మాస్ మహారాజా ఇటీవల సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. ధమాకా హిట్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇటీవలే రిలీజైన మాస్ జాతర రిజల్ట్ కూడా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో రవితేజకు మాస్ ట్యాగ్ అంతగా కలిసి రావడం లేదని సగటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు.
మాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ.. రవితేజ ఫ్యాన్స్‌కు సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కొత్త సినిమాను సడన్‌గా ప్రకటించారు. ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మాస్ హీరోకు పెద్దగా కలిసి రాకపోయినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు మన స్టార్ హీరో. అయితే ఈ సారి కొత్త మూవీ టైటిల్ చూస్తే మాస్ ట్రాక్ మార్చినట్లు అర్థమవుతోంది. ఈ మూవీని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్లాఫ్‌లు ఎదురవుతున్న తరుణంలో చేస్తోన్న ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడని సమాచారం. నిర్మాతలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉండాలన్న రవితేజ నిర్ణయం మంచిదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.


