ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. ది రాజాసాబ్ (జియోహాట్‌స్టార్), మన శంకర వరప్రసాద్‌గారు (జీ5), నారీ నారీ నడుమ మురారి (అమెజాన్), అనగనగా ఒకరాజు (నెట్‌ఫ్లిక్స్)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి, అయితే, రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి( Bhartha Mahasayulaku Wignyapthi) మూవీ మాత్రం ఓటీటీ విడుదల విషయంలో జాప్యం ఏర్పడుతుంది. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే, ఓటీటీ ఆలస్యానికి కారణాలు ఏంటి అనేది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ థియేటర్ రన్ తర్వాత స్ట్రీమింగ్ హక్కులను ZEE5 పొందింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై మౌనం పాటిస్తోంది. ఇది ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. డిజిటల్ ప్రీమియర్ ఆలస్యం వెనుక ఉన్న కారణాన్ని పేర్కొంటూ తాజాగా ఆన్‌లైన్‌లో ఒక ఆసక్తికరమైన రూమర్ వైరల్ అవుతుంది. దీని ప్రకారం, ఇతర భాషాలకు సంబంధించిన డబ్బింగ్ వెర్షన్ పనులు పూర్తి కాలేదట. ముందుగా మేకర్స్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని, అందుకే OTT అరంగేట్రం చేసేందుకు మరింత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది.
ZEE5 సాధారణంగా బహుళ భాషలలో ప్రముఖ చిత్రాలను ఒకేసారి విడుదల చేస్తుంది. ఇటీవల, చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఏడు భాషలలో విడుదలైన విషయం తెలిసిందే. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.


