breaking news
Bhartha Mahasayulaku Wignyapthi Movie
-
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
మాస్ మహారాజా ఇటీవల సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. ధమాకా హిట్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇటీవలే రిలీజైన మాస్ జాతర రిజల్ట్ కూడా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో రవితేజకు మాస్ ట్యాగ్ అంతగా కలిసి రావడం లేదని సగటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు.మాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ.. రవితేజ ఫ్యాన్స్‌కు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కొత్త సినిమాను సడన్‌గా ప్రకటించారు. ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మాస్ హీరోకు పెద్దగా కలిసి రాకపోయినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు మన స్టార్ హీరో. అయితే ఈ సారి కొత్త మూవీ టైటిల్ చూస్తే మాస్ ట్రాక్ మార్చినట్లు అర్థమవుతోంది. ఈ మూవీని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాకు సంబంధించి టాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్లాఫ్లు ఎదురవుతున్న తరుణంలో చేస్తోన్న ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడని సమాచారం. నిర్మాతలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉండాలన్న రవితేజ నిర్ణయం మంచిదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. కామెడీగా గ్లింప్స్
గత కొన్నేళ్లుగా హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది లేకుండా పోయింది. వారం పదిరోజుల క్రితం 'మాస్ జాతర' అంటూ వచ్చాడు. యధావిధిగా ఇది కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరో కొత్త మూవీని సిద్ధం చేశాడు. దీనికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని తమిళ హీరోయిన్)నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కిశోర్ తిరుమల.. రవితేజ కొత్త చిత్రానికి దర్శకుడు. గ్లింప్స్ చూస్తుంటే కామెడీగా బాగానే ఉంది. రామసత్యనారాయణ (రవితేజ)ని అతడి జీవితంలోని ఇద్దరు ఆడోళ్లు రెండు ప్రశ్నలు అడుగుతారు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి? వాటికి ఎవరూ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారనేదే స్టోరీలా అనిపిస్తుంది.'నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ.. ఇలా అన్నింటినీ అడిగారు. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో' అని రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. భీమ్స్ సంగీతమందించాడు. వచ్చే సంక్రాంతికి మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ చూస్తుంటే ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)


