అల్లు అర్జున్‌ పార్టీ.. ఉపాసన, రామ్‌ చరణ్‌తో పాటు సెలబ్రిటీలు | Allu Arjun Celebrated Grand Party With Ram Charan And Upasana For Sirish And Nayanika Big Day, Photo Went Viral | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌గా అల్లు అర్జున్‌ పార్టీ.. ఉపాసన, రామ్‌ చరణ్‌తో పాటు సెలబ్రిటీలు

Feb 21 2026 7:25 AM | Updated on Feb 21 2026 11:37 AM

Allu Arjun Celebrate Party With Ram Charan And Upasana

అల్లు కుటుంబంలో పెళ్లి వేడుక మొదలైంది. మార్చి 6న నయనికతో అల్లు శిరీష్‌ వివాహం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే దుబాయ్‌లో తమ సన్నిహితులతో ఓ పార్టీ కూడా చేసుకుని వచ్చారు. తాజాగా అల్లు అర్జున్‌ తమకు బాగా కావాల్సిన వారితో పాటు కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి స్పెషల్‌గా పార్టీ ఇచ్చారు. తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా అన్న అల్లు అర్జున్ ఇలా గ్రాండ్‌గా పార్టీ ఇస్తుంటే ఫ్యాన్స్‌ కూడా వారి బంధం గురించి పోస్టులు పెడుతున్నారు.

అయితే, తాజాగా జరిగిన పార్టీలో  పాల్గొన్న వారి లిస్ట్‌ కూడా నెట్టింట వైరల్‌ అవుతుంది. గ్రాండ్‌గా జరిగిన పార్టీలో రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత కొణిదెల, నిహారిక స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆపై తేజా సజ్జా, వైష్ణవ్‌ తేజ్‌, సిద్ధు జొన్నలగడ్డ, సుశాంత్‌, కృతి శెట్టి, నేహా శెట్టి, రాశీ ఖన్నా, నభా నటేష్‌ పాల్గొన్నారని సమాచారం.

అల్లు శిరీష్‌ - నయనికల  పెళ్లి పిలుపుల్ని ఇప్పటికే వారు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తమ ఇంటి ఆడబిడ్డ సురేఖకు తొలి శుభలేఖను ఇచ్చారు. ఆ సమయంలో తన మావయ్య చిరంజీవికి అందించిన శిరీష్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అరవింద్‌ సతీసమేతంగా చిరు దంపతులకు నూతన వస్త్రాలు అందించి పెళ్లికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

👉 :​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement