ఏడేళ్ల క్రితం.. మేము జీవితాంతం కలిసుండాలని, ఒకరి చేయి మరొకరు వడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాం. 

మాకెంతో స్పెషల్‌
కష్టాలు, సంతోషాలు, పాఠాలు.. ఇలా అన్నింటిలో ఒకరికొరం తోడుగా నిలిచి బలంగా ఎదిగాము. మా ప్రేమకు ప్రతిరూపం, మా జీవితంలో అత్యంత మధురమైన అధ్యాయం మా కూతురు అర్ఖ. ఇద్దరం నుంచి ముగ్గురంగా మారిన మా ప్రయాణం ఎంతో అపురూపమైనది. ఈ ఫోటో మాకెంతో స్పెషల్‌. ఎందుకంటే మా చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న తొలి ఫోటో ఇదే!

జీవితాంతం కలిసిమెలిసుండాలి
నాకు భాగస్వామిగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు, నా కూతురికి ప్రేమగల తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ అర్జున్‌. మనం ఇలాగే జీవితాంతం సంతోషంగా, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మధురమైన పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని రాసుకొచ్చింది.

బిగ్‌బాస్‌తో గుర్తింపు
తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అతడితోపాటు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వెనువెంటనే ఎలిమినేట్‌ అయిపోయారు. కానీ, అర్జున్‌ మాత్రం కడవరకు నిలబడ్డాడు. టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రాండ్‌ ఫినాలేలో టాప్‌ 6లో చోటు దక్కించుకున్నాడు.

 

 

చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement